cherukuvada sriranganatha raju
-
టీడీపీ గురించి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
-
చంద్రబాబుపై మాజీ మంత్రి చెరుకువాడ ఫైర్
-
చంద్రబాబు జైల్లో దీక్ష చూసింది ఎవరు?
-
ప.గో.జిల్లా లంకగ్రామాల్లో మాజీ మంత్రి రంగనాధరాజు పర్యటన
-
రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ...
-
వచ్చే ఏడాది జూన్‌కి ఇళ్లు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్ నాటికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం తొలిదశ ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇళ్లు లేని నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతలో రాజీపడకుండా ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండరాదన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కాలనీల్లో ప్రజలకు ఆరోగ్యకర జీవన పరిస్థితుల కల్పనపై ప్రభుత్వానికి ప్రత్యేకశ్రద్ధ ఉందని చెప్పారు. ప్రత్యేకాధికారులు తరచు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పనుల తీరును పర్యవేక్షించాలని, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌పాండే, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ పాల్గొన్నారు. -
సొంత స్థలం ఉన్న వారికీ పక్కా గృహాలు
చోడవరం: సొంత స్థలం ఉన్న వారికి కూడా పక్కా గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విశాఖ జిల్లా చోడవరంలో నియోజకవర్గంలో 4,487 పక్కాగృహాల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించానని, అన్నిచోట్ల శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరులో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సర్పంచ్‌లు కలిసి పనిచేస్తున్నారన్నారు. గ్రామాలకు దగ్గర్లో ఉన్న స్థలాలనే ఈ కాలనీలకు కేటాయించినట్టు తెలిపారు. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇవ్వడంతోపాటు ఉచితంగా ఇసుక అందిస్తున్నామన్నారు. ఆయన వెంట ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, హౌసింగ్ బోర్డు చైర్మన్ దొరబాబు, నవరత్నాల వైస్ చైర్మన్ సత్యనారాయణమూర్తి ఉన్నారు. -
జగనన్న కాలనీలను పరిశీలించిన మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు
-
జగనన్న కాలనీల్లో ఇం‘ధన’ ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఏటా రూ.539.7 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయొచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. స్టార్ రేటెడ్ ఉపకరణాలు అమర్చడం ద్వారా భారీగా విద్యుత్ ఆదా చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా మరింత మెరుగుపరచవచ్చన్నారు. ఇంధన శాఖను సమన్వయం చేసుకుంటూ ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులతో మంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, విద్యుదీకరణ, తాగు నీరు, పాఠశాలలు, ఆస్పత్రులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తోందని మంత్రి చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వీటిలో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం తొలి దశ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఆమోదంతో ఫైవ్ స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు అందించాలనుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వీటి వల్ల ప్రతి ఇంటికి ఏటా రూ.3,598 విలువైన విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలు అమర్చడం వల్ల ఏడాదికి 1,674 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. కేంద్ర సంస్థలైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోందని అజయ్ జైన్ తెలిపారు. -
ఆ రెండు పథకాలకు అధిక ప్రాధాన్యతివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాల అమలుకు అధిక ప్రాధాన్యతివ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అధికారులను ఆదేశించారు. 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లు (గృహ నిర్మాణం), గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో మంగళవారం విజయవాడలోని గృహనిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తొలి దశలో నిర్మిస్తోన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన పనులను తక్షణం మొదలు పెట్టాలని ఆదేశించారు. ఆప్షన్–? ఎంచుకున్న లబ్ధిదారుల గృహాల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కాలనీలలో అంతర్గత రహదారుల నిర్మాణం, ఇళ్లు నిర్మించుకోవడానికి నీటి వసతి కల్పించాలని సూచించారు. 25 మంది లబ్ధిదారుల చొప్పున గ్రూపులు ఏర్పాటు చేసి, ఇళ్ల నిర్మాణాలకు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నారు. లేఅవుట్లకు 20 కిలో మీటర్ల లోపు ఇసుక రీచ్‌లు ఉండే విధంగా చూడాలని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఉచితంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని, ఈ నెల 21 నుంచి సీఎం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దొరబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘కులాలను వాడుకుని బాబు రాజకీయం చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కులాలను వాడుకుని రాజకీయం చేస్తున్నారని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. క్షత్రియుల పేరుతో చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్‌పై యాడ్ ఇప్పించారని మండిపడ్డారు. ఏ వ్యక్తి పేరు లేకుండా క్షత్రియులు అని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. క్షత్రియులు అన్ని పార్టీల్లో ఉన్నారని, ఈ రోజు తమ కమ్యూనిటీని వాడుకుని బాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రెడ్డి కమ్యూనిటీని రఘురామకృష్ణంరాజుతో చంద్రబాబుతిట్టిస్తున్నాడని మంత్రి మండిపడ్డారు. ట్రస్టుల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిచేస్తుందని, ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. మాలో మాకు విద్వేషాలు నింపొద్దని చంద్రబాబుకి సూచించారు. అసలు ఊరు పేరు లేకుండా ప్రకటన ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమ కమ్యూనిటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. చదవండి: టీడీపీ కార్పొరేటర్ భూ దందాలకు అదుపే లేదు ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్ -
కఠిన చర్యలు తీసుకోవాలి
పెనుగొండ: నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం ఎంపీ అరెస్ట్‌పై పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో మంత్రి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన కేసులోనే కాకుండా, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో నమోదైన కేసుల్లోనూ పోలీసులు విచారణ చేయాలన్నారు. స్థానికంగా ఎంపీపై పలు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. గెలిపించిన పార్లమెంటు ప్రజలను 13 నెలలుగా వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూంటే, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎంపీ వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసేలా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► వ్యక్తిగతంగా మా మీద ఎన్ని నిందలు మోపినా, ఎంత దిగజారి అసత్యాలు ప్రచారం చేసినా మేం సహించాం, భరించాం. ► ఈ రోజు రఘురామకృష్ణరాజు అరెస్టుకు.. మా పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది సీఐడీ పోలీసులు ప్రాథమిక విచారణ చేసి నమోదు చేసిన ఒక కేసులో జరిగిన అరెస్ట్. ► సీఐడీ ఏం చెప్పిందో వారి స్టేట్మెంట్లోనే ఉంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేలా ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న ప్రసంగాలు.. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ద్వేషాన్ని పెంచేందుకు ఆయన ప్రయత్నించారని తమకు వచ్చిన సమాచారం మీద విచారణ జరిపి కేసు నమోదు చేశామని, ఆ కేసు ప్రకారమే ఆయన్ను అరెస్టు చేశామని సీఐడీ స్పష్టం చేసింది. ► రాజద్రోహానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయగానే చంద్రబాబునాయుడు, టీవీ5, ఏబీఎన్ ఎంత ప్రేమ ఒలకబోశారో అందరూ చూశారు. -
'కోర్టు కేసులతో 6 నెలల నుంచి ఆపుతున్నారు'
సాక్షి, పశ్చిమగోదావరి: ద్వారకా తిరుమల వెంకన్నను శనివారం రోజున రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేసారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గుళ్లపై కూడా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ వారితో కోర్టులో కేసులు వేసి 6 నెలల నుంచి ఆపుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచిన పాపాన పోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 15 లక్షలు ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. కోర్టు నుంచి అనుమతి రాగానే మరో 15 లక్షల ఇళ్లు పంపిణీ చేస్తాం. సొంతంగా ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది' అని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. -
వాటిపై కూడా స్టేలు తేవడం దురదృష్టకరం
సాక్షి, తాడేపల్లి : హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టివ్వాలని నిర్ణయించారని, పేదలకు ఇచ్చే ఇళ్లపై సైతం కొందరు కోర్టులకు వెళ్లి స్టేలు తేవడం దురదృష్టకరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. బుధవారం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారాయన. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎండీ అజయ్ జైన్, అన్ని జిల్లాల పీడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ డెల్టా, మెట్ట ఏరియాలలో బిల్డింగ్ నిర్మాణ ఖర్చు ఎంత అవుతుందో చర్చించాము. ఖర్చు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాము. ఈ సంవత్సరం 15 లక్షల ఇళ్లు నిర్మిస్తాము. తామే కట్టుకుంటామనే లబ్దిదారులకు 1 లక్ష 80 వేల రూపాయలు నిర్మాణ ఖర్చులకు ఇస్తాము. ప్రభుత్వమే కట్టివ్వాలనుకునే వారికి అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తాము. రోడ్డు, వాటర్, పవర్ వంటి వసతులతో ఇళ్లు నిర్మిస్తాము. (సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి ) అప్ల్యాండ్ ఏరియాలో 1 లక్ష 80 వేల రూపాయల ఇంటి నిర్మాణ ఖర్చు అవుతుందని అంచనా వేశాము. ఇసుక ఉచితంగా ఇస్తాము. కృష్ణ, గోదావరి, పెన్న ఏరియాల్లో ఫిల్లింగ్‌కు ఎక్కువ ఖర్చు అవుతుంది. అర్బన్, రూరల్ ఏరియాలో 15 లక్షల ఇల్లు కట్టి పేదలకు ఇస్తాము. కట్టుకునే వారికి సైతం తక్కువ రేటుకే మెటీరియల్స్ అందేలా చర్యలు తీసుకుంటాము. సీఎం జగన్ పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నారు. మొదటిగా ప్రతి జిల్లాలో రెండు, మూడు ప్రాంతాల్లో మోడల్ కాలనీలు నిర్మిస్తాము. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు లోన్స్ ఇచ్చి కాంక్రీటు మిక్చర్ల వంటివి కొనుక్కునేలా ఉపాధి కల్పిస్తామ’’న్నారు. -
సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి
సాక్షి, పెనుగొండ: సినిమాలు సందేశాత్మకంగా ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీవాసవీ మూవీస్ బ్యానర్లో కె.హరనాథ్‌రెడ్డి దర్శకత్వంలో సీహెచ్ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ‘మాతృదేవోభవ’ ఓ అమ్మ కథ చిత్రం షూటింగ్‌ను మంత్రి శ్రీరంగనాథరాజు బుధవారం వాసవీ శాంతిధాంలో పూజా కార్యక్రమాల అనంతరం క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. సితార, సుమన్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సూర్య, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ, జెమిని సురేష్, రవిప్రకాష్, చమ్మక్ చంద్ర, జబర్దస్త్ అప్పారావు, సత్యశ్రీ, సోనియా చౌదరి ప్రధాన తారాగణం. పతంజలి శ్రీనివాస్ సమర్పిస్తుండగా కథను సితారే కేజేఎస్ రామారెడ్డి, మాటలు మరుధూరి రాజా, పాటలు అనంత శ్రీరామ్, డీఓపీ రామ్‌కుమార్, సంగీతం జయసూర్య సమకూరుస్తున్నారు. పైట్స్ డ్రాగన్ ప్రకాశ్ చేస్తున్నారు. ఈ సదర్భంగా దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ, ఆవు ప్రాముఖ్యాన్ని చాటిచెబుతూ కథాంశం ఉంటుందన్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూలు తణుకు పరిసరాల్లో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్, వైజాగ్, కర్ణాటకల్లో మిగిలిన షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. -
వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు..
సాక్షి, పశ్చిమగోదావరి: క్వారంటైన్‌కి వచ్చే పేషెంట్స్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశించారు. ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలని మంత్రి బుధవారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, నెగ్గిపూడి ఆచార్య ఎన్జీ రంగా రైతుభవనంలో సుమారు 400 మందికి సరిపడే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రోజురోజుకి కేసులు అధికమవుతుండటంతో నియోజకవర్గంలో ఉన్న కళాశాలలు, స్కూల్స్‌ను ప్రజలకు దగ్గరగా క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తున్నాం. నియోజవర్గ ప్రజలలో కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని, పాజిటివ్ వచ్చిన వారిని పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, క్వారంటైన్ కేంద్రాలకి తరలిస్తున్నారని అక్కడ బాధితులు పెరిగిపోవడంతో నియోజక వర్గ ప్రజలకు దగ్గరగా ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం నుంచి నియోజకవర్గంలో క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. (వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్: పేర్నినాని) -
మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి సీతానగరం వద్ద హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని జిల్లాలో కూడా మోడల్ హౌస్‌లు నిర్మించి.. ఇదే తరహాలో పేదలు ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన ముడిసరుకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని గృహాలకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని.. సిమెంట్ వంటి సరుకులకు తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఇల్లు 2.5 లక్షలు ఖర్చు కావాల్సి ఉంటే సబ్సిడీలతో 1.80 లక్షలకు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు. (అక్కాచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వాలనే: సీఎం జగన్) అదే విధంగా అర్బన్‌లో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణమే జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ మోడల్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పరిశీలిస్తారని వెల్లడించారు. ‘‘పేదలకు తొలుత 25 లక్షల ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. అయితే రాష్ట్రంలో సర్వే నిర్వహించిన తర్వాత 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఒక బెడ్ రూమ్, హాలు, బాత్ రూమ్, కిచెన్, వరండా ఉండే విధంగా పేదలకు ఇళ్లు నిర్మించనున్నాం’’అని శ్రీరంగనాథరాజు తెలిపారు. -
ఏనాడైనా రాయలసీమ,ఉత్తరాంధ్రను పట్టించుకున్నారా?
-
ఎవరి కోసం సౌభాగ్య దీక్ష చేశారు?
పెనుగొండ: నాలుగు నెలల పాటు ధాన్యం బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు నిధులు మళ్లిస్తే ఆనాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా, రైతు సౌభాగ్యం కోసమే నిరంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తూ రైతుల మన్ననలు పొందుతుంటే పవన్ సౌభాగ్య దీక్ష ఎవరి కోసం చేశారని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా తూర్పుపాలెంలో మంత్రి శనివారం సాక్షితో మాట్లాడారు. రైతులకు నేటి ప్రభుత్వం ఎక్కడా బకాయిలు పడలేదన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.9 వేల కోట్లు దారి మళ్లించి రైతుల పంటకు చెల్లింపులు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వివరించారు. దీనిపై రైతుల పక్షాన ప్రశ్నించడానికి పవన్ ఎక్కడా కనపడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల బాధలు విన్నవిస్తే ఆనాటి ధాన్యం బకాయిలు చెల్లించినట్లు తెలిపారు. -
‘ఇళ్ల స్థలాలపై పేదలకు యాజమాన్య హక్కు’
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను కూడా మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాల్లో అపార్టుమెంట్లు కాకుండా ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఒక సెంటు భూమిని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రూరల్‌లో ఒకటిన్నర సెంటు, అర్బన్‌లో సెంటు భూమి ఇస్తాం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 24 లక్షల ఇళ్లు ఇచ్చారు. మళ్లీ ఆయన కుమారుడు సీఎం జగన్ ఇప్పుడు 25 లక్షల ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. సీఎం నవరత్నాలలో భాగంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. వాలంటీర్లు ద్వారా లబ్ధిదారులను గుర్తించాం. మొత్తంగా సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరిస్తాం. కానీ అందుకోసం దేవాలయాల భూములు సేకరిస్తామని తాము చెప్పలేద’ని మంత్రి స్పష్టం చేశారు. -
ప్రక్షాళన చేయండి: డిప్యూటీ సీఎం
భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఆర్ఎస్ఆర్ తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. సాక్షి, అనంతపురం : ‘ప్రభుత్వ భూమి ప్రతి ఎకరమూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. లేదా ప్రజావసరాలకు వినియోగించబడాలి, పేదల వద్దనైనా ఉండాలి. అంతే తప్ప పెద్దలు, సంపన్నల వద్ద ప్రభుత్వ భూమి ఉందంటే దానిని వెంటనే స్వాధీనం చేసుకోండి. బలవంతుడైన ముఖ్యమంత్రి మీ వెనుక ఉన్నాడు. ఎవరికీ తలవంచకండి’ అంటూ అధికారులకు డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాలతో కూడిన పిలుపునిచ్చారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డులు స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా మంత్రి శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో వారు సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ భూమి బలవంతులు, సంపన్నులు చేతిలో ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 1983 వరకు అమలులో ఉన్న జమాబందీ విధానం వల్ల భూ రికార్డులు సక్రమంగా ఉండేవని గుర్తు చేశారు. ఆ విధానం రద్దు అయిన తర్వాతే వ్యవస్థ గాడితప్పిందన్నారు. భూ యజమానుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు పాత విధానాన్ని కొనసాగించే సాహసోపేత నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు పోతోందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది. గృహ నిర్మాణానికి ఉపయోగపడేది ఎంత. ఇంకా ఎంత అవసరం ఉంది, ఇందుకు నిధులు ఎంత అవసరం అనేదానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మూడు గ్రామాలను యూనిట్‌గా తీసుకోండి మూడు గ్రామాలను యూనిట్‌గా తీసుకుని భూ రికార్డుల స్వచ్ఛీకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఒక వీఆర్వో, సర్వేయర్‌తో కలిపి రికార్డులను పరిశీలించి తప్పులు సరిచేయాలన్నారు. జిల్లాలో ఆర్ఎస్ఆర్తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ భూ పరిపాలనలో నిమగ్నం కావాలని సూచించారు. ఆర్డీఓల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఉగాది నాటికి సంతృప్తి స్థాయిలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం అందిన 1.89 లక్షల దరఖాస్తులను విచారణ చేసి అర్హులను గుర్తించాలన్నారు. ఒక కుటుంబం తెల్లకార్డులో తండ్రితో పాటు అతని పిల్లలు ఉంటారన్నారు. వారిలో ఒక కుమారునికి వివాహం జరిగి సంతానం కూడా ఉంటారని, అయితే వారికి వేరే కార్డు ఉండదన్నారు. ఈ క్రమంలో ఉదారంగా వ్యవహరించి వివాహం జరిగిన కుమారునికి కూడా ఇంటి పట్టా మంజూరు చేయాలన్నారు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేల సహకారంతో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. గతంలో జిల్లాలో 57 వేల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.91 కోట్లు బిల్లులు చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. వీటిపై విచారణ చేసి నివేదిక ఇస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర పాలక కమిషనర్ ప్రశాంతి, పెనుకొండ సబ్‌కలెక్టర్ టి.నిశాంతి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న హౌసింగ్ మినిస్టర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిఇవ్వాలనేది నవరత్నాల్లో ప్రధామైన అంశమన్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాగం అంకితభావంతో పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హాయంలో కొండలు, గుట్టలు, వంక పోరంబోకు స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, సమగ్ర విచారణ చేసి వాటికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలన్నారు. రెవెన్యూ రికార్డులు సరిచేసి భూ వివాదాలు లేకుండా చూడాలన్నారు. నిబంధనలు సడలించండి కరవును దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పట్టాల మంజూరులో నిబంధనలు సడలించాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కోరారు. 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట అర్హతగా తీసుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సూచించారు. శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలి చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని, అధికారులు గుర్తించి తక్షణమే స్థలాలు కేటాయించాలని ఎంపీ గోరంట్ల మాధవ్ సూచించారు. కియా పరిశ్రమకు, ఎన్పీకుంట సోలార్ హబ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో కొందరికి పరిహారం అందలేదని వారందరికీ పరిహారం ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాల్లోని వారికి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసిల్దారు కార్యాలయం అవసరం నగర పరిధిలో 3 లక్షల జనాభా, రూరల్ పరిధిలో 2 లక్షల జనాభా ఉన్నా.. ఒకటే తహసీల్దారు కార్యాలయం ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అదనంగా మరో తహసీల్దారు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంతకల్లును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, చుక్కల భూముల సమస్యలకు ముగింపు పలకాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నగర పరిధిలో 2014 వరకు 14 వేల ఇళ్లకు బిల్లులు బకాయిలో ఉన్నాయని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చుక్కల భూముల సమస్యలు అలాగే ఉన్నాయి చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో ఇళ్లను పొందిన వారు కూడా ప్రస్తుతం ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేస్తున్నారని, ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్ల పట్టాలు అనర్హుల చేతిలోకి వెళ్లకూడదని సూచించారు. మైనారిటీలకు కాలనీలు ఏర్పాటు చేయాలి అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో పేద మైనారిటీలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సూచించారు. 2014 నుంచి 2019 వరకు భూ అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఐదారు వేల ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగులు, సంపన్నులకు కట్టబెట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి త్వరితగతిన భూ రికార్డులను సరిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలో వ్యవస్థ కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలో రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఇష్టానుసారంగా ఆన్లైన్లో భూముల వివరాలను వారు మార్చేస్తున్నారన్నారు. తప్పుడు పనులు చేస్తున్న ఆపరేటర్లను తొలగించాలన్నారు. లక్ష లోపు జనాభా ఉండే పట్టణాల్లో అపార్ట్మెంట్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లను కేటాయించాలని సూచించారు. సాహసోపేత నిర్ణయం రెవెన్యూ భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనేది సాహసోపేత నిర్ణయమని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూముల సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా స్వచ్ఛీకరణ సక్రమంగా చేయాలని అధికారులకు సూచించారు. క్రాస్ చెకింగ్ సిస్టం ఉండాలన్నారు. పాస్‌పోర్ట్ తరహా పట్టా పాసు పుస్తకం విధానం తీసుకొస్తే భూముల వివరాలు మార్పు సాధ్యం కాదని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం సేకరిస్తున్న భూమి ఆయా గ్రామల ప్రజలకు నివాసయోగ్యమా కాదా అనేది నిర్ధారించుకోవాలని, లేదంటే పథకం నిరుపయోగమవుతుందని హెచ్చరించారు. వేల ఎకరాలకు పట్టాలిచ్చారు తహసీల్దార్లు బదిలీపై వెళుతూ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చేశారని మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వా మి తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్నారు. ‘ఎస్‌ఈజె డ్ కోసం 1,600 ఎకరాల భూమిని రైతుల నుంచి 2014లో సేకరించారు. 1బిని రద్దు చేశారు. అయితే 600 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చి, మిగిలిన భూమి ఇవ్వలేదు. దానికీ పరిహారం ఇవ్వాలి’ అని కోరారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశా లకు, అమరాపురంలో ఐటీఐ ఏర్పాటుకు, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి భూములు కేటాయించాలన్నారు. -
అధినేతను కలిసిన వైసీపీ నేతలు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : నరసాపురంలో జరిగే ఎన్నికల జనభేరి సభలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం నుంచి మార్గమధ్యంలో పార్టీ సీఈసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇంటి వద్ద కొద్దిసేపు ఆగారు. రంగరాజుతో, పార్టీ నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తెల్లం బాల రాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్‌తో పాటు మిగిలిన నాయకులు జగన్మోహన్రెడ్డి వెంట ఉన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, పార్టీ నాయకులు మారం వెంకటేశ్వరరావు తదితరులు జగన్‌ను కలిశారు. రోడ్‌షోను విజయవంతం చేయాలి చాగల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 16న కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న రోడ్ షోను విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత కార్యకర్తలు, అభిమానులను కోరారు. 16వ తేదీ ఉదయం 9 గంటలకు బ్రాహ్మణగూడెంలో రోడ్‌షో మొదలవుతుందని, బ్రాహ్మణగూడెం, ఎస్.ముప్పవరం, ఊనగట్ల, చాగల్లు, మీనానగరం, ఐ.పంగిడి మీదుగా కొవ్వూరు చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.