గృహ నిర్మాణ తీరును సమీక్షిస్తున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఏలూరు (మెట్రో): జిల్లాలో ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం జిల్లాలో గృహనిర్మాణ ప్రగతి తీరును, సంవత్సరం, పథకాల వారీగా, ఏఈల వారీగా గృహ నిర్మాణాల ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కుటుంబానికి నూరు శాతం ఇళ్లు ఇవ్వాలన్నదే లక్ష్యమన్నారు.
ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఎంతమందికి ఇళ్లు మంజూరు చేయాలో కచ్చితమైన అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. 2017, 2018, 2019 సంవత్సరా ల్లో మంజూరైన ఇళ్లలో ఇంకా ప్రారంభం కాని నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటిపై దృష్టిపెట్టి ఫిబ్రవరి మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని చెప్పారు. ఇంజినీర్లు వారపు లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో పసుపు, కుంకుమ ద్వారా అందించే సహాయం, పెన్షన్ల పంపిణీ వాటితో పాటు దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాసరావు, టిడ్కో ఎస్‌ఈ
శ్రీనివాసరావు, కమిషనర్ మోహనరావు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు సమస్యలు తెలుసుకుని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆ సమస్యలు పరిష్కరించాలని సంబంధితాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ విధులుకు వస్తున్న సమయంలో కొందరు ప్రజలు సమస్యల అర్జీలతో కలెక్టర్‌కు కనిపించారు. సంబంధిత ప్రజలను కలెక్టర్ పలకరించి ఆ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
బదిలీ ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తి
ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారుల బదిలీ ప్రక్రియలను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల సంసిద్ధత వంటి అంశాలపై రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర ఫనేఠ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునేత మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న దృష్ట్యా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులను బదిలీలు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.సత్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment