సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను కూడా మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాల్లో అపార్టుమెంట్లు కాకుండా ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఒక సెంటు భూమిని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. రూరల్‌లో ఒకటిన్నర సెంటు, అర్బన్‌లో సెంటు భూమి ఇస్తాం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 24 లక్షల ఇళ్లు ఇచ్చారు. మళ్లీ ఆయన కుమారుడు సీఎం జగన్ ఇప్పుడు 25 లక్షల ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. సీఎం నవరత్నాలలో భాగంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. వాలంటీర్లు ద్వారా లబ్ధిదారులను గుర్తించాం. మొత్తంగా సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరిస్తాం. కానీ అందుకోసం దేవాలయాల భూములు సేకరిస్తామని తాము చెప్పలేద’ని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment