చోడవరం: సొంత స్థలం ఉన్న వారికి కూడా పక్కా గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విశాఖ జిల్లా చోడవరంలో నియోజకవర్గంలో 4,487 పక్కాగృహాల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించానని, అన్నిచోట్ల శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరులో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సర్పంచ్‌లు కలిసి పనిచేస్తున్నారన్నారు. గ్రామాలకు దగ్గర్లో ఉన్న స్థలాలనే ఈ కాలనీలకు కేటాయించినట్టు తెలిపారు. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇవ్వడంతోపాటు ఉచితంగా ఇసుక అందిస్తున్నామన్నారు. ఆయన వెంట ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, హౌసింగ్ బోర్డు చైర్మన్ దొరబాబు, నవరత్నాల వైస్ చైర్మన్ సత్యనారాయణమూర్తి ఉన్నారు.
సొంత స్థలం ఉన్న వారికీ పక్కా గృహాలు
Published Sun, Feb 27 2022 5:22 AM | Last Updated on Sun, Feb 27 2022 3:54 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment