DDA Housing Scheme 2023: Registration for over 5,500 flats; check price - Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ స్కీం: 5500 ఫ్లాట్లు, రూ.9.89 లక్షలకే ఫ్లాట్‌

Published Sat, Jul 1 2023 4:15 PM | Last Updated on Sat, Jul 1 2023 4:29 PM

DDA Housing Scheme 2023 Registration for over 5500 flats check price - Sakshi

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA)  గృహకొనుగోలుదారులకు భలే మంచి  శుభవార్త అందించింది. వివిధ ప్రదేశాలలో 5,500 ఫ్లాట్‌లతో కూడిన కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది.  ఇందులో రూ. 9.89  లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్‌ను అందించ నుంది. 

శుక్రవారం (జూన్‌ 30) ప్రారంభించిన ఈ పథకంలో ముందుగా వచ్చిన వారికి, ముందుగా కేటాయింపు ప్రాతిపదికన  వీటిని  విక్రయించ నుంది. ఫ్లాట్‌లలో 1-BHK, 2-BHK ,3-BHK ఇళ్లు ఉన్నాయి. అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జూన్ 14న ఆన్‌లైన్‌లో ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్ హౌసింగ్ స్కీమ్  ఫేజ్ 4ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ఈ పథకం టోకెన్ చెల్లించి తమ కిష్టమైన ప్రాంతంలో ఫ్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. (ఆధార్‌-ప్యాన్‌ లింక్‌ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన)

డీడీఏ హౌసింగ్ స్కీమ్‌లోని ఫ్లాట్‌ల  వివరాలు
1-BHK ఫ్లాట్‌లు నరేలా, సిరాస్‌పూర్, రోహిణి, లోక్‌నాయక్ పురంలో ఉన్నాయి
2-BHK ఫ్లాట్‌లు నరేలా ,ద్వారకలో ఉన్నాయి
3-BHK ఫ్లాట్‌లు జసోలాలో ఉన్నాయి (టీసీఎస్‌: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట)

ఫ్లాట్లు: ధరలు సుమారుగా
1-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 9.89 లక్షల -రూ. 26.98 లక్షలు, లోక్‌నాయక్ పురంలో రూ. 28.47 లక్షలకు
2-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 1 కోటి నుండి రూ. 1.23 కోట్లకు-ద్వారకలో రూ. 1.33 కోట్లు
3-BHK ఫ్లాట్లు: రూ. 2.08 కోట్ల నుండి రూ. 2.18 కోట్లు

బుకింక్‌  అమౌంట్‌
1-BHK ఫ్లాట్‌లు: రూ. 50,000 (ఆర్థికంగా  వెనుకబడినవారికి ), రూ. 1 లక్ష (జనరల్‌)
2-BHK ఫ్లాట్‌: రూ. 4 లక్షలు
3-BHK ఫ్లాట్‌: రూ. 10 లక్షలుచెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సిఉంటుంది.  జూన్ 30 సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్.  జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి (మరిన్ని అప్‌డేట్స్‌కోసం చదవండి: సాక్షిబిజినెస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement