హౌసింగ్ స్కీమ్-2014 కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్రారంభించిన వెబ్‌సైట్‌కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 48 గంటల్లో 18.25 లక్షల మంది
న్యూఢిల్లీ: హౌసింగ్ స్కీమ్-2014 కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్రారంభించిన వెబ్‌సైట్‌కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 48 గంటల్లో 18.25 లక్షల మంది ఈ హౌసింగ్ స్కీమ్ వివరాల కోసం డీడీఏ వెబ్‌సైట్‌ను సందర్శించారు. పేరుతో ప్రారంభించిన వెబ్‌సైట్ సోమవారం క్రాష్ కావడంతో దానిని మళ్లీ పునరుద్ధరించామని, వెబ్‌సైట్ ద్వారా అందిస్తున్న అన్ని ఆన్‌లైన్ సేవలు ఇకపై కూడా అందుతాయని డీడీఏ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు.
ప్రారంభించిన రోజే 11 లక్షల మంది వెబ్‌సైట్‌ను సందర్శించగా రెండో రోజు పునరుద్ధరించిన తర్వాత 7.25 లక్షల మంది వెబ్‌సైట్‌ను సందర్శించారని డీడీఏ సిస్టమ్స్ డెరైక్టర్ వి.ఎస్. తోమర్ తెలిపారు. వెబ్‌సైట్ క్రాష్ అయిన తర్వాత తమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు శ్రమించి మరింత మెరుగ్గా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దారని, దీంతో ఆన్‌లైన్ సేవలు అందించడం ఇకపై మరింత సులువుతుందని తోమర్ అభిప్రాయపడ్డారు.