Housing Scheme
-
పేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారు: టీజేఆర్ సుధాకర్‌బాబు
సాక్షి,తాడేపల్లి: ఇళ్ల పట్టాల రూపంలో చంద్రబాబు పేదలపై పిడుగులు వేశారని,బాబు హయాంలో గతంలో ఏనాడూ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. శనివారం(జనవరి18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.‘వైఎస్ జగన్ తన హయాంలో 30.6లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు.71 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు.25,374 ఎకరాలను పేద ప్రజల కోసం వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. టిడ్కో ఇళ్లను కట్టించి ఇచ్చారు.అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు లక్షల మందికి భూమిని పంచి పెట్టారు.ఆయన కుమారుడు మళ్ళీ 33 లక్షలమందికి పట్టాలిచ్చారు.చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారు.కానీ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవటం దారుణం. వైఎస్ జగన్ రాజకీయాలు చూడకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాలను లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? ఒక్కొక్కరికి మూడు నుంచి పది లక్షల విలువైన భూమిని వైఎస్ జగన్ అందించారు.పేదలకు సంపద సృష్టించి,ఆత్మగౌరవం నిలపెట్టేలా వైఎస్ జగన్ వ్యవహరించారు.80 శాతం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు వారి నుంచి భూములను లాక్కుని రోడ్డున పడేస్తారా? 17 వేల ఊర్లను వైఎస్ జగన్ నిర్మించారు.ఇలా చేయాలనుకుంటే చంద్రబాబు కూడా భూమిని కొని పేదలకు అందించాలి. వైఎస్ జగన్ నిర్మించిన కాలనీలు,గ్రామ సచివాలయాలు,బాగుపడిన స్కూళ్లలోకి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లడం లేదు? అక్కడకు వెళ్తే వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని భయమా? సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ఎందుకు గౌరవించటం లేదు? సచివాలయాల నిర్మాణాలు తప్పయితే అదే విషయాన్ని ప్రకటించాలి.రాజధానిలో చంద్రబాబు పెద్ద ఎత్తున భూ స్కామ్ చేశారు. దీనిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. 9 లక్షల ఎకరాలను జగన్ 22A నుంచి తప్పించి రైతులకు హక్కులు కల్పించారు.25 లక్షలమంది రైతులకు మేలు చేశారు. రాజధానిలో 50 వేల మంది పేదలకు వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలిచ్చారు.చంద్రబాబు వారందరికీ అన్యాయం చేస్తూ స్థలాలను లాగేసుకున్నారు. రాజధానిలో ఎస్సీ,ఎస్టీలు ఉండకూడదా? పేదల స్థలాలను లాగేసుకుంటే న్యాయపోరాటం చేస్తాం’అని సుధాకర్‌బాబు హెచ్చరించారు. ఇదీ చదవండి: బాబు పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది: భూమన -
పాత విధానంలోనే పేదింటి సాయం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు మాటలు కోటలు దాటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆయన చేతలు చతికిలబడ్డాయి. అధికారం చేజిక్కించుకునేందుకు అనేక మాయమాటలు చెప్పి పేదలను నమ్మించిన ఆయన ఇప్పుడు గద్దెనెక్కాక వంచిస్తున్నారు. ఇందులో భాగంగా.. సొంత గూడులేని పేదలను బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. గత ప్రభుత్వంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోదని, నిర్మాణ వ్యయం ఇంకా పెంచాలని అప్పట్లో ఆయన గుండెలు బాదుకున్నారు.తాము అధికారంలోకి వస్తే నిర్మాణ సాయం పెంచుతామని పేదలందరినీ ఊరించారు. మరోవైపు.. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన తొలి సమీక్షలోనూ పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. మంత్రులు సైతం ఈ అంశాన్ని ఊదరగొట్టారు. ఎల్లోమీడియా సైతం బాబు ప్రభుత్వం నిర్మాణ సాయం పెంచేస్తోందని బాకాలు ఊదాయి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు అదే రూ.1.80 లక్షల సాయాన్నే పేదల ఇంటి నిర్మాణానికి అందించేలా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, గత ప్రభుత్వంలో అమలుచేసిన మూడు ఆప్షన్ల విధానాన్నీ యథావిధిగా కొనసాగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ వెలువరించిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ గత ప్రభుత్వంలోని యూనిట్ ధరతోనే పథకాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇసుక ఉచితం అంటూనే ఖరీదు కట్టారు.. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 18.01 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచి్చనట్లు వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 6.40 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం రూ.1.50 లక్షల సాయం అందిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు కలిపి మొత్తం రూ.1.80 లక్షలు గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇదే తరహాలో ప్రస్తుతం కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇక గత ప్రభుత్వం నుంచే 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇంటి నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు. కానీ, ఇసుకను ఉచితం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, పేదల ఇంటికి అందించే 20 మెట్రిక్ టన్నుల ఇసుకకు రూ.15 వేలు ఖరీదు కట్టింది. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసి, వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. కానీ, ఇప్పుడేమో ఇసుక ఉచితం అని చెబుతూనే రూ.15 వేలు వెలకట్టి, ఆ మేర మేలు చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని చూస్తోందని లబి్ధదారులు ఆరోపిస్తున్నారు. రూ.4 లక్షల ఊసేలేదు.. పేదల ఇంటి నిర్మాణాలపై ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో ఎక్కడా రూ.4 లక్షలకు సాయం పెంపు ఊసేలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ.1.80 లక్షల సాయాన్నే యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించడంపై పేదలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాయం పెంచుతున్నట్లు సీఎం ప్రకటించడంతో సొంతింటి నిర్మాణానికి అదనపు చేయూత లభిస్తుందని లబి్ధదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం సాయం పెంచుతుందని చాలామంది నిర్మాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. కానీ, రూ.1.80 లక్షలకు మించి ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడంతో పేదల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. -
31 లక్షల మందికి ఇళ్ల పంపిణీ.. ఇళ్లు కాదు.. ఊరులు నిర్మించిన సీఎం జగన్
-
జగనన్న గృహ నిర్మాణ పథకంతో సొంతింటికల సాకారం
-
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’
-
త్వరలోనే కొత్త హౌసింగ్ స్కీమ్.. ధ్రువీకరించిన కేంద్ర మంత్రి
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తాజాగా ధ్రువీకరించారు. “మేము కొత్త హోమ్ సబ్వెన్షన్ స్కీమ్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించే ఇది ఒక పెద్ద పథకం. త్వరలోనే ఈ పథకం తుది వివరాలు వెల్లడిస్తాం ” అని హర్దీప్ సింగ్ పూరి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తొలుత ఈ పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్‌ను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీలలో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. ‘సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న పేదలకు వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల ఉపశమనంతో సహాయం చేస్తాం. అది వారికి లక్షల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది’ అని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. -
ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు శుభవార్త ఇది. పట్టణాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు తక్కువ (సబ్సిడీ) వడ్డీ రేట్లలో గృహ రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గానికి చెందిన 20.5 లక్షల మంది రుణ దరఖాస్తుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. రాయిటర్స్ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రాబోయే నెలల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. వడ్డీ రాయితీని ముందుగానే లబ్ధిదారుల హౌసింగ్ లోన్ ఖాతాలో జమ చేస్తారు. 2028 వరకు ప్రతిపాదించిన పథకం దాదాపు ఖరారైందని, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలను రాయిటర్స్ ఉటంకిస్తూ పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. "రాబోయే సంవత్సరాల్లో కొత్త పథకాన్ని తీసుకువస్తాం. ఇది ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో, మురికివాడల్లో, అనధికార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని మోదీ చెప్పారు. -
హౌసింగ్ స్కీం: 5500 ఫ్లాట్లు, రూ.9.89 లక్షలకే ఫ్లాట్
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) గృహకొనుగోలుదారులకు భలే మంచి శుభవార్త అందించింది. వివిధ ప్రదేశాలలో 5,500 ఫ్లాట్లతో కూడిన కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రూ. 9.89 లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్‌ను అందించ నుంది. శుక్రవారం (జూన్ 30) ప్రారంభించిన ఈ పథకంలో ముందుగా వచ్చిన వారికి, ముందుగా కేటాయింపు ప్రాతిపదికన వీటిని విక్రయించ నుంది. ఫ్లాట్లలో 1-BHK, 2-BHK ,3-BHK ఇళ్లు ఉన్నాయి. అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జూన్ 14న ఆన్లైన్లో ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 4ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ఈ పథకం టోకెన్ చెల్లించి తమ కిష్టమైన ప్రాంతంలో ఫ్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) డీడీఏ హౌసింగ్ స్కీమ్‌లోని ఫ్లాట్ల వివరాలు 1-BHK ఫ్లాట్లు నరేలా, సిరాస్‌పూర్, రోహిణి, లోక్‌నాయక్ పురంలో ఉన్నాయి 2-BHK ఫ్లాట్లు నరేలా ,ద్వారకలో ఉన్నాయి 3-BHK ఫ్లాట్లు జసోలాలో ఉన్నాయి (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ఫ్లాట్లు: ధరలు సుమారుగా 1-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 9.89 లక్షల -రూ. 26.98 లక్షలు, లోక్‌నాయక్ పురంలో రూ. 28.47 లక్షలకు 2-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 1 కోటి నుండి రూ. 1.23 కోట్లకు-ద్వారకలో రూ. 1.33 కోట్లు 3-BHK ఫ్లాట్లు: రూ. 2.08 కోట్ల నుండి రూ. 2.18 కోట్లు బుకింక్ అమౌంట్ 1-BHK ఫ్లాట్లు: రూ. 50,000 (ఆర్థికంగా వెనుకబడినవారికి ), రూ. 1 లక్ష (జనరల్) 2-BHK ఫ్లాట్: రూ. 4 లక్షలు 3-BHK ఫ్లాట్: రూ. 10 లక్షలుచెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిఉంటుంది. జూన్ 30 సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్. జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి (మరిన్ని అప్డేట్స్కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
‘గృహలక్ష్మి’పై కదలిక: ఎంపిక ఎమ్మెల్యేలకే?
సాక్షి, హైదరాబాద్: సొంతంగా స్థలాలున్న పేదలు వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేసే ‘గృహలక్ష్మి’ పథకానికి జూలైలో శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయి తే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, జాబితాల రూపకల్పన బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్లో కేటాయింపులు చేసినా.. ‘పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనే ఈ పథకానికి రూ.12 వేల కోట్లను కేటాయించింది. కానీ పథకానికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేయకపోవటంతో అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం తిరిగి రూ.12 వేల కోట్లను కేటాయించింది. అయితే ఇప్పటివరకు మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలను ఆర్థిక సాయంగా అందిస్తుంది. లబ్ధిదారులు అవసరమైన అదనపు మొత్తాన్ని కలిపి సొంత జాగాలో కావాల్సిన విధంగా ఇంటిని నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. జూలై నెలలో పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. దీనికి తగ్గట్టుగానే ఇటీవల ఉన్నతాధికారులు భేటీ అయి ఈ పథకం తీరు తెన్నులపై చర్చించారు. వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. త్వరలో సీఎం నుంచి అనుమతి వస్తుందని, ఆ వెంటనే మార్గదర్శకాలు, ఇతర అంశాలపై కసరత్తు ముమ్మరం చేస్తామని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ పథకం కీలకంగా మారుతుందని.. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే విషయంలో స్థానిక శాసనసభ్యులకే బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కనీసం స్థలంపై అస్పష్టత సొంత స్థలమున్న పేద లబ్ధిదారులకే గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తారు. అయితే ఈ స్థలం ఎంత ఉండాలన్న విషయంలో మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎంత, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంత స్థలం ఉంటే మంచిదన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇక కులాల వారీగా ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్ అమలు చేయాలన్న విజ్ఞప్తులూ ఉన్నాయి. వీటన్నింటిపై మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపికపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. ‘గృహలక్ష్మి’కి అర్హతల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. కనీస స్థలం పరిమితులు లేకుండా ఉంటే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రభుత్వం ఇటీవల ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిందని వివరించాయి. మొత్తంగా ఆగస్టు నాటికి అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడత ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్న దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించాయి. -
పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడుపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని, 2022-23 సంవత్సరంలో 10,200 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయనున్నాం.. ఎక్కడా కూడా బకాయిలు లేవు.. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సీఎం పేర్కొన్నారు. ‘‘పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి. కొన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. వేయికిపైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలి. ఇప్పటికే 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకుపైగా రుణాలు మంజూరు అయ్యాయి. కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పరిగణించాలి’’ అని సీఎం ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►హౌసింగ్ కార్యక్రమంలో నిమగ్నమైన అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలి ►దీనివల్ల అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి, నిర్మాణాల్లో నాణ్యత కూడా ఉంటుంది ►ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు ఏసీ సీఆర్డీయే ప్రాంతంలో మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలి ►దేశంలో ఎక్కడా కూడా సమగ్ర సర్వే జరగలేదు ►100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో చేస్తున్నాం ►దేశానికి అంతటికీ ఆదర్శప్రాయమైన కార్యక్రమం ►జాతీయ స్థాయిలో ఈకార్యక్రమం ద్వారా మనకు సముచిత స్థానం లభిస్తుంది ►భూ హక్కు పత్రాల పంపిణీ, సరిహద్దు రాళ్లు పాతడం, గ్రామాల్లో భూముల రికార్డుల్లో తుది వివరాలు నమోదు, గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రార్ సేవలు లభ్యం కావడం… ఇదీ… ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ ►మొదటి విడతలో 2వేల గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోంది ►దీన్ని త్వరగా పూర్తిచేయాలి ►కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టి రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీతోపాటు తర్వాత దశల్లో సర్వే చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలి ►పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలి ►మే 25 నుంచి రెండో దశ గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుంది పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం ►నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయి ►తల్లిదండ్రులు కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లుఉన్నాయి ►పనులను వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ►తదుపరి ఖర్చులకోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ►నాడు – నేడుకు నిధుల కొరత లేదు ►ఐఎఫ్‌పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15వేల కు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టు అవుతుంది ►ఈ పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుంది ►జూన్ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి ►మూడు విడతల్లో దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు -నేడు పనులు పూర్తవుతాయి ►వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాల ఉంటాయి ►ఈ సమయాన్ని పనులకోసం బాగా వినియోగించుకోవాలి ►కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి ►మొదటి విడతలో నాడు- నేడు కింద పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలి ►ఎక్కడైనా లోపాలు ఉంటే.. వెంటనే వాటిని సరిదిద్దాలి ►ఇంత పెద్ద మొత్తంలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం ►పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ►గ్రామ, వార్డు సచివాలయాలను సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి ►ఇసుక, సిమ్మెంటు, స్టీలు లాంటివి కొరతలేకుండా వాటి పంపిణీపై దృష్టిపెట్టాలి ►8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5.18 లక్షల ట్యాబులు ఇచ్చాం ►వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చూడాలి ►అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి ►సమస్యలుంటే..ఏం చేయాలన్నదానిపై దానిపై ఎస్ఓపీ రూపొందించాం ►ఏమైనా సమస్యలు ఉంటే… హెడ్మాస్టర్కు గాని, స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయల్లోగాని ఇస్తే.. 3 రోజుల్లోగా రిపేరు చేసి తిరిగి ఇస్తారు ►ఈ ఎస్ఓపీ అమలు జరుగుతుందా? లేదా? అన్నది కలెక్టర్లు చూడాలి ►గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు.. స్కూలుకు వెళ్లి.. అక్కడున్న ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు ►నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్ డే పాటిస్తూ.. వారు స్కూళ్లకు వెళ్తారు ►ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై వీరు శిక్షణ ఇస్తారు ►స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ►ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదు ►దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది ►పంపిణీపై మంచి ప్రోటోకాల్‌ను పాటించాలి ►అలాగే జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువుల క్వాలిటీపైన కూడా బెస్ట్ ప్రోటోకాల్ పాటించాలి ►జగనన్న విద్యాకానుకపై ఏ స్కూలు నుంచైనా, ఏ విద్యార్థినుంచైనా నాకు ఫిర్యాదులు రాకూడదు ►స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలని ►గతంలో ఎప్పుడూ పుస్తకాలు టైముకు ఇచ్చేవారు కాదు: ►అక్టోబరు, నవంబరు వచ్చినా.. అవి పిల్లలకు అందేవి కావు: ►మనం వచ్చాక పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం: ►మొత్తం వ్యవస్థలోనే మార్పులు తీసుకు వచ్చాం: ►స్కూళ్లలో పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి: ►అలాగే పాఠశాల్లో నైట్ వాచ్‌మెన్లును నియమించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి: ►మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి ►ప్రతి కాలేజీలోకూడా ఎస్ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్ప్లే చేయాలి ►వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలి ►జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయాలి ►మాదక ద్రవ్యాల నివారణే వీటి ఉద్దేశం కావాలి ►కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి చదవండి: బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్ ►వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలి ►పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలి ►మాదకద్రవ్యాలు తయారుచేస్తున్నవారు. రవాణా చేస్తున్నారు, పంపిణీచేస్తున్నవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి ►గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి ►15వేలమందికిపైగా మహిళా పోలీసులు ఉన్నారు ►వారు సమర్థవంతంగా పనిచేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలి -
రాజకీయాల కోసం కాకుండా రాజ్యాంగ ఫలాలు అందేలా సాగుతున్న పాలన: మంత్రి ధర్మాన
-
చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లను అందచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా నివాసాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్–జగనన్న కాలనీల రూపంలో ఏకంగా పట్టణాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 18.63 లక్షలు సాధారణ గృహాలు. సాధారణ ఇళ్లలో 16.67 లక్షల గృహాల శంకుస్థాపనలు పూర్తి కాగా, నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 8,485 లేఅవుట్లలో విద్యుత్ సర్వే పూర్తి ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్న 8,485 లేఅవుట్లలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సర్వే పూర్తయింది. 3,248 లేఅవుట్లలో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు లాంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. 1,411 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరాకు సంబంధించి 1,561 లేఅవుట్లలో పనులు ప్రారంభించారు. 6,012 లేఅవుట్లలో పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. 1.40 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2.09 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 1,46,440 ఇళ్లకు విద్యుత్, 1,40,986 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణాలు పూర్తయిన వెంటనే విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్సార్–జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 50 ఇళ్లకు పైగా ఉన్న లేఅవుట్లలో స్వాగత ఆర్చ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.50 కోట్లతో 1,127 లేఅవుట్లలో ఆర్చ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వసతులపై ప్రత్యేక దృష్టి వైఎస్సార్–జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి వెంటనే నీరు, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న సమయంలో నీరు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రెయిన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్ మురారి గ్రామంలోని వైఎస్సార్–జగనన్న కాలనీలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న సిబ్బంది -
స్వగృహప్రాప్తిరస్తు.. నిర్మాణం శరవేగం
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. త్వరితగతిన గృహాలు నిర్మించేందుకు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఆప్షన్–3లో భాగంగా కాంట్రాక్టర్లతో నిర్మించి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో సుమారు 15 వేల గృహనిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో.. జిల్లాలో పేదలకు ప్రభుత్వం 77,688 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికే పలువురు సొంతంగా నిర్మాణాలు ప్రారంభించారు. పలువురు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయగా డ్వాక్రా మహిళలకు బ్యాంకుల నుంచి రూ.35 వేలు రుణం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వ్యవసాయ కార్మికులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ఇంటి నిర్మాణం కష్టం కావడంతో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలను పురమాయించి నిర్మాణాలు చేపట్టేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారు. నిబంధనల మేరకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం 10 అడుగుల లోతులో గోతులు తవ్వి వాటికి ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్ క్యాప్ వేస్తారు. ఆర్సీసీ ప్లి్లంత్ బీమ్‌తో కలిసి 4 అడుగుల ఎత్తు సిమెంట్ రాయి కట్టుడు బేస్మెంట్, బేస్మెంట్ను ఇసుకతో నింపడం, రూఫ్ బీమ్, 4 అంగుళాల స్లాబ్ వంటి పనులు చేస్తారు. యంత్రాల వినియోగం కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు యంత్రాలు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌కు డిగ్గర్‌ను అమర్చి పిల్లర్లకు గోతులు తవ్వుతున్నారు. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే కాంక్రీట్ కలపడానికి మిక్చర్ యంత్రం, శ్లాబ్‌కు లిఫ్ట్ మెషీన్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులతో ఒప్పందం ఇంటిని నిర్మించుకోవడానికి కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. దీనిలో భాగంగానే 20 వేల టన్నుల ఇసుక నిల్వ చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసేలా కృషిచేస్తున్నాం. –ఎ.శివరామరాజు, హౌసింగ్ పీడీ, భీమవరం భీమవరంలో 3 వేల ఇళ్లు భీమవరంలోని విస్సాకోడేరు జగనన్న కాలనీలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1,200 మందికి పైగా లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలనీలో ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్‌క్యాప్ వేసే పనులు చేపట్టాం. పనులు చూసిన మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంటున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి గృహప్రవేశాలు చేయిస్తాం. – పళ్ల ఏసుబాబు, కాంట్రాక్టర్, భీమవరం ఇళ్ల నిర్మాణం ఇలా.. జిల్లాలో పెద్ద కాలనీలు ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలతో ఇళ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భీమవరంలో 3 వేలు, పాలకొల్లులో 3,500, తణుకులో 5,500, ఆకివీడులో 2,700 ఇళ్లను కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెంలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిర్మాణాలకు కొరత లేకుండా అధికారులు 20 వేల టన్నుల ఇసుకను నిల్వ చేశారు. కాంట్రాక్టర్లకు అవసరమైన సిమెంట్, ఇనుమును ముందుగానే అందిస్తున్నారు. నిర్మాణానికి రూ.3.30 లక్షలు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.3.30 లక్షల ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు రూ.35 వేలు బ్యాంకు రుణం ఇస్తున్నారు. మిగిలిన రూ.1.15 లక్షలను లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. -
పట్నంలో 50 గజాలు .. పల్లెల్లో 75 గజాలు!
సాక్షి, హైదరాబాద్: సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే సరికొత్త గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర సర్కారు విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు పడక గదుల (డబుల్ బెడ్రూమ్) ఇళ్ల నిర్మాణ పథకం పూర్తిస్థాయి సవరణలతో, దానితో ఏ మాత్రం పోలిక లేకుండా కొత్త రూపుతో ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇంటికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 50 గజాల నుంచి 75 గజాల మధ్య ఉండాలి. అయితే కింద ఒక గది, పైన మరొక గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలు అయినా సరిపోతుంది. వీటితో పాటు ఇతర విధివిధానాలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని భారీగా సవరించి చేపడుతున్న నేపథ్యంలో..కొత్త పథకంలో సీఎం కేసీఆర్ మార్పులు, చేర్పులు చేస్తారని భావిస్తున్నారు. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం విఫలమైందన్న ప్రచారానికి అవకాశం కల్పించకుండా, దీన్ని కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఆయన మార్పులు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాగానే దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మార్పులు చేర్పుల ఆధారంగా తుది విధివిధానాలు రూపొందించి అధికారికంగా వెల్లడించనున్నారు. లేదంటే ప్రాథమిక అంశాలే తుది విధివిధానాలుగా ఖరారు కానున్నాయి. ఆదినుంచీ అవాంతరాలే.. రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆది నుంచి ఎదురవుతున్న అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు సాగనీయటం లేదు. మొత్తం 2.27 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అయితే 1.10 లక్షల ఇళ్లే పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు కనీసం 20 వేల ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదు. మిగతా వాటికి సంబంధించి అసలు లబ్ధిదారుల జాబితాలనే రూపొందించలేదు. దీన్ని తప్పుబడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సొంత ఇంటి పథకం మార్పు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రాథమికంగా విధివిధానాలు ఖరారు చేసింది. ప్రాథమికంగా ఇలా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రాథమికంగా రూపొందించారు. ►ఈ ఇళ్లను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి (బీపీఎల్) మాత్రమే మంజూరు చేస్తారు. ►ఈ ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ ఉంటుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన దాఖలాలున్నాయి. సొంత స్థలాలున్న వారి సంఖ్య అందుకు సరిపడా లేదనుకున్నప్పుడు జనాభాలో వారి శాతం ఆధారంగా రిజర్వేషన్ ఉండాలి. ►పట్టణ ప్రాంతాల్లో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ వారికి 12 శాతం ఇళ్లు కేటాయించాలి. ►ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రెండు గ్రామ సభల ద్వారా చేపట్టాలి. తొలి గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించాలి. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటి పరిశీలన పూర్తి చేసి అర్హుల జాబితా రూపొందించి రెండో సభలో వివరాలు వెల్లడించాలి. అభ్యంతరాలకు కూడా అవకాశం కల్పించాలి. ►ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను కేటాయిస్తారు. మరికొన్ని ఇళ్లు ముఖ్యమంత్రి విచక్షణాధికారం పరిధిలో ఉంటాయి. వెరసి 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తారు. ►ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.3 లక్షలు కేటాయిస్తారు. వాటిని ఇళ్ల నిర్మాణం జరిగే కొద్దీ విడతల వారీగా విడుదల చేస్తారు. ►కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు 58, 59 జీవోల ద్వారా కల్పించిన వెసులుబాటు పరిధిలో ఉన్నవారు ఈ ఇళ్లు పొందేందుకు అనర్హులు. -
1.79 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2021–22 సంవత్సరానికి సంబంధించి మరో 1,79,060 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున రూ.3,223.08 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 1.79 లక్షలలో అత్యధికంగా గుంటూరు జిల్లాకు 27,330, కర్నూలుకు 21,494, పశ్చిమగోదావరికి 19,146 ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశ కింద చేపట్టిన 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. -
భారీ కేటాయింపులు..పేదల సొంతింటి కలకు రూ.4,791కోట్లు
సాక్షి, అమరావతి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో రూ.4,791.69 కోట్ల నిధులు కేటాయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండరాదన్న లక్ష్యంతో సీఎం జగన్ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రవేశపెట్టారు. పథకం కింద రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లను రూ.50,944 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రూ.28,084 కోట్లతో జరుగుతోంది. వీటిలో 10.88 లక్షల ఇళ్లు ప్రస్తుతం పునాది దశలో ఉన్నాయి. 2.50 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 21.7 కోట్ల పనిదినాల సృష్టి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూలేని విధంగా తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా 21.7 కోట్ల పనిదినాలు కల్పించారు. తద్వారా ఇప్పటివరకూ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,146.7 కోట్లు చెల్లించింది. అదేవిధంగా ఒక్కో లబ్ధిదారురాలికి 3 శాతం వడ్డీతో రూ.35వేల రుణాన్ని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది. రుణ విముక్తి.. ఇక 2011కు ముందు గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణసాయంతో ఇళ్లు నిర్మించుకున్న వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రుణ విముక్తి కల్పిస్తున్నారు. అదే విధంగా లబ్ధిదారులకు స్పష్టమైన టైటిల్, స్వాధీన హక్కుతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. రుణాలు పొందకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికీ హక్కులు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 8.56 లక్షల మంది పథకం ద్వారా లబ్ధిపొందారు. సచివాలయాలకు పెరిగిన కేటాయింపులు సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులను బాగా పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు ప్రభుత్వం ఖర్చు రూ.2,890.26 కోట్లు ఉండగా వచ్చే ఏడాదికి రూ.3,396.25 కోట్లకు పెంచింది. ఇందులో గ్రామ సచివాలయాలు, శాఖ ప్రధాన కార్యాలయాల నిర్వహణ ఖర్చులతోపాటు గ్రామ సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు, గ్రామ వలంటీర్ల గౌరవ వేతనం వంటి ఖర్చులు కలిసి ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన కసరత్తును జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రొబేషనరీ ప్రకటనతో అర్హులైన గ్రామ సచివాలయాల ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ శాఖకు బడ్జెట్ కేటాయింపులను కూడా పెంచినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు వార్డు వలంటీర్లకు వేరుగా మునిసిపల్ శాఖ నుంచి ప్రభుత్వం వేరుగా మరికొన్ని నిధులను కేటాయించింది. -
వచ్చే ఏడాది జూన్‌కి ఇళ్లు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్ నాటికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం తొలిదశ ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇళ్లు లేని నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతలో రాజీపడకుండా ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండరాదన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కాలనీల్లో ప్రజలకు ఆరోగ్యకర జీవన పరిస్థితుల కల్పనపై ప్రభుత్వానికి ప్రత్యేకశ్రద్ధ ఉందని చెప్పారు. ప్రత్యేకాధికారులు తరచు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పనుల తీరును పర్యవేక్షించాలని, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌పాండే, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ పాల్గొన్నారు. -
అసైన్డ్‌దారులే అంగీకరించినప్పుడు మీకొచ్చిన ఇబ్బందేమిటి?
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కోసం ప్రభుత్వానికి భూములిచ్చేందుకు అసైన్డ్‌దారులే అంగీకారం తెలిపినప్పుడు మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అసైన్డ్‌దారులు అంగీకరించినప్పుడు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఎందుకు విచారించాలని కూడా ప్రశ్నించింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ, అసైన్డ్ భూముల సమీకరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి మండలాల పరిధిలో పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 6,116 ఎకరాలు సమీకరిస్తోందంటూ రైతు కూలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై 2020లో విచారణ జరిపిన సీజే ధర్మాసనం భూములను స్వాధీనం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం తుది విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 1.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం సమీకరిస్తోందని తెలిపారు. అసైన్డ్ భూములు ఇచ్చేందుకు అసైన్డ్‌దారులు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేశారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు. అసైన్డ్‌దారులే వ్యవసాయ కూలీలని, అందువల్ల భూ సమీకరణ వల్ల ప్రత్యేకంగా వ్యవసాయ కూలీలు ప్రభావితం కావడం లేదని చెప్పారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూ సమీకరణ చేస్తున్నారని తెలిపారు. అసైన్డ్ భూముల సమీకరణకు చట్టం నిర్దేశించిన విధి విధానాలను ప్రభుత్వం అనుసరించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. -
పేదింటికి పావలా వడ్డీ రుణాలు
సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కూడా ఈ రుణాలివ్వాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది. దీంతో బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే 2.12 లక్షల మందికి రూ.735.61 కోట్ల మేర పావలా వడ్డీ రుణాలు ఇచ్చాయి. ఈ పథకం కింద తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల వెసులుబాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు, ప్రకాశం, అనంతరపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రుణాల మంజూరులో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రుణాలిప్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి, త్వరితగతిన రుణాలిప్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. వర్షాలు తగ్గడంతో నిర్మాణాలు వేగవంతం వర్షాలు తగ్గడంతో పేదల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుందని అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లులు రూ. 934.26 కోట్లను, సామాగ్రి సరఫరా బిల్లు రూ. 42.22 కోట్లను చెల్లించేసినట్లు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో మరింత వేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
పీఆర్సీ గ్యారెంటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కచ్చితంగా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది వారే. అలాంటి ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప కోపం ఉండదు’ అని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎవరూ అడగకుండానే ఉద్యోగులకు 27% ఐఆర్ (మధ్యంతర భృతి) ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు పీఆర్సీని వేయడంలో తీవ్ర జాప్యం చేశారని, డీఏలు కూడా ఇవ్వలేదని ఎత్తిచూపారు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నది ఉద్యోగులకు తెలుసని, అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ అంగన్వాడీ కార్యకర్తల నుంచి అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు పెంచామని గుర్తు చేశారు. 2018–19లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు రూ.32 వేల కోట్లు ఉంటే.. 2020–21కి రూ.50 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. వేతనాలు, డీఏ తదితరాలను పెంచడం వల్ల ఏడాదికి రూ.18 వేల కోట్ల మేర ఉద్యోగులకు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులు సంయమనం పాటించాలని, గడవులోగా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. తాము తల్చుకుంటే ప్రభుత్వాలను కూల్చగలం.. నిలబెట్టగలమని నలుగురైదుగురు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కావాలంటే వారు నలుగురూ రాజకీయ పార్టీలు పెట్టుకుని.. ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడెందుకు చేయలేదు బాబూ? రాష్ట్రంలో దశాబ్దాలుగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణాలు తీసుకుని.. ఇళ్లు నిర్మించుకున్న పేదలకు వాటిపై సంపూర్ణ హక్కు లేదని సజ్జల చెప్పారు. అసలు, వడ్డీని ఏకకాలంలో నామమాత్రపు చెల్లింపుతో పరిష్కరించి.. ఉచితంగా పేదల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించి.. అమ్ముకోవడానికి హక్కు కల్పించేలా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం వైఎస్ జగన్ చేపట్టారని చెప్పారు. పేదలకు ప్రయోజనం కలిగే ఈ పథకాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుపట్టడంపై మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణంపై వడ్డీ మాఫీ చేయాలని ఐదు సార్లు అధికారులు ప్రతిపాదనలు పంపితే.. నాటి సీఎం చంద్రబాబు అంగీకరించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే అసలు, వడ్డీని మాఫీ చేసి, ఉచితంగా ఇళ్లను అందిస్తానని బాబు చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. పేదలకు ప్రయోజనం చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఎవరినీ బలవంతం పెట్టడం లేదని.. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే వర్తింపజేస్తామని తేల్చిచెప్పారు. చదవండి: రాష్ట్రానికి తుపాన్ల దెబ్బ.. 90వేల కోట్లు నష్టం చంద్రబాబు ఏజెంట్ల మాటలు వినే.. రాయలసీమలో 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టి కురవడంతో అన్నమయ్య ప్రాజెక్టును 3.20 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తిందని సజ్జల చెప్పారు. ఆ ప్రాజెక్టు స్పిల్ వే సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులేనని, అంతకు మించి వరద రావడంతో మట్టికట్ట తెగిందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి, పునరావాసం కల్పించామన్నారు. లేదంటే ప్రాణ నష్టం అధికంగా ఉండేదన్నారు. కేంద్ర బృందం కూడా ఇదే అంశాన్ని చెప్పిందని గుర్తు చేశారు. కేంద్ర బృందం నివేదికను పరిశీలించకుండా.. చంద్రబాబు ఏజెంట్ల మాటలు వినే కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడారని చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి ఎంత నీరు వస్తుందో అంచనా వేయడానికి ఇప్పటిదాకా ఏర్పాట్లు లేవన్నారు. చదవండి: వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా కొలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల మనిషని, కష్టాల్లో తోడునీడగా నిలబడతారని చెప్పారు. ప్రజలు ప్రేమతో సీఎం జగన్‌తో సెల్ఫీలు తీసుకుంటే తప్పుపట్టే చంద్రబాబు.. పోలీసులు బారికేడ్లు పెడితే ప్రజలంటే సీఎం జగన్‌కు భయమని విమర్శించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఎప్పుడో జరిగిన ఘటనకు ఇవాళ్టికి కూడా ఎన్ఎస్జీ గార్డులను చుట్టూ పెట్టుకుని ప్రజల్లో తిరిగే చంద్రబాబు.. సీఎం జగన్ భద్రతపై మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. -
ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. -
టమ టమ బండి.. భలే భలేగా ఉందండి.! ఎర్రబాబు బండికి యమ క్రేజ్..!
మచిలీపట్నం: ఏడు పదుల వయస్సులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని లాక్కొస్తున్న బందరుకు చెందిన షేక్ ఎర్రబాబు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కృష్ణా జిల్లా బందరు జనశక్తి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న షేక్ ఎర్రబాబు తయారు చేసే ఓ ప్రత్యేకమైన చిన్నబండికి పిల్లల్లో మంచి క్రేజ్ ఉంది. తనలో ఉన్న సృజనాత్మకతను రంగరించి రెండు చక్రాలతో చిన్న బండిని తయారు చేశాడు. సైకిల్ వెనుక ఆ బండిని కట్టి బందరు వీధుల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అమ్మకానికి తీసుకెళ్లే క్రమంలో అది టమ టమ అని శబ్ధం వస్తుండడంతో పిల్లలంతా ‘టమ టమ బండి’ వచ్చిందంటూ ఎగబడేవారు. దీంతో దానికి టమ టమ బండి అనే పేరు పెట్టాడు ఎర్రబాబు. సృజనాత్మకతను రంగరించి.. బందరులో ఉండే తమ పూర్వీకులు నాడు, మట్టి కుండలపై పల్చటి చర్మం పొరని అతికించి సంగీత వాయిద్యాలను తయారు చేసేవారు. అదే స్ఫూర్తితో ఎర్రబాబు పిల్లలు ఆడుకునేందుకు ఉపయుక్తంగా ఉండేలా చిన్న బండి తయారీకి సిద్ధమయ్యాడు. నాలుగు, ఐదు అంగులాల సైజులో ఓ డప్పును అమర్చి, బండి కదిలే సమయంలో అది టమ టమ అని శబ్ధం వచ్చేలా రూపొందించాడు. దీనికి కావాల్సిన సామగ్రి అంతటినీ బందరు మార్కెట్లోనే కొనుగోలు చేస్తాడు. రోజుకు మూడు బండ్లు తయారు చేసి.. సైకిల్‌కు కట్టుకుని బందరు వీధుల్లో విక్రయిస్తున్నాడు. రోజుకు సుమారు ఐదు నుంచి పది బండ్ల వరకు అమ్ముడుపోతాయి. నాలుగు అంగళాల డప్పు గల బండి రూ. 150, ఐదు అంగుళాలది రూ. 200 ధరగా ఎర్రబాబు నిర్ణయించాడు. రెక్కల కష్టంతోనే.. బందరు రైల్యే స్టేషన్‌కు సమీపంలో గుడిసెలో చాలా కాలం ఉండేవారు. అయితే ఇటీవల రైల్యేలైన్ విస్తరణతో అక్కడ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో డివిజన్ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నోబుల్ థామస్ చొరవతో రాష్ట్ర మంత్రి పేర్ని నాని వారికి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం జనశక్తి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం ఇతరత్రా పనులకు వెళ్లినా..వయస్సు మీద పడుతుండడంతో.. ఆనవాయితీగా వస్తున్న బండ్లు తయారీకి మళ్లీ శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించక కొడుకు ఆరో తరగతి వరకు చదివి మానేశాడు. భర్త కష్టాన్ని చూసిన భార్య జహీరాభి ఓ ఇంట్లో పనికి కుదిరి కుటుంబ భారం మోయడంలో కొంత మేరకు భాగస్వామి అయ్యింది. ఏడు పదుల వయస్సు మీదపడినా, ఆధార్‌లో పొరపాటున పుట్టిన సంవత్సరం తప్పుగా నమోదు కావడంతో ఎర్రబాబు వృద్ధాప్య పింఛన్‌కు నోచుకోలేదు. వైఎస్సార్ ఇంటి పట్టాతో ఊరట.. బందరులోనే ఏళ్ల తరబడి బతుకీడుస్తున్నప్పటికీ, సొంత ఇళ్లు లేని పరిస్థితి. ఇతని దయనీయ పరిస్థితులు గత పాలకులెవ్వరికీ కనిపించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన గృహ నిర్మాణ పథకంలో ఎర్రబాబు పేరును డిప్యూటీ మేయర్ టి కవితాథామస్ చేర్పించి, జహీరాభి పేర ఇంటి పట్టా అందజేశారు. సొంత ఇంటి వారయ్యే రోజులు సమీపంలోనే ఉన్నాయని ఎర్రబాబు కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తుంది. -
‘పేదలందరికీ ఇళ్లు’ అప్పీలుపై విచారణ 26కి వాయిదా
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. ఈ అప్పీల్‌తో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీని జత చేయాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ప్రస్తావించని అంశాలపై కూడా సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని నివేదించారు. ఆ అంశాలపై తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అభ్యంతరం లేదు.. దుష్ట సంప్రదాయం కారాదనే పేదలందరికీ ఇళ్ల పథకం వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ పెండింగ్‌లో ఉందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని ఏఏజీ పేర్కొన్నారు. సింగిల్ జడ్జి తీర్పు వల్ల 30 లక్షల మందికిపైగా ప్రభావితం అవుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ అప్పీల్‌ను పరిశీలించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీ లేకపోవడాన్ని గమనించింది. దీనిపై ఏఏజీ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరింది. ఈ నెల 8న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని, ఆ మరుసటి రోజే తాము అప్పీల్ దాఖలు చేశామని, అప్పటికి తీర్పు సర్టిఫైడ్ కాపీ అందుబాటులో లేనందున అప్పీల్‌తో జత చేయలేకపోయామని తెలిపారు. సర్టిఫైడ్ కాపీ స్థానంలో వెబ్ కాపీని జత చేశామని వివరించారు. అందువల్ల సర్టిఫైడ్ కాపీ దాఖలు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశామని తెలిపారు. ఈ అనుబంధ పిటిషన్‌ను అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే సర్టిఫైడ్ కాపీ లేకుండా ప్రభుత్వ అప్పీల్‌ను విచారిస్తే అది ఒక దుష్ట సంప్రదాయంగా మారుతుందని, రేపు ప్రతి ఒక్కరూ సర్టిఫైడ్ కాపీ లేకుండా అప్పీళ్లు వేసి విచారించాలని కోరతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సర్టిఫైడ్ కాపీని తమ ముందుంచాలని సూచిస్తూ అప్పీల్‌పై విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. -
ఈ పాపం టీడీపీదే
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, తెనాలి రూరల్: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన వ్యవహారంలో తెరపై సూత్రధారులు తెనాలి కొత్తపేటకు చెందిన జి.అమ్మేశ్వరరావు, మల్లేశ్వరరావులు కాగా, తెరవెనుక టీడీపీ ప్రముఖులు కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. పిటిషన్లు వేయడానికి కారణమైన వీరిద్దరికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఓ కార్మిక సంఘంలో పని చేసిన అమ్మేశ్వరరావుతో పాటు ఒక కుల సంఘం నేతగా ఉన్న ఎం.మల్లేశ్వరరావులు పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పిస్తామని నమ్మబలికి, వారి నుంచి ధృవీకరణ పత్రాలు, సంతకాలు సేకరించారు. వీటి ద్వారా 2016లో అప్పటి మండల తహశీల్దారుపై అమ్మేశ్వరరావు హైకోర్టులో కేసు వేశారు. అదే కేసులో పిటిషనుదారుల్లో చాలా మంది పేర్లతో మళ్లీ గత డిసెంబర్లో పేదలందరికీ ఇళ్లు పథకంపై పిటిషను దాఖలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సివిల్ న్యాయవాదికి తాను ఈ పత్రాలు ఇచ్చినట్టు అమ్మేశ్వరరావు స్థానికుల వద్ద అంగీకరించాడు. అదేమని అడిగితే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం సరిపోదని, అందుకే హైదరాబాద్‌లో సివిల్ న్యాయవాదికి ఇచ్చి పిటిషన్ వేయించినట్టు చెబుతున్నాడు. ‘మీ అంతట మీరే కేసు వేశారా? ఎవరి ప్రోద్భలమైనా ఉందా? ఇళ్ల స్థలాల అర్జీలకంటూ సంతకాలు తీసుకుని, వారి పేర్లతో పిటిషన్ వేయటం ఏమిటి’ అన్న బాధితుల ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వడం లేదు. కొత్తపేటలోని పట్టాభి రోడ్డులో డ్రైనేజి కాలువ పక్కన చిన్న ఇంటిలో నివసించే అమ్మేశ్వరరావు.. హైకోర్టు లాయరుకు భారీ ఫీజులు చెల్లించి.. కోర్టులో పిటిషన్ వేసేంత స్థోమత లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసు కోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న అమ్మేశ్వరరావుకు ఆ పార్టీకి చెందిన పెద్దలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. టీడీపీ పెద్దలు తెరవెనుక నుంచి ఇచ్చిన సూచనల మేరకు కొంత మంది ఆ పార్టీ నేతల ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే పిటిషన్ వేసిన వారిలో మృతి చెందిన మహిళ ఉండటం, పేర్లు సరిచూసుకోక పోవడం తదితర కారణాల వల్ల ఇట్టే దొరికి పోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జి.అమ్మేశ్వరరావు నివసిస్తున్న ఇల్లు మాకు ఏ పాపం తెలియదు ‘మేం తెనాలి చంద్రబాబుకాలనీ వాసులం. మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి గౌరవ హైకోర్టులో మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి కేసు వేసి స్టే ఉత్తర్వులు తీసుకున్నట్లు మాకు టీవీలు, పేపర్ల ద్వారా తెలిసింది. నాలుగేళ్ల క్రితం గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావులు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటే ఆధార్‌కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చాము. తర్వాత ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయలేదు. మాకు తెలియకుండా మా వివరాలతో కేసు వేసిన కుట్రదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోండి’ అంటూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తుమ్మపూడి అశోక్‌కుమార్, పరుచూరు బేబీ సరోజిని, కొండా నాగమంజుల, కనికరం రాంబాబు, శేని సత్యవతి, ఎస్ లీలాప్రసాద్, చనగవరపు శివకుమారి, షేక్ జిలాని, భీమిశెట్టి రామ్మోహన్రావు తదితరులు తెనాలి త్రీటౌన్ పోలీసు స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. కుట్రదారులను విచారించండి ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ పథకంలో భాగంగా తమకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, స్థలాన్ని తమకు స్వాధీనం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇళ్ల స్థలాల కోసం ఏ కోర్టులోనూ ఎటువంటి కేసులు వేయలేదని, ఏ ప్లీడర్ను కలవలేదని ఫిర్యాదులో వివరించారు. తమ వద్ద నుంచి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకున్న గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావు వారి రాజకీయ స్వలాభం కోసం తమ సంతకాలు ఫోర్జరీ చేసి హైకోర్టులో వేసిన ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కుట్రకు పాల్పడిందెవరో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. పేదల్లో కలవరం పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 369, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి మల్లవోలు సత్యనారాయణమూర్తి ఈనెల 8న ఇళ్ల పథకానికి బ్రేక్ వేస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న పొదిలి శివమురళి ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇళ్ల పథకాన్ని నిలిపివేయమని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తెనాలివాసుల పేర్లు ఉన్నాయన్న సమాచారం చాలా మంది పేదల్లో కలవరం కలిగించింది. పలువురు తమ పేరు ఉందేమోనన్న ఆందోళనతో పట్టణ 23వ వార్డులోని సచివాలయానికి వెళ్లారు. పిటిషనులో తమ పేర్లు ఉన్నాయేమో చూడాలని సచివాలయం సిబ్బందిని కోరారు. పిటిషన్లో పేర్లు లేని మరికొంత మంది కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అమ్మేశ్వరరావుకు డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. చాలాసార్లు అతడి కోసం తిరిగి, ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు. పిటిషన్లో చనిపోయిన మహిళ పేరు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో వేసిన పిటిషన్లో తెనాలికి చెందిన కొండెం ప్రమీల పేరు ఉంది. ఈ పిటిషన్‌ను గత ఏడాది డిసెంబర్లో వేశారు. అయితే కొండెం ప్రమీల అనారోగ్యంతో గత ఏడాది మార్చి 4వ తేదీ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. చనిపోయిన ఈమె ఎలా పిటిషన్ వేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరి పేర్లు రిపీట్ అవ్వగా, కొందరి అడ్రస్‌లు తప్పుడువి ఇచ్చారు. చాలా మంది పిటిషన్లో పేర్కొన్న చిరునామాలలో ఉండటం లేదు. తొలుత ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టగానే తెలుగుదేశం నేతలు భుజాలు తడుముకోవడం పలు అనుమానాలకు దారితీసింది. పిటిషన్ దారుల్లో మొదటి వ్యక్తిగా చెబుతున్న పొదిలి శివమురళి తాను తమ కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఆధార్‌కార్డు ఇచ్చానని చెబితే, తెనాలి ఎమ్మెల్యే పేరు చెప్పినట్లుగా వక్రీకరిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా విలేకరుల సమావేశం పెట్టడంతో ఇందులో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. కేసు వేయించింది ఆలపాటి రాజాయే – తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మండిపాటు ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టులో కేసు వేయించింది మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనుదారుల్లో ప్రథముడైన పొదిలి శివమురళి వీడియో సాక్షిగా చెప్పిన అంశాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా వక్రీకరించి, తనకు ఆపాదించాలని చూశారని విమర్శించారు. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం ద్వారా తెనాలిలో ఇక తనకు స్థానం లేదన్న దుగ్ధతో ఆలపాటి రాజానే ఈ కేసు వేయించారని చెప్పారు. దీని వెనుక ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలనే భారీ కుట్ర ఉందంటూ బుధవారం విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. ముందుగా పిటిషనుదారుల్లో ఒకరైన పొదిలి శివమురళి మాట్లాడిన వీడియోను, దాని ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా ప్రెస్‌మీట్ వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. తాను నాయీబ్రాహ్మణ కులస్తుడినని, తన కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఇళ్ల స్థలాల కోసమని డబ్బులు, ధృవీకరణ పత్రాలు ఇచ్చానని శివమురళి చెబితే, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ఇచ్చానని చెప్పాడంటూ రాజా తనపై ఆరోపణ చేయటం ఏమిటని శివకుమార్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలను అడ్డుకునే కుట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే పురుడుపోసుకుందని చెప్పారు. పంచాయతీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలంటూ టీడీపీకి చెందిన వెంకట్రావుతో కేసు వేయించిందీ రాజానేనని చెప్పారు. క్రిమినల్ మైండ్ కలిగిన రాజా, కోర్టుల్లో తనకు అపారమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటూ, సెటిల్మెంట్లు చేయటం అలవాటని ఆరోపించారు. టీడీపీకి చెందిన నన్నపనేని సుధాకర్ దగ్గర కోర్టు కేసు విషయంలో రాజా రూ.25 లక్షలు తీసుకున్నాడని తాను ఏడాది క్రితం ఆరోపించినట్టు ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత రెండు నెలలకు రూ.10 లక్షలు తిరిగి ఇచ్చాడనే విషయాన్ని సుధాకర్ స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. -
హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిట్ అప్పీల్ విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం న్యాయమూర్తులు పంపారు. ఈనెల 20న ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.