
న్యూఢిల్లీ: ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూశారు. 94 ఏళ్ల సుఖ్ రామ్ మే 4న మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మే 7న న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈమేరకు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడిస్తూ.. సుఖ్ రామ్‌తో కలిసి తన చిన్ననాటి ఫోటోను కూడా శర్మ పోస్ట్ చేశాడు. అయితే, ఆయన ఎప్పుడు తుది శ్వాస విడిచారు అని పోస్ట్‌లో పేర్కొనలేదు. మండి లోక్‌సభ స్థానం నుంచి సుఖ్‌రామ్ మూడు సార్లు, విధాన సభ నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 1993-1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment