Housing construction
-
ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి కూటమి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని మహిళల పేరుతో మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట్ల మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట ఏపీ టిడ్కో సహా, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కేటాయించాలని సూచించింది. ఈ పట్టాలపై పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు దక్కేలా కన్వేయన్స్ డీడ్స్ ఇస్తామని తెలిపింది. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇళ్ల స్థలం ఇవ్వాలని, కేటాయించిన రెండేళ్ల లోపు ఇల్లు కట్టుకోవాలని, ఆధార్ కార్డుతో పట్టాను లింకు చేయాలని స్పష్టం చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ లబ్ధిదారులు, రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా స్థలం లేనివారు, గతంలో ఏ ప్రభుత్వ హౌసింగ్ స్కీం కిందకు రాని వారు, ఐదు ఎకరాలకు మించి మెట్ట వ్యవసాయ భూమి, 2.5 ఎకరాలకు మించి మాగాణి వ్యవసాయ భూమి, లేదా రెండు కలిపి 5 ఎకరాలకు మించని వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఇళ్ల స్థలాలకు అర్హులని స్పష్టం చేసింది. గతంలో ఇళ్ల పట్టా పొంది కోర్టు కేసుల వల్ల ఇల్లు పొందని వారికి దాన్ని రద్దు చేసి కొత్తగా పట్టా ఇవ్వవచ్చని పేర్కొంది. గతంలో ఇళ్ల పట్టా పొంది అక్కడ ఇల్లు కట్టుకోని వారికి పట్టాలు రద్దు చేసి తిరిగి మరొక చోట ఇవ్వాలని సూచించింది. ఇళ్ల స్థలాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించాలని, వాటిని వీఆర్వో, ఆర్ఐలు అర్హతలకు అనుగుణంగా విచారణ జరిపి జాబితాను తయారు చేసి అక్కడ అంటించాలని సూచించింది. లబి్ధదారుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాలకు తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదం తీసుకోవాలని పేర్కొంది. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూముల్ని జిల్లా కలెక్టర్లు గుర్తించాలని స్పష్టం చేసింది. -
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
న్యూఢిల్లీ: గృహాల రంగానికి ఇచ్చిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రికార్డు స్థాయిలో రూ. 27.23 లక్షల కోట్లకు చేరాయి. రంగాలవారీగా బ్యాంకు రుణాల అంశంపై ఆర్బీఐ వెలువరించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం 2022 మార్చిలో గృహ నిర్మాణ రంగంలో (హౌసింగ్‌కు ప్రాధాన్యతా రంగం కింద ఇచ్చినవి సహా) రుణబాకీలు రూ. 17,26,697 కోట్లుగా ఉండగా 2024 మర్చి ఆఖరు నాటికి రూ. 27,22,720 కోట్లకు చేరింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఇచ్చినవి రూ. 2.97 లక్షల కోట్ల నుంచి రూ. 4.48 లక్షల కోట్లకు చేరాయి.కోవిడ్ అనంతరం గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలు, ధరలు గణనీయంగా పెరిగినట్లు పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్ నెలకొన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ గృహ రుణాల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, అయితే, అధిక బేస్ కారణంగా 15–20 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు.ఇవి చదవండి: పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు! -
ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇప్పట్లో ‘ఇందిరమ్మ గృహ’ వసతి అందే సూచనలు కనిపించటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు. పథకం ప్రారంభించడానికి ఒకరోజు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా సొంత జాగా కలిగి ఉండాలని అందులో పేర్కొంది. తద్వారా సొంత స్థలాలు లేని వారికి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లేదనే స్పష్టతనిచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు 66 లక్షలుగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 30 లక్షల మందికి సొంత జాగా లేదని కూడా తేలినట్టు సమాచారం. కాగా వారందరికీ ప్రభుత్వం తొలుత భూమి పట్టాలు జారీ చేసి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. సొంత స్థలాలు లేని వీరంతా తదుపరి విడత కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. లక్ష ఇళ్లపైనే దృష్టి: ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఏడాది కాలంలో లక్ష ఇళ్లకు మించి పూర్తి కావని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తొలుత ఆ లక్ష ఇళ్లకు సరిపడా నిధులు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రక్రియ కాస్తా పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంటే జూలైలో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి కూడా వానాకాలం కొనసాగనున్నందున అక్టోబర్ తర్వాత గాని ఆ ప్రక్రియలో వేగం పెరగదు. అయితే వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు కొన్ని సొంత నిధులు కలిపి లబ్ధిదారులు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల్లో అర్థికపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. అలాంటి వారి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోపు కొన్ని ఇళ్లకే పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అలా దాదాపు లక్ష ఇళ్లకే నిధులు అందించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. నిధులు సిద్ధం! లక్ష ఇళ్లకు రూ.5 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ప్రస్తుతం రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. ఇందులో రూ.1,500 కోట్లు మాత్రమే ఇప్పుడు విడుదల కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి కిస్తీగా రూ.1,000 కోట్లు మంజూరవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వెరసి రూ.2,500 కోట్లు అందుబాటులో ఉన్నట్టవుతుంది. కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్ష ఇళ్లకు నిధులు దాదాపు సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ఇళ్లే ఇచ్చినా ఎక్కువ శాతం కన్పించేలా.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తొలుత చిన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ జనాభా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో తక్కువ ఇళ్లనే అందించినా.. ఆ గ్రామ జనాభా, మంజూరు చేసిన ఇళ్ల దామాషాను చూస్తే ఎక్కువ శాతం ఇళ్లను కేటాయించినట్టు లెక్కలు కనిపిస్తాయి. అదే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ఇచ్చే ఇళ్ల సంఖ్యను, ఆ ప్రాంత జనాభాను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ఇళ్లు కేటాయించినట్టుగా కన్పిస్తుంది. దీన్ని గమనంలో ఉంచుకునే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి
సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటి రూపంలో పేద అక్కచెల్లెమ్మల చేతిలో ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తిని పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామన్నారు. వివిధ దశల్లో 22 లక్షల గృహాలు నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల మేర ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఆర్డీయేలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సోమవారం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను సీఎం జగన్ అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సంతోషంగా స్వీకరిస్తున్నాం.. సీఆర్డీఏలో 50,793 మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలిచ్చాం. ఈ రోజు గృహ నిర్మాణాలను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అత్యధికంగా ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారు. వారి నిర్ణయానికి అనుగుణంగా మన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తోంది. సీఆర్డీఏ ప్రాంతంలో గజం స్థలం కనీసం రూ.15 వేలు ఉంది. ఈ లెక్కన పేద మహిళలకు ఇచ్చిన స్థలం విలువే రూ.7.50 లక్షలు ఉంటుంది. మరో రూ.2.70 లక్షలు వెచ్చించి ఇళ్లను నిర్మిస్తున్నాం. మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటి మీద మరో రూ.లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఈ ఆస్తి విలువ కనీసం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతుంది. అన్ని సదుపాయాలతో.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లేఅవుట్లను అభివృద్ధి చేసి 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు ఇళ్లను నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి లేఅవుట్ వద్దకు అక్కచెల్లెమ్మలను తీసుకుని వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి ఆ ఇంటి స్థలంలో ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేశాం. సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవలింగ్, ప్లాట్ల సరిహద్దు రాళ్లు కూడా పాతాం. దీనికోసం ఇప్పటికే రూ.56 కోట్లు ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్లలో నీటి సరఫరా కోసం రూ.32 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. విద్యుత్ కనెక్షన్ కోసం రూ. 326 కోట్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి మరో రూ.8 కోట్లతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. పేదల ఇళ్లు నిర్మించే కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్‌మాల్స్, పార్కులు వస్తాయి. మిమ్మల్నందరినీ ఆయా సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో మ్యాపింగ్ చేశారు. కౌంటర్లలో మీ ఇంటికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెడతారు. ఇందుకోసం 25 కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఏ ప్రభుత్వమూ చేయనంతగా గత నాలుగేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని మీ బిడ్డ చేసి చూపించాడు. పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, వివక్షకు తావులేకుండా సేవలు, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు దన్నుగా నిలిచాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్.. ఇలా వైద్య ఆరోగ్య సేవలలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలను తీసుకొస్తున్నాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఆరోగ్య ఆసరాను అమలు చేస్తున్నాం. వైద్య ఆరోగ్యసేవల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణం, సామాజిక వర్గాల సంక్షేమం, ప్రాంతాల సంక్షేమం, డీసెంట్రలైజేషన్, పోర్టులు.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని చేశాం. భావోద్వేగంతో కంటతడి ఇళ్లు నిర్మాణ మంజూరు పత్రాలు అందుకున్న పలువురు మహిళలు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. వాస్తవానికి 2020 డిసెంబర్లోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అయితే ప్రతిపక్షాల కుట్రలతో సీఆర్డీఏలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయ్యాక మూడేళ్ల అనంతరం తమకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందచేయడంతో ఉద్వేగానికి గురయ్యారు. వెంటనే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి ఆశీస్సులు సీఆర్డీఏలో సీఎం జగన్ చేతుల మీదుగా పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మహిళా లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కృష్ణాయపాలెం లేఅవుట్లో భూమి పూజ అనంతరం వెంకటపాలెంలోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్న కొద్ది సేపటికే వర్షం ప్రారంభం అయింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు లబ్దిదారులు సభాప్రాంగణం వెలుపల నిల్చుని సీఎం ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. సుమారు అరగంట పాటు కొనసాగిన సీఎం జగన్ ప్రసంగాన్ని మహిళలు ఆసక్తిగా విన్నారు. ‘‘అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం పెత్తందారులపై పేద వర్గాల విజయానికి తార్కాణం. పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన ద్వారా సామాజిక అమరావతికి పునాది రాయి వేశాం...’ అని సీఎం జగన్ పేర్కొన్నప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జై జగన్ నినాదాలు హోరెత్తాయి. ‘రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించారు. ఇలాంటి పెత్తందారులు, దుర్మార్గమైన మనుషులను, పార్టీలను గతంలో ఎప్పుడైనా మనం చూశామా..?’ అని సీఎం ప్రశ్నించడంతో.. చూడలేదని మహిళలు బిగ్గరగా సమాధానమిచ్చారు. -
అమరావతిలో పేదల ఇళ్ల పండుగ.. బొట్టు పెట్టి ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి, మంగళగిరి: పేదల ఇళ్ల పండుగకు అమరావతి ముస్తాబవుతోంది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద సీఆర్డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వతేదీన పేదల ఇళ్ల నిర్మాణానికి కృష్ణాయపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. వలంటీర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి ఈ కార్యక్రమానికి రావాలని సాదరంగా కోరుతున్నారు. వన మహోత్సవం సందర్భంగా అదే రోజు అమరావతిలో 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో మోడల్ హౌస్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్లో లబ్ధిదారురాలు ఈపూరి జీవరత్నం ఇంటిని మోడల్ హౌస్‌గా నిర్మించారు. షీర్ వాల్ పద్ధతిలో మూడు రోజుల స్వల్ప వ్యవధిలోనే అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీలైనన్ని ఇళ్లను షీర్ వాల్ పద్ధతిలో నిర్మించి వేగంగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు సులభంగా అర్థం అయ్యేలా మోడల్ హౌస్‌ను నిర్మించారు. అత్యధికంగా ఆప్షన్–3 ఇళ్లు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ప్రభుత్వం సీఆర్డీఏలో 1,366.48 ఎకరాల్లో 25 లేఅవుట్లలో ఇంటి స్థలాలను పంపిణీ చేసింది. 47,017 మంది లబ్ధిదారుల (ఎన్టీఆర్ జిల్లా 23,821, గుంటూరు జిల్లా 23,196) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు లభించాయి. వీరిలో 45,100 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. 24,200 ఇళ్లను షీర్వాల్ పద్ధతిలో, మిగిలినవి సాధారణ పద్ధతిలో నిర్మించేందుకు 36 లేబర్ ఏజెన్సీలను గుర్తించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా రూ.365.91 కోట్లతో విద్యుత్, నీటి సదుపాయంతో పాటు అప్రోచ్ రోడ్లను వేస్తున్నారు. ఈ లేఅవుట్లలో రూ. 72.06 కోట్లతో మౌలిక వసతులతో పాటు స్కూళ్లు, హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు లాంటి సదుపాయాలను కల్పించనున్నారు. పేదలకు 30 లక్షలకుపైగా ఇళ్లు రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల కోసం 30 లక్షలకు పైగా గృహ నిర్మాణం లక్ష్యంగా నవరత్నాలు పథకం ద్వారా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. 30.65 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఇళ్ల స్థలాల కింద పేదలకు అందించిన స్థలాల మార్కెట్ విలువ రూ.75 వేల కోట్ల మేరకు ఉంటుంది. కేవలం స్థలాలిచ్చి సరిపుచ్చకుండా రెండు దశల్లో 21.25 లక్షల (టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు, సాధారణ ఇళ్లు 18.63 లక్షలు) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకూ అనుమతులు ఇచ్చారు. సీఆర్డీఏలో నిర్మించే ఇళ్లు వీటికి అదనం. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 4.40 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రూ.లక్షల విలువ చేసే స్థలాలను ఉచితంగా సమకూర్చడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయాన్ని అందచేస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక, సబ్సిడీపై స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 24న తొలుత కృష్ణాయపాలెం చేరుకుని ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించి లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. వెంకటాయపాలెం బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శాంక్షన్ లెటర్ అందచేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలితో పాటు సీఎం ప్రసంగ వేదికను శుక్రవారం పరిశీలించారు. నవులూరు లే ఔట్ వద్ద సీఎం 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, ఎండీ లక్ష్మీ షా తదితరులు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తోబుట్టువులా తోడుగా.. వలంటీర్‌గా పనిచేస్తున్నా. నా భర్త వ్యవసాయ కూలీ. పెళ్లై 13 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఒక్కసారి దరఖాస్తు చేయగానే ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. కృష్ణాయపాలెం లేఅవుట్లో నాకిచ్చిన స్థలంలో నా ఇంటినే మోడల్ హౌస్‌గా నిర్మించారు. సీఆర్డీఏలో పూర్తయిన మొదటి ఇల్లు నాదే. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. పిల్లల చదువుకు అమ్మ ఒడి కింద సాయం చేశారు. పొదుపు సంఘంలో ఉన్న నాకు నాలుగు విడతల్లో రూ.10 వేల చొప్పున రుణమాఫీ అందించారు. తోబుట్టువులా సీఎం జగన్ అండగా ఉన్నారు. ప్రభుత్వం మాకు ఇళ్లు ఇస్తుంటే కొందరు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఆ వార్తలు విన్నప్పుడు ఎక్కడ ఇల్లు రాకుండా పోతుందోనని భయంగా ఉంటుంది. – ఈపూరి జీవరత్నం, ఇళ్ల లబ్ధిదారురాలు, కృష్ణాయపాలెం, గుంటూరు జిల్లా -
Fact Check: ఏపీలో రోజుకు 2,000 ఇళ్ల నిర్మాణాలు.. రామోజీ బురద వార్తలు
సాక్షి, అమరావతి: ఒకేసారి 30 లక్షల మందికిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందించడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు కాగా అడ్డంకులను అధిగమిస్తూ పేదల గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. అత్యధికంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (12.85 లక్షలు), గుజరాత్ (8.78 లక్షలు), మహారాష్ట్ర (8.10 లక్షలు) ఉండగా ఏపీలో 7.93 లక్షలు పూర్తైనట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ గణాంకాల్లోనే స్పష్టంగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా సీఎం జగన్ చేస్తున్న గృహ యజ్ఞంపై కేంద్ర మంత్రులు సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మాత్రం అట్టడుగున ఉందంటూ యథావిధిగా వక్రీకరణ కథనాలను ప్రచురించారు. దేశంలోనే అత్యధిక ఇళ్లు పేదలకు పక్కా గృహాల కల్పనలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన 71,811.49 ఎకరాల భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఏపీలో అత్యధిక ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. మంజూరైన ఇళ్ల పనులను మొదలు పెట్టడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన వనరులను వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పించడం, లబ్ధిదారులకు సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధిని చూసి ఇటీవలే సీఆర్డీఏ పరిధిలో 47వేల ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ అనుమతులు ఇచ్చింది. కుట్రలను అధిగమించి నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కోర్టులను ఆశ్రయించి న్యాయ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఈ అవరోధాలను అధిగమించి 2020 డిసెంబర్లో 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించే సమయంలో కోవిడ్ రెండో విడత ప్రారంభం అయింది. దీంతో కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021 జూలైలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి తొలి దశలో 15.6 లక్షల గృహ నిర్మాణాలను ప్రారంభించారు. నిర్మాణాలు చురుగ్గా సాగుతున్న సమయంలో మరోమారు టీడీపీ కోర్టుల్లో కేసులు వేయడంతో కొద్ది నెలలు పనులు నిలిచిపోయాయి. విశాఖ, సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నించారు. విశాఖ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో గత ఏడాది ఏప్రిల్ నెలలో 1.24 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. రోజుకు రెండు వేలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. నిత్యం రెండు వేల ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. పనుల్లో వేగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయడంతో పాటు యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందచేస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందించడంతో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తున్నారు. -
త్వరితగతిన సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే నిర్మాణాలు మొదలు పెట్టాలన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదలకు ఎంత త్వరగా పక్కా ఇళ్లను సమకూరిస్తే వారి జీవితాలు అంత త్వరగా బాగు పడతాయన్నారు. సీఆర్డీఏ పరిదిలో పేదలకు పంపిణీ చేస్తున్న స్థలాల్లో వేగంగా పనులు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గత 45 రోజుల్లో రూ.1,085 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే 3.69 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రూఫ్ లెవల్, ఆపై దశలో ఉన్న ఇళ్ల త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మరో 8.64 లక్షల ఇళ్లు బేస్మెంట్ ఆపై దశల్లో ఉన్నాయన్నారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాలను అమలు చేశామని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ స్పెషల్ ఆఫీసర్లను కూడా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నియమించి, ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని వివరించారు. బ్యాంకుల నుంచి త్వరితగతిన రుణాలు ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇలా ఇప్పటి వరకూ 11.03 లక్షల మందికి పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణాలిప్పించామని.. రూ.3,886.76 కోట్ల మేర రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. సీఆర్డీఏలో ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, భూమి చదును చేసే పనులు చేశామన్నారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం పూర్తయిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ జైన్, శ్రీలక్ష్మి, విజయానంద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?
72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా? 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే. ఇవికాక ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? షమీ కుటుంబంలో సంబరం షేక్ షమీ భర్త రసూల్ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్ కూలి పనులు మానాలి. అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్‌కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది. ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్.జగన్ ఓ అడుగు ముందుకేశారు. స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్ దశలో నిర్మాణంలో ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీతో చకచకా నా భర్త హోల్‌సేల్ మెడికల్ షాపులో సేల్స్‌మెన్‌గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్వాల్ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది. – జి.శోభారాణి, ఆప్షన్–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వివక్ష లేకుండా మంజూరు గత ఏడాది డిసెంబర్ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. – ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా అంతా కలలా.. ఆర్నెల్లలోనే నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు. – నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. – బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా -
జోరుగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు
-
ఆదర్శ రాష్ట్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్‌జైన్ వివరించారు. అత్యాధునిక సాంకేతికత.. తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ చొప్పున మొత్తం 1,145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీకాస్ట్ టెక్నాలజీ, షియర్‌వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అజయ్‌జైన్ వివరించారు. కాలనీలు కాదు.. అధునాతన గ్రామాలు ఇక అల్పాదాయ వర్గాలు, పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఇళ్లలో వారు సగౌరవంగా జీవించేలా చూడడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ లక్ష్యమని అజయ్‌జైన్ స్పష్టంచేశారు. అందుకు అనుగుణంగానే కాలనీలకు బదులు అధునాతన గ్రామాలను సృష్టిస్తున్నామని, 17,005 లే అవుట్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు. రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. లేఅవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్‌లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ జేఎండీ ఎం. శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ ఈ సదస్సులో పాల్గొన్నారు. -
గడప గడపకు పనులు 'నెలలో మొదలు'
సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆయా సచివాలయాల పరిధిలో నెల రోజుల్లోగా ప్రాధాన్యత పనులు ప్రారంభం కావాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ–క్రాప్ జాబితాలను అక్టోబర్ 25న సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ – 3 కింద డిసెంబర్లో ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనే కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమని, వాటి ఆధారంగానే మార్కులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత సాయంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా విడుదల చేస్తామని తెలిపారు. వసతి దీవెన నవంబర్ 10న విడుదల చేస్తామని చెప్పారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలలో ఆరు సచివాలయాలు.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనులకు ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించాం. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎలాంటి ఆలస్యం, అలసత్వానికి తావు ఉండకూడదు. 15,004 సచివాలయాలను ఈ కార్యక్రమం ద్వారా సందర్శిస్తున్నాం. ఎమ్మెల్యేలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది అంతా నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలి. ఎమ్మెల్యేలు కనీసం రెండు రోజుల పాటు సంబంధిత సచివాలయంలో గడిపి ప్రతి ఇంటినీ సందర్శించాలి. ఒక రోజులో కనీసం 6 గంటల పాటు గడప గడపకూ నిర్వహించాలి. మండల అధికారులు, పాలనా సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా అంతే సమయం గడపాలి. పక్కాగా ఈ–క్రాపింగ్ ఈ– క్రాప్ అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. పొరపాట్లకు తావులేకుండా నూరు శాతం పూర్తి చేయాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ఈ సీజన్లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రైతులను వారి క్షేత్రాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకోవడం, వివరాల నమోదు సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వోలు బయోమెట్రిక్ ద్వారా వీటిని ఆధీకృతం చేయాలి. అక్టోబరు 3లోగా ఇది పూర్తి చేయాలి. రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తి చేయాలి. అక్టోబరు 10 నుంచి రైతులకు ఇ– క్రాప్ డిజిటల్ రశీదులు, ఫిజికల్ రశీదులు ఇవ్వాలి. అక్టోబరు 15 లోగా అది పూర్తి చేసి సోషల్ ఆడిట్ చేపట్టాలి. అక్టోబరు 25 నుంచి వారం రోజుల పాటు ఇ–క్రాప్ తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. నవంబరు 1 నుంచి తుది జాబితాను అన్ని పోర్టల్స్‌లో అందుబాటులో ఉంచాలి. ఈ షెడ్యూల్ ప్రకారం ఇ– క్రాప్ పూర్తిచేసే బాధ్యత కలెక్టర్లదే. కనీసం 10 శాతం ఇ–క్రాప్‌ను స్వయంగా ఎంఏవో, ఎమ్మార్వోలు పరిశీలించాలి. కనీసం 6 శాతం ఆర్డీఏలు, ఏవీఏలు పరిశీలించాలి. కనీసం 5 శాతం ఇ–క్రాప్‌లను డీవోలు, 2 శాతం ఇ–క్రాప్‌లను జేసీలు, ఒక్క శాతం కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి. 17.05 కోట్ల పని దినాలు ఉపాధిహామీ కింద ఇప్పటివరకూ 17.05 కోట్ల పనిదినాలను సృష్టించడం అభినందనీయం. ఇప్పటివరకూ సగటు వేతనం రూ.210.02 ఉండగా కనీసం రూ.240 చొప్పున అందేలా కృషి చేయాలి. కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల ఉపాధిహామీ బకాయిలు త్వరలోనే వస్తాయి. రాగానే వెంటనే విడుదల చేస్తాం. సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీలపై ప్రత్యేక శ్రద్ధ డిసెంబర్‌లోగా 4,500 గ్రామ సచివాలయాలకు కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కలుగుతుంది. అక్కడ డిజిటల్ లైబ్రరీలను పూర్తి చేయాలి. మిగిలిన చోట్ల కూడా డిజిటల్ లైబ్రరీలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. పులివెందుల నియోజకవర్గం వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటైన డిజిటల్ లైబ్రరీని వినియోగించుకుంటూ గ్రామానికి చెందిన 30 మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం గృహ నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్ధ పుంజుకుంటుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహ నిర్మాణం బాగుంది. సత్యసాయి, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు దీనిపై దృష్టి పెట్టాలి. విశాఖలో 1.24 లక్షల ఇళ్లను కేటాయించాం. అక్టోబరు నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలి. కనీస సదుపాయాలు (బోర్‌వెల్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, సీడీ వర్క్స్, గోడౌన్స్) ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయి. ఇక్కడ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా సంబంధిత కలెక్టర్లు చూడాలి. పూర్తయిన పనులకు సంబంధించి పేమెంట్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగాలి. ఆప్షన్ 3 కింద 3.27 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. 10 వేల ఇళ్లకు పైబడి ఉన్న లే అవుట్లలో స్టేజ్ కన్వర్షన్ వేగంగా జరగాలి. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, ఆదోని, తిరుపతి, జీవీఎంసీ లే అవుట్లపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి. డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా అడుగులు ముందుకేయండి. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి. ఇళ్లు పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబర్లో ఫేజ్ 3 కింద ఇళ్ల మంజూరుకు కలెక్టర్లు కార్యాచరణ రూపొందించాలి. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై ఆడిట్ ప్రక్రియ వచ్చే 20 రోజుల్లో సంపూర్ణంగా పూర్తి కావాలి. డిసెంబర్ నాటికి 1.75 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తిచేసి ఇవ్వబోతున్నాం. ఈమేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలి. ఎస్వోపీల ప్రకారం సర్వే జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వేలో భాగంగా ఇప్పటివరకూ 5,738 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తైంది. 2,662 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలు జిల్లాలకు విడుదలయ్యాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం సర్వే ప్రక్రియ సాగాలి. స్పందన ఆర్జీల్లో సమయ పాలన, నాణ్యత స్పందన అర్జీల్లో సమయ పాలన, నాణ్యత కనిపిస్తోంది. దీనికి దోహదపడ్డ అధికారులకు అభినందనలు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాని పెండింగ్ కేసులు, తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గింది. పరిష్కారంలో నాణ్యత ఉందనేందుకు ఇది నిదర్శనం. కలెక్టర్లు అందరికీ అభినందనలు. అర్జీ పరిష్కారానికి ముందు విచారణ వివరాలను అర్జీదారులకు ఫోన్ ద్వారా తెలియజేయాలి. ఈ కొత్త ఫీచర్ సెప్టెంబరు 14 నుంచి ప్రారంభమైంది. ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. దరఖాస్తుదారుడితో లొకేషన్లో సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేయాలి. ఈ ఫీచర్ కూడా సెప్టెంబరు 26 నుంచి మొదలైంది. ఇది కూడా తప్పనిసరిగా పాటించాలి. సచివాలయాల్లో రోజూ సాయంత్రం స్పందన ప్రతి బుధవారం కలెక్టర్లు స్పందనపై సమీక్ష చేయాలి. సచివాలయాల్లో రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన నిర్వహించాలి. కలెక్టర్ల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకూ తప్పనిసరిగా స్పందనలో పాల్గొనాలి. స్పందనలో పాల్గొన్న అధికారులు కలెక్టర్లు నిర్వహించే సమీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి. స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలి. తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాలి. అలా జరిగితేనే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉన్నట్లు. తిరిగి అదే సమస్యపై అర్జీ వస్తే పై అధికారి లేదా మరో అధికారితో విచారణ చేయించండి. ఎస్డీజీ లక్ష్యాలపై కలెక్టర్ల పర్యవేక్షణ ఎస్డీజీ లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. డేటాను సక్రమంగా అప్లోడ్ చేయాలి. అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయి. ఎస్డీజీల ఆధారంగానే కలెక్టర్లకు మార్కులు కేటాయిస్తాం. పనితీరు, సమర్థత ఎస్డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయిస్తాం. ఎస్డీజీ లక్ష్యాల సాధనను మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చూస్తుంది. ఏసీబీ, ఎస్ఈబీ నంబర్లతో పోస్టర్లు దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో డౌన్లోడ్ చేసుకునేలా చూడాలి. దిశ పనితీరుపై పర్యవేక్షణ చేసేలా కలెక్టర్లు, ఎస్పీలు మాక్ కాల్స్ చేయాలి. అవినీతి నిర్మూలనకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నంబర్ 14400 పోస్టర్ అందరికీ కనిపించేలా 3 గీ 5 సైజులో ఉండాలి. ఈ పోస్టర్ లేకపోతే సంబంధిత కార్యాలయంలో ఉండే ముఖ్య అధికారిని బాధ్యుడ్ని చేయాలి. ప్రతి యూనివర్శిటీ, కాలేజీలో కూడా ఎస్ఈబీ నంబర్ 14500 ఉండాలి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి. భూసేకరణపై దృష్టి పెట్టాలి జాతీయ రహదారులకు భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి. బెంగళూరు– విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలో 345 కి.మీ మేర ఉంది. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణపై దృష్టిపెట్టాలి. జాతీయ రహదారులకు సంబంధించి 2,758 కి.మీ పరిధిలో రూ.33,507 కోట్లతో చేపడుతున్న 95 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మరో 2,687 కిలోమీటర్ల పరిధిలో రూ.55,890 కోట్లతో చేపడుతున్న మరో 63 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. జాతీయ రహదారులకు సంబంధించి దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు పైగా విలువైన పనులు చేపడుతున్నాం. వీటికి భూసేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి. సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీస్ అజయ్ జైన్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా మంజూరు.. ప్రారంభం ఒక సచివాలయంలో రెండు రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిశాక అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను మంజూరు చేయాలి. వాటిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. మంజూరైన నెల రోజుల్లోగా పనులు ప్రారంభం కావాలి. నిర్దేశించుకున్న మేరకు ప్రతి వార్డు లేదా గ్రామ సచివాలయంలో రెండు రోజులపాటు రోజుకు 6 గంటలపాటు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించకుంటే పనులు మంజూరు కావు. ఇప్పటివరకూ గడప గడపకూ నిర్వహించిన సచివాలయాల్లో ప్రాధాన్యతగా గుర్తించి పెండింగ్‌లో ఉన్న పనులను అక్టోబర్ 5లోగా మంజూరుచేయాలి. అవి అక్టోబర్ చివరి నాటినుంచి ప్రారంభం కావాలి. -
CM YS Jagan: స్పీడ్‌గా ‘ఆప్షన్ 3’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్ – 3 ఎంచుకున్న లబ్ధిదారుల గృహ నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) పాటించాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులతో వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ఈ నెలాఖరులోగా స్పష్టత కోసం ప్రయత్నించాలని అధికారులకు నిర్దేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాలు, 90 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ ప్రగతిని అధికారులు వివరించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కాలనీల్లో అవసరమైన చోట్ల ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే... ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఆప్షన్–3 ఇళ్లను నిర్మించే కాంట్రాక్టర్లు పనులపై ఎస్ఓపీలు రూపొందించాలి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో సమకూర్చుకున్నారా? ఇటుకల తయారీ యూనిట్లు కాలనీలకు సమీపంలోనే ఏర్పాటయ్యాయా? తదితర అంశాలు అందులో ఉండాలి. ఎస్ఓపీల ప్రకారం అధికారులు పర్యవేక్షించాలి. గోడౌన్లతోపాటు నీరు, విద్యుత్ సరఫరా లాంటి కనీస సదుపాయాలను కాలనీల్లో సమకూర్చుకుని నిర్మాణాలను వేగంగా చేపట్టాలి. కోర్టు కేసులతో వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ఈ నెలాఖరులోగా స్పష్టత కోసం ప్రయత్నించాలి. స్పష్టత రాని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఎక్కడ ఇంటి స్థలాన్ని ఇచ్చారో చూపించడమే కాకుండా పట్టా, సంబంధిత డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలి. స్థలాన్ని సమకూర్చడంతోపాటు పట్టా, ఇతర డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఎండీ నారాయణ భరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ వద్దు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. కాలనీల్లో డ్రైన్లు సహా విద్యుత్, నీటి సరఫరా లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులు ప్రతి దశలోనూ నాణ్యతపై దృష్టిపెట్టాలి. ఇళ్లకు సమకూర్చే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్ లైట్లు నాణ్యమైనవిగా ఉండాలి. కాలనీల రూపంలో కొన్ని చోట్ల ఏకంగా మునిసిపాలిటీలే వెలుస్తున్నాయి. అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పౌర సేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. -
నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు: సీఎం జగన్
-
గృహ నిర్మాణాల వనరులపై దృష్టి సారించండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహనిర్మాణశాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు.. ఇంకా ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా పనులు, నిధులు మంజూరుచేసి పని పూర్తిచేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. అంతేకాదు గత సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఇంకా అవసరమైన చోట ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు. ఆప్షన్ –3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆప్షన్ –3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్ఓపీని పాటించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అంతేకాదు.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా? లేదా? ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? తదితర వనరుల విషయంలో పరిశీలనలు చేయాలని తెలిపారు. అలాగే గోడౌన్లు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని.. ఇళ్లనిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని, ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా.. ► జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి: ► డ్రైనేజీ, కరెంటు, నీటి సరఫరా అంశాలపై దృష్టిపెట్టాలి. ► ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండాలి. ► జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవుతున్నాయి. అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. ► నిర్మాణ నాణ్యతపై అధికారులు ప్రతి దశలోనూ దృష్టిపెట్టాలి: 90 రోజుల్లో పట్టాలు పంపిణీపై కూడా సీఎం సమీక్ష లబ్ధిదారునికి కేవలం ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చిందీ చూపడమే కాదు, పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల అన్నీకూడా ఇవ్వాలి. స్థలం ఇచ్చారని, దానికి సంబంధించిన పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే.. -
రామోజీ విషపు రాతలు.. తిప్పి కొట్టిన జగన్ సర్కార్
-
కనీస ‘ఉపాధి’ రూ.240
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం కనీసం రూ.240 వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపుగా అన్ని జిల్లాలు చేరుకున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం సమగ్ర సర్వే ప్రక్రియకు సంబంధించి నిర్దేశించుకున్న గడువులను గుర్తు చేస్తూ వీటిని ప్రతి కలెక్టర్ నోట్ చేసుకోవాలని సీఎం సూచించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ, పేదల గృహ నిర్మాణాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లపై ముఖ్యమంత్రి జగన్ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. తనిఖీలతో పనుల్లో నాణ్యత కలెక్టర్లు, జేసీలు, పీడీసీలు, ఎంపీడీవోలు ఉపాధిహామీ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయాలి. దీనివల్ల పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. రుతుపవనాలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నందున వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. అన్ని పరిస్థితులనూ సమన్వయం చేసుకుంటూ ఉపాధి పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలి. జాప్యాన్ని అనుమతించేది లేదు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, బీఎంసీలు, ఏఎంసీలు.. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలి. కలెక్టర్లు వీటిపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. అసంపూర్తి భవనాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. వీటి నిర్మాణాల విషయంలో వెనకబడ్డ జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి పనితీరు మెరుగుపరుచుకోవాలి. కోర్టు కేసులున్న స్థలాల్లో ప్రత్యామ్నాయాలు కోర్టు కేసుల కారణంగా పంపిణీ కాని ఇళ్లపట్టాల విషయంలో సీఎస్, సంబంధిత శాఖాధికారులు ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తారు. న్యాయపరంగా సంక్లిష్టంగా ఉన్న స్థలాలపై ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఒక్కో కేసు వారీగా పరిశీలించి ప్రణాళిక రూపొందిస్తారు. 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా అందిన 2,11,176 దరఖాస్తులను అర్హత కలిగినవిగా గుర్తించారు. ఇందులో 1,12,262 మందికి పట్టాలు పంపిణీ చేశాం. మరో 98,914 మందికి వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేలా భూములను గుర్తించాలి. టిడ్కో ఇళ్ల పనులు నాణ్యంగా ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు. ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. గడువులోగా సమగ్ర సర్వే జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం విప్లవాత్మకమైనది. 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర సర్వే ఇది. నిర్దేశించుకున్న గడువులోగా సర్వే పూర్తి చేయాలి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్యాలను కలెక్టర్లు సరి చూసుకోవాలి. రోజువారీ సర్వే పనుల ప్రగతిని నివేదిక రూపంలో తెప్పించుకోవాలి. నిరంతరం సమీక్షిస్తూ ముందుకు సాగితేనే సమగ్ర సర్వే లక్ష్యాలను చేరుకోగలం. ఇళ్ల పనులకు ఈ వారమే నిధులు పేదల ఇళ్లకు సంబంధించి కొన్ని లే అవుట్లకు పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్లను, ల్యాండ్ లెవలింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి. దీనికి కావాల్సిన నిధులను ఈ వారంలోనే అందుబాటులోకి తెస్తున్నాం. సుమారు రూ.700 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కింద ఏప్రిల్ 28న విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల ఇళ్లను మంజూరుచేశాం. ఇక్కడ గృహ నిర్మాణాలు వేగం పుంజుకునేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతినెలా కనీసం 75 వేల ఇళ్లు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. కరెంటు, తాగునీరు, డ్రైన్లు ఈ సదుపాయాలన్నీ కాలనీల్లో కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. -
‘హౌసు’ ఫుల్లు..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది నిరుపేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలలు నెరవేరుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘నవరత్నాలు–పేదలం దరికీ ఇళ్లు’ పథకం కింద 31 లక్షల మందికిపైగా పేదలకు ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మిస్తోంది. తొలిదశలో 15.60 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ ఏడాది పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.13,100 కోట్లు వెచ్చిం చనుండటంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా 1.54 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా కోసం రూ.1,121.12 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాయితీ కింద ఇచ్చే 3.46 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ కోసం రూ.2,425.50 కోట్లు, 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.1,575.27 కోట్లు వ్యయం కానుంది. మిగిలిన నిధులను బిల్లుల చెల్లింపులు, ఇతర అవసరాలకు వెచ్చించనున్నారు. రాయితీపై నిర్మాణ సామగ్రి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. రాయితీపై మార్కెట్ ధర కన్నా తక్కువకు 140 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్ సహా ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. గతంలో 90 బస్తాల సిమెంట్ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నారు. అదనపు చేయూత సొంతిళ్లు నిర్మించుకునే అక్క చెల్లెమ్మలకు అదనంగా చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నారు. రూ.35 వేల నుంచి ఆ పైన రుణ సాయం అందుతోంది. ఇప్పటివరకూ 3,59,856 మంది లబ్ధిదారులకు రూ.1,332.09 కోట్ల రుణం మంజూరైంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అత్యధికంగా చిత్తూరులో 69,170, అనంతపురంలో 49,918, తూర్పు గోదావరిలో 36,462 మంది రుణాలు పొందారు. లబ్ధిదారులపై భారం తగ్గించేలా ఊరికి దూరంగా ఉండే లేఅవుట్లలోకి సిమెంట్, ఐరన్, ఇతర సామాగ్రి తరలింపు భారం లబ్ధిదారులపై పడకుండా స్థానికంగా గోడౌన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 66 పెద్ద లేఅవుట్లలో గోడౌన్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 47 అందుబాటులోకి వచ్చాయి. ఇటుకల తయారీ యూనిట్లు కూడా లే అవుట్లలోనే ఏర్పాటు చేసి తక్కువ ధరలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఆప్షన్–3 ఇళ్లపై పర్యవేక్షణ.. ప్రభుత్వమే నిర్మించే ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఆప్షన్–3ను ఎంచుకోగా గ్రూపులుగా విభజించి కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం 25,430 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో కనీసం పదిమంది లబ్ధిదారులు ఉంటారు. వెయ్యి ఇళ్లకు ఒక వార్డు అమెనిటీ సెక్రటరీని కేటాయించి ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. లేఅవుట్ల నుంచే హాజరు నమోదుకు వీరికి అవకాశం కల్పిస్తున్నారు. రుణాల మంజూరుకు బ్యాంకులు, ఇతర అధికారులతో సమన్వయంతో వ్యవహరించే బాధ్యత అప్పగించారు. నున్నలో నిర్మిస్తున్న పాపాయమ్మ ఇల్లు వేగంగా నిర్మాణాలు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల కోసం లే అవుట్లలోనే ఇటుకల తయారీ యూనిట్లతో పాటు సామగ్రి రవాణా భారం లేకుండా గోడౌన్లు నిర్మించాం. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వెయ్యి ఇళ్లకు అమెనిటీ సెక్రటరీ, లే అవుట్‌కు డిప్యూటీ ఈఈలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నాం. – అజయ్‌జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కష్టాలు తీరాయి.. కూలి పనులు చేసుకుంటూ మా అమ్మతో కలసి ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్తు దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఇంటి స్థలం రావడంతోపాటు నిర్మాణం కూడా పూర్తైంది. సుదీర్ఘ కల నెరవేరుతోంది. నా కష్టాలు తీరాయి. – ఇందూరి మంగతాయమ్మ, చెరువుకొమ్ముపాలెం, ఎన్టీఆర్ జిల్లా మరో 40 రోజుల్లో.. శ్రీకాళహస్తిలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. సంపాదనలో చాలావరకు అద్దెలకే ఖర్చవుతోంది. గతంలో ఇంటిపట్టా కోసం ఎంతో ప్రయత్నించినా రాలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వలంటీర్ మా ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకున్నాడు. మాకు స్థలం, ఇల్లు మంజూరైంది. మరో 40 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. – రెడ్డిపల్లి సుబ్రహ్మణ్యం, ఊరందూరు, తిరుపతి జిల్లా సొంతింట్లోకి దర్జీ కుటుంబం.. దర్జీగా పనిచేసే నా భర్త సంపాదనతో ఇద్దరు పిల్లలను చదివించి అద్దెలు కట్టేందుకు ఎంతో అవస్థ పడేవాళ్లం. మాకు స్థలంతో పాటు ఇల్లు మంజూరైంది. తక్కువ ధరకే సిమెంటు, ఐరన్, ఇతర సామాగ్రి ఇవ్వడంతో ఇంటిని నిర్మించుకున్నాం. – రహీమా, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా గృహ ప్రవేశం చేశాం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. రాయితీపై సిమెంట్ అందించారు. గృహ ప్రవేశం కూడా చేశాం. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ మాకు సొంత గూడు సమకూర్చారు. – ఇస్సాకుల శేషారత్నం, నేమాం, కాకినాడ జిల్లా రేకుల షెడ్డు నుంచి.. చక్కెర కర్మాగారంలో కూలీగా పనిచేసే నా భర్త సంపాదనలో నెలకు రూ.4 వేలు ఇంటి అద్దెకు ఖర్చయ్యేవి. ఒకదశలో అద్దె భారాన్ని భరించలేక ఫ్యాక్టరీ సమీపంలోని రేకుల షెడ్డులో తలదాచుకున్నాం. ఇప్పుడు మాకు ప్రభుత్వం సొంత గూడు కల్పించింది. ఈ ఏడాది జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తైంది. తొమ్మిది నెలల్లో సొంతిల్లు కట్టుకున్నాం. బిల్లులు సక్రమంగా అందాయి. ఇటీవలే కొత్త ఇంట్లోకి వచ్చాం. – మామిని పాడి, పాలకొండ అర్బన్, పార్వతీపురం మన్యం జిల్లా అదనంగా 50 బస్తాల సిమెంట్ .. బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసి లెంటల్ లెవెల్ వరకు ఇంటిని నిర్మించుకున్నాం. ఉచితంగా ఇసుక, రాయితీపై సిమెంటు, స్టీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 90 బస్తాల సిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇది మాకెంతో ఉపయోగపడుతుంది. – ఖైరున్నిసాబీ, పార్నపల్లె, నంద్యాల జిల్లా సొంతిల్లు కడుతున్న మేస్త్రి విజయవాడలోని నున్నలో నివసించే భూలక్ష్మి మిషన్ కుడుతూ.. భర్త శ్రీనివాసరావుకు తోడుగా నిలుస్తోంది. వీరు 20 ఏళ్లకుపైగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. చాలాసార్లు ఇంటి నిర్మాణానికి ప్రయత్నించినా అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరైంది. శ్రీనివాసరావు తాపీ మేస్త్రీ కావడంతో తనే స్వయంగా దగ్గరుండి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇటీవల స్లాబ్ వేశారు. స్థలంతో పాటు రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం అందిందని, పొదుపు సంఘం ద్వారా రూ.50 వేలు లోన్ తీసుకున్నానని.. ఇంటి నిర్మాణం పూర్తి కావచ్చిందని భూ లక్ష్మి ఆనందంగా చెబుతోంది. తరతరాల కోరిక తీరింది.. విజయవాడ నున్న ప్రాంతంలో ఇళ్లలో పనులకు వెళ్లే పాపాయమ్మ కొద్ది నెలల క్రితం పక్షవాతం బారిన పడటంతో మంచానికే పరిమితమైంది. భర్త అప్పారావు రిక్షా కార్మికుడు. వీరికి తరతరాలుగా సొంతిల్లే లేదు. ఇంటి స్థలం, ఇల్లు కోసం ఎన్నోసార్లు విఫలయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చివరి ప్రయత్నంగా వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాపాయమ్మకు రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు మంజూరైంది. ఇల్లు నిర్మించుకుంటున్నారు. త్వరలో గృహ ప్రవేశం చేయనున్నారు. -
ప్రతి ‘ఇంటి’కీ ఆర్థిక దన్ను
జగనన్న గృహనిర్మాణ పథకంలో భాగంగా నాగజ్యోతికి స్థలం మంజూరైంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాతే అధికారులు దశలవారీగా సొమ్ము చెల్లిస్తారు. ఇంటి పనులు ప్రారంభించడానికి కనీస సొమ్ము కూడా ఆమె చేతిలో లేదు. దీంతో స్థలం ఖాళీగానే ఉండిపోయింది. ఇదే పథకంలో ఇల్లు మంజూరైన స్వర్ణకుమారి సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపనతో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించింది. పునాదులు వేసి, కిటికీల దశకు వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అధికారుల పరిశీలనలో ఇలాంటి పరిస్థితులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సంకల్పించింది. వారికి ముందస్తు చెల్లింపులతో అండగా నిలవాలని నిర్ణయించింది. తద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వేగవంతంగా పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏలూరు(మెట్రో): పేదలందరికీ సొంతిల్లు అందించడమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పిస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇప్పటికే స్థలాలు కేటాయించి గృహ నిర్మాణాలు చేస్తోంది. జిల్లాలో 1,23,296 గృహాలకు ఇప్పటికే మంజూరు పత్రాలను అందించిన జిల్లా అధికారులు ఆ మేరకు గృహ నిర్మాణాలను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ గృహ నిర్మాణాల ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే వారం వారం గృహ నిర్మాణాలకు బిల్లులు చెల్లిస్తూ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చెల్లింపులకూ రెడీ... ఎప్పటికప్పుడు గృహ నిర్మాణ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. లబ్ధిదారులు పనులు వేగవంతం చేసేందుకు తాజాగా ముందస్తు చెల్లింపులు సైతం చేసేందుకు నిర్ణయించింది. లబ్ధిదారులు గృహ నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచుకుని నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తే వారికి రూ.15 వేలు చొప్పున మిగులు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. గృహ నిర్మాణాల నిమిత్తం చెల్లించే మిగులులోనే వీటిని మినహాయించుకుని లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందస్తు సహాయం చేయనుంది. లబ్ధిదారుల ఆసక్తి మేరకు ఈ నిధులు చెల్లించనున్నారు. జిల్లాలో ఇందుకు అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే అంశంపై గృహనిర్మాణ శాఖ అధికారులు ఆయా డివిజన్లు, మండలాల వారీగా పరిశీలన చేస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకూ సాయం... పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణాలు ఇంకా ప్రారంభించని లబ్ధిదారులకు సైతం సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా లబ్ధిదారులకు రూ.5 వేలు చొప్పున ముందస్తు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ సహాయాన్ని జిల్లాలో పలువురు లబ్ధిదారులకు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా రూ.15 వేలు, రూ.5 వేలు ముందస్తు ఆర్థిక సహాయానికి 93,688 మందిని గుర్తించగా, ఇప్పటికే రూ.15 వేలు చొప్పున 1816 మందికి, రూ.5 వేలు చొప్పున 1067 మందికి చెల్లింపులు చేశారు. ఈ విధంగా గృహనిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఆర్థికంగా సైతం లబ్ధిదారులకు దన్నుగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికీ సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా వెసులుబాటు జిల్లాలో ఇప్పటివరకు గృహనిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకు ప్రోత్సాహక సహాయంగా రూ.5 వేలు చొప్పున ముందస్తు సాయంగా అందిస్తున్నాం. గృహనిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు ఆర్థిక కారణాలతో మధ్యలోనే నిలిపివేయకుండా వారికి చేయూత అందించి పనులు చేయించడమే లక్ష్యంగా రూ.15 వేలు చొప్పున సహాయం ముందుగానే అందజేస్తున్నాం. ఈ విధంగా గృహనిర్మాణాలు వేగవంతం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. గృహనిర్మాణాలు వేగంగా పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. – సూరజ్ ధనుంజయ్ గనోరి, జేసీ (గృహ నిర్మాణం) -
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 32 కోట్లు ఖర్చు
-
ఇళ్ల నిర్మాణం పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
రంగనాథ్ అన్న చాలా అద్భుతంగా చేశారు: సీఎం వైఎస్ జగన్
-
సొంత స్థలం ఉన్న వారికీ పక్కా గృహాలు
చోడవరం: సొంత స్థలం ఉన్న వారికి కూడా పక్కా గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విశాఖ జిల్లా చోడవరంలో నియోజకవర్గంలో 4,487 పక్కాగృహాల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించానని, అన్నిచోట్ల శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరులో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సర్పంచ్‌లు కలిసి పనిచేస్తున్నారన్నారు. గ్రామాలకు దగ్గర్లో ఉన్న స్థలాలనే ఈ కాలనీలకు కేటాయించినట్టు తెలిపారు. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇవ్వడంతోపాటు ఉచితంగా ఇసుక అందిస్తున్నామన్నారు. ఆయన వెంట ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, హౌసింగ్ బోర్డు చైర్మన్ దొరబాబు, నవరత్నాల వైస్ చైర్మన్ సత్యనారాయణమూర్తి ఉన్నారు. -
గృహ నిర్మాణంలో దేశానికే ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’కు సంబంధించి ఇంధన శాఖ చేపడుతున్న పనుల ప్రగతిపై ఆదివారం అజయ్ జైన్, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌లు మూడు డిస్కంల సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా 28.30 లక్షల ఇళ్లను రెండు దశల్లో నిర్మిస్తున్నట్టు అజయ్ జైన్ చెప్పారు. ఆ ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం రూ.34,109 కోట్లు వెచ్చిస్తోందన్నారు. పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం దేశంలోనే లేదన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తిచేయాలని గడువు విధించినట్టు అజయ్ జైన్ చెప్పారు. విద్యుదీకరణకు రూ.7,080 కోట్లు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లే అవుట్లకు భూగర్భ విద్యుత్‌ను అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా డిస్కంల సీఎండీలు హరనాథరావు(ఏపీఎస్పీడీసీఎల్), పద్మాజనార్దనరెడ్డి(ఏపీసీపీడీసీఎల్), సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్)లు మాట్లాడుతూ ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి రూ.1,32,284 ఖర్చవుతుందని తెలిపారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లలో మొత్తం విద్యుదీకరణకు రూ.2,368 కోట్లు, 550 కంటే ఎక్కువగా ఉన్న లేఅవుట్లలో రూ.3,628 కోట్లు ఖర్చవుతుందన్నారు. 389లే అవుట్లకు భూగర్భ, 9,678 లే అవుట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నట్టు వారు వివరించారు. -
AP: ఇళ్లకు పావలా వడ్డీ రుణాలు
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులైన పేదలకు పావలా వడ్డీ కింద రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులకు పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్ చేశామని, అత్యవసర సమయాల్లో వీటి మీద రుణం తెచ్చుకునేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పావలా వడ్డీ మాత్రమే లబ్ధిదారుడికి పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. రుణ సదుపాయం వల్ల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మరింత ఊపందుకుంటుందన్నారు. కొన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా సహకారంతో లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణంతో పాటు ఖరీఫ్ సన్నద్ధత, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష, పరిశ్రమలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పది రోజుల్లో ప్లాట్ల మ్యాపింగ్ హౌసింగ్ లే అవుట్లలో లబ్ధిదారుల ప్లాట్ల మ్యాపింగ్ 10 రోజుల్లోగా పూర్తిచేయాలి. దీనివల్ల అర్హులైన వారికి మిగిలిన ప్లాట్లను వెంటనే కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులుగా గుర్తించిన వారికీ ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న సుమారు 8 వేల దరఖాస్తుల వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. ప్రస్తుత లే అవుట్ల ద్వారా 45,212 మందికి పట్టాలు ఇవ్వబోతున్నాం. కొత్త లే అవుట్లలో 10,801 మందికి పట్టాలు ఇస్తాం. మరో 1,43,650 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ తొలిదశలో 15.60 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. ఇప్పటివరకు 10.11 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ప్రతి ఇంటి నిర్మాణ ప్రగతిపై ఆన్లైన్ స్టేజ్ అప్డేషన్ చేయాలి. హౌసింగ్‌పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి. అక్టోబర్ 25 నుంచి ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణం ఆప్షన్–3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం అక్టోబర్ 25 నుంచి మొదలవుతుంది. ఆప్షన్ 3 లబ్ధిదారుల సంఖ్య 3.25 లక్షలు కాగా ఇప్పటికే 1.77 లక్షల ఇళ్లకు సంబంధించి 12,855 గ్రూపులు ఏర్పాటయ్యాయి. మిగిలిన చోట్ల గ్రూపుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. అక్టోబరు 25లోగా అన్ని సన్నాహాలు పూర్తి కావాలి. నీరు, కరెంట్ సదుపాయాలను సెప్టెంబర్ 15లోగా కల్పించేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ధరలు పెంచితే కఠిన చర్యలు కొన్ని జిల్లాల్లో మెటల్ ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోంది. కలెక్టర్లు దీనిపై చర్యలు తీసుకోవాలి. వెంటనే రేట్లు నిర్ణయించాలి. ధరలు పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపాలి. లే అవుట్ల సమీపంలోనే ఇటుకల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. వారానికి ఒకసారి కలెక్టర్లు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలి. ఇ–క్రాపింగ్ చాలా కీలకం.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మండలాలు మినహా సాధారణ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాగు లక్ష్యం 92.21 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకూ 59.07 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో 37.25 లక్షల ఎకరాల్లో ఇ–క్రాపింగ్ పూర్తైంది. మిగిలిన చోట్ల కూడా ఇ–క్రాపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 10% ఇ– క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. జేడీఏలు, డీడీఏలు 20 శాతం ఇ–క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు 30 శాతం తనిఖీ చేయాలి. సీజన్‌తో సంబంధం లేకుండా ఇ– క్రాపింగ్ జరగాలి. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లను రైతుల నుంచి డిమాండ్ చేయకూడదు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, పంట సేకరణ, పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు సరఫరా ఇలా అన్నింటికీ ఇ–క్రాపింగ్ చాలా కీలకం. వ్యవసాయ సలహా మండళ్లు వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు కొనసాగాలి. వీటిని కలెక్టర్లు పర్యవేక్షించి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల్లో, రెండో శుక్రవారం మండల స్థాయిల్లో, ప్రతి 3వ శుక్రవారం జిల్లాల స్థాయిలో సలహా మండళ్ల సమావేశాలు జరగాలి. జిల్లాస్థాయి సమావేశాలకు కలెక్టర్ హాజరు కావాలి. కల్తీపై కొరడా.. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువుల తదితరాల పంపిణీ, నాణ్యతపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ఎక్కడా కల్తీలకు చోటు ఉండకూడదు. ప్రైవేట్ దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలి. రైతులకు రుణాలతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలు అప్పుడే సక్రమంగా అందించగలుగుతాం. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం. కలెక్టర్ల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. భూ వివాదాల్లేని రాష్ట్రం దిశగా ఏపీలో ఈ సర్వేను నిర్వహిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు 3న ప్రోత్సాహకాలు ఎంఎస్ఎంఈలకు సెప్టెంబరు 3న ప్రోత్సాహకాలు విడుదల చేయబోతున్నాం. కలెక్టర్లు నెలలో ఒకరోజు ఎంఎస్ఎంఈలకు, మరో రోజు ఇతర పరిశ్రమలకు కేటాయించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. అప్పుడే పారిశ్రామిక రంగం ప్రగతి సాధిస్తుంది. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ నెలలో ఒకరోజు సమావేశం కావాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాల విడుదలకు మార్గం సుగమమవుతుంది. భూముల కేటాయింపులు, కాలుష్య నివారణ తదితర అంశాలపై కూడా దృష్టి సారించవచ్చు. 75% ఉద్యోగాలు స్థానికులకే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించే చట్టం అమలుపైనా కలెక్టర్లు సమీక్షించాలి. పరిశ్రమలకిచ్చే రాయితీలకు ఈ చట్టంతో సంబంధం ఉంది. 75 శాతం స్ధానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాయితీలకు అర్హత ఉండదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపైనా దృష్టి పెట్టాలి. విజయదశమి రోజున వీటి నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను పెండింగ్‌లో పెట్టారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దిష్ట తేదీ ప్రకటించి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, ఇతర పరిశ్రమలకు కరెంటుపై రాయితీతోపాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం. అప్పుడే పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. నెలకు మూడు రోజులు కలెక్టర్లు సమయం కేటాయిస్తే పారిశ్రామిక వేత్తలకు భరోసా కలిగి ముందుకు వస్తారు. -
త్వరపడండి.. ఇళ్లు ఖరీదు కేవలం రూ. 87 మాత్రమే
రోమ్: మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నారా..? అయితే త్వరపడండి ఇది మీకు మంచి అవకాశం. అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్న సంగతి మీకు తెలుసా..? అత్యంత సుందరమైన ప్రదేశంలో అది కూడా అన్ని వసతులతో నిండి ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ఎంత చౌక అంటే ఆ ఇంటి విలువ కేవలం రూ. 87 రూపాయలు మాత్రమే. నమ్మడం కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ చాన్స్ మన దేశంలో కాదు. ఇటలీలో మాయోంజా అనే అందమైన పట్టణం ఉంది. ఇది రోమ్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణంలో ఇళ్లు ఒక యూరో కంటే తక్కువ ధరకే అక్కడి ప్రభుత్వం వారు విక్రయిస్తున్నారు. మరి ఇంత అందమైన నగరంలో, సువిశాలమైన ఇళ్లను ఎందుకు ఇంత తక్కువ ధరకే అమ్ముతున్నారంటే ఆ ప్రదేశంలోని 90 శాతం ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దానితో ఎంతో అందమైన ఈ ప్రదేశం ఇప్పుడు ఎవరూ నివసించకపోవడంతో బోసిపోయింది. అందుకే అక్కడి ప్రభుత్వం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మాయోంజాలోని ఇళ్లల్లో ప్రజలు నివాసముండడానికి ప్రోత్సహించేందుకు అతి తక్కువ ధరకే ఈ ఇళ్లను విక్రయిస్తున్నారు. మాయోంజా నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఇలా ఇళ్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నామని అక్కడి మేయర్ క్లాడియో స్పెర్డుటి పేర్కొన్నారు. అయతే ఈ ఇళ్లను విడతల వారీగా విక్రయానికి ఉంచనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఇళ్ల కొనుగోళ్లకు సంబందిచిన దరకాస్తుల స్వీకరణ ఈ నెల 28న ముగియనుంది. ఈ పట్టణం ఒకప్పుడు నిత్యం ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. అయితే 1968వ సంవత్సరంలో వచ్చిన భూకంపం ప్రభావంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దానితో మాయోంజ పట్టణం పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం ప్రజలు నివసించక అక్కడ అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఆ పట్టణం జనంతో కళకళలాడేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకే వేలంలో విక్రయిస్తోంది. అందుకే కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటల్లోనూ పాల్గొనవచ్చు. టౌన్ అత్యంత పురాతనమైనది కావడంతో ఇక్కడ ఇళ్లు రోడ్డుకు ఇరువైపుల ఒకదానికి దగ్గరగా ఇంకొకటి కలిసి ఉంటాయి. అన్ని కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేందుకు ఎంతో బాగుంటుంది కాబట్టి అందరూ ఇళ్లను కొనుక్కోవాలని ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ టౌన్ మళ్లీ జనాభాతో కళకళలాడాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఈ ఇళ్లు కొనే ముందు ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే కొనుగోలు చేసిన ఇళ్లను మరమత్తులు చేయించుకోవాలి. వాటిని కొత్త ఇళ్లల్లా తీర్చిదిద్దుకోవాలి. తప్పనిసరిగా మూడు సంవత్సరాలలో కొనుగోలు చేసిన ఇళ్లను పునరుద్ధరించాలి. దానితో పాటు ఒప్పందంలో డిపాజిట్‌గా 5,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇళ్లు పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇళ్లలో కచ్చితంగా నివసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇంటిని పునర్నిర్మాణం చేసి ఎలా ఉపయోగించుకోబోతున్నారో మాత్రం కశ్చితంగా స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి తెలియచేయాలి. వాస్థవానికి ఇటలీలోని గ్రామీన ప్రాంతాల్లో ఈ పధకం మూడేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇలా ప్రజలు నివసించని నిర్మానుష్యపు ప్రాంతాల్లో ఒకటైన చింక్వా ఫ్రాండీ అనే ప్రాంతంలోని కాళీ ఇళ్లను కేవలం ఒక్క అమెరికన్ డాలరుకే అప్పట్లో అమ్మకానికి పెట్టారు. అలాగే సిసిలియా అనే మరో గ్రామంలోనూ ఇదే తరహాలో ఒక యూరోకే ఇళ్లని విక్రయించడం జరిగింది. మరి ఈ ఆఫర్ ఎంతమంది ప్రజలకి నచ్చుతుందో వేచి చూడాల్సిందే. -
గ్రామీణాభివృద్ధిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును కేంద్రం ప్రశంసించింది. ఉపాధి హామీ పథకంతో పాటు పింఛన్ల పంపిణీ, భూ రికార్డుల ఆధునీకరణ, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం గతేడాది దేశంలోని 24 రాష్ట్రాల పరిధిలోని 233 జిల్లాల్లోని 2,330 గ్రామాల్లో పర్యటించింది. గతేడాది అక్టోబరులో మన రాష్ట్రంలోనూ నాలుగు జిల్లాల పరిధిలో 40 గ్రామాలను కేంద్ర అధికారులు సందర్శించారు. ఆ వివరాలతో ‘నేషనల్ లెవల్ మానిటరింగ్’ పేరుతో కేంద్రం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలోనూ, ఉపాధిహామీ అమలులోనూ ఏపీ వంద శాతం పనితీరు కనబరుస్తున్నదంటూ కేంద్ర అధికారులు ప్రశంసించారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చిన్నతా -
కాలనీల్లో సదుపాయాలు కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణం వల్ల ఏర్పడిన కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని నీతి ఆయోగ్‌కు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. ఆయన బుధవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాలతో కలిసి న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌కాంత్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌గోయెల్‌తో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు నీటిపారుదల ప్రాజెక్టులను నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సిఫార్సు చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ అంశాన్ని అభినందించిన నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్, సీఈవోలు స్వాగతించదగినదిగా పేర్కొన్నారన్నారు. రాష్ట్రంపై పూర్తిభారం పడకుండా కేంద్రం సహకరించాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రేషన్‌వాటా తగ్గిన విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 2015 నుంచే వాటా తగ్గుతూ వస్తోందని, గత ప్రభుత్వం గమనించపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వాటా తగ్గడం వల్ల సుమారు 35 వేల టన్నుల బియ్యం తగ్గుతున్నాయని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.వందల కోట్ల భారం పడుతోందని చెప్పారు. ఈ అంశాన్ని వివరిస్తూ గ్రామీణ ప్రాంతాలకు 75 శాతానికిగాను 60 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతానికిగాను 40 శాతం వాటా వస్తున్నట్లు తెలిపామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పదిశాతం ఎక్కువ వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా దీనిపై దృష్టిసారించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారని చెప్పారు. రబీ సేకరణ, గరీబ్ కల్యాణ్ యోజన బకాయిలు త్వరగా విడుదల చేయాలని కోరినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. -
బిల్లు తగ్గేలా ఇల్లు.. ఐఈఏ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద కుటుంబాల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 లక్షల ఇళ్ల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తున్నారు. గాలి, వెలుతురు విరివిగా ప్రసరించేలా.. తక్కువ కరెంట్ బిల్లులు వచ్చేలా వీటిని డిజైన్ చేయడం ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ పథకం దేశంలోనే అతి పెద్దదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రశంసించింది. దీనివల్ల ఏడాది పాటు 2.50 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ఆ సంస్థ ప్రతినిధి మైకేల్ అప్పర్‌మెన్ తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు జూన్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించడంతో భవన నిర్మాణ మెటీరియల్, ప్రణాళిక వేగంగా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండో–స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రాజెక్టు (బీఈఈపీ) నేతృత్వంలో ఇటీవల వెబినార్ జరిగింది. ఈ వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మీడియాకు ఆదివారం వివరించారు. అడుగడుగునా హై టెక్నాలజీ స్విట్జర్లాండ్, భారత్ సంయుక్త భాగస్వామ్య సంస్థ ఆధ్వర్యంలోని ‘ఎనర్జీ ఎఫీషియెంట్, థర్మల్లీ కంఫర్టబుల్ (ఈఈటీసీ)’ టెక్నాలజీని ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వాడుతోంది. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రతలు కనీసం 2 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఫలితంగా 20 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. గాలి, వెలుతురు విరివిగా రావడం వల్ల సీజనల్ వ్యాధులు సోకేందుకు ఆస్కారం తక్కువ. పైకప్పు మీద రూఫ్ ఇన్సులేషన్ లేదా రిఫ్లెక్టివ్ రంగు వేయడం ద్వారా వేడి తగ్గుతుంది. ఆటోక్లేవ్ ఏరేటెడ్ కాంక్రీట్ (ఏఏసీ) బ్లాక్స్, కేవిటీ వాల్, హేలో బ్రిక్స్ వంటివి వాడటం వల్ల మొత్తం భవనంపై వేడి తగ్గిపోతుంది. కిటికీలకు సరైన తెరలు వాడటం వల్ల కూడా బయటి వేడి లోపలకు రాకుండా ఉంటుంది. క్షేత్రస్థాయి వరకూ శిక్షణ ఇంజనీర్లు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, వార్డు, సచివాలయ సిబ్బందికి బీఈఈపీ, బీఈఈ సంయుక్తంగా తాజా సాంకేతికపై శిక్షణ ఇస్తోంది. 13 వేల మంది ఇంజనీర్లకు దశల వారీగా ఈ శిక్షణ ఉంటుంది. ఇండో–స్విస్ బీఈఈపీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి), రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, స్టేట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సీడ్కో ), ఇంధన శాఖ సహకారంతో శిక్షణ చేపడతారు. ప్రాథమికంగా 50 మంది ఇంజనీర్లకు ‘మాస్టర్ ట్రైనర్లు’గా శిక్షణ ఇస్తారు. అనంతరం వీరు మిగిలిన వారందరికీ శిక్షణ ఇస్తారు. తర్వాత 500 మంది గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందనడానికి ఇదే నిదర్శనమని అజయ్ జైన్ పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పథకంలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ తదితర సౌకర్యాల కోసం పంచాయతీరాజ్, మునిసిపల్, గ్రామీణ నీటి సరఫరా, ఇంధన శాఖలు రూ.32,215 కోట్లు ఖర్చు చేస్తాయని అంచనా వేసినట్టు తెలిపారు. విద్యుత్ షాక్ ఉండదు పేదల కోసం నిర్మించే ఇళ్లల్లో ఇంధన సామర్థ్య పరికరాలు వాడుతున్నాం. దీనికి ఇంధన పొదుపు సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో 20 శాతం కరెంట్ వృథాను అరికట్టే వీలుంది. పేదలకు అతి తక్కువ కరెంట్ బిల్లులు వచ్చే వీలుంది. – ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, సీఈవో, రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ -
YS Jagan: ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం..
ఎకానమీకి బూస్ట్... కోవిడ్ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటే కార్మికులకు సొంత ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. కార్పెంటర్లు, ప్లంబర్లు లాంటి రకరకాల వృత్తుల వారికి దీర్ఘకాలం ఉపాధి లభిస్తుంది. స్టీల్, సిమెంట్ తదితర గృహ నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయడం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా కొనసాగి ఎకానమీ బూస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవలింగ్ చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో జూన్ 1వ తేదీన తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చేకూర్చడమే కాకుండా కార్మికులకు పెద్ద ఎత్తున పని దొరుకుతుందని.. స్టీల్, సిమెంట్ ఇతర మెటీరియల్ కొనుగోళ్లతో వ్యాపార లావాదేవీలు సాఫీగా కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదని, మధ్యాహ్నం 12 వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’, వైఎస్సార్–జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పనులేవీ ఆగకూడదు.. జగనన్న కాలనీలలో జూన్ 1న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగించాలి. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ కీలకం కాబట్టి వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకోవాలి. మోడల్‌హౌస్ తప్పనిసరి.. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌస్ నిర్మించి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయవచ్చు..? లాంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి. సొంతంగా కట్టుకుంటే మెటీరియల్.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గి రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు ఆక్సిజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి. స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలి. అన్ని వసతులు ఉండాలి.. కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు. తగిన మౌలిక వసతులు కూడా కల్పించాలి. లేఅవుట్ పక్కాగా ఉండాలి. సీసీ రోడ్లు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జేజేఎం), విద్యుదీకరణ, ఇంటర్నెట్ లాంటివి మౌలిక వసతుల్లో ముఖ్యమైన కాంపోనెంట్స్. కరెంటు, నీటి సరఫరాతో పాటు రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ.. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైపులైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. కేంద్రాన్ని అదనపు నిధులు కోరదాం.. ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కోరదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తోంది కాబట్టి అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. ఏడాదిలో ఇళ్లు పూర్తి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్–బీఎల్సీ తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్లు మంజూరు కాగా కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్లు ఉన్నాయని, అందువల్ల వాటికి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు మంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్సైట్లో మ్యాపింగ్ జరిగిందని వివరించారు. ఒక లే అవుట్లో పనులన్నీ ఒకే కంపెనీకి అప్పగిస్తే సమన్వయ లోపం, డూప్లికేషన్‌కు తావు ఉండదని అధికారులు ప్రతిపాదించారు. 81,040 టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి జగనన్న లేఅవుట్లలో పనులు ఈ జూన్‌లో మొదలు పెట్టి సెప్టెంబరు నాటికి బేస్మెంట్, డిసెంబరు నాటికి గోడల నిర్మాణాలు, వచ్చే ఏడాది జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. టిడ్కో ఇళ్లలో 81,040 దాదాపు పూర్తయ్యే దశ (90 శాతం పనులు)లో ఉండగా మరో 71,448 ఇళ్లు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఇళ్ల నిర్మాణ వేగం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, ఆ మేరకు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టేందుకు అవసరమై నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంపై నిర్లక్ష్యం వహించకుండా వాటిపై వెంటనే దృష్టి సారించాలని సూచించారు. ఇళ్లు కట్టు కోవడానికి కరెంటు, నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కన్పించకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. వసతుల కల్పనపై నివేదిక ఇవ్వండి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం తదితర వసతుల కల్పనపై సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా చర్చించారు. పట్టణాల్లో ఏవిధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామో అదే తరహాలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లోనూ వసతులు కల్పించాలని చెప్పారు. ఆ మేరకు తీసుకునే చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. తామే ఇళ్లు నిర్మించుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని చెప్పారు. స్టీలు, సిమెంట్, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కొత్త కాలనీల రూపు రేఖలు, అక్కడ చేపట్టనున్న నిర్మాణాలు, కల్పిస్తున్న వసతులు, డిజైన్లపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. -
పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పటికే పునాదుల వరకు నిర్మాణాలు జరగ్గా.. మరికొన్ని చోట్ల భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నారు. సొంత స్థలం, పొజిషన్ సర్టిఫికెట్లు కలిగిన లబ్ధిదారులు వారు కోరుకున్న కొలతల్లో ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. లేఅవుట్ కాలనీల్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. 68,361 ఎకరాల్లో కొత్తగా వేసిన 17,005 లేఅవుట్లలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది నిర్మాణ పనులు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట లేఅవుట్లో లబ్ధిదారులు రెండు రోజులుగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ పునాదులు తీశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ఇళ్ల పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ఇదే రీతిలో రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో వాటికి అవసరమైన ఇసుక, సిమెంట్ కొరత రాకుండా చూసే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సమస్యను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా లబ్ధిదారుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో సరైన విధానాలు అవలంబించడంతోపాటు ఎప్పటికప్పుడు ప్లానింగ్ అనుసరిస్తే అనుకున్న సమయానికి ఇళ్లు పూర్తి చేసేందుకు అవకాశముందని వారు వివరిస్తున్నారు. -
కోలాహలం.. పట్టాల యజ్ఞం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యజ్ఞం వరుసగా పదోరోజైన ఆదివారం కూడా లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో జరిగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30.75లక్షల మందికి నివాస స్థలాలు/ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో తమ కల సాకారం అవుతోందని అక్కచెల్లెమ్మలంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు వారంతా లేఅవుట్ల వద్దకు పెద్దఎత్తున వస్తుండడంతో అక్కడంతా కోలాహలంగా.. ఓ ఉత్సవంలా ఉంది. ► శ్రీకాకుళం జిల్లాలో 1,909 మంది లబ్ధిదారులకు ఆదివారం పట్టాలను అందజేశారు. పది రోజుల వ్యవధిలో 37,127 మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరిగింది. ► విజయనగరం జిల్లాలో ఆదివారం 18,917 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో ఇళ్ల పట్టాలు 7,845, పీసీ/ఈఆర్ కింద మరో 11,072 పట్టాలు ఉన్నాయి. డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 55,224 పట్టాల పంపిణీ జరిగింది. ► విశాఖ జిల్లాలో 2,676 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు అందజేశారు. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో 211 మందికి పట్టాలు అందజేశారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో 166 మందికి పంపిణీ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 1,886 మందికి టిడ్కో ఇళ్ల ఒప్పందపత్రాలు, పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కశింకోటలో 314 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేశారు. నాతవరం మండలంలో 99 పట్టాలు అందజేశారు. ► తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 90,493 మందికి ఇళ్ల పట్టాలు.. 1,547 మందికి టిడ్కో ఇళ్లు, 9,202 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఆదివారం ఒక్కరోజే 19,926 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 56,204 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు. గృహనిర్మాణం చేపట్టేందుకు 10,335 మంది ఆప్షన్ ఫారాలు అందించారు. కరప మండలం యండమూరు, కాకినాడ రూరల్ మండలం చీడిగలో 3,646 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం మొత్తం 4,660 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. దీంతో మొత్తం పది రోజుల్లో 74,319 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. తణుకు నియోజకవర్గం ఇరగవరంలో 312 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో 530 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► కృష్ణా జిల్లాలో ఆదివారం 11,687 ఇళ్ల పట్టాలను అందచేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 95,878 ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ► ప్రకాశం జిల్లాలో ఆదివారం 2,478 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం కలిపి 38,728 మందికి పట్టాలిచ్చారు. ఒంగోలులో టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లు 215 పంపిణీ చేశారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 670 సేల్ అగ్రిమెంట్లు పంపిణీ చేశారు. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 4,822 మందికి ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ► వైఎస్సార్ కడప జిల్లాలో ఆదివారం 4,782 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు పదిరోజుల్లో మొత్తం 64,934 మంది ఇళ్ల పట్టాలు పొందారు. ► అలాగే, కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో 155, ఆదోనిలో 343, పత్తికొండ 191, ఆలూరు 619, శ్రీశైలం 248, నంద్యాల 71, కోడుమూరు నియోజకవర్గంలో 418 ఇళ్ల పట్టాలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ► అనంతపురం జిల్లావ్యాప్తంగా ఆదివారం 5,732 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం కామరుపల్లి లేఅవుట్ వద్ద ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. ► చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం 9,289 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మోడల్ కాలనీగా పేరేచర్ల లేఅవుట్ గుంటూరు జిల్లా పేరేచర్లలోని లేఅవుట్‌ను రాష్ట్రంలోనే వైఎస్ జగనన్న మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని గృహ నిర్మాణ, గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ లేఅవుట్లో ఇంటి పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలిలో చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌రావు, జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ.. పేరేచర్లలో 400 ఎకరాల్లో 18,492 ప్లాట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద వైఎస్సార్ జగనన్న కాలనీ నిరి్మతమవుతుందన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఆదివారం 26,422 పట్టాలు పంపిణీ చేశారు. వీటిలో 26,347 ఇళ్ల పట్టాలు ఇవ్వగా, 75 టిడ్కో అగ్రిమెంట్లను లబ్ధిదారులకు అందజేశారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లోనూ పట్టాల పంపిణీ జరిగింది. చంద్రగిరిలో వినూత్నంగా.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇంటి పట్టాతో పాటు ప్రతి తోబుట్టువుకు లెనిన్ కాటన్ చీర, జాకెట్, శ్రీవారి లడ్డూ, శ్రీ పద్మావతి అమ్మవారి పసుపు–కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, స్వీట్లు, చక్కటి బ్యాగుతో కూడిన సారెను తన స్వహస్తాలతో అందజేశారు. -
మనం కట్టేవి 'ఊళ్లు'
సాక్షి, అమరావతి: మనం పేదల కోసం కట్టేవి ఇళ్లే కావు ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలని, వీధి దీపాల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటుచేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అలాగే ప్రతి లే అవుట్లో నమూనా ఇంటిని (మోడల్ హౌస్) నిర్మించాలని ఆదేశించారు. ఈ నెల 25వ తేదీన పట్టాలు ఇచ్చే ప్రాంతాల్లో తొలిదశ కింద అదే రోజు 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని, జనవరి 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని చెప్పారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే... నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులు ఎలా కోరుకుంటే అలా.. – లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే కట్టించి ఇస్తాం – లేదా మెటీరియల్ ఇచ్చి, లేబర్ కాంపొనెంట్‌కు సంబంధించిన డబ్బు ఇవ్వండి అంటే అలాగే చేస్తాం – లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇల్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. – ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి – ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. నాణ్యత చాలా ముఖ్యం –ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. –ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలి. –ఆ లే అవుట్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధంగా ఉంచుకోవాలి. –దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఇళ్ల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుంది – ఇటీవలి వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలి –అవసరమైన విధంగా డ్రెయిన్ల నిర్మాణం, తదితర చర్యలు తీసుకోవాలి –లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా, సమస్యలు లేకుండా చూడాలి. – సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. – మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు – 3,65,987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులు – ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ – రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ – 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభం –రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం –వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక – కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం. – టిడ్కో ఇళ్లకు సంబంధించి 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం – 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కేవలం రూ.1 కే ఇవ్వనున్న ప్రభుత్వం -
ఇళ్లలో రివర్స్‌టెండరింగ్ రూ.105.91కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఏపీ టిడ్కోలో(ఏపీ టౌన్షిప్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) మొదటి దశలో 14,368 హౌసింగ్ యూనిట్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. ఈమేరకు రివర్స్ టెండర్లను గురువారం ఖరారు చేశారు. నాలుగు జిల్లాల్లో రివర్స్ టెండర్లు టీడీపీ హయాంలో పట్టణాల్లో ’అందరికీ ఇళ్ల పథకం’ కింద ఏపీ టిడ్కో 65,969 హౌసింగ్ యూనిట్లతో ప్రాజెక్టులు చేపట్టింది. టీడీపీ పెద్దలకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేలా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో కంటే అత్యధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాధనాన్ని ఆదా చేస్తూ పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్ యూనిట్లకు దశలవారీగా రివర్స్ టెండరింగ్ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రధాన టెండర్లు పిలిచిన మర్నాడే రివర్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఏపీ టిడ్కో మొదటి దశలో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 14,368 హౌసింగ్ యూనిట్లకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టింది. తద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ‘రివర్స్’తో ఆదా ఇలా.. ►చిత్తూరు జిల్లాలో 5,808 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెండర్లు దాఖలు చేశాయి. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎల్–1గా నిలిచింది. రూ.271.03 కోట్ల విలువైన పనులకు 15 శాతం తక్కువకు అంటే రూ.2309.18 కోట్లకే ఆ సంస్థ బిడ్ దాఖలు చేసింది. చదరపు అడుగు రూ.1,321 చొప్పున టెండరు ఖరారు చేశారు. తద్వారా రూ.40.85 కోట్లు ఆదా అయ్యాయి. ►కృష్ణా జిల్లాలో 2,064 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్, కేఎంవీ ప్రాజెక్ట్స్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ బిడ్లు దాఖలు చేశాయి. ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. రూ.95.65 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.81.30 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తద్వారా ఖజానాకు రూ.14.35 కోట్లు ఆదా అయ్యాయి. చదరపు అడుగు రూ.1,312 చొప్పున టెండరు ఖరారు చేశారు. ►విశాఖపట్నం జిల్లాలో 3,424 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి టాటా ప్రాజెక్టŠస్ లిమిటెడ్, ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్, ఇంద్రజిత్ మెహతా కన్ స్ట్రక్షన్స్ రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. రూ.192.23 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.163.40 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తద్వారా రూ.28.83 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. చదరపు అడుగుకు రూ1,304 చొప్పున ఈ టెండరు ఖరారు చేశారు. ►విజయనగరం జిల్లాలో 3,072 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి వీఎన్‌సీ లిమిటెడ్, ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ రివర్స్ టెండర్లలో పాల్గొనగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థ రూ.148.12 కోట్ల విలువైన పనులకు 14.78 శాతం తక్కువకు అంటే రూ.126.24 కోట్లకు కోట్ చేసింది. తద్వారా ఖజానాకు రూ.21.88 కోట్లు ఆదా అయ్యాయి. ఈ సంస్థకు చదరపు అడుగు రూ.1,315 చొప్పున టెండరు ఖరారు చేశారు. -
పట్టణ పేదలకు ఉచితంగా 10లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి : పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపక్రమించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బీ–అర్బన్ లోకల్ బాడీస్) పరిధిలో మొదటి దశ కింద జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులకు స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించి అనంతరం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీటిడ్కో నిర్ణయించింది. మొదటి దశలో ఇలా.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మొదటి దశ కింద 10 లక్షల వరకు ఇళ్లు నిర్మించాలని ఏపీటిడ్కో సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో ఇళ్ల కోసమే పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు 2 లక్షల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. విజయవాడలో లక్ష ఇళ్లు, గుంటూరులో 70 వేలు, తిరుపతిలో 60వేల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇలా రాష్ట్రం మొత్తం మీద పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని టిడ్కో గుర్తించింది. అన్ని వసతులతో 10వేల ఎకరాల్లో నిర్మాణం ఒక ఎకరా విస్తీర్ణంలో జి+3 విధానం కింద 100 యూనిట్లను అన్ని వసతులతో నిర్మించాలన్నది ప్రణాళిక. ఒక్కో యూనిట్‌ను 330 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఆ గృహ సముదాయాల వద్ద కమ్యూనిటీ హాలు, పార్కు, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల గృహాల కోసం 10వేల ఎకరాలు అవసరమని ఉన్నతాధికారులు అంచనా వేశారు. అందుకు అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియను రెవెన్యూ శాఖ ఇప్పటికే చేపట్టింది.భూసేకరణ, సమీకరణ, దాతల నుంచి సేకరించడం ద్వారా అవసరమైన భూమిని కూడా గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రారంభానికి భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది నాటికి లబ్ధిదారుల పేరిట ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో ఒక ఎకరా భూమిని ఉమ్మడిగా 100 మంది లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ టిడ్కో ఎండీ దివాన్ మైదీన్ ‘సాక్షి’కి తెలిపారు. మహిళల పేరిటే పట్టాలు ఇస్తారు. అనంతరం ఆ భూముల్లో ఏపీటిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. అందుకు రివర్స్ టెండరింగ్ విధానంలో బిడ్లు ఆహ్వానిస్తారు. అలాగే, ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యమని ఉన్నతాధికారులు చెప్పారు. ప్రణాళికలు సిద్ధం గతంలోని టీడీపీ ప్రభుత్వంలో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు కూడా తమ వాటాగా డబ్బులు చెల్లించాలనే విధానం రూపొందించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.2.65 లక్షలు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.3.65 లక్షలు, 430 చ.అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.4.65 లక్షలు లబ్ధిదారులు చెల్లించాలని నిర్ణయించారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం పేదలకు పూర్తి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ విధానమని అధికారులకు స్పష్టంచేశారు. భారీ వ్యయమవుతుందని అధికారులు చెప్పినా ఎంతైనా సరే ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తేల్చి చెప్పారు. దాంతో పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ టిడ్కో అధికారులు ప్రణాళిక రూపొందించారు. -
‘బోజగుట్ట’ ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బోజగుట్టలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై గతంలో ఉన్న ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. ఆ భూముల్లో చట్ట వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఎస్ ముస్తఫాహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ దాఖలు చేసిన కేసులో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు, అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం సవరించింది. సొసైటీకి చెందిన ఆరు ఎకరాల్లో కూడా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని పిటిషనర్ ఆరోపణ. ఈ కేసులో జీహెచ్ఎంసీ తరుఫున తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు వాదిస్తూ సొసైటీ భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మిగిలిన భూములపై హద్దులు నిర్ణయించి సింగిల్ జడ్జి వద్ద నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. -
10 నెలల్లో పది ఇళ్లు కట్టలేదు
హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకం కింద జి ల్లాలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క విమర్శించారు. హన్మకొండ బాలసముద్రంలోని శ్రీదేవి ఏషియన్మాల్ పక్కన నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో పలువురు నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పది నెలల క్రితం జిల్లాలో 592 ఇళ్లు నిర్మించేందుకు ప్రారంభించిన పనులు కనీసం బేస్మెంట్స్థాయిని కూడా దాటలేదని ఆరోపించారు. పిల్లర్లు వేసి పనులు పూర్తి చేయకపోవడంతో భూమిలోని అవి తుప్పుపట్టిపోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు వచ్చే ఇసుకలో సైతం అధికార పార్టీ నేతలు, వారి కుమారులు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పాలకులు సంబురాలు మానుకుని పాలనపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, నాయకులు సంతోష్‌నాయక్, జయపాల్, మన్సూర్హుస్సేన్, కొండం మధుసూదన్‌రెడ్డి, ఆక రాధాకృష్ణ, మార్క విజయ్, చాడా రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
► అనధికారిక సీనరేజీ వసూలు యథాతథం ► నిరుపయోగంగా పోలీస్ చెక్‌పోస్టులు ► తెలంగాణకు తరలిపోతున్న ఇసుక తిరువూరు : ఇసుక ఉచితంగా తోలుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా తిరువూరు మండలంలో ప్రజల నుంచి కొందరు సిం డికేట్లు ముక్కుపిండి మరీ డబ్బులు దం డుకుంటున్నారు. గానుగపాడు, చింతల పాడు వాగుల్లో ఇంకా మిగిలిన కొద్దిపాటి ఇసుకను రోజుకు 50 నుంచి 60 ట్రక్కుల లో నింపి తెలంగాణాకు తరలిస్తున్నారు. స్థానికులు ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క ట్రాక్టరుకు రూ.300 చొప్పున సీనరేజీ వసూలు చేస్తున్నారు. దొడ్డిదారిన అక్రమ రవాణా చింతలపాడు నుంచి ముష్టికుంట్ల, వామకుంట్ల మీదుగా ఎన్ఎస్పీ కాలువ కట్టపై వెంకటేశ్వరనగర్ చేరుతున్న ఇసుక ట్రా క్టర్లు ఖమ్మం జిల్లాలోని ఎర్రబోయినపల్లి మీదుగా కల్లూరు వెళుతున్నాయి. ఈ మా ర్గంలో ఎక్కడా పోలీసు చెక్‌పోస్టు లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునే అవకాశంలేదు. పోలీసులు తిరువూరు బై పాస్‌రోడ్డు, రాజుపేట, అక్కపాలెం, వేమిరెడ్డిపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వైపునకు వెళ్లకుండా దొడ్డిదారిలో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో చెక్‌పోస్టులు నిరుపయోగంగా మారాయి. గ్రామ కమిటీల పేరుతో వసూలు ఇసుక ఉచితంగా తెచ్చుకునే వారి నుంచి గ్రామ కమిటీల పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారు. దేవాలయాల అభివృద్ధి, గ్రామంలో కొత్త దేవాలయాల నిర్మాణం పేరు చెబుతూ కొందరు డబ్బు వసూలు చేస్తుండగా, తమ పొలం సమీపం నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నందున డబ్బులు ఇవ్వాలని పెద్ద రైతులు డిమాండ్ చేస్తున్నారు. చింతలపాడు, గానుగపాడు, వామకుంట్ల గ్రామాల్లో నిత్యం వేలాది రూపాయలు అనధికారిక వసూళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
డబుల్ ఇళ్ల ఊసెక్కడ..?
శంకుస్థాపనకే పరిమితమా!? కొణిజర్ల : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం డబుల్ బెడ్ రూం పథకం ఇంత వరకు మొదలు కాలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని గల్లీ నాయకుడి దగ్గర నుంచి మంత్రి వరకు అందరూ హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు నిలిపి వేసింది. అటు పాత బిల్లులు రాక కొత్త ఇళ్లు రాక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైరా నియోజకవర్గ పరిధిలో 400 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారు. వీటి నిర్మాణాలను మొదలు పెట్టేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఏడాది అక్టోబర్ 26న తనికెళ్లలో శంకుస్థాపన చేశారు. నాలుగు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. మండలంలో తనికెళ్ల, పెద్దగోపతి, తీగలబంజర, రాంపురం, విక్రంనగర్ గ్రామాల్లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ స్వయంగా లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు సైతం ప్రకటించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జాబితాకు బ్రేక్ పడింది. జిల్లా కలెక్టర్, మంత్రి , ఎమ్మెల్యేలు కలసి జాబితాను తయారు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటి వరకు తిరిగి దాని ఊసే ఎవ్వరు ఎత్తటం లేదు. అధికారులు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న ఇళ్లు కూల్చారు.. ఎమ్మెల్యే ప్రతిపాదనతో ఇక తమకు ఇళ్లు ఖాయం అన్న ధీమాతో పలువురు లబ్ధిదారులు తమకున్న కొద్ది పాటి ఇండ్లను కూల్చివేసుకున్నారు. తనికెళ్లలో సుమారు 8 మంది, తీగలబంజరలో రెండు కుటుంబాల వారు తమకున్న ఆధారాలను కూల్చివేసుకుని రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండలకు ఆ రేకుల షెడ్లలో ఉండలేక అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల నిరుపేదల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పట్లో ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి కనబడటం లేదు. గ్రామంలో ఉమ్మడిగా స్థలం ఉన్నచోట ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే ఇలా మండలంలో ఎక్కడా ప్రభుత్వ స్థలం లేదు. దీంతో సొంతింటి కల నెరవేరుతుందా.. లేదా.. అనే అయోమయంలో లబ్ధిదారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార్లు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గూడు కుదిరేనా?
దరఖాస్తులు 1,09,525 లక్షలు అర్హులు 64,789 కేటాయింపు 15,500 ఇళ్లు ఒక్కో నియోజకవర్గానికి 1250 గృహాలు ఎమ్మెల్యేల నుంచి ఇంకా అందని {పతిపాదనలు బడ్జెట్ కేటాయింపులను బట్టే నిర్మాణం అంటున్న అధికారులు పేదోడి సొంతింటి కల ఓ ప్రహసనంగా మారిపోయింది. తిన్నా తినకపోయినా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ జీవనాన్ని సాగిస్తున్న నిత్య శ్రామికుడు సేదతీరేందుకు కనీసం ఓ గూడు లేక అల్లాడిపోతున్నాడు. పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్న పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద జిల్లాకు కేటాయించిన గృహాల సంఖ్యే పేదోడి సంక్షేమంపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. మచిలీపట్నం : జిల్లాలోని పేదలకు పక్కా గృహాల నిర్మాణం అంశం మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 15,500 గృహాలను మాత్రమే కేటాయించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి లబ్ధిదారుల జాబితాలు గృహనిర్మాణ శాఖకు పంపితే ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు మంజూరవుతాయి. ప్రభుత్వం అరకొర కేటాయించినా... లబ్ధిదారుల జాబితాలను ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీ సభ్యులు ఇంకా ఖరారు చేయని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల నుంచి జాబితాలు వస్తే వాటిని కలెక్టర్ అనుమతి కోసం పంపుతామని గృహనిర్మాణ శాఖాధికారులు చెబుతున్నారు. పక్కా గృహాల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో జన్మభూమి కమిటీ సభ్యుల ప్రమేయం అధికం కావడం చర్చనీయాంశంగా మారింది. 64,789 మంది అర్హులుగా గుర్తింపు... జిల్లాలో జన్మభూమి - మా ఊరు, మీకోసం కార్యక్రమాల్లో 1,09,525 దరఖాస్తులు గృహనిర్మాణం నిమిత్తం వచ్చాయి. వీటిని తనిఖీ చేసిన అధికారులు 64,789 మందిని అర్హులుగా, మిగిలిన 44,736 మందిని అనర్హులుగా గుర్తించారు. మచిలీపట్నం మండలానికి 500 గృహాలను కేటాయించి మిగిలిన 12 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1250 చొప్పున కేటాయించారు. వాటిలో 845 ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా, 405 గృహాలు ఇందిరా ఆవాస యోజన పథకం ద్వారా నిర్మించాలని నిర్ణయించారు. 1.09 లక్షల దరఖాస్తులు రాగా దాదాపు 65 వేల మందిని అర్హులుగా గుర్తించి 15,500 గృహాలే కేటాయించడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి గృహాలు కేటాయిస్తారు. ఈ కేటాయింపులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం తదితర అంశాలపై లబ్దిదారుల్లో చర్చ జరుగుతోంది. 15,500 గృహాల్లో ఎస్సీలకు 3,590, ఎస్టీలకు 1406 ఇతరులకు 10,504 చొప్పున కేటాయించారు. ఒక్కొక్క గృహాన్ని రూ.2.75 లక్షలతో నిర్మించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా రూ.1.75 లక్షలు, రుణంగా లక్ష రూపాయలు, ఇతరులకు ప్రభుత్వ సబ్సిడీ రూ. 1.25, రుణంగా రూ. 1.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లాకు కేటాయించిన 15,500 గృహాల్లో ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఇళ్లస్థలాలు పొందిన వారికి 50 శాతం గృహాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండేళ్లుగా మంజూరే లేదు టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క నూతన గృహ నిర్మాణానికీ అనుమతులు మంజూరు చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 21 రోజుల్లో మార్చి నెల ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో గృహనిర్మాణ శాఖకు కేటాయించే నిధులను బట్టే గృహాల నిర్మాణం జరుగుతుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పక్కా గృహాల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం ఎంతమేర న్యాయం చేస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క గతంలో నిర్మించిన గృహాలకు సంబంధించి రూ.12 కోట్లకు పైగా బిల్లులను లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల రూ.8 కోట్లను విడుదల చేశారు. మిగిలిన రూ.4 కోట్ల బకాయి ఎప్పటికి విడుదల చేస్తారో వేచిచూడాలి. -
జిల్లాలో 4,850 డబుల్ బెడ్రూం ఇళ్లు మంత్రి మహేందర్‌రెడ్డి
♦ మొయినాబాద్‌లో సుడిగాలి పర్యటన ♦ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు మొయినాబాద్ : జిల్లాలో 4850 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.302 కోట్ల నిధులు ఖర్చుచేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. నాగిరెడ్డిగూడ, చందానగర్, చిలుకూరు పంచాయతీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నాగిరెడ్డిగూడలో రూ.3 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, చందానగర్‌లో రూ.3 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు, చిలుకూరులో రూ.3 లక్షలతో సీసీ రోడ్డు, దేవల్వెంకటాపూర్లో రూ.5 లక్షలతో సులబ్‌కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, చిలుకూరులో రూ.6 లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనం ఫ్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రూ.285 కోట్లతో 786 చెరువుల్లో పూడికతీత, మరమ్మతు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.1100 కోట్లు, లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు రూ.115 కోట్లతో విద్యుత్ సబ్ష్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ పద్మమ్మ, సర్పంచ్‌లు సంధ్య, మల్లారెడ్డి, గున్నాల సంగీత, ఎంపీటీసీ సభ్యులు గణేష్, సహదేవ్, పెంటయ్య, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజేష్, తహసీల్దార్ అనంతరెడ్డి, ఈఓపీఆర్డీ సునంద, ఎంఈఓ వెంకటయ్య, ఏఈలు భాస్కర్‌రెడ్డి, శారద, బీజేపీ మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్లు వర్ధన్, నర్సింహగౌడ్, నాయకులు కీసరి సంజీవరెడ్డి, జయవంత్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్లో డబుల్ కసరత్తు..!
స్థలాల అన్వేషణలో అధికారులు తొలివిడత 30 వేల ఇళ్లకు అంచనా సిటీబ్యూరో: సంవత్సర కాలంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం.. ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం. నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కాక జీహెచ్ఎంసీ దాదాపు రూ. 17 వేల కోట్లు ఖర్చు చేయాలి. ప్రభుత్వ హామీ మేరకు పనులు చేసేందుకు అధికారులు ప్రస్తుతం స్థలాన్వేషణ ప్రారంభించారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయి.. వాటిల్లో ఎన్ని అంతస్తుల్లో.. ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చో అంచనా వేస్తున్నారు. తగిన స్థలం ఉంటే 15 అంతస్తుల్లో నిర్మించాలని యోచిస్తున్నారు. మరో వారం రోజుల్లో వీటన్నింటిపై ఓ అంచనాకు రాగలమని భావిస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారు దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారు. ఖాళీ స్థలాల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు గుడిసెలు.. రేకులతో నిర్మించిన ఇళ్లు.. చిన్న ఇళ్లున్న స్లమ్స్‌లో వాటిని తొలగించి అక్కడివారికి అక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టివ్వాలనేది మరో యోచన. ఇక శిఖం భూములైతే నిర్మాణానికి వీల్లేదు. దేవాదాయశాఖ భూములైతే స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి పొందాలి. ఇలా వివిధ రకాల పనులు ఉండడంతో అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. ఈవారం ఆరంభం నుంచి సర్వే చేపట్టిన అధికారులు అపార్టుమెంట్లుగా దాదాపు 30 వేల ఇళ్లు నిర్మించేందుకు స్థలాలు ఉన్నట్టు అంచనా వేశారు. అయితే వాటి పూర్వాపరాలు.. వాటిని జీహెచ్ఎంసీ పరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు పూర్తిచేయాల్సి ఉంది. 9 ప్రాంతాల్లో గుర్తింపు ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందు గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేసినప్పటికీ, ప్రస్తుతానికి 9 బస్తీల్లో మాత్రం నిర్మాణానికి వీలుందని గుర్తించారు. ఈ బస్తీల్లో 8570 ఇళ్లు నిర్మించేందుకు అవకాశముందని అంచనా వేశారు. వాటికోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అంచనా వ్యయం రూ. 151 కోట్లు.గుర్తించిన బస్తీలు: హమాలీ బస్తీ, సయ్యద్‌సాబ్‌కా బాడా, సరళాదేవి నగర్, పిల్లిగుడిసెలు, జంగమ్మెట్, కాంగారినగర్, ధోబీఘాట్, ఇందిరానగర్, లంబాడి తండా. ఒక్కో ఇంటికి రూ.7 లక్షలు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నగరంలో ఒక్కో ఇంటికి రూ. 7 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రూ. 1.5 లక్షలు కేంద్రం నుంచి రూ. 3.8 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నాయి. మిగతా రూ. 1.7 లక్షలు జీహెచ్ఎంసీ వెచ్చించాలి. ఈ లెక్కన లక్ష ఇళ్లు నిర్మించాలంటే జీహెచ్ఎంసీపై పడే భారం దాదాపు రూ. 17 వేల కోట్లు. వీటిని ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టత రావాల్సి ఉంది. జీఐఎస్ మ్యాపింగ్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం గుర్తించిన స్థలాలను జీఐఎస్ మ్యాపింగ్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఏయే ప్రాంతాల్లో ఎన్ని అంతస్తులతో నిర్మించనున్నారు.. ఎక్కడ పనులు ఎంతమేర జరుగుతున్నాయి.. అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు తదితర విషయాలను కంప్యూటర్ నుంచే ప్రభుత్వ పెద్దలకు వివరించే వీలవుతుందని భావిస్తున్నారు. అందుకుగాను అన్నివిధాలా అనువుగా ఉండే ఆధునిక సాంకేతిక విధానాలను పరిశీలిస్తున్నారు. 2 లక్షల కుటుంబాలు.. తాజా అంచనాల మేరకు గ్రేటర్‌లోని 1466 స్లమ్స్‌లో రెండు లక్షల కుటుంబాలు ఉంటున్నట్టు అంచనా. వీరందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు వారు ఉంటున్న ఇళ్లను కూల్చివేసి, అక్కడే కొత్తవి నిర్మించాలి. వ్యక్తిగతంగా ఉన్న ఇళ్ల స్థానే ఫ్లాట్స్‌లో ఉండేందుకు ఒప్పించాలి. ఇందుకు కొంత కసరత్తు అవసరమని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను చూసి చాలామంది ముందుకు వస్తున్నప్పటికీ, వ్యక్తిగత ఇంటిని కోల్పోయి అంతస్తుల్లో ఉండేందుకు నిరాకరిస్తున్నవారూ ఉన్నారు. -
పండుగ తెల్లారే...
23న జిల్లాకు రానున్న కేసీఆర్ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం, డబుల్ బెడ్రూం పథకం ప్రారంభం మడికొండలో బహిరంగసభ హన్మకొండ : అభివృద్ధి పథకాల అమలే ఎజెండాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 23న జిల్లాలో పర్యటించనున్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, వరంగల్-యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణ, ఏటూరునాగారం వద్ద గోదావరిపై నూతనంగా నిర్మించిన వంతెన తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎంపాల్గొననున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కారీ పాలుపంచుకోనున్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పథకాన్ని దసరా రోజున లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. పథకం తొలిదశలో ప్రతీ నియోజకర్గానికి 400 ఇళ్లు కేటాయించగా, జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 4800 ఇళ్లు మంజూరయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది. మడికొండలో బహిరంగ సభ సీఎం జిల్లా పర్యటనలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రథకం ప్రారంభోత్సవ కార్యక్రమంగా వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండలో బహిరంగసభ నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహారి, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబులు పరిశీలించారు. మడికొండ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకంతో పాటు హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా యాదగిరిగుట్ట-మడికొండ రహదారి విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తొలుత వంతెన ప్రారంభం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏటూరునాగారం మండలం నుంచి ప్రారంభం కానుంది. తొలుత జాతీ య రహదారి 163పై ఏటూరునాగారం మండలం ముల్లకట్ట నుంచి ఖమ్మం జిల్లా వాజేడు మండలం పూసురు వరకు గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన వం తెనను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామమైన పూసూరులో జరుగనుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి గడ్కారీ మడికొండ వద్దకు చేరుకుంటా రు. కేంద్రమంత్రి పర్యటనకు సంబంధించి షెడ్యుల్ మంగళవారం వెల్లడి కాగా, సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలు మాత్రం అధికారికంగా ఖరారు కాలేదు. -
‘మైవాన్’కు మంగళం
- డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో విదేశీ పద్ధతికి రాంరాం - ప్రస్తుతానికి సంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాలని ప్రభుత్వం ఆదేశం - ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిని ప్రజలు ఆమోదించరంటూ కొత్త మెలిక - పాత పద్ధతిలో చేయాలంటే ఖర్చు పెరుగుతుందంటున్న అధికారులు - వరంగల్ టెండర్లలో కాంట్రాక్టర్ల కొటేషన్లే నిదర్శనమని వ్యాఖ్య - గందరగోళంగా ‘డబుల్’ వ్యవహారం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో మరో మలుపు. ఇళ్ల నిర్మాణాన్ని ఆధునిక పద్ధతిలో చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకుంది. నిర్మాణంలో మైవాన్ పరిజ్ఞానాన్ని వినిగియోగించుకోవాలనే యోచనను పక్కన పెట్టేసింది. సంప్రదాయ విధానానికే మొగ్గుచూపింది. ఈ సంవత్సరం చేపట్టనున్నట్టు ప్రకటించిన 60 వేల ఇళ్లను స్థానిక సంప్రదాయ నిర్మాణ పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాణాల కోసం పిలిచే టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లకే అవకాశం కల్పించేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగరంలో చేపట్టబోయే ఇళ్ల నిర్మాణం కోసం స్థానికంగా నమోదు చేసుకున్న కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనాలని నోటిఫికేషన్లో స్పష్టం చేయటం గమనార్హం. రోజుకో ఆలోచన.. పూటకో నిర్ణయం రెండు పడక గదుల ఇళ్ల విషయంలో గత జూన్ 2న తొలిసారి సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేదికపై ఆయన ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి నిర్మాణంపై రోజుకో మాట, పూటకో నిర్ణయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారీ సంఖ్యలో, అధిక వ్యయంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నందున ఖజానాపై భారాన్ని తగ్గించుకునే క్రమంలో గంపగుత్త నిర్మాణ పద్ధతిని అనుసరిస్తామని వెల్లడించింది. అవసరమైతే గ్లోబల్ టెండర్లకు వెళ్తామని చెప్పింది. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటంతోపాటు, త్వరగా పనులు పూర్తి కావటం, మన్నిక ఎక్కువగా ఉండేందుకు విదేశాల్లోని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ పద్ధతి అయిన మైవాన్ పరిజ్ఞానంతో పనులు చేపట్టనున్నట్టు స్వయంగా సీఎం వెల్లడించారు. ఆ పరిజ్ఞానంతో పనులు చేపట్టిన కంపెనీలతో అధికారులు చర్చలు కూడా జరిపారు. ఇందిరమ్మ ఇళ్ల తరహాలో లబ్ధిదారులే వారివారి స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునేలా కాకుండా ప్రభుత్వం సేకరించిన ప్రాంతంలో కాలనీలుగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదిలోనే నిర్ణయించారు. ఒకేచోట ఇళ్ల నిర్మాణం జరిగితే నిర్మాణ సంస్థకు పనులు చేయడం సులభం. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ప్రస్తుతం గ్రామాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షల చొప్పున యూనిట్కాస్ట్ను నిర్ధారించారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ధరతో నిర్మాణం చాలా కష్టం. కానీ అది జరగాలంటే స్థానిక సంప్రదాయ పద్ధతి కాకుండా, ప్రస్తుతం వంతెనల నిర్మాణంలో అనుసరిస్తున్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతే అనుసరించాలి. కానీ ఉన్నట్టుండి మనసు మార్చుకున్న ప్రభుత్వం అధిక వ్యయమయ్యే సంప్రదాయ పద్ధతిలో నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తుందో అధికారులకే అంతుచిక్కటం లేదు. తాజాగా ఆ యూనిట్ కాస్ట్‌తో నిర్మాణం సాధ్యం కాదన్నట్టుగా వరంగల్‌లో కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేయడమే ఇందుకు నిదర్శనం. మరి ఏకంగా 60 వేల ఇళ్లను ఎలా నిర్మిస్తారో అంతుచిక్కని పరిస్థితి. అంతా గందరగోళం మైవాన్ లాంటి కొత్త పద్ధతులు స్థానిక ప్రజలకు పరిచయం లేనందున, వారు అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి సంప్రదాయ పద్ధతిలోనే పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ సంవత్సరం నిర్మించనున్న 60 వేల ఇళ్లకు పాత పద్ధతిని అనుసరించి, ఆ తర్వాత భారీ మొత్తంలో నిర్మించే ఇళ్లకు మైవాన్ను వినియోగిస్తామంటోంది. కానీ ఇప్పుడు అనుమానపడే గ్రామీణులు ఆ తర్వాత ఎలా అంగీకరిస్తారో మరి. కొన్ని పాత పద్ధతిలో, మరికొన్నింటిని మైవాన్ పరిజ్ఞానంతో నిర్మిస్తే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
‘జీ ప్లస్’కు టెండర్లు ఓకే
- అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు - రూ.84.22 కోట్లతో డబుల్ బెడ్రూం ప్లాట్లు - 1384 మందికి ప్రయోజనం - రూ. 20కోట్లతో మౌలిక వసతులు - త్వరలోనే పనులు ప్రారంభం వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్ఆర్ నగర్‌లోని నివాసాల స్థానంలో జీప్లస్-1, జీప్లస్-3 పద్ధతిన డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పర్యవేక్షణ శాఖ ఎంపిక, టెండర్ల నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు కట్టబెట్టింది. రూ.వంద కోట్లకు పైగా వ్యయం కానున్న జీప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతను జిల్లా కలెక్టర్ ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్ అండ్ బీ శాఖ పూర్తి స్థాయిలో డీపీఆర్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహాయం తీసుకొని ఈ డీపీఆర్‌కు రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలోని కమిటీ ఈ డీపీఆర్‌కు ఆమోదం వేయగానే ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్లో టెండర్లు నిర్వహించారు. రూ.43 కోట్లతో జీప్లస్-3 నిర్మాణం: హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని 7 ఎకరాల స్థలంలో జీప్లస్-3 పద్ధతిలో అ ర్హులుగా గుర్తించిన 592మందికి డబుల్ బెడ్రూం ఇ ళ్లు నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో ప్లాట్లు, రోడ్లు, వి ద్యుత్ సౌకర్యం, ఇతరత్రా మౌలిక సదుపాయాలతో పాటు సీవరేజీ ప్లాంటు నిర్మిస్తారు. ఇళ్ల నిర్మాణానికి రూ.34కోట్లు, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వ్య యానికి రూ.9కోట్లు కేటాయించారు. ఈ పనుల కో సం నిర్వహించిన టెండర్లలో నాలుగు ఏజెన్సీలు పో టీ పడ్డాయి. ఈ టెండర్ల ప్రైస్‌బిడ్ ఓపెన్ చేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 1.17శాతం మైనస్, బీపీఆర్ కంపెనీ రూ.1శాతం మైనస్‌కు టెండర్లు వేయగా 7.29శాతం తక్కువ వేసిన మంద ఐలయ్య కంపెనీ ఈపనులను దక్కిం చుకున్నట్లు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. రెండు రోజుల్లో అగ్రిమెంటు కాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. రూ.71.80కోట్లతో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం: వరంగల్‌లోని ఎస్ఆర్ నగర్‌లోని 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేందుకు యత్నించగా స్థానికుల నుంచి వ్యతి రేకత రావడంతో అర్హులుగా గుర్తించిన 792మందికి జీప్లస్-1పద్ధతిలో ఇళ్లు నిర్మించనున్నారు. ఇందులో నిర్మాణాలను గ్రేడ్లుగా విభజించారు. - గ్రేడ్‌లో 4+4, బి-గ్రేడ్‌లో 2+2, సి- గ్రేడ్‌లో 1+1, డి-గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూపొందించారు. ఇందులో సి, డీ గ్రేడ్ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఎ, బి గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేందుకు జిల్లా కమిటీ నిర్ణయించింది. రూ.71.80కోట్ల వ్యయంతో ఇందులో రూ.50.22కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.10.40కోట్లతో మౌలిక సదుపాయాలు, రూ.11.18కోట్లు ఇతరత్రా వ్యయానికి కేటాయించారు. ఈ పనుల కోసం నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొనగా నలుగురు అర్హత పొందారు. బీపీఆర్ కంపెనీ రూ.0.01ప్లస్‌కు, మంద ఐలయ్య కంపెనీ 0.90శాతం ఎక్కువకు టెండర్లు వేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 4.14శాతం మైనస్‌తో ఈపనులను దక్కించుకున్నట్లు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ పనుల అగ్రిమెంటు పూర్తి కావడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. రూ.130కోట్ల వ్యయంతో డబుల్బెడ్రూం నిర్మాణం ప్రభుత్వం నగరంలో నిర్మించ తలపెట్టిన డబుల్‌రూం ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.130కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో రూ.110కోట్ల వరకు ఇళ్ల నిర్మాణానికి వ్యయం చేస్తుండగా రూ.20కోట్లు మౌలిక వసతుల కోసం వెచ్చిస్తాం. రోడ్లు, విద్యుత్ సరఫరాలతో పాటు నగరంలో మొదటి సారిగా సీవరేజి ప్లాంట్లు నిర్మిస్తాం. కాలనీల్లో వినియోగించిన నీటిని సీవరేజీ ప్లాంటులో శుద్ధి చేయడం వల్ల వాటిని మొక్కల పెంపకానికి, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ రెండు టెండర్ల ప్రక్రియ పూర్తయి అగ్రిమెంటు పూర్తింది. ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వగానే పనులు ప్రారంభిస్తాం. ఈ రెండు పనులు 15నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. - మోహన్‌నాయక్, ఎస్ఈ, ఆర్అండ్బీ -
థర్మాకోల్ ‘ఇళ్లు’
థర్మాకోల్‌తో చిన్నప్పుడు బొమ్మల ఇళ్లు కట్టాం.. కానీ అదే థర్మాకోల్‌తో నిజమైన ఇల్లు కట్టేస్తే.. అదీ తుపాను గాలులను సైతం తట్టుకునేలా నిర్మిస్తే.. ప్రకృతి విపత్తులు, తుపాన్ల సమయంలో 300 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలుల్ని కూడా తట్టుకునేలా ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’ ఇళ్ల నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్నారు. థర్మాకోల్ షీట్లతో ఇళ్లు నిర్మించే ఈ సరికొత్త టెక్నాలజీని తొలిసారిగా ఇక్కడ వినియోగించడం విశేషం. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన తుపానుకు ఇళ్లు కోల్పోయిన బాధితులకు హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో 330 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక్కో ఫ్లాట్ రూ. 5.35 లక్షల వ్యయంతో మొత్తం రూ.25 కోట్ల ఖర్చుతో ఈ ఇళ్ల ప్రాజెక్టు చేపడుతున్నారు. 12 బ్లాక్‌ల్లో 8+8 (జీ+1) తరహాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. - సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం * థర్మాకోల్ షీట్లతో ఇళ్ల నిర్మాణం * సమయం... ఖర్చు ఆదా * తుపాను బాధితులకోసం ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’ ఇళ్లు * ఏపీలోనే తొలిసారిగా శ్రీకాకుళంలో అమలు తక్కువ ఖర్చు.. ఎక్కువ ఉపయోగం సాధారణ గృహాల మాదిరి పునాదులు, పిల్లర్లు, బీమ్‌లు ఇనుము, కాంక్రీట్‌తోనే నిర్మించి.. గోడలు, కిటికీలు, మరుగుదొడ్లకు థర్మాకోల్ షీట్లను వాడుతున్నారు. సాధారణ షీట్లు కాకుండా రసాయనాలు మిక్స్ చేసి ల్యాబ్‌ల్లో పరీక్షించిన థర్మాకోల్ షీట్లనే వినియోగిస్తున్నారు. స్లాబ్ సమయంలో ఈ షీట్లను వైర్లతో అల్లి చుట్టూ రసాయనాలు పూసి కాంక్రీట్ పూతతో పూర్తిచేస్తారు. థర్మాకోల్ షీట్ల చుట్టూ ఐరెన్ మిక్స్ అయిన(తుప్పు పట్టని) జీఐ వైరు ముక్కలతో ఓ బాక్స్ తయారు చేస్తారు. వాటిని వివిధ సైజుల ప్రకారం అమర్చుతారు. రెండు పిల్లర్ల మధ్య, బాక్స్లమాదిరిగా వీటిని అమర్చి అనంతరం రసాయనాలు పూస్తారు. తరువాత గన్ పెయింటింగ్ తరహాలో కాంక్రీట్‌తో బలం వచ్చేలా చేస్తారు. గోడలు తయారైన తరువాత చూస్తే సాధారణ ఇళ్ల నిర్మాణం మాదిరిగానే కనిపిస్తుంది. మేకులు కొట్టుకునేందుకూ అనువుగా ఉంటుంది. సాధారణ గృహ నిర్మాణానికి ఏడాది కాలం పడితే థర్మాకోల్ షీట్లతో ఆరునెలల్లోనే పూర్తవుతుంది. తుపాను బాధితులకు గతంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు ఏడెనిమిది లక్షల ఖర్చు అయ్యేది. కానీ ఈ విధానంతో రూ. 5.35 లక్షలతోనే పూర్తవుతోంది. ఒక్కో ఫ్లాటుకు రూ.500 విలువ చేసే 2ఇన్‌టూ3 మీటర్లుండే 26 షీట్లను ఉపమోగించి గోడలు నిర్మించుకోవచ్చు. ప్రత్యేకతలు.. ఇవీ ఈ థర్మాకోల్ ఇళ్ల వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా చేయవచ్చు. భారీ తుపాన్లను సైతం ఇవి తట్టుకోగలవు. అగ్ని ప్రమాదాలు సంభవించినా ప్రాణ/ఆస్తినష్టం వాటిల్లే అవకాశాలుండవు. శబ్దకాలుష్యం నుంచి విముక్తితోపాటు వేసవిలో చల్లదనం పొందొచ్చు. ఈ నిర్మాణాలకు రూ.12 వేలతో మరుగుదొడ్ల నిర్మాణ ఖర్చును కేంద్రం భరిస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. చెన్నైకు చెందిన ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్ట్రక్చరల్ సెంటర్’ (సీఐఎస్ఆర్) సంస్థ థర్మాకోల్ షీట్ల పంపిణీలో కీలక బాధ్యత వహిస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిస్తే రాష్ట్రవ్యాప్తంగా నాలుగుచోట్ల ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేస్తామని ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇటుక నిర్మాణాలకు భవిష్యత్తులో ఇబ్బందులేర్పడే అవకాశాలుండడంతో 12ఎంఎం చిప్స్ సహా థర్మాకోల్ షీట్లను ఉపయోగిస్తున్నామని ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. -
ఎనిమిది నెలలాయే..!
ముందుకుసాగని ఇళ్ల నిర్మాణం తొలుత 3,957 ఇళ్లకు సీఎం శంకుస్థాపన తదుపరి 1,384 ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉత్తర్వులు వచ్చినా మొదలు కాని పనులు కనీసం లే అవుట్లు సిద్ధంకాని వైనం మిగిలిన ఇళ్ల నిర్మాణంపై స్పష్టత కరువు హన్మకొండ : మురికివాడలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామంటూ 2015 జనవరిలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద రెండు రోజుల వ్యవధిలోనే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆర్నెళ్లలోపే ఇళ్లు నిర్మించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మీపురం, ఎస్సార్‌నగర్, గరీబ్‌నగర్, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట, ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, అంబేద్కర్‌నగర్, జితేందర్నగర్లలో ఇళ్ల నిర్మాణానికి సీఎం స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ కాలనీల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో 3,957 ఇళ్లు నిర్మిస్తామని సహకరించాల్సిందిగా ప్రజలకు సీఎం సూచించారు. ఈ పని చేపట్టేందుకు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి రాజధాని నగరానికి దూరంగా జిల్లా కేంద్రంలో వరుసగా నాలుగు రోజులు బస చేశారు. అయితే శంకుస్థాపన జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. లే అవుట్ సిద్ధం కాలేదు.. శంకుస్థాపన జరిగిన ఆర్నెళ్ల తర్వాత అంబేద్కర్‌నగర్, ఎస్సార్‌నగర్‌లలో 1,384 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ప్రతీ ఇంటికి 900 చదరపు అడుగులను కేటాయించారు. వీటిలో 560 చదరపు అడుగుల వైశాల్యంలో రూ 5.04 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం, కిచెన్, కామన్హాల్, రెండు టాయిలెట్లతో ఇళ్లను నిర్మించనున్నట్లు ఆ జీవోలు పేర్కొన్నారు. తొలిదశలో 1,384 ఇళ్ల నిర్మాణానికి రూ.69.75 కోట్లు మంజూరయ్యాయి. స్థల లభ్యత ఆధారంగా అంబేద్కర్‌నగర్‌లో జీ ప్లస్ 3 పద్ధతిలో, ఎస్సార్‌నగర్‌లో జీ ప్లస్ 2 పద్ధతిలో ఇళ్లను నిర్మించాల్సి ఉంది. ఉత్తర్వులు జారీ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లే అవుట్లు సిద్ధం కాలేదు. కష్టంగా మారిన స్థల మార్పిడి జీ ప్లస్ వన్ పద్ధతిలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఎంపిక చేసిన ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, ఎస్ఆర్నగర్, గరీబ్‌నగర్, సాకారాశికుంట మురికివాడలు చెరువు శిఖం భూముల్లో వెలిశాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఈ స్థలాలు చెరువుశిఖం ప్రాంతంలో ఉన్నాయి. చారిత్రక ఖిలావరంగల్‌లోని మట్టికోటకు ఆనుకోని గిరిప్రసాద్‌నగర్ ఉంది. ఈ మురికివాడ మొత్తం ఆర్కియాలజీ శాఖ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం చెరువు శిఖం భూములు, పురవస్తుశాఖ పరిధిలో ఉన్న స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడ ఇళ్లు నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాల్సి ఉంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు ఆర్నెళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆర్నెళ్లు గడుస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం చెరువుశిఖం, పురవస్తుశాఖ ఆధీనంలో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతికి సంబంధించి స్థలమార్పిడిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం లేదు. లక్ష్మీపురం ప్రాంతం స్థల మార్పిడి నిబంధనతో పని లేకుండానే ఇక్కడ ఇళ్లు నిర్మించవచ్చు. కానీ అంతర్గతరోడ్లు, పార్కులతో కూడిన లే అవుట్‌ను సిద్ధం చేసే క్రమంలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సేకరించాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు అదనపు నిధుల అవసరం ఏర్పడుతోంది. స్థలమార్పిడి, అదనపు నిధులతో ముడిపడి ఉన్న ఇళ్లపై ప్రభుత్వ పరంగా స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గడిచినా ఎనిమిది నెలలుగా వీటిపై ్రపభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. -
ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా..!
హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న ఇళ్లు లక్షకుపైనే.. ప్రభుత్వం మంజూరుచేసింది పదివేలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంకా ప్రారంభంకాని ఇళ్ల నిర్మాణం విజయనగరం క్రైం: గత ఏడాది ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుద్‌హుద్ తుపాను ధాటికి బాధితులు నష్టపోయింది కొండంత అయితే ప్రభుత్వం మంజూరు చేసింది గోరంత చందంగా ఉంది బాధితుల పరిస్థితి. గత ఏడాది అక్టోబర్ 12న ఉత్తరాంధ్ర జిల్లాల్లో హుద్‌హుద్ తుపాను ప్రజలను తీవ్రమైన భయాందోళనలకు గురిచేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హుద్‌హుద్ విలయతాండవం చేయడంతో పేదల ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది. మూడు జిల్లాల్లో ఇళ్లు కోల్పోయిన అనేకమంది ఉండడానికి గూడు లేక ప్రభుత్వం తమకు ఇళ్లు ఇస్తుందేమో ఆన్న ఆశతో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు, అయితే విజయనగరం జిల్లాలో 15,212 ఇళ్లు, విశాఖపట్నం జిల్లాలో సుమారు 60వేల ఇళ్లు, శ్రీకాకుళం జిల్లాలో 30వేల ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించినప్పటికీ ఈ మూడు జిల్లాలకు ప్రభుత్వం మం జూరు చేసిన ఇళ్లు కేవలం పదివేలు మాత్రమే. లక్షల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు వేలల్లో ఇళ్లు మంజూరు చేయడం పట్ల బాధితులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణానికి చర్యలేవీ..? తుపాను వచ్చి సుమారు తొమ్మిదినెలలు కావస్తోంది. బాధితులను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించారు. కానీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో శ్రద్ధ చూపడం లేదని బాధితులు వాపోతున్నారు. తుపాను బాధితులకు ఈఏడాది అక్టోబర్ 12 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి విశాఖపట్నం జిల్లాలో 2500 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. విజయనగరం జిల్లాలో మం జూరైన 15 వందల ఇళ్లలో 500 ఇళ్లకు మాత్రమే టెండర్లు వేశారు. మిగతా ఇళ్ల నిర్మాణానికి టెండర్లు వేయాల్సి ఉంది. ఈఏడాది అక్టోబర్ 12నాటికి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.. -
మా ఇళ్లను కూల్చకండి
- సభా సమితి సభ్యుల ఎదుట - బాధితుల ఆక్రోశం సాక్షి, బెంగళూరు: ‘ప్రభుత్వమే మాకు హక్కు పత్రాలను ఇచ్చి ఇళ్లను నిర్మించుకునేందుకు అధికారాన్ని కల్పించింది. ఇంతకాలంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు చెల్లిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెరువులను ఆక్రమించారంటూ మా ఇళ్లను కూల్చేస్తే పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్లాలి. మా ఇళ్లను కూల్చకండి’ అంటూ వివిధ ప్రాంతాల్లోని నివాసితులు సభా సమితి సభ్యుల ఎదుట తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నగరం చుట్టుపక్కల ప్రాం తాల్లో చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అధ్యయ నం కోసం ఏర్పాటు చేసిన కె.వి.కోళివాడ నేతృత్వంలోని సభా సమితి రెండో రోజైన బుధవారం సైతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. నగరంలోని విజినాపుర చెరువుతోపాటు కౌదేనహళ్లి, బి.నారాయణపుర, బాణసవాడి చెరువులను సమితి సభ్యులు బుధవారం పరిశీలించారు. సమితి సభ్యులు ఆయా ప్రాంతాలకు చేరుకోగానే తమ ఇళ్లను కూల్చేందుకే అధికారులు వచ్చారని భావించిన స్థానికులు సభాసమితి సభ్యులను చుట్టుముట్టారు. తమకు ఆయా స్థలాలను అమ్మిన వారిని వదిలేసి ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో స్థలాలను కొని ఇళ్లు కట్టుకుంటే ఇలా బలవంతంగా ఖాళీ చేయించాలని చూడడం ఎంత వరకు సమంజసమని ఆయా ప్రాంతాల ప్రజలు సభా సమితి సభ్యులను నిలదీశారు. ఇక కౌదేనహళ్లి చెరువుకు సంబంధించి సర్వే నెం.37లో 34.10 ఎకరాలు కబ్జాకు గురికాగా, బి.నారాయణపుర చెరువులో 7.05 ఎకరాలు, విజినాపుర చెరువులో 10.37 ఎకరాలు, బాణసవాడిలో ఒక ఎకరా ఆక్రమణకు గురయ్యాయని సభా సమితి సభ్యులకు అధికారులు వివరించారు. -
అద్దె చెల్లిస్తే ఇల్లు సొంతం!
కొత్త విధానానికి ప్రభుత్వ యోచన గ్రేటర్‌లోని పేద ప్రజలకు దశలవారీగా రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం.. మధ్య తరగతి వారికి కూడా సొంతిల్లు కల్పించాలనే యోచనలో ఉంది. అందుకు తగిన విధివిధానాలు రూపొందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. నగర ంలో ఇళ్లు లేని వారిలో నిరుపేదలతో పాటు లక్షల సంఖ్యలో దిగువ, మధ్యతరగతి వారున్నారు. వీరు నెలకు రూ. 3 వేల నుంచి రూ. ఏడెనిమిది వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని వీరు కడుతున్న అద్దె కంటే 20 శాతం అదనంగా నెలానెలా (అద్దెలాగే) ప్రభుత్వానికి చెల్లించే ఏర్పాటు చేస్తారు. తద్వారా నిర్ణయించిన ధర మేరకు అలా పది, పదిహేనేళ్లు అద్దె చెల్లిస్తే ఇళ్లు వారి సొంతమవుతాయి. ఈ దిశగా ఎంతమందికి ఎలాంటి ఇళ్లు అవసరమవుతాయనే దిశగా అధికారులు యోచిస్తున్నారు. ప్రభుత్వం పేదల కోసం ఐడీహెచ్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లకు సగ టున రూ. 8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఆ మోడల్లో నిర్మించే ఇళ్లలో మధ్య తరగతివారు ఉండేందుకు కూడా మొగ్గుచూపుతారనే అంచనాలున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ పద్ధతిలో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని వృత్తుల్లోని వారు నిర్ణయించిన కనీస ధరను ఏకమొత్తంగా చెల్లిస్తే.. మిగతా ఖర్చు ప్రభుత్వమే భరించి వారికి సొంత ఇళ్లను సమకూర్చాలనే యోచనలో కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీ కార్మికులకు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు..? వీటితోపాటు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా నగరంలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. కాగా, వాటిలో దాదాపు 20 వేల ఇళ్లు లబ్ధిదారులు లేక ఖాళీగా ఉన్నాయి. వీటిని తమ కార్మికులు, చిరుద్యోగులకు అందజేయాలనే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది. ఈమేరకు త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను కూడా వేలం పద్ధతిలో విక్రయించాలనే యోచనలో ఉన్నారు. నగరంలో సొంత ఇల్లు లేని వారు ఉండరాదనే ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేసేందుకు ఇలా వివిధ పద్ధతులను అధికారులు పరిశీలిస్తున్నారు. -
ఇంటింటా మరుగుదొడ్డి
- పైలట్ ప్రాజెక్ట్‌గా పెంచ్‌కల్‌పాడ్ ఎంపిక - తిమ్మాపూర్‌కు తరలిన లబ్ధిదారులు - ముఖ్యమంత్రి సభకు ఆహ్వానం కుంటాల : గృహనిర్మాణ, ఉపాధిహామీ పథకం, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డీఆర్డీఏ, ఐకేపీ శాఖల ద్వారా సంయుక్తంగా మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ గ్రామాన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. గ్రామంలో మరుగుదొడ్లు వందశాతం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపటే ్టందుకు ముందుకు వచ్చారు. వందశాతం పూర్తి చేయడమే లక్ష్యం.. మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ గ్రామంలో 340 కుటుంబాలుండగా వెయ్యి మంది జనాభా ఉన్నారు. నాలుగు రోజులుగా గ్రామంలో చేపట్టిన సర్వేలో 137 ఇళ్లలో మరుగుదొడ్లు లేవని తెలిసింది. వివిధ కారణాలతో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 74ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. గ్రామంలో మరుగుదొడ్ల లక్ష్యం వందశాతం పూర్తి చేసేందుకు డీఆర్డీఏ, ఐకేపీ శాఖలు ముందుకు వచ్చాయి. మరుగుదొడ్ల నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆ శాఖల ద్వారా రూ.12వేలు నేరుగా వీవో సంఘాల ద్వారా అధికారులు అందించి ప్రోత్సహిస్తున్నారు. అధ్యయనం కోసం తిమ్మాపూర్‌కు.. మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ ముంపు గ్రామం. గ్రామంలో ప్రతీ ఇంటి ఎదుట విశాలమైన స్థలం ఉంది. నిబంధనలు సడలిస్తే నిర్మాణాలు పూర్తిచేస్తామని లబ్ధిదారులు పేర్కొనడంతో అధికారులు జిల్లాలోని పెంచ్కల్పాడ్ను నమూనా ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. దీంతో ఐకేపీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి సర్పంచ్ దాసరి కమల, ఎంపీటీసీ సభ్యురాలు అవదూత్వార్ వేదిక, మహిళాసంఘాల సభ్యులు, గ్రామపెద్దలు, అధికారులు, అధ్యయనం కోసం మెదక్ జిల్లాలోని గజ్వేల్ మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి అక్కడి గ్రామస్తులు రాష్ర్టంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్కడ చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను పెంచ్‌కల్‌పాడ్ గ్రామస్తులు మూడురోజుల పాటు అధ్యయనం చేస్తారు. కాగా మెదక్ జిల్లా కౌడపెల్లి మండల కేంద్రంలో ఈనెల ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభకు గ్రామ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులకు ఆహ్వానం అందింది. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. -
ఇక ఇళ్ల రాజకీయం!
* పదేళ్ల ఇళ్ల నిర్మాణాలపై సర్వే * నేటి నుంచి జియో టాగింగ్ ప్రారంభం.. * జిల్లాలో 59 బృందాలతో సర్వే శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ద్వారా వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. 2014-15 సంవత్సరానికి కొత్తగా ఒక్క ఇల్లు మంజూరు చేయకపోయినా గతంలో నిర్మించిన ఇళ్లపై మాత్రం సర్వేలు నిర్వహిస్తోంది. దీనికి రాజకీయ కారణాలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా టీడీపీయేతర ప్రభుత్వాలు రాష్ట్రం లో ఉండడంతో నాడు నిర్మించిన ఇళ్లపై ప్రస్తుతం సర్వేలు చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఇళ్లు మంజూరు లేకుండా జాప్యం చేసేందుకు కూడా జియోటాగింగ్ విధానం పేరిట జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం వలన కొత్తగా ప్రభుత్వానికి గానీ, లబ్ధిదారులకుగానీ ఏ ప్రయోజనం లేకపోయినా సిబ్బందిని ఇబ్బంది పెట్టేందుకు, గత ప్రభుత్వం పొరపాట్లు చేసిందని ఆరోపించేందుకే జియోటాగింగ్ సర్వేను చేపడుతోందని భావిస్తున్నారు. జియోటాగింగ్ విధా నం జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుగానూ వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలతో కూడిన 59 బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందాలు ఆయా మండలాల్లో వారికి ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌తో ఫోటోగ్రఫీ, ఇతర వివరాలు అప్లోడ్ చేసి జియోటాగింగ్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ కార్యక్రమం డిసెంబరు 31 వరకు జిల్లాలో జరుగుతుంది. ఒక మం డలంలో రెండు బృందాలు పర్యటించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ బృందాలకు మైక్రోమాక్స్ సెల్‌ఫోన్, ఎయిర్టెల్ సిమ్‌కార్డు, ప్రత్యేక రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. వీరు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలను తీసుకొని జియోటాగింగ్ నిర్వహిస్తారు. ఈ సర్వేలకు 2004 నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్ల వరకు అన్ని ఇళ్లను సర్వే చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి గృహాలు సుమారుగా 4 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన జాబితాలు ఆయా మండలాల వారీగా, స్కీమ్‌ల వారీగా సిద్ధం చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రస్తుతం వాటి స్థాయిలతో కూడిన జాబితాలను తయారు చేశారు. వీటన్నింటినీ జీవో టాగింగ్ చేయాల్సి ఉంది. ఈ విధానంలో ఇందిరా ఆవాసయోజన పథకంలో మంజూరైన వాటికి తొలి ప్రాధాన్యమివ్వాలి. రెండవ ప్రాధాన్యతగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను తీసుకోవాలి. మూడో ప్రాధాన్యత అంశంగా పూర్తిగా నిర్మాణాలు పూర్తయిన ఇతర స్కీమ్‌ల ఇళ్లను జియోటాగింగ్ చేయాలి. ఈ విధానంలో ఒక్కో బృందం రోజుకు 50 గృహాలకు తక్కువ లేకుండా నిర్వహించాలి. ఈ విధానంలో గృహం ఐడీ నెంబరు, గృహయజమాని పేరు, ఆ గృహనిర్మాణాన్ని కనీసం రెండుకు తగ్గకుండా ఫోటోలు ఈ విధానంలో అప్లోడ్ చేయాల్సి ఉంది. నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో డేటాను తీసుకొని కార్యాలయానికి వచ్చిన అప్లోడ్ చేయాలి. ఇందుకు ఉపయోగించే సెల్‌లకు ప్రత్యేకంగా పవర్‌బ్యాంకు పేరిట ఒక ప్రత్యేక బ్యాటరీ రీచార్జర్ను అందిస్తున్నారు. దీని ద్వారా సెల్‌ఫోన్‌కు రెండు మూడు పర్యాయాలు చార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంతవరకు గృహనిర్మాణాల అంచనాలు వేయడం, బిల్లులు చేయడం వంటి పనుల్లో ఉన్న ఇంజినీర్లు ఒక్కసారిగా ఈ టాగింగ్ విధానం రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల నుంచి నిర్మాణాలపై ఈ విధానం నిర్వహించడం వలన కొన్ని గృహాల వివరాలు దొరికే పరిస్థితి కన్పించడం లేదు. సమాచారం తిరిగి అందుబాటులో లేకపోవడం, లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉండక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని సర్వే బృందాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియోటాగింగ్‌పై ఒక్కరోజు శిక్షణ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జియోటాగింగ్ విధానంపై ఒక్కరోజు శిక్షణను బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణలో ప్రధానంగా జియోటాగింగ్ విధానం నిర్వహించడంపైన శిక్ష ణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఫొటో తీసే విధానాన్ని, ఐడీ నెంబరు నమోదు అంశాలపై సెల్‌ఫోన్ ఆధారంగా శిక్షణ ఇచ్చారు. ఈ బృందాలకు సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, పవర్‌బ్యాంకు ఛార్జర్ తదితర పనిముట్లను అందజేశారు. కార్యక్రమలో గృహనిర్మాణ సంస్థ రీజనల్ మేనేజర్ పి. శ్రీరాములు, ఎంజీఎస్ ప్రసాద్, జోనల్ మానిటరింగ్ ఆఫీసర్ బి. జయచందర్, జి. నారాయణ, ఈఈలు కూర్మారావు, గణపతి, డీఈలు అప్పారావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రామకృష్ణ, సత్యనారాయణ, పాల్గొన్నారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్: నేతలు ఎవరెవరెమన్నారు..
‘ఇందిరమ్మ’ పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఇందిరమ్మ పథకం కింద పెద్ద ఎత్తున గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సుమారు రూ.150 కోట్ల వరకు పెండింగ్ బిల్లులున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో గృహనిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి నామమాత్ర ంగా నిధులు విడుదల చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించి లబ్ధిదారులను ఆదుకోవాలి. -సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఆరు మాసాలుగా వారి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపి సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. - సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభను తప్పుదోవ పట్టిస్తున్న అధికార పక్షం అధికారపక్ష సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. శాసనసభా మర్యాదలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షానికి ఓర్పు సహనం అవసరం. కనీసం సలహాలు, సూచనలను సైతం తీసుకునే స్థితిలో అధికార పక్షం లేదు. టీడీపీ సభ్యులను నామినేట్ ఆంగ్లో ఇండియన్ సభ్యులుగా అభివర్ణించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. - బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి సభా సమయం వృథా అవుతోంది టీఆర్ఎస్, టీడీపీ అనవసర రాద్ధాంతాలతో విలువైన సభా సమయం వృధాఅవుతోంది. సభా మర్యాదలు పాటించడం లేదు. సభ తీరు గందరగోళంగా ఉంది. ఇరుపక్షాలు సభను రాజకీయ వేదికగా మార్చుకున్నాయి. ఇప్పటి వరకు శాసనసభను అధికారపక్షం స్వార్థ రాజకీయాలకు వాడుకునేది .ఇప్పుడు కుటుంబం కోసం వాడుకుంటోంది. ఈ విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. -కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సంక్షేమ పథకాల అమలేది.. టీఆర్ఎస్ ఎన్నికల ఎజెండాల్లో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు ఏది..? రైతు రుణాలపై స్పష్టత లేదు. విద్యుత్ సమస్యకు పరిష్కారం లేదు. గిరిజనులకు మూడు ఎకరాల భూమిపై చర్చ లేదు. ఆగస్టు 15న దళితులకు భూమి పంపిణీ చేసి వదిలేశారు. సాగుకు పెట్టుబడేది. ప్రజా సమస్యలపై చర్చ జరుగాలి. సభా సమయం వృథా కావద్దు. -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.వెంకటేశ్వర్లు విద్యుత్ కష్టాలకు సూత్రధారి చంద్రబాబే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు. ఆంధ్రబాబు కనుసైగల్లోనే టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. విద్యుత్‌ను అడ్డుకుంటుంది చంద్రబాబు కాదా..? సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరిస్తున్నా... అడుగడుగునా అడ్డుకుంటూ ఆంధ్ర బాబుకు వత్తాసు పలుకుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. టీటీడీపీ సభ్యులకు గుణ పాఠం తప్పదు. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు -
‘లెక్క’ తేల్చుతారు!
ప్రభుత్వ పథకాల కింద మంజూరైన ఇళ్లలో బోగస్‌లను గుర్తించాలని కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేదల కోసం ప్రభుత్వ నిధులు, సబ్సిడీలతో నిర్మించిన ప్రతి ఇంటినీ ప్రభుత్వం లెక్కతీయనుంది. ప్రభుత్వ పథకాల కింద నిర్మించిన మొదటి ఇంటితో సహా ఇప్పటివరకు మంజూరైన అన్ని ఇళ్ల వివరాలను సేకరించనుంది. ఇందుకోసం గూగుల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనుంది. అసలు మం జూరైన ఇళ్లెన్ని? అందులో నిర్మించినవెన్ని? పక్కదారిపట్టినవెన్ని? దుర్వినియోగమైన నిధులెన్ని అనేది తేల్చనుంది. అక్రమాలు బయటపడితే.. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టడంతో పాటు నిధులనూ రికవరీ చేయనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద పేదల కోసం 45 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. దీనికి ప్రభుత్వం రూ. 9,400 కోట్లు ఖర్చు చేసింది. వీటికి సంబంధించిన వివరాలన్నీ పైకి పక్కాగా కనిపిస్తున్నా... వాస్తవానికి భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పేదలకు ఒక్కో ఇంటిని రూ. మూడు లక్షలతో విశాలంగా నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ నేపథ్యంలో.. ముందుగా ఈ అక్రమాల బాగోతం తేల్చాలని నిర్ణయించింది. లక్షల ఇళ్లు ఎక్కడికి పోయాయి..? ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి కేసీఆర్ వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి కొన్ని విస్తుపోయే అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. దాంతో ఆయన అలాంటి మొత్తం ఇళ్ల వివరాలను ఆరా తీయాలని నిర్ణయించి.. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు .బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో నిర్వహించిన థర్డ్ పార్టీ తనిఖీల వివరాలు కేసీఆర్ దృష్టికి వచ్చాయి. తెలంగాణలో 593 గ్రామాల్లో నిర్వహించిన ఈ పరిశీలనలో ఏకంగా రూ. 230 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్నది ఆ నివేదిక సారాంశం. ఈ లెక్కన అన్ని గ్రామాల్లో పరిశీలన చేస్తే భారీ అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని కేసీఆర్ అధికారులకు సూచించారు. తెలంగాణలో మొత్తం 84 లక్షల కుటుంబాలున్నాయి. వారంతా దాదాపు 57 లక్షల ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం ఇళ్లలో 45 లక్షల ఇళ్లు ప్రభుత్వపరంగా పేదల కోసం నిర్మించినవే. అంటే సాధారణ కుటుంబాలుండే ఇళ్లు 12 లక్షలు మాత్రమే అన్నట్లు. అంతేగాకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి గతేడాది చివరలో 13.65 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికితోడు మరికొన్ని లక్షల మంది దరఖాస్తుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిని పరిశీలించిన కేసీఆర్... ఇప్పటికే ప్రభుత్వ పరంగా 45 లక్షల ఇళ్లు నిర్మించినా... మళ్లీ లక్షల కొద్దీ ఇళ్ల కోసం దరఖాస్తులెందుకు? అన్ని ల క్షల మంది ఇళ్లు లేకుండా ఎందుకున్నారు? అన్న కోణంలో పరిశీలించి, వాస్తవాలు వెలికితీయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు హయాంలో తెలుగుదేశం నేతలు, అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించే నాటికి ప్రతి ఇంటి లెక్కను తన ముందుం చాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఊరికి వెళ్లి పరిశీలిం చి పారదర్శకమైన నివేదిక ఇవ్వాల ని కోరారు. ఈ మేరకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఏం చేయబోతున్నారు..? ప్రభుత్వ నిధులు, సబ్సిడీలతో నిర్మించిన పేదల ఇళ్లకు సంబంధించిన లెక్కలను ఆగస్టు 14వ తేదీలోగా సేకరించాలి. ఈ లక్ష్యం మేరకు వేగంగా పనిచేయాలని అధికారులకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. గత శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీ పది జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ ఇళ్ల లెక్క తేల్చాలని నిర్ణయించారు. గూగుల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, వాస్తవాలను వెలికితీయాలి. ఆ ఇంటి ఫొటో సహా యజమాని వ్యక్తిగత వివరాలు, ప్రభుత్వం అందజేసిన మొత్తం తదితర అన్ని వివరాలను గూగుల్ మ్యాపుల్లో నిక్షిప్తం చేయాలి. ఈ పరిశీలనలో బోగస్‌ల జాడ తెలిస్తే బాధ్యులైన అధికారులెవరో గుర్తించి, వారిపై ఆరోపణలు నమోదు చేయాలి. నిధులను రికవరీ చేయాలి. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఈఈలు, డిప్యూటీ ఈఈలను మరో జిల్లాకు.. ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లను మరో నియోజకవర్గానికి బదిలీ చేయాలి. -
త్రిశంకు స్వర్గంలో ‘ఇందిరమ్మ’
- నాలుగు నెలలుగా అందని బిల్లులు - కొత్త ప్రభుత్వం రద్దు చేస్తోందని ప్రచారం - ఆందోళనలో లబ్ధిదారులు - బిల్లు చెల్లించి న్యాయం చేయాలంటూ వేడుకోలు సంగారెడ్డి డివిజన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వాలు ‘ఇందిరమ్మ’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయడంతో లబ్ధిదారులు కూడా ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చారు. అందువల్లే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అర్హులైన పేదలకు రూ.3 లక్షలతో రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్‌తో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 లక్షల పథకానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో అధికారులు విధి విధానాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం కొనసాగింపుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్త గృహ నిర్మాణం పథకానికి శ్రీకారం చుడితే తమ పరిస్థితి ఏమిటని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన బిల్లుల చెల్లింపు జిల్లాలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు నాలుగు మాసాలుగా బిల్లులు అందటంలేదు. బిల్లులు రాకపోవటంతో ఇళ్ల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి. కొత్త సర్కార్ ఈ పథకాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారంలో లబ్ధిదారులంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఇందరిమ్మ గృహ నిర్మాణం పథకాన్ని చేపట్టగా, మూడు విడతల్లో జిల్లాకు 3,03,083 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 2,38,122 ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ చేశారు. వీటిలో 41,374 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగతా 2,38,122 ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 23,587 ఇళ్ల నిర్మాణం పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకానికి సంబంధించి ఎక్కువ శాతం ఇళ్లు ఇంకా నిర్మాణ దశల్లోనే కొనసాగుతున్నాయి. పునాదుల దశలో 7,557 ఇళ్లు ఉండగా, పునాది పనులు ప్రారంభించిన ఇళ్లు 27,889, ఇంటిగోడల నిర్మాణం పూర్తయి పనులు కొనసాగుతున్న ఇళ్లు 3952, రూఫ్ స్థాయిలో 10,284 ఇళ్లు ఉన్నాయి. రూఫ్ పనులు పూర్తయి ఇంకా చిన్నపాటి నిర్మాణం పనులు పూర్తి కావాల్సిన గృహాలు సంఖ్య 1,88,440 వరకు ఉంది. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నందున ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ గృహాలు నిర్మాణ దశలో ఉన్నందున లబ్ధిదారులతోపాటు ప్రజాప్రతినిధులు సైతం ఇందిరమ్మ గృహ నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇదిలావుండగా, సుమారు నాలుగు నెలలుగా ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలు విషయంలో స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో గృహ నిర్మాణశాఖ అధికారులు సైతం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ కారణంగానే బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ప్రారంభం కాని ఇళ్ల మాటేమిటి జిల్లాలో ప్రారంభానికి నోచుకోని ఇందిరమ్మ ఇళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. జిల్లాలో 23,587 ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. నూతన ప్రభుత్వం ఇందిరమ్మ పథకం స్థానంలో కొత్త గృహ నిర్మాణం పథకం ప్రారంభించిన పక్షంలో గతంలో మంజూరై ఇప్పటికీ ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తారని తెలుస్తోంది. రద్దు చేసిన లబ్ధిదారులకు రూ.3 లక్షల గృహ నిర్మాణం పథకంలో తిరిగి ఎంపిక చేయవచ్చని సమాచారం. -
బాబు, రాజన్నపాలనలో... పక్కా ఇళ్లు
బాబు పాలన తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దక్కినా కనీసం మూడో వంతు కుటుంబాలకు కూడా ఇళ్లను నిర్మించి ఇవ్వలేకపోయారు చంద్రబాబు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మితమైన ఇళ్లు 20 లక్షల లోపే.నియోజకవర్గానికి ఏడాదికి వేయి ఇళ్లు చొప్పున నిర్మిస్తున్నట్టు అప్పట్లో చెప్పిన ఆయన, వాటి నిర్మాణంలో ఎమ్మెల్యేల పెత్తనాన్ని పెంచారు. వారు చెప్పినవారికే ఇళ్లు కేటాయించే పద్ధతిని కొనసాగించి, వాటిలో అనర్హులు పాగా వేసేలా చేశారు.జన్మభూమి పేరుతో అట్టహాసంగా నిర్వహించిన కార్యకమాల్లో... ఇళ్లు కావాలంటూ పేదలు లక్షల సంఖ్యలో అందజేసిన విజ్ఞాపనలను బుట్టదాఖలు చేశారు. ‘వాంబే’ పేర కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనే తన ఘనతగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీశారు. రాజన్న రాజ్యం పేదలందరికీ సొంత గూడు ఉండాలన్న ఆలోచన కొత్తది కానప్పటికీ, సొంతిల్లు లేని కుటుంబం ఒక్కటి కూడా రాష్ట్రంలో ఉండరాదనే సంకల్పంతో ఆ బృహత్ ప్రణాళికను పూర్తి చేయటం ప్రారంభించింది మాత్రం వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేపట్టిన పాదయాత్రలో పేదల కష్టాలను కళ్లారా చూసి... వాటిని దూరం చేయాలన్న తపనతో వారికి ఏం చేస్తే బాగుంటుందన్న కోణంలో అప్పుడే ప్రారంభమైన ఆలోచనలో పుట్టుకొచ్చిందే... ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న తపన. 2004లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతకుముందు కొనసాగిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని మామూలుగానే కొనసాగించారు. అంతకుముందు మంజూరై నత్తనడక నడుస్తున్న కొన్ని ఇళ్లు కలుపుకొని మొత్తం నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేశారు. విప్లవాత్మక మార్పులు తెస్తేగాని పేదలందరికీ సొంత గూడు లభించదన్న ఉద్దేశంతో ‘ఇందిరమ్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం మూడేళ్ల కాలంలో వీలైనంతమంది పేదలకు ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఓ యజ్ఞంలా దాన్ని ప్రారంభించి కొనసాగించారు. 2006-07, ఇందిరమ్మ మొదటి దశ: కనీవినీ ఎరుగని రీతిలో కేవలం ఒక్క ఏడాదిలోనే 20,22,801 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.దేశం మొత్తం రాష్ట్రం వైపు చూడసాగింది. ఇంతటి భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించి, పూర్తి చేయటం సాధ్యమా అని ముఖ్యమంత్రులంతా విస్తుపోయారు. కానీ రాజశేఖరరెడ్డి దాన్ని చేసి చూపారు.2007-08, ఇందిరమ్మ రెండో దశ: అంతకుముందు సంవత్సరం రికార్డును బద్దలు కొడుతూ 20,95,110 ఇళ్లను ప్రారంభించారు.2008-09, ఇందిరమ్మ మూడో దశ: 15,44,889 ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇలా ఈ మూడేళ్ల కాలంలో సింహభాగం పేదలకు ఇళ్లు అందాయి. వైఎస్సార్ బతికున్నపుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే.. ఆయన హయాంలోనే ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షలు ఇళ్లు కట్టారు.మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఇంకా పేదల ఇంటి పరిస్థితిని కళ్లారా చూసి, వారి నోటివెంటే వారి పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. ఈలోపు ఎన్నికలు ముంచుకొచ్చాయి. పేదల వెన్నంటి ఉన్నందున రాజశేఖరరెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో ‘రచ్చబండ’ కార్యక్రమం చేపట్టారు... ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలోనే ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మనందరికీ దూరమయ్యారు. జగన్ సంకల్పం ‘‘సొంత గూడు లేక లక్షల మంది దుర్భర జీవితం గడుపుతున్నారు. వారందరికీ యోగ్యమైన సొంతింటి అవసరముంది. వారి కలను నిజం చేసి చూపిస్తా. 2019 నాటికి ‘మాకు సొంతిల్లు లేదు’ అని ఎవరూ చెయ్యెత్తి చూపే పరిస్థితి లేకుండా చేస్తా. ఏటా 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. ఇల్లు ఇచ్చినప్పుడే ఆడపడుచు పేరున పట్టా ఇస్తా. ఇంటిని రుణంలో కాదు.. ఇంటి మీదే రుణం తెచ్చుకునేలా చేస్తా. ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తా. ఉండడానికి నీడనిస్తా... ఇంటి పత్రాలను చేతికిస్తా... ఆపదలో అవసరమైతే పావలావడ్డీకి రుణం తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చి ఆదుకుంటా! దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పేదలకు సొంత గూడు కల్పించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరు స్ఫూర్తిగా దీన్ని సాధ్యం చేసి చూపుతా...’’