
'తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలి'
తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలనికోరుతూ మంగళవారం రాత్రి ఎంపీలతో కలిసి తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు.
కరీంనగర్(సుల్తానాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలనికోరుతూ మంగళవారం రాత్రి ఎంపీలతో కలిసి తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు. ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి వైద్య రంగంలో ప్రాధాన్యత ఇచ్చిన వారవుతారని అన్నారు. కేంద్ర మంత్రి తమ వినతిపై సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా ఉన్నారు.