సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వాసుపత్రి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) పడకల స్థాయిని విస్తరించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ ఆపరేషన్ల కోసం రోగులు దీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తోంది. పడకల సంఖ్య తక్కువగా ఉం డడంతో నెలలు, సంవత్సరాలపాటు వివిధ ఆపరేషన్ల కోసం రోజులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ నిరీక్షణ కాలం వ్యాధి తీవ్రతను బట్టి, నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
అడ్మిషన్ ప్రక్రియ సరళీకరణ: ఇందులో భాగంగా రోగుల అడ్మిషన్ ప్రక్రియను సరళీకరించి సౌకర్యవంతంగా, పారదర్శకంగా అడ్మిషన్ ప్రక్రియను తీర్చిదిద్దడం కోసం ఆన్‌లైన్ ద్వారా పడకలను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. రోగులు ఇంటి వద్ద నుంచే అసుపత్రిలో ఆన్‌లైన్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసుపత్రిలో పడక లభ్యత గురించిన సమాచారాన్ని ఎయిమ్స్ ఎస్‌ఎంఎస్ ద్వారా అందిస్తుంది. దాని వల్ల రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ తిర గాల్సిన పనిలేదు. ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలనేది రోగులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుతోంది. కేటాయించిన రోజు రోగులను ఆసుపత్రికి తీసుకొని రావచ్చని ఎయిమ్స్ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
రోజూ 10 వేల మంది రోగుల రాక: ఎయిమ్స్ ఓపీడీ విభాగాన్ని రోజుకు పదివేల మంది సందర్శిస్తారు. న్యూరాలజీ, కార్డియాలజీ, కేన్సర్, పిడియాట్రిక్ ,ఈఎన్‌టీ విభాగాలలో రోగుల సంఖ్యఎక్కువగా ఉంటుంది. 2,400 పడకలు కల ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఆపరేషన్ల కోసం నిరీక్షాంచాల్సి వస్తోంది. ఒక్కోసారి ఆపరేషన్ తేదీ ముందుగానే లభించిన ప్పటికీ పడకలు ఖాళీగా లేకపోవడం జాప్యం జరుగుతోంది. పడక ఎప్పుడు దొరుకుతుందో తెలుసుకోవడం కోసం రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ ఏళ్లతరబడి తిరుగాల్సి వచ్చేంది. డబ్బులు తీసుకుని ఆసుపత్రి సిబ్బంది పడక కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఈ సమస్యలను నివారించడం కోసం పడకల కేటాయింపు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా అందించాలని ఎయిమ్స్ యోచిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
ఎయిమ్స్‌లో ఆన్‌లైన్ సేవలకు కసరత్తు
Published Mon, Dec 15 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement