Aims
-
మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి,మంగళగిరి : ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్స్ కోర్స్ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది. ప్రతి సంవత్సరం నిర్వహించాలి. పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలి. ఎయిమ్స్ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారు.దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలి.మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాను. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయం.ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివి. ప్రతీ రోగికీ సేవలందించాలి.. ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి.యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలి’’ అని అన్నారు.చంద్రబాబు మాట్లాడుతూఅనంతరం రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది.ప్రతి సంవత్సరం నిర్వహించాలి.కాన్వకేషన్ మీకు ఒక గుర్తింపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాధారణ మహిళ, గిరిజన మహిళగా భారత ప్రథమ మహిళ అయ్యారు. ఉపాధ్యాయినిగా అంచెలంచెలుగా రాష్ట్రపతి అయ్యారు ’అని చంద్రబాబు అన్నారు. -
పరిసరాలపై విశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలను కాల్వలు, చెరువు కట్టలు, రహదారికి ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటం గమనిస్తాం. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలంటే పురపాలక సిబ్బంది రావాలని అనుకుంటాం. ఆలస్యమైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాం.. అలా కాకుండా మనమే శుభ్రం చేద్దామని కంకణం కట్టుకున్నవారెంతమంది ఉంటారు? అలాంటి వారు నగరంలో చాలా అరుదనే చెప్పాలి.కొందరు యువత మాత్రం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి నడుం బిగించారు. 2021 నుంచి నగరంలో సరూర్‌నగర్ చెరువు, అమీన్పూర్ చెరువు, నల్లగండ్ల చెరువు, గాంధీ చెరువు, పీరంచెరువు, ఖాజాగూడ చెరువు, తదితర ప్రాంతాల వద్ద కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సెలవు రోజునా చెరువు కట్ట, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలన్నది వారి లక్ష్యం. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ, ఇతర వ్యక్తుల్లో క్లీనింగ్ పట్ల స్పృహ కల్పించడం, ఎన్నో రకాల పక్షులను ఆదుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ ప్రస్తుతం సుమారు 500 మందికిపైగా వలంటీర్లను జత చేసుకుంది.బృందాలుగా ఏర్పడి...వీరంతా బృందాలుగా ఏర్పడి చెరువులను దత్తత తీసుకుంటున్నారు. వారాంతంలో వారికి కేటాయించిన చెరువుల దగ్గర ప్రజలు వేసే చెత్త, ప్లాస్టిక్ సంచులు, తాగుబోతులు విసిరేసిన గాజు సీసాలు వంటి వ్యర్థాలను ఏరిపారేస్తున్నారు. సంచుల్లో ప్యాక్ చేసి జీహెచ్ఎంసీకి తరలిస్తున్నారు. దేశంలోనే మొదటి బయోడైవర్సిటీ చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువుతో పాటు నగరంలో పలు చెరువులకు వలస పక్షలు వస్తున్నాయి.ఈ సీజన్లో వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా వలస వచ్చిన పక్షలు ఇక్కడ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. ఆహారంగా చేపలు, ఇతర కీటకాలను వేటాడే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. ఈ క్రమంలో వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలనే పట్టుదలతో ఒక్కో చెరువునూ ఒక్కో బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయి. -
ఆ మైలురాయి సాధించడమే ఎస్బీఐ లక్ష్యం
వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన మొదటి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్లు దాటడం సాధ్యమేనా అని అడిగినప్పుడు “మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా, ఆ మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి కంపెనీగా మేము ఉండాలనుకుంటున్నాం” అని సీఎస్ శెట్టి చెప్పారు.లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలైనవి తమకు చాలా ముఖ్యమైన అంశాలని, అదే సమయంలో కస్టమర్-సెంట్రిసిటీకి సమానమైన ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే తమ కార్యకలాపాలలో ప్రాథమిక అంశంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.ఇక కార్పొరేట్ రుణ డిమాండ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్‌లైన్‌ను పొందిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి ఓరం
న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం ఢిల్లీలోని ఎయి మ్స్‌లో చేరారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కొత్త ప్రైవేట్ వార్డులో చేరారని, పల్మనరీ మెడిసిన్ అండ్ స్లీప్ డిజార్డర్స్ విభాగాధిపతి డాక్టర్ అనంత్ మోహన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి ఆరోగ్య నిలకడగా ఉందని వెల్లడించాయి. మంత్రి ఓరం భార్య ఝింగియా ఓరం(58) శనివారం ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో డెంగీతో చికిత్స పొందుతూ చనిపోవడం తెలిసిందే. అదే ఆస్పత్రిలో డెంగీతో మంత్రి ఓరం కూడా చికిత్స పొందారు. ఇలా ఉండగా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర జ్వరంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో జాయినయ్యారు. ‘ఆయన మంచిగానే ఉన్నారు. చికిత్స అందుతోంది. ఎలాంటి ప్రమాదం లేదు’అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
తొలి ‘ఎయిమ్స్’ ఎలా ఏర్పాటైంది? యువరాణి అమృత్ కౌర్‌కు సంబంధం ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ గురించి తెలియనివారెవరూ ఉండరు. దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఎయిమ్స్‌కు వస్తుంటారు. అయితే ఎయిమ్స్‌ను ఎలా స్థాపించారో, దాని వెనుక ఎవరి చొరవ ఉందో తెలుసా? దేశ తొలి మహిళా ఆరోగ్య మంత్రి రాజకుమారి అమృత్‌కౌర్ ఎయిమ్స్ గురించి కలలుగన్నారు. యువరాణి అమృత్ కౌర్ 1887 ఫిబ్రవరి 2న లక్నోలో జన్మించారు. ఆమె తండ్రి రాజా హర్నామ్ సింగ్ అహ్లువాలియాను బ్రిటీషర్లు ‘సర్’ బిరుదుతో సత్కరించారు. హర్నామ్ సింగ్ అహ్లువాలియా పంజాబ్‌లోని కపుర్తలా సంస్థానానికి చెందిన మహారాజుకు చిన్న కుమారుడు. కపుర్తలా సింహాసనం విషయంలో వివాదం ప్రారంభమైనప్పుడు రాజా హర్నామ్ సింగ్ తన రాజ్యాన్ని విడిచిపెట్టి, కపుర్తలా నుండి లక్నోకు చేరుకున్నారు. అనంతరం హర్నామ్ సింగ్ అహ్లువాలియా అవధ్ రాచరిక రాష్ట్రానికి మేనేజర్‌గా చేరారు. అంతే కాదు క్రిస్టియన్ మతం స్వీకరించారు. హర్నామ్ సింగ్ అహ్లువాలియా పశ్చిమ బెంగాల్ (అప్పటి బెంగాల్)కు చెందిన ప్రిస్కిల్లాను వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి పేరు గోకుల్‌నాథ్ ఛటర్జీ. రాజా సాహెబ్, ప్రిస్కిల్లాకు తొమ్మిది మంది కుమారులు. యువరాణి అమృత్ కౌర్ 10వ సంతానంగా జన్మించారు. రాజా హర్నామ్ సింగ్ అహ్లూవాలియా యువరాణి అమృత్ కౌర్‌ను చదువుకునేందుకు విదేశాలకు పంపారు. ఆమె ఇంగ్లాండ్‌లోని డోర్సెట్‌లోని షీర్బార్న్ స్కూల్ ఫర్ గర్ల్స్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. చదువు పూర్తయ్యాక ఆమె 1908లో భారత్‌కు తిరిగివచ్చారు. మహాత్మా గాంధీ రాజకీయ గురువు గోపాల్ కృష్ణ గోఖలేకు ప్రభావితురాలైన యువరాణి అమృత్ కౌర్ స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. మహాత్మా గాంధీకి అభిమానిగా మారారు. దండి మార్చ్ సమయంలో జైలుకు వెళ్లారు. తల్లిదండ్రుల మరణానంతరం ఆమె 1930లో రాజభవనాన్ని విడిచిపెట్టి స్వాతంత్ర్య ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమృత్ కౌర్ గొప్ప పాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్యావంతులైన యువరాణి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. వైద్యరంగంలో చికిత్స, పరిశోధనల కోసం దేశంలోనే ఉన్నతమైన వైద్యసంస్థను నెలకొల్పాలన్నది అమృత్ కౌర్ కల. ఇందుకోసం ఆమె 1956 ఫిబ్రవరి 18న లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అమృత్ కౌర్ కల సాకారం కావాలని అందరూ కోరుకున్నారు. అనంతరం యువరాణి అమృత్ కౌర్ ఎయిమ్స్ ఏర్పాటు కోసం నిధుల సేకరణను ప్రారంభించారు. అమెరికాతో పాటు స్వీడన్, పశ్చిమ జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి నిధులను సేకరించారు. సిమ్లాలోని తన ప్యాలెస్‌ను ఎయిమ్స్‌కు ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చట్టం మే 1956లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి అధ్యక్షురాలైన మొదటి ఆసియా మహిళ గానూ కూడా అమృత్ కౌర్ ఖ్యాతి గడించారు. ఆమె 1964 ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో కన్నుమూశారు. -
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఈరోజు (గురువారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిమ్స్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో చెలరేగిన మంటలకు సంబంధించిన సమాచారం అందగానే అగ్నిమాపకదళం ఏడు అగ్నిమాపక యంత్రాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 5:58 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలివెళ్లాయి. ఎయిమ్స్‌లోని ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. డైరక్టర్ బిల్డింగ్ రెండో అంతస్తులోని ఆఫీసు రికార్డులు, ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. #WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services (Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ — ANI (@ANI) January 4, 2024 -
ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..
ఉత్తరకాశీ టన్నెల్ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను ప్రభుత్వం ఆర్మీకి చెందిన హెలికాప్టర్లో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించింది. ఈ కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు, మానసిక పరీక్షలు చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఎయిమ్స్‌కు కార్మికులు చేరుకోకముందే ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్ హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే, ఆరోగ్య కార్యకర్తలు.. కార్మికులను ఆరోగ్య పరీక్షల కోసం అంబులెన్స్‌లు, వీల్చైర్ల ద్వారా వారిని వార్డులకు తీసుకు వెళ్లారు. వైద్యుల బృందం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సొరంగం నుండి బయటపడిన కార్మికులంతా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వారి ఆరోగ్యం గురించి మరింతగా తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పరీక్ష కోసం తీసుకుంటున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు సైకియాట్రిస్ట్ బృందం కూడా సేవలను అందిస్తోంది. ఇది కూడా చదవండి: కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు -
వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు?
దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు నాణ్యత సూచిక ‘తీవ్రమైన’ విభాగంలోనే కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వైద్య నిపుణులు ఆరోగ్యంపై వాయు కాలుష్యానికి సంబంధించిన ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలియజేశారు. డాక్టర్ పీయూష్ రంజన్ (అడిషనల్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, ఎయిమ్స్) మీడియాతో మాట్లాడుతూ వాయు కాలుష్యం- వివిధ రకాల క్యాన్సర్ల మధ్యగల సంబంధానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధులతో వాయు కాలుష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆయన తెలిపారు. వాయు కాలుష్యం విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మెదడు, గుండె దెబ్బతినే అవకాశాలున్నాయని, ఇది అన్ని వయసులవారిలో సంభవించవచ్చన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ఆదివారం వరుసగా నాల్గవ రోజు కూడా ‘తీవ్రమైన’ విభాగంలోనే ఉంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు! -
ఆ ఊపిరి ఆపలేం!
న్యూఢిల్లీ: 26 వారాల ఐదు రోజుల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు ఓ వివాహిత పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ‘‘ఆమె ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతుండటం వాస్తమేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు తేలి్చంది. అయితే గర్భస్థ శిశువు బాగానే ఉందని, ఆరోగ్యపరంగా అసాధారణ పరిస్థితులేమీ లేవని బోర్డు స్పష్టం చేసింది. ఆమె వాడుతున్న మందులు కూడా పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపేవేమీ కావని వెల్లడించింది. అంతేగాక పిండం వయసు వైద్యపరంగా అబార్షన్ (ఎంటీపీ)కి అనుమతించిన 24 వారాల గరిష్ట గడువును కూడా దాటేసింది. కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇప్పుడు అబార్షన్‌కు అనుమతించడం భ్రూణ హత్యతో సమానం. ఎంపీటీ చట్టంలోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే. సదరు మహిళ ఆస్పత్రి ఖర్చులన్నింటినీ ఎయిమ్సే భరిస్తుంది. చిన్నారిని పెంచుకోవడమా, దత్తతకివ్వడమా అనేది ప్రసవానంతరం తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటికే తనకిద్దరు పిల్లలని, 2022 సెపె్టంబర్లో రెండో కాన్పు అనంతరం కుంగుబాటుకు గురయ్యానని పేర్కొంటూ ఓ 27 ఏళ్ల గర్భిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడో బిడ్డను కని పెంచే శారీరక, ఆర్థిక, భావోద్వేగపరమైన స్తోమత లేనందున అబార్షన్‌కు అనుమతించాలని కోరింది. ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ బృందం నివేదిక ఆధారంగా ఆమె 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అక్టోబర్ 9న సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బాగానే ఉందని, చక్కగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటూ ఎయిమ్స్ బృందంలోని ఒక వైద్యుడు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 6న పంపిన ఈ మెయిల్‌ను ఉటంకించింది. ఈ నేపథ్యంలో దీనిపై పునరి్వచారణ జరిపిన జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి.నాగరత్న ద్విసభ్య ధర్మాసనం తొలుత అబార్షన్‌కు అనుమతించినా, బుధవారం భిన్నమైన తీర్పు వెలువరించింది. దాంతో కేసు సీజేఐ ధర్మాసనం ముందుకొచి్చంది. చట్టమూ అంగీకరించదు... వివాహితలకు అబార్షన్ చేసుకునేందుకు ఎంటీపీ చట్టం ప్రకారం అనుమతించిన గరిష్ట గడువు 24 వారాలు. అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్ల వంటి బాధిత మహిళలకు ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఈ గడువును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విడిగా విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పిండం ఎదుగుదల ఎలా ఉంది?
న్యూఢిల్లీ: వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో ఆమె గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆ మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటోందని గర్భాన్ని మోయడానికి ఆమె సిద్ధంగా లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్ని çపరిగణనలోకి తీసుకుంది. మానసిక సమస్యలకు ఆ మహిళ తీసుకుంటున్న మందులు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయో పూర్తిగా పరీక్షలు చేసి వివరంగా కోర్టుకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ శారీరక, మానసిక స్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన ఆ మహిళ ప్రసవానంతరం వచ్చే మానసిక సమస్యలతో బాధపడుతోందని పరీక్షల్లో తేలితే ప్రత్యామ్నాయంగా మరేౖవైనా మందులు ఇవ్వొచ్చా పరిశీలించాలి’’ అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
విమానంలో చిన్నారికి గుండెపోటు.. ప్రాణం పోసిన ఎయిమ్స్ డాక్టర్లు
న్యూఢిల్లీ: ప్రాణం పోయడంలో దేవుడి తర్వాత దేవుడిగా డాక్టర్లనే కొలుస్తూ ఉంటారు. ఈ మాటను నిజం చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోశారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడంతో అదే విమానంలో ఉన్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ నిర్వహించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ పయనమైన విస్తార విమానం UK -814లో రెండేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపటిలోనే పల్స్ ఆగిపోయింది. బిడ్డ చర్మం నీలిరంగులోకి మారిపోయి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లిస్తున్నట్లు సిబ్బంది అత్యవసర ప్రకటన చేసింది. విషయం తెలుసుకున్న అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై బాలికకు సీపీఆర్ నిర్వహించారు. విమానం నాగ్‌పూర్‌కు చేరేవరకు బిడ్డ ప్రాణాలను అదిమి పట్టుకున్నారు. ఎలాగోలా ఐవీ క్యానులాను అమర్చగలిగారు. బిడ్డ యధాతథంగా ఊపిరి తీసుకునేంతవరకు ఎయిమ్స్ డాక్టర్లు చాలా శ్రమించారు. చిన్నారిని నాగ్‌పూర్‌కు తరలించిన తర్వాత సర్జరీ నిర్వహించగా ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దమన్‌దీప్, డా.రిషబ్ జైన్, డా.ఒయిషికా, డా.అవిచల తక్షక్లను అభినందిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో వారికి అభినందనలు తెలుపుతూ చిన్నారితో సహా డాక్టర్ల ఫోటోలను షేర్ చేసింది. #Always available #AIIMSParivar While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM — AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023 ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య! -
భార్యతో మీద కోపంతో.. రెండేళ్ల కొడుకును భవనంపై నుంచి పడేసి..
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి రెండేళ్ల కొడుకుని మూడు అంతస్తుల బాల్కనీ నుంచి తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ వద్ద ఉన్న స్లమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన తండ్రి కొడుకులిదర్నీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మన్సింగ్ అతడి భార్య పూజా కుటంబ కలహలతో గత కొన్ని నెలలుగా వేర్వేరుగా నివశిస్తున్నారు. ప్రస్తుతం పూజ తన ఇద్దరు పిల్లలతో కల్కాజీలో ఉంటున్న తన నానమ్మ వద్దే ఉంటోంది. గత రాత్రి మన్సింగ్ తన భార్య పూజ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మన్సింగ్ కోపంతో.. తన రెండేళ్ల కొడుకుని 21 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుంచి పడేసి..ఆ తర్వాత అతను దూకేశాడు. ఈ మేరకు పోలీసులు మనసింగ్పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఆ సమయంలో తాగి ఉన్నాడని పూజ నానమ్మ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి) -
గూగుల్ ఫారమ్ ఫిల్ చేస్తున్నారా?..6 లక్షల మంది భారతీయులపై హ్యాకర్ల పంజా!
పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గత నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. తాజాగా భారత్‌కు చెందిన మరో 6 లక్షల మంది పర్సనల్ డేటాను బోట్ మార్కెట్(ఆన్లైన్ మార్కెట్ ప్లేస్) లో అమ్ముకున్నట్లు తేలింది. పలు నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఆ డేటాను బోట్ మార్కెట్లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. 2018 నుండి ప్రపంచంలో అతి పెద్ద వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ కు చెందిన లూథూనియా నార్డ్ సెక్యూరిటీ రీసెర్చ్ బోట్ మార్కెట్‌ను ట్రాక్ చేసింది. 2018లో తొలిసారి బోట్ మార్కెట్ విడుదలైంది. నాటి నుంచి ఆ మార్కెట్ పనితీరుపై నార్డ్ వీపీఎన్ దృష్టిసారించగా..యూజర్ల వివరాలు బోట్ మార్కెట్లో లభ్యమవుతున్నట్లు గుర్తించింది. తన రిసెర్చ్‌లో భాగంగా ప్రధానమైన జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీ బోట్ మార్కెట్లతో పాటు దొంగిలించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాగిన్ ఐడీలు ఉన్నట్లు చెప్పింది. రూ.490కే నాటి నుంచి బోట్ మాల్వేర్ సాయంతో హ్యాకర్స్ యూజర్లు వినియోగిస్తున్న ఫోన్, ల్యాప్‌ట్యాప్, పర్సనల్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వారి లాగిన్ ఐడీలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్ షాట్లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాల్ని తస్కరించారు. ఒక్కో యూజర్ డేటాను రూ.490కి అమ్ముకున్నట్లు తేలింది. ఆటో ఫామ్స్ ఫిల్ చేస్తున్నారా? ఆటో ఫామ్స్ అంటే? ఏదైనా సంస్థ తన ప్రొడక్ట్ ఎలా ఉందో తెలిపేలా లేదంటే.. ఏదైనా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే ముందుకు గూగుల్ ఫారమ్స్ తరహాలో ఆటో ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫారమ్ ఫిల్ చేసిన యూజర్ల డేటా 667 మిలియన్ కుకీస్, 81వేల డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, 5లక్షల 38 ఆటో ఫారమ్స్ ఫిల్స్, భారీ ఎత్తున స్క్రీన్ షాట్లు, వెబ్ క్యామ్ స్నాప్‌ల నుంచి డేటాను సేకరించినట్లు నార్డ్ వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ తెలిపారు. డార్క్ వెబ్ వర్సెస్ బోట్ మార్కెట్ డార్క్ వెబ్ మార్కెట్ల కంటే బోట్ మార్కెట్లు విభిన్నంగా ఉంటాయి. బోట్ మార్కెట్లు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి ఒక్క డివైజ్ ద్వారా భారీ మొత్తంలో డేటాను సేకరిస్తాయని బ్రీడిస్ అన్నారు. ఐసీఎంఆర్‌పై 6వేల సార్లు దాడులు వాట్సాప్ తర్వాత దేశంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు.ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారు. విఫలమయ్యారు. పటిష్ట భద్రత కారణంగా సైబర్ నేరస్తుల ఐసీఎంఆర్ వైబ్ సైట్ నుంచి డేటాను పొందలేకపోయారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
చంద్రబాబుపై ప్రశ్నల వర్షం.. ఆ 6,500 కోట్లు ఏం చేశావ్: సోము వీర్రాజు
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు.. ప్రజల డబ్బంతా వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం ఇచ్చిన రూ. 6,500 కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. రూ. 1800 కోట్లతో కేంద్రం ఎయిమ్స్ నిర్మించింది. అయితే, కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ బాగుందో లేక చంద్రబాబు రాజధాని బాగుందో చర్చకు రావాలి. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. సింగపూర్, మలేషియా, జపాన్ అంటూ దేశాలు తిరిగి వచ్చాడు. వేల కోట్లు ఖర్చు చేశాడు. కానీ.. రాజధానిని మాత్రం ఎందుకు కట్టలేదు’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఆనాడు దానిని అడ్డుకుంది చంద్రబాబే.. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
ఎయిమ్స్‌కు చుక్కలు చూపింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి ఎయిమ్స్‌కు చుక్కలు చూపించారని, ఆ సంస్థ అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అయినా ఆనాడు ఈనాడుకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఎయిమ్స్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, అయినా ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సోమవారం మంగళగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏదైనా సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు మంచి నీరు, కరెంటు, రోడ్లు, డ్రెయినేజీ లాంటి మౌలిక వసతులు కల్పిస్తారని, గత టీడీపీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. 2014 – 19 మధ్య కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ ఏర్పాటుకు భవనాలు నిర్మిస్తుంటే అప్పటి సీఎం చంద్రబాబు అటువైపు కన్నెత్తి చూడలేదని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిమ్స్‌కు సరిపడా మంచి నీరందించేందుకు తాత్కాలికంగా చేయాల్సిందంతా చేస్తూనే, శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోజుకు మూడు లక్షల లీటర్ల నీరు కావాలని ఎయిమ్స్ నుంచి మొదట్లో అభ్యర్థన వచ్చిందన్నారు. ఆమేరకు రోజుకు 3.20 లక్షల లీటర్ల నీటిని మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. మరో లక్ష లీటర్ల నీటిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఎయిమ్స్ విస్తరణలో భాగంగా రోజుకు అదనంగా మరో 3 లక్షల లీటర్లు అవసరమని కోరగా, ఈ నీటిని విజయవాడ కార్పొరేషన్ నుంచి అదనంగా అందజేస్తున్నామన్నారు. అందుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఎయిమ్స్ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా రూ. 7.74 కోట్లతో ఆత్మకూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి రోజుకు 25 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచామన్నారు. ఇందుకు జూలై 26న జీవో నం.534 విడుదల చేశామన్నారు. అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. విద్యుత్ సరఫరాకు రూ. 35 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్‌కు జాతీయ రహదారి నుంచి, మంగళగిరి నుంచి నేరుగా రెండు ప్రధాన రహదారులు నిర్మించామన్నారు. సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు రూ.10 కోట్లకు పైనే ఖర్చయిందన్నారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. 2014–19 మధ్య ఎయిమ్స్‌కు చుక్కలు చూపిన బాబు సర్కార్‌పై ఒక్క వార్త కూడా రాయని రామోజీరావు... తమ ప్రభుత్వం మంచి చేస్తున్నా అబద్ధాలు రాయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర కూడా పాల్గొన్నారు. -
జ్యోతిష్యులకు బంపర్ ఆఫర్, వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ జ్యోతిష్య ప్లాట్‌ఫామ్ ఆస్ట్రోటాక్ స్థూల ఆదాయాన్ని ఏడాదిలో దాదాపు రూ. 400 కోట్లకు రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. 10వేల మంది జ్యోతిష్యులను తన ప్లాట్ఫామ్లో చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గుప్తా వెల్లడించారు. మార్కెటింగ్, సాంకేతికత, శిక్షణ, రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ బృందాలను పెంచడం ద్వారా కంపెనీ ఉద్యోగులను కూడా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా కార్యకలాపాలను, ప్రస్తుత బృందాన్ని పెంచాలని చూస్తున్నాము. మా వద్ద ఉన్న జ్యోతిష్యుల సంఖ్యతో పోలిస్తే వినియోగదరులను (ట్రాఫిక్‌ను) ఆకర్షించడానికి మా మార్కెటింగ్ చాలా మెరుగ్గా ఉంది. మా వెబ్సైట్లో మేము పొందుతున్న ట్రాఫిక్‌ను ప్రస్తుత బృందం నిర్వహించలేకపోతోంది. ఇప్పటికే మా టెక్నాలజీ టీమ్‌లో వ్యక్తులను నియమించుకోవడం ప్రారంభించాము మేము 2022 చివరి నాటికి 10,000 మంది జ్యోతిష్యులతో భాగస్వామి కావాలని చూస్తున్నాము’’ అన్నారు. 3 కోట్ల మంది కస్టమర్లు నమోదు... సొంత వనరులతో అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన తన స్టార్టప్ ప్లాట్‌ఫారమ్, ఇప్పటి వరకు 3 కోట్ల కస్టమర్ సందర్శనలను నమోదు చేసిందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా తాము వ్యాపారం చేస్తున్నామని వెల్లడించారు. అయితే 3,500 కంటే ఎక్కువ జ్యోతిష్యుల సేవలను వినియోగించుకోలేకపోయినట్లు తెలిపిన ఆయన, ఇప్పుడు వీరిని భారీగా భాగస్వాములను చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్ రూ.72 కోట్లు అయితే, సగటున నెలకు రూ.4 కోట్లు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని చెప్పారు. వార్షిక ప్రాతిపదికన దాదాపు రూ.200 కోట్లు అంటే రోజుకు దాదాపు రూ.55 లక్షల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నాన్-జ్యోతిష్యుల సంఖ్య దాదాపు 125గా ఉందని పేర్కొంటూ, మరింత మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. కంపెనీ నాన్-జ్యోతిష్యుల్లో రిక్రూటర్లు, జ్యోతిష్కుల శిక్షకులు, జ్యోతిష్య భాగస్వాములు, కస్టమర్ల కోసం రిలేషన్షిప్ మేనేజర్లు ఉన్నట్లు వెల్లడించారు. -
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్ రామ్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూశారు. 94 ఏళ్ల సుఖ్ రామ్ మే 4న మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మే 7న న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ ఫేస్బుక్ ద్వారా వెల్లడిస్తూ.. సుఖ్ రామ్‌తో కలిసి తన చిన్ననాటి ఫోటోను కూడా శర్మ పోస్ట్ చేశాడు. అయితే, ఆయన ఎప్పుడు తుది శ్వాస విడిచారు అని పోస్ట్‌లో పేర్కొనలేదు. మండి లోక్‌సభ స్థానం నుంచి సుఖ్రామ్ మూడు సార్లు, విధాన సభ నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 1993-1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. -
Yasmeen:అసలు పెళ్లి అవుతుందా అని హేళన.. దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్
Acid Attack Survivor Yasmeen Mansoori: ఎవరో మూర్ఖంగా చేసిన పనికి ముఖం కాలిపోయింది, కళ్లు తెరవలేని పరిస్థితి. అయినా జీవితం మీద ఆశలు వదులుకోలేదు. ఇరవై సర్జరీలు చేయించుకున్నా, ముఖం పూర్వస్థితికి రాలేదు. ఏ మాత్రం నిరాశపడకుండా కష్టపడి చదివి ఏకంగా ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ అయ్యింది యాస్మిన్ మన్సూరి. చిన్నపాటి కష్టాలను సాకులుగా చూపుతూ లక్ష్యం లేకుండా, నిర్లక్ష్యంగా బతుకుతోన్న ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది యాస్మిన్. అది 2004.. ఉత్తర్ ప్రదేశ్‌లో షామిలీ జిల్లాలో ఉంటోన్న యాస్మిన్ వాళ్ల కుటుంబం జీవనం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అప్పుడు యాస్మిన్‌కు పదహారేళ్లు. ఒకరోజు వారిమీద కిట్టని వాళ్లెవరో యాసిడ్ పోశారు. ఈ దుర్ఘటనలో యాస్మిన్ చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది. కళ్లు తెరిచే పరిస్థితి లేదు. తనతోపాటు ఉన్న చెల్లి శరీరం కూడా కాలింది. మంచి వైద్యం తీసుకునేందుకు యూపీ నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు వారిని. కొన్నాళ్లు కుటుంబం మొత్తం అక్కడే ఉంటూ మెరుగైన వైద్యం చేయించుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి వారిది. దీంతో రెండు వారాలకొకసారి ఢిల్లీ వెళ్లడం యాస్మిన్ జీవితంలో ఒక భాగమైంది. చికిత్సలో వాడే మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించడంతో చాలా ఇబ్బందులకు గురైంది. ఈ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్లు ‘‘ఈ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు, వీరికి అసలు పెళ్లి అవుతుందా?’’ అని గుసగుసలాడుకునేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క గుండెల్లో గుచ్చుకునే మాటలు మానసికంగా బలహీన పరిచేవి. కొన్నాళ్లకు ఇలా కాదు. అయ్యిందేదో అయ్యింది. దానిని మార్చలేము కాబట్టి అలాగే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది యాస్మిన్. సేవలు నచ్చి... సఫ్దర్ జంగ్ తర్వాత చికిత్స కోసం ఎయిమ్స్‌కు వెళ్లింది యాస్మిన్. అక్కడ కొంతమంది నర్సులు రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చడంతో తను కూడా నర్స్ అయ్యి సేవలందించాలనుకుంది. అనుకున్న వెంటనే దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్ చదువుతూనే, మరోపక్క కంప్యూటర్ కోర్సు చేసింది. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో బిఏలో చేరింది. ఒకపక్క బిఏ చేస్తూనే ‘జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ’లో నర్సింగ్‌లో చేరింది. అయితే ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవడం వల్ల నర్సింగ్ బాగా కష్టంగా అనిపించేది తనకు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పటికీ నిరాశ పడకుండా తరువాతి ప్రయత్నంలో పాస్ అయ్యింది. ఉత్తమ ఉద్యోగిగా నర్సింగ్ అయిపోయిన వెంటనే 2014లో హకీమ్ అబ్దుల్ అహ్మద్ సెంటెనరీ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ రెండేళ్లు పనిచేసాక, మరో ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ యాస్మిన్ సేవలకు గుర్తింపుగా ‘బెస్ట్ ఎంప్లాయీ అవార్డు’ వచ్చింది. ఒకపక్క ప్రైవేటు హాస్పిటల్స్‌లో చేస్తూనే మరోపక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేది. ఇదే సమయంలో ఎయిమ్స్‌లో నర్సులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది,. అర్హతలన్నీ ఉన్నప్పటికీ డిజెబిలిటీ నిబంధనలకు ఆమె సరిపోదని తిరస్కరించారు. దీంతో యాసిడ్ సర్వైవర్‌ను కూడా డిజెబిలిటీ విభాగంలో చేర్చాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ధర్మాసనం 2016లో డిజెబిలిటీ చట్టంలో కొన్ని సవరణలు చేసి యాసిడ్ సర్వైర్స్‌ను కూడా ఈ చట్టపరిధిలోకి చేర్చింది. దీంతో రెండేళ్ల తరువాత ఎయిమ్స్‌లో ఉద్యోగాన్ని పొంది, ‘‘దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్’’ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ రోగులకు మంచి సేవలందించడంతో ‘ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ పర్సన్’ విభాగంలో ‘బెస్ట్ ఎంప్లాయీ’ అవార్డును అందుకుంది. ‘‘ప్రస్తుతం దేశంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. అమ్మాయిల జీవితంలో పెళ్లి అతిముఖ్యమైన అంశంగా చూస్తారు. అది సరికాదు. పెళ్లికి ముందు మనకెన్నో కలలు ఉంటాయి. వాటిని నిజం చేసుకుని ఆ తర్వాతే, జీవితంలో ముందుకు సాగాలి’’ అని యువతకు చెబుతోంది. -
ప్రతి జిల్లాలో వైద్య కళాశాల
రిషికేశ్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్‌లను నెలకొల్పే దిశగా కృషి కొనసాగుతోందని వివరించారు. పీఎం కేర్స్ ఫండ్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 35 ప్రెషర్ స్వింగ్ అబ్సార్ప్షన్(పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను మోదీ గురువారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ‘ఎయిమ్స్’ ఈ కార్యక్రమానికి వేదికగా మారింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు.. కరోనా మహమ్మారి ఉనికి తొలిసారిగా బయటపడినప్పుడు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉండేదని, ఇప్పుడు వాటి సంఖ్య 3,000కు చేరిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని 10 రెట్లు పెంచామన్నారు. కొత్త ప్లాంట్లతో కలిపి పీఎం కేర్స్ ఫండ్ కింద ఇప్పటిదాకా 1,150 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి జిల్లాకు వీటితో సేవలు అందుతాయన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 93 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 100 కోట్ల మార్కును దాటుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగవంతమైన వ్యాక్సినేషన్ భారత్‌లో కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చేదాకా ప్రభుత్వం ఎదురుచూడడం లేదని, ప్రభుత్వమే వారి వద్దకు వెళ్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లో ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తోందని తెలిపారు. -
మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి
న్యూఢిల్లీ: దేశంలో వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కనీసం 600 మెడికల్ కాలేజీలు, 50 ‘ఎయిమ్స్’ తరహా సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలని అన్నారు. ప్రతి తాలూకాలో కనీసం ఒక వెటర్నరీ ఆసుపత్రి ఉండాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. గడ్కరీ శనివారం మహా రాష్ట్రలో సతారా జిల్లాలోని కరాడ్‌లో కోవిడ్–19 మహమ్మారిపై పోరాడిన యోధులను సన్మానిం చారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను నెలకొల్పేందుకు సహకార రంగం కూడా ముందు రావాలని పిలుపునిచ్చారు. మోదీతో సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. కరోనా తొలినాళ్లలో 13వేల వెంటిలేటర్లుండేవి. దేశంలో వెంటిలేటర్ల కొరత ఉందని తాను చెప్పగా, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని మోదీ ప్రశ్నించారని, ఇప్పుడు భారీగా 2.5 లక్షల వెంటిలేటర్లు ఉండొచ్చని బదులిచ్చానని చెప్పారు. చదవండి: Speaker Om Birla: చట్టసభల గౌరవం పెంచాలి -
ఎయిమ్స్ మాస్టర్‌ప్లాన్‌కు నిధులు
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలోని బీబీనగర్ ఎయిమ్స్‌కు మాస్టర్ ప్లాన్ మంజూరు చేసిన కేంద్రం, నిర్మాణ పనుల కోసం రూ.799 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లో ఈ నెల 23న ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన జారీచేసింది. ఈపీసీ పద్ధతిలో ఈ టెం డర్లను ఆహ్వానించారు. ఎయిమ్స్‌లో రూ. 776.13 కోట్లతో నూతనంగా భవనాల నిర్మాణం చేపట్టను న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు కేటాయించిన ఖాళీ స్థలంలో కేంద్రం ఆమోదించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం 24 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి. అలాగే ఆపరేషన్, నిర్వహణ కోసం రూ.23.50 కోట్లు కేటాయించారు. ఏ, బీ విభాగాలుగా పనులు విభజించి ఈనెల 23 నుంచి బిడ్ డాక్యుమెంట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఆగస్టు 4 వరకు టెండర్లలో ఉన్న సందేహాలు ఈ మెయిల్ లేదా వెబ్సైట్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెండర్ వేయడానికి ఆగస్టు 25 తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు చివరి గడువు కాగా, ఆగస్టు 26న మధ్యాహ్నం 3 గంటలకు ఈ బిడ్లను తెరుస్తారు. కాగా, ఎయిమ్స్‌కు కేంద్రం నిధులు మంజూరు చేయడం పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి సహకారంతోనే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతోనే బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులు మంజూరయ్యాయని యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు చెప్పారు. ఇటీవల కిషన్‌రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా మాస్టర్‌ప్లాన్ టెండర్లు వేస్తారన్న విషయాన్ని వెల్లడించారన్నారు. -
సెప్టెంబర్‌కల్లా పిల్లలకు వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: భారత్‌లో పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఈ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అదే జరిగితే కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదో ముఖ్య ఘట్టంగా మారుతుందని అన్నారు. జైడస్ క్యాడిలా కంపెనీ జైకోవ్–డీ పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తి చేసి డేటా కూడా సమర్పించిందని, అత్యవసర అనుమతి కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ (2–18 ఏళ్ల లోపు పిల్లలకు) ఆగస్టు లేదంటే సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతాయని, అదే సమయానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌కు సెప్టెంబర్ నాటికి వస్తే వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టవచ్చునని గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వివిధ వార్తా సంస్థలకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఇప్పటివరకు 42 కోట్లకు పైగా టీకా డోసుల్ని ఇచ్చారు. ఇంచుమించుగా 6% జనాభా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై ఇన్నాళ్లయినా 18 ఏళ్ల లోపు వారికి మాత్రం టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. పశ్చిమ దేశాల్లో పిల్లలకి ఫైజర్ టీకా ఇప్పటికే ఇవ్వడం మొదలుపెట్టగా... మోడర్నా వ్యాక్సిన్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా 18 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో చురుగ్గా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి పిల్లల కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లే అందుబాటులోకి వస్తాయని గులేరియా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి 18–30 శాతం పెరగడానికి 11–17 ఏళ్ల వయసు వారే కారణమని, వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారని ఇటీవల లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో తేలింది. భారత్‌లో పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైతే వైరస్ వ్యాప్తికి గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. బూస్టర్ డోస్ అవసరమే కరోనా వైరస్‌లో తరచూ జన్యుపరంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో భవిష్యత్‌లో బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని గులేరియా చెప్పారు. కరోనా వ్యాక్సిన్లు ప్రభావం తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తే సెకండ్ జనరేషన్ కోవిడ్–19 వ్యాక్సిన్ల (బూస్టర్ డోసులు) అవసరం వస్తుందని అన్నారు. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరి నాటికి బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని, అందుకే అప్పటికల్లా జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని గులేరియా చెప్పారు. -
మూడో వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే..
న్యూఢిల్లీ: మనుషుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం, మరింత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ వేరియంట్ పుట్టుకురావడం, లాక్డౌన్ నిబంధనల్లో విచ్చలవిడిగా సడలింపులు ఇవ్వడం వంటి కారణాలు మూడో వేవ్ ముప్పునకు కారణమయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటి చర్యలతో కరోనా థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు. మూడో వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే ఉందన్నారు. తదుపరి కరోనా వేవ్ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగినట్లు పేర్కొన్నారు. అన్ని ఆంక్షలను ఎత్తివేస్తే, రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే కరోనా వేరియంట్ తప్పించుకోగలిగితే రెండో వేవ్ కంటే మూడో వేవ్ ఉధృతి అధికంగా ఉంటుందని వెల్లడించారు. కొన్ని ఆంక్షలను కఠినంగా అమలు చేస్తే కరోనా మహమ్మారి సైతం నియంత్రణలోనే ఉంటుందని, పాజిటివ్ కేసులు పెరగవని రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. మరికొన్ని ఆంక్షలు, నిబంధనలను అమల్లోకి తీసుకొస్తే కేసుల సంఖ్య క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కరోనాలో కొత్త వేరియంట్లు పురుడుపోసుకున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
పిల్లలకు టీకా వస్తే స్కూళ్లు తెరుచుకోవచ్చు
న్యూఢిల్లీ: చిన్నారులకు సైతం కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అదొక గొప్ప ఘనత అవుతుందని, పాఠశాలలు మళ్లీ తెరవడానికి మార్గం సుగమమవుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. పిల్లల కోసం టీకా వస్తే వారికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా కోవాగ్జిన్‌ను 2–18 ఏళ్లలోపు వారిపై పరీక్షించారని, రెండో, మూడో దశ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి రాగానే దేశంలో పిల్లలకు కరోనా టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకంటే ముందే ఫైజర్ టీకాకు అనుమతి లభిస్తే పిల్లలకు అదికూడా ఒక ఆప్షన్ అవుతుందన్నారు. జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్–డి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసిందని, భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం త్వరలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జైకోవ్–డి టీకాను పెద్దలతోపాటు 12–18 ఏళ్లలోపు పిల్లలు సైతం తీసుకోవచ్చని గులేరియా తెలిపారు. చిన్నారులకు కరోనా వైరస్ సోకినప్పటికీ చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటివారు కరోనా వాహకులుగా (క్యారియర్లు) మారుతున్నారని అన్నారు. దేశంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారు 13 కోట్ల నుంచి 14 కోట్ల మంది ఉంటారని, వీరందరికీ కరోనా టీకా ఇవ్వడానికి 25 కోట్ల నుంచి 26 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
ఏదేమైనా పిల్లలకు టీకా కావాల్సిందే: ఎయిమ్స్ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. లేదంటే కోవిడ్ స్వల్ప లక్షణాలు లేక లక్షణాలు లేని పిల్లలు క్యారియర్లుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని గులేరియా చెప్పారు. కరోనా వైరస్ ఇప్పటి వరకు పిల్లలను పెద్దగా ప్రభావితం చేయకపోయినా, రాబోయే రోజుల్లో ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్.. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా సెప్టెంబర్ నాటికి అందుబాటులో వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్ కన్నా ముందు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశముందని అది కూడా పిల్లలకు మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసర వినియోగానికి జైడస్ క్యాడిలా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేయనుందనే వార్తల నేపథ్యంలో గులేరియా స్పందించారు. జైడస్ క్యాడిలా మరొక ఆప్షన్‌గా ఆయన అభివర్ణించారు. చదవండి: కోడలిపై పోలీస్ మామ అత్యాచారం.. -
వ్యాక్సిన్ మిక్సింగ్‌పై మరింత డేటా కావాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ రెండు డోసుల్లో... ఒకటి ఒక కంపెనీ, మరొకటి మరో కంపెనీ (మిక్స్ అండ్ మ్యాచ్ టీకా విధానం) వేసుకోవడం వల్ల యాంటీబాడీలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. అయితే దీనిపై లోతైన అధ్యయనాలు చేయాలని, మరింతగా సమాచారాన్ని సేకరించాల్సి ఉందని చెప్పారు. భవిష్యత్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, అందువల్ల ఏయే కంపెనీల కాంబినేషన్లు బాగా పని చేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం ఈ దిశగా అధ్యయనం చేస్తోందని... కొద్ది నెలల్లోనే ఫలితాలు వస్తాయని తెలిపారు. బ్రిటన్‌లో ప్రయోగాత్మకంగా ఒక టీకా డోసు ఆస్ట్రాజెనికా (కోవిషీల్డ్) రెండో డోసు ఫైజర్ ఇచ్చిన వారిలో సైడ్ అఫెక్ట్‌లు కనిపించాయని లాన్సెట్ జనరల్ నివేదిక వెల్లడిస్తే, ఈ రెండు కంపెనీల టీకా డోసుల్ని ఇస్తే మరింత సామర్థ్యంగా పని చేశాయని స్వానిష్ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా ప్లస్ వేరియెంట్‌కు పనిచేయవని జరుగుతున్న ప్రచారాన్ని గులేరియా కొట్టి పారేశారు. ఇలాంటి భయాలు పెట్టుకునే బదులుగా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. సింగిల్ డోసు వ్యాక్సిన్ డెల్టా వేరియెంట్‌పై 33 శాతం పని చేస్తుందని, అదే రెండు డోసులు తీసుకుంటే 90 శాతం రక్షణ వస్తుందని వెల్లడైన అధ్యయనాలపై గులేరియా ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ ప్రజలకి వీలైనంత త్వరగా బూస్టర్ డోసు ఇచ్చే కార్యక్రమం మొదలుకావాలని ఆకాక్షించారు. -
6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని, రాబోయే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ ప్రారంభం అయ్యే అవకాశాలు న్నాయని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. కరోనా మూడో వేవ్ కొన్ని నెలల్లో రావచ్చని అనేకమంది నిపుణులు హెచ్చరించిన పరిస్థితుల్లో గులేరియా అప్రమత్తంచేయడం గమనార్హం. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడ కుండా ఉండటం లాంటి జాగ్రత్తలను ఏమేరకు అవ లంభిస్తారనే దానిపై థర్డ్ వేవ్ రాక ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రజలు బయటికి రావడం, కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం, ఒకే దగ్గర గుమిగూడడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్ వేవ్స్ నుంచి ప్రజలు ఏమీ నేర్చుకున్నట్లు లేదు’ అని ఆయన అన్నారు. డెల్టా వేరియంట్ ప్రభావం ‘ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ గతంలోని వేరియంట్స్‌తో పోలిస్తే మరింత బలమైంది. దీని సంక్రమణ వేగం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. యూకేలో డెల్టా వేరియంట్ మ్యూటేషన్ చెందుతోంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వేవ్స్ మధ్య గ్యాప్ తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. అధునాతన పరిశోధనశాలలు వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో చూడటానికి మనకు అగ్రెసివ్ జీనోమ్ సీక్వెన్సింగ్ అవసరం. వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుందా, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స పని చేస్తుందా? అనే డేటాను అధ్యయనం చేసేందుకు అధునాతనమైన పరిశోధనశాలల వ్యవసలు ఉండాలి. పాజిటివిటీ రేటు 5% దాటితే మినీ లాక్డౌన్ ‘ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఏ ప్రాంతంలోనైనా 5% మించి పాజిటివిటీ రేటు నమోదైతే మినీ లాక్డౌన్ విధించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. హాట్స్పాట్లలో కరోనా టెస్ట్‌లు చేయడం, సంక్రమణ ట్రాకింగ్‌తో పాటు చికిత్సపై దృష్టి పెట్టాలి’ అని గులేరియా అన్నారు. కొత్త వ్యూహాలను అనుసరించాలి ‘కరోనా కొత్త వేవ్ ప్రభావం మొదలుకావడానికి సాధారణంగా మూడు నెలలు పడుతుంది. కానీ వివిధ అంశాల ప్రభావంతో తక్కువ సమయంలో దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటించాలి. బయటి వేరియంట్ భారత్‌లో వ్యాప్తి చెంది పరివర్తన చెందింది. అందుకే కరోనా హాట్స్పాట్లపై నిఘా పెంచాలి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్‌ల మధ్య అంతరాల పెరుగుదల తప్పేం కాదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరించాలి’ -
పిల్లలపై... థర్డ్‌వేవ్ ప్రభావానికి ఆధారాల్లేవ్!
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్ కోవిడ్–19 కమిషన్ ఇండియా టాస్క్‌ఫోర్స్ నివేదిక తేల్చిచెప్పింది. ‘భారతీయ పిల్లల్లో కోవిడ్ 19’ అనే అంశంపై పరిశోధన జరిపేందుకు లాన్సెట్ ఇండియా సంస్థ ఎయిమ్స్‌లోని ప్రముఖ పీడియాట్రిషన్ల్ల(చిన్నపిల్లల వైద్య నిపుణులు)తో కూడిన ఒక బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం పిల్లలలో థర్డ్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేందుకు ఆధారాలేమీ లభించలేదని వివరించింది. ‘కోవిడ్ సోకిన చిన్నారుల్లో ఎక్కువమంది ఎలాంటి లక్షణాలను కనబరచరు(ఎసింప్టమాటిక్), మిగిలినవారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో అధికులు స్వల్ప జ్వరం, శ్వాస సమస్యలు, ఉదర సమస్యలు ఎదుర్కొంటారు. వయసులవారీగా చూస్తే లక్షణాలు చూపే పిల్లల సంఖ్య వయసు పెరిగేకొద్దీ పెరుగుతుంది’అని బృంద నివేదిక తెలిపింది. లక్షలో ఒక్కరు.. అధ్యయన వివరాలను అనువర్తిస్తే లక్షమంది పిల్లల్లో కేవలం 500 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 2 శాతం మంది మాత్రమే మరణించడం జరిగింది. ‘లక్ష మంది పిల్లల్లో కోవిడ్ మరణాలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి’ అని బృందం సభ్యుడు డాక్టర్ సుశీల్ కాబ్రా చెప్పారు. ‘ గణాంకాల ప్రకారం చూస్తే కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువని కానీ, పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతారనేందుకు కానీ సరైన ఆధారాలేవీ లేవు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువ, మరణాల రేటు కూడా తక్కువే’ అని వివరించారు. ఒబేసిటీ, ఆస్థమా, శ్వాస సమస్యలు, పెరుగుదల సమస్యలు, గుండె సమస్యలు, కాన్సర్, ఇమ్యునిటీ వ్యాధులు రిస్కు కారకాలని నివేదిక తెలిపింది. అలాగే తీవ్రత తక్కువని నిర్లక్ష్యం చేయకుండా, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి మౌలిక వసతులు పెంచడం, ఆక్సీజన్ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవడం, మందుల కొరత నివారించడం తదితర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించింది. -
vaccine: పిల్లలపై ఎయిమ్స్ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందన్న అంచనాల మధ్య ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు టీకాను అందించే ప్రక్రియను వేగవంతం చేసింది. పిల్లలపై కరోనా టీకా కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈమేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతితోపాటు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆమోదం కూడా పొందింది. సోమవారం (జూన్ 7) నుండి స్క్రీనింగ్ ప్రారంభించనుంది. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.12 నుంచి18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. రివర్స్ ఆర్డర్లో ఎంపిక చేసిన చిన్నారులను మొదటి టీకా డోస్ ఇవ్వనున్నామని ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు, అనంతరం 2-6 సంవత్సరాల పిల్లలకు పరీక్షలకు నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే 2 నుండి 18 సంవత్సరాల పిల్లలకు టీకా పరీక్షలు జూన్ 3 నుంచి బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయని ఎయిమ్స్ పాట్నా సూపరింటెండెంట్ , ప్రిన్సిపల్ ట్రయల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సింగ్తె తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ టీకా మొదటి డోసును ఇప్పటివరకు 10 మంది పిల్లలు స్వీకరించారు. మరో 28 రోజుల్లో రెండవ మోతాదు పొందనున్నారు. కోవాక్సిన్ ట్రయల్ టీకాను కనీసం 100 మంది పిల్లలకు ఇవ్వాలనేది లక్ష్యం. ఢిల్లీ ,పాట్నా ఎయిమ్స్‌తోపాటు, మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాగ్‌పూర్ కేంద్రాలు ఈ పరీక్షల కోసం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలోఉన్నాయి. చదవండి : వారి కోసం స్టెప్పులేసిన డాక్టర్లు: వీడియో వైరల్ Petrol, diesel price today: కొనసాగుతున్న పెట్రో సెగ -
Coronavirus: డేంజరస్ డెల్టా ఒళ్లంతా తిష్ట!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2 కోడ్‌తో ఉన్న వేరియంట్‌ను డెల్టాగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ మానవ శరీరంలోకి ప్రవేశించాక అవయవాలపై వేగంగా ప్రభావాన్ని చూపడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మంది ఆస్పత్రిపాలయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది మరణం అంచులవరకు వెళ్లి వచ్చారు. కొందరిలో అవయవాలు దెబ్బతినగా, మరికొందరు జీవితకాల వ్యాధులైన బీపీ, షుగర్ బారినపడ్డారు. మొదటి దశ, రెండో దశలో ఆస్పత్రిలో చేరి.. వారు ఎదుర్కొన్న సమస్యలు, వైరస్ ప్రభావం తదితర అంశాలపై రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధన చేసింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల రోగులను ఎంపిక చేసుకుని పరిశీలించి ఆ నివేదికను విడుదల చేసింది. అన్ని అవయవాలపైనా ప్రభావం... మొదటి దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫె„క్షన్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ, రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర కీలకమైన అవయవాలపై వైరస్ ప్రతాపాన్ని చూపింది. వీలైనంత ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసుకుని వైరస్ వ్యాప్తి చెందిన శరీరాన్ని గుల్ల చేసింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మూత్రపిండాలపై ప్రభావం ఆరు రెట్లు అధికంగా ఉంది. కాలేయంపై చూపిన ప్రభావం గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. లివర్‌లోకి వైరస్ వ్యాప్తి చెందడంతో ఆ అవయవం విడుదల చేసే ఎంజైమ్స్ రెట్టింపు చేసి సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు. దేశంలో కోవిడ్ బారినపడ్డ 70 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. బి.1.617.2 రకానికి చెందిన ఈ వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. డెల్టా వేరియంట్ తెల్ల రక్తకణాల్లోని లింపోసైట్లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తిని ముందుగా లక్షణాలతో గుర్తించి చికిత్స తీసుకున్న వారు ఇంటివద్దే కోలుకుంటుండగా... కాస్త నిర్లక్ష్యం చేసినా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దీని నియంత్రణకు వైద్యులు శ్రమించాల్సి వస్తోంది. మొదటి దశ, రెండో దశలో సివియర్ పేషంట్లలో పరిస్థితి ఇలా(గణాంకాలు శాతాల్లో)... కేటగిరీ మొదటి దశ రెండో దశ ఎస్పీఓ2 సగటు 92 85.5 ఫీవర్ 30 85 దగ్గు 14 78 గొంతులో గరగర 11 05 దమ్ము 15 80 నీరసం 9.5 19.6 లూస్మోషన్స్ 11 5 ► మొదటిదశ చికిత్సలో స్టెరాయిడ్లను 4 శాతం మందికే వాడగా... రెండో దశకు వచ్చే సరికి 72 శాతం మందికి ఇచ్చారు. ఇక యాంటిబయోటిక్స్ వినియోగం రెట్టింపు అయ్యింది. ►బాక్టీరియల్ న్యుమోనియా 1.1 శాతం నుంచి 9 శాతానికి పెరగగా, సివియర్ వైరస్ న్యుమోనియా 6 శాతం నుంచి ఏకంగా 49 శాతానికి ఎగబాకింది. ►సీటీ స్కాన్‌లో స్కోర్ గతేడాది కంటే ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడంతో ఆక్సిజన్ స్థాయిలు భారీగా పడిపోయాయి. కరోనా తొలి దశలో 12 శాతం మందికే ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరంపడగా... రెండో దశలో ఏకంగా 82 శాతానికి పెరిగింది. రెమిడెసివిర్ వినియోగం మొదటి దశలో ఒక శాతం కంటే తక్కువ ఉండగా... ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన 12 శాతం మంది వినియోగించారు. సివియర్ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో గతేడాది 90 శాతం మంది డిశ్చార్జ్ కాగా.. సెకండ్ వేవ్‌లో 71శాతం మందే డిశ్చార్జ్ అయినట్లు గుర్తించారు. ఈ లెక్కన మొదటి దశలో నమోదైన మరణాల రేటుతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారిలో 2.6 శాతం మందికే వెంటిలేటర్ అవసరపడగా ఈసారి 41 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది. పరిశోధన సాగిందిలా... మొదటి దశ కోవిడ్‌కు సంబంధించి గత ఏడాది ఏప్రిల్, మే, జూన్లలో ఎయిమ్స్‌లో అడ్మిట్ అయిన 106 మంది రోగులు.. రెండో దశ తీవ్రంగా ఉన్న ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో చేరిన 104 మందిపై పరిశీలన చేశారు. మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలుగా కోవిడ్‌ను విభజించి.. వీరిలో వైరస్ చూపిన ప్రభావం, అందించిన చికిత్సను పరిశీలించారు. తొలి దశలో లక్షణాలు లేకున్నా ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం మోడరేట్ స్టేజి దాటే క్రమం, సివియారిటీకి వచ్చిన తర్వాతే ఆస్పత్రుల్లో చేరారు. . తొలిదశలో 37.5% మందే ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం 70% మంది చేరారు. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారి సగటు వయసు 37 యేళ్లు కాగా, ప్రస్తుతం 50.5 యేళ్లు. -
Black Fungus: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బ్లాక్ ఫంగస్ సంక్రమణపై ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి ఏమాత్రం కాదని, కరోనా మాదిరిగా ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించదని ఆయన పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ డయాబెటిస్ రోగికి మ్యూకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గులేరియా సోమవారం తెలిపారు. దేశంలో మ్యూకోర్మైకోసిస్ కేసులు వేగంగా పెరుగుతున్నందున, ఈ వ్యాధిని విస్మరించలేమని అన్నారు. ఈ సంక్రమణకు చికిత్సను ప్రారంభంలోనే మొదలుపెడితే ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తి దగ్గర కూర్చోవడం వల్ల ఇతరులకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాపించదని ఆయన స్పష్టం చేశారు. డయాబెటిస్ లేని వారిపై తక్కువ ప్రభావం మధుమేహం లేని, కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్ తీసుకోని రోగుల్లో మ్యూకోర్మైకోసిస్ ప్రభావం చాలా తక్కువగా ఉందని డాక్టర్ గులేరియా తెలిపారు. బ్లాక్ ఫంగస్ ఆక్సిజన్ ద్వారా వ్యాపించదని, ఫంగస్ ఉన్నవారిలో 92–95% మందికి డయాబెటిస్ లేదా స్టెరాయిడ్ వాడకం ఉందని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ సంక్రమణకు ఆక్సిజన్ కారణమనేది ఒక పెద్ద అంశం కాదని, పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు దుందుడుకు వైఖరితో ఆపరేషన్ చేయడం కారణంగా రోగి మరణించే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. బ్లాక్ ఫంగస్ ఉన్న కరోనా రోగులకు నెగెటివ్ వస్తే వారిని వేరే వార్డుకు మార్చాల్సి ఉంటుందన్నారు. వారికి వైద్య సాయం కొనసాగాలి కరోనా నుంచి కోలుకొనే వారితో పాటు కోలుకున్న వారికి సైతం కొన్ని వారాల పాటు వైద్య సహాయం అవసరమని డాక్టర్ గులేరియా అన్నారు. 4–12 వారాల పాటు కరోనా లక్షణాలు కనిపిస్తే, దీనిని ఆన్‌గోయింగ్ సింప్టమాటిక్ కోవిడ్ లేదా పోస్ట్–అక్యూట్ కోవిడ్ సిండ్రోమ్ అని అంటారని తెలిపారు. 12 వారాల కంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే, దీనిని పోస్ట్–కోవిడ్ సిండ్రోమ్ లేదా నాన్–కోవిడ్ అంటారని డాక్టర్ గులేరియా వివరించారు. కోలుకున్న వారిలో ఊపిరితిత్తుల పనితీరు, సామర్థ్యం సాధారణంగానే ఉన్నప్పటికీ శ్వాసలో ఇబ్బంది, దగ్గు, ఛాతీనొప్పి, పల్స్ రేటులో పెరుగుదల వంటి లక్షణాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ లక్షణాలు పోస్ట్ కోవిడ్ సమయంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కారణంగా ఉంటాయని ఆయన వివరించారు. కోలుకున్న వారిలో కనిపించే మరో సాధారణ లక్షణం క్రొనిక్ ఫెటీగ్ సిండ్రోమ్. ఇందులో కీళ్ల నొప్పులు, అలసటతో శరీరం నొప్పి, తలనొప్పి ఉంటుందని గులేరియా పేర్కొన్నారు. అందుకే ఈ వైరల్ వ్యాధి నుంచి కోలుకున్నవారికి పునరావాసం కల్పించేందుకు మల్టీ–డిసిప్లినరీ పోస్ట్–కోవిడ్ క్లినిక్‌ల అవసరం ఎంతో ఉందని ఆయన సూచించారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు రంగుల పేర్లు వద్దు ఫంగల్ ఇన్ఫెక్షన్లను రంగుల పేర్లతో కాకుండా, మెడికల్ పరిభాషలోని పేర్లతోనే గుర్తించడం మంచిదని గులేరియా వ్యాఖ్యానించారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ ఈ ఇన్ఫెక్షన్లను గుర్తించడంతో గందరగోళానికి అవకాశముందన్నారు. శరీరంలో ఆ ఫంగస్ పెరిగే ప్రదేశంపై ఫంగస్ రంగు అనేది ఆధారపడి ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్‌గా పిలిచే మ్యుకర్‌మైకోసిస్ వైట్ కలర్ ఫంగల్ కాలనీల్లో బ్లాక్ డాట్స్‌తో ఉంటుందన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మ్యుకర్‌మైకోసిస్, క్యాండిడా, ఆస్పర్జిల్లస్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయని గులేరియా తెలిపారు. థర్డ్ వేవ్‌లో చిన్నారులకు ముప్పు సూచనల్లేవ్ దేశంలో మరికొన్ని నెలల్లో కోవిడ్–19 థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలే వైరస్ బారినపడతారన్న వాదనల్లో వాస్తవం లేదని గులేరియా చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్‌లో చిన్నారులు తీవ్రం గా ప్రభావితం అవుతారని, ఎక్కువ మం దికి వైరస్ సోకుతుందని చెప్పడానికి ఎలాంటి సూచనలు, ఆధారా ల్లేవని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటా యని చెప్పారు. ఒకవేళ వారు వైరస్ బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలే కనిపిస్తాయని, చికిత్సతో వారు ఆరోగ్యవంతులవుతారని వివరించారు. . -
స్టెరాయిడ్ల వల్లే బ్లాక్ ఫంగస్ ముప్పు
సాక్షి,, న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్లను అధికంగా వాడటం వల్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనాతో పాటు ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న మ్యూకోర్మైకోసిస్ కేసులను నియంత్రించేందుకు ఆయన పలు సూచనలు చేశారు. కోవిడ్ రోగులలో కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రాబల్యం ప్రస్తుతం పెరిగిందని, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు కరోనా బారిన పడటం వలన మ్యూకోర్మైకోసిస్ ప్రమాదం పెరుగుతుందని గులేరియా అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో వ్యాధి తీవ్రత చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, స్పష్టమైన సంకేతాలు లేనప్పటికీ స్టెరాయిడ్లను ఎక్కువ మోతాదులో ఉపయోగించడం ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందన్నారు. లక్షణాలు లేని రోగులకు అధిక మోతాదులో స్టెరాయిడ్లు ఇస్తే, వారికి రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మ్యూకోర్మైకోసిస్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిని నివారించేందుకు..రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రించుకోవాలని, స్టెరాయిడ్స్ వాడుతున్నవారు రోజూ వారి రక్తంలో షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలని తెలిపారు. ముడి ఆహారాన్ని తినడం ద్వారా మ్యూకోర్మైకోసిస్ వ్యాప్తి చెందుతోందనే విషయం ధృవీకరించడానికి ఎలాంటి డేటా లేదని వివరించారు. అదే సమయంలో కోవిడ్ చికిత్స సమయంలో ఆక్సిజన్ వాడకంతో బ్లాక్ ఫంగస్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కొందరు కరోనా రోగుల్లోనూ బ్లాక్ ఫంగస్‌ను ధృవీకరిస్తున్నారని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. -
బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది
-
Black Fungus: బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్ అనే అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వారికి ఈ ఫంగస్ సోకుతుండటం ప్రస్తుత సెకండ్ వేవ్‌లోనే కనిపిస్తోందన్నారు. మ్యుకోర్‌మైకోసిన్(బ్లాక్ ఫంగస్) బారినపడే వారిలో 90 శాతం మంది డయాబెటిస్ బాధితులే ఉంటున్నారన్నారు. వీరి రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలిస్తూ నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించారు. శనివారం జరిగిన క్లినికల్ ఎక్స్‌లెన్స్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో ఈ మేరకు రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారులను డాక్టర్ గులేరియా అప్రమత్తం చేశారు. డయాబెటిస్ పేషెంట్లు, స్టెరాయిడ్లు తీసుకునే వారే ఎక్కువగా మ్యుకోర్‌మైకోసిన్ బారిన పడుతున్నట్లు ప్రస్తుతం పెరుగుతున్న కేసులను బట్టి తెలుస్తోందన్నారు. స్టెరాయిడ్ల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి దారి తీస్తోందని తెలిపారు. గుజరాత్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 500కు పైగా మ్యుకోర్‌మైకోసిన్ కేసులను గుర్తించినట్లు అక్కడి వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు. కోవిడ్ పేషెంట్ల చికిత్సలో వాడుతున్న టోసిలిజుమాబ్ అనే ఔషధం ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుందా అనే విషయాన్ని గుజరాత్ వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపారు. కోవిడ్‌బారిన పడిన తర్వాత కూడా డయాబెటిస్ పేషెంట్లు తమకు సూచించిన మందులు వాడకం కొనసాగించాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ శనివారం తెలిపారు. -
పడగ విప్పుతోన్న బ్లాక్ ఫంగస్
-
సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదనలను ఖండించిన ఐఆర్‌ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ లేదా సీటీ స్కాన్లు చాలా హానికరం అన్న ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా వ్యాఖ్యలపై ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ స్పందించింది. ఒక్క సీటీ స్కాన్ 300-400ఎక్స్-రేలకు సమానమని, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్న వాదనలు చాలా ఔట్ డేటెడ్ సిద్ధాంతమని అసోసియేషన్ కొట్టి పారేసింది. ఈ వాదన 30-40 సంవత్సరాల క్రితం నాటిదని ఐఆర్‌ఐఏ పేర్కొంది 5-10 ఎక్స్-కిరణాలతో పోల్చదగిన రేడియేషన్‌ను విడుదల చేసే అత్యాధునిక స్కానర్లు ఇపుడు అందుబాటులోకి వచ్చాయంటూ గులేరియా వ్యాఖ్యలను అసోసియేషన్ ఖండించింది. గులేరియా వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవి, బాధ్యతా రహితమైనంటూ అసోసియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి. అమర్నాథ్ సంతకంతో ఒక ప్రకటన విడుదల చేసింది. సిటీ ఛాతీ స్కాన్ క్యాన్సర్‌కు కారణమవుతుందనే ప్రకటన ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియాలజిస్టులు అలారా (ఏఎల్‌ఏఆర్‌ఏ: సహేతుకంగా సాధించగలిగినంత తక్కువ) సూత్రాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. దీన్నుంచి వచ్చే రేడియేషన్ ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి గురయ్యే రేడియేషన్‌కు సమానమని కూడా తెలిపింది. (అలర్ట్: సీటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశం..) కోవిడ్ సోకిన వారు వివిధ రకాల లక్షణాలతో బాధపడుతున్నారనీ, తక్కువ వైరల్ లోడ్ కారణంగా, ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ వచ్చినా, ఊపిరితిత్తులు కొందరిలో పాడైపోతున్నాయని, ఇలాంటి సమయంలో సిటీ స్కాన్ అవసరం చాలా ఉందని పేర్కొంది. అంతేకాదు ప్రారంభ దశలో ఊపిరితిత్తుల పనితీరును గుర్తించే పల్స్ ఆక్సీమీటర్ కంటే సీటీ స్కాన్లు అత్యంత సున్నితమైనవి ఐఆర్ఐఎ తెలిపింది. ముఖ్యంగా కరోనా సెకండ్‌వేవ్‌లో యువకులు హ్యాపీ హైపోక్సియా (ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం) తోబాధపడుతున్నారని ఈక్రమంలో ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, రోగిని కాపాడటం అంత సులభమని వెల్లడించింది. తద్వారా వ్యాధి తీవ్రతను ముందస్తుగా గుర్తించడంతోపాటు, తొందరగా చికిత్సను ప్రారంభించడానికి సహాయపడుతుందని తెలిపింది.అలాగే వారు సూపర్-స్ప్రెడర్లు కాకుండా నిరోధించగల. సిటీ స్కాన్ ద్వారా బాధితులు ఆసుపత్రిలో చేరాలా, లేదా ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందితే సరిపోతుందా అనేది తెలుసుకోవచ్చు. వైరస్ తీవ్రతను, అతి విస్తరిస్తున్న తీరును పర్యవేక్షించవచ్చు, ముఖ్యంగా తీవ్ర లక్షణాలున్నవారిలో సిటీ స్కాన్ పాత్ర అనూహ్యం. సరైన సమయంలో స్టెరాయిడ్లను ప్రారంభించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపింది. అలాగే ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత లాంటి సంక్షోభంనుంచి బయటపడవచ్చని స్పష్టం చేసింది. (కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు) కాగా ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలతో సమానమని, దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించారు. అవసరమైతే తప్ప సీటీ స్కాన్ల జోలికి వెళ్లొద్దని సూచించిన సంగతి తెలిసిందే. -
ఉన్నచోటే ఉండిపోకండి కొత్తవి నేర్చుకోండి
గౌరికి నది ఇరుకై పోయింది. సముద్రంలోకి వెళ్లింది. నది అంటే న్యూఢిల్లీ లోని ‘ఎయిమ్స్’. అందులో డెంటిస్ట్ గౌరి. సముద్రం అంటే న్యూయార్క్‌లోని డబ్ల్యూ.ఎం.ఎస్.! పన్నెండేళ్లుగా పసిఫిక్ మహా సముద్రం లాంటి ఆ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇష్టంగా ఈతకొడుతూ ఉన్నారు గౌరీ. అందులోని అన్ని డిపార్ట్మెంట్ల పని నేర్చుకుని, అన్ని డిపార్ట్మెంట్లకు టీమ్ లీడర్‌గా చేశారు. ఆపరేషన్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్సా్ఫర్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్.. అన్నీ నేర్చుకున్నారు. పసిఫిక్ సముద్రం అన్ని ఖండాలను టచ్ చేస్తూ ఉన్నట్లుగానే సముద్రం లాంటి తన కంపెనీలో అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు గౌరి. ప్రస్తుతం ఆమె ఆ కంపెనీలోనే హెల్త్ కేర్ విభాగానికి బిజినెస్ యూనిట్ లీడర్ గా ఉన్నారు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మనం నిరర్థకంగా ఒడ్డున పడ్డట్లేనని అంటారు గౌరి పురి. ఉన్నచోటే ఉండి పోవద్దంటారు. గౌరీపురి తన ఈడు పిల్లల్లో కాస్త భిన్నంగా ఉన్న అమ్మాయి. కనుక ఇప్పుడూ భిన్నంగానే ఉన్నారని అనుకోవచ్చు. పదేళ్ల వయసులోని ఆమె భిన్నత్వం గురించి మొదట తెలుసుకుందాం. పిల్లలు ఆటలు ఆడే వయసులో కిందపడటం, దెబ్బలు తగలడం, అప్పుడప్పుడు రక్తం వారి కంట పడటం సహజంగా జరిగేదే. అప్పుడు మిగతా పిల్లలు భయంతో కళ్లు మూసుకుంటే గౌరి మాత్రం ఏ మాత్రం బెదురు లేకుండా ఆ దెబ్బలు తగిలిన పిల్లలకు గాయం దగ్గర తుడిచి, శుభ్రం చేసేవారట. ‘‘ప్రాథమిక చికిత్స వంటిది అనుకోండి’’ అని ఇప్పుడా సంగతులను నవ్వుతూ గుర్తు చేసుకుంటారు గౌరి. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఉంటుంది వాళ్ల కుటుంబం. గౌరి అక్కడే పుట్టి పెరిగారు. 21వ యేట న్యూఢిల్లీలోని ‘ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్’లో డెంటల్ సర్జన్‌గా తనకో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె అక్కడ పని చేసింది రెండున్నరేళ్లే. తర్వాత ఆర్నెల్లు సెలవు పెట్టి.. ‘నది కాదు నాకు కావలసింది, సముద్రం’ అని అనుకుని న్యూ ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లి డబ్లు్య.ఎన్.ఎస్. కంపెనీలో చేరిపోయారు! డబ్లు్య.ఎన్.ఎస్. అంటే వరల్డ్ నెట్వర్క్ సర్వీసెస్. బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్లు 1996లో ముంబైలో ప్రారంభించిన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ అది. ప్రపంచం అంతటా బ్రాంచీలు ఉన్నాయి. గౌరి కోరుకున్నట్లుగా నిజంగా అది సముద్రమే. 2007లో అందులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. డెంటల్ సర్జన్కి బిజినెస్ మేనేజ్మెంట్తో ఏం పని? యూఎస్ మార్కెట్లో హెల్త్ క్లెయిమ్‌లను చక్కబెట్టడానికి వాళ్లకొక ఇండియన్ మెడికల్ డాక్టర్ కావలసి వచ్చింది. అక్కడ ఆమె 60 మంది డాక్టర్ల బృందాన్ని నడిపించాలి. గౌరి వెంటనే యూఎస్ విమానం ఎక్కేశారు. ఆ తర్వాత ఆమె కెరీర్ అంతా అంత ఎత్తులోనే ఎగురుతూ ఉంది. నేర్చుకోవడం ఆమెకు ఇష్టం. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఏ సబ్జెక్టునూ తనది కాదు అనుకోరు. అక్కడ టీమ్‌ని నడుపుతూనే ఆపరేషన్ థియేటర్స్ అని, బోర్డ్ రూమ్స్ అని లేకుండా అన్ని విభాగాల విధాన నిర్ణయాల గురించి తెలుసుకున్నారు. నిర్ణయ విధానాలను గమనించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా చేరగానే మొదట బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్‌ల నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు. మూడేళ్లకే ఆ సముద్రం కూడా బోర్ కొట్టేసింది గౌరికి! సముద్రంలో ఇంకా తనకు తెలియని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని గాలించారు. డబ్లు్య.ఎన్.ఎస్. ఒక పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ అన్ని ఖండాలకూ వ్యాపించినట్లు డబ్లు్య.ఎన్.ఎస్. ఖండాంతర శాఖలుగా విస్తరించి ఉంది. పైగా గౌరికి ఒకే సీట్లో హాయిగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మన కెరీర్ అక్కడితో ఆఖరు అంటారు. తను చేస్తున్న పని చేస్తూనే ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ఉన్న తమ కంపెనీ వ్యవహారాలను కూడా యూఎస్ నుంచే ఆమె నడిపించారు. రోజుకు కనీసం 18 నుండి 20 గంటలు పని చేస్తారు గౌరి. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ‘‘పనే నా శక్తి’’ అని నవ్వుతారు గౌరి. కష్టం ఊరికే పోతుందా? 2017లో ఆమెకు ఎవరూ ఊహించనంత పెద్ద ప్రమోషన్. డబ్లు్య.ఎన్.ఎస్.లోని హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ యూనిట్లకు ఆమె బిజినెస్ లీడర్ అయ్యారు! ఈ మూడేళ్లలో మళ్లీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్స్ఫార్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్లో పట్టు సాధించారు. గౌరి హెల్త్ కేర్ యూనిట్‌ను చేపట్టినప్పుడు 7 శాతం మాత్రమే ఉన్న ఆ విభాగం రాబడి ఇప్పుడు ఆమె నేతృత్వంలో 20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆమె మొత్తం కలిపి 4 వేల మంది డాక్టర్లు, కోడర్స్, ఫార్మసిస్టులు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌ను లీడ్ చేస్తున్నారు! వారిలో ఒక్క సీనియర్ కూడా ఇప్పటివరకు ఆమె టీమ్ నుంచి వెళ్లిపోలేదు. ఎందుకు వెళ్లిపోతారు? ఆమె దగ్గర పని చేయడమంటే ఆమెతో సమానంగా పని చేయడమేనన్న గొప్ప గుర్తింపును పొందుతున్నప్పుడు! ‘‘కొత్త విషయాలను నేర్చుకోడానికి యువ వృత్తి నిపుణులు చిన్నతనంగా భావించకూడదు. నేర్చుకోవడం అన్నది నన్ను ఈ వయసులోనూ యవ్వనోత్సాహంతో ఉంచుతోంది.’’ – గౌరి పురి (38), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డబ్లు్య.ఎన్.ఎస్. -
ఎయిమ్స్‌లో ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–ఎయిమ్స్)లో శనివారం నుంచి ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు (టెలీ మెడిసిన్) అందుబాటులోకి తేనున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తేవడం ప్రజలు గమనించి ఇంటి వద్ద నుంచే వైద్య సేవలను అందుకోవాలని కోరారు. సామాజిక కుటుంబ వైద్య విభాగం ఫోన్ నంబర్ 9494908320, చెవి ముక్కు, గొంతు విభాగం 9494906407, జనరల్ మెడిసిన్ 9494908526, జనరల్ సర్జరీ 9494901428, ప్రసూతి స్త్రీల విభాగం 9494907302, చిన్న పిల్లల విభాగం 9494902674, దంత వైద్య విభాగం 9494907082, నేత్ర వైద్య విభాగం 9494905811, చర్మవ్యాధుల విభాగం 9494908401, మానసిక వైద్య విభాగం 9494730332, విచారణకు 94939065718/8523007940 ఫోన్ నంబర్లలో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వైద్యసేవలను అందుకోవచ్చన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటి వద్ద నుంచే టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలను అందుకుని సహకరించాలని కోరారు. -
1,31,968 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. వరసగా మూడోరోజు లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లో 1,31,968 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కి చేరుకుంది. ఇక ఒకే రోజు 780 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మొత్త మరణాల సంఖ్య 1,67,642కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల రోజులుగా వరసగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 9,79,608కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 56,286 కేసులు నమోదు కాగా, ఛత్తీస్‌గఢ్‌లో 10,652, ఉత్తరప్రదేశ్‌లో 8,474 కేసులు నమోదయ్యాయి. వారియర్స్‌కి కరోనా కాటు కరోనా వారియర్స్నీ ఆ మహమ్మారి వదలడం లేదు. దేశ రాజధానిలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వారం రోజుల వ్యవధిలో 22 మంది డాక్టర్లు సహా 32 మంది కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్ 1, 9 మధ్య కాలంలో వైద్యులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 25శాతం మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో సర్ గంగా రామ్ ఆస్పత్రిలో 37 మంది వైద్యులకు కరోనా సోకిన మర్నాడే నిమ్స్ వైద్యులకూ కరోనా పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో లాక్డౌన్ తప్పదేమో గత కొద్ది రోజులుగా 50 వేలకు పైగా కేసులతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితులు ముంచుకొస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిపోతూ ఉండడంతో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల్ని పెంచడానికి రెండు నుంచి మూడు వారాలు లాక్డౌన్ విధించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కోలేని పక్షంలో పూర్తి స్థాయి లాక్డౌన్ గురించి ఆలోచిస్తామన్నారు. కరోనా రోగులు పెరిగిపోయి, ఆస్పత్రుల్లో పడకలు చాలక, మందులు లేక పరిస్థితులు చెయ్యి దాటిపోతే అప్పుడు లాక్డౌన్ మినహా మార్గం లేదని అన్నారు. ఒమర్ అబ్దుల్లాకు పాజిటివ్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న రెండు రోజుల్లోనే ఆయనకు వైరస్ సోకింది. ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టీకా ఎగుమతులు ఆపండి కోవిడ్–19 టీకా డోసుల ఎగుమతుల్ని వెంటనే నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకే ఎక్కువ అధికారాలు కట్టబెట్టాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ప్రభావిత వర్గాలకు నేరుగా ఆర్థిక సాయం అందించాలన్నారు. ‘‘వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన వనరులు టీకా తయారీ సంస్థలకు సమకూర్చాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మన ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ డోసుల్ని ఎగుమతి ఎందుకు చేయాలి ? వాటిని వెంటనే నిలిపివేయండి. వ్యాక్సిన్ అవసరమైన వారందరికీ వెంటనే ఇవ్వడం ప్రారంభించండి’’అని రాహుల్ ఆ లేఖలో డిమాండ్ చేశారు. -
‘నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరు’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. గత 11 రోజులుగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 43,846 కేసులు నమోదైనట్టుగా ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 15 లక్షల 99 వేల 130కి చేరుకుంది. యాక్టివ్ కేసుల శాతం 2.66కి పెరిగింది. మొత్తం 3,09,087 యాక్టివ్ కేసులు న్నాయి. కేసులు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి గల కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోవిడ్–19 నిబంధనలు ప్రజలు సరిగా పాటించకపోతే దేశాన్ని సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకొస్తే కరోనా భూతాన్ని తరిమి కొట్టవచ్చునని అన్నారు. జన్యు మార్పిడికి లోనైన వివిధ రకాల వైరస్లు భారత్‌లోకి రావడం, భారీగా జనాల గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించడం తాజాగా కేసులు పెరిగిపోవడానికి కారణమని ఆయన చెప్పా రు. ‘‘కరోనా నిబంధనల్ని జనాలు గాలికొదిలేశారు. ముప్పు తప్పిందని అందరూ అనుకుంటున్నారు. వ్యాక్సిన్ కూడా రావడంతో ధీమా పెరిగిపోయింది. ఎక్కువ మందితో పెళ్లిళ్లు, వేడుకలు చేస్తున్నారు. ఇలాంటి భారీ కార్యక్రమాలే కరోనా కేసుల్ని పెంచుతున్నాయి’’ అని రణ్‌దీప్ అంచనా వేశారు. కరోనా కట్టడికి అతి ముఖ్య సూత్రమైన టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ విధానాన్ని పాటించడంలో ప్రభుత్వాలు కొద్ది కాలంగా నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. వివిధ దేశాల కొత్త మ్యుటేషన్ వైరస్లు కూడా కేసుల తీవ్రతకు కారణమని వివరించారు. దీనిని నిలువరించాలంటే కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యమివ్వాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. అయిదు రాష్ట్రాల నుంచే 83% కేసులు 4 నెలల్లో అత్యధికంగా రోజువారీ కేసులు 43,846 నమోదైతే, అందులో 83% కేసులు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచే వచ్చాయి. మహారాష్ట్రలో ఏకంగా 30,535 కేసులు నమోదయ్యాయి. మరో 197 మంది కరోనాతో చనిపోగా మృతుల సంఖ్య 1,,59,755కి చేరుకుంది. లోక్‌సభ స్పీకర్‌కు కరోనా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(58)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఎయి మ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు ఆదివారం తెలిపాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఆంక్షలు జైపూర్/భోపాల్: రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు ప్రకటించాయి. రాజస్తాన్ ప్రభుత్వం సోమవారం నుంచి 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వారు 72 గంటల్లోపు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ రిపోర్టును చూపించాలని లేదంటే 15 రోజులపాటు క్వారంటైన్లో గడపాలని తెలిపింది. ఇండోర్‌లో లాక్డౌన్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాల్లో ఆదివారం వీధులు బోసిపోయాయి. ఈ నగరాల్లో ప్రతి శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి భోపాల్, ఇండోర్ జిల్లాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. -
కరోనా సెకండ్ వేవ్ భయం!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభి స్తోందనే భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,264 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. వారం రోజుల్లో 86,711 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేలకి చేరువలో ఉంది. మొత్తం కేసుల్లో ఇవి 1.32 శాతం. మహారాష్ట, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదకరంగా కొత్త స్ట్రెయిన్: ఎయిమ్స్ చీఫ్ మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకడం ఆందోళన పుట్టిస్తోందని అన్నారు. ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు అంతగా నమోదు కాకపోవడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామేమోనన్న అంచనాలకు చాలా మంది వచ్చారు. కానీ భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు. జనాభాలో 80 శాతం మందికి యాంటీబాడీలు ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారని అన్నారు. ప్రజల నిర్లక్ష్యమే కారణం మహారాష్ట్రలో కేసులు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఆరోగ్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకపోవడం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని కరోనా టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సంజయ్ ఓక్ అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కేసుల్ని కట్టడి చేయలేమన్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి కరోనాని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని విశ్వసిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వారంలో కనీసం నాలుగు రోజులు టీకా డోసులు ఇచ్చే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. వచ్చే నెలకల్లా సీనియర్ సిటిజన్లకి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మళ్లీ పంజా సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అత్యధికంగా కరోనా ప్రభావం ఉన్న యావత్మాల్ జిల్లాలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి వారంపాటు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు మంత్రి యశోమతి ఠాకూర్ ప్రకటించారు. అకోలా జిల్లాలోని అకోలా, మూర్తిజాపూర్, అకోట్ తదితర పట్టణాల్లో 23 నుంచి లాక్డౌన్ అమలవుతుందని అధికారులు చెప్పారు. నాగపూర్, అమరావతి, బుల్దానా, వాశీం, పుణే, నాసిక్ జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. 15న 3,365 కేసులు, 21న 6,071 కేసులు బయటపడ్డాయి. కాగా, మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించాలా వద్దా అనే నిర్ణయం ప్రజల చేతిలో ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖానికి మాస్క్ వినియోగించాలని కోరారు. అదే మన ఆయుధమని వ్యాఖ్యానించారు. నిబంధనలు పాటించకుంటే ఆఖరి అస్త్రంగా లాక్డౌన్ అమలు చేస్తామన్నారు. నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. లాక్డౌన్ కావాలనుకునేవారు కరోనా నియమాలు పాటించరని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ధార్మిక కార్యక్రమాలన్నింటినీ సోమవారం నుంచి కొన్ని రోజులపాటు రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్టు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
భారత్‌లో కరోనా టీకా రెండో డోసు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ అంశంలో భారత్ అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోంది. రికార్డు స్థాయిలో 28 రోజుల్లో దాదాపుగా 80 లక్షల మందికి టీకాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా టీకా రెండో డోసు కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమైంది. జనవరి 16న కరోనా తొలి విడత కార్యక్రమం మొదలైంది. ఆరోజున రెండు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ రెండో డోసు తీసుకున్నవారిలో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చిన 28 రోజుల్లోగా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకోలేకపోతే ఆరువారాల్లోగా రెండో డోసు తీసుకోవచ్చునని వైద్య నిపుణులు తెలిపారు. భారత్ ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఎక్కువగా వినియోగిస్తోంది. పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ అత్యధిక మందికి ఇస్తోంది. ఇక దేశీయంగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నంత వరకు సరఫరా చేస్తోంది. కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా తొలి విడత 79,67,647 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్న వారిలో 97% మంది సంతృప్తిగా ఉన్నారు. వచ్చే నెల నుంచి మరికొన్ని కంపెనీల టీకాలు అందుబాటులోకి వస్తే, రోజుకి 10 లక్షల మందికి ఇచ్చేలా కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. కోవిడ్ నిబంధనల్ని పక్కాగా పాటిస్తూనే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత అవసరమని రెండో డోసు తీసుకున్న మహిళా వైద్య కళాశాల డాక్టర్ మాథూర్ చెప్పారు. కేసులు తగ్గుతున్నా జాగ్రత్తలు తప్పనిసరి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అన్నారు. గత నాలుగు వారాలుగా కేసులు తక్కువగా నమోదైతే, రెండు వారాలుగా మరణాల రేట్ తగ్గిందన్నారు. కరోనా తగ్గిపోయిందని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. గత వారం రోజులకి ప్రపంచవ్యాప్తంగా 32 లక్షల కరోనా కేసులు నమోదైతే ఈ వారంలో 19 లక్షలు కేసులు నమోదయ్యాయని టెడ్రాస్ వివరించారు. -
దేశమంతటా టీకా పండుగ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాదర స్వాగతం పలికారు. కొన్నిచోట్ల ప్రార్థనలు సైతం చేశారు. మిఠాయిలు పంచారు. వ్యాక్సిన్ బాక్సులకు పూలదండ చేసి, హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. మనీశ్ కుమార్ ఫస్ట్ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్ కుమార్‌కు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్‌కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్ కుమార్ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. థాంక్యూ మనీశ్ కుమార్ దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్ కుమార్‌కు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్ కుమార్ కోవిడ్–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు. టీకా తీసుకున్న ప్రముఖులు కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా, పశ్చిమ బెంగాల్ మంత్రి నిర్మల్ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. తొలిరోజు 1,91,181 మందికి.. దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1,91,181 మందికి టీకా మొదటి డోసు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వగా, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ కూడా అందజేశారు. -
ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం
సాక్షి, ఏలూరు: అంతుబట్టని అనారోగ్యం బారి నుంచి ఏలూరు కోలుకున్నా వ్యాధి నిర్ధారణ ఇంకా చిక్కుముడిగానే ఉంది. దీనిపై కేంద్ర బృందాలు ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. మరోవైపు ఆరో రోజు గురువారం ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 14కి పరిమితమైంది. నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నా నిర్థారణ పరీక్షల ఫలితాల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏలూరులో బాధితులను పరామర్శించి అధికారులతో సమావేశం అయ్యారు. కేంద్ర బృందాలతో కూడా చర్చించారు. బాధితుల్లో 24 గంటల అనంతరం సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల బృందం తెలిపింది. ఐఐసీటీ నిపుణులు కూడా వివిధ రకాల శాంపిళ్లు సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌వో) ప్రతినిధి బృందం ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేస్తూ నమూనాలు సేకరించింది. ఒకటి రెండు రోజుల్లో కచ్చితమైన నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిపుణుల బృందాలు చెబుతున్నాయి. ఏలూరులో తాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, కలుషితం కాలేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, విమ్టా ల్యాబ్ నివేదికలో వెల్లడైంది. హాని కలిగించే స్థాయిలో లేదు.. ఇప్పటివరకు 604 మంది బాధితులు ఏలూరు ఆస్పత్రిలో చేరగా 536 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మందిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇద్దరు వింత వ్యాధితో చనిపోయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ ఖండించారు. ఏలూరు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇప్పటికే తాగునీటి విషయంలో పూర్తి స్పష్టత వచ్చిందని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తాగునీటిలో ఆర్గానో క్లోరిన్ ఉన్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై స్పందిస్తూ ‘వైద్య పరిభాషలో ఎంజీ అంటే మిల్లీ గ్రామ్ కాదు. మైక్రోగ్రామ్‌గా భావించాలి. బాధితుల రక్త నమూనాల్లో లభ్యమైన ఆర్గానో క్లోరిన్ హాని కలిగించే స్థాయిలో లేదు’ అని తెలిపారు. చదవండి: (బాబు హయాంలో అప్పుల తప్పులు: కాగ్ నివేదిక) రక్త నమూనాల్లో సీసం, ఆర్గానో క్లోరిన్స్! ►పరీక్షల కోసం సీఎఫ్ఎస్ఎల్ సహాయం కోరిన ఢిల్లీ ఎయిమ్స్ సాక్షి, న్యూఢిల్లీ: ఏలూరులో వింత వ్యాధికి కారణమైన మూలాలను కనుగొనేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మరింత లోతుగా పరిశోధనలు చేస్తోంది. ఏలూరులో సేకరించిన మరిన్ని రక్త నమూనాలను ఎయిమ్స్ వైద్యులు విశ్లేషించారు. మొత్తం 37 రక్త నమూనాలను విశ్లేషించగా.. అందులో 21 నమూనాల్లో అధిక మోతాదులో సీసం (లెడ్) ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మిగతా నమూనాల్లోనూ సీసం, నికెల్ వంటి భార లోహాలతోపాటు ఆర్గానో క్లోరిన్స్ (క్రిమిసంహారకాలు) కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆర్గానో క్లోరిన్స్ పరీక్షల కోసం ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సహాయం కోరారు. అయితే ఈ పరిశోధనల కోసం కేంద్ర హోంశాఖ నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు కావాలని సీఎఫ్ఎస్ఎల్ తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో హోంశాఖ నుంచి రాతపూర్వక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆర్గానో క్లోరిన్స్ ఆనవాళ్ల కోసం సీఎఫ్ఎస్ఎల్ పరిశోధనలు చేస్తోంది. శుక్రవారం పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. -
ఏలూరు దక్షిణపు వీధిలో ఎయిమ్స్ బృందం
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరులోని దక్షిణపు వీధిలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే డిశ్చార్జి అయి ఇంటి వద్ద ఉన్న బాధితుల వివరాలను వైద్యుల బృందం అడిగి తెలుసుకుంది. త్రాగునీటి శాంపిల్స్‌తో పాటు బాధితుల రక్త నమూనాలను కేంద్ర బృందం సేకరిస్తుంది. మరోవైపు వింత లక్షణాలతో అస్వస్థతకు గురైన వారిలో 22 మందిని ఏలూరు వైద్యులు విజయవాడకు పంపారు. వారిని ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్ అనంతరం ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. మిగతావారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అందరూ కోలుకుంటున్నట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి సుహాసిని తెలిపారు. విజయవాడకు వచ్చిన వారిలో రెండోసారి వ్యాధి లక్షణాలు కనిపించలేదని, భయం, మానసిక ఒత్తిడి వల్ల కొంతమంది ఇబ్బందికి గురయ్యారని పేర్కొన్నారు. ఈ అంశంపై మానసిక వైద్యనిపుణులు కూడా కేస్ స్టడీ చేస్తున్నట్లు వివరించారు. 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. అస్వస్థతకు గురైన వారి బ్లడ్ ,యూరిన్ ,స్పైనల్ శాంపిల్స్ పరీక్షలకు పంపామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. (ఏలూరు: అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ) -
ఏలూరు: డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు
సాక్షి, పశ్చిమగోదావరి: గత కొద్ది రోజులుగా ఏలూరు పరిసరాల్లో ప్రజలు అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ పరిస్థితులను పర్యవేక్షించడానికి గాను దేశంలోని అనేక ఇన్స్టిట్యూట్ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలు చేరుకున్నాయని డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య తగ్గడమే కాక డిశ్చార్జిల సంఖ్య పెరిగిందన్నారు. దేశంలోని పలు ఇన్స్టిట్యూట్ల నుంచి బృందాలు వచ్చి నమోదు అయిన కేసుల వివరాలు తెలుసుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. అంతేకాక డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు వచ్చారని తెలిపారు. ఇక్కడ నుంచి వాటర్, మిల్క్ శాంపిల్స్ సేకరించి న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు పంపుతామన్నారు. పూణె వైరాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి నిపుణులు వస్తారని తెలిపారు మోహన్. (చదవండి: అనుక్షణం అప్రమత్తం ) ప్రస్తుతం ఇక్కడ బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు ఏవీఆర్ మోహన్. డిశ్చార్జి అయిన వారిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. అన్ని ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక వచ్చిందని.. కొత్తగా మరో 40 మంది బాధితుల శాంపిల్స్ సేకరించి పంపిచామన్నారు. పూర్తిగా నిర్దారణ లేకుండా నివేదికలు బయటకు వెల్లడించలేమన్నారు. భయాందోళనవల్ల కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు మోహన్. -
ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. అస్వస్థతకు దారి తీసిన కారణాలు.. ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఇక బాధితులందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని.. ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామన్నారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని.. ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిశ్చార్జ్ చేసిన వారు తిరిగి మళ్లీ ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. వారికి ఆహారం, మందులు అందించాలని.. డిశ్చార్జ్ అయిన వారిని కూడా అబ్జర్వేషన్లో ఉంచాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఏలూరులో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 104, 108కి కాల్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: సర్కారు బాసట.. కోలుకుంటున్నారు) ఆందోళన చెందవద్దు: పేర్ని నాని ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘డిశ్చార్జ్ చేసిన బాధితులను నెలపాటు పర్యవేక్షించాలని.. బాధితులకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అస్వస్థతకు గల కారణాలపై పరిశోధనకు కేంద్ర బృందాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం కూడా రాబోతుంది. బాధితులు ఆందోళన చెందవద్దు’ అని తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 425 కేసులు నమోదు కాగా.. 222 మంది డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 16మంది విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాము. అస్వస్థతకు గురైన వారికి అన్ని వైరల్ టెస్టులు చేశాం. నీటిలో మెటల్ టెస్టులు కూడా చేశాం.. రిపోర్టులు రావాలి. సీఎంబీకి కూడా నమూనాలు పంపామని’ తెలిపారు. -
మారనున్న ఎయిమ్స్ రూపురేఖలు
బీబీనగర్ ఎయిమ్స్ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. వైద్య, విద్య పరిశోధన విభాగాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 18 వైద్య కళాశాలల డైరెక్టర్లు,ఎంపీలతో కమిటీ వే శారు. అలాగే ఫైనాన్స్, హెచ్ఆర్, అకడమిక్, సెలక్ట్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీ నికి సంబంధించి ఎయిమ్స్ డైరెక్టర్ ఇనిస్టిట్యూట్ కమిటీ సభ్యులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీబీనగర్ (భువనగిరి) : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రం రంగాపురం పరిధిలో గల ఎయిమ్స్ కళాశాల రూపురేఖలను మార్చేందు కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిమ్స్ కళా శాల నిర్మాణంతో పాటు ఓపీ సేవలకు బీజం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ని మ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చి కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. క ళాశాలలో ఒకవైపు ఎంబీబీఎస్ తరగతులు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో 50విద్యార్థులు వి ద్యను అభ్యసిస్తున్నారు. ఓపీ సేవలను అందిస్తున్నా రు. కోవిడ్ కారణంగా ఎయిమ్స్ అధికారులు టెలీకన్సల్టింగ్ ఓపీ సేవలను అందుబాటులో ఉంచారు. ప్రపంచ ఖ్యాతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా ఎయిమ్స్ కళాశాలను ప్రపంచ ఖ్యాతి స్థాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా రూప కల్పన చేసేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. దీంతో వైద్య, విద్య పరిశోధన విభా గాలను ఏర్పాటు చేసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 18మంది వైద్య కళాశాలలకు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన డైరెక్టర్లతో, ఎంపీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఫైనాన్స్, హెచ్ఆర్, ఆకాడమిక్, సెలక్ట్ స్టాండింగ్ కమిటీలను ఎర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎయిమ్స్ ప్రఖ్యాతి చెందేలా ఐఐటీ సంస్థలతో భాగస్వామ్యంతో ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్‌గా మరింత అభివద్దికి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్టోబర్ నాటికి వసతుల ఏర్పాటుకు చర్యలు 2020 అక్టోబర్ నాటికి ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో నియామకాలతోపాటు వసతులు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియామకాలకు సంబంధించి 143పోస్టులకు ప్రకటన వేయగా ఇందులో ఫ్యాకల్టీతోపాటు నాన్‌టీచింగ్ పోస్టులు ఉన్నాయి. మరిన్ని పోస్టులను జారీ చేయనున్న ట్లు సమాచారం. టీచింగ్ ఫ్యాకల్టీ కోసం ఇప్పటికే రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కళాశాలకు 161 ఎకరాల భూదాన్ భూమిని కేటాయించగా మరింత భూమి అవసరం కావడంతో 89 ఎకరా ల పట్టా భూములను సేకరించారు. కన్స్ట్రక్షన్ ఎజెన్సీ అధికారులు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యా రు. త్వరలో నిర్మాణాలు నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మారుస్తూ కేంద్రం గెజిటెడ్ విడుదల చేయడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా భూమి సిద్ధంగా ఉండడంతో త్వరలో కళాశాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. నిమ్స్ భవనంలో తాత్కాలికంగా ఎయిమ్స్ నడిపిస్తుండగా మూడేళ్లలో పూర్తిస్థాయిలో 240ఎకరాలకు పైగా స్థలంలో వసతి గహాలు, ప్రొఫెసర్లు, వైద్యుల గృహాలు, పరిశోధన కేంద్రాలు నిర్మించనున్నారు. అలాగే మైదానాలు, స్విమ్మింగ్‌పూల్స్, బృందావనాలు, రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. కమిటీలో ముగ్గురు ఎంపీలు ఎయిమ్స్‌ను ప్రపంచ ఖ్యాతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చేందుకు వేసిన 18మంది డైరెక్టర్ల కమిటీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు బండ ప్రకాశ్, బండి సంజయ్, అరవిందులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, ఎంపీ, ఎయిమ్స్ అడ్వయిజర్ సభ్యులు బండ ప్రకాశ్‌లు గురువారం ఇనిస్టిట్యూట్ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఈ సందర్భంగా దేశ నలుమూలల నుంచి 17మంది సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రధానంగా ఎయిమ్స్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని, 2021లోపు ఎయిమ్స్ రూపు రేఖలను మార్చనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. -
మనం కరోనా వైరస్‌ను తిప్పికొట్టగలం
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు సైతం ప్రయోగాలను ముమ్మరం చేశారు. వైరస్ జన్యుక్రమంపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సరికొత్త పరిశోధన చేసింది. వైరస్ జన్యుక్రమంతో పాటు వైరస్ సోకిన వారు దాన్ని ఎదుర్కొంటున్న తీరును అధ్యయనం చేసింది. ఇప్పటివరకు భారత్‌లో వ్యాప్తి చెందిన వైరస్‌లో 7 రకాలు దాదాపు 42 శాతం వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఇందులో ఏ2ఏ రకానికి చెందిన ఎం.టి.012098 బెడిప్రెడ్ 2.0 సర్వర్, నెట్‌సీటీఎల్ 1.2 సర్వర్ పద్ధతిలో టి, బి ఆధారిత రోగనిరోధక శక్తిపై ప్రభావాన్ని అంచనా వేశారు. దీన్ని ఎన్డీబీఐ జీన్‌బ్యాంక్ నుంచి సే కరించారు. డాక్టర్ రూబీ ధార్, అకౌరి యాష్ సిన్హా సారథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌లోని బ యోకెమిస్ట్రీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలు ఈ అధ్యయనం చేశాయి. వైరస్ జన్యు విశ్లేషణ, వైరస్ స్వభావంపై నివేదిక తయారు చేశాయి. (ఒక్కరోజులో 380 మంది మృతి) సమర్థంగా పోరాటం.. కరోనా ఏ2ఏ రకం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రెండు, మూడు రోజుల్లో దాని ఉనికిని చూపిస్తుంది. అయితే చాలావరకు వైరస్ సోకిన వారిలో లక్షణా లు పెద్దగా కనిపించట్లేదు. ఇందుకు శరీరంలోని వై రస్‌ను ఎదుర్కొనే కణాలు సమర్థంగా పనిచేస్తుండటమే కారణమని చెబుతున్నారు. వైరస్‌లోని 4 రకా ల జీన్స్‌పై, మానవ శరీరంలోని కణాల పనితీరుపై చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు గుర్తించారు. నిర్దేశించిన రకం కరోనా వైరస్‌ను మన శరీరం ఎదుర్కొంటూ రోగనిరోధక శక్తిని ప్రేరేపించేలా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అయితే తాజాగా సీసీఎంబీ చేసిన పరిశోధనలో 1/ఏ3ఐ అనే కొత్త రకం వైరస్ ను గుర్తించారు. మన దగ్గర 50 శాతానికిపైగా ఈ ర కం వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా లోతై న పరిశోధన చేస్తే వ్యాక్సిన్ పరిశోధనకు ఉపయోగపడుతుందని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశా ల అసోసియేట్ ప్రొ. డాక్టర్ కిరణ్ చెప్పారు. (ప్రతీ అయిదుగురిలో ఒకరికి కోవిడ్ ముప్పు) -
‘2 మీటర్ల సామాజిక దూరం తప్పనిసరి’
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నప్పటికి వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2 లక్షల మార్కును దాటగా... ఈ ఒక్క రోజే 8 వేల పై చిలుకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి లాక్డౌన్ ఎత్తివేత దిశగా కేంద్రం అడగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి చర్యలు కరోనా బారి నుంచి మనల్ని కాపాడతాయని ప్రసిద్ధ లాన్సెట్ జర్నల్ ఓ నివేదికను విడుదల చేసింది. 16 దేశాలలో దాదాపు 172 అధ్యయనాలను సమీక్షించిన తర్వాత ఈ నివేదికను వెల్లడించింది. దానిలోని అంశాలు.. మాస్క్, సామాజిక దూరం అన్ని కలిస్తేనే.. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం భౌతిక దూరం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో ఏ ఒక్కటి ఒంటరిగా కరోనాను కట్టడి చేయలేదని.. వీటన్నింటిని పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని నివేదిక తెలిపింది. అంతేకాక వ్యాధి సోకిన వారి నుంచి మీటరు దూరం లోపల ఉన్న వ్యక్తికి వైరస్ సోకే అవకాశం 12.8 శాతంగా ఉండగా.. మీటరు కంటే ఎక్కువ దూరం(2మీటర్లు)లో ఉన్నప్పుడు వ్యాప్తి కేవలం 2.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.ఫేస్ మాస్క్ ధరించిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3.1 శాతం ఉండగా.. ధరించని వారికి 17.4 శాతంగా ఉంది. అలానే ఫేస్ షీల్డ్స్, గ్లాసెస్ వాడటం వలన వైరస్ వ్యాప్తి 5.5 శాతం తగ్గిందని.. వాడకపోవడం వల్ల 16 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మాస్క్ ఎలాంటిది అయినా పర్వాలేదు.. గుడ్డ మాస్క్‌లు, ఆపరేషన్ మాస్క్‌లు, ఎన్-95 మాస్కులు.. ఇలా ఏది వాడినా మంచిదే అని నివేదిక తెలిపింది. కాకపోతే ఎక్కువ పొరలు ఉన్న మాస్క్ ధరించడం మరింత శ్రేయస్కరం అని పేర్కొంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కిర్బీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ రైనా మాక్ ఇంటైర్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సడలించాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు మాస్క్‌ను తప్పనిసరి చేయాలి. ఈ మాస్క్‌లు కూడా నీటిని పీల్చుకోని వస్త్రంతో.. ఎక్కువ పొరలు ఉన్న వాటిని వాడేలా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం’ అన్నారు. భారత్‌ను కాపాడే అస్త్రాలు ఇవే.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యక్తిగత శుభ్రత, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా మాత్రమే కేసుల సంఖ్యను తగ్గించగలమని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బయట ఉన్నా వీటిని పాటించడం మాత్రం మర్చిపోవద్దన్నారు గులేరియా. (అత్యధికం : 24 గంటల్లో 8909 తాజా కేసులు) తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు.. కళ్లు, ముక్కు, గొంతు ద్వారా ప్రవేశించి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. కానీ దీన్ని నిరూపించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు లేవని నివేదిక తెలిపింది. -
రెండు లక్షలకు చేరువలో..
దేశంలో కోవిడ్–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. రికార్డు స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలోనే కోవిడ్–19తో 230 మంది మరణించగా 8,392 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. రికార్డు స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలోనే కోవిడ్–19తో 230 మంది మరణించగా 8,392 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్ ఇటలీల తర్వాత ఏడో స్థానంలోకి భారత్ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు చెబుతున్నాయి. 91,818 మంది వైరస్ బాధితులు కోలుకుని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 48.19 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశలో భారత్ దేశంలో కోవిడ్–19 వ్యాధి తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశకు చేరిందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య నిపుణులు, ఐసీఎంఆర్ కోవిడ్ –19 అధ్యయన బృందం సభ్యులు వెల్లడించారు. దేశంలో 1.90 లక్షల మందికి కోవిడ్ సోకి, 5వేల మంది మరణించినప్పటికీ దేశంలో ఇంకా సామాజిక వ్యాప్తి జరగలేదనడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే తీవ్రంగా కోవిడ్ బారిన పడిన దేశాల్లో భారత్ ఏడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇంత విస్తృతంగా కోవిడ్–19 సామాజిక వ్యాప్తి జరిగిన దశలో, వైరస్‌ను అరికడతామని చెప్పడం అవాస్తవమైన విషయమని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీహెచ్ఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడమాలజిస్ట్స్ సభ్యులు ప్రధాని మోదీకి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. -
ఎయిమ్స్ వైద్యుల ఘనత
న్యూఢిల్లీ : నడుము భాగంలో అతుక్కొని పుట్టిన అవిభక్త కవల పిల్లలను దాదాపు 24 గంటల శస్త్రచికిత్స అనంతరం ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా వేరుచేశారు. 64 మంది వైద్య సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాకు చెందిన ఈ కవల పిల్లలు దాదాపు రెండు నెలల వయసున్నప్పటి నుంచి వీరు ఎయిమ్స్ పీడియాట్రిక్స్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మిను బాజ్‌పాయ్ నేతృత్వంలోని వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ చిన్నారుల వయసు రెండు సంవత్సరాలు. దీంతో శస్త్రచికిత్సకు శరీరం అనుకూలంగా ఉండటంతో ఆపరేషన్‌ను ప్రారంభించారు. వైద్యరంగంలో ఇలాంటి కేసు చాలా అరుదని కవలల దిగువ శరీర భాగాలు అతుక్కొని ఉండటమే కాక ఇద్దరి గుండెలో రంధ్రం ఉండటంతో సమస్య మరింత కఠినం అయిందని, అయిన్పప్పటికీ దాదాపు 24 గంటల సుధీర్ఘ ఆపరేషన్‌తో ఇద్దరిని విజయవంతంగా వేరు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (ఐదు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్) "ఇద్దరి శిశువుల వెన్నముక, దగ్గర తగినంత చర్మం లేకపోవడంతో గుండె, ప్రధాన రక్తనాళాలకి సరిగ్గా రక్త ప్రసరణ జరగలేదు. దీంతో ఆపరేషన్ సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. చాలా డీప్‌గా కేసు స్టడీ చేశాక ఈ కేసులో క్లిష్టమైన అంశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. దీంతో ఆపరేషన్ కోసం చాలా మంది ప్రముఖులతో సమావేశం అయ్యి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం "అని ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ వైద్యుడు వెల్లడించారు. అనస్థీషియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సి.టి.వి.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియోడయాగ్నోసిస్, న్యూరోఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఓ జట్టులా ఏర్పడి 24 గంటలపాటు సుధీర్ఘంగా కష్టపడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని, ఆపరేషన్‌ను విజయవంతం కావడం పట్ల కవల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. (మాల్స్‌లో విదేశీ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్) -
కరోనా: మరో సీనియర్ వైద్యుడు కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి ఢిల్లీలోని మరో సీనియర్ వైద్యులు బలయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ వైద్యుడు డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే (78) కోవిడ్-19తో శనివారం మరణించారు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రీమియర్ ఆసుపత్రిలో పల్మనాలజీ విభాగానికి డైరెక్టర్, ప్రొఫెసర్‌గా ఆయన పనిచేశారు.ఎయిమ్స్ మెస్ వర్కర్ ఈ వ్యాధితో మరణించిన ఒక రోజు తర్వాత డాక్టర్ పాండే చనిపోయారు. పాండే మరణాన్ని ధృవీకరించిన మరో సీనియర్ వైద్యులు డాక్టర్ సంగితా రెడ్డి, పల్మోనాలజీలో ఆయన చేసిన కృషిని, సేవలను కొనియాడారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఆమె ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా ఆర్పీసీ క్యాంటీన్ విభాగం నిరాకరించిందంటూ శుక్రవారం ఎయిమ్స్ డైరెక్టర్‌కు రాసిన లేఖలో తెలిపింది. తమ మాటలను పెడచెవిన పెట్టడం వల్లే మెస్ వర్కర్ చనిపోయాడని వాపోయారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడం సిబ్బందిలో ఆందోళన రేపుతోంది. కాగా కరోనా ప్రభావానికి దేశంలో దెబ్బతిన్న రాష్ట్రాలలో ఢిల్లీ ఒకటి. దేశ రాజధానిలో ఇప్పటివరకు 12,319 కేసులు నమోదు కాగా, 208 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తరువాత దేశంలో అత్యధికంగా ప్రభావితమైన నాలుగవ రాష్ట్రం ఢిల్లీ. ప్రధానంగా వైద్యులు, నర్సులు వైరస్ బారిన పడటంతో, హిందూ రావు, బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ హాస్పిటల్, ఢిల్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి ఆసుపత్రులకు సీలు వేయవలసి వచ్చిన సంగతి తెలిసిందే. (పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి) చదవండి : ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా Deeply saddened to hear that today @covid19 claimed it's most illustrious victim Dr. J.N Pande Director & Prof of Pulmonology @aiims_newdelhi A stalwart of the medical world his work in pulmonology will continue to ensure better health for many My Condolences to his family🙏 pic.twitter.com/ByE83ikItS — Dr. Sangita Reddy (@drsangitareddy) May 23, 2020 -
మృతదేహంలో కరోనా ఎంతకాలం ఉంటుంది?
న్యూఢిల్లీ: మొదటిసారిగా కోవిడ్–19 బాధిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. మృతుల శరీరాల్లో కరోనా వైరస్ ఎంత కాలం జీవిస్తుంది? మృతదేహం నుంచి కూడా ఆ వైరస్ ఇతరులకు సోకుతుందా? శరీరంలోని ఏఏ అవయవాలపై ఏ మేరకు ప్రభావం చూపుతోంది? అనే విషయాలను ఈ పోస్టుమార్టం ద్వారా పరిశీలించనుంది. ఈ అధ్యయనంలో పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల నిపుణుల సాయం కూడా తీసుకోనున్నట్లు ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడించారు. ‘ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే దీనికోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లాక ఏఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది. మృత శరీరంలో ఎంత కాలం జీవిస్తుంది? వంటి అంశాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’అని డాక్టర్ గుప్తా చెప్పారు. కోవిడ్ బాధిత మృతదేహాలకు పోస్టుమార్టం చేపట్టినట్లయితే మార్చురీ సిబ్బందికి, పోలీసులకూ సోకడంతోపాటు మార్చురీ పరిసరాల్లోనూ వైరస్ ప్రభావం ఉంటుందని భావించిన ఐసీఎంఆర్.. శవపరీక్ష వద్దంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. -
కోవిడ్‌తో ‘లోక్‌పాల్’ త్రిపాఠీ కన్నుమూత
న్యూఢిల్లీ: లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు తెలిపారు. ఆయన కుమార్తె, పని మనిషికి కూడా ఈ వైరస్ సోకిందని, వారు కోలుకున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరు. -
సర్కారుకు సహకరించాలి
సాక్షి, అమరావతి: అమెరికా, ఐరోపాలో మాదిరిగా శరవేగంగా కాకున్నా భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. లాక్డౌన్ అమలులోనే ఉన్నప్పటికి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఢిల్లీ యాత్రికుల రాకతో రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి కోరలు సాచింది. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య సలహాదారు, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ కె.శ్రీనాథరెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రానున్న మూడు వారాలు అత్యంత కీలకమని, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని సూచించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భౌతిక దూరమే శరణ్యం కరోనాకు మందులు లేవు. కేవలం భౌతిక దూరం పాటించడమే మార్గం. పాజిటివ్‌గా తేలితే నిర్బంధంలో ఉంచడం మినహా చేసేదేమీ లేదు. వారినుంచి ఇతరులకు సోకకుండా కాపాడుకోవాలి. అందుకు ఆధారాలు లేవు కరోనా మ్యుటేషన్ (రూపాంతరం) చెంది భారత్‌లో బలహీనపడిందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒకవేళ బలహీనపడినా ఆధారాలు లేకుండా నిర్ధారించలేం. నిజంగా బలహీనపడితే దేశంలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దేశంలో మొన్నటివరకూ కరోనా కేసులు వారం రోజులకు రెట్టి్టంపు అయ్యేవి. అది ఇప్పుడు 5 రోజులకు పడిపోయింది. డబ్లింగ్ అంటే నమోదైన కేసులు రెట్టింపు అయ్యే సమయం. యూరప్ దేశాల్లో ఇది రెండు రోజులకే అవుతోంది. మన దేశంలోనూ రెట్టింపు అవుతున్న వ్యవధి నెమ్మదిగా పడిపోతోంది. ఇది పడిపోకుండా చూడాలి. ఈ రేటు పడిపోవడం ప్రమాదకర సంకేతం. జాగ్రత్తగా లేకుంటే .. ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా వంటి సంపన్న దేశాలు కరోనా దెబ్బకు అల్లాడుతున్నాయి. డబ్బుతోపాటు వైద్యపరంగా మనకంటే ఎన్నో రెట్లు ముందున్న దేశాలే వైద్యులు, వెంటిలేటర్లు, ఆస్పత్రులు, పడకల కొరతతో విలవిలలాడుతున్నాయి. వాటి పరిస్థితి చూసైనా జాగ్రత్తగా ఉండకుంటే మూల్యం చెల్లించక తప్పదు. కరోనా లక్షణాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి స్క్రీనింగ్ నిర్వహిస్తే కొంతవరకు నియంత్రించవచ్చు. నిర్ధారణ సామర్థ్యం పెరగాలి దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం పెరగాలి. వైరాలజీ ల్యాబ్‌లను ఒక్కరోజులో పెంచలేం గానీ పరిస్థితిని బట్టి ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు ఎక్కువ మందిని టెస్ట్ చేసి క్వారంటైన్లో ఉంచగలిగితే ఫలితాలు బాగుంటాయి. లాక్డౌన్ అమల్లో ఉన్నందు వల్లే వైరస్ నియంత్రణలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలి. ఐసీయూలను పెంచుకోవాలి ప్రస్తుతం మనకున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఏ మాత్రం సరిపోవు. వీటిని పెంచాలి. 50 ఏళ్ల పైబడిన వారికి వైరస్ సోకినప్పుడు ఐసీయూల అవసరం చాలా ఉంటుంది. ప్రభుత్వాస్పత్రులు బలోపేతం కావాలి రకరకాల వైరస్లు, బాక్టీరియాల పోకడను అంచనా వేసి ప్రభుత్వ ఆస్పత్రుల వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. పరిశోధనలు ఎక్కువగా జరగాలి. ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి. రానున్న 3 వారాలు ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలి. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు సమాజాన్ని రక్షించుకోవాలి. -
సంతాన యోగం!
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మరీ ముఖ్యంగా పురుషులు యోగా సాధన చేసేందుకు మరో బలమైన కారణాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా తగ్గిపోతున్న పురుషుల వీర్యం నాణ్యత పెంచేందుకు యోగా ఉపయోగపడుతుందని సీసీఎంబీ, ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సంయుక్తంగా చేసిన పరిశోధన స్పష్టం చేసింది. మానవ జన్యు వ్యవస్థపై వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. అనారోగ్యకర జీవనశైలి, దురలవాట్ల కారణంగా డీఎన్ఏలో రసాయన మార్పులు చో టుచేసుకుని వీర్యం నాణ్యత తగ్గుతుందని కూ డా వింటుంటాం. ఈ మార్పులను యోగాతో అ ధిగమించొచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. ఆండొలోగియా జర్నల్ తాజా సంచికలో ప్ర చురితమైన దాని ప్రకారం వంధ్యత్వ సమస్యల తో బాధపడుతున్న పురుషులు యోగా ఆధారిత జీవనశైలి అలవర్చుకుంటే వీర్యకణాలు చురు గ్గా మారడంతో పాటు వీర్యంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. తద్వారా సంతానం కలిగేందుకు ఉన్న అవకాశాలు పెరుగుతాయి. సీసీఎంబీలో పరిశీలన.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో వంధ్యత్వ సమస్యలకు చికిత్స పొందుతున్న కొంతమందిని ఎంచుకుని తాము అధ్యయనం చేశామని సీసీఎంబీ శాస్త్రవేత్త సురభి శ్రీవాత్సవ తెలిపారు. వీరు రోజుకు గంట చొప్పున వేర్వేరు ఆసనాలు వేయడంతో పాటు ప్రాణాయామం, ధ్యానం వంటి యోగా క్రియలను అనుసరించారు. యోగా కార్యక్రమంలో చేరే ముందు.. ఆ తర్వాత వీరి వీర్యాన్ని పరిశీలించగా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయని శ్రీవాత్సవ వివరించారు. 400 జన్యువులు ఆన్/ఆఫ్ అయ్యేందుకు కీలకమైన మిథైలోమ్ను యోగా ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు. వీటిల్లో పురుషుల సంతాన లేమికి వీర్య ఉ త్పత్తికి ఉపయోగపడే జన్యువులు ఉన్నాయి. ఈ అధ్యయనంలో గుర్తించిన జన్యువులపై మరి న్ని పరిశోధనలు జరపడం, వీర్యంపై యోగా ప్రభావంపై విస్తృత అధ్యయనం ద్వారా వంధ్య త్వ సమస్యలను అధిగమించేందుకు మెరుగైన మార్గం లభిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. యోగా అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇద్దరు ఏడాది తిరగకుండానే తండ్రులు అవుతుండటం విశేషం. -
నిమ్స్ 'ఖాళీ'!
దేశంలోని ఎయిమ్స్ సహా పలు జాతీయ వైద్య కళాశాలల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 67 నుంచి 70 ఏళ్లు.. ఉస్మానియా, గాంధీ సహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లు.. కానీ.. ఎయిమ్స్‌కు అనుబంధంగా కొనసాగుతున్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల పదవీ విరమణ వయసు మాత్రం 60 ఏళ్లే.. దీంతో ఈ ఆస్పత్రిలో మంచి హస్తవాసి, పేరున్న వైద్య నిపుణుల సేవలు రోగులకు అందడంలేదు. వీరి పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో కీలకమైన కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఈ వైద్యసంస్థలో వచ్చే జూలై చివరి నాటికి 12 మంది, 2022 నాటికి మరో 30 మంది సీనియర్ వైద్యులు రిటైర్డ్ కానున్నారు. సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో వైద్యుల పోస్టులు ఒక్కొక్కటే ఖాళీ అవుతున్నాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు తక్కువగా ఉండటంతో మరికొందరు వైద్యులు బయటి వేతనాలకు ఆశపడి ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్లకే వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే యత్నం చేయడంలేదు. ఫలితంగా 311 పోస్టులకు 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీ ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు.. రోగుల చికిత్సపైనా ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేక, కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొందరు సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పనిచేసేందుకు సుముఖంగా ఉన్నా.. యాజమాన్యం విముఖత చూపుతోంది. జూనియర్లే పెద్దదిక్కు అంతర్గత విబేధాలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఆఫర్లతో ఇప్పటికే చాలామంది వైద్యులు నిమ్స్‌ను వీడిపోయారు. 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి రావడంతో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు, మాజీ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, డయాబెటిక్ నిపుణుడు వెంకటేశ్వరరావు, డాక్టర్ నరేందర్, డాక్టర్ సుభాష్‌కౌల్, డాక్టర్ జీఎస్‌ఎన్‌రాజు సహా పలువురు ఆస్పత్రికి దూరమయ్యారు. న్యూరో ఫిజీషియన్ విభాగాధి పతి డాక్టర్ వీణాకుమారి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. జూలై చివరికి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాంరెడ్డి సహా సీటీ సర్జన్ ఆర్వీకుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప, డాక్టర్ జోత్స్న, డాక్టర్ ఉషారాణి, డాక్టర్నాగేశ్వరరావు తదితరులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయా విభాగాలకు ఇక జూనియర్ వైద్యులే పెద్దదిక్కు కానున్నారు. ఇప్పటికే సీనియర్లు లేక రుమటాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సహా పలు విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. ఆయా విభాగాలపై ఆధారపడిన రోగులతోపాటు సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. రెసిడెంట్లపైనే భారమంతా.. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైంది. 1986లో దీని పడకల సామర్థ్యం 500 కాగా, ప్రస్తుతం 1,500కి చేరింది. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగిన వైద్యులు లేకపోవడంతో రెసిడెంట్లపై భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పనిచేయా ల్సి వస్తుంది. ‘నిమ్స్‌లో రోగులకు ఇంకా సేవచేసే ఓపిక ఉంది! మరికొంత కాలం పనిచేసే అవకాశమివ్వండి’ అని పలువురు నిపుణులు నిమ్స్ పాలకమండలికి మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోతోంది. దీనిపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. ‘ఒకటి రెండు రోజుల్లో పాలక మండలి సమావేశం ఉంది. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. పేరు గొప్ప.. అన్నింటా తీసికట్టు - నిమ్స్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ముఖ్యమంత్రే దీనికి ఛాన్సలర్‌గా ఉంటారు. - ఎయిమ్స్ నిబంధనల ప్రకారం ఇక్కడ నియామకాలు, పదోన్నతులు ఉంటా యి. ఉస్మానియా, గాంధీలో త్రిటైర్ విధానం అమల్లో ఉండగా, నిమ్స్‌లో ఫోర్టైర్ విధానం అమల్లో ఉంది. - ఉస్మానియాలో అసిస్టెంట్ కేడర్‌లో చేరిన ఓ వైద్యుడు ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫె సర్, చివరకు ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకుంటారు. ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుంది. - నిమ్స్‌లో అసిస్టెంట్ కేడర్‌లోని వైద్యు డు అసోసియేట్, అడిషనల్ ప్రొఫె సర్ కేడర్లను దాటుకుని ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ కేడర్ రావడానికి 12 నుంచి 14 ఏళ్లు పడుతోంది. - ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసుకునే అవకాశముంది. ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందుతాయి. కానీ నిమ్స్ వైద్యుల బయటి ప్రాక్టీస్ నిషేధం. ఆరోగ్య శ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందవు. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులతో పోలిస్తే వీరి వేతనాలు చాలా తక్కువ. -
చైనాలో కరోనా కల్లోలం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు. చైనాలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ ఈ వ్యాధి రేపుతున్న కల్లోలం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసాధారణ రీతిలో కొత్త సంవత్సరం వేడుకల్ని చైనా సర్కార్ రద్దు చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్ భారత్‌నూ భయపెడుతోంది. 13 నగరాలకు రాకపోకలు బంద్ కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం 13 నగరాల్లో రవాణా ఆంక్షలు విధించింది. మొట్టమొదటి సారి ఈ వైరస్ కనిపించిన సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో 13 నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకల్ని నిలిపివేసింది. బస్సులు, రైళ్లను రద్దు చేసింది. దీంతో 4.1 కోట్ల మందిపై ప్రభావం చూపించింది. హుబీ ప్రావిన్స్‌లో హువాన్, దాని చుట్టుపక్కల ఉన్న 13 నగరాల నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పట్టణాల్లో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. కొత్త సంవత్సర వేడుకలకి దూరం చైనాలో శనివారం కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది. గణతంత్ర వేడుకలు కూడా రద్దు ఈ నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషే«ధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు కరోనా వైరస్ సోకిందన్న అనుమానం కలిగిన వారికి వైద్యపరీక్షలు, చికిత్సల కోసం రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ (ఎయిమ్స్) ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది ముంబైలో ఇద్దరికి వైద్య పరీక్షలు ముంబై, సాక్షి: చైనా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు జలుబు, దగ్గు ఉండటంతో ముందు జాగ్రత్తగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నుంచే ముంబై విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే, చైనాకు వెళ్లి వచ్చిన 80 మందిని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో ఏడుగురికి దగ్గు, జ్వరం, గొంతువాపు ఉండటంతో చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ నుంచి?: ఈ వైరస్ ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించిందో చైనా ఆరోగ్య అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అయితే సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచి వ్యాపించినట్లు భావిస్తున్నారు. వుహాన్‌లోని ఈ మార్కెట్లో చట్టవిరుద్ధంగా పలు అడవి జంతువులను కూడా అమ్ముతుంటారు. క్రెయిట్ పాములు, నాగు పాములు, గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు చైనా శాస్త్రవేత్తల అభిప్రాయం. 10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం! వైరస్ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా ఫీల్డ్ ఆస్పత్రిని వుహాన్‌లో చైనా నిర్మిస్తోంది. కేవలం 10 రోజుల్లో ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు. కాగా, అమెరికాలో రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. చికాగోకు చెందిన 60 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ణయించారు. గత డిసెంబరులో ఈమె వుహాన్‌ను పర్యటించినట్లు తెలిపారు. మరో 50 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. లక్షణాలు తీవ్రమైన జ్వరం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది న్యుమోనియాతో ఊపిరితిత్తుల్లో సమస్యలు కిడ్నీలు విఫలం కావడం మాస్క్‌లు ధరించడం జాగ్రత్తలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం మాంసాహారం మానేయడం లేదా బాగా ఉడికించి తినడం మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం ఉతికిన దుస్తులు ధరించడం వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం దగ్గు, తుమ్ములు వచ్చినపుడు రుమాలు ఉపయోగించడం వన్యప్రాణులకు దూరంగా ఉండటం వుహాన్‌లో నిర్మించనున్న ఆస్పత్రి కోసం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న పనులు -
కాంగ్రెస్ నేత మృతి, కుటుంబానికి రాహుల్ పరామర్శ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత షంషేర్ సింగ్ సుర్జేవాలా(87) కన్నుమూశారు. అనారోగ్యంతో గతకొంత కాలంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతి చెందినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా తండ్రి అయిన షంషేర్ సింగ్.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ రాష్ట్ర మంత్రిగా ఆయన సేవలు అందించారు. హర్యానా రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన షంషేర్ సుర్జేవాలా రైతుల హక్కుల కోసం పోరాటం చేశారు. ఇవాళ మధ్యాహ్నం హర్యానాలోని నర్వాణాలో షంషేర్ సుర్జేవాలా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఆయన మృతి విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సుర్జేవాలా కుటుంబాన్ని పరామర్శించారు. -
ఏపీలో మద్యం బానిసలు 13.7 శాతం
సాక్షి, అమరావతి: దేశంలో సగటున 10.5 శాతం మంది మద్యానికి బానిసలైతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంఖ్య 13.7 శాతం. మద్యం సేవించే వారి సంఖ్య జనాభా పరంగా చూస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. మద్యంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగంలోనూ రాష్ట్రం తీసిపోలేదు. కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్‌కు బానిసలైన వారిలో పిల్లలు, యువతే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు (ఎయిమ్స్) అనుబంధంగా పనిచేసే నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్(ఎన్డీడీటీసీ) నిర్వహించిన సర్వేలో పలు విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2017 నుంచి 2018 డిసెంబర్ వరకు ఈ సర్వే నిర్వహించారు. 186 జిల్లాల్లో 4,73,569 మందిని ప్రశి్నంచి, నివేదిక రూపొందించారు. 135 జిల్లాల్లో మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ 72,642 మందిని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలు, నిషేధిత డ్రగ్స్, మద్యానికి బానిసలైన వారిపై ఇంత పెద్ద ఎత్తున సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ సర్వే వివరాలను కేంద్ర సామాజిక సాధికారిత శాఖ వెల్లడించింది. ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. ఈ సర్వేను 8 కేటగిరిల్లో నిర్వహించారు. మద్యం లేకపోతే ఉండలేమనే స్థితికి చేరుకోవడం, గంజాయి, నల్లమందు, డ్రగ్స్ వాడడం, ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం లేదా మత్తు కోసం రసాయన పదార్థాలను పీల్చడం, ప్రమాదకర డ్రగ్స్ వినియోగం ఎలా మాన్పించాలి అనే అంశాల ఆధారంగా సర్వే చేపట్టారు. సర్వేలో ఏం తేలిందంటే.. ►ప్రధానంగా 10 నుంచి 75 ఏళ్ల లోపు వారు ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్నారు. ►దేశ జనాభాలో సగటున 10.5 శాతం మంది మద్యం బానిసలు కాగా, ఏపీలో దేశ సగటును మించి మద్యం బానిసలున్నారు. ►జనాభాపరంగా చూస్తే దేశవ్యాప్తంగా మద్యం బానిసల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. ►మద్యం వినియోగంలోనూ ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. ►దేశంలో మద్యం వినియోగం 18.5 శాతం కాగా, ఏపీలో 43.5 శాతం. ►మద్యానికి బానిసలై వైద్యం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ►దేశవ్యాప్తంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వారు 8.5 లక్షల మంది ఉండగా, ఏపీలో 69 వేల మంది ఉన్నారు. ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్న రాష్ట్రాల్లో యూపీ, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్ ఉన్నాయి. ►దేశంలో మద్యం సేవించే మహిళలు, పురుషుల నిష్పత్తి 1:17గా ఉంది. ►ఏపీలో 10 నుంచి 17 ఏళ్ల లోపు వారిలో 1.37 శాతం మంది కొకైన్ వినియోగిస్తున్నారు. ►ఏపీలో నల్లమందు లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ 1.4 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారు. ►నిద్రపుచ్చే మత్తు పదార్థాలను తీసుకునే వారు ఏపీలో 0.80 శాతం మంది ఉన్నారు. ►ఏపీలో 10 నుంచి 75 ఏళ్ల లోపు వారిలో 0.2 శాతం మంది గంజాయి సేవిస్తున్నారు. ►నిద్రపుచ్చే మత్తు మందుల వినియోగంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఏపీలో 3.6 లక్షల మంది ఉన్నారు. ప్రత్యేక వ్యవస్థ అవసరం ►మద్యం, డ్రగ్స్ వ్యసనాన్ని దూరం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీగా డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►మద్యం, డ్రగ్స్ వ్యసనపరులను ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. ప్రస్తుతం ఓపీ క్లినిక్‌లు మాత్రమే ఉన్నాయి. ►మద్యపానాన్ని నియంత్రించేందుకు, మాదక ద్రవ్యాలను అందుబాటులో లేకుండా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తగినంత సిబ్బందిని సమకూర్చాలి. ►దేశంలోకి డ్రగ్స్ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ►2018 డిసెంబర్ నాటికి ఏపీలో మద్యం బానిసలు13.7%మంది ►దేశ సగటు కంటే అధికం.. జనాభా పరంగా దేశంలో నాలుగో స్థానం ►సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు రాష్ట్రంలో 47 లక్షలు మంది ►ఏపీలో ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వారు 69 వేల మంది మద్యం సేవిస్తున్న వారిలో ఎవరెంత (శాతాల్లో) -
‘నీట్’తోనే ఎయిమ్స్, జిప్మర్ ప్రవేశాలు
న్యూఢిల్లీ చెన్నై: ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో ప్రవేశాలను వచ్చే ఏడాది నుంచి నీట్ ద్వారానే చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు మినహా మిగతా అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారా చేపడుతున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారానే జరపనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అన్ని కాలేజీలకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించే వీలు ఉంటుందన్నారు. తమ మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఎయిమ్స్, జిప్మర్లో ప్రవేశానికి ఇకపై ప్రత్యేక పరీక్ష ఉండదని వెల్లడించారు. ఎన్ఎంసీ ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి ‘నెక్ట్స్’పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు. దేశమంతటా నీట్ కుంభకోణం నీట్ ఎంట్రెన్స్‌లో అవకతవకలకు పాల్పడి తప్పుడు మార్గంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పొందిన వ్యవహారంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణం తమిళనాడుకే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. కేవీ ఉదిత్ సూర్య అనే విద్యార్థి అక్రమంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారంటూ సూర్యతోపాటు ఆయన తండ్రి డాక్టర్ వీకే వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై హైకోర్టు కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిస్పందించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు తమ తరఫున వేరే వారితో ఎంట్రెన్స్ రాయించారని తేలింది. -
అందరివాడు
రాజకీయాల్లో అందరి మనసులూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ జనతా పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలు సేవలందించిన అరుణ్ జైట్లీ... తన వాక్చాతుర్యంతో, అపార ప్రతిభాపాటవాలతో అందరి మనసులూ చూరగొన్నారు. ఒక న్యాయవాదిగా పార్టీలకతీతంగా ఎవరి తరఫునైనా వాదించే విలక్షణత్వం, ప్రత్యర్థుల్ని విమర్శించడంలో కనబరిచే హేతుబద్ధత ఇవన్నీ జైట్లీకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. అందుకే ప్రధానిగా ఎవరున్నా బీజేపీలో అరుణ్‌జైట్లీ స్థానం ప్రత్యేకమే. అందుకే కావచ్చు! కాంగ్రెస్‌లోనూ ఆయనకు వీరాభిమానులున్నారు. వాదనలో పదునెక్కువ గోధ్రా మతఘర్షణల్లో మోదీ తరపున, సొహ్రాబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసుల్లో కూడా జైట్లీ వాదించారు. సోనియా, రాహుల్ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు, చిదంబరం ఇరుక్కకున్న కేసులు, ఇంకా ఎన్నో ప్రత్యేక కేసుల్లో అవి తప్పా, ఒప్పా అన్నది పక్కన పెడితే కోర్టుల్లో ఆయన వాదనా పటిమకు ప్రత్యర్థులు కూడా ముగ్ధులయ్యేవారు. ప్రఖ్యాత లాయర్ రామ్‌జెఠ్మలానీ వంటి వారి ప్రశంసలు అందుకున్నారు. తెరవెనుక వ్యూహకర్త జైట్లీ మంచి వ్యూహకర్త. అమిత్ షా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందు ఎక్కడ ఎన్నికలు జరిగినా జైట్లీ పేరే వినిపించేది. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా డజనుకిపైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించారు. గోధ్రా ఘర్షణల సమయంలో గుజరాత్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న జైట్లీ.. మోదీకి అత్యంత అండగా నిలిచి ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక జైట్లీ కృషి కూడా ఉంది. ఆ ఎన్నికల వ్యూహకర్తల్లో జైట్లీ కూడా ఒకరు. ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నిక కాలేదు... ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అరుణ్ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అమృత్సర్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్‌ను ఎదుర్కోలేక ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకుంది. పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సైతం జైట్లీ కొనసాగారు. మోదీకి ప్రధాన మద్దతుదారు వాజపేయి హయాంలోనే జైట్లీ అత్యంత కీలకమైన శాఖల్ని నిర్వహించారు. న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్ వ్యవహారాల శాఖలపై తనదైన ముద్రవేశారు. మోదీ ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో బీజేపీలో దిగ్గజ నాయకులు కొందరు వ్యతిరేకించి అడ్వాణీ వెంట నడిచారు. కానీ జైట్లీ అలా కాదు. గుజరాత్ సీఎంగా మోదీ నియామకం సమయంలో... గోద్రా ఘర్షణల సమయంలోనూ మోదీ వెంటే ఉన్నారు. ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. మోదీ ఆర్థిక నిర్ణయాలకు అండగా ఉండి ప్రత్యర్థుల నోరు మూయించారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తర్వాత అనారోగ్య కారణాలతో మీడియా ముందుకు రాకపోయినా సొంతగా బ్లాగు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ పోస్టులు పెట్టేవారు. మోదీ సర్కార్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందారు. 2016లో పార్లమెంట్లో ప్రధాని మోదీతో.. క్రికెట్ అంటే ప్రాణం న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా అనూహ్యమైన విజయాలు సాధించిన అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ప్రాణం. చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడేవారు. బీజేపీలో చేరాక బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ క్రికెట్ అధ్యక్షుడిగా పదమూడేళ్లపాటు ఉన్న జైట్లీ రాజధానిలో క్రికెట్ స్టేడియం నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కృషి చేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో జైట్లీ అవకతవకలకి పాల్పడ్డారని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణు చేయడంతో ఆయనను కోర్టుకు లాగారు. జైట్లీ వాదనా పటిమతో ఆఖరికి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
6కిపైగా కొత్త పారిశ్రామిక పాలసీలు !
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా త్వరలో 6కిపైగా నూతన పారిశ్రామిక విధానాలను ప్రకటించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రస్తుత పాలసీల కంటే అధిక ప్రయోజనాలను అందించేలా 3 – 5 నెలల వ్యవధిలో కొత్త విధానాలను అమలులోకి తెస్తామన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ కార్యక్రమంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై ఆయన మాట్లాడారు. సమగ్ర పారిశ్రామిక పాలసీతోపాటు, ఆటోమొబైల్, ఐటీ, బయోటెక్నాలజీ, పెట్రో కెమికల్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి ఆరుకు పైగా రంగాలకు ప్రత్యేక పాలసీలను తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు సహకారం అందించేందుకు ఢిల్లీలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కార్యాలయాలు ప్రారంభించాలనుకుంటే ఉచితంగా ఆఫీస్ స్పేస్‌ను అందచేస్తామన్నారు. రాష్ట్రానికి 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంతోపాటు నాలుగు పోర్టులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మరో నాలుగు పోర్టులు నిర్మించనున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉండగా మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయని రజత్ భార్గవ చెప్పారు. విశాఖ సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొత్త ఎయిర్‌పోర్టులో పెట్టుబడులు పెట్టడానికి జ్యూరిచ్ ఆసక్తి వ్యక్తం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు. కొరియా, చైనా, బ్రిటన్ తదితర దేశాలు ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజారవాణా వ్యవస్థలో డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆటోమొబైల్ రంగంలో భారీ పెట్టుబడులకు ఏపీలో అవకాశాలున్నాయన్నారు. 31 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ఏర్పాటు చేశామన్నారు. కష్టాల్లో ఉన్న 86,000కిపైగా ఎంఎస్ఎంఈలకు నవోదయం పథకం కింద రుణాలను రీ షెడ్యూల్ చేయడం ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కాకినాడ సెజ్‌లో పెట్రో కెమికల్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్నాయని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఏపీలో అపార అవకాశాలు రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి బీచ్ టూరిజం, ఎకో టూరిజం వరకు అనేక సర్క్యూట్లు ఉన్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని బౌద్ధ కేంద్రాల్లో ఉన్న అవకాశాలను జపాన్ లాంటి దేశాలు వినియోగించుకోవాలన్నారు. హెల్త్ టూరిజంలో కూడా పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని వివరించారు. అపోలో, కేర్, రెయిన్బో లాంటి ప్రముఖ ఆస్పత్రులు ఇప్పటికే ఏర్పాటయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 86,219 మంది డాక్టర్లు ఉండగా ఏటా 29 వైద్య కళాశాలల నుంచి 5,000 మందికిపైగా గ్రాడ్యుయేట్లు పట్టాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడం కోసం ప్రభుత్వం నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తోందని ముఖ్యమంత్రి సలహాదారు ఎం.శామ్యూల్ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, దశలవారీ మధ్యనిషేధం, జలయజ్ఞం, ఫించన్ల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్, అందరికీ ఇల్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీలో ఫిషరీస్‌తో పాటు పాడి, పశుసంవర్థక రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని మత్స్య, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. అనూహ్య స్పందన: విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి హరీష్ రాష్ట్రాల్లో పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు తొలిసారిగా ఏర్పాటు చేసిన డిప్లొమాటిక్ ఔట్రీచ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పి.హరీష్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పలు దేశాల రాయబారులు, ప్రతినిధులు హాజరుకావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో అపార అవకాశాలున్నాయని దీన్ని వినియోగించుకోవాల్సిందిగా విదేశీ ప్రతినిధులను కోరారు. -
నడక నేర్పిన స్నేహం
అది 2015 సంవత్సరం. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ. ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ అతడి సహచరులు నలుగురైదుగురి మధ్య గాఢమైన స్నేహబంధం ఉండేది. ఒకే కంచం, ఒకే మంచం అన్నంతగా అల్లుకుపోయారు. వారిలో తరుణ్ అనే స్నేహితుడు వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. మడమ పైభాగంలో కాలు విరగడంతో కొన్నాళ్లు వీల్ చెయిర్‌కే తరుణ్ పరిమితమయ్యాడు. ఆ తర్వాత క్రచ్‌ల సాయంతో నడిచినా కష్టంగా ఉండేది. సీన్ కట్ చేస్తే ఇటీవలే.. శ్రీనివాస్ అతడి మిత్రులు అరవింద్ సురేశ్, అంబాల పూజా, గిరిష్ యాదవ్‌లు తరుణ్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. స్నేహితుల దినోత్సవం రోజున తరుణ్‌కు వాళ్లిచ్చిన కానుక వెల కట్టలేనిది. తరుణ్ నడిచేందుకు వీలుగా ఓ క్రచ్‌ను స్వయంగా డిజైన్ చేసి ఇచ్చారు. దీని సాయంతో ఎలాంటి రోడ్డుపై అయినా అవలీలగా నడవొచ్చు. మంచు కురుస్తున్నా, బురదగా మారినా, రాళ్లూరప్పలు ఉన్నా.. మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా ఎంతో హాయి. వీటి కిందభాగం మృదువుగా ఉండటమే కాకుండా అడుగు వేస్తే ఎలాంటి నొప్పి కలగదు. ఆఖరి సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తరుణ్‌కు ఆసరాగా ఉండేందుకు ఈ ప్రోటోటైప్ క్రచ్‌ల డిజైన్ మొదలు పెట్టారు. బిరాక్, ఒయాసిస్ అనే అధ్యయన సంస్థలతో కలసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్రచ్‌ను రూపొందించారు. వీటిని ఫ్లెగ్జ్మో క్రచ్‌లని పిలుస్తారు. పోలియో వ్యాధిగ్రస్తులు, ఆపరేషన్ అయినవారు ఈ క్రచ్‌లని వినియోగించుకోవచ్చు. వీటిని ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యులు కూడా పరీక్షించి చూసి కితాబిచ్చారు. ఈ నెల 9న ఈ క్రచ్‌లను మార్కెట్లోకి కూడా విడుదల చేయనున్నారు. ఒక స్నేహితుడి కోసం వారు పడ్డ తపన, ఇప్పుడు ఎందరో జీవితాలకు ఆసరాగా మారుతోంది. నడవ లేని వారి జీవితాలను ఈ క్రచ్ మార్చేస్తుందని తరుణ్ ఆనందబాష్పాల మధ్య చెప్పాడు. -
నిను వీడని నీడను నేనే
సాక్షి, విశాఖపట్నం : కంటినిండా కునుకు కరువయ్యిందా..?అయితే.. పనిలో ఏకాగ్రత కోల్పోతారు.చిన్న విషయానికే కోపం, చిరాకు పడుతుంటారు..ఊబకాయులుగా మారిపోతారు..అవునా.. సరిగా నిద్రపోకపోతే ఇన్ని సమస్యలు వెంటాడతాయా? అని ఆశ్చర్యపోతున్నారా.? ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఎవరైనా నిద్రపోతున్న వారిని మేల్కొలిపితే ‘బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు’ అంటూ కొంచెం అసహనం వ్యక్తం చేస్తారు. నిద్రను బంగారంతో పోల్చడం చూస్తే ఎంతటి ప్రాధాన్యం ఉందో ఇక్కడే తెలిసిపోతోంది. మానవుడికే కాదు పశుపక్ష్యాదులకూ నిద్ర అవసరమే. ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సుఖమెరగదు.. అంటారు. కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. ఇంతకు మించిన జీవితం ఏముంటుందనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా కంటికి కునుకు దూరమైపోతోంది. నిద్రలేమితో కనురెప్పలు మూతలు పడక అలసిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ.. సాధారణంగా వీటివల్లే నిద్రలేమి సమస్యలు వస్తాయి. వీటన్నింటికంటే యువత నిద్రలేని రాత్రులు గడుపుతుండటానికి మూలకారణం ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్‌ఫోన్ ఫీవర్. వీటితో సావాసం చేసుకుంటూ నిద్రమానుకుంటున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ అంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఏడాది కిందట ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని వెల్లడైంది. ఇక విశాఖ నగరం విషయానికొస్తే 60 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది. ఇందులో యువతే ఎక్కువ శాతం ఉంది.. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. అలాగే రోజుకు 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణ రేటు పెరుగుతుందని వెల్లడించింది. ఒకప్పుడు నిద్ర పోయే సమయం రాత్రి 7 నుంచి 8 గంటలకు ప్రారంభమయ్యేది. టీవీలు వచ్చాక అది కాస్తా 10 గంటలైంది. కంప్యూటర్లు వచ్చాక 11 గంటలు., స్మార్ట్ఫోన్లు వచ్చాక అర్ధరాత్రి 12.. ఒంటి గంట, 2 గంటలు.. ఇలా.. దాటిపోతోంది. నగరంలోనూ నిద్రలేమి దేశ రాజధానిలోనే కాదు.. ప్రతి నగరం దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. విశాఖ నగరంలో ముఖ్యంగా యువతరం నిద్రకు దూరమైపోతోంది. ఒక దశలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకూ నిద్రపోకుండా కొన్ని నెలల పాటు కాలం వెళ్లదీసిన వారి శరీర గడియారంలో వచ్చిన మార్పుల కారణంగా నిద్రపోదామని ఇప్పుడు ప్రయత్నిస్తున్నా.. ఫలితం శూన్యం. కేవలం యువతరమే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు సైతం.. తమ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక.. సెల్‌ఫోన్‌తో సావాసం చేస్తూ.. ఆరోగ్యానికి మేలు చేకూర్చే నిద్రను మరిచిపోతున్నారు. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు.. టెక్నాలజీ రెండూ కలిసి సిటీజనులను నిద్రకు దూరం చేస్తున్నాయని నగరానికి చెందిన పలు సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 83 శాతం మంది కలత నిద్రకు గురవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ప్రభుత్వ, ప్రైవేట్, సొంత వ్యాపారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రజలు నిద్ర సుఖానికి దూరమైపోతున్నారు. నిత్యం 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారు 31 శాతం కాగా, 6 గంటల కంటే తక్కువ సమయం శయనిస్తున్నవారు 27 శాతం మంది ఉండటం గమనార్హం. ఇక 25 శాతం మంది ఏకంగా 5 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారని అధ్యయనంలో తేలింది. 35 శాతం మంది అర్ధరాత్రి 12 నుంచి ఒంటిగంట దాటిన తర్వాత కానీ.. నిద్రకు ఉపక్రమిస్తున్నారంట. రాత్రి సమయంలో నిద్రలేమి కారణంగా పని చేస్తున్న ప్రాంతాల్లో 83 శాతం మంది ఓ పావు గంట సేపు కునుకు తీస్తున్నారని అధ్యయనంలో తేలింది. చక్కటి నిద్రకు చిట్కాలివే.... నిద్రకు ఉపక్రమించే ముందు టీ, కాఫీలు తాగకూడదు. నిద్రపోయే ప్రదేశంలో చీకటిగా ఉండాలి. వెలుతురు కళ్లపై పడకుండా జాగ్రత్త పడాలి. నిద్రకు ఉపక్రమించే సమయంలో సెల్ఫోన్లను దూరం పెట్టాలి. అవసరమైతే స్విచాఫ్ చేయాలి. వీలైనంత వరకూ పడుకునే సమయానికి గంట ముందుగానే టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు ఆఫ్ చేయాలి. మంచి పుస్తకం చదువుతూ నిద్రపోతే గాఢనిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే.. రాత్రి 8 గంటలకే ఆఫ్ చేయాలి. అప్పుడే సోషల్‌మీడియాలో ఎలాంటి అప్డేట్స్ మిమ్మలను విసిగించవు. మెడిటేషన్ సాధన చేస్తూ.. శరీరంపై పట్టు సాధించాలి. యోగా, నడక, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. మధ్య వయసులో ఉన్న వారు 24 గంటల్లో కచ్చితంగా నిద్రకు 8 గంటలు కేటాయించాలి. మిగిలిన 8 గంటలు పని, మరో 8 గంటలు శారీరక అవసరమైన పనులకు వినియోగించాలి. -
దేశంలో మద్యపాన ప్రియులు 16 కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 14.6 శాతం (16 కోట్ల మంది) మద్యం సేవించేవారు ఉన్నారని ఓ సర్వే ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది. మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయి. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని సర్వేకోసం ప్రామాణికంగా తీసుకున్నారు. మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. ప్రతి 180 మందిలో ఒకరు ఏదో ఒక సమయంలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారే. 15ఏళ్ల విరామం తర్వాత ఎయిమ్స్ ఆధ్వర్యంలోని ఎన్డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం– సాధికారత శాఖ ఈ సర్వే చేసింది. ‘గతంలో 2001లోనూ సర్వే చేసి 2004లో ఫలితాలను ప్రకటించినా, అది రాష్ట్రాల వారీగా పూర్తి గణాంకాలను సమర్పించలేదు. అయితే ప్రస్తుత సర్వే దేశంలో గణనీయమైన స్థాయిలో మత్తు పదార్థాల వినియోగాన్ని తెలుపుతోంది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. వయోజనుల్లో ఈ రుగ్మతల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని సర్వే స్పష్టం చేసింది’ అని నివేదిక తయారుచేశాం’ అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. జాతీయ స్థాయిలో 186 జిల్లాలలో ఈ సర్వే చేశారు. దేశ జనాభాలో 2.8 శాతం (దాదాపు మూడు కోట్లు) గత 12 నెలల కాలంలో తాము గంజాయి లాంటి మత్తు పదార్థాలను రుచిచూశామని చెప్పారు. సాధారణ మత్తు మందు ఉపయోగించే వారి సంఖ్య 1.14 కాగా, ఔషధ మత్తు మందులు (వైద్యులు చెప్పిన పరిమితికన్నా ఎక్కువ) ఉపయోగించే వారు 0.96 శాతం. 0.52 శాతం ప్రజలు సాధారణంగా లభించే నల్లమందును వాడుతున్నట్లు తెలిసింది. -
నిమ్స్ ఇకపై ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: 2019–20 విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో ఇందుకు అనుగుణంగా బీబీనగర్ నిమ్స్ భవనాన్ని ఎయిమ్స్‌కు రాష్ట్ర అధికారులు అప్పగించారు. దీనికి ఇటీవల రూ.1028 కోట్ల నిధులకు కూడా కేంద్రం కేటాయించింది. 45 నెలల్లో ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సూచించింది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన భూ, భవన నిర్మాణం సహా అన్ని రకాల పత్రాలను ఎయిమ్స్‌కు అధికారులు అందజేశారు. ఇప్పటి వరకు నిమ్స్ ఆధ్వర్యంలో ఉన్న రూ.200 కోట్లకుపైగా విలువ చేసే రెండు బహుళ అంతస్తుల భవనాలు, 151 ఎకరాల భూమి సహా రూ.60 లక్షల విలువ చేసే లేబొరేటరీ, వైద్య పరికరాలు ఎయిమ్స్ అధీనంలోకి వెళ్లాయి. దీంతో నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆర్థికంగా నష్ట పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు యాదాద్రిజిల్లా రెవెన్యూ అధికారులు ఇటీవల మరో 49 ఎకరాల భూమిని సేకరించి ఎయిమ్స్‌కు సమకూర్చారు. ఓపీ సేవలు కొనసాగుతాయి అనేక విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 2016 మార్చిలో బీబీనగర్ నిమ్స్‌లో అవుట్ పేషెంట్ సేవలను ప్రారంభించింది. త్వరలోనే ఇన్ పేషెంట్ సేవలను ప్రారంభించాలని నిర్ణయిం చింది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే కేంద్రం రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేసింది. ఎయిమ్స్ సేవలు ప్రారంభమయ్యే వరకు ఓపీ సేవలు కొనసాగుతాయని బీబీనగర్ నిమ్స్ ఇన్చార్జి డాక్టర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
పరిశోధనలా.. లైట్ తీస్కో!
వైద్య కళాశాలలో సీటు వచ్చిందా... చదివామా... హాయిగా స్థిరపడ్డామా.. అనే ధోరణి ఇప్పటి విద్యార్థుల్లో నెలకొంది.ఎంబీబీఎస్ చదవడం, ఆ తర్వాత ఏదో స్పెషలైజేషన్ పూర్తిచేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరంకెల జీతంతో చేరడమే లక్ష్యమైంది. పైగా వైద్య రంగంలో పరిశోధన చేసే వారిని రెండో జాతి పౌరుడిగా చూస్తున్నారన్న ప్రచారమూ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య కళాశాల ల్లో పరిశోధన మసకబారింది. ఎయిమ్స్ సహా మరికొన్ని బోధనాసుపత్రుల్లో మాత్రమే దీనికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ అంశాన్నే ‘ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇండియా’ఎత్తి చూపింది. దీంతో దేశంలో పుట్టుకొస్తున్న అనేక వ్యాధులకు పరిష్కారాలు దొరకడంలేదని పేర్కొంది. ఈ స్థితిపై ఒక అధ్యయన పత్రాన్ని కేంద్రానికి అందజేసింది. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే మెడికల్ కాలేజీల్లో నియమించుకునే అధ్యాపకులు తప్పనిసరిగా పరిశోధన పత్రాలు సమర్పించి ఉండాలి. వివి ధ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌ల్లో వారి పరిశోధన పత్రా లు ముద్రితమై ఉండాలంది. అప్పుడే దేశంలో పరిశోధన ముందుకు సాగుతుందని తెలిపింది. ఈ పత్రంపై రాష్ట్రంలోని వివిధ వైద్య ప్రముఖులూ చర్చిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఇస్రో స్ఫూర్తి..ఎంతో మేలు ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధనల్లో ప్రధానంగా ఆయా దేశాల్లో వస్తున్న వ్యాధులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సంభవిస్తున్న జబ్బులకు పరిష్కారాలు కనుగొంటున్నారు. జీవనశైలి వ్యాధులు, స్థానికంగా తలెత్తుతున్న ఇన్ఫెక్షన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో 2007 నాటికి 9,066 ఆరోగ్య పరిశోధనా పత్రాలు తయారయ్యాయి. అందులో ఢిల్లీ ఎయిమ్స్ ఒక్కటే 2,567 పత్రాలను విడుదల చేయడం విశేషం. స్కోపస్ అనే డేటా బేస్ సంస్థ విశ్లేషణ ప్రకారం 2005–14 మధ్య దేశంలో ఉన్న 579 వైద్యకళాశాలలు, బోధనాసుపత్రుల్లో కేవలం 25 సంస్థల్లో మాత్రమే ఏటా 100కు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించాయి. 332 కళాశాలలు ఒక్క పరిశోధనా పత్రాన్ని సమర్పించలేకపోయాయి. వాటి పత్రాలు ఏవీ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌లో ముద్రితం కాలేదు. అందులో మన తెలంగాణకు చెందిన కాలేజీలు ఉండటం విశేషం. కానీ మన దేశంలోనే ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో జరుగుతున్న పరిశోధనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కమిషన్ పేర్కొంది.ఇందులో పనిచేసే శాస్త్రవేత్తలకు చెల్లిస్తున్న వేతనాలు సముచితంగా ఉన్నా, ప్రైవేటు రంగంతో పోలిస్తే తక్కువే. అయినా ఇస్రోలో ఎందుకు పరిశోధనలు బాగుంటున్నాయంటే అక్కడ పని సంస్కృతి అధికంగా ఉండటమేనని కమిషన్ తేల్చింది.అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు జాతికి గర్వకారణంగా నిలిచారు. వైద్య రంగంలో పరిశోధనలు కుంటుపడటానికి బ్యూరోక్రసీ, రాజకీయ రంగ ఆధిపత్యం కూడా కారణాలుగా నిలిచాయి. వైద్య పరిశోధనలకు తలసరి కేటాయింపు రూ.డెబ్భైయేనా? వైద్యరంగంలో పరిశోధనలకు అత్యంత తక్కువ కేటాయిస్తున్నారు. మన దేశంలో తలసరి కేటాయింపు కేవలం రూ.70 మాత్రమే. ఆ కొద్ది మొత్తానికీ ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది. స్థానిక అవసరాలు, దేశం ఎదుర్కొనే కీలక అనారోగ్య అంశాలపై కేంద్రీకరించడంలేదు. పైగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దేశానికి అవసరమైన ఆరోగ్య పరిశోధన ఎజెండాను సరిగా నిర్వచించడంలేదన్న విమర్శ నెలకొంది. దీంతో ఐసీఎంఆర్ 2017 నుంచి 2024 మధ్య కాలానికి గాను పరిశోధనలపై వ్యూహాత్మక ప్రణాళికను రచించింది. ఐదు ప్రధాన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. శక్తి సామర్థ్యాలను సాధించడం, డేటా మేనేజ్మెంట్, సంప్రదాయ వైద్య విధానాలను గుర్తించడం, వాస్తవాల పునాదులపై విధానాలను రూపొందించడం, పరిశోధనల ద్వారా ఆరోగ్య కార్యక్రమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య బడ్జెట్లో 2% పరిశోధనకు సిఫార్సు.. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చూస్తే... ఆరోగ్య బడ్జెట్లో కనీసం రెండు శాతం పరిశోధనకు కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. అందులో ప్రజారోగ్యంపై జరిగే పరిశోధనలకు అధికంగా ఇవ్వాలంది.మెడికల్ కాలేజీల్లో పరిశోధనరంగాన్ని విస్తృతం చేయాలి. అధ్యాపకులకు పరిశోధనలపై పదోన్నతులు కల్పించాలి. వారి పరిశోధన పత్రాలు వివిధ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌ల్లో ముద్రితమై ఉండాలి.జాతీయస్థాయి ప్రాధా న్యం ఉన్న అంశాలపై పరిశోధనను తప్పనిసరి చేయాలి. వైద్య రంగంలో పరిశోధన చేసే వారిని ప్రముఖంగా గుర్తించాలి. వైద్య రంగంలో పరిశోధన విధాలు... 4 1 ప్రత్యక్ష పరిశోధన... ఏదో ఒక వ్యాధిపై పరిశోధన చేయాలి. అది కూడా జాతీయ ప్రాధాన్యంగల అంశంపై చేయాలి. స్వల్పకాలిక లేదా మధ్యకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా జరగాలి. ప్రభుత్వమే ఆ ప్రాధాన్యాన్ని నిర్ధారించాలి. ప్రభుత్వమే నిధులు కేటాయించాలి. 2 అంతర్జాతీయస్థాయి కలిగిన కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్.. దీని లక్ష్యం కొత్త వ్యాక్సిన్లు, మాలిక్యూల్స్, సాంకేతిక అంశాలను అభి వృద్ధి చేయడం. ప్రైవేటు రం గంతో కలసి నిర్వహిస్తారు. మేధోపరమైన హక్కులు సాధించుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. 3 క్లినికల్ రీసెర్చ్... వ్యాధుల వల్ల దేశానికి కలిగే నష్టం, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జరగాలి. ప్రధా నంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిధులు కేటాయించాలి. 4 విదేశీ నిధులతో జరిగే పరిశోధనలు... ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగానికి సవాల్ విసురుతున్న అంశాలపై దేశంలో జరిగే పరిశోధనలకు అంతర్జాతీయ సంస్థలు నిధులు కేటాయిస్తాయి. ఆ నిధులతో పరిశోధనలు చేపట్టాలి. -
బీబీనగర్‌లో ఎయిమ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి/ న్యూఢిల్లీ: బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను 45 నెలల్లో నెలకొల్పేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బీబీనగర్ ఎయిమ్స్‌తో పాటు, తమిళనాడులోని మధురైలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బీబీనగర్‌లోని ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని, మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. అవసరమైన నిధులను ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద సమకూర్చుతారు. 2019–20 విద్యా సంవత్సరంలోనే బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహించేలా ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా అద్దె భవనాలు, ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాల్లో ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 15 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ సీట్లు వస్తాయి. దీంతోపాటు 750 పడకలతో ఎయిమ్స్ ఆసుపత్రి నెలకొల్పుతారు. రోజుకు 1,500 మంది ఔట్ పేషెంట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసే 750 పడకల్లో ఎమర్జెన్సీ లేదా ట్రామా బెడ్స్, ఆయుష్ బెడ్స్, ప్రైవేటు పడకలు, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉంటాయి. మెడికల్ కాలేజీ, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, రాత్రి బస, గెస్ట్‌హౌస్, హాస్టళ్లు, రెసిడెన్షియల్ సదుపాయం ఉంటాయి. 3 వేల మంది సిబ్బంది.. బీబీనగర్ ఎయిమ్స్‌లో అనేక రకాల స్పెషలిస్టు వైద్యులుంటారు. నిపుణులైన వైద్య సిబ్బంది ఉంటుంది. కేంద్రం పేర్కొన్న ప్రకారం 3 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ఉంటారు. ఎయిమ్స్‌కు అవసరమైన భవనాలు, స్థలం అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు సీఎస్ ఎస్కే జోషి గతంలో లేఖ రాశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలు ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. బీబీనగర్‌లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. ఒక అంచనా ప్రకారం వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి అక్కడ ఎంబీబీఎస్ తరగతులతో ఎయిమ్స్ ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా, ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం తెలపడంపై వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నరసయ్యగౌడ్, బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. -
వచ్చే ఏడాదే మన ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 14 ఎయిమ్స్‌లలో ఒకేసారి ప్రవేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర బృందం అక్కడికి వచ్చి నిమ్స్ భవనాలు, అదనపు స్థలాలను పరిశీలించింది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ ఎయిమ్స్‌కు కూడా ప్రవేశాలు జరిపేలా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎయిమ్స్ ఏర్పాటు వచ్చే ఏడాదే ఉంటుందని స్పష్టమైంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, బఠిండా, భోపాల్, భువనేశ్వర్, గోరఖ్‌పూర్, దేవ్‌గఢ్, జోధ్‌పూర్, కల్యాణి, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రాయ్‌బరేలీ, రిషికేశ్‌ల్లో ఉన్న ఎయిమ్స్‌ల్లోనూ ప్రవేశాలు జరుపుతామని నోటిఫికేషన్లో వెల్లడించారు. మే 25, 26 తేదీల్లో ఎంట్రన్స్ టెస్ట్ అన్ని ఎయిమ్స్‌ల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. జనవరి మూడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది మే 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వివరాలు ఎయిమ్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సుకు అర్హులు. అలాగే ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాలంటే ప్రవేశ పరీక్షలో సరైన ర్యాంకు రావడంతోపాటు ఇంటర్మీడియెట్‌లోని ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు మొదలైన సన్నాహాలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎయిమ్స్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని తెలంగాణ ప్రభు త్వం అక్టోబర్‌లో కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు అప్పట్లో లేఖ రాశారు. నిమ్స్ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. బీబీనగర్‌లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. అంతేగాక ఎయిమ్స్ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
19 కొత్త ఎయిమ్స్‌లలో ఆయుర్వేద శాఖలు
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుచేసిన 19 ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లలో ఆయుర్వేద శాఖలను నెలకొల్పనున్నట్లు ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), ఇతర పారమిలటరీ దళాలకు చెందిన ఏడు ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖలను ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 100 ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని నాయక్ తెలిపారు. అంటురోగాలుకాని వ్యాధుల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన జాతీయ పథకాన్ని ఇప్పుడున్న ఆరు రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు. -
ఎయిమ్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎయిమ్స్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు లేఖ రాశారు. అలాగే నిమ్స్ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఎయిమ్స్ కోసమే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఎయిమ్స్ కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాటం చేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రులను కలసి వినతిపత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
పరీకర్ మంత్రిత్వ శాఖల అప్పగింత?
పణజి: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో పాంక్రియాటిక్ వ్యాధికి చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పరీకర్ శుక్రవారం మంత్రులు, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పాలనపై మంత్రులతో పరీకర్ చర్చించారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖలను మిగతా మంత్రులకు అప్పగించాలని నిర్ణయించారు. ‘గోవాలో పరిపాలనతో పాటు కీలక శాఖల పనితీరుపై పరీకర్ సమీక్ష నిర్వహించారు. పరీకర్ కోలుకుంటున్నారు. ఆయనే సీఎంగా ఉంటారు. దీపావళి కల్లా డిశ్చార్జ్ అవుతారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖల్లో కొన్నింటిని మిగతా మంత్రులకు అప్పగించడంపైనా చర్చించాం’ అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. -
గోవాకు త్వరలో కొత్త సీఎం?
పణజి: ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్ కార్యదర్శి చెల్లకుమార్ తెలిపారు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పారికర్
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ (62) శనివారం మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. దీంతో బీజేపీ నాయకత్వం ఇతర మార్గాల అన్వేషణలో పడింది. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ వారం పాటు అమెరికాలో చికిత్స పొంది ఈనెల మొదటి వారంలోనే ఆయన తిరిగి వచ్చారు. కొన్ని రోజులకే మరోసారి గోవాలోని కండోలిమ్ ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు ఈ ఏడాది ప్రారంభంలో 3 నెలల పాటు పారికర్ అమెరికాలో సుదీర్ఘ చికిత్స పొందిన విషయం తెలిసిందే. తరచూ ఆయన అనారోగ్యానికి గురికావడం, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ఇద్దరు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం సోమవారం గోవా వెళ్లనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యామ్నాయాల మార్గాల అన్వేషణలో ఉందని సమాచారం. నాయకత్వ మార్పిడికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పారికర్‌తో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. -
‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు
భోపాల్: చెత్త ఏరుకునే వ్యక్తి కుమారుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి తొలి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో సీటు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన ఆశారాం చౌదరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రవేశపరీక్షలో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో అతని ర్యాంకు 707. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సీటు రావడంతో కళాశాలలో చేరేందుకు ఆశారాం రాజస్తాన్ వెళ్లాడు. అతని వైద్య విద్యకయ్యే ఖర్చు మొత్తాన్నీ భరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లోనూ ఆశారాం ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 803 ర్యాంకు సాధించాడు. ఆశారాం గురించి తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అతణ్ని కార్యాలయానికి పిలిపించి అభినందించి, తొలి సాయంగా 25 వేల రూపాయలు అందజేయాల్సిందిగా దేవాస్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాండేను ఆదేశించారు. శనివారమే ఆశారాం జోధ్‌పూర్ బయల్దేరాడు. అతనికి తోడుగా ప్రభుత్వమే ఓ అధికారిని పంపించింది. చెప్పలేనంత సంతోషంగా ఉంది: ఆశారాం ఎయిమ్స్‌లో సీటు రావడంతో తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆశారాం అంటున్నాడు. ‘మా నాన్న చెత్త ఏరుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమ్ముడు పన్నెండో తరగతి, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మా ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌గానీ, మరుగుదొడ్డిగానీ లేదు’ అని ఆశారాం తన కుటుంబ దుర్భర పరిస్థితిని వివరించాడు. న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమనీ, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ చదివి సొంత ఊరిలోనే వైద్యశాల ప్రారంభించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తానని ఆశారాం వెల్లడించాడు. తమ ఊరిలోని వైద్యుడు దుర్గా శంకర్ కుమావత్ తనకు ఎంతో సాయం చేశాడనీ, ఆయనే తన హీరో అని వివరించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆశారాంకు ఓ లేఖ రాసి అభినందించారు. ‘నీలాంటి వాళ్లు ఎందరికో ఆదర్శంగా మారుతారు’ అని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
మారుతీ లక్ష్యం.. ఏటా 22.5 లక్షల కార్ల తయారీ
మెహసానా: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై దృష్టిపెట్టింది. 2020 నాటికి గుజరాత్ ప్లాంటులోని మూడు యూనిట్ల నుంచి తయారీని 7.5 లక్షల యూనిట్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. దీంతో మొత్తం తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 22.5 లక్షల యూనిట్లకుపైగా తీసుకెళ్లాలని చూస్తోంది. అలాగే 2020 తర్వాత తయారీని దీని కన్నా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే మార్గాలను అన్వేషిస్తోంది. ‘‘గుజరాత్ ప్లాంటులో మూడు యూనిట్లున్నాయి. ఇందులో ఒక దానిలో తయారీ ప్రారంభమైంది. దీని సామర్థ్యం ఏడాదికి 2.5 లక్షల యూనిట్లు. ఇదే తయారీ సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ కార్యకలాపాలు ఈ ఏడాది చివరకు ప్రారంభమవ్వొచ్చు. 2020 నాటికి మూడో యూనిట్ అందుబాటులోకి రావొచ్చు. ఈ మూడు ఫెసిలిటీల్లో 5,000–6,000 మంది ఉద్యోగులు ఉండేలా చూసుకుంటాం’’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన జపాన్–ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ (జేఐఎం) తొలి బ్యాచ్ ముగింపు సందర్భంగా మాట్లాడారు. కాగా కంపెనీ మరోవైపు గుర్గావ్, మానేసర్ ప్లాంట్లలో ఏడాదికి 15 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
ఎయిమ్స్–ఎంబీబీఎస్ ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఎంబీబీఎస్ –2018 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో 2,705 అమ్మాయిలు సహా.. 7,617 మంది అర్హత సాధించారు. మొదటిసారిగా అమ్మాయిలే తొలిమూడు ర్యాంకులు చేజిక్కించుకోవడం విశేషం. న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న 9 (న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రుషికేశ్, మంగళగిరి, నాగ్‌పూర్) ఎయిమ్స్లలోని 800 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ కౌన్సిలింగ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. కాగా, తొలి 10 ర్యాంకుల్లో తొమ్మిది రాజస్తాన్‌లోకి కోటాలోని అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు చేజిక్కించుకున్నారు. రెండు నుంచి 10వ ర్యాంకు వరకు అన్నీ ఈ సంస్థ ఖాతాలో చేరాయి. -
నిపాకు మరొకరు బలి
కోజికోడ్: కేరళను వణికిస్తోన్న ‘నిపా’ వైరస్‌తో గురువారం మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనతో రాష్ట్రంలో నిపాతో చనిపోయినవారి సంఖ్య 11కు చేరుకుంది. ఈ విషయమై కోజికోడ్ జిల్లా వైద్యాధికారి డా.జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఇక్కడి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వి.ముసా(61) గురువారం చనిపోయినట్లు తెలిపారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) నిపుణులు, ఎయిమ్స్ వైద్యుల బృందం కేరళలో పర్యటిస్తోంది. మరోవైపు, కర్ణాటకలో నిపా లక్షణాలతో శివమొగ్గ జిల్లాలోని సాగర ప్రాంతానికి చెందిన మిదున్(21) ఆస్పత్రిలో చేరారు. -
రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన నిర్ణయం
-
రిటైర్మెంట్లే.. భర్తీలేవీ..?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం ఇప్పుడు గందరగోళంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అస్పష్ట వైఖరి వైద్య వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలో ఉద్యోగ విరమణ వయసు పెంచాలని కొందరు వైద్యులు డిమాండ్ చేస్తుండగా.. ఇలా చేస్తే కింది స్థాయి వైద్యుల అవకాశాలు దెబ్బతింటాయని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొత్తగా వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ వైద్య సేవలు నాసిరకంగా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో అన్ని ఆస్పత్రుల్లోనూ ఖాళీలు పెరుగుతున్నాయి. బోధన ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో 2,500 మంది వైద్యులు ఉండాలి. వరుస రిటైర్మెంట్లు, కొత్త వైద్యుల భర్తీ జరగకపోవడంతో ప్రస్తుతం 1,800 మంది మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండుమూడేళ్లలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఎంబీబీఎస్, పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం ఉంది. మరోవైపు జిల్లా, ఏరియా, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. అన్ని జిల్లాల్లో కలిపి సగటున ఏటా 60 మంది వరకు వైద్యులు రిటైర్ అవుతున్నారు. కానీ ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం ముందుకు జరగడంలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం పదేపదే తెరపైకి వస్తోంది. ప్రతిపాదనలపై రగడ వైద్యుల పదవీ విరమణ వయసు విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. బోధన ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 70 ఏళ్ల వరకు పెంచాలని నిర్ణయించింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పదవీ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రతిపాదనపై ప్రభుత్వ వైద్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సీనియర్ వైద్యులు అవసరమవుతారని, పదవీ విరమణ వయసు పెంచాలని కొందరు కోరుతున్నారు. బోధన ఆస్పత్రుల్లోని జూనియర్ వైద్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వయసు పెంచితే కింది స్థాయిలో ఉన్న వారి అవకాశాలు దెబ్బతింటాయని వారు తీవ్రంగా వాదిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా పని చేయాలనుకునే వారు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీల్లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం చెబుతోంది. ఇలా వైద్యుల్లోనే పలు భిన్నాభిప్రాయాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా.. వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు దేశమంతటా ఒకేవిధంగా లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 70 ఏళ్ల వరకు ఉండవచ్చు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విరమణ వయసు 65 సంవత్సరాలు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, వైద్య కాలేజీల్లో అధ్యాపకుల ప్రస్తుత విరమణ వయస్సు 58 సంవత్సరాలు. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో 60 ఏళ్లు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విరమణ వయస్సు 70 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60 ఏళ్లు.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్‌లలో 62 ఏళ్లు.. హరియాణా, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 65 ఏళ్లు.. బిహార్‌లో 67 ఏళ్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ అంశంపై ఎటూ తేల్చకపోవడంతో వైద్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఎయిమ్స్ నుంచి లాలూ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన వీల్‌చైర్‌లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తనను బలవంతంగా డిశ్చార్చ్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అందిస్తున్న చికిత్స ఇంకా పూర్తి కాలేదని, బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు. ’ఇది అన్యాయం. నా ఆరోగ్యం క్షీణింప చేసేందుకు జరుగుతున్న కుట్ర. నేను ఇంకా కోలుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేని చోటకు నన్ను తరలిస్తున్నారు. అయినా దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లాలూ డిశ్చార్చ్ సందర్భంగా పెద్దఎత్తున ఆర్జేడీ అభిమానులు ఎయిమ్స్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అక్కడి సెక్యూరిటీ గార్డ్‌కు గాయాలయ్యాయి. లాలూను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆరోగ్యం కుదుటపడకుండానే పంపేస్తున్నారని ఆర్జేడీ ఎంపీ జయప్రకాశ్ నారాయణ యాదవ్ ఆరోపించారు. మరోవైపు లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, అందుకే ఆయనను రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన డిశ్చార్చ్ వెనుక కుట్ర, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. డిశ్చార్జి సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్‌కు లాలూ లేఖ రాశారు. ‘నాకు ఏదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించా ల్సి ఉంటుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాహుల్ పరామర్శ: అంతకుముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించి.. కాసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో లాలూతో రాహుల్ -
ఎయిమ్స్‌కు కేంద్రం పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం మార్గం సుగమం చేసింది. ఇప్పటికే ఏపీకి ఎయిమ్స్ మంజూరు కాగా తెలంగాణలో ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కొంతకాలంగా తెలంగాణ ఆరోపిస్తోంది. తాము అడిగిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావట్లేదని, అందుకే జాప్యం జరుగుతోందని కేంద్ర ప్రతినిధులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఫలితంగా ఈ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పీఠముడిలా మారింది. గత కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా లేదు. దీంతో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ముందు భూమి కేటాయించండి ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం అందించింది. అయితే ఎయిమ్స్ ఏర్పాటుకు కావాల్సిన భూమి కేటాయింపు అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రం అధీనంలోకి భూమి వస్తేనే మిగతా అంశాలను పట్టించుకుంటామని స్పష్టం చేసింది. గతంలో పలు కేంద్రప్రభుత్వ సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలోనే కేంద్రమంత్రులు ఆరోపణలు చేశారు. భూమిని అప్పగించకపోవడం వల్లే ఆయా సంస్థల ఏర్పాటులో ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పుడు ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఇదే విషయాన్ని పేర్కొంది. భూమి కేటాయించాకే డీపీఆర్‌ల తయారీ ఉంటుందని కూడా పేర్కొంది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద కేటాయించిన రూ.3,825 కోట్ల నిధుల్లోంచి ఖర్చు చేయనున్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుమతులు.. ఇప్పటికే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ కార్యకలాపాలు ప్రారంభించగా, తాజాగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. సూర్యాపేట, నల్లగొండల్లో కూడా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఎయిమ్స్ ఏర్పాటు వల్ల రాష్ట్రంలో అత్యవసర, మెరుగైన, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేంద్రానికి సీఎం కేసీఆర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
జైట్లీకి ఎయిమ్స్‌లో డయాలసిస్; డిశ్చార్జ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(65)కి ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సోమవారం డయాలసిస్ నిర్వహించారు. జైట్లీకి తొలుత కిడ్నీ ఆపరేషన్ చేస్తారని భావించినప్పటికీ ఆయన్ను పరీక్షించిన వైద్యులు మందులు, డయాలసిస్ ద్వారా సమస్యను తగ్గించవచ్చని సూచించడంతో మంత్రి అంగీకరించారు. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో రెండ్రోజులు గడిపిన జైట్లీ.. సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇన్ఫెక్షన్ పెరగవచ్చన్న కారణంతో ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకు ఎవ్వరినీ అనుమతించడంలేదు. -
నేడు జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ(65) శుక్రవారం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. నేడు ఆయనకు శస్త్రచికిత్స చేస్తారని, అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా జైట్లీకి శస్త్రచికిత్స చేస్తారని సమాచారం. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా జైట్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనను రద్దుచేసుకున్నారు. ‘కిడ్నీ సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను’ అని జైట్లీ గురువారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ఎయిమ్స్’కు నిధులు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను పూర్తి స్థాయి హెల్త్ హబ్‌గా మార్చేందుకు దోహదపడే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం కేంద్ర మంత్రులను పార్లమెంటులో కలుసుకున్న ఆయన తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటించి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని వివరించారు. ఎయిమ్స్ ఏర్పాటు అవసరమైన స్థలం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్‌ను కలిసిన లక్ష్మారెడ్డి ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియపై చర్చించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, జి.నగేశ్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు. -
ఎయిమ్స్ కోసం ఆఖరి ప్రయత్నం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) దోబూచులాటకు తెరపడుతోంది. దాదాపు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేంద్రం నిర్ణయంపై స్పష్టత రానుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రానికి విన్నవిస్తున్నా ఎయిమ్స్‌పై స్పందన లేకపోవడం, తాజా కేంద్ర బడ్జెట్లోనూ ఆ ఊసే ఎత్తకపోవడంతో.. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డాను స్వయంగా కలసి మరోసారి విన్నవించేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నారు. రాజకీయ నిర్ణయం మినహా.. ఎయిమ్స్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఎయిమ్స్ మంజూరుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఇదే అభిప్రాయంతో ఉంది. రాజకీయ నిర్ణయం మినహా ఇతర సమస్యలేవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ కూడా ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌పై కేంద్రం నుంచి రాజకీయ నిర్ణయం వెలువడేలా ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎయిమ్స్ కోసం ఇదే ఆఖరి ప్రయత్నమని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఎయిమ్స్ మంజూరుకు సమస్యల్లేవు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మంజూరుకు, నిధులు ఇచ్చేందుకు కేంద్రం నుంచి తగిన ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను రాష్ట్రానికి ఇవ్వడానికి అధికారికంగా ఎలాంటి సమస్యలు లేవని, కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. మంగళవారం సచివాలయం లో మంత్రి లక్ష్మారెడ్డిని ప్రీతి మర్యాదపూర్వ కంగా కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేశారు. రెండో ఏఎన్ఎంలకు కనీస వేతనాలు పెంచా లని కోరారు. ఆశా వర్కర్లకు తెలంగాణలో నెలకు కనీసం రూ.6 వేలు చొప్పున ప్రోత్సా హకాలు అందిస్తున్నామని, కేంద్రం చొరవ తీసుకుంటే వాళ్ల వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వెల్నెస్ సెంటర్లకు ఆయుష్ సేవలు అందేలా చొరవ తీసుకోవా లని కోరారు. క్లినికల్ ట్రయల్స్‌కి జాతీయ స్థాయిలో ఒకే రకమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించారు. కనీసం జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్ ఫుడ్ సేఫ్టీ, చెకింగ్ వాహనాలు ఉంటే ఆహార కల్తీ నివారణ పటిష్టంగా వీలవుతుందని తెలిపారు. ప్రీతి స్పందిస్తూ, సిద్దిపేట, సూర్యాపేట, నల్ల గొండ వైద్య కళాశాలలకు మరిన్ని నిధులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. మాతా శిశు వైద్యశాలలను పరిశీలించిన ప్రీతి.. ఇలాంటి మరికొన్ని ఆసుపత్రులను మంజూరు చేస్తామని తెలిపారు. -
ఢిల్లీలో మిస్టరీ.. ఇన్సులిన్ ఎక్కించి హత్య?
సాక్షి, చెన్నై: ఉన్నత చదువుకు ఢిల్లీ వెళ్తున్న తమిళ విద్యార్థులకు భద్రత కరవు అవుతోంది. ప్రధానంగా వైద్య కోర్సుల్ని అభ్యషించేందుకు వెళ్తున్న విద్యార్థుల మరణాలు ఓ మిస్టరీగా మారుతున్నాయి. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన శరవణన్ మరణం కలకలం రేపగా, ప్రస్తుతం శరత్ ప్రభు మరణం ఆందోళనలో పడేసింది. విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలకు బలం చేకూరే రీతిలో శరవణన్ మరణ మిస్టరీ విచారణ కొలిక్కి వస్తున్నది. ఈ సమయంలో అదే తిరుప్పూర్‌కు చెందిన మరో విద్యార్థి శరత్ ప్రభు విగతజీవిగా మారడం ఉన్నత చదువు నిమిత్తం ఢిల్లీలో ఉన్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన తప్పడం లేదు. నిన్న శరవణన్.. నేడు శరత్.. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆస్పత్రుల్లో ఒకటి. ఇందులో ఢిల్లీ విద్యార్థులే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వైద్య ఉన్నత విద్యను అభ్యషిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన వైద్య పీజీ ఎండీ విద్యను అభ్యషిస్తున్న శరవణన్ అనుమానాస్పద మరణం తమిళనాట కలకలాన్ని రేపింది. ఆ కేసు విచారణ నేటికీ సాగుతోంది. ఇది ముమ్మాటికి హత్యేనని వాదించే వాళ్లు ఎక్కువే. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీల పట్టుతో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. కోర్టు రీ పోస్టుమార్టం ఆదేశాలతో వచ్చిన నివేదికలో ఇన్సులిన్ ద్వారా హత్య చేసి ఉండడానికి కారణాలు ఉన్నట్టుగా తేలింది. దీంతో అనుమానాలకు బలం చేకూరే విధంగా కోర్టు విచారణ సాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం అదే తిరుప్పూర్‌కు చెందిన శరత్ ప్రభు(25) మరణం ఢిల్లీలో తమిళ విద్యార్థులకు భద్రత కరువైందన్న విషయాన్ని తేట తెల్లం చేసింది. శరత్ మరణంతో ఆందోళన: తిరుప్పూర్ జిల్లా పారప్పాళయం మంగళం సమీపంలోని ఇడువం పాళయం ప్రాంతానికి చెందిన సెల్వమణి , ధనలక్ష్మి దంపతుల కుమారుడు శరత్ ప్రభు(25) కోయంబత్తూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తాను చదువుకున్న చదువు, మార్కులు, ప్రతిభకు గాను ఢిల్లీ ఎయిమ్స్ పరిధిలోని యూసీఎంఎస్ వైద్య కళాశాలలో ఎండీ ఉన్నత కోర్సు సీటు దక్కించుకున్నారు. చివరి సంవత్సరం చదువుకుంటున్న శరత్ బాత్ రూమ్‌లో జారి పడ్డట్టు, మరి కాసేట్లో మరణించినట్టు వచ్చిన సమాచారం ఆ కుటుంబంలోనే కాదు ఢిల్లీలో ఉన్నత కోర్సుల్ని అభ్యషిస్తున్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన బయలు దేరింది. అనుమానాలు.. ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే శరత్ ప్రభు మంగళవారం కూడా అదే చేశాడు. రాత్రి పదిన్నర గంటల వరకు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. ఢిల్లీలోని యూసీఎంఎస్ కళాశాల హాస్టల్లో ఉంటున్న సహచర విద్యార్థుల నుంచి ఉదయాన్నే వచ్చిన ఫోన్‌కాల్ సెల్వమణి, ధనలక్ష్మి దంపతుల్ని కలవరంలో పడేశాయి. బుధవారం ఉదయం బస చేసి ఉన్న గదిలోని బాత్రూమ్లో శరత్ కింద పడ్డట్టు, ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్టుగా తొలుత ఓ ఫోన్‌కాల్ రావడం, మరి కాసేపటికి బాత్రూమ్లో పడి మరణించినట్టుగా వచ్చిన సమాచారాలతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. సహచర విద్యార్థుల నుంచి వచ్చిన పొంతన లేని సమాచారాలతో శరత్ మరణంలో అనుమానాలు బయలు దేరాయి. అదే సమయంలో శరత్ ప్రభు తండ్రి సెల్వమణి దృష్టికి కళాశాల నిర్వాహకులు తెచ్చిన సమాచారంలోనూ అనుమానాలు కొట్టొచ్చినట్టు కన్పించడంతో ఢిల్లీలో ఏదో జరిగిందన్న ఆందోళన తప్పడం లేదు. తక్షణం విమానం ద్వారా ఢిల్లీకి సెల్వమణి, ఆయన స్నేహితులు బయలు దేరి వెళ్లారు. శరవణన్ మరణ సమాచారం తరహాలోనే శరత్ మరణ సమాచారాలు ఉండడంతో ఇన్సులిన్ వేసి హతమార్చి, నాటకం సాగుతున్నదా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు అధికమే. ముమ్మాటికి హత్యే.. శరత్ ప్రభు మరణ సమాచారంతో గతంలో తనయుడు శరవణన్‌ను కోల్పోయిన తండ్రి గణేషన్ మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి వేల శరత్‌ను కూడా హతమార్చి నాటకం సాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నానని, అందులో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. తమిళ విద్యార్థులకు ఢిల్లీలో భద్రత లేనే లేదని గతంలోనూ చెప్పాను అని, ఇప్పుడు కూడా తాను చెబుతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, తమిళ ప్రభుత్వం చోద్యం చూస్తున్నాయని, విద్యార్థులకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మరో తమిళ విద్యార్థి బలి కాకుండా భద్రత కల్పించాలని, ఇందుకు విద్యార్థిలోకం గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మరణాల గురించి సీఎం పళనిస్వామిని మీడియా ప్రశ్నించగా, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదవుకుంటున్న విద్యార్థులు తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎవరు ఎక్కడ చదువుకుంటున్నారో అన్న గందరగోళం తప్పడం లేదన్నారు. ఇకనైనా తమ పేర్లను విద్యార్థులు నమోదు చేసుకోవాలని, విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మన ఎయిమ్స్‌పై కేంద్రం నిర్లక్ష్యం!
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది వార్షిక బడ్జెట్లో తెలంగాణకు ప్రకటించిన ఆల్ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు విషయంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రకటన చేసి ఏడాది కావస్తున్నా ఇంత వరకు నిధులు విడుదల కాలేదు. ఈ విషయమై టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నిసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ ఎయిమ్స్ విషయంలో మాత్రం కేంద్రం ఆగమేఘాల మీద ఆమోదం తెలిపి నిధుల విడుదలపై స్పష్టతనిస్తూ నిర్మాణం పూర్తికి లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. గత బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌లోని బిలాస్పూర్లో ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వర్గం రూ. 1,350 కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించడంతోపాటు 48 నెలల్లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హిమాచల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఎయిమ్స్ ఏర్పాటులో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎయిమ్స్‌కు నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీబీ నగర్లో ఎయిమ్స్ ఏర్పాటుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా కేంద్రం స్పందించలేదు. కేవలం రాజకీయ కారణాలతో హిమాచల్‌ప్రదేశ్ విషయంలో ఒక రకంగా తెలంగాణ విషయంలో మరో రకంగా కేంద్రం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిమ్స్‌కు నిధులు విడుదల చేయాల్సిందిగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం మరోసారి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. -
ఎంబీబీఎస్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నిర్వహించిన ఎంబీబీఎస్ ఆన్లైన్ ప్రవేశపరీక్షలో ప్రశ్నపత్రం లీక్ కాలేదని విచారణ కమిటీ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు అక్కడి అధికారుల సాయంతో మోసానికి పాల్పడ్డారని వెల్లడించింది. ప్రశ్నపత్రం స్క్రీన్ షాట్స్ బయటకు రావడంపై సీబీఐ విచారణ జరపాలని కోరినట్లు కమిటీ పేర్కొంది. పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ఫలితాలు ్చజీజీఝట్ఛ్ఠ్చఝట.ౌటజతోపాటు మిగతా ఆరు ఎయిమ్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. -
కోలుకుంటున్న మేనకా గాంధీ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ (60) మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె చాలా బలహీనంగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యానికి ప్రమాదమేమి లేదని పేర్కొన్నారు. ఆదివారం ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఉదరంలో ఉన్న రాయిని తొలగించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జూన్ 2 న మేనకా గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో పర్యటిస్తుండగా హఠాత్తుగా కడుపునొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. స్కానింగ్ చేయగా ఆమె పిత్తాశయం (గాల్‌బ్లాడర్)లో ఓ రాయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స చేసి రాయిని తొలగించినట్లు వైద్యులు వివరించారు. -
రంగారెడ్డిలో మరో రెండు రక్షణ సంస్థలు!
- ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్ కోసం భూముల అన్వేషణ - ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు 1,000 నుంచి 2,000 ఎకరాలు - ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రక్షణ రంగ సంస్థలకు రంగారెడ్డి జిల్లా హబ్‌గా మారింది. ఇప్పటికే పలు సంస్థలను అక్కున చేర్చుకున్న జిల్లా తాజాగా సశస్త్ర సీమాబల్, సీఐఎస్ఎఫ్లను కూడా సరసన చేర్చుకుంటోంది. శత్రుసేనలను తుదముట్టించేందుకు దేశ సరిహద్దుల్లో పహారా కాసే సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), పారిశ్రామిక రక్షణ దళం (సీఐఎస్ఎఫ్)కు చెరో 70 ఎకరాలను కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపా దనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆక్టోపస్, ఎన్ఎస్జీ, బీఎస్ఎఫ్, ఎన్పీఏ తదితర సంస్థలకు కేంద్రంగా మారిన రంగారెడ్డి జిల్లా.. తాజాగా మరిన్ని సంస్థలకు ఆహ్వా నం పలుకుతోంది. ఈ రెండింటికి కూడా ఇబ్రహీం పట్నం మండలంలో భూములు కేటాయించే అం శాన్ని యంత్రాంగం పరిశీలిస్తోంది. మరోవైపు ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు ఏకంగా 1000ృ2000 ఎకరాలు కావాలని కోరుతూ రక్షణ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంలో వివిధ చోట్ల ఆర్మీకి ఉన్న భూములను ప్రజోపయోగ అవసరాలకు తీసుకున్నందున ప్రత్యామ్నా యంగా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు ఈ మేరలో భూమి ఇవ్వాలని కోరింది. రక్షణ శాఖ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కారు భూములను గుర్తిం చాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిం చింది. హైదరాబాద్ పోలీస్ కమిషన రేట్‌కు కూడా ఫైరింగ్‌లో శిక్షణ కోసం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ లో 18 ఎకరాలను కేటాయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే మండలంలోని రామోజీ ఫిలింసిటీకి పర్యాటకా భివృద్ధిలో భాగంగా 295 ఎకరాలను అప్పగించాలని నిర్ణయించారు. దీని పై వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశముం దని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అకాడమీ స్థాపిం చేందుకు భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, మొయినాబాద్ మండలాల పరిధిలో పలు చోట్ల భూములను రెవెన్యూ యంత్రాంగం అన్వేషిస్తోంది. ఎయిమ్స్ కూడా జిల్లాకే.. రంగారెడ్డి జిల్లా యవనికపై మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. దేశంలో అత్యున్నత వైద్యసేవలందించే అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు జిల్లా వేదిక కానుంది. ఈ మేరకు ఎయిమ్స్ ఏర్పాటుకు తగినంత భూమిని గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. ఎయిమ్స్ ఏర్పాటుపై వివిధ ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వం.. రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో దీన్ని స్థాపించడం ద్వారా ఎక్కువ మందికి వైద్యసేవలందించవచ్చని భావించింది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్ సముదాయాన్ని నిర్మించనున్నందున.. దానికి తగ్గట్టుగా భూమిని గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. కేవలం ఆస్పత్రేగాకుండా.. మెడికల్ కాలేజీ, వైద్యులు, ఇతర సిబ్బందికి క్వార్టర్లు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలా ఎయిమ్స్‌ను డిజైన్ చేస్తున్నారు. దీంతో కనిష్టంగా 200 ఎకరాలు కావాలని కోరుతున్నట్లు తెలిసింది. కాగా, భూమి కేటాయింపుపై జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. రెండేళ్ల క్రితం ఎయిమ్స్ కోసం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో భూమిని పరిశీలించారు. దీనితోపాటు సరూర్‌నగర్ మండలం నాదర్గుల్లోని భూమిని కూడా ఎయిమ్స్‌కు ప్రతిపాదించాలని భావిస్తున్నారు. ఇవేగాకుండా మరిన్ని భూములతో కూడిన ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. -
పోరాడితేనే తెలంగాణకు ఎయిమ్స్
కేంద్రం ఎయిమ్స్ ప్రకటనపై ఎంపీ జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ‘పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాటం చేస్తే తప్ప రాష్ట్రానికి ఏమీ దక్కడంలేదు. ఇప్పుడు అలాగే పోరాటం చేసి తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను సాధించుకున్నాం’అని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఎయిమ్స్ ఏర్పాటు హామీని అమలు చేయాలని గత రెండున్నరేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం నేటికి ఫలించిందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసిన తరువాత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఎయిమ్స్ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్గదర్శకత్వంలో పార్టీ ఎంపీలు చేసిన కృషి నేటికి ఫలించిందని జితేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎయిమ్స్ కేటాయింపు లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ చెందామని ఆయన అన్నారు. దీనికి నిరసనగా తమ పార్టీ ఎంపీలు లోక్‌సభకు హాజరుకాకూడదని నిర్ణయించారన్నారు. బడ్జెట్ ఓటింగ్‌కు వచ్చే ముందైనా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎయిమ్స్ ప్రకటన చేయాలని బుధవారం అరుణ్ జైట్లీని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రత్యేకంగా కలసి విజ్ఞప్తి చేశామన్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై లోక్‌సభలో ప్రకటన చేశారని ఎంపీ వినోద్ తెలిపారు. -
ఈసారైనా రాష్ట్రానికి ఎయిమ్స్ వచ్చేనా?
కేంద్ర బడ్జెట్‌పై వైద్య ఆరోగ్యశాఖ ఎదురుచూపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన ఎయిమ్స్ రెండేళ్లుగా దోబూచులాడుతోంది. ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నా.. ఇప్పటివరకు కేంద్ర బడ్జెట్లో దానికి నిధుల కేటాయింపు జరగలేదు. ఇక బుధవారం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లోనైనా రాష్ట్రానికి ఎయిమ్స్ వస్తుందా? రాదా? అన్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో నెలకొంది. ఎయిమ్స్‌ను రాష్ట్రానికి రప్పించేందుకు స్వయానా సీఎం కేసీఆర్ గతంలో ఒకసారి కేంద్రానికి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కూడా ఈ బడ్జెట్లో ఎయిమ్స్ కేటాయించాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఈసారి మనకు ఎయిమ్స్ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఎయిమ్స్‌ను యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి ఏకంగా రూ.820 కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఆ మొత్తాన్ని కేంద్రమే సమకూర్చనుంది. ఎయిమ్స్ ఏర్పాటుతో అధునాతన వైద్య వసతి సౌకర్యాలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, వైద్య విద్య అందుబాటులోకి వస్తాయి. ఏకంగా 30 వరకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిమ్స్ పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నడిచే సంస్థ కావడంతో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు. -
త్వరలో మరణ నమోదు రిజిస్ట్రీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సంభవిస్తున్న మరణాలు, వాటి కారణాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని భద్రపరిచే జాతీయ మరణాల రిజిస్ట్రీని ఆరోగ్య శాఖ ఎయిమ్స్‌తో కలిసి రూపొందించనుంది. వేర్వేరు ప్రాంతాల్లో చావులకు కారణాలు తెలిస్తే వ్యాధులపై విధాన రూపకర్తలకు పూర్తి అవగాహన కలిగి, ఆరోగ్య వసతులు, ఇతర వనరులను సమర్థంగా వినియోగించుకునే వీలు కలుగుతుందని ఎయిమ్స్ కంప్యూటరీకరణ చైర్మన్ దీపక్ అగర్వాల్ చెప్పారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం పూర్తి సమాచారం లేదని, ఈ వ్యవస్థ అమలైతే రోగుల వివరాలు, మరణాలకు కారణాలతో పూర్తి వివరాలు అందుబాటులోకొస్తాయని వెల్లడించారు. -
వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?
-
వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ వారాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. రక్త సంబంధీకుడు కాని దాత నుంచి కిడ్నీ సేకరిస్తున్నట్లు సమాచారం. రోగి బంధువులే కాకుండా స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగువారు.. ఎవరైనా అవయవ దానం చేయవచ్చని చట్టం చెబుతోంది. కిడ్నీ మార్పిడి ప్రక్రియకు దాత, గ్రహీతలకు ముందస్తు పరీక్షలన్నీ పూర్తి చేసినట్లు వైద్యులు చెప్పారు. ఎరుుమ్స్‌లోని నిపుణులైన వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలిపారు. -
గిన్నీస్ బుక్ రికార్దు కోసం
-
బాపూజీ అడుగు జాడల్లో నడుద్దాం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన బాపూజీ అడుగు జాడల్లో నడుద్దామని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ , లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను ఆదివారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరుపుకున్నారు. జాతిపిత చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు చేపట్టి దేశ ప్రజలను గాంధీజి ఏకతాటిపై నడిపించారన్నారు. మహాత్ముని సేవలు మరువలేనివన్నారు. అహింసా ఉద్యమంతో గాంధీజీ ప్రపంచ నేత అయ్యారని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
2019 నాటికి ‘ఎయిమ్స్’ పూర్తి
* గ్లోబల్ టెండర్ల ఆహ్వానానికి చర్యలు * మౌలిక వసతుల కల్పనపై నివేదిక * కేంద్ర కమిటీ వెల్లడి మంగళగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక్మంగా మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)ను 2019 చివరినాటికి పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రకమిటీ సభ్యుడు, రాయపూర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నితిని నాగార్కార్ తెలిపారు. మంగళగిరిలోని శానిటోరియం స్థలంలో ఎయిమ్స్ నిర్మాణ పనులను ఢిల్లీ ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకె శర్మ, కేంద్ర ఆరోగ్య శాఖ పీఎంఎస్ఎస్వై yì విజన్ సభ్యుడు సుదీప్ శ్రీవాస్తవ, ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్ నిపుణుడు కె.శర్మ, సీనియర్ ఆర్కిటెక్ రాజీవ్కనోజయాలతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఎయిమ్స్ మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎయిమ్స్‌కుS వెళ్లేందుకు ప్రధానంగా మంగళగిరి పట్టణం గౌతమబుద్ధారోడ్ నుంచి జాతీయరహదారికి కనెక్టవిటీ రోడ్ 100 అడుగులు ఉండాలని, దీనికి అవసరమైన అటవీశాఖభూమి 13 ఎకరాలను వెంటనే డీరిజర్వ్ చేసి కేటాయించాలని ఆదేశించారు. అదే విధంగా నిర్మాణస్థలంలో వున్న విద్యుత్లైన్లు, హైటెన్షన్ పవర్లైన్లను వెంటనే మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. అన్నిశాఖల అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిమ్స్ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నిర్మాణాన్ని వేగంగా జరిగేలా చూస్తామన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఎయిమ్స్ నిర్మాణంలో కావాల్సిన మౌలిక వసతులు రోడ్లు, తాగునీరు, విద్యుత్‌తో పాటు నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అనంతరం ఇప్పటికే జరుగుతున్న ప్రహరీగోడ పనులను పరిశీలించిన బృందం పనులు మందకోడిగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. వారికి వివరాలు అందించిన వారిలో అకడమిక్ డీఎంఈ బాబ్జి, జిల్లా అటవీశాఖ అధికారులు మోహనరావు, వెంకటేశ్వరావు, రవికుమార్, డీఎంహెచ్‌వో పద్మజారాణి, ఆర్డీవో శ్రీనివాసరావు, సిద్ధార్థ కళాశాల ప్రిన్స్‌పల్ ఆర్ శంశాంక్, తహశీల్దార్ సంగా విజయలక్ష్మి, విద్యుత్ ఏడీఈ రాజేష్‌ఖన్నా, ఏఈ భాస్కరరావు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు. -
నేడు మంగళగిరికి కేంద్ర బృందం
నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలించనున్న సభ్యులు సాక్షి, హైదరాబాద్: మంగళగిరిలో నిర్మాణం చేపట్టిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి బృందం నేడు అమరావతికి రానుంది. రాయ్‌పూర్, న్యూఢిల్లీ ఎయిమ్స్ సభ్యులతోపాటు పీఎంఎస్ఎస్వై, పీజీఐ ఛండీగఢ్ సభ్యులు కూడా రానున్నారు. వీరితోపాటు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒకరు ఇందులో ఉంటారు. ఈనెల 5, 6 తేదీల్లో అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలిస్తారు. ఎయిమ్స్‌ను వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు అనుమతులు వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఇప్పటివరకూ ప్రహరీ గోడ, హైటెన్షన్ కరెంటు లైన్ల ఏర్పాటు కూడా పూర్తికాలేదు. భవన నిర్మాణాలన్నీ పూర్తయ్యేవరకూ వేచిచూస్తే మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన భవనాల నిర్మాణాలను పరిశీలించి అనుకూలంగా వాటిని ఉపయోగించుకుని కొన్ని విభాగాలనైనా అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరు, తెనాలి, మంగళగిరిలో అనుకూల భవనాలను పరిశీలిస్తారు. బృందంలో రాయ్‌పూర్ ఎయిమ్స్ డెరైక్టర్ డా.నితిన్ ఎం నాగార్కర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డీకే శర్మలు ఉంటారు. వైద్య కళాశాలకు సంబంధించిన సీనియర్ రెసిడెంట్లకు కావాల్సిన భవనాలు, హాస్టల్ గదులు, వైద్య సిబ్బందికి నివాసం ఉండటానికి కావాల్సిన భవనాలు అద్దెకు తీసుకుంటామని కేంద్రానికి రాష్ట్రం ఇప్పటికే లేఖ రాసింది. -
అత్యుత్తమ వైద్య సంస్థగా ఎయిమ్స్
– రూ.1,618కోట్ల వ్యయంతో నిర్మాణం – మై హాస్పిటల్ యాప్ ఆవిష్కరణ తిరుచానూరు : ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా మంగళగిరిలో ఎయిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా(జేపి.నడ్డా) తెలిపారు. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో ‘ప్రజా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ పునరుత్పత్తి ఆవిష్కరణల ఆచరణలో’ అనే అంశంపై 3వ జాతీయ స్థాయి సదస్సు సోమవారం ప్రారంభమయింది. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని సదస్సును ప్రారంభించి మాట్లాడారు. రూ.1,618కోట్ల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మరో రెండేళ్లల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రాణాంతకమైన, ప్రమాదకర వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు అత్యాధునిక వైద్యసేవలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వైద్య అభివృద్ధికి కేంద్రం ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు సమర్పించే రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు. డిజిటల్ ఇండియా దేశ ప్రధాని ఆశయమని తెలిపారు. ప్రధాని ఆలోచనల మేరకు ప్రతి నెల 9వ తేదీన ప్రాథమిక వైద్య కేంద్రాలలో ప్రతి ఒక డాక్టర్ ఉంటారని, ఆ రోజంతా గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు, తరువాత వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మై హాస్పిటల్ యాప్, ఐ పోష్టర్ను విడుదల చేశారు. కేంద్ర సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19పరీక్షలు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో 40పరీక్షలు, ప్రాంతీయ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రిలలో 63పరీక్షలను రోగులకు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఏఎన్ఎంకు ట్యాబ్‌లను సరఫరా చేశామని, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం ద్వారా రాష్ట్రంలో 278తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుని సూచనల మేరకు రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయ డయాలసిస్ కార్యక్రమాన్ని గూడూరు, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులలో రిమోట్ ద్వారా కేంద్రమంత్రి ప్రారంభించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీలు సీకె.మిశ్రా, అరుణ్‌పాండే, మనోజ్జిలానీ, రాష్ట్ర ప్రిన్సిపల్ పూనం మాలకొండయ్య, తిరుపతి సబ్‌కలెక్టర్ హిమాంశు శుక్ల, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్లోబల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు
న్యూడిల్లీ: దేశాల మధ్య అంతర్జాతీయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించే గ్లోబల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం యోచిస్తోందని లా అండ్ జస్టిస్, ఐటీ శాఖామంత్రి రవి శంకర ప్రసాద్ తెలిపారు. తాము దేశానికి పెట్టుబడులు ఆహ్వానిస్తూనే, శ్రీఘ్రంగా వివాదాలను పరిష్కరించే వ్యవస్థమీద దృష్టిపెట్టినట్టు ఆయన చెప్పారు. భారతదేశ పెట్టుబడిదారులకు ఒక సాహసోపేతమైన వివాద పరిష్కార వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రపంచ మధ్యవర్తిత్వ కేంద్రంగా మారే లక్ష్యంతో ఉన్నామని బ్రిక్స్ దేశాల ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అంశంపై నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి చెప్పారు. ముంబై, ఢిల్లీ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో రవి శంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యాపార వృద్ధి ఉంటే, వివాదాలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలో ఒక బలమైన మధ్యవర్తిత్వ ఫోరమ్ ఉండాల్సి అవసరం ఉందని ప్రసాద్ వివరించారు. దేశంలో ఉత్తమ న్యాయమూర్తులున్పప్పటికీ, వారు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సందర్భాలలో వారికి ప్రాతినిధ్యం లభించడంలేదని తెలిపారు. ఐదుగురు సభ్యుల బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా , దక్షిణ ఆఫ్రికా మధ్య బలమైన మధ్యవర్తిత్వ ఫోరం కోసం ఒక అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఐదు బ్రిక్స్ దేశాల మధ్య 2015 లో 242 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. -
ఎంసెట్ లీకేజీలో కొత్త పేరు
► 2005 ఎయిమ్స్ ప్రశ్నపత్రం లీకు వీరుడు ధర్మకూ పాత్ర ► గాలిస్తున్న మూడు ప్రత్యేక బృందాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ధర్మ అలియాస్ ధర్మేంద్ర అనే వ్యక్తికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ధర్మ గతంలో పలు ప్రశ్నపత్రాల లీకేజీల్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా 2005లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఎంసెట్ లీకేజీలోనూ కీలకపాత్ర పోషించినట్లు సీఐడీకి ఆధారాలు లభ్యమయ్యాయి. కీలక బ్రోకర్లు గుడ్డూ, ఇక్బాల్, రాజగోపాల్‌రెడ్డి, రాజేశ్‌లతో ధర్మ తరచూ ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ధర్మను అదుపులోకి తీసుకుంటే ఎంసెట్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధర్మను పట్టుకొనేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, ముంబై, చండీగఢ్‌లలో గాలిస్తున్నాయి. ముకుల్‌జైన్ అరెస్టు ఇక ఈ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన బ్రోకర్ ముకుల్ జైన్‌ను సీఐడీ అరెస్టు చేసింది. అతను సబ్ బ్రోకర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రాజేశ్, షకీరాల ద్వారా ఆరుగురు విద్యార్థులకు కోల్‌కతాలో శిక్షణ ఇప్పించినట్లు విచారణలో వెలుగు చూసింది. అయితే కోల్‌కతాలోని ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని మరో బ్రోకర్ మోహిత్ కుమార్ సింగ్ నిర్వహించినట్లు గుర్తించింది. అతడిని కూడా అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
వీణావాణీలు ఇంటికే!
- శస్త్రచికిత్స చేయించలేమని చేతులెత్తేసిన సర్కారు - ఆర్థికసాయం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలకు శస్త్రచికిత్స చేయించలేమని సర్కారు చేతులెత్తేసింది. శస్త్రచికిత్స చేయించడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని, అందువల్ల వారిని ఇంటికే పంపిస్తామని ప్రకటించింది. వీణావాణీలను వేరు చేస్తామని లండన్ వైద్యులు చెప్పినా.. కేవలం ఎయిమ్స్ నివేదికపై ఆధారపడి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఎయిమ్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వీణావాణీలకు ఆపరేషన్ చేయడం రిస్క్‌గా భావిస్తున్నాం. మరోసారి వైద్య పరీక్షల ఆలోచన సర్కారుకు లేదు. వారిని నీలోఫర్‌లో ఉంచడం కష్టం. కాబట్టి వారిని తల్లిదండ్రుల వద్దకు పంపిస్తాం. పిల్లలను చూసుకునే ఆర్థిక స్థోమత లేదని తల్లిదండ్రులు చెబుతున్నందున ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. అలాగే వీణావాణీలకు ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చే ఆలోచన ఉంది. వారి చదువు, ఆరోగ్యం, వైద్యం కోసం కూడా సాయం చేస్తాం..’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శరీరం అతుక్కుని పుట్టి 14 ఏళ్లుగా ఎన్నో బాధలు అనుభవిస్తున్న వీణావాణీల కథ ఇంటికి చేరింది. హైదరాబాద్‌లోనే పరీక్షలు.. వీణావాణీలకు శస్త్రచికిత్స అంశంపై సర్కారు గతేడాది లండన్ వైద్యులను పిలిపించి హడావుడి చేసింది. అయితే రూ.10 కోట్లు ఖర్చవుతుందని వారు తేల్చగానే ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి సలహా అంటూ వెనక్కి తగ్గిందన్న ఆరోపణలున్నాయి. కానీ ఎయిమ్స్లోనైనా పరీక్షలు చేశారా అంటే అదీ లేదు. నీలోఫర్ ఆస్పత్రి పక్కనే ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో పరీక్షలు చేసి, వాటిని ఎయిమ్స్‌కు నివేదించారు. అంతర్జాతీయ స్థాయిలో చేయాల్సిన వైద్య పరీక్షలను ఇక్కడికే పరిమితం చేశారు. ఆ నివేదికలను పట్టుకుని ఎయిమ్స్ నిపుణులు ‘శస్త్ర చికిత్స చేయగలం. కానీ ప్రాణాలకు ప్రమాదం’ అని ప్రకటించారు. అసలు లండన్ వైద్యులు శస్త్రచికిత్స చేస్తామని చెప్పాక కూడా ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్థికసాయం చేస్తే తీసుకెళ్తాం వీణావాణీల తల్లిదండ్రులు తాము కూలీ చేసి బతుకుతున్నామని, ఇప్పు డు తమ వద్ద ఉన్న ఇద్దరు పిల్లలనే కష్టపడి పోషిస్తున్నామని వీణావాణీల తండ్రి మురళి పేర్కొన్నారు. వీణావాణీలను తీసుకెళ్లాలని నీలోఫర్ వైద్యులు చెప్పారని.. తాము సమ యం కావాలని కోరామని చెప్పారు. వీణావాణీలను సరిగా చూసుకునే ఆర్థిక స్థోమత తమకులేదని.. వారికి మంచి ఆహారం, విద్య, వైద్యం అందించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి, సదుపాయాలు కల్పిస్తే వీణావాణీలను తీసుకెళ్లి కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారు. -
వీణా-వాణీలను విడదీస్తే ప్రాణగండం
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్ర చికిత్స విషయంలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చేతుతెల్తేశారు. తలలు అంటుకొని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వీణా-వాణీలను విడదీయడానికి శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని బ్రిటన్ కు చెందిన వైద్య బృందం తేల్చి చెప్పింది. ఆపరేషన్ చేస్తే వీణా-వాణీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైనా, నాడీ వ్యవస్థ కలిసి ఉండటంతో వాళ్లిద్దరూ కోమాలోకి వెళ్లడమో, నరాల క్షీణత, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఎయిమ్స్ వైద్యుల తాజా ప్రకటనతో నీలోఫర్ వైద్యులు డైలమాలో పడ్డారు. ఆపరేషన్ సంగతి పక్కన పెడితే ..ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులిద్దరి ఆలనాపాలన కూడా ప్రశ్నార్థకంగా మారింది. వారిద్దరికీ 13ఏళ్లు రావడంతో ఇక వారిని చూసుకోవడం తమవల్ల కాదని నిలోఫర్ వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో వీణా-వాణీల తాజా పరిస్థితులపై నీలోఫర్ వైద్యులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయానికి వచ్చారు. కాగా ఇప్పటి వరకూ ఏదో ఓ రోజు వీరిద్దరిని విడదీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తారన్న చిన్నారుల తల్లిదండ్రులు ఈ వార్తతో అయోమయంలో పడ్డారు. తాము పేదవారిమని, వారిద్దర్ని పోషించే శక్తి తమకు లేదని చెబుతున్నారు. -
వీడియో ఆధారంగా ఓ అభిప్రాయానికి రాలేం
శ్రుతి, సాగర్ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టుకు విన్నవించిన ఎయిమ్స్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌లకు స్థానిక వైద్యులు పోస్టుమార్టం నిర్వహణకు సంబంధించిన వీడియో ఆధారంగా నిర్దిష్ట అభిప్రాయానికి రావడం సాధ్యం కాదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వైద్యులు తేల్చి చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో చర్చించిన తరువాతనే ఓ అభిప్రాయానికి రాగలమని హైకోర్టుకు నివేదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఎయిమ్స్ వైద్యులు కోరుతున్న విధంగా పోస్టుమార్టం తాలూకు డాక్యుమెంట్లు, దాన్ని నిర్వహించిన వైద్యుల ఫోన్ నంబర్లు, ఎఫ్ఐఆర్ తదితర వివరాలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్నింటినీ పరిశీలించి జూన్ 15 లోపు అభిప్రాయాన్ని తెలియచేయాలని ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో సమన్వయ బాధ్యతలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌కు అప్పగిస్తూ, తదుపరి విచాణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిమ్స్ వైద్యులు ఇచ్చే నివేదికను సీల్డ్ కవర్లోనే అందచేయాలని శరత్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. -
విషమంగానే వీర జవాను
ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆర్మీ ♦ కోలుకోవాలని కోరుకుంటూ హనుమంతప్ప తల్లికి సోనియా లేఖ న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితులుండే సియాచిన్‌లో, మంచు చరియలు విరిగిపడటంతో, దాదాపు ఆరు రోజుల పాటు 25 అడుగుల లోతున కూరుకుపోయి, అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన సాహస జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప పరిస్థితి మరింత విషమించిందని బుధవారం సైన్యం ప్రకటించింది. ఆర్మీ హాస్పిటల్ వైద్యులతో పాటు అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) నుంచి నిపుణులైన వైద్యులు హనుమంతప్ప ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నారు. ‘మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతోంది. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉంది. బహుళ శరీరాంగాల వైఫల్య స్థితి కొనసాగుతోంది. పూర్తి చికిత్స అందుతున్నప్పటికీ.. పరిస్థితి ఇంకా విషమించింది’ అని బుధవారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హనుమంతప్ప కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ జవాను తల్లికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. కాగా, హనుమంతప్పకు మూత్రపిండం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ మహిళ ముందుకు వచ్చింది. ‘టీవీలో ఆయన పరిస్థితి చూశాను. కిడ్నీలు, కాలేయం పనిచేయట్లేదని చెప్పారు. ఆ జవాను క్షేమం కోసం కేవలం ప్రార్థనలే కాదు.. ఇంకేదైనా చేయాలనుకున్నాను. అందుకే నా భర్త అనుమతితో హనుమంతప్పకు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాను’ అని పడారియా తుల గ్రామానికి చెందిన నిధి పాండే తెలిపారు. హనుమంతప్ప కోలుకోవాలని ఆయన స్వరాష్ట్రం కర్ణాటక సహా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహా పలువురు నేతలు, ప్రముఖులు హనుమంతప్ప క్షేమాన్ని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా తరతమ భేదం లేకుండా ప్రజలు పూజలు నిర్వహించారు. కర్ణాటకలోని హుబ్లిలో గల తుల్జా భవానీ దేవాలయంలో పూజలు చేశారు. అహమ్మదాబాద్, జమ్మూ, తదితరచోట్ల హోమాలు చేసి, కొవ్వొత్తులు వెలిగించారు. ఆ వీరుడికి సవాళ్లే ఇష్టం..! జమ్మూ: మంచులో కూరుకుపోయి, ప్రాణాలతో బయటపడిన వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ వృత్తి జీవితం సాహసాలమయమే. మొదటి నుంచీ ఆయన శాంతియుత ప్రాంతాల్లో కాకుండా.. సమస్యాత్మక, కష్టతరమైన ప్రాంతాల్లోనే విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపేవారు. మొత్తం 13 ఏళ్ల సర్వీసులో 10 సంవత్సరాలు హనుమంతప్ప క్లిష్టమైన, సవాళ్లతో కూడిన పోస్టింగ్‌ల్లోనే పనిచేశారని, ఆ పోస్టింగ్‌లను ఆయనే స్వయంగా కోరుకునేవారని సైన్యంలోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘కర్ణాటకకు చెందిన హనుమంతప్ప 2002 అక్టోబర్ 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో జవానుగా చేరాడు. ఎప్పుడూ ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా ఉండే హనుమంతప్ప తొలి నుంచీ సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో పనిచేయాలనే కోరుకునేవాడు. 2003 నుంచి 2006 వరకు జమ్మూకశ్మీర్‌లోని మాహోర్‌లో పనిచేశారు. సరిహద్దుల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడంలో సాహసోపేతంగా పనిచేశాడు. ఆ తరువాత 54వ రాష్ట్రీయ రైఫిల్స్(మద్రాస్)లో పనిచేస్తానని ముందుకువచ్చాడు. అక్కడ 2008 నుంచి 2010 వరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌లో అత్యంత చురుగ్గా పాల్గొన్నాడు. 2010 - 2012 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాడు. అక్కడ బోడోలాండ్, అల్ఫా తీవ్రవాదులుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. 2015 అక్టోబర్ నుంచి సియాచిన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉన్నాడు. డిసెంబర్ 2015లో ఆయనను ఇంకా ఎత్తై పోస్ట్‌కు పంపించాలని నిర్ణయించారు. దాంతో, 19,500 అడుగుల ఎత్తై క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గంటకు 100 కిమీల వేగంతో శీతల గాలులు వీస్తుంటాయి’ అని ఆ అధికారి వివరించారు. -
మంగళగిరి ఎయిమ్స్ మూడేళ్లలో పూర్తి
శంకుస్థాపన సభలో కేంద్రమంత్రి నడ్డా వెల్లడి సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని అభివృద్ధి పరిచి, పేదలకు ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. దేశంలో 10 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమానికి జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యాలతోపాటు ఆయుర్వేదం, యునానీ, సిద్ధ వంటి అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఎయిమ్స్ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హరియాణా, కోల్‌కతాలో రెండు కేన్సర్ పరిశోధనా కేంద్రాలు, అన్ని రాష్ట్రాల్లో 20 కేన్సర్ ఇనిస్టిట్యూట్లు, 50 క్యాన్సర్ ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. దేశంలో 58 జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచి వైద్య కళాశాలలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెడికల్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరి ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఎయిమ్స్‌ను దేశంలో నంబర్‌వన్‌గా రూపొందిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎయిమ్స్ విద్యార్థులకు విజయవాడ లేదా గుంటూరు ఆసుపత్రుల్లో తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. రాజధానికి ఎయిమ్స్ ను మణిహారంగా మారుస్తామన్నారు. ఆసుపత్రుల్లో జనరిక్ మందుల అమ్మకాలను డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తామన్నారు. గుంటూరు, కర్నూలులో కేన్సర్ ఆసుపత్రుల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఎయిమ్స్‌కు రూ.4 కోట్ల విరాళాలు మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణానికి ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన డాక్టర్ సదాశివరావు కుమారులు రమేశ్, సురేశ్ రూ.2 కోట్లు, డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్ రూ.2 కోట్లు విరాళంగా అందచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సన్మానించారు. వైద్యరంగంలో విశేష సేవలు అందిస్తున్న వైద్య ప్రముఖులు సోమరాజు, గురువారెడ్డి, మన్నెం గోపీచంద్, చదలవాడ నాగేశ్వరరావు, ముక్కామల అప్పారావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పి.అశోక్‌గజపతిరాజు, వై.సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, పి.మాణిక్యాలరావు, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ-గుంటూరుకు ఎలక్ట్రికల్ ట్రైన్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను దేశంలోని 393 జిల్లాల్లో 30 కోట్ల మందికి వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎయిమ్స్ శంకుస్థాపన సభలో ఆయన ప్రసంగించారు. విజయవాడ-గుంటూరు మధ్య ఎలక్ట్రికల్ ట్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అంతర్వేది వద్ద రూ.1,800 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. -
'మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం'
విజయవాడ: మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నడ్డా, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 193 ఎకరాల్లో 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్‌ను నిర్మించనున్నట్టు జేపీ నడ్డా తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. 'మంగళగిరి ఎయిమ్స్ అమరావతికి మణిహారంలా నిలవబోతుంది. వైద్య సేవల కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. రెండేళ్లలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయాలి' అని చెప్పారు. 'త్వరలోనే విజయవాడ మెట్రో రైలు టెండర్స్ పిలుస్తాం. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు కి ప్రత్యేక ఎలక్ట్రికల్ ట్రైన్ సర్వీస్ ప్రారంభిస్తాం. ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టినా ఏపీకి ప్రాధాన్యం ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం' అని వెంకయ్యనాయుడు అన్నారు. -
నేడు ఎయిమ్స్‌కు శంకుస్థాపన
హాజరవనున్న కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించే ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) నిర్మాణ పనులకు శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా శంకుస్థాపనకు హాజరవుతున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. -
ఉద్యోగ సమాచారం
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వివిధ పోస్టులు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్- వీఎస్పీ).. వివిధ విభాగాల్లో మైనింగ్ మేట్, రిజిస్టర్ కీపర్, అసిస్టెంట్ రిజిస్టర్ కీపర్, హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 28. వివరాలకు www.vizagsteel.comచూడొచ్చు. ముంబై పోర్ట ట్రస్ట్‌లో 16 పోస్టులు ముంబై పోర్ట ట్రస్ట్ వివిధ విభాగాల్లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది జనవరి 15. వివరాలకు www.mumbaiport.gov.inచూడొచ్చు. ఢిల్లీ ఎయిమ్స్‌లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ (సైంటిస్ట్, రేడియోగ్రాఫర్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 12. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 5, 6. వివరాలకు www.aiims.edu చూడొచ్చు. ఎన్బీఆర్ఐలో టెక్నీషియన్లు లక్నోలోని సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ నేషనల్ బొటానికల్ రీసెర్చ ఇన్ స్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు www.nbri.res.inచూడొచ్చు. పాట్నా ఎయిమ్స్‌లో 195 ఫ్యాకల్టీ పోస్టులు పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 195. దర ఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www.aiimspatna.orgచూడొచ్చు. ఎంఏఐడీఎస్లో సీనియర్ రెసిడెంట్లు న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ (ఎంఏఐడీఎస్).. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www.maids.ac.inచూడొచ్చు. ఎన్ఆర్సీపీబీలో వివిధ పోస్టులు న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ (ఎన్ఆర్సీపీ బీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రీసెర్చ అసోసియేట్, జూ. రీసెర్చ ఫెలో, ఫీల్డ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు 6. ఇంటర్వ్యూ తేది జనవరి 2. వివరాలకు www.nrcpb.orgచూడొచ్చు. -
నేడు నీలోఫర్‌కు ఎయిమ్స్ బృందం
వీణ-వాణిల శస్త్రచికిత్స సాధ్యాసాధ్యాల పరిశీలన సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్-న్యూఢిల్లీ)కి చెందిన ముగ్గురు సభ్యుల న్యూరో వైద్యుల బృందం నేడు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి రానుంది. అవిభక్త కవలలైన వీణ-వాణిల శస్త్రచికిత్సకు సాధ్యాసాధ్యాలు, వైద్య పరీక్షలు తదితర వాటిపై పరిశీలనకు ఈ బృందం వస్తున్నట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ వైద్యులు డా.డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీల బృందం హైదరాబాద్‌కొచ్చి నీలోఫర్‌లో ఉన్న వీణ-వాణిలను పరిశీలించారు. ఐదు దశల్లో శస్త్రచికిత్స నిర్వహించి వీళ్లిద్దరినీ వేరు చేస్తామని.. ఈ కవలలను లండన్‌కు తీసుకురావాలని అన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. లండన్ వైద్యులను రప్పించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించింది. అంటే ఇప్పటికి సుమారు పది మాసాలు అయింది. తాజాగా ఎయిమ్స్ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో వీణ-వాణిలను పరిశీలించేందుకు ముగ్గురు వైద్యుల బృందం వస్తోంది. వీరికోసం నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. వీణ-వాణిలకు అన్ని వైద్య పరీక్షలు చేసి నివేదికలను సిద్ధం చేశారు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం లండన్ వైద్యులతోనూ ఆ బృందం సమాలోచనలు జరుపనుంది. -
ఉద్యోగ సమాచారం
ఐఓసీఎల్‌లో 98 పోస్టులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్).. పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్‌లో వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 98. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.iocl.comచూడొచ్చు బీహెచ్ఈఎల్లో 50 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు బెంగళూరులోని బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రిక ల్స్ లిమిటెడ్).. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 50. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.bheledn.comచూడొచ్చు. ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్స్ రాయ్‌పూర్‌లోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 29. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.aiimsraipur.edu.inచూడొచ్చు. కేరళ వెటర్నరీ వర్సిటీలో తాత్కాలిక పోస్టులు కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ.. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిసెంట్ ప్రొఫెసర్స, టీచింగ్ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 10. వివరాలకు www.kvasu.ac.inచూడొచ్చు. టాటా మెమోరియల్ సెంటర్లో ఫీల్డ్ వర్కర్లు టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.actrec.gov.inచూడొచ్చు. ఎన్సీఈఆర్టీలో స్పెషల్ రిక్రూట్మెంట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ).. వికలాంగుల కోటాలో లోయర్ డివిజన్ క్లర్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 20. వివరాలకు www.ncert.nic.inచూడొచ్చు. బెనారస్ హిందూ వర్సిటీలో ఖాళీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా కలెక్షన్/కోడింగ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ అండ్ ఎనాలిసిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 17. వివరాలకు www.bhu.ac.inచూడొచ్చు. 145 డీఎడ్ కాలేజీలకు అనుమతులు రెండు రోజుల్లో డీఈఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్)లో ప్రవేశాలకు చ ర్యలు మొదలయ్యాయి. 145 ప్రైవేటు డీఎడ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తూ సంబంధిత ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సంతకం చేశారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆ వెంటనే డీఈఈసెట్-2015 ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వీలైతే ఈ నెల 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాశం ఉంది. డీఈఈసెట్లో అర్హత సాధించిన 71 వేల మంది దీని కోసం ఎదురుచూస్తున్నారు. కళాశాల విద్యా కమిషనర్‌గా కిషన్‌కు బాధ్యతలు కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ సెలవులో ఉండడంతో ప్రభుత్వం... పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 8 వరకు ఓపెన్ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ మొదటి, రెండో సంవత్సరం, ఎంబీఏ మొదటి, రెండో, మూడో సంవత్సర వార్షిక పరీక్షలు డిసెంబర్, జనవరిలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 8లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ వార్షిక పరీక్షలు కూడా డిసెంబర్ ఆఖరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు. తెలంగాణ, ఏపీలోని స్టడీ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 5న నిమ్స్‌లో డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్ హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో పారామెడికల్ డిప్లొమా పీజీ కోర్సులకు రెండో విడ త కౌన్సెలింగ్ ఈ నెల 5న నిర్వహించనున్నట్లు నిమ్స్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5న నిమ్స్ పాత భవనం మొదటి అంతస్తులోని లె ర్నింగ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.nims.edu.inవెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. సిబ్బంది వివరాలు అప్లోడ్ చేయాల్సిందే జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశం... 15 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. అర్హులైన బోధన సిబ్బంది లేకపోయినా నెట్టుకొస్తున్న కాలేజీలను గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను(బయోడేటా) తమ వెబ్సైట్లో ఈ నెల 15 లోగా అప్లోడ్ చేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇందుకవసరమైన చర్య లు చేపట్టాలని ఆదేశించింది. వెబ్సైట్లో జేఈఈ మెయిన్ దరఖాస్తుల లింకు సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో దరఖాస్తుల లింక్‌ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ నోటిఫికేషన్లో అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొనగా, మెయిన్ నోటిఫికేషన్ లో మాత్రం 1.5లక్షల మందినే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా తీసుకుంటారంది. -
ఎంపీ మృతితో రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు ఖేకిహో ఝిమోమీ హఠాన్మరణంతో.. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభ వాయిదా పడింది. అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన ఖేకిహో గురువారం ఉద యం గుండెపోటుతో మరణించారు. నాగాలాండ్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఖేకిహో కృషిచేశారని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తెలిపారు. సభ ప్రారంభం కాగానే సిట్టింగ్ ఎంపీతోపాటు ఇటీవలమరణించిన మాజీ రాజ్యసభ ఎంపీలు రామ్ కప్సే, రుద్ర ప్రతాప్ సింగ్, ఎన్ రాజేంద్రన్‌లకు కూడా సభ నివాళులర్పించింది. రెండు నిమిషాలపాటు మౌనం వహించిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు అన్సారీ తెలిపారు. అసహనంపై చర్చకు సిద్ధం: జైట్లీ అసహనంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ‘భారత్‌లో వాస్తవ భిన్నాభిప్రాయాన్నే కాదు.. కల్పిత, నకిలీ అసమ్మతినీ అనుమతించేంత స్వేచ్ఛ ఉంది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనావిధానంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శలపై.. ‘మా ప్రధానమంత్రులు మోదీ కానీ, వాజ్‌పేయి కానీ అత్యంత చిన్న స్థాయి నుంచి అత్యున్నత పదవికి ఎదిగారు. కాంగ్రెస్‌లోలా కుటుం బ పాలన ద్వారా కాదు’ అని కౌంటర్ ఇచ్చారు. ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఎవరైనా తమకు రక్షణ లేదని, అభద్రతగా భావిస్తే.. వారిని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. -
మంగళగిరి ఎయిమ్స్‌కు ఓకే
సాక్షి, న్యూఢిల్లీ/మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ వివరాలను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. ‘ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) పథకం ద్వారా కొత్తగా మూడు ఎయిమ్స్ తరహా బోధనాసుపత్రుల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో వీటిని నిర్మిస్తాం. ఈ మూడు ప్రాజెక్టులకు మొత్తం రూ. 4,949 కోట్లు వ్యయం అవుతుంది’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. ఏపీలో ఎయిమ్స్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పొందుపరిచిన హామీ ప్రకారం జరుగుతోంది. మిగిలినవి 2014-15 బడ్జెట్లో పొందుపరిచినవి. మంగళగిరి ఎయిమ్స్‌కు రూ. 1,618 కోట్లు, నాగ్‌పూర్‌కు రూ. 1,577 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 1,754 కోట్లు వెచ్చిస్తారు. ప్రతిపాదిత ఒక్కో ఎయిమ్స్‌లో 960 పడకల ఆసుపత్రి ఉంటుంది. అలాగే టీచింగ్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, నర్సింగ్ కాలేజి, నైట్ షెల్టర్, హాస్టల్‌తో పాటు వసతి సదుపాయాలు ఉంటాయి. నాణ్యమైన వైద్య విద్య, నర్సింగ్ విద్య, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని గోయెల్ వివరించారు. వీటి ఏర్పాటు ఆయా రాష్ట్రాలకు పొరుగునే ఉన్న రాష్ట్రాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వైద్య పరంగా వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో వైద్య నిపుణులను తయారు చేయడానికి ఇవి తోడ్పడతాయని ఆయన తెలిపారు. నిర్మాణానికి ముందు దాదాపు 12 నెలలు ప్రణాళిక కోసం, ఆ తరువాత 48 నెలలు నిర్మాణానికి సమయం పడుతుందని వివరించారు. -
'త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభం'
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదిత భూములను మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర డీజీపీ వెంకటరాముడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్లానెటేరియానికి చెందిన 193 ఎకరాలను ఎయిమ్స్ ఏర్పాటుకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, నియామకాల ద్వారా సిబ్బంది కొరతను అధిగమిస్తామని డీజీపీ రాముడు చెప్పారు. -
రాష్ట్రానికి త్వరలో ఎయిమ్స్ బృందం
సాక్షి, హైదరాబాద్: రాష్టానికి త్వరలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) బృందం రానుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి ఈ బృందం పర్యటించి నివేదిక ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని... వాటిని వేగవంతం చేయాలని కోరుతూ లక్ష్మారెడ్డి రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిసినట్లు లక్ష్మారెడ్డి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మంజూరై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలని... వాటికి నిధులు విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు. కేంద్రం వివిధ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి రూ.755 కోట్లు మంజూరు చేయగా, కేవలం రూ.9 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో 187 ఎకరాల భూమిని పరిశీలించారని... అక్కడే ఎయిమ్స్ నిర్మాణం చేపడతామని వారికి చెప్పారు. కేంద్ర బృందాన్ని పంపి ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపి వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించిందని, ప్రత్యేక ఆరోగ్య విధానాన్ని కూడా సిద్ధం చేస్తుందని కేంద్ర మంత్రులకు వివరించారు. దీంతో వారు సానుకూలత వ్యక్తంచేశారని లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆయన వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. బుధవారం కూడా ఆయన ఢిల్లీలో పలువురిని కలవనున్నారు. -
'తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలి'
కరీంనగర్(సుల్తానాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలనికోరుతూ మంగళవారం రాత్రి ఎంపీలతో కలిసి తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు. ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి వైద్య రంగంలో ప్రాధాన్యత ఇచ్చిన వారవుతారని అన్నారు. కేంద్ర మంత్రి తమ వినతిపై సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా ఉన్నారు. -
ఆశ కారాదు నిరాశ
మంగళగిరి : అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఈ సారైనా శంకుస్థాపన జరగాలని జిల్లా ప్రజానీకం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అంగీకరించినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలో శంకుస్థాపన కార్యక్రమం మూడు సార్లు వాయిదా పడడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేస్తోంది. జూన్ మొదటి వారంలో వివిధ కార్యక్రమాల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మూడు రోజులు ఉండబోతున్నారు. దీంతో ఏదో ఒక రోజు ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారనే ప్రచారం ప్రజల ఆశలను చిగురింపజేస్తోంది. ఈ నెల 14వ తేదీన ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేయబోతున్నారంటూ పదిలక్షల రూపాయల ఖర్చుతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరకు కార్యక్రమం వాయిదా పడింది. శంకుస్థాపనకు రావాల్సిన కేంద్ర మంత్రి నడ్డాకు వీలుకాకపోవడంతోనే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకున్నా, అసలు కారణం వేరే ఉండి ఉంటుందనే అనుమానాలు లేకపోలేదు. పలు కార్పొరేట్ ఆసుపత్రుల ఒత్తిడి కారణంగానే ఎయిమ్స్ శంకుస్థాపన వాయిదా పడుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. అయితే జూన్‌లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని జరుగుతున్న ప్రచారం కొంత ఊరట కలిగిస్తోంది. ఎయిమ్స్ నిర్మాణానికి జిల్లా ప్రజలు ఎదురుచూడడానికి పలు కారణాలు ఉన్నాయి. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య వున్న మంగళగిరి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రాంతంగా మారిన తరుణంలో ఇక్కడ ఎయిమ్స్ నిర్మిస్తే మంగళగిరి మెడికల్ హబ్‌గా అవతరించనుందని భావిస్తున్నారు. సుమారు రూ. 1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌కు శానిటోరియం స్థలం 200 ఎకరాలతో పాటు, ఇక్కడ ఉన్న అటవీభూములు, ప్రశాంత వాతావరణం కలిగి ఉండడం ఎయిమ్స్ ఏర్పాటుకు కలిసి వచ్చే అంశాలు. ఎయిమ్స్ ఏర్పాటుతో వంద సీట్లతో మెడికల్ కాలేజి, 500 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, పలు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు కానుండడంతో మంగళగిరి ప్రాంతం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మంగళగిరి మున్సిపాల్టీకి తప్పనిసరిగా మరో తాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం కేటాయించనుండడంతో తాగునీటిసమస్యను అధిగమించవచ్చు. ఎయిమ్స్ నిర్మాణం పూర్తయి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తే అదే స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధి చెందే అవకాశం లేకపోలేదు. -
వీణా వాణీల శస్త్రచికిత్సపై సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిల శస్త్రచికిత్స పై సందిగ్ధత కొనసాగుతోంది. లండన్ వైద్యులను రప్పించి శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమేనన్న ఎయిమ్స్... రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై రాసిన లేఖ లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది. తనకు ప్రభుత్వం సంధించిన 4 ప్రశ్నలకు సంక్షిప్తంగా బదులిచ్చింది. ‘‘కేం ద్రం అనుమతి స్తే లండన్ వైద్యులతో ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చే యడానికి సిద్ధమే. కానీ చిన్నారులను ప్రత్యక్షం గా పరీక్షించనిదే దీనిపై నిర్ణయం తీసుకోలేం. దేనిమీదా స్పష్టత రాకుండా ఖర్చు విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం’’ అని పేర్కొంది. దీం తో సర్కారు సందిగ్థంలో పడింది. ఎయిమ్స్ వై ద్య బృందాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్‌కు అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. -
వీణావాణీలకు ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స
లండన్ వైద్యులతో చేయించేందుకు ఎయిమ్స్ సంసిద్ధత సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్రచికిత్సకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ముందుకు వచ్చింది. లండన్ గ్రేట్ ఆర్మండ్స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులను దేశానికి రప్పించి శస్త్రచికిత్స చేయిస్తామని ఎయిమ్స్ స్పష్టం చేసింది. వీణా వాణీ ల శస్త్రచికిత్స విషయమై దేశంలో ఉన్న అవకాశాలపై సలహా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం ఎయిమ్స్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ వద్దనే శస్త్రచికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు సమకూర్చి వీణావాణీలను విజయవంతంగా వేరు చేయడంలో కృషి చేస్తామని వెల్లడించింది. ఇది లా ఉండగా ఇక్కడకు వచ్చి శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు అంగీకరిస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. లండన్ వైద్యులు హైదరాబాద్ నిలోఫర్‌కు వచ్చి వీణా వాణీలను పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తామని లండన్ వైద్యులు వెల్లడించారు. ఆరు విడతలుగా చేసే ఈ ఆపరేషన్‌కు ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేశారు. అందుకు రూ. 10 కోట్లు ఖర్చు కాగలదని ప్రభుత్వానికి నివేదిక పంపారు కూడా. లండన్ వైద్యుల నివేదిక అనంతరం తెలంగాణ సర్కారు శస్త్రచికిత్స విషయమై ఎయిమ్స్ సలహా కోరుతూ లేఖ రాసింది. అయితే, ఎయిమ్స్‌లో శస్త్రచికిత్సకు అంగీకరించిన ఆ సంస్థ ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఖర్చుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్‌కు మరో లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు ముందుకు వస్తారా లేదా కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒప్పించేలా చేయాలని కూడా భావిస్తోంది. -
లండన్ వైద్యులను ఢిల్లీ రప్పిద్దామా?
వీణ వాణీల ఆపరేషన్‌పై ఎయిమ్స్‌కు సర్కారు లేఖ దేశంలోనే శస్త్రచికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలపై ఆరా ఖర్చు తదితర అంశాలపై వివరణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వీణ, వాణి అవిభక్త కవలలను వేరు చేసేందుకు లండన్ వైద్యులను మన దేశానికే రప్పించి శస్త్రచికిత్స చేసేందుకు గల సాధ్యాసాధ్యాలపై అభిప్రాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు లేఖ రాసింది. లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు వీణవాణిలను విడదీసే శస్త్రచికిత్స చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం దాదాపు రూ.10 కోట్ల మేరకు ఖర్చవుతుందంటూ వారు నివేదిక కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ సలహా కోరుతూ వారి నివేదికను కూడా పంపింది. ఎక్కడ చేయించవచ్చు? ప్రధానంగా మూడు అంశాలపై సర్కారు ఎయిమ్స్ సలహా కోరింది. లండన్ డాక్టర్లను రప్పించడం ఒకటి కాగా.. అలా రప్పిస్తే ఎయిమ్స్‌లో ఆపరేషన్ చేయడానికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు ఉన్నాయా? లేదా తెలపాలని కోరింది. లండన్‌లో చికిత్సకు రూ. 10 కోట్లు ఖర్చయితే.. వారిని ఢిల్లీకి రప్పించి, శస్త్రచికిత్స చేయిస్తే ఎంత ఖర్చవుతుందో సమాచారం ఇవ్వాలని కోరింది. ఇక రెండో అంశం.. అసలు ఎయిమ్స్‌లోనే శస్త్రచికిత్స చేయడానికి అవకాశాలు, ఆధునిక వైద్య వసతులు ఏమేరకు ఉన్నాయనే వివరాలు ఇవ్వాలని కోరింది. మూడో విషయం.. దేశంలో మరెక్కడైనా వీణవాణీలకు శస్త్రచికిత్స చేసే సామర్థ్యం గల ఆసుపత్రులున్నాయా? వైద్యులు ఉన్నారా? అన్న విషయంపైనా వివరాలు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ మూడింటిలో ఏది అనుకూలమో చెప్పాలని.. శస్త్రచికిత్స విజయవంతమయ్యేలా ఆ సలహాలు ఉండాలని కోరింది. జాప్యమా.. జాగ్రత్తా..? వీణవాణీల శస్త్రచికిత్సపై ఎయిమ్స్ సలహా కోరడం మంచిదే అయినా... దేశంలో ఎక్కడైనా చేసే అవకాశం ఉందా? అని సర్కారు అడగడాన్ని పలువురు వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. వీణవాణీల ఆపరేషన్‌పై ఏళ్లుగా చర్చ జరుగుతున్న సంగతిని వారు ప్రస్తావిస్తున్నారు. సింగపూర్ వైద్యులను ఇంతకు ముందు సంప్రదించారని, దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ ఆసుపత్రులతో పాటు ఎయిమ్స్ వైద్యుల దృష్టిలోనూ ఈ విషయం ఉందని వారు చెబుతున్నారు. అనేక ప్రయత్నాల తర్వాతే లండన్ ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చారని, వారు ఇప్పటికే ఇలాంటి ఆపరేషన్ చేసి విజయవంతమయ్యారని అంటున్నారు. ఇలా ఇన్ని రకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ... మళ్లీ ఎయిమ్స్ సలహా అంటూ సర్కారు తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. లండన్ ఆసుపత్రిలో చికిత్స విజయవంతానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరితే చాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఈ వాదనను కొట్టివేస్తోంది. ఒకటికి పదిసార్లు సరిచూసుకోవడం కోసమే ప్రభుత్వం ఎయిమ్స్ సలహా కోరిందని చెబుతోంది. -
మీ అభిప్రాయం ఏమిటి?
వీణ,వాణిల శస్త్ర చికిత్సపై ఎయిమ్స్‌కు లేఖ రాయనున్న సర్కార్ సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ,వాణిలను విడదీసే శస్త్రచికిత్సకు లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్య బృందం ముందుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయం కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారికి లేఖ రాయనుంది. శస్త్రచికిత్సలో అనేక సంక్లిష్ట అంశాలున్నందున ఎయిమ్స్ దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరని సర్కారు అభిప్రాయపడుతోంది. ఎయిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయినందున వైద్య పరమైన అంశాలకు సంబంధించిన అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వ ఆలోచన. లండన్ ఆసుపత్రి విషయంలో ముందుకు వెళ్లాలా? వద్దా? అక్కడ ఏ మేరకు సక్సెస్ రేటు ఉంటుంది? లండన్‌లోనే చేయించాలా? లేక ఇంకా ఎక్కడైనా చేయించే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లండన్ ఆసుపత్రి నుంచి వచ్చిన సమ్మతి లేఖ శుక్రవారం ఆర్థిక శాఖకు చేరింది. -
ఎయిమ్స్, నిమ్స్ రెండూ కావాలి!
బీబీనగర్ నిమ్స్‌పై శాసనసభలో చర్చ ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు నిమ్స్ అవసరం లేదన్న వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ స్థానం లో ఎయిమ్స్ ఏర్పాటు అంశంపై శాసన సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ లేవనెత్తిన ప్రశ్నపై శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అధికార టీఆర్ఎస్- కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పరస్ప రం ఆరోపణలు చేసుకున్నారు. ఎయిమ్స్‌ను మరోచోట ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలకు నిమ్స్, ఎయిమ్స్ రూపంలో రెండు పెద్ద ఆస్పత్రుల సేవలు అందుబాటులోకి వచ్చేవని చిం తల రామచంద్రారెడ్డి(బీజేపీ) ప్రభుత్వాన్ని నిలదీశారు. బీబీనగర్ నిమ్స్ భవన నిర్మాణం పూర్తైదని, కేవలం పరికరాలు, వైద్యులను అందుబాటులోకి తెస్తే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు అంగీకరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ స్వయంగా లేఖ రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్పత్రికి కావాల్సిన భూసేకరణ జరపకుండా ఆలస్యం చేయడం వల్లే ఈ బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించలేకపోయిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తప్పుబట్టారు. ఎయిమ్స్ వచ్చే వరకైనా బీబీనగర్ నిమ్స్ ఆధ్వర్యంలో ఆస్పత్రిని ప్రారంభించి వైద్య సేవలు అందించాలని జీవన్‌రెడ్డి(కాంగ్రెస్)డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికార పక్షం విపక్షాలపై ఎదురుదాడి చేసింది. బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రి స్థాపన నీరుగార్చడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఇప్పుడా ప్రాంతంలో నిమ్స్ ఆస్పత్రి అవసరం లేదన్నారు. చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకునే నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణ యం తీసుకున్నామన్నారు. పునర్విభజన చట్టంలో ఎయిమ్స్ ఏర్పాటుపై హామీ లేకపోయినా సీఎం కేసీఆర్, తమ ఎంపీల చొరవతో కేంద్రం అంగీకరించిందన్నారు. బీబీ నగర్ నిమ్స్‌కు 150 ఎకరాలు ఉన్నాయని, అక్కడే ఎయిమ్స్‌ను నెలకొల్పేందుకు కావాల్సిన మరో 50 ఎకరాలను సేకరిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. ఉమ్మడిజాబితాలో జేఎన్టీయూలేదు పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 10లోని ఉమ్మడి సంస్థల జాబితాలో ‘జేఎన్టీయూ హెచ్’ వర్శిటీ లేనందునే రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రలకు వేర్వేరుగా ఎంసెట్ నిర్వహణ ఎందుకు? అని పువ్వాడ అజయ్ కుమార్(కాంగ్రెస్) అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని మూడేళ్లలో 25 నుంచి 35 శాతానికి వృద్ధి చేసేందుకు హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం లో 25.43 లక్షల హెక్టార్లలో అడవులున్నాయన్నారు. టీఆర్ఎస్ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, కె.విద్యాసాగర్, చింతా ప్రభాకర్, వీరేశం, ఆరూరి రమేష్, రాథోడ్ బాపూరావు అడిగిన ప్రశ్నకు మంత్రి జోగురామన్న పైవిధంగా స్పందించారు. ఠ ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిని వాకారాబాద్లోని అనంతగిరి హిల్స్‌లో ఉన్న టీబీ శానిటోరియంకు మార్చాలని నిర్ణయం తీసుకున్న విషయం వాస్తవమేనని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఎర్రగడ్డ ఆస్పత్రి స్థలంలో అత్యాధునిక సచివాలయ సముదాయం నిర్మించనున్నామన్నారు. -
రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నతమైన వైద్యసేవల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తమిళనాడు శిగపై మరో కీర్తికిరీటం అలంక రణ కానుంది. వైద్య చరిత్రలో భారతదేశంలో పేరెన్నిక గన్న ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఆస్పత్రి రాష్ట్రానికి రానుంది. ఎయిమ్స్ నిర్మాణానికి అనుకూలంగా రాష్ట్రం సిద్ధం చేసిన ఐదు స్థలాలను పరిశీలించేందుకు ేంద్ర బృందం త్వరలో రాష్ట్రానికి చేరుకోనుంది.సాధారణ వైద్యంతోపాటు నేత్ర చికిత్సలో చెన్నై సుప్రసిద్ధిగా నిలిచింది. దేశం నలుమూలల నుంచేగాగ విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో రోగులు చెన్నైలో వైద్యానికి ప్రాధాన్యత నిస్తుంటారు. ముఖ్యంగా అరబ్, ఆఫ్రికా దేశాల వారికి చెన్నైలో వైద్యం అంటే ఎంతో నమ్మకం. దేశీయుల కంటే విదేశీయులతోనే ఇక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతుంటాయి. చెన్నై సెంట్రల్ ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వాత్రి (జీహెచ్)లో అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇదిగాక రాయపేట, స్టాన్లీ, కీల్పాక్, ఎగ్మూరులోని తల్లి, పిల్లల ఆస్పత్రి ఇలా ఎన్నో ఆస్పత్రులున్నాయి. తాజాగా అన్నాడీఎంకే ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాన్ని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చివేసింది. ఈ ఆస్పత్రి ద్వారా ఎయిమ్స్ తరహా వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఎయిమ్స్ ప్రవేశం ఇప్పటికే అత్యున్న వైద్యసేవల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులో ఏకంగా ఎయిమ్స్ ఆస్పత్రులే ప్రవేశిస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఒకటి, తమిళనాడులో నాలుగు లెక్కన ఐదు ఎయిమ్స్ ఆస్పత్రులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రి నెలకొల్పేందుకు కనీసం 200 ఎకరాలు అవసరం. ఈ స్థలం నగరానికి అనుకునే ఉండాలి, రోడ్డు మార్గం, రైలు, విమాన మార్గం, రవాణా, తాగునీరు, విదుత్ తదితర ప్రాథమిక వసతులు కలిగి ఉండాలి. ఎయిమ్స్‌కు అనుకూలమైన స్థలం తిరుచ్చిరాపల్లి-తంజావూరు మార్గంలోని చెంగిపట్టి, పుదుక్కోట్టైలో పశుసంవర్థకశాఖకు చెందిన స్థలం, చెంగల్పట్టు, మధురై సమీపం తోప్పూర్, ఈరోడ్డు జిల్లా పెరుందురై... ఈ ఐదు స్థలాలను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపింది. అంతేగాక వెంటనే ఎయిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. గత ఏడాది ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రధాని మోదీని కలిసినపుడే ఐదు స్థలాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన తొలి బడ్జెట్లో ప్రకటించారు. త్వరలో ఒక కేంద్ర బృందం సదరు ఐదు స్థలాలను సర్వే చేసేందుకు రాష్ట్రానికి రానుంది. రాష్ట్రం సిద్ధం చేసిన ఐదు స్థలాలను పరిశీలించి ఇందులో ఒకదానిని ఖరారు చేస్థారా లేక మరి కొన్ని స్థలాలను సూచించాల్సిందిగా కోరుతారా అనేది సర్వే పూర్తయితేగానీ తెలియదు. -
‘ఎయిమ్స్’పై ఎందుకింత జాప్యం!
-
నెరవేరని ఎయిమ్స్!
* ఎంపీ కొండా ప్రయత్నం వృథా ప్రయాసే * బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒంటరి పోరు వృథా ప్రయాసగా మారింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అఖిల భారత వైద్య, విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను జిల్లాలో స్థాపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ, పక్క జిల్లాకు తరలిపోవడం నిరాశే మిగిల్చింది. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర సర్కారు తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వతహాగా వైద్యసంస్థలపై పట్టున్న కొండా.. ఎయిమ్స్ వస్తే మెడికల్ కాలేజీ కూడా దానంతట అదే మంజూరవుతుందని ఆశించి ఎలాగైనా ఈ సంస్థను జిల్లాలో నెలకొల్పాలనే పట్టుదల ప్రదర్శించారు. కేంద్రంతో సంప్రదింపులు.. స్థలం కేటాయిస్తే ఎయిమ్స్‌ను నిర్మిస్తామని పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టం చేయడమే తరువాయి ప్రభుత్వ స్థలాల వేట కొనసాగించారు. రాజధానికి సమీపంలో శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండేలా ముచ్చర్ల, చేవెళ్ల, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించిన ఆయన ఈ అంశంపై అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీధర్‌తో కూడా పలుమార్లు చర్చించారు. ఎంపీ ప్రతిపాదనలతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న జవహర్‌నగర్‌లో కూడా ఎయిమ్స్ నిర్మాణాన్ని పరిశీలించాలంటూ శ్రీధర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ క్రమంలోనే తెలంగాణకు కేటాయించిన ఎయిమ్స్ జిల్లాకు రావడం ఖాయమనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ముచ్చర్ల భూములను ఫార్మాసిటీకి కేటాయించడం, శేరిలింగంపల్లిలోని ప్రతిపాదిత స్థలాలను వేలం వేయాలని నిర్ణయించడం ఎంపీ ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. ఆఖరికి జవహర్‌నగర్‌ను కూడా పరిగణనలోకి తీసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎయిమ్స్‌ను నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆయన వర్గీయులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. కొత్త ప్రాజెక్టుల ఎంపికకు రంగారెడ్డి జిల్లాను పరిగణనలోకి తీసుకోవడం ఒక ఎత్తయితే.. కనీసం ఈ వ్యవహారంలో జిల్లా ప్రతినిధులు కలిసిరాలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫార్మాసిటీపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. 13వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధనగరి నిర్మిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించినా.. ఇప్పటివరకు కనీసం 2వేల ఎకరాలను కూడా సమీకరించకపోవడం, ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు తటాపటాయిస్తున్నట్లు తెలుస్తుండడంతో ప్రభుత్వంలో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదు. ఈ క్రమంలోనే సర్వే పనులను కూడా నెమ్మదిగా కొనసాగిస్తోంది. -
ఎయిమ్స్‌గా బీబీనగర్ నిమ్స్
* రూ. 1,000 కోట్లతో అభివృద్ధి * 200 ఎకరాల్లో అభివృద్ధికి నిర్ణయం * రాజధాని, శివారు జిల్లాల రోగులకు వైద్యసేవలు * మొదటి దశలో ఎయిమ్స్, రెండో దశలో స్మార్ట్ హెల్త్‌సిటీ * స్మార్ట్హెల్త్సిటీ కోసం వెయ్యి ఎకరాలు * రైతులు, భూదాన్ భూముల సేకరణ * సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం భువనగిరి: నల్లగొండ జిల్లా బీబీనగర్ వద్దగల నిమ్స్‌ను ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్)గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మంగళవారం బీబీనగర్ మండలం రంగాపురం వద్దగల నిమ్స్‌ను సీఎం పరిశీలించారు. అంతర్జాతీయస్థాయిలో హెల్త్ టూరిజం, హెల్త్స్మార్ట్ సిటీగా బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు అధికారులతో కలసి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా అభివృద్ధి చేయడానికి 200 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం 160 ఎకరాల భూమి ఉంది. మిగిలిన 40 ఎకరాలను రైతులు, భూదాన్ భూముల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఈ భూమి ప్రతిపాదనలతో కేంద్రానికి నివేదికలు పంపిస్తే ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తారని సీఎం వివరించారు. ఎయిమ్స్ ఏర్పాటైతే సుమారు 1,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి రానున్నాయి. నిమ్స్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల రోగులకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అధునాతన రీసెర్చ్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తెలంగాణలో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. దీంతో ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కోరారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్రంలోని 10 ప్రాంతాలను ఎంపికచేసి అనువైన స్థలం కోసం సర్వేలు చేపట్టింది. అంతిమంగా బీబీనగర్ నిమ్స్.. ఎయిమ్స్ ఏర్పాటుకు అనువైందని గుర్తించింది. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా నిమ్స్‌ను సందర్శించి ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 1,000 ఎకరాలు సేకరించాలి నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చడానికి ప్రస్తుతం 200 ఎకరాలు అవసరం కాగా, అంతర్జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన కేంద్రంగా, స్మార్ట్ హెల్త్‌సిటీగా అభివృద్ధి చేయడానికి మాత్రం 1,000 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఇందుకోసం బీబీనగర్ ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములను సేకరించాలని నిర్ణయించారు. మొదటి ఫేజ్‌లో 200 ఎకరాల్లో ఎయిమ్స్‌ను, రెండవ ఫేజ్‌లో 1,000 ఎకరాల్లో స్మార్ట్హెల్త్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, ఆరోగ్యశాఖ డెరైక్టర్ శ్రీనివాస్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ మధుసూదన్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రి
నాలుగు జిల్లాల్లో భూముల అన్వేషణ: మంత్రి రాజయ్య కేంద్ర ప్రభుత్వం రూ.820 కోట్లతో ఏర్పాటు చేస్తుంది ఫీవర్ ఆసుపత్రిలో ఎబోలా, స్వైన్‌ఫ్లూ, డెంగీలకు ప్రత్యేక వార్డు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తరహా ఆసుపత్రిని నిర్మించేందుకు నాలుగు జిల్లాల్లో భూములను పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూములు, వసతుల పరిశీలన జరుపుతున్నామని చెప్పారు. ఆ సమాచారాన్ని కేంద్రానికి పంపుతామన్నారు. అనంతరం కేంద్ర బృందం ఆ భూములను పరిశీలించి ఒకచోట రూ.820 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి డిజైన్ తయారు చేసే పనిలో ఉన్నామన్నారు. ఈనెల 29న రామగుండం ఏరియా ఆసుపత్రిలో నిద్ర కార్యక్రమం ఏర్పాటుచేశామని చెప్పారు. ఇక నుంచి గాంధీ ఆసుపత్రికి బదులు ఫీవర్ ఆసుపత్రిలో ఎబోలా, స్వైన్‌ఫ్లూ, డెంగీ, చికెన్‌గున్యా పరీక్షలు జరుపుతామని, అందుకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70 స్వైన్‌ఫ్లూ కేసులు గుర్తించామని, ప్రస్తుతం ఎక్కడా స్వైన్‌ఫ్లూ కేసులు లేవని స్పష్టంచేశారు. ‘‘రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో 13 వేల స్వైన్‌ఫ్లూ క్యాప్సూల్స్ అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తాం. ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో కాలేయ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని వివరించారు. ‘యాప్’లో వైద్య సేవల సమస్త సమాచారం.. వైద్య ఆరోగ్య సేవలపై హెల్త్‌కేర్ అప్లికేషన్ (యాప్)ను మంత్రి రాజయ్య ఆవిష్కరించారు. ఈ యాప్‌ను ‘మహీంద్ర కామ్వివా’ వారు రూపొందించారు. -
ఎయిమ్స్‌లో ఆన్లైన్ సేవలకు కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వాసుపత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) పడకల స్థాయిని విస్తరించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ ఆపరేషన్ల కోసం రోగులు దీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తోంది. పడకల సంఖ్య తక్కువగా ఉం డడంతో నెలలు, సంవత్సరాలపాటు వివిధ ఆపరేషన్ల కోసం రోజులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ నిరీక్షణ కాలం వ్యాధి తీవ్రతను బట్టి, నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అడ్మిషన్ ప్రక్రియ సరళీకరణ: ఇందులో భాగంగా రోగుల అడ్మిషన్ ప్రక్రియను సరళీకరించి సౌకర్యవంతంగా, పారదర్శకంగా అడ్మిషన్ ప్రక్రియను తీర్చిదిద్దడం కోసం ఆన్లైన్ ద్వారా పడకలను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. రోగులు ఇంటి వద్ద నుంచే అసుపత్రిలో ఆన్లైన్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసుపత్రిలో పడక లభ్యత గురించిన సమాచారాన్ని ఎయిమ్స్ ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తుంది. దాని వల్ల రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ తిర గాల్సిన పనిలేదు. ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలనేది రోగులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతోంది. కేటాయించిన రోజు రోగులను ఆసుపత్రికి తీసుకొని రావచ్చని ఎయిమ్స్ సీనియర్ అధికారి పేర్కొన్నారు. రోజూ 10 వేల మంది రోగుల రాక: ఎయిమ్స్ ఓపీడీ విభాగాన్ని రోజుకు పదివేల మంది సందర్శిస్తారు. న్యూరాలజీ, కార్డియాలజీ, కేన్సర్, పిడియాట్రిక్ ,ఈఎన్టీ విభాగాలలో రోగుల సంఖ్యఎక్కువగా ఉంటుంది. 2,400 పడకలు కల ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఆపరేషన్ల కోసం నిరీక్షాంచాల్సి వస్తోంది. ఒక్కోసారి ఆపరేషన్ తేదీ ముందుగానే లభించిన ప్పటికీ పడకలు ఖాళీగా లేకపోవడం జాప్యం జరుగుతోంది. పడక ఎప్పుడు దొరుకుతుందో తెలుసుకోవడం కోసం రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ ఏళ్లతరబడి తిరుగాల్సి వచ్చేంది. డబ్బులు తీసుకుని ఆసుపత్రి సిబ్బంది పడక కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఈ సమస్యలను నివారించడం కోసం పడకల కేటాయింపు సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అందించాలని ఎయిమ్స్ యోచిస్తోందని అధికారులు పేర్కొన్నారు. -
ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థినుల ధర్నా
న్యూఢిల్లీ: తమ సహ విద్యార్థిని ఆత్మహత్య ఘటనతో నర్సింగ్ విద్యార్థినులు అగ్రహోదగ్రులయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ జంతర్‌మంతర్ ప్రాంతంలో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఈ విషయమై నర్సింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న యోగితా సింగ్ అనే విద్యార్థిని మాట్లాడుతూ హాస్టల్ సూపరింటెండెంట్ మానసిక వేధింపులను భరించలేకనే పల్లవి ఆత్మహత్య చేసుకుందన్నారు. అందువల్ల హాస్టల్ సూపరింటెండెంట్‌ను తక్షణమే విధుల్లోనుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కాగా ఎయిమ్స్‌లో నర్సింగ్ కోర్సు చేస్తున్న 20 సంవత్సరాల విద్యార్థిని పల్లవి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు పల్లవి మృత దేహం వేలాడుతుండడాన్ని ఆమె స్నేహితురాళ్లు ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో గుర్తించారు. పల్లవి అదే రోజు సాయంత్రం మాయాపురిలోని ఇంటి నుంచి హాస్టల్‌కు వచ్చింది. బీఎస్సీ సర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న పల్లవికి ఇటీవల జరిగిన పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయి. ఈ విషయమై హాస్టల్ సూపరింటెండెంట్ పల్లవిని ఎగతాళి చేయడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఆమె స్నేహితురాళ్లు మీడియాకు తెలిపిన విషయం విదితమే. -
జనవరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన: కామినేని
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేసే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (ఎయిమ్స్)కు వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్ సోమవారం ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిమ్స్‌కు రూ.200 కోట్లు విడుదల చేస్తామని, భూముల పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఈ నెల 23లోగా పంపుతామని నడ్డా హామీ ఇచ్చారన్నారు. -
మోడీకి ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి ఢిల్లీ ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు మోడీ ఎయిమ్స్‌కు చేరుకోగా.. ఆయనకు వైద్యులు పరీక్షలు చేశారు. సాధారణంగా ప్రధానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటీన్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అందులో భాగంగానే మోడీకి పరీక్షలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
ప్రధాని మోడీరాకతో ఎయిమ్స్‌లో ఇబ్బందులు
న్యూఢిల్లీ: సాధారణ వైద్య పరీక్షల కోసం ప్రధాని మోడీ ఆదివారం ఎయిమ్స్‌కు రావడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఉదయం 10.30 గంటలకు మోడీ ఆస్పత్రికి వచ్చారని, వైద్య పరీక్షల అనంతరం ఆయన వెంటనే తిరిగి వెళ్లిపోయారని ఎయిమ్స్ డెరైక్టర్ ఎం.సి. మిశ్రా తెలిపారు. ఇదిలాఉండగా ఆయన రాకవల్ల ఎయిమ్స్ పరిసరాల్లో భద్రతా ఆంక్షలు విధించారు. ఆస్పత్రికి ఆయన రావడానికి అరగంట ముందు నుంచి బయటివారిని ఎవరినీ లోపలికి అనుతించలేదు. కొంతమంది ఆస్పత్రి సిబ్బందిని కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. ఇక వైద్యం కోసం వచ్చిన రోగులనైతే గేటు వద్దే ఆపివేశారు. ఆస్పత్రి మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న భద్రతా సిబ్బంది వైద్య పరీక్షలు ముగిసే వరకు కఠినంగా వ్యవహరించారు. ఈ విషయమై ఓ రోగి మాట్లాడుతూ... ‘ప్రధానికి భద్రత కల్పించడం అవసరమే. అయితే ఈస్థాయి భద్రతను గతంలో కూడా ఎప్పుడూ చూడలేదు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని కూడా లోపలికి పంపకపోతే ఎలా? సిబ్బంది కూడా బయటే నిల్చోవాల్సి వచ్చింది. ఇలా ప్రజలను ఇబ్బందిపెడితే ఎలా?’ అని ప్రశ్నించారు. ఆస్పత్రి సిబ్బంది ఒకరు మాట్లాడుతూ... ‘ఆస్పత్రి సిబ్బంది అని కూడా చూడలేదు. ఐడీ కార్డులు చూపినా కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. మా సంగతి సరే... రోగులను కూడా లోపలికి పంపకపోతే ఎలా? వారిలో హృద్రోగులు, గర్భవతులు ఉన్నారనే కనికరం లేకపోతే ఎలా?’ అని ప్రశ్నిం చారు. మోడీ రాకతో రోగులు ఇబ్బంది పడిన వార్తలు టీవీలో ప్రసారమైన వెంటనే ట్విటర్, ఫేస్బుక్లో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. -
హర్షవర్ధన్‌ను తక్షణమే తప్పించాలి
ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని పదవినుంచి తప్పించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను పదవి నుంచి తప్పించాలని లేదా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై పార్టీ కార్యాలయంలో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎయిమ్స్ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతి కార్యకలాపాలను సంజీవ్ చతుర్వేది బయటపెట్టారు. ఈ కారణంగానే ఆయనను ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి పదవినుంచి తొలగించారు’ అని అరోపించారు. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ చతుర్వేది సదరు అధికారిపై చర్యలకు ఉపక్రమించాడు. దీంతో ఆ అధికారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కారణంగా సదరు ఐఏఎస్ అధికారి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాలేకపోయారు. బీజేపీ నాయకుడు చతుర్వేదిపై అనేక పర్యాయాలు ఫిర్యాదుచేశాడు. ఆ ఫిర్యాదులను పరిశీలించి, చివరికి తిరస్కరించారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వివాద పరిష్కారానికి మరింత సమయం కాగా పరువునష్టం కేసు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బీజేపీ అగ్రనాయకుడు నితిన్ గడ్కరీ, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మరింత సమయమిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదావేసింది. -
ఎయిమ్స్ తరహాలో రిమ్స్
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఇక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) స్థాయిలో అభివృద్ధి చెందనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) పథకం కింద రిమ్స్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇక రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవులు అందనున్నాయి. గత ఫిబ్రవరిలోనే అప్పటి యూపీఏ సర్కారు ఈ పథకం కింద రిమ్స్‌ను ప్రకటించింది. సరైన మార్గదర్శకాలు చేసిన అనంతరం నిధులు విడుదల చేయాలని భావించింది. దేశంలో 39 వైద్య కళాశాలలు ఎంపిక చేయగా, మన రాష్ట్రంలో వరంగల్ కాకతీయ, రిమ్స్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వైద్య కళాశాలలు బలోపేతం చేయడం, రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రూ.150 కోట్ల నిధులతో.. పీఎంఎస్ఎస్వై పథకం కింద కేటాయించిన రూ.150 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు సమకూర్చనున్నాయి. ఈ నిధుల్లో రూ.90 కోట్లు ఆస్పత్రి భవనాల కోసం.. రూ.60 కోట్లు వైద్య పరికరాల కోసం వెచ్చించనున్నట్లు సమాచారం. నాలుగేళ్లలో ఎయిమ్స్ తరహాలో రిమ్స్ వైద్య కళాశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందడుగేసింది. రిమ్స్‌లో ప్రస్తుతం ఉన్న 21 వైద్య విభాగాలతోపాటు మరో 25 వైద్య విభాగాల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్య నిపుణులు చికిత్సలు అందిస్తారు. ఎంఆర్ఐ యూనిట్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థ్రోపెడిక్, అనస్తీయాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రోలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 500 పడకలు కలుపుకుని మరో 500 పడకల సామర్థ్యంతో సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటితోపాటు అదనంగా 200 మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకమవుతారు. ప్రత్యేక బృందం పరిశీలన తర్వాతే.. రిమ్స్ ఆస్పత్రికి సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందించేందుకు కావాల్సిన సౌకర్యాలు, ఆస్పత్రి భవనాల నిర్మాణానికి సంబంధించి స్థలం, తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి ఓ ప్రత్యేక బృందం పరిశీలనకు వస్తుంది. పరిశీలన అనంతరం బృందం సభ్యులు నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు. అంనతరం కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ప్రస్తుతం మనకు రిమ్స్ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారి పక్కన కావాల్సిన స్థలం అందుబాటులో ఉంది. ప్రభుత్వ బృందం రిమ్స్ పరిశీలనకు వచ్చినప్పుడు ఈ స్థలాన్ని ఆస్పత్రి భవనాలు నిర్మించేందుకు రిమ్స్ అధికారులు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకం కింద రూ.150 కోట్లను రిమ్స్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను అడుగగా.. ఈ నిధులతో రిమ్స్ మెరుగుపడుతుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అన్ని అంశాలతో నివేదిక తయారు చేస్తాం అన్నారు. -
ఎయిమ్స్ విజయవాడలోనే ఏర్పాటు చేయండి
మాజీ మంత్రి సారథి డిమాండ్ ముస్తాబాద (గన్నవరం రూరల్) : ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థ ఎయిమ్స్‌ను విజయవాడలోనే ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి డిమాండ్‌చేశారు. శనివారం ముస్తాబాద వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ఖమ్మం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎయిమ్స్‌ను విజయవాడలో నెలకొల్పాలని కోరారు. జిల్లాకు చెందిన వైద్య శాఖ మంత్రి గుంటూరులో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటిం చినా, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించకపోవడం సరికాదన్నారు. గొల్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. రైతులకు విత్తనాలను గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. అనేక గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళిత, గిరిజన సర్పంచ్‌లు తమ అధికారాలను వినియోగించుకోకుండా పంచాయతీ కార్యదర్శుల ద్వారా టీడీపీ నాయకులు పరిపాలన నడుపుతున్నారని విమర్శించారు. సర్పంచ్ హక్కులను కాపాడేందుకు, గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని సారథి ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఎం.బాబు, కూరేటి కుమారి, నాయకులు బి.వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్!
-
తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్!
న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రానికి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ను కేటాయించే అంశంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో సహా పలువురు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారంతెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎయిమ్స్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం పలు విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్లను ప్రధాన నగరాలైన కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలకు ఒక్కొక్కటి కేటాయించింది. అలాగే, విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ను తమ కూడా కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
జిప్మర్ తరహాలో ఎయిమ్స్ ఏర్పాటు
మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి మంగళగిరి : జిప్మర్ ఆసుపత్రిలాంటి ఆధునిక సదుపాయాలతో సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్‌ను నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించేందుకు గురువారం విచ్చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎయిమ్స్ నిర్మాణానికి శానిటోరియం స్థలం అనువుగా ఉందన్నారు. అయితే తాము స్థలాన్ని పరిశీలించి కేంద్రబృందానికి పంపుతామని చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 125 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు. శానిటోరియంలో ఇప్పటికే ఎన్టీఆర్ యూనివర్శిటితో పాటు ఎన్డీఆర్ఎఫ్కు భూములు కేటాయించి వున్నాయని, ఎన్డీఆర్ఎఫ్కు అమరావతి టౌన్ షిప్లో వున్న 80 ఎకరాల స్థలం కేటాయించి శానిటోరియం స్థలాన్ని పూర్తిగా ఎయిమ్స్‌కు కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఆంధ్ర విద్యార్థులకు కేసీఆర్ ఫీజులు చెల్లించకుంటే తమ ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. (ఇంగ్లీషులో ఇక్కడ చదవండి) -
ఇద్దరు మంత్రుల మధ్య ‘ఎయిమ్స్’ చిచ్చు
- సంస్థ ఏర్పాటుపై ఉమా, ప్రత్తిపాటి పట్టు - సీఎం వద్ద ఉమా మంత్రాంగం సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రంలో ముఖ్య శాఖలకు సంబంధించిన ఇద్దరు మంత్రుల మధ్య ‘ఎయిమ్స్’ చిచ్చు రగులుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను మా జిల్లాకు కావాలంటే.. మా జిల్లాకు కావాలంటూ.. ఇద్దరు మంత్రులూ పట్టుపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎయిమ్స్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం పలు విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్లను ప్రధాన నగరాలైన కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలకు ఒక్కొక్కటి కేటాయించింది. అలాగే, విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టుబడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య మంగళగిరి ఉన్నందున రెండు ప్రాంతాలకూ అనుకూలంగా ఉంటుందన్న భావనతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో కేంద్ర బృందం కూడా త్వరలోనే స్థల పరిశీలన చేయనుంది. మరోవైపు ఎయిమ్స్‌ను ఎలాగైనా విజయవాడలోనే పెట్టించాలనే ఆలోచనతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపాదనకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో దానిని ఏర్పాటుచేస్తే విజయవాడ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నది ఉమా అభిప్రాయం. జనాభా ఎక్కువగా ఉండడం, రాజధానికి అనువైన ప్రదేశం అయినందున విజయవాడలోనే నెలకొల్పాలని ఆయన సీఎం వద్ద పట్టుబడుతున్నారు. దీంతో రాజకీయంగా మంత్రులిద్దరి మధ్య దూరం బాగా పెరుగుతున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. మంత్రులు ఇలాంటి పట్టుదలలకు పోతే రేపు రాబోయే ప్రాజెక్టులపై ఎలాంటి వివాదాలు నెలకొంటాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'ఇప్పుడూ కూడా అభివృద్ధి ఒకే ప్రాంతంలోనే'
అనంతపురం : తెలుగు దేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు కూడా అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తున్నారని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. అనంతపురంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలు-అనంతపురం మధ్యలో ఉప రాజధాని నిర్మాణం జరగాలని శైలజానాథ్ సూచించారు. -
గుంటూరులో ఎయిమ్స్!
న్యూఢిల్లీ : గుంటూరు జిల్లాలో ఎయిమ్స్ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ప్రతిపాదించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. కాగా ప్రతి రాష్ట్రంలోనూ 'అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ' (ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఆ మేరకు తగిన ప్రాంతాల్లో స్థలాలు గుర్తించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరింది. ఎయిమ్స్‌కు స్థలం కేటాయింపులో కొన్ని సమస్యలున్నాయని, ఒక్కో సంస్థ ఏర్పాటు చేయడానికి 200 ఎకరాల దాకా అవసరం అవుతాయని మంత్రి చెప్పారు. ఒక్కో ఎయిమ్స్ కు దాదాపు రూ.1500 కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిమ్స్ కోసం గుంటూరు జిల్లాలో స్థలం ప్రతిపాదించిందని తెలిపారు. కాగా కొత్త ఎయిమ్స్ ఏర్పాటు ఎంత కాలంలో చేయాలన్నదానికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితి ఏమీ లేదని ఆయన వివరించారు. -
ఆస్పత్రులున్నాయనే.. అడగలే దు!
ఎయిమ్స్ ప్రతిపాదనపై టీ.ఎంపీలతో ఆరోగ్యమంత్రి న్యూఢిల్లీ : తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు విరివిగా ఉన్నాయన్న సమాచారంతోనే ఎయిమ్స్ తరహా ఆస్పత్రి కోసం రాష్ట్రాన్ని ప్రతిపాదన అడగలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ అన్నట్లు టీ.ఎంపీలు తెలిపారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేకప్రతినిధి రామచంద్రుడు, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కె.కవిత ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యమంత్రిని కలిసి, తెలంగాణకు ఎయిమ్స్ తరహా ఆస్పత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు అందుబాటులో లేవని చెప్పారు. ఎయిమ్స్ తరహా ఆస్పత్రుల కోసం ఇటీవల 13 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి లేఖవచ్చిందని, తెలంగాణను ఎందుకు పట్టించుకోలేదని ఎంపీలు ప్రశ్నించారు. సరైన సమాచారం తెప్పించుకుని తెలంగాణకు న్యాయం చేస్తానన్నారని టీ.ఎంపీలు తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి రూ.వంద కోట్లు, ఇతర వర్సిటీలకు రూ.ఏభై కోట్లు మంజూరు చేయాలని కేంద్రమానవ వనరుల శాఖ స్మృతి ఇరానిని కోరారు. -
బెజవాడలోనే ఎయిమ్స్: కామినేని
విజయవాడ : అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) విజయవాడలోనే ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎయిమ్స్ ఆస్పత్రి కోసం కేంద్ర బృందం రెండు, మూడు రోజుల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ కోసం కేంద్రం రూ.12 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కామినేని తెలిపారు. మెడికల్ హబ్ సిటీగా విజయవాడను తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఇష్టపడి చదివా.. 'ఎయిమ్స్' టాపరయ్యా!
-
'నిమ్స్‌ను ఎయిమ్స్ స్థాయికి తీసుకు వెళతాం'
హైదరాబాద్ : నిమ్స్‌ను ఎయిమ్స్ స్థాయికి తీసుకు వెళతామని ఆరోగ్య శాఖమంత్రి రాజయ్య అన్నారు. నిమ్స్‌లో అవినీతిని అరికట్టేందుకు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కంప్యూటరైజేషన్ చేస్తామన్నారు. ఇందుకోసం పీ డాక్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నట్లు రాజయ్య గురువారమిక్కడ తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న పాత సామాగ్రిని తీసివేసి కొత్త సామాగ్రిని అందచేస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మెడికల్ కళాశాలలో కోల్పోయిన సీట్ల కోసం ఎంసీఐని సంప్రదించామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో వంద సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజయ్య చెప్పారు.