Harshavardhan
-
కర్నాటకలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మృతి
-
చెరువులో పడి ముగ్గురు పిల్లల మృతి
మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో విషాదంశామీర్‌పేట్: ఆటలో భాగంగా మట్టి గణపతిని చేసిన ముగ్గురు పిల్లలు.. ఆ ప్రతిమను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూ చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తుల గాలానికి ఓ మృతదేహం చిక్కడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న బాలేకర్ మణి హర్ష (14), సలేంద్రి హర్షవర్ధన్‌న్(13), ఈరబోయిన మనోజ్ (10) స్నేహితులు. దసరా సెలవుల నేపథ్యంలో వీరు శుక్రవారం మట్టి గణపయ్యను చేసి పూజలు చేస్తూ ఆడుకున్నారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. చెరువు వద్ద కొందరు వ్యక్తులు చేపల కోసం నీటిలో గాలాలు వేశారు. ఓ వ్యక్తి గాలానికి ఏదో తగిలినట్లు అనిపించడంతో పైకి లాగగా.. మనోజ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
రాజకీయాలకు గుడ్‌బై బీజేపీ ఎంపీ హర్షవర్ధన్
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలిజాబితాను బీజేపీ ప్రకటించిన మరుసటి రోజే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్.హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పరిధిలోని చాంద్‌నీచౌక్ స్థానం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. శనివారం బీజేపీ విడుదలచేసిన తొలి జాబితాలో ఈయన పేరు లేదు. అందుకే ఈయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘ 50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లో ఎంబీబీఎస్‌లో చేరా. పేదలకు సేవచేశా. 30 ఏళ్ల పైబడిన రాజకీయ జీవితంలో ఐదు సార్లు శాసనసభ, రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచా. మళ్లీ ఇన్నాళ్లకు నా మూలాల్లోకి వెళ్లిపోతా’’ అన్నారు. ఢిల్లీ పరిధిలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు పర్వేశ్ శర్మ, రమేశ్ బిధూరి, మీనాక్షి లేఖీ, హర్‡్షవర్ధన్లను కాదని కొత్త వారికి బీజేపీ అవకాశమిస్తూ వారి పేర్లను తొలి అభ్యర్థుల జాబితాల చేర్చడం తెల్సిందే. నేను పోటీచేయలేను: పవన్ సింగ్ పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ ఎంపీ స్థానం నుంచి తనను బీజేపీ అభ్యరి్థగా నిలబెట్టినప్పటికీ తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ నేత పవన్ సింగ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ‘‘ నేనైతే పోటీ నుంచి వైదొలగుతున్నా. ఎందుకు పోటీ చేయట్లేను అనే కారణాలను వెల్లడించలేను’ అని భోజ్‌పురీ గాయకుడు, నటుడు అయిన పవన్ సింగ్ స్పష్టంచేశారు. అసన్సోల్లో బీజేపీ ముందే ఓడిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాచేసింది. -
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఎస్పీ (సైబర్ నేరాలు) హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, నకిలీ వార్తలు, కించపరిచే వీడియోలు, వ్యాఖ్యలకు బాధ్యులు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లోనూ ఎక్కడ ఉన్నా వారి ఆటకట్టిస్తామని చెప్పారు. ఈ నేరగాళ్లను పట్టుకొనేందుకు సీఐడీ విభాగం పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ద్వారా ఇంటర్ పోల్, ఇతర దేశాలతో కలసి పనిచేస్తోందని చెప్పారు. ఆయన శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు సైబర్ భద్రత కల్పించేందుకు సీఐడీ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధమైందన్నారు. ఆన్లైన్ ద్వారా వేధింపులు, ఆర్థిక మోసాలు, జూదం/బెట్టింగులు, సైబర్ బెదిరింపులు, ఉద్యోగ మోసాలు, వైవాహిక మోసాలు, రాన్సమ్వేర్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ రుణ మోసాలు మొదలైన అన్ని సైబర్ నేరాలను నిరోధించేందుకు సీఐడీ పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా ఫేక్ పోస్టులు, వార్తలు, ట్రోలింగ్లు, మార్ఫింగ్ వీడియోలు వంటివి పోస్టు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నిరోధించేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీపీపీఎస్) ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేకంగా 60 మంది సైబర్ వలంటీర్లను కూడా నియోగించామన్నారు. నకిలీ వార్తలు, దుష్ప్రచార పోస్టులను తొలగించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సైబర్ నేరాలు, దుష్ప్రచారాలపై రెండేళ్లలో ఏకంగా 23 వేల కేసులు నమోదు చేశామని, రూ.30 లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని, 3 వేల మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు. ఇటువంటి నేరాలను అరికట్టడంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు విభాగం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలో అక్టోబరు 7, 8 తేదీల్లో సైబర్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు హర్షవర్థన్ రాజు చెప్పారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు ♦ ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్: 1930 ♦ సైబర్ మోసాలను ఆన్లైన్లో నివేదించడానికి: cybercrime.gov.in ♦ సైబర్ నేరాలపై ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదుకు: cybercrimes& cid@ap.gov.in ♦ ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదుల కోసం సీఐడీ వెబ్సైట్: cid.appolice.gov.in ♦ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు: itcore&cid@ap.gov.in ♦ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు:@apcidcyber ♦ యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు: APCID4S4U -
రూపాయికే కార్పొరేట్ వైద్యం.. డాక్టర్ హర్షవర్ధన్ గొప్ప మనసు
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ అప్‌గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్‌కు ఆ ఆస్పత్రిలో సర్జన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి.. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్‌లో పెట్టిన సొంత క్లినిక్‌లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్‌లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు. మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్‌ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా. – వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్ ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్‌లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. -
చావు వస్తుందని తెలిసి.. ముందే ఏర్పాట్లు చేసుకుని..
ఖమ్మం: ఈరోజుల్లో మనిషికి చావు ఊహించనిది. కానీ, అతనికి మాత్రం ఊహించిందే. అందుకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసేశాడు. కన్నవాళ్లకు, తోడబుట్టిన వాడికి ధైర్యం చెప్పి.. ఓదారుస్తూ వచ్చాడు. విదేశాల్లో ఉంటున్న తాను.. ఎలాగైనా తన మృతదేహం స్వదేశానికి చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేశాడు. ఖమ్మం వాసులను కంటతడి పెట్టిన హర్షవర్థన్ గాథలోకి వెళ్తే.. ఖమ్మం సిటీలో ఉండే ఏపూరి రామారావు, ప్రమీలకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు హర్షవర్థన్ బీఫార్మసీ చేసి.. 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చాడు. కరోనాకి ముందు.. 2020 ఫిబ్రవరిలో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వస్తే భార్యను తీసుకెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో వైరస్-లాక్డౌన్ వచ్చి పడ్డాయి. ఇదిలా ఉండగానే.. 2020 అక్టోబర్‌లో జిమ్ చేస్తున్న హర్షవర్ధన్‌కి ఆరోగ్యం తేడాగా అనిపించింది. దగ్గు ఆయాసం అనిపించడంతో టెస్టులు చేయించుకోగా.. లంగ్స్ క్యాన్సర్ సోకిందని చెప్పారు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. వాళ్లు రోదించారు. ఇంటికి వచ్చేయమని కోరారు. కానీ, హర్ష వాళ్లకు ధైర్యం అందించాడు. అక్కడే ఉండి చికిత్స తీసుకుంటానని చెప్పాడు. క్యాన్సర్ సోకింది.. తనకు చావు తప్పదని అనుకున్నాడో ఏమో భార్యకు విడాకులిచ్చేశాడు. అంతేకాదు.. ఆమె జీవితంలో స్థిరపడేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో.. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న క్రమంలో.. నయమైందని డాక్టర్లు చెప్పడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 2022 సెప్టెంబర్‌లో ఇంటికి వచ్చి పదిరోజులు ఉన్నాడు. తిరిగి వెళ్లాక.. వ్యాధి తిరగబడింది. ఇక చావు తప్పదని అతనికి అర్థమైంది. విషయం అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. రోజూ వీడియో కాల్లో మాట్లాడడం చేశాడు. ఇంతలో తమ్ముడు అఖిల్‌కు వివాహం నిశ్చయ్యం అయ్యిందని సంతోషించాడు. మే నెలలో ముహూర్తం ఫిక్స్ చేయడంతో.. సంతోషించి ఆరోగ్యం సహకరిస్తే వస్తానంటూ చెప్పాడు కూడా. ఆ సమయంలో అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను చనిపోయాక.. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంపై అతను దృష్టిసారించారు. ఆ విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకున్నాడు. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ఓ లాయర్‌ను పెట్టుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. మార్చి 24వ తేదీన హర్షవర్ధన్ కన్నుమూశాడు. ఏప్రిల్ 5వ తేదీ(బుధవారం) అతని మృతదేహాం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు చేరింది. హర్ష మృతదేహాన్ని చూసి కుటుంబంతో పాటు స్థానికులంతా కన్నీరు మున్నీరుగా విలపించగా.. అంత్యక్రియలు ముగిశాయి. -
6 నుంచి జీపీఎఫ్ఐ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్థికాంశాల్లో అందరినీ భాగస్వాములను చేసే లక్ష్యంతో సిద్ధం చేసిన యూపీఐ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని జీ20 సదస్సు చీఫ్ కో–ఆర్డినేటర్ హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. జీ20 సదస్సు వేదికగా యూపీఐ సహా ఇతర అంశాల్లో భారత్ అనుభవాలు, మేలైన పద్ధతులు, వనరులను అందించేందుకు సిద్ధమని, దీనివల్ల పేద దేశాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్‌నర్‌షి ప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్ (జీపీఎఫ్ఐ) రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. దానికంటే ముందు శని, ఆదివారాల్లో ‘నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్’సమావేశాలు నిర్వహించనున్నారు. జీ20 దేశాలతోపాటు ఆసక్తిగల ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఇందులో పాల్గొననున్నాయి. ఆర్థిక అంశాల్లో అందరికీ చోటు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టనష్టాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అనుభవాలను పంచుకొనేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమావేశం ప్రాముఖ్యత ఇతర వివరాలను వెల్లడించారు. భారత్ తయారీ యూపీఐ పేమెంట్లపై సర్వత్రా ఆసక్తి... భూదక్షిణార్ధ గోళంలోని దేశాలతో ప్రధాని మోదీ ఇప్పటికే ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’పేరుతో చర్చలు జరిపారని, ప్రజోపయోగం కోసం డిజిటల్ టెక్నాలజీ వాడకం అవసరాన్ని నొక్కి చెప్పారని హర్షవర్ధన్‌శ్రింగ్లా తెలిపారు. గ్లోబల్ సౌత్ ప్రాథమ్యాలు, గళం భారత్ గళమవుతుందని ప్రధాని స్పష్టం చేసినట్లు వివరించారు. ఈ నెల 6న చెల్లింపులు, రెమిటెన్సెస్‌లలో డిజిటల్ ఇన్నొవేషన్స్ అంశంపై జీపీఎఫ్ఐ సదస్సును నిర్వహించనున్నామని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల అమలుకు పెట్టే పెట్టుబడుల వల్ల ఉత్పాదకత పెంపుతోపాటు ఖర్చులు కూడా తగ్గుతాయని అభివృద్ధి చెందుతున్న దేశాలు గుర్తించాయని, ఈ నేపథ్యంలోనే భారత్ సిద్ధం చేసిన యూపీఐ పేమెంట్ల పద్ధతులపై సర్వత్రా ఆసక్తి నెలకొందన్నారు. ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో నిర్వహించిన తొలి జీపీఎఫ్ఐ సమావేశాల ద్వారా కొన్ని సత్ఫలితాలను సాధించామని, ప్రపంచ దేశాల రుణభారాన్ని తగ్గించడం, స్వదేశాలకు చేసే చెల్లింపులకు అయ్యే ఖర్చులు తగ్గించడం, ఆయా దేశాలకు మేలు జరగాలంటే సక్రియాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాల అవసరం వంటి అంశాల్లో సభ్యుల మధ్య అంగీకారం కుదిరిందని శ్రింగ్లా తెలిపారు. కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్ 3700 కోట్ల డాలర్ల మొత్తాన్ని మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందజేయడంపై అంతర్జాతీయ సంస్థలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు చంచల్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు. -
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీల్లో పెద్ద చదువులు అభ్యసించాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(అగ్రవర్ణ పేదలు), దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేలా గత నెల 30 వరకు ప్రభుత్వం గడువిచ్చిందన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులొచ్చాయని, అయితే ఈ పథకంలో మరింత మందికి మేలు చేసే లక్ష్యంతో మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం రీయింబర్స్మెంట్, క్యూఎస్ ర్యాంకుల్లో 101 నుంచి 200లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేసేలా పథకాన్ని రూపొందించినట్టు వివరించారు. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులని చెప్పారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని హర్షవర్ధన్ వివరించారు. -
లోన్ యాప్‌ల మాయలో పడి మోసపోవద్దు
రాయచోటి : సెల్ఫోన్ల వినియోగంలో భాగంగా లోన్ యాప్‌ల మాయలో పడి ప్రజలు మోసపోవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు హితబోధ చేశారు. శనివారం ఈ మేరకు ఎస్పీ ఒక ప్రకటనల విడుదల చేసి సైబర్ నేరాలపై స్పందించారు. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు పొంది వారి వేధింపులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. సైబర్ మోసగాళ్లు సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, వ్యాపారస్తులు రుణయాప్‌లకు ఆకర్షితులవుతున్నారన్నారు. రుణాలు తీసుకున్నాకా అధిక వడ్డీ, అనేక అసంబంధమైన చార్జీల పేరిట యాప్ నిర్వాహకులు రుణగ్రహీతల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు రుణాలు తిరిగి చెల్లించే విషయంలో యాప్ నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, రుణగ్రహీతల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారి ఫోన్ల నుండి సేకరించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలమైన ఫొటోలు, వీడియోలను వారి ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లకు పంపించి వేధిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వివరించారు. ప్రజలు కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలని సూచించారు. నకిలీ యాప్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రుణాల విషయంలో వేధింపులకు గురిచేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. -
మామా మాశ్చీంద్ర: సుధీర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా?
యంగ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు బర్త్‌డే నేడు (మే 11). ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మామా మశ్చీంద్ర అన్న టైటిల్‌తో పాటు సుధీర్ లుక్‌ను సైతం విడుదల చేశారు. ఇందులో హీరో స్టేజీపై సాంగ్ పాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా పని చేస్తుండగా పీజీ వింద సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సుధీర్‌బాబు కృతిశెట్టితో కలసి నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' త్వరలోనే విడుదల కానుంది. Fun & action have no language barrier 🥳 #MaamaMascheendra!! Also in Hindi this time! 😃 Let's go! 🕺🏻@HARSHAzoomout @chaitanmusic @pgvinda #NarayanDasNarang @puskurrammohan @SVCLLP pic.twitter.com/RIil9JOJYi — Sudheer Babu (@isudheerbabu) May 11, 2022 చదవండి: నా విషయం పక్కనపెట్టు, నీ ముఖం సంగతేంటి?: ట్రోలింగ్‌కు నటి కౌంటర్ ప్రాణాల కోసం పోరాడుతున్న మాజీ మిస్టర్ యూనివర్స్.. ఆవేదనలో ఫ్యాన్స్ -
యాక్షన్ ఎంటర్టైనర్
సుధీర్ బాబు హీరోగా కొత్త సినిమా షురూ అయింది. రచయిత, నటుడు హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. సుధీర్ బాబు సరికొత్తగా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
‘కారుణ్యం’ చూపలేక.. మరణమే పలకరించింది
కన్నబిడ్డ నాలుగేళ్లుగా అనారోగ్యంతో అల్లాడుతుంటే.. ఆ తల్లి తట్టుకోలేకపోయింది. శక్తిమేర వైద్యం చేయించినా.. కుదుటపడని కొడుకుని చూడలేక తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇక బిడ్డను బతికించుకోలేననుకున్న ఆ తల్లి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరేందుకు ప్రయత్నించింది. కోర్టు లేదని తెలిసి కొడుకును ఇంటికి తీసుకెళుతుండగా.. మార్గంమధ్యలోనే కన్నుమూశాడు ఆ తనయుడు. అందరికంట తడిపెట్టించిన ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగింది. పుంగనూరు: గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెకు చెందిన మణి చౌడేపల్లె మండలం బీర్జేపల్లెకు చెందిన అరుణను వివాహం చేసుకుని బీర్జేపల్లెలో స్థిరపడ్డాడు. బండలు కొట్టి జీవించే ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకొడుకు హర్షవర్ధన్ (9) నాలుగో తరగతి చదువుతున్నాడు. మరో కుమారుడు ఎబిలైజర్ వయసు ఏడాది. నాలుగేళ్ల కిందట ఒకరోజు హర్షవర్ధన్ బడిలో ఆడుకుంటూ పడిపోయాడు. నోటినుంచి, ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. అప్పటి నుంచి తరచుగా అలాగే అవుతుండేది. తల్లిదండ్రులు తిరుపతి, వేలూరు తదితర ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. గుర్రంకొండలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మి లక్షలు వెచ్చించినా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. హర్షవర్ధన్‌కు తరచు రక్తస్రావం అవుతోంది. కొడుక్కి వైద్యం చేయించలేకపోతున్నాననే వేదనతో మణి 15 రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో బిడ్డ పడుతున్న వేదన చూసి తట్టుకోలేకపోయిన అరుణ.. అతడికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరాలని నిర్ణయించుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కొడుకును తీసుకుని ఆటోలో మంగళవారం పుంగనూరు కోర్టుకు వచ్చింది. కోర్టుకు సెలవని తెలియడంతో వారంతా అదే ఆటోలో వెనుదిరిగారు. బీర్జేపల్లె వెళ్లకముందే ఆటోలోనే హర్షవర్ధన్ తుదిశ్వాస విడిచాడు. కళ్లముందే కన్నపేగు తెగిపోవడంతో ఆ తల్లి రోదన హృదయవిదారకంగా ఉంది. హర్షవర్ధన్ తాత మృతి గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెలో ఉంటున్న హర్షవర్దన్ తాత కె.రెడ్డెప్ప (70) అనారోగ్యంతో సోమవారం తిరుపతి ఆస్పత్రిలో మృతిచెందాడు. ముందురోజు తాత, మరుసటి రోజు మనుమడు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
85 రోజుల్లో 10,12,84,282 డోసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ చెప్పారు. దేశంలో కేవలం 85 రోజుల్లో 10 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ చేరిందన్నారు. 10 కోట్ల డోసులు ఇవ్వడానికి యూకేలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పట్టిందని గుర్తుచేశారు. ఇండియాలో ప్రస్తుతం రోజువారీగా సగటున 38,93,288 డోసులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకూ దేశంలో 10,12,84,282 డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. -
వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని అది సైంటిఫిక్ పద్ధతి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వైరస్ తన పంథాను మార్చుకుంటున్న కొద్దీ, దాన్ని బట్టి మన ప్రాధాన్యతలను మార్చుకోవాలని లోక్‌సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహా మేరకు ఆరోగ్య రంగం, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రంగం, వృద్ధులు, 45 సంవత్సరాలు దాటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవాలి.. కాంగ్రెస్ ఎంపీ రవీత్‌సింగ్ బిట్టు ప్రశ్నిస్తూ.. కోవిడ్ –19 వల్ల ప్రజల భయపడుతున్నారని, అది భవిష్యత్తులో వారికి హాని చేస్తుందా అని ప్రశ్నించారు.. దానికి హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. పోలియో, చికెన్ పాక్స్ వంటి వ్యాధులపై మనం విజయం సాధించామని, అందుకు కారణం వ్యాక్సినేషన్ అని చెప్పారు. త్వరలోనే భారత్ నుంచి మరికొన్ని కోవిడ్ వ్యాక్సిన్లు వస్తాయని వాటితో పాటే ప్రీ–ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. అందరికీ రక్తం అందింది.. తలసేమియాపై పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానమిస్తూ.. తలసేమియా రోగులకు తరచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అన్నారు. కరోనాతో దేశం అతలాకుతలమైన సమయంలో కూడా ఏ ఒక్క తలసేమియా రోగికి రక్తం అందని పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే.. ఏడాదిలోనే 75 వైద్య కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 30 వేల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇదంతా కోవిడ్ విజృంభించి సమయంలోనే జరిగిందన్నారు. ఆరేళ్లలో 24 వేల కొత్త పీజీ మెడికల్ సీట్లను సృష్టించినట్లు వెల్లడించారు. 39,726 కొత్త కరోనా కేసులు.. దేశంలో గత 24 గంటల్లో 39,726 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 154 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,370కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,10,83,679కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,71,282గా ఉంది. -
‘కోవిడ్’పై అమిత్ షా సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్ర వైద్య శాఖాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భళ్లాలు పాల్గొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడంపై ఆయన పలు విషయాలు ఆరా తీశారు. కోవిడ్‌ను అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాల్సిందిగా సూచించారు. ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి చేయదగ్గ సహాయాలను అందించాలని కోరినట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,417 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 19,94,947కు చేరుకుంది. -
కొరొనిల్’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ బాబా రూపొందించిన కరోనా మందు ‘కొరొనిల్’ ప్రమోషన్‌పై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ ఆర్గనైజేషన్- ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని మందుపై ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. రామ్‌దేవ్ బాబా మందుపై కేంద్ర మంత్రులు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. తప్పుడు, అశాస్త్రీయ మందును ప్రజల ముందుకు ఎలా తీసుకొస్తారని నిలదీసింది. కరోనాకు విరుగుడుగా పతాంజలి సంస్థ రూపొందించిన ‘కొరొనిల్’ మందును ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్ బాబా విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో తెలిపింది. అయితే దీనిపై సోమవారం భారత వైద్యుల సంఘం స్పందించింది. కొరొనిల్ మందును తాము ఎలాంటి పరీక్షలు చేయలేదని భారత వైద్య సంఘం (ఐఎంఏ) తెలిపింది. తాము పరీక్షించని మందుకు ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా ఎలా గుర్తించినట్లు రామ్‌దేవ్ బాబా చెప్పుకుంటారని ఐఎంఏ ప్రశ్నించింది. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ముందు పచ్చి అబద్ధాలు రామ్‌దేవ్ బాబా చెప్పారని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా చెప్పిన ప్రకటనపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పందించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించింది. కరోనాను ఏ సంప్రదాయక మందుకు తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని ఈ సందర్భంగా ఐఎంఏ స్పష్టం చేసింది. వైద్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఎలా సమర్ధిస్తారని మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించిన మందును ఒక వైద్యుడిగా ఉన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఎలా సమర్ధించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ తీసుకొచ్చిన ఆ మందుకు అంత సామర్థ్యం ఉంటే రూ.32వేల కోట్లు ఖర్చు చేసి ఎందుకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఐఎంఏ డిమాండ్ చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా గతేడాదే ఈ మందును తీసుకువచ్చారు. అయితే ఈ మందు కరోనా నివారణకు పనికి రాదని, కేవలం రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేసే మందుగా అమ్మాలని అప్పట్లో ఆయుశ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. The Indian Medical Association issues a strongly worded statement on the Patanjali shenanigans and calls it a shame on the behalf of the Health Minister. pic.twitter.com/0kAHBkycGI — Abhishek Baxi (@baxiabhishek) February 22, 2021 -
‘కోవిడ్ టీకాతో నపుంసకులవుతారు’
లక్నో: మరో 24 గంటల్లో కేంద్రం కరోనా వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అయితే దీనిపై ఇప్పటికే ప్రజల్లో పలు సందేహాలు నెలకొనగా.. రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్ బీజేపీది కాబట్టి.. తాను దాన్నితీసుకోనని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి అదే పార్టీ ఎమ్మెల్సీ మరొకరు చేరారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకులు అవుతారంటూ సదరు ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మా డౌట్లు తొలగించండి ) ఆ వివరాలు.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సే అశుతోష్ సిన్హా మాట్లాడుతూ.. ‘మేం కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్మం. మా నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకోనంటున్నారంటే.. వ్యాక్సిన్ విషయంలో ఆయనకు ఏవైనా వాస్తవాలు తెలిసి ఉంటాయని నా నమ్మకం. ఈ వ్యాక్సిన్ ప్రజలకు హానీ చేస్తుంది. కోవిడ్ టీకా తీసుకుంటే నపుంసకులవుతారు. మా నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ వద్దు అన్నాడంటే.. కేవలం మా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాక రాష్ట్ర ప్రజలందరు టీకాకు దూరంగా ఉండాలి’ అంటూ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో టీకా పట్ల భయాలు నెలకొనడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా రంగంలోకి దిగి, అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. (చదవండి: ‘అపోహలు ఉంటే పాకిస్తాన్లో వ్యాక్సిన్ వేయించుకోండి’ ) కరోనా టీకా వలన నపుంసకులు అవుతారంటూ వినిపిస్తున్న ఊహాగానాలను హర్షవర్ధన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘కరోనా టీకా కారణంగా మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారని శాస్త్రవేత్తలెవరూ చెప్పలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. నిరాధానమైన ఇటువంటి ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు హర్షవర్ధన్. అయితే కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత కొద్దిమందిలో స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో నొప్పి ఉంటుందని అన్నారు. ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందన్నారు. కొద్ది సేపటిలోనే ఇటువంటి సమస్యలు మాయయవుతాయని స్పష్టం చేశారు. ఇక రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. After being administered #COVID19Vaccine, some individuals may have side effects like mild fever, pain at injection site & bodyache. This is similar to the side effects that occur post some other vaccines. These are expected to go away on their own after some time. #StaySafe pic.twitter.com/VCnJzXu70S — Dr Harsh Vardhan (@drharshvardhan) January 14, 2021 -
వ్యాక్సిన్ పంపుతున్నాం.. ఏర్పాట్లు చేసుకోండి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్‌కు మొదటి విడత టీకాను త్వరలో పంపుతామని కేంద్రం తెలిపింది. టీకాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తమానం పంపింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖలో రిప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ ప్రదీప్ హల్డేర్ ఈ నెల 5న రాసిన లేఖలో రాష్ట్రాలను కోరారు. రిజిస్టరైన లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ వ్యాక్సిన్‌ను జిల్లాలకు పంపిణీ చేయాలని తెలిపారు. దీనికి సంబంధించిన సూచనలను త్వరలోనే పంపుతామని పేర్కొన్నారు. నేడు మరో విడత డ్రైరన్: దేశవ్యాప్తంగా యూపీ, హరియాణా మినహా నేడు చేపట్టే డ్రైరన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, స్వయంగా పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులను కోరారు. దేశ వ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 736 జిల్లాల్లో ఈ బృహత్ కార్యక్రమం జరుగుతుందని ఆయన వెల్లడించారు. -
‘క్లినికల్’ తరహాలో కోవాగ్జిన్ టీకా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన తొలి టీకా కోవాగ్జిన్ వినియోగానికి ఇచ్చిన అనుమతులు కేవలం క్లినికల్ ట్రయల్ మోడ్‌లో వినియోగానికేనని ప్రభుత్వం తెలిపింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌కు ఇచ్చిన అనుమతుల్లో తేడాఉందని, కోవాగ్జిన్‌ను కేవలం క్లినికల్ ట్రయిల్ మోడ్‌లో మాత్రమే వినియోగిస్తామని కేంద్రమంత్రి హర్షవర్థన్ వివరణ ఇచ్చారు. అంటే కోవాగ్జిన్ ఇచ్చిన వారిని ట్రయిల్స్‌లో చేసినట్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతోపాటు కోవాగ్జిన్‌ను ఫేజ్ 3 ట్రయిల్స్‌లో 12 సంవత్సరాలు నిండినవారికి ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించింది. గత ట్రయిల్స్‌లో ఈ టీకాను 12 ఏళ్ల పైబడినవారికి ఇచ్చిన సందర్భంలో సురక్షితమనే తేలింది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌కు ఆదివారం అత్యవసర వినియోగానుమతులు లభించాయి. రెండు టీకాలను రెండు డోసుల్లో ఇస్తారని డీసీజీఐ అనుమతి పత్రంలో పేర్కొంది. ఒకపక్క ఫేజ్ 3 ట్రయిల్స్ కొనసాగిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాలను వాడేందుకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 3 కోట్ల మందికి టీకా అందిస్తారు. రెండు టీకాలు అత్యవసర అనుమతికి తయారుగా ఉన్నా, ఇంకా ఫేజ్ 3 ట్రయిల్స్‌ను పూర్తి చేసుకోలేదు. -
కోవిడ్ అత్యవసర నిధి నుంచి రూ.981 కోట్లు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్–19 పరీక్షలను, కోవిడ్ కేర్ సెంటర్లను, ఐసీయూ, నాన్ ఐసీయూ పడకలను పెంచడం, తాత్కాలిక సిబ్బంది నియామకాల్ని చేపట్టడం కారణంగా రాష్ట్రంపై ఆర్థిక భారం ఎక్కువగా ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై బుగ్గన చర్చించారు. అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాటాడుతూ.. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్ అత్యవసర నిధి నుంచి రాష్ట్రానికి రూ.981 కోట్లు సాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించాలని కోరామని బుగ్గన వివరించారు. 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చేసిన విజ్ఞప్తిని కేంద్ర మంత్రి పరిశీలిస్తామని హామీ ఇచి్చనట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. -
అందుకు చైనా వైఖరే కారణం: శ్రింగ్లా
న్యూఢిల్లీ: భారత్‌తో అగ్రరాజ్యానికి ఉన్న సంబంధాలను అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం పెద్దగా ప్రభావితం చేయదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్లలో ఎవరు గెలిచినా ద్వైపాక్షిక బంధం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ట్రంప్‌తో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ ప్రత్యేక అనుబంధం ఉందని, పార్టీలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం దౌత్య విధానాలు రూపుదిద్దుకుంటాయని చెప్పుకొచ్చారు. మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతు చేస్తూ జో బైడెన్ దూసుకుపోతున్నారు. అయితే పెద్దరాష్ట్రాల్లో ఆధిక్యం కనబరుస్తున్న ట్రంప్.. విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన హర్షవర్ధన్ శ్రింగ్లా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాతో మన బంధం పరస్పర మద్దతు, సహాయసహకారాలపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్(అమెరికా చట్టసభలు)లోనూ, ప్రజా వ్యవహరాలను పరిశీలించినట్లయితే ఈ విషయం అర్థమవుతుంది. కాలక్రమంలో ఎన్నెన్నో పరీక్షలకు తట్టుకుని ద్వైపాక్షిక బంధం నేటికీ కొనసాగుతోంది. సమగ్రమైన, బహుముఖ దౌత్య విధానాలతో ముందుకు సాగుతున్నాం. విలువలు, విధానాల్లో మాత్రమే కాదు వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ పరస్పర అవగాహనతో సంబంధాలను మెరుగుపరచుకుంటున్నాం’’అని ఆయన చెప్పుకొచ్చారు. (చదవండి: హోరాహోరీగా కొనసాగుతోన్న పోటీ) చైనా దుందుడుకు వైఖరి వల్లే ఇక సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల గురించి విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘అక్కడి పరిస్థితులు నిజంగానే కాస్త ఉద్రిక్తంగా ఉన్నాయి. అవి ఇరు దేశాల మధ్య ఉన్న బంధంపై ప్రభావం చూపుతాయి. అయితే దీనికంతటికి చైనా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, యథాతథ స్థితిని మార్చేందుకు చేసిన దుందుడుకు ప్రయత్నాలే కారణం’’ అని శ్రింగ్లా బదులిచ్చిరు. అదే విధంగా చైనా, భారత భూభాగాన్ని ఆక్రమించిందా అన్న ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘‘సరిహద్దుల్లో బలగాలు ప్రస్తుత స్థానాల నుంచి ముందుకు రావడం వంటి కవ్వింపు చర్యలు దౌత్య సంబంధాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. చైనా ఆర్మీ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నాం. ప్రాంతీయ సమగ్రత, మన సార్వభౌమత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం’’అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే లక్ష్యంతో ఏర్పాటైన క్వాడ్ దేశాల(క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్- భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) విధానం గురించి మాట్లాడుతూ.. పరస్పరం సహకరించుకుంటూ, స్వేచ్చాయుత వాతావరణం, సుస్థిరత నెలకొల్పడమే ధ్యేయంగా నాలుగు దేశాలు ముందుకు సాగుతున్నట్లు శ్రింగ్లా వెల్లడించారు.(చదవండి: అవన్నీ అబద్ధాలు.. కట్టుకథలు: చైనా) -
ఢిల్లీలో కట్టడిపై మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ ఆవలంబించిన విధానాలనే జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ అమలు చేసి, మహమ్మారిని అదుపు చేయాలని సూచించారు. అదేవిధంగా, కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్న రాష్ట్రాలు, ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కంటైన్మెంట్ అమలు తీరుపై సమీక్ష జరిపి, సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలని కూడా ఆయన కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్–19 పరిస్థితి, ఆయా రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధాని మోదీ శనివారం సమీక్ష జరిపారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వైరస్‌ను వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీకి తావులేదన్నారు. ఈ జాగ్రత్తలపై యంత్రాంగాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా బాధితులను ఇంటివద్దే పర్యవేక్షించి, వైద్యం అందించే ‘ధన్వంతరి రథ్’ విధానం ఫలితాలను ఇచ్చిందనీ, దీనిని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు. -
కొత్త కేసులు 24,879
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజులో కొత్తగా 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 487 మంది కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 7,67,296కు, మరణాలు 21,129కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2,69,789 కాగా, 4,76,377 మంది బాధితులు చికత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 62.08 శాతానికి చేరుకుంది. సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు భారత్‌లో కరోనా వైరస్ ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 49 జిల్లాల్లోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు కరోనా కేసులు, మరణాలను పరిశీలిస్తే భారత్‌లోనే అతి తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనపై రాజేశ్ భూషణ్ స్పందించారు. ప్రజలు భౌతికదూరం కనీసం రెండు మీటర్ల దూరం పాటిస్తే గాలి ద్వారా వైరస్ సోకే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా నిత్యం 2.6 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. 90 శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే... దేశంలో 90 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) గురువారం ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలియజేసింది. కేంద్ర మంత్రుల బృందం సమావేశం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో గురువారం జరిగింది. దేశంలో కరోనా బాధితుల కోసం 3,914 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పారు. -
మహమ్మారిపై పోరు బాట
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో ఆదివారం సమావేశమై కరోనాని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, మృతదేహాల నిర్వహణ వంటి అంశాల్లో సుప్రీం కూడా మొట్టికాయలు వేయడంతో పరిస్థితుల్ని సమీక్షించి కరోనాను ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ సమావేశం ఫలప్రదమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రెండు ప్రభుత్వాలు కలిసి కోవిడ్‌ను ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటానికి సంబంధించి అమిత్ షా పలు ట్వీట్లు చేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహకరిస్తుందన్నారు. నేడు అఖిలపక్ష భేటీ ఢిల్లీలో వైరస్ వ్యాప్తిని సమీక్షించడానికి సోమవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఇదీ కార్యాచరణ పరీక్షలు మూడు రెట్లు ► దేశ రాజధానిలో కోవిడ్ పరీక్షలను ఇక మూడు రెట్లు పెంచనున్నారు. వచ్చే రెండు రోజుల్లో రెట్టింపు పరీక్షలు, ఆరు రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించనున్నారు. కొద్ది రోజుల తర్వాత నగరంలో కంటైన్మెంట్ జోన్లలో ప్రతీ పోలింగ్ స్టేషన్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటి సర్వేలు ► ఢిల్లీలో ప్రస్తుతం 241 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలో ఇంటింటికీ వెళ్లి కేంద్రం సర్వే నిర్వహిస్తుంది. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నాయా, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీస్తుంది. ఈ జోన్లలో నివసించే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 500 రైల్వే బోగీలే కరోనా పడకలు ► ఢిల్లీలో కోవిడ్ రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో కేంద్రం 500 రైల్వే కోచ్‌లను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చనుంది. ఈ కోచ్‌లలో 8 వేల మందికి చికిత్స అందించవచ్చు. వైరస్‌పై పోరాడడానికి అన్ని రకాల పరికరాలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 60% పడకల్లో వైద్యం ► ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా రోగులకు చికిత్స అందించనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 శాతం పడకల్ని కోవిడ్ రోగులకు కేటాయించనున్నారు. ఇక్కడ తక్కువ ధరకే వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం డాక్టర్ పాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎయిమ్స్ వైద్యులతో కమిటీ ► కోవిడ్ రోగులకు చికిత్సనందించే విధానంపై చిన్న చిన్న ఆస్పత్రుల్లో అవగాహన పెంచడానికి ఎయిమ్స్‌లో సీనియర్ వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వీరంతా అక్కడ వైద్యులకు టెలిఫోన్ ద్వారా సూచనలు అందిస్తారు. అంతేకాదు ఢిల్లీలో కోవిడ్ సన్నద్ధతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ నగరంలో వైద్య సదుపాయాల్ని పర్యవేక్షిస్తుంది. -
మూడేళ్ల చిన్నారికీ కోవిడ్
న్యూఢిల్లీ: కేరళలో మూడేళ్ల చిన్నారి సహా నలుగురికి తాజాగా కరోనా వైరస్ సోకడంతో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూలలో ఒక్కో కేసు నమోదు కాగా.. ఇటీవల ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మూడేళ్ల చిన్నారి వ్యాధి బారిన పడినట్లు ఆర్యోగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికీ కోవిడ్ సోకింది. జమ్మూలో కోవిడ్ బారిన పడ్డ వ్యక్తి ఇరాన్‌కు వెళ్లినట్లు తెలిసిందని, ఉత్తర ప్రదేశ్ బాధితుడు కరోనా వైరస్ సోకిన ఆరుగురితో ఆగ్రాలో సన్నిహితంగా గడిపారని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో వివరించింది. మరోవైపు రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లతో ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘వైరస్ నియంత్రణపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. 8255 విమానాల్లోని 8.74 లక్షల అంతర్జాతీయ ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. కేరళలోని కోచీలో వైరస్ బారిన పడ్డ మూడేళ్ల చిన్నారి రెండు రోజుల క్రితమే తల్లిదండ్రులతో కలిసి ఇటలీ నుంచి వచ్చింది. వైరస్ భయాందోళనలు ఎలా ఉన్నా కేరళలో మంగళవారం నాటి ఆటుక్కళ పొంగలలో లక్షలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం గమనార్హం. కర్ణాటకలో మొదటి కోవిడ్ కేసు వెలుగుచూసింది. అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన 40ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగికి కోవిడ్ సోకిందని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. మార్చి 1న భార్య, కుమార్తెతో న్యూయార్క్ నుంచి బెంగళూరుకు ఆ ఉద్యోగి వచ్చారు. -
భారత్‌లో కోవిడ్ కల్లోలం
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా వైరస్) భారత్‌లోనూ హడలు పుట్టిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటివరకు భారత్‌లో 29 కేసులు నమోదయ్యాయి. వారిలో 16 మంది ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టులే. ఇప్పటివరకు 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేసేవారు. కోవిడ్ అంతగా లేని జాబితాలో ఆస్ట్రియా ఉండడంతో ఆ దేశం నుంచి వచ్చిన ఢిల్లీ వాసికి విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయలేదు. ఆ తర్వాత అతనికి వైరస్ సోకడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇకపై అన్ని విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మరోవైపు ఈ వైరస్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది రంగు పడదు కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని∙మోదీ బుధవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా ఉంటున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచనల మేరకు తాను ఈసారి హోలీ మిలాన్ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నానని ట్విటర్లో మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలందరూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, హోలీని ఈ సారి జరుపుకోవద్దని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు కూడా హోలీ ఉత్సవాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సారి హోలి వేడుకలు రద్దు చేస్తున్నట్టుగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఒకే కుటుంబంలో ఏడుగురికి ఇటీవల ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ సోకినట్లు తాజాగా వైద్య పరీక్షల్లో తేలిన విషయం తెలిసిందే. ఆగ్రాలో ఉన్న ఆయన కుటుంబీకులు ఆరుగురికి కూడా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. 16 మంది ఇటలీ టూరిస్టులలో 14 మందికి ఢిల్లీలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటలీ పర్యాటకుల్లో రాజస్థాన్‌కు వెళ్లిన భార్యాభర్తలిద్దరికీ కోవిడ్ సోకడంతో వారికి జైపూర్‌లో ఎస్ఎంహెచ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. గుర్గావ్లో పేటీఎం ఉద్యోగికి పాజిటివ్‌గా వచ్చింది. ఇతను ఇటలీకి వెళ్లొచ్చినట్లు తెలిసింది. చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అమెరికాలో 9 మంది మృతి ♦ దేశంలో 21 ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ సెంటర్లు ♦ 12 ప్రధాన రేవు పట్టణాలు , 65 చిన్న రేవుల్లోనూ స్క్రీనింగ్ సదుపాయాలు ♦ రెండు నెలల్లో 6 లక్షల మంది వరకు స్క్రీనింగ్ ♦ నేపాల్ సరిహద్దుల నుంచి వచ్చిన వారిలో 10 లక్షల మందికి స్క్రీనింగ్ ♦ వైద్యుల పర్యవేక్షణలో 27 వేల మంది ♦ ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ నుంచి పర్యాటకులకు అనుమతి నో ♦ చైనా, ఇరాన్, ద.కొరియా, ఇటలీలకు అత్యవసరమైనా వెళ్లవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి ♦ కోవిడ్ ప్రబలుతున్న ఇతర దేశాలకు ప్రయాణాలు మానుకుంటే మంచిదని సూచన ♦ అమెరికాలో తొమ్మిది మంది మరణించారు. 126 కేసులు నమోదయ్యాయి. ♦ ఇటలీలో వైరస్ మృతులసంఖ్య 100 దాటింది. ♦ ఇరాన్లో 92 మంది మరణిస్తే, 2,922 కేసులు నమోదయ్యాయి. దేశ ప్రజాప్రతినిధుల్లో 8% మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. ♦ ఇరాక్‌లో తొలి మరణం నమోదైంది. ♦ ఉమ్రా యాత్రను రద్దు చేసిన సౌదీ అరేబియా ♦ ఇతర దేశాల్లో పెరుగుతుండగా, చైనాలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ కొరియాలో కొత్తగా 516 కేసులు నమోదైతే, చైనాలో 130 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ♦ చైనాలో ఈ రోజు 38 మంది మరణించగా, దేశంలో మృతుల సంఖ్య 2981కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 3,123 దాటింది. -
చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా మరో 24 మంది మృతిచెందినట్లు చైనా ప్రకటించింది. దీంతో మొత్తం చైనాలో కరోనా మృతుల సంఖ్య 131కి చేరింది. 4,515 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. థాయ్‌లాండ్‌లో 7, జపాన్‌లో 3, దక్షిణ కొరియాలో 3, అమెరికాలో 3, వియత్నాంలో 2, సింగపూర్‌లో4, మలేషియాలో 3, ఫ్రాన్స్‌లో 3, ఆస్ట్రేలియాలో 4, శ్రీలంక, నేపాల్‌లో చెరో కేసు నమోదైనట్టు అధికారులు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్ వెల్లడించారు. భారత్‌లో 20 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ఇప్పటికే 7 విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని 20 విమానాశ్రయాలకు విస్తరించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. మనవారిని వెనక్కి రప్పిస్తున్నాం.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు చెప్పారు. అయితే అందుకు మరికొద్ది రోజులు పట్టొచ్చనీ, వారిని వెనక్కి తీసుకొచ్చి తీరుతామనీ, స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఒక్క భారతీయ విద్యార్థికి కూడా వైరస్ సోకలేదని చెప్పారు. భారత్‌కి తీసుకెళ్ళండి చైనాలో చిక్కుకుపోయిన గుజరాత్‌కి చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు తాము భారత్ తిరిగివచ్చేందుకు యత్నిస్తున్నారు. అందులో కొందరు బీజింగ్ నుంచి బయలుదేరి బుధవారానికి దేశానికి చేరుకుంటారని గుజరాత్ సీఎం రూపానీ చెప్పారు. సురక్షితంగా దేశానికి చేర్చేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. -
సెనేట్ కొట్టేయాలి అంతే..
వాషింగ్టన్: తనపై మోపిన అభిశంసన తీర్మానాన్ని సెనేట్ కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అభిశంసనకు గురవుతున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించగా.. త్వరలోనే దీనిపై విచారణ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆ తరువాత విచారణ విషయంలో కాంగ్రెస్‌ను అడ్డుకున్నారని ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి. అయితే అభిశంసన విచారణ సాక్షులకు తనదైన ఆలోచనలు పంచిన ట్రంప్ ఆదివారం మాత్రం విచారణ జరగడానికే వీల్లేదన్నారు. టంప్‌ను కలిసిన హర్షవర్ధన్ ష్రింగ్లా వాషింగ్టన్: అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా (57), అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. పదవీ కాలం ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లనున్న భారత రాయబారిని అమెరికా అధ్యక్షుడు కలవడం ఇదే మొదటిసారి. 2019 జనవరి 9 నుంచి అమెరికాలో భారత రాయబారిగా పని చేస్తున్న ష్రింగ్లా తన పదవీకాలాన్ని ముగించుకొని భారత్‌కు తిరిగి రానున్నారు. భారత్‌లో ఈ నెల 29న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్‌ను కలిసి తనకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘గాంధేయవాద విస్తరణకు ప్రవాసుల కృషి అమోఘం’
టెక్సాక్ : శాంతి, ప్రేమ, అహింస వంటి ఆశయాల సమాహారమైన గాంధేయవాదానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం కల్పించడంలో విశేష కృషి చేస్తున్న ప్రవాస భారతీయుల చొరవ, కృషి అభినందనీయమని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కొనియాడారు. డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్‌లో గల మహాత్మా గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాయబారి ష్రింగ్లా మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించి ప్రసంగించారు. తాను దక్షిణాఫ్రికా దేశంలోని డర్బన్ నగరంలో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందించినప్పుడు గాంధీజి గత చరిత్రను అతి సమీపంగా సున్నితంగా స్పృశించానని, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారిని అహింసాయుత పోరాటాల వైపు ప్రేరేపించడం గాంధీయిజానికి పాశ్చాత్య దేశాలు పట్టిన గొడుగు అని ఆయన పేర్కొన్నారు. 150వ జయంతి ఉత్సవాలను అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో సైతం నిర్వహించామని అన్నారు. భారత్-అమెరికా మధ్య జీవ వారధులుగా ప్రవాస భారతీయులు వర్థిల్లుతున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యలు నిజం చేసేలా గాంధేయవాదానికి కూడా ప్రవాసులు బ్రహ్మరథం పడుతున్నారని వారందరికీ తన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ గాంధీ స్మారకస్థలిని సందర్శించిన ప్రప్రథమ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కావడం ఆనందంగా ఉందని, మహాత్మా గాంధీ స్మారకస్థలి ఏర్పాటులో జరిగిన కృషి, స్మారకస్థలి విశేషాలు, స్థానిక పాఠశాల విద్యార్థులకు అది ఎలా ఉపయుక్తమవుతుందనే విషయాలను రాయబారికి వివరించారు. గాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల సభను ప్రారంభించగా, అక్రం సయాద్ తుది పల్కులు పల్కారు. అనంతరం మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా ను ఘనంగా శాలువతో సత్కరించి, స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గాంధీజి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేక అతిధిగా పాల్గొని బాపూజీ కి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హ్యూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ డా. అనుపమ్ రే, కాన్సులేట్ అధికారులు సురేంద్ర అదానా, అశోక్, గాంధీ మెమోరియల్ డైరెక్టర్స్ రావు కల్వల, జాన్ హామేండ్, కమల్ కౌశల్, అక్రం సయాద్, షబ్నం మాడ్గిల్, జాక్ గద్వాని, స్వాతి షా, శాంటే చారి, శ్రీకాంత్ పోలవరపు, మురళీ వెన్నం తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాల కింద దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలను ఓ ప్రజా ఉద్యమంగా ఏర్పాటు చేస్తాం. ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కింద పది కోట్ల మంది పేదలకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెస్తాం’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ జూన్ 3న తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. అది సాధ్యం కావాలంటే ప్రతి పదివేల మంది జనాభాకు 20 మంది డాక్టర్ల చొప్పున మొత్తం 44.5 శాతం మంది వైద్య సిబ్బంది ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదివేల మంది జనాభాకు పది మంది డాక్టర్ల చొప్పున మొత్తం 22.8 శాతం వైద్య సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం దేశంలో 22.8 శాతం వైద్య సిబ్బంది కూడా లేరు. ‘బీఎంజె ఓపెన్’ మెడికల్ జర్నల్ లెక్కల వరకు నేడు దేశంలో ప్రతి పదివేల మంది జనాభాకు 5.9 శాతం డాక్టర్లను కలుపుకొని మొత్తం వైద్య సిబ్బంది (నర్సులు, ఆయాలు, బాయ్‌లు) 20.6 శాతం మంది ఉన్నారు. 2011–12 ఆర్థిక సంవత్సరంలో ఈ వైద్య సిబ్బంది 19 శాతం ఉండగా, కార్పొరేట్ సంస్థలు పలు వైద్య, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికీ వైద్య సిబ్బంది సంఖ్య ఒకటిన్నర శాతం పెరిగింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్‌లు, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థల నుంచి సేకరించిన వివరాల ద్వారా ఈ లెక్కలు తెలిశాయి. దాదాపు 52 దేశాల్లో వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని తెలియడంతో 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి పదివేల మందికి కనీసం 22.8 శాతం వైద్య సిబ్బంది ఉండాలంటూ మార్గదర్శకాలను సూచించింది. 2016లో వాటిని సవరించింది. ఈ దేశంలోనైనా వైద్య సేవలను విశ్వవ్యాప్తం చేయాలన్నా వైద్య సిబ్బంది 44.5 శాతం ఉండాలని నిర్ధారించింది. దీన్ని సాధించాలంటే దేశ బడ్జెట్‌ను మొత్తం ఒక్క వైద్య రంగానికే కేటాయించాల్సి రావచ్చు. అది అసాధ్యం కనుక, కేంద్ర ఆరోగ్య మంత్రి హామీని అమలు చేయడం కూడా అసాధ్యమే. -
8 నిమిషాలు.. 80 వేల కణాలు
సాక్షి, హైదరాబాద్: అత్యంత చౌకగా ఇకనుంచి అరుదైన జన్యువ్యాధులను అతివేగంగా గుర్తించవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, వైద్య శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ సీసీఎంబీలో రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక జన్యుక్రమ నమోదు యంత్రాన్ని కేంద్రమంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జన్యువైవిధ్యత అధికంగా ఉన్న మనదేశంలో అరుదైన జన్యువ్యాధుల గుర్తింపును వేగవంతం చేసేందుకు జన్యుక్రమ నమోదు యంత్రం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మరో మూడేళ్లలో సరికొత్త భారతాన్ని నిర్మించాలన్న ప్రధాని నరేంద్రమోదీ స్వప్నాన్ని సాకారం చేసేందుకు శాస్త్రవేత్తలందరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత సంస్థ ఆవరణలోనే నిర్మించే ఆడిటోరియానికి శంకుస్థాపన కూడా చేశారు. మూడోతరం ఎరువులు, క్రిమి, కీటకనాశినుల తయారీ కోసం ఐఐసీటీ ఏర్పాటు చేసిన కొత్త విభాగాన్ని గురించి ఆయన వివరిస్తూ.. ఎరువులు, క్రిమి, కీటకనాశినులను వీలైనంత తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐసీటీ విభాగం ఉపయోగపడుతుందన్నారు. సభలో మెడికల్ కమిషన్ బిల్లు కేంద్ర కేబినెట్ గత బుధవారం ఆమోదించిన జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా స్థానంలో ఏర్పాటు కానున్న కమిషన్ దేశంలో వైద్య విద్య, నీట్, నెక్స్ట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. ప్రైవేట్ వైద్య కళాశాల ల్లో 50% కన్వీనర్ కోటా ఫీజుల నియంత్రణ బాధ్యతలను కూడా కమిషనే చేపట్టనుంది. ఎంసీఐని ఇప్పటికే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తన ఆధీనంలోకి తీసుకుందని, కమిషన్ అందుబాటులోకి వస్తే వైద్య విద్యలో మార్పులు వస్తాయని మంత్రి చెప్పారు. చౌకగా వ్యాధుల నిర్ధారణ: డాక్టర్ తంగరాజ్ ఇల్యూమినా కంపెనీ తయారు చేసిన జన్యుక్రమ నమోదు యంత్రం సేవలను సామాన్యులూ ఉపయోగించుకోవచ్చని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ..జన్యుక్రమ నమోదుకు రూ.లక్ష వరకూ ఖర్చు కావొచ్చని..నిర్దిష్ట వ్యాధుల నిర్ధారణకు మాత్రం ఇంతకంటే తక్కువ ఖర్చు అవుతుందన్నారు. దేశ జనాభాలో మూడొంతుల మందికి మాత్రమే జన్యు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జన్యుక్రమ విశ్లేషణ ద్వారా ఈ వ్యాధులకు కారణాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఆయా వ్యాధుల నిర్ధారణ కొన్ని రూ.వందలతోనే పూర్తవుతుందన్నారు. వేగంగా గుర్తించవచ్చు: రాకేశ్ మిశ్రా సీసీఎంబీలో శనివారం ఏర్పాటైన జన్యుక్రమ నమోదు యంత్రం కేవలం 8 నిమిషాల్లోనే 80 వేల కణాల్లోని జన్యుక్రమాలను, బార్‌కోడింగ్ పద్ధతిలో వేర్వేరుగా గుర్తించగలదని సంస్థ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ పరికరాన్ని వైద్యులు, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. వ్యాధులు వాటి చికిత్సలకు సంబంధించిన పరిశోధనలు మొత్తం ప్రస్తుతం కాకేసియన్ జాతి జనాభా ఆధారంగా జరుగుతున్నాయని..భారతీయుల అవసరాలకు తగ్గ జన్యు సమాచారం సేకరించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని చెప్పారు. -
ఈబీసీలకు 4,800 ఎంబీబీఎస్ సీట్లు
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఈ సంవత్సరం 4,800 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినట్లు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. గడిచిన రెండేళ్లలో మెడికల్ కాలేజీల్లో 24,698 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. 2019–20లోనే 10,565 గ్రాడ్యుయేట్, 2,153 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. దేశంలో 75 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు, ఇన్స్టిట్యూట్లలో సీట్లు పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. ఎంబీబీఎస్ కోర్సుకు అనుమతి వచ్చిన మూడేళ్లలో పీజీ కోర్సును ప్రారంభించడం తప్పనిసరి చేశామన్నారు. జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర పథకం కింద కొత్త కాలేజీలు.. 2014 జనవరిలో ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం కింద 82 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 60 శాతం నిధులను కేంద్రం, 40 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే, 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు సమకూర్చుతాయి. మొదటి దశలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 జిల్లా ఆస్పత్రులను గుర్తించి ఆమోదించామని హర్షవర్ధన్ తెలిపారు. ఒక్కో వైద్య కళాశాల స్థాపనకు రూ.189 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తం వైద్య కళాశాలల కోసం రూ.7,507 కోట్లను ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేశామని చెప్పారు. రెండో దశలో 8రాష్ట్రాల్లోని 24 కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు. -
విడదీయరాని బంధం
ఈ ఫొటో సరిగ్గా చూశారా.. కుడివైపున సీఎం చంద్రబాబు అని అందరికీ తెలుసు.. పక్కన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబులు కూడా చాలా మందికి తెలుసు. అయితే ఇదే ఫొటోలో ఎడమ వైపున సరిగ్గా చంద్రబాబుకు ఎదురుగా పసుపు చొక్కా, కండువా వేసుకున్న వ్యక్తి ఎవరో పోల్చుకున్నారా.. ఆయనేనండి.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక వ్యక్తి, ప్రధాన నిందితుడు జె. శ్రీనివాసరావు పని చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ యజమాని హర్షవర్ధన్ చౌదరి. అయితే ఇప్పుడేంటీ అంటారా? గత అక్టోబర్ ఆఖరులో దేశ వ్యాప్తంగా ఆ ఘటన కలకలం రేపిన సమయంలో హర్షవర్ధన్ చౌదరి మీడియా ముందుకు వచ్చి చాలా బీరాలుపోయారు. అనవసరంగా నన్ను టీడీపీ వ్యక్తి అంటున్నారని వాపోయాడు. గతంలో గాజువాక టికెట్ ఆశించి ఆ పార్టీలో తిరిగిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. టీడీపీలో తాను లేనని పలుమార్లు స్పష్టం చేశారు. కానీ ఆదివారం విశాఖ నగరంలో జరిగిన చంద్రబాబు ప్రచార సభలో మాత్రం అన్నీ తానై వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలన మొదలు అన్నీ దగ్గరుండి నడిపించారు. చంద్రబాబు, హర్షవర్ధన్ చౌదరిల విడదీయరాని బంధానికి ఇంత కంటే ఏం సాక్ష్యం కావాలి? – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు మనదేశం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ప్రపంచదేశాలు అంగీకరించిన ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయడంలో అందరికంటే ముందు ఉందని కేంద్ర పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. విద్యుత్తు వాహనాల వినియోగం మొదలుకుని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తులు చేయడం వరకూ అనేక అంశాల్లో భారత్ తనకు తానుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను అధిగమించి ముందుకు వెళుతోందని అన్నారు. శనివారం హైదరాబాద్ ప్రగతినగర్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్)లో ఇంటర్నేషనల్ ట్రెయినింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రఫీ కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. మహాసముద్రాలపై అధ్యయనం చేసే వారి శిక్షణార్థం ఈ కేంద్రాన్ని ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు భారత్ నిర్మించింది. మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం మునుపెన్నడూ లేనంత వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. పరిశోధనా వ్యాసాల ప్రచురణలో ప్రపంచ సగటు వృద్ధి కేవలం నాలుగు శాతమే ఉండగా, భారత్‌లో అది 14 శాతం వరకూ ఉందని వివరించారు. అలాగే, ఇన్కాయిస్ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు దేశీయ జాలర్లు చేపలవేటకు సముద్రాలపై గడపాల్సిన సమయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. సముద్ర ప్రాంతంలో చేపల వేటకు ఉపయోగించే వాహనాలు, పడవల డీజిల్ 60 నుంచి 70 శాతం ఆదా అవుతోందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఇన్కాయిస్ సెర్చ్ అండ్ రెస్క్యూ టూల్ ద్వారా కోస్ట్‌గార్డు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు సులభతరమయ్యాయన్నారు. ఇన్‌కాయిస్‌తో 25 దేశాలకు లబ్ధి ఇన్‌కాయిస్‌లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా హిందూ మహాసముద్ర తీరంలోని 25 దేశాలు లబ్ధి పొందుతున్నాయని హర్షవర్ధన్ అన్నారు. వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయడంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉందని వివరించారు. 2004లో సునామీ భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇన్‌కాయిస్‌లో ఏర్పాటు చేసిన సునామీ హెచ్చరిక కేంద్రంతో నేడు సునామీని ముందస్తుగా గుర్తించే వీలు కలిగిందన్నారు. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ద్వారా వాతావరణ వివరాలను సకాలంలో అందజేసేందుకు కూడా ఇన్కాయిస్ పరిశోధనలు సాయపడ్డాయని చెప్పారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట నిర్మించిన ‘అటల్ అతిథిగృహ’ను కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర ఎర్త్ సైన్సెస్ 0శాఖ కార్యదర్శి రాజీవ్ నాయర్, ఇన్కాయిస్ డైరెక్టర్ డాక్టర్ సతీశ్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనివాసరావు రెండోసారి కస్టడీపై సిట్ దొంగాట!
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నిందితుడు శ్రీనివాసరావు నుంచి ఇంకా ఏ వాస్తవాలు తెలుసుకోవాలని భావిస్తున్నారో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అతని నుంచి సేకరించే సమాచారంతో ఇంకా విచారించాల్సిన సాక్షులు ఎవరో కూడా వెల్లడించలేదు. అతనికి కస్టడి పొడిగించాల్సిన అవసరం ఏమిటో కూడా పోలీసులు సరైన కారణాలు చూపలేకపోయారు. దర్యాప్తు అధికారులు సరైన కారణాలు చూపితేగానీ కస్టడీ పొడిగించలేం’ – విశాఖపట్నం న్యాయస్థానం ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కస్టడి పొడిగించేందుకు పోలీసులు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఆ ప్రాతిపదికనే అతని కస్టడీ పొడిగింపును న్యాయస్థానం తిరస్కరించింది. కష్టడీ పిటిషన్‌ను ఏ కారణాల వల్ల నిరాకరిస్తుందో ఆ అంశాలను కోర్టు తెలిపింది. సాధారణంగా కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి పోలీసులు మరలా పిటిషన్ వేయాలి. కానీ ఈ కేసులో పోలీసులు ఆపని చేయలేదు. దీన్నిబట్టి చూస్తే కావాలనే పోలీసులు కష్టడీకి తిరిగి పిటిషన్ వేయలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహేతుకమైన కారణాలను పోలీసులు వివరించి ఉంటే న్యాయస్థానం కస్టడీకి సమ్మతించి ఉండేదని న్యాయ నిపుణులు చెబుతుండటం గమనార్హం. అంటే శ్రీనివాసరావును మరోసారి కస్టడీలోకి తీసుకుని ఈ కేసులో అసలు కుట్ర కోణాన్నిఛేదించే ఉద్దేశం పోలీసులకు లేదని స్పష్టమవుతోంది. ఈ కుట్రలో తెరవెనుక పెద్దలు, అసలు కుట్రదారుల పాత్ర బయటకు రాకుండా పోలీసులే విచారణను పక్కదారి పట్టించారన్నది తేటతెల్లమవుతోంది. పూర్తిగా విచారించే ఉద్దేశంలేని సిట్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు. సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిని లోతుగా, నిశితంగా విచారిస్తే అసలు కుట్ర బట్టబయలవుతుంది. అందుకే ఇలాంటి కేసుల్లో నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించేందుకు పోలీసులు రెండుమూడుసార్లు కస్టడీ కోరతారు. కస్టడీ పొడిగించేందుకు అనుమతించాల్సిందిగా సహేతుకమైన కారణాలను కూడా కోర్టుకు వివరిస్తారు. కాని సిట్ పోలీసులు ఆ ప్రమాణాలను పాటించకుండా తూతూ మంత్రంగా కస్టడీ పొడిగింపు పిటిషన్ వేశారు. దాంతో కస్టడియే అవసరం లేదని న్యాయస్థానం భావించి ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటూ.... వై.ఎస్.జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయటపడకుండా సిట్ అధికారులు మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆడమన్నట్టు ఆడుతున్నారు. నిందితుని కస్టడీ పొడిగించి విచారిస్తే ఈ కుట్రలో సూత్రధారుల పాత్రలు బయటపడే అవకాశముందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే అసలు కస్టడి పొడిగింపే వద్దని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. తద్వారా ఈ కేసు విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించి, కొన్ని రోజులకు కేసును పూర్తిగా నీరుగార్చాలన్నది వారి వ్యూహం. అందుకే తూతూ మంత్రంగా పిటిషన్ వేసి చేతులు దులుపుకున్నారు. పోలీసులు అంత ఉదాసీనంగా ఉండటాన్ని న్యాయస్థానం ప్రస్తావిస్తూ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను తిరస్కరించింది. తమకు కావల్సింది కూడా అదేనని ప్రభుత్వ పెద్దలు ఇటు పోలీసులు మిన్నుకుండిపోయారు. కస్టడీ పిటిషన్లోనే కాదు ఈ కేసులో మొదటి నుంచీ కూడా సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే చేస్తున్నారు. హత్యాయత్నం కేసు రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాన్ని 120బి సెక్షన్‌ను పొందుపరచలేదు. నిందితుడు శ్రీనివాసరావుకు నిబంధనలకు విరుద్ధంగా విశాఖ విమానాశ్రయంలో ఆశ్రయం కల్పించిన టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిను పిలిపించి తూతూ మంత్రంగా మాట్లాడి పంపించేశారు. హత్యాయత్నానికి మార్గం సుగమం చేసిన అతన్ని అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించకపోవడం విస్మయపరుస్తోంది. ఇక నిందితుడు శ్రీనివాసరావును అయినా పూర్తిస్థాయిలో విచారిస్తారా... అంటే అదీ లేదు. ఆరురోజుల కస్టడి సమయంలో పోలీసులే హైడ్రామా నడిపారు. ప్రభుత్వ పెద్దలు కోరుకున్నట్లుగా శ్రీనివాసరావును మీడియాతో మాట్లాడించేందుకు అనారోగ్యం పేరిట అతన్ని కింగ్‌జార్జ్ ఆసుపత్రికి తీసుకువచ్చి డ్రామా రక్తికట్టించారు. ఆ తరువాత ఇక అతన్ని సరైన రీతిలో విచారింకుండానే కస్టడీ గడువు ముగిసింది. -
ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ క్లోజ్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కుట్రకు.. పాత్రధారి, నిందితుడు శ్రీనివాసరావుకు షెల్టర్ జోన్‌గా మారిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ఎయిర్పోర్ట్ శాఖ మూతపడింది. కానీ అదే సమయంలో సిరిపురం జంక్షన్లో వుడా(వీఎంఆర్డీఏ) స్థలంలో నడుస్తున్న ఇదే రెస్టారెంట్ శాఖను లక్షల ఖర్చుతో ఆధునికీకరించి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పునః ప్రారంభించారు. మామూలుగా అయితే ఇందులో చెప్పుకోవాల్సిన విశేషమేమీ లేదు గానీ.. సరిగ్గా జననేతపై హత్యాయత్నం జరిగిన తర్వాతే ఈ రెస్టారెంట్ ఆధునికత సంతరించుకోవడం.. పైగా లీజు గడువు రెండేళ్లలో ముగియనున్న తరుణంలో భారీ ఖర్చుతో రెనోవేట్ చేయడంపై స్థలం లీజుకిచ్చిన వుడా వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా యి. మరో 33 ఏళ్ల పాటు లీజు పొడిగించాలని ఫ్యూజన్ ఫుడ్స్ కోరినప్పటికీ 2020 నాటికి ఖాళీ చేయాల్సిందేనని వుడా గతంలోనే స్పష్టం చేసింది. అయినా లక్ష్యపెట్టికుండా.. అదీ యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. వై.ఎస్.జగన్‌పై హత్యాయత్న ఘటన తర్వాతే ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి సిరిపురం బ్రాంచ్‌లో మకాం వేసి రీమోడలింగ్‌పై దృష్టిపెట్టడంపై విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జననేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందన్న వాదనలు బలపడుతున్న సంగతి తెలి సిందే. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లోని తన రెస్టారెంట్లో ఉద్యోగం ఇప్పించడం మొదలు.. కత్తులు, మారణాయుధాలతో విచ్చలవిడిగా సంచరించినా పట్టించుకోకపోవడం.. ప్రత్యేకంగా వసతి కల్పించడం.. వైఎస్ జగన్‌పై ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం చేయడం.. తదితర పరిణామాలు చూ స్తే.. హర్షవర్ధన్ అండ లేకుండానే శ్రీనివాసరావు ఇంతకు తెగబడ్డాడా అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి. ఇక అక్టోబర్ 25న మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా పది నిమిషాల ముందే హర్షవర్ధన్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవడం, ఘటన దరిమిలా ‘శ్రీనివాసరావు చాలా మంచోడండీ, అమాయకుడండీ, ఏదో అభిమానంతో పిచ్చి పని చేసుంటాడు’.. అని వకాల్తా పుచ్చుకోవడంతో హర్షవర్ధన్ తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి దిగితే.. దాన్ని చిన్నఘటనగా చిత్రీకరిస్తూ.. సదరు ఉద్యోగినే వెనకేసుకొచ్చిన హర్షవర్ధన్‌ను ఇప్పటివరకు ప్ర శ్నించని పోలీసు అధికారుల నిర్వాకం చూస్తేనే కుట్రకోణంలో పెద్దల పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. ఇప్పుడు సద రు హర్షవర్ధన్ సిరిపురం జంక్షన్లో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను రూ.లక్షలు ఖర్చు చేసి అర్ధంతరంగా రీమోడలింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. లీజు గడువు ముంచుకొస్తున్నా.. ముస్తాబు వాస్తవానికి సిరిపురం జంక్షన్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లీజుపై ఇప్పటికే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) విమర్శలు మూటకట్టుకుంది. సిరిపురంలో ఉన్న హెచ్ఎస్బీసీకి నెలకు ఎకరాకు రూ. 1.40 లక్షల లీజు రెంటు చెల్లించేలా ఒప్పందం చేసుకున్న వీఎంఆర్డీఏ(అప్పటి వుడా).. దాని పక్కనే ఉన్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ స్థలానికి మాత్రం టీడీపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ఎకరానికి నెలకు రూ.42 వేల అద్దె మాత్రమే నిర్ణయించింది. 2003 మార్చిలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 10,842 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ. 13,500 నామమాత్రపు అద్దె చెల్లించేలా తొమ్మిదేళ్ల పాటు లీజుకు ఇచ్చారు. లీజు గడువు పెంచాలని హర్షవర్ధన్ 2011లో దరఖాస్తు చేసుకోగా, అప్పటికే వుడాకు రూ.11,27,823 బకాయి ఉన్నందున గడువు ముగిసిన వెంటనే ఖాళీ చెయ్యాలని అప్పటి వుడా నోటీసులు జారీ చేసింది. దీనిపై జిల్లా కోర్టులో ఫ్యుజన్ ఫుడ్స్ పిటిషన్ దాఖలు చేసినా.. దాన్ని కోర్టు కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరుగుతుండగానే బకాయిలు చెల్లించేసిందన్న సాకుతో.. అదే వుడా 2015 వరకూ రూ.24,369 ధరతో లీజు పొడిగించింది. ఆ తర్వాత 2015లో టీడీపీ పెద్దల సిఫార్సుతో మళ్లీ 2020 వరకు లీజు గడువు పొడిగిస్తూ వుడా నిర్ణయించింది. కానీ ఈసారి హర్షవర్ధన్ ఐదు, పదేళ్ళు కాదు.. ఏకంగా 33 ఏళ్ళ పాటు లీజు పొడిగించాలంటూ గతేడాది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2003 నుంచి అతి తక్కువ లీజుకు ఇవ్వడం వల్ల వీఎంఆర్డీఏ చాలా నష్టపోయిందనీ, ఇక 33 సంవత్సరాలకు కట్టబెడితే కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం వాటిల్లుతుందని వీఎంఆర్డీఏ అధికారులు సర్కారుకు స్పష్టం చేశారు. దీంతో ఆ ఫైలు ఆగిపోయింది. అయితే హర్షవర్ధన్ ప్రసాద్ తాజాగా లక్షలు వ్యయం చేసి రెస్టారెంట్‌కు రీమోడలింగ్ చేయడంపై వీఎంఆర్డీఏ అధికారులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండేళ్లలో లీజు పూర్తై, స్థలం ఖాళీ చేయాల్సిన దశలో అర్ధంతరంగా లక్షలు ఖర్చు చేసి పనులు చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదని వీఎంఆర్డీఏ ఉన్నతాధికారి ఒకరు సాక్షి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. ఎన్వోసీలు లేకుండానే ఎయిర్‌పోర్ట్‌లో ఇన్నాళ్లూ హల్చల్ హత్యాయత్న ఘటన తర్వాత రెండు మూడురోజులపా టు యధావిధిగానే పనిచేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ఆ తర్వాత మూతపడింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు రెస్టారెంట్లో పనిచేసే శ్రీనివా సరావు సహోద్యోగులను ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు తీ సుకువచ్చి అర్ధరాత్రి వరకు విచారించారు. ఈ క్రమంలో నే వారిలో చాలామందికి ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లు లేవని తేలింది. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో పనిచేయాలంటే తప్పని సరిగా ఎన్వోసీలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు హర్షవర్ధన్ చౌదరి నిబంధనలేమీ పాటించకుండా సిబ్బందితో ఇష్టారాజ్యంగా పనిచేయించారు. ఎన్వోసీల వివాదం తెరపైకి రావడంతో పోలీసులు ఫ్యూజన్‌ఫు డ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఎన్వోసీలు తీసుకోవా లని సూచించారు. ఇదంతా ఇప్పటికిప్పుడు పూర్తయ్యే ప్రక్రియ కాకపోవడంతో హర్షవర్ధన్ ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. దీనికితోడు విచారణ పేరిట సీఐ ఎస్ఎఫ్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు విమానాశ్రయంలోనే మకాం వేయడంతో ఎందుకొచ్చిన గొడవని హర్షవర్ధన్ ఎయిర్పోర్ట్ జోలికి పోవడం లేదు. అదే సమయంలోనే సిరిపురం బ్రాంచ్‌పై దృష్టి పెట్టారు. -
దాచేస్తే దాగని కుట్ర
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం వెనక పకడ్బందీగా వ్యూహ రచన జరిగిందని, ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఈ కుట్రకు బీజం పడిందనే వాదనలకు బలం చేకూర్చేలా ఈ అంశాలపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) డీజీ నివేదిక ఇవ్వడం గమనార్హం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలోకి పదునైన కత్తి ఎలా వచ్చింది? నిందితుడు వీఐపీ లాంజ్‌లోకి ఎలా రాగలిగాడు? ఎవరు సహకారం అందించారు?... ఇదంతా కేవలం ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నందువల్లే సాధ్యమనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. బీసీఏఎస్ డీజీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో నిందితుడు శ్రీనివాసరావుకు కేవలం అక్టోబర్ నెలకు మాత్రమే ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) జారీ అయినట్లు ప్రస్తావించడం ఇది ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం సాగిన కుట్ర అనే విషయాన్ని రుజువు చేస్తోంది. విమానాశ్రయంలో పనిచేసేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన ఏఈపీ కోసం నిందితుడు కనీసం దరఖాస్తు కూడా చేయలేదని వెలుగులోకి రావడం గమనార్హం. జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే ఇది పబ్లిసిటీ కోసం జరిగిందని డీజీపీ వ్యాఖ్యలు చేయడం, విచారణ అవసరం లేదని సీఎం పేర్కొనడం, అనంతరం సిట్ దర్యాప్తు ప్రారంభమైనా ముందుకు సాగకపోవడం, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిని తూతూమంత్రంగా విచారించి వదిలేయడం, తాజాగా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీ... నిందితుడికి అక్టోబర్ నెలకు మాత్రమే ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాస్ ఉన్నట్లు పేర్కొనటం ఈ ఘటన వెనక పెద్దల ప్రమేయం ఉండటం వల్లే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలకు బలం చేకూరుస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుకు 2018, అక్టోబరు 1 నుంచి 30 వరకే తాత్కాలిక అనుమతి ఉందని తెలిపే బీసీఏఎస్ డీజీ నివేదిక విమానాశ్రయంలో ఏడాదిగా అనధికారికంగా పాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కుట్రదారులు వ్యూహాత్మకంగానే విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) డీజీ కుమార్ రాజేష్‌చంద్ర రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇదే అంశాన్ని నిర్ధారిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుకు విమానాశ్రయం జోన్ ‘డి’లో పనిచేసేందుకు 2018 అక్టోబరు 1వతేదీ నుంచి 30వతేదీ వరకు తాత్కాలిక ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ (ఏఈపీ)ని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జారీ చేశారు. ఇదే విషయాన్ని బీసీఏఎస్ డీజీ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే... నిందితుడు శ్రీనివాసరావు దాదాపు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. సిట్ పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కేవలం అక్టోబర్ నెలకు మాత్రమే అనుమతి ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో ఎలా కొనసాగాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. అనుమతిలేని వ్యక్తి విమానాశ్రయంలో ఏడాదిగా దర్జాగా తిరుగుతుంటే భద్రతా విభాగం అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది సందేహాస్పదంగా మారింది. పక్కా పథకం ప్రకారమే.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కుట్రకు ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా తమకు నమ్మకస్తుడైన ఫ్యూజన్ ఫుడ్స్ నిర్వాహకుడు హర్షవర్థన్ప్రసాద్ చౌదరిని సాధనంగా చేసుకున్నారు. ïఉత్తరాంధ్రలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో అదను చూసి ఆయన్ను మట్టుబెట్టేందుకు విమానాశ్రయంలో ఉన్న హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి రెస్టారెంట్ కేంద్రంగా పన్నాగం పన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల అండదండలతోనే హర్షవర్థన్ ప్రసాద్ చౌదరికి 2017లో విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్ లైసెన్సు లభించింది. నిబంధనలకు విరుద్ధంగా హర్షవర్థన్ ప్రసాద్‌కు చెందిన ఒలంపిక్స్ అసోసియేషన్‌కు గుర్తింపునిచ్చారు. రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్యపై పెత్తనం కట్టబెట్టారు. టీడీపీ టికెట్ ఇచ్చేలా హామీ! గత ఎన్నికల్లో గాజువాక టీడీపీ టిక్కెట్ కోసం హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి తీవ్రంగా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కేలా హామీ కూడా ఇచ్చినట్టు కూడా సమాచారం. విమానాశ్రయ ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్‌కు హర్షవర్థన్ ప్రసాద్‌తోపాటు విశాఖ నగరానికి చెందిన నేరచరిత్ర ఉన్న ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీన్ని కూడా తమ కుట్రకు సాధనంగా చేసుకున్నారు. భద్రతాధికారుల సహకారంతోనే.. నిందితుడు శ్రీనివాసరావు అనధికారికంగా విమానాశ్రయంలో ఏడాదిగా మాటేసినా భద్రతా అధికారులు పట్టించుకోలేదు. రెస్టారెంట్‌కు సరుకుల సరఫరా ముసుగులో విచ్చుకత్తిని విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేలా కథ నడిపారు. తాత్కాలిక ఏఈపీ ప్రకారం కూడా కేవలం ‘డి’ బ్లాక్ కు మాత్రమే పరిమితం కావాల్సిన శ్రీనివాసరావు ఏకంగా వీఐపీ లాంజ్‌లోకి ప్రవేశించాడు. దీన్ని కూడా భద్రతా ధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ రాక సందర్భంగా విమానాశ్రయ భద్రతా విభాగం కుట్ర కోణంతోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి నడిపించిన ఈ కుట్ర కథలో శ్రీనివాసరావు, టీడీపీ నేత హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి తెరముందు పాత్రలు కాగా... విమానాశ్రయ భద్రతాధికారులు అందుకు తమవంతు సహకారం అందించారన్నది స్పష్టమవుతోంది. ఏఈపీ కోసం దరఖాస్తే చేయలేదు నిబంధనల ప్రకారం విమానాశ్రయంలోని వివిధ విభాగాల్లో పనిచేసే వ్యక్తులకు ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) తప్పనిసరిగా ఉండాలి. ఏఈపీ జారీకి కేంద్ర విమానయాన సంస్థ (ఏఏఐ) కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ప్రైవేట్ వ్యక్తులకు ఒక రోజు నుంచి మూడు రోజులకు ఒక కేటగిరీలో, నాలుగు రోజుల నుంచి 90 రోజులకు మరో కేటగిరీ కింద ఏఈపీలు కేటాయిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విదేశీయులకు మరో రెండు కేటగిరీల కింద ఏఈపీ జారీ చేస్తారు. ఇందుకోసం సదరు వ్యక్తులు గుర్తింపు కార్డు, తాము పనిచేసే సంస్థ అనుమతిపత్రం, తమపై ఎలాంటి కేసులు లేవని నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) మొదలైనవి సమర్పించి దరఖాస్తు చేయాలి. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు గానీ అతడి తరపున రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిగానీ ఎలాంటి దరఖాస్తు చేయలేదని కూడా బీసీఏఎస్ డీజీ వెల్లడించడం గమనార్హం. కనీసం ఏఈపీ కోసం దరఖాస్తు చేయకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో అనధికారికంగా మాటు వేసినట్లు దీనిద్వారా తేటతెల్లమవుతోంది. నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలోని రెస్టారెంట్లో పనిచేస్తున్నాడని పోలీసులు సమర్పించిన నివేదిక తాత్కాలిక అనుమతిపైనా సందేహాలు నిందితుడు శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1వతేదీ నుంచి 30వతేదీ వరకు విమానాశ్రయంలో పనిచేసేందుకు తాత్కాలిక ఏఈపీ జారీ చేశామని విమానాశ్రయ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి బీసీఏసీ డీజీకి చెప్పడం సందేహాలకు తావిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుగానీ అతడి తరపున రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిగానీ అసలు ఏఈపీ కోసం దరఖాస్తే చేయలేదని బీసీఏఎస్ డీజీ కుమార్ రాజేష్‌చంద్ర రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లిఖితపూర్వకంగా తెలిపారు. ఆయనే మరో ప్రశ్నకు సమాధానంగా నిందితుడు శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1 నుంచి 30వతేదీ వరకు విమానాశ్రయంలో పనిచేసేందుకు తాత్కాలిక ఏఈపీని విమానాశ్రయ డైరెక్టర్ జారీ చేశారని వెల్లడించారు. ఈ తాత్కాలిక ఏఈపీపై న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేసున్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం అనంతరం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పటికప్పుడు నెల రోజుల గడువు కలిగిన తాత్కాలిక ఏఈపీని సృష్టించారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరికి విమానాశ్రయ భద్రతా అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావుకు అక్టోబరు నెలకు సంబంధించి జారీ చేశారని చెబుతున్న తాత్కాలిక ఏఈపీ ఎంతవరకు సరైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీనివాసరావు టీడీపీ వర్గీయుడే నిందితుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులంతా టీడీపీకి చెందినవారేనని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సోదాహరణంగా వెల్లడించారు. టీడీపీ వర్గీయులైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను అడ్డుకున్న తీరు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఉదంతాన్ని ఆయన బయటపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే శ్రీనివాసరావును రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి వద్దకు చేర్చారని కూడా ఆయన చెప్పడం గమనార్హం. కుట్ర కోణాన్ని పట్టించుకోని సిట్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అంతమొందించేందుకు ప్రభుత్వ పెద్దలు ఇంత పక్కాగా సాగించిన కుట్రపై సిట్ అధికారులు కనీసం దృష్టి సారించలేదు. శ్రీనివాసరావు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలో అనధికారికంగా మాటేసిన వైనం, అతడి కుటుంబం టీడీపీ సానుభూతిపరులనే వాస్తవాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణాన్ని కప్పిపుచ్చేందుకు కేసును నీరుగారుస్తున్నారని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. స్పందించేందుకు నిరాకరించిన ఎయిర్‌పోర్టు డైరెక్టర్, ముఖ్య భద్రతాధికారి ఈ అంశాలపై విశాఖ ఎయిర్‌పోర్డు డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్‌ను సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. బీసీఏఎస్ డీజీ ఇచ్చిన నివేదికకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ అంతకుమించి స్పందించేందుకు నిరాకరించారు. ఇదే అంశంపై వేణుగోపాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
హర్షవర్ధన్ చౌదరి జోలికి వెళ్లొద్దు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో అధికార తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి పాత్రను నిగ్గుతేల్చడంపై పోలీసులు చేతులెత్తేశారు. ఆ రెస్టారెంట్ కేంద్రంగానే జగన్‌పై హత్యాయత్నానికి కుట్ర జరిగిందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాము హర్షవర్దన్ చౌదరి జోలికి వెళ్లలేమని, ఆ మేరకు తమకు పైస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని విశాఖ పోలీసులు పేర్కొంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచే ఆదేశాలు అందాయని అంటున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇప్పటివరకు ఈ కేసు విచారణను కేవలం నిందితుడు శ్రీనివాసరావుకే పరిమితం చేశారు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పక్కా స్క్రీన్‌ప్లేతో విచారణ డ్రామాను రక్తి కట్టించారు. హర్షవర్దన్ చౌదరిని ప్రశ్నించని పోలీసులు ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో నిందితుడు శ్రీనివాసరావు సహోద్యోగులైన యువతీ యువకులను ఆరు రోజుల విచారణ సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే ఉంచేవారు. ఓ దశలో స్టేషన్ వద్దనే పడిగాపులు కాస్తున్న మీడియా సిబ్బంది... ఆడపిల్లలను ఇప్పటివరకు స్టేషన్లో ఉంచితే ఎలా? అని ప్రశ్నిస్తే పోలీసులు హడావుడిగా ఆటోలు తెప్పించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీనివాసరావు సహోద్యోగులను అర్ధరాత్రి దాకా స్టేషన్లోనే ఉంచి, విచారణ డ్రామాను నడిపించిన పోలీసులు ఆ రెస్టారెంట్ యజమాని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల సన్నిహితుడైన హర్షవర్దన్ చౌదరిని కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయలేకపోయారు. స్టేషన్లో ఉన్న తన రెస్టారెంట్ సిబ్బందిని తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడల్లా హర్షవర్దన్ చౌదరి పోలీస్ స్టేషన్లో దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు. పోలీసులంటే తనకు ఓ లెక్క కాదన్నట్లుగా ప్రవర్తించేవాడు. తన వాహనాన్ని పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే నో పార్కింగ్ బోర్డు వద్ద పార్క్ చేసేవాడంటే అతడి వ్యవహార శైలి ఏంటో అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఎయిర్‌పోర్టులో నో పార్కింగ్ బోర్డ్ వద్ద హర్షవర్దన్ చౌదరి కారు పార్క్ చేసిన దృశ్యం.. ఎదురుగా ఉన్న వాహనం నగర పోలీస్ కమిషనర్‌ది హర్షవర్దన్ చౌదరి అండ లేకుండానే నిందితుడు బరితెగించాడా? గతంలో ఎన్నో కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరావును రక్షణ శాఖ అధీనంలోని విశాఖ ఎయిర్‌పోర్టులో తన రెస్టారెంట్లో నియమించుకోవడం.. కత్తులు, మారణాయుధాలతో ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో అతడు విచ్చలవిడిగా సంచరించడం, శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా వసతి కల్పించడం, మిగిలిన ఉద్యోగుల కంటే అధికంగా వేతనం ఇవ్వడం, వైఎస్ జగన్‌పై వ్యూహాత్మకంగానే ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం చేయడం.. ఈ వరుస పరిణామాలను గమనిస్తే హర్షవర్దన్ చౌదరి అండ లేకుండానే శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి తెగబడ్డాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 25న మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా 10 నిమిషాల ముందే హర్షవర్దన్ చౌదరి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఘటన తరువాత శ్రీనివాసరావు చాలా మంచోడండి, అమాయకుడండి, ఏదో అభిమానంతో పిచ్చి పని చేసుంటాడు అని వకాల్తా పుచ్చుకున్న హర్షవర్దన్ చౌదరి తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి పాల్పడితే... సదరు ఉద్యోగినే వెనకేసుకొచ్చిన హర్షవర్దన్ చౌదరి నిర్వాకంపై పోలీసులు దృష్టి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. పోలీసులు తమపై వస్తున్న విమర్శలకు తలొగ్గి హర్షవర్దన్ చౌదరిని దీపావళి పండుగ తర్వాత తమదైన శైలిలో విచారించాలని భావించారు. అయితే, హర్షవర్దన్ చౌదరి జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో తాము మిన్నకుండిపోయామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. హర్షవర్దన్ చౌదరిని విచారిస్తే మొత్తం డొంకంతా కదిలి కుట్రకోణం బట్టబయలై, అసలు కుట్రదారుల పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉండడం వల్లే సీఎంవో నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో బీసీఏఎస్ దర్యాప్తు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటన నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా(బీసీఏఎస్) అధికారులు గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బీసీఏఎస్ అధికారి పాల్ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్, పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. హత్యాయత్నం జరిగిన తీరు, తదనంతర పరిణామాల గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విజయదుర్గను మరోసారి విచారించనున్న ‘సిట్’ ముమ్మిడివరం: ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసులో సిట్ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు వద్ద దొరికాయని చెబుతున్న లేఖలను రాసిన అతడి సమీప బంధువు విజయదుర్గను గతంలో ‘సిట్’ సీఐ విశ్వేశ్వరరావు విశాఖపట్నం తీసుకువెళ్లి, విచారించి, తిరిగి పంపించారు. ఆయితే, మూడు రోజుల క్రితం విజయదుర్గ ఫోన్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాల్‌డేటా ఆధారంగా మరోసారి విచారించేందుకు విజయదుర్గను విశాఖపట్నం తీసుకురావాలని స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం పోలీసులు గురువారం ఆమెను విశాఖపట్నం తీసుకెళ్లారు. -
ఆ లేఖపై సందేహాలెన్నో!
సాక్షి, విశాఖపట్నం: ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడే వారు తమ చావుకు కారణాలను వివరిస్తూ లేఖ రాసి పెట్టుకుంటారు. ఆ లేఖ ఆధారంగానే అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందో నిర్ధారణకు వస్తారు. కానీ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడు జనుపల్లి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీకి వీరాభిమానిగా చిత్రీకరించేందుకు పోలీసులు ఆడిన ‘లేఖ’ నాటకం విస్మయానికి గురిచేస్తోంది. చేయి తిరిగిన రాతగాడిలా..: లేఖలో మొదటి పేజీ మొదలుకుని చివరి పేజీ వరకు ఒకే దస్తూరి క్రమపద్ధతిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంత చేయి తిరిగిన రాతగాడైనా చివరి పేజీలకొచ్చేసరికి రాత శైలి మారుతుంది. కానీ ఇక్కడ శ్రీనివాసరావు రాసినట్టు పోలీసులు చెబుతున్న లేఖను పరిశీలిస్తే ఎన్నో అనునానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అతను చదువుకున్నదేమో పదో తరగతి. కానీ లేఖలోని విషయాలు..భావుకత, సమాజం పట్ల నిర్ధిష్ట అవగాహన చూస్తుంటే నిజంగా అతను రాసిందేనా అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కచ్చితంగా ఈ లేఖ పోలీసులు సృష్టించిందేనన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. పైగా ఈ లేఖ చివరి పేజీలో సంబంధం లేకుండా ‘ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా నా అవయవదానం చేయండి అమ్మా..నాన్నా’ అంటూ లేఖ ముగించడం చూస్తుంటే కావాలని పథకం ప్రకారమే ఈ లేఖ సృష్టించినట్టుగా స్పష్టమవుతోంది. లేఖ ఆద్యంతం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు: ‘అన్నా ప్రజల హృదయంలో కొలువుండి ప్రజలు దైవంగా భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నాకు చాలా అభిమానం’అంటూ ప్రారంభమైన ఆ లేఖలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారంటూ విమర్శలు సాగాయి.అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. చివరి పేజిలో చంటి పేరిట సంతకం చేసి పక్కనే వేరే దస్తూరితో జనుపల్లె శ్రీనివాసరావు చిరునామా రాసి ఉంది. సీఐఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ సంతకాలతో విడుదల చేసిన ఈ లేఖ సర్వత్రా సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఇదిలా ఉండగా డీజీపీ ఠాకూర్ అమరావతిలో ఘటనపై మాట్లాడుతూ దుండగుడు వైఎస్ జగన్‌కు వీరాభిమాని అంటూ ప్రకటించారు. అంతే కాదు.. వైఎస్సార్సీపీ అభిమాని అని తేల్చేందుకు అతని జేబులో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామంటూ చెప్పుకొచ్చిన అనంతరం పోలీసులు లేఖను విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. పోలీసుల హైడ్రామా..: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో దారుణంగా విఫలమైన పోలీసులు.. చివరికి ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ఓ సాధారణ యాధృచ్ఛిక ఘటనగా చిత్రీకరించేందుకు చేస్తున్న యత్నాలు విస్తుగొలుపుతున్నాయి. అత్యంత భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేతపై కత్తితో హత్యాయత్నం జరిగితే పోలీసులు స్పందించిన తీరు, నిర్లక్ష్య వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. హర్షను విచారించని పోలీసులు! దుండగుడు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని, టీడీపీ నేత హర్షను పోలీసులు కనీసంగా ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యూజన్ ఫుడ్స్ బ్రాంచిని సొంతంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. -
‘బాబు’ అనుచరుడే హర్షవర్ధన్
సాక్షి, విశాఖపట్నం: టి. హర్షవర్ధన్‌ప్రసాద్.. ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టులోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని. టీడీపీ సీనియర్ నాయకుడు. విశాఖ జిల్లా గాజువాక నుంచి టీడీపీ తరఫున పోటీచేసేందుకు రెండుసార్లు విఫలయత్నం చేశారు. గతంలో చంద్రబాబు ఎప్పుడు సిటీకి వచ్చినా ఆయన వాహనానికి డ్రైవర్‌గా పనిచేసేవాడని చెబుతుంటారు. టీడీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు చంద్రబాబుతో నేరుగా మాట్లాడగలిగే నాయకుల్లో హర్షవర్ధన్ ఒకరు. నగరంలోని గురజాడ కళాక్షేత్రం పక్కనే వుడాకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ లీజు వ్యవహారం కూడా తీవ్ర వివాదస్పదమైంది. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే నిబంధనలకు విరుద్ధంగా లీజు పద్ధతిలో ఈ స్థలాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న పరిచయంతోనే ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ సంపాదించగలిగారు. టీడీపీ మాజీ నేత సుందరపు విజయకుమార్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నట్లు సమాచారం. ఈ రెస్టారెంట్‌ను ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ప్రారంభించారు. చంద్రబాబు ఎప్పుడు నగరానికి వచ్చినా ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లుచేసేది హర్షవర్ధనే అని అందరూ చెబుతుంటారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌కు చెందిన రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు జననేతపై హత్యా యత్నానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. వుడాకు నామమాత్రపు ధర చెల్లిస్తూ ఏళ్ల తరబడి లీజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్‌లో పని చేస్తున్నాడు. ఈ ఘటనను రాజకీయం చేస్తూ.. ఫ్యూజన్ ఫుడ్స్ యజమానితో తమకు సంబంధం లేదంటూ అధికార టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సదరు ఆహారశాల యజమాని అధికార పార్టీకి చెందిన నాయకుడిదేనని స్పష్టం చేస్తూ ‘సాక్షి’ గతంలోనే కథనాలు ప్రచురించింది. విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) ఉద్యోగ భవన్ ఎదురుగా గురజాడ కళాక్షేత్రాన్ని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని 2003 మార్చి 5న ఫ్యూజన్ ఫుడ్స్(సెవెన్ డేస్) అధినేత హర్షవర్థన్ ప్రసాద్‌కు లీజ్‌కు ఇచ్చారు. అప్పట్లో ఈ స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు మూడు సంస్థలు పోటీ పడినప్పటికీ తక్కువ ధర కోట్ చేసిన హర్షవర్థన్కే దక్కింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలతో హర్షవర్థన్‌కు సత్సంబంధాలుండడంతో 10,842 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ.13,500 నామమాత్రపు అద్దె చెల్లించాలన్న ఒప్పందంతో 9 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు. అయితే, లీజు సొమ్ము చెల్లింపులో హర్షవర్థన్ జాప్యం చేయడంతో.. స్థలాన్ని ఖాళీ చెయ్యాలంటూ ‘వుడా’ ఆదేశించింది. దీనిపై జిల్లా కోర్టులో ఫ్యుజన్ ఫుడ్స్ పిటిషన్ దాఖలు చెయ్యగా.. దాన్ని కోర్టు కొట్టేసింది. వెంటనే ఖాళీ చెయ్యాలని వుడా మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే, ఫ్యూజన్ ఫుడ్స్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఫ్యూజన్ ఫుడ్స్‌కే అడిగినన్ని సంవత్సరాలపాటు లీజు పెంచాలంటూ వుడాపై ఒత్తిడి తీసుకొచ్చింది. తొమ్మిదేళ్లు అంటే 2024 వరకూ లీజు పెంచాలంటూ వుడాను ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు ఒప్పుకోక తప్పలేదు. లీజు గడువుని 33 ఏళ్లకు పెంచాల్సిందేనని హర్షవర్థన్ పట్టుబట్టగా, టీడీపీ నేతలు అందుకు వంతపాడారు. ఫ్యూజన్ ఫుడ్స్‌కే స్థలం దక్కేలా చేశారు. ఆ రోజున అంతలా హర్షవర్థన్‌కు అండదండలు అందించిన టీడీపీ ఇప్పుడు అతడితో తమకు సంబంధం లేదని చెప్పడం విస్మయపరుస్తోంది. హర్షవర్ధన్‌కు సీఎం, లోకేష్‌తో సాన్నిహిత్యం! ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు పనిచేసే విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ప్యూజన్ ఫుడ్స్ అధినేత హర్షవర్ధన్ ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని విశాఖకు చెందిన టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి టికెట్ ఇస్తామని హర్షవర్ధన్‌కు చంద్రబాబు హామీ ఇచ్చి విభిన్న కారణాలవల్ల నిలబెట్టుకోలేకపోయారు.అలాగే రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ను చేస్తామని, స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ పదవి ఇస్తామని హర్షవర్ధన్‌కు చంద్రబాబు, లోకేష్ గట్టి హామీ ఇచ్చినప్పటికీ.. టీడీపీ నేతలు సహకరించక పోవడంతో ఆ పదవులు ఆయనకు దక్కలేదు. -
కాలుష్య రహిత టపాసులు!
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాలుష్యం కలిగించని బాణసంచా తయారీకి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఓ వైద్యుడిగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, అయితే టపాసులు పేల్చడం వల్ల కలిగే అనుభూతిని ఎవరూ కోల్పోరాదన్నది తన అభిప్రాయమని చెప్పారు. ఆయన శనివారం చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల బాణసంచా తయారీదారులు తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారికి తెలిపామని, శాస్త్రవేత్తల సహకారంతో పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగల టపాసుల తయారీ కష్టమేమీ కాకపోవచ్చని పేర్కొన్నారు. దేశంలో అపరిష్కృతంగా ఉన్న పౌర సమస్యలకు పరిష్కారాలు కనుక్కునే దిశగా పరిశోధనలను మళ్లించిన ఘనత తమదేనన్నారు. దేశంలోని వేర్వేరు పరిశోధన శాలల్లో జరుగుతున్న పరిశోధనలను అంతరిక్షం, వ్యవసాయం, వైద్యం, నానో టెక్నాలజీ వంటి భాగాలుగా వర్గీకరించి.. ఆయా రంగాల్లో సమన్వయం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పోస్టులు ఎక్కువ అవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలు రెండు వైపులా పదునున్న కత్తి వంటివని.. కొంతమంది వీటిని తప్పుడు వార్తల ప్రసారానికి వాడుకోవడం సరికాదని హితవుపలికారు. ఈశాన్య రాష్ట్రాలకు పెద్దపీట శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈశాన్య రాష్ట్రాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కొత్త పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయడం.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలకు కేటాయించే బడ్జెట్లో కనీసం పది శాతం ఇక్కడి బయోటెక్నాలజీ రంగానికి ఇస్తుండటం తమ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండేళ్లు ఢిల్లీలో నిర్వహించగా.. తాజాగా ఇప్పుడు చెన్నైలో జరుగుతోందని.. వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించాలన్నది తన అభిప్రాయమని చెప్పారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వందేళ్లుగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ.. కేవలం శాస్త్రవేత్తలు పరిశోధన వ్యాసాలు ప్రచురించేందుకు, వారిలో వారు చర్చలు జరిపేందుకు మాత్రమే ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో శాస్త్రవేత్తలతోపాటు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశ్రమ వర్గాలను ఒకేచోటికి చేర్చడం ద్వారా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం కొత్త పుంతలు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం శాస్త్ర, సాంకే తిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతోందని, సామాన్యుల కష్టాలను తీర్చే దిశగా పరిశోధన లు పురోగతి సాధిస్తున్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ అన్నారు. తమిళనాడులోని చెన్నై లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) శుక్రవారం ప్రారంభమైంది. సమాజంలోని అసమానతలను రూపుమా పేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే అత్యుత్తమ మార్గమని తమ ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు. దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. నానో టెక్నాలజీ రంగంలో దేశం ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 1,200 ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో సీఎస్ఐఆర్ గతేడాది 12వ స్థానంలో ఉండగా.. తాజాగా 9వ స్థానానికి చేరుకుం దని అన్నారు. సీఎస్ఐఆర్ వంటి సంస్థలు ఇప్పుడు అన్ని రంగాల్లో సామాన్యుల సమ స్యలకు ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా పరిష్కా రాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. వివిధ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులకు తెలియజేసే లక్ష్యంతో ఐఐఎస్ఎఫ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. సాంకేతికతతో సమస్యల పరిష్కారం: సుజనా చౌదరి గ్రామీణ భారత ప్రజల అనేక సమస్యలకు శాస్త్ర, సాంకేతికత ద్వారా పరిష్కారాలు కనుగొనేందుకు కేంద్రం ప్రాముఖ్యం ఇస్తోందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు. గ్రామీణ సమస్యలకు ఆ ప్రాంతాల సృజనశీలురు ఎన్నో వినూత్నమైన పరిష్కారాలు ఆవిష్కరించారని వీటన్నింటినీ ప్రజలకు చేరువ చేసేందుకు ఐఐఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అఫ్గానిస్తాన్ మంత్రి అబ్దుల్ లతీఫ్ రోషన్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు విజయ్ భట్కర్, తమిళనాడు మంత్రి అన్బలగణ్, కేంద్ర భూశాస్త్ర విభాగ కార్యదర్శి రాజీవన్ పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలు తమ పరిశోధన వివరాలను ప్రదర్శిస్తున్నాయి. భారత్‌కు రుణపడి ఉన్నాం: బంగ్లాదేశ్ మంత్రి తమ దేశం పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి విముక్తమయ్యేందుకు సాయం చేసిన భారత్‌కు బంగ్లాదేశ్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆ దేశానికి చెందిన మంత్రి యశ్ ఉస్మాన్ అన్నారు. ఆసియా రీజియన్‌కు భారత్ నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, బంగ్లాదేశ్‌లు అన్ని రంగాల్లో కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
పీరియాడిక్ సినిమాలో స్టార్ యాంకర్
బుల్లితెరపై స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది తారలు ఇప్పుడు వెండితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, లాస్య లాంటి వారు వెండితెర మీద కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అలరించిన యాంకర్ శ్రీముఖి.. ఇప్పుడు లీడ్ రోల్ ఓ సినిమా చేస్తోంది.ఈ సినిమా 80ల నాటి కథతో పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్దన్ తొలి సారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో శ్రీముఖి లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. అంజి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీముఖితో పాటు కిశోర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. "GOOD BAD UGLY" A 80's period film! My next in telugu! And it's really close to my heart! Thanks @harrsham #GOODBADUGLY #GBU pic.twitter.com/tXjBIBRpZH — SreeMukhi (@MukhiSree) 13 August 2017 GOOD BAD UGLY! Need all your love! #GBU #GOODBADUGLY #mynextintelugu #Harshavardhansmusicalnarrative pic.twitter.com/BfGAkAoWkh — SreeMukhi (@MukhiSree) 13 August 2017 #mymovie #first pressmeet pic.twitter.com/edOgxmqOE7 — harshavardhan (@harrsham) 12 August 2017 -
‘పారిస్’.. భారత్‌కే అనుకూలం
పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందంతో అమెరికాకు నష్టమని వ్యాఖ్య ► ట్రంప్‌ది చారిత్రక తప్పిదం, మొత్తం భూగోళానికే ప్రమాదం: ఫ్రాన్స్, జర్మనీ ► పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: భారత్ ► ఒప్పందాన్ని అమలు చేస్తామన్న న్యూయార్క్, కాలిఫోర్నియా గవర్నర్లు వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బకొట్టారు. కర్బన ఉద్గారాల ధాటికి వేడెక్కుతున్న భూగోళాన్ని రక్షించే ఉద్దేశంతో కుదుర్చుకున్న పారిస్ పర్యావరణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. ఆ ఒప్పందం నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు. ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే ఒప్పందాన్ని అంగీకరించేందుకు మనసు అంగీకరించడం లేదని అందుకే వైదొలుగుతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా ఒప్పందం ఉంటే అంగీకరించేందుకు సిద్ధమని ట్రంప్ పరోక్షంగా తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు... ప్రపంచ పర్యావరణాన్ని ట్రంప్ పణంగా పెట్టడంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. గ్రీన్ హౌస్ వాయువుల్ని అత్యధికంగా వెదజల్లుతున్న దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘2015 పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతుంది. ఈ ఒప్పందం అమెరికాకు తీవ్ర నష్టం కలిగిస్తుంద’ని వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌లో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అనంతరం ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ..‘నేను పిట్స్బర్గ్(అమెరికా) ప్రజల ప్రతినిధిగా ఎన్నికయ్యాను.. అంతేగానీ పారిస్‌కు కాద’ని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ‘అధ్యక్షుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. నా బాధ్యతంతా అమెరికా ప్రజలే... పారిస్ పర్యావరణ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అమెరికా సార్వభౌమాధికారాన్ని బలహీనపరుస్తుంది. ఆమోదయోగ్యం గానీ నిబంధనల్ని మనపై విధించారు. ప్రపంచంలోని ఇతర దేశాలకు నష్టం కలిగించే దేశంగా మనల్ని చిత్రీకరించార’ని పేర్కొంటూ పారిస్ ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వ్యాపారాలు, ఉద్యోగాలకు నష్టం.. పారిస్ ఒప్పందం పక్షపాత ధోరణిలో ఉండడంతో పాటు, అమెరికాలో వ్యాపారాలు, ఉద్యోగాలకు నష్టం కలిగిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ‘నేను ప్రతి రోజు అమెరికా ప్రజల కోసం పోరాడుతున్నాను. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగేందుకు ఇదే సరైన సమయం. అదే సమయంలో పర్యావరణం, అమెరికన్ కంపెనీలు, ప్రజల్ని పరిరక్షించేందుకు కొత్త ఒప్పందానికి ఇదే తరుణం. మనం ఒప్పందం నుంచి బయటపడుతున్నాం. తిరిగి చర్చలు ప్రారంభించాలి. ఏదైనా మంచి ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అలా జరిగితే మంచిదే.. కుదరకపోయినా మంచిదే’ అంటూ తన నిర్ణయాన్ని ట్రంప్ గట్టిగా సమర్ధించుకున్నారు. చైనా, భారత్‌లకే ప్రయోజనం పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలపై కొన్ని దేశాలు అర్థం లేని షరతులు విధించాయని ట్రంప్ తప్పుపట్టారు. ‘పారిస్ ఒప్పందం అమలుకు కట్టుబడి ఉండేందుకు అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్ బిలియన్ల కొద్దీ డాలర్లను అందుకుంటోంది. అమెరికాపై ఆర్థికంగా పైచేయి సాధించేందుకు... చైనా, భారత్‌లు వచ్చే కొన్నేళ్లలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్ని రెండింతలు చేయనున్నాయి. అమెరికా ప్రజలపై కఠినమైన ఆర్థిక ఆంక్షల్ని విధించడమే కాకుండా.. అమెరికా పర్యావరణ లక్ష్యాలకు తగినట్లుగా పారిస్ ఒప్పందం లేద’ని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం చైనా.. 13 ఏళ్ల పాటు కర్బన ఉద్గారాల్ని ఇష్టమొచ్చినట్లు విడుదల చేయవచ్చని, వారికి మినహాయింపునిచ్చి.. అమెరికాకు ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. ‘ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.. చివరిగా చెప్పేదేంటంటే పారిస్ ఒప్పందం అన్యాయంగా ఉంది. అందుకే తప్పుకుంటున్నాం’ అని ముక్తాయింపునిచ్చారు. ట్రంప్ కాదన్నా.. మేం ఓకే.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని పలు నగరాలు, రాష్ట్రాలు, కంపెనీల ప్రతినిధులు పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ఒక ప్రణాళికను ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. 30 మంది మేయర్లు, ముగ్గురు గవర్నర్లు, 80 మందికిపైగా వర్సిటీ అధ్యక్షులు, 100కు పైగా వ్యాపార సంస్థల ప్రతినిధులు కూటమిగా ఏర్పడి ఐరాసతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఒప్పం దం నుంచి వైదొలగడం అనైతికమని న్యూయా ర్క్, కాలిఫోర్ని యా, వాషింగ్టన్ గవర్నర్లు తప్పుపట్టారు. ఒప్పందాన్ని సమర్థించే రాష్ట్రాలతో సంప్రదింపుల కోసం ‘యునైటెడ్ స్టేట్స్ క్లైమేట్ అలయన్స్’ను ఏర్పాటు చేశారు. పారిస్ ఒప్పందానికి న్యూయార్క్ రాష్ట్రం కట్టుబడి ఉంటుదంటూ ఎగ్జిక్యుటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నానని న్యూయార్క్ గవర్నర్ అండ్రూ కోమో వెల్లడించారు. ప్రపంచ దేశాల నిరసన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయంపై తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తమైంది. ‘అతి కొద్ది దేశాలే భవిష్యత్తు ప్రయోజనాల్ని వ్యతిరేకిస్తున్నాయి. పారిస్ ఒప్పందంలో కొనసాగే దేశాలు ఉద్యోగాలు, పరిశ్రమల కల్పనతో దక్కే ప్రయోజనాల్ని పొందుతాయి. ఒప్పందంలో అమెరికా ముందు వరుసలో ఉండాల’ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. ఒప్పందంపై పునఃసంప్రదింపులు ఉండవని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు స్పష్టం చేశాయి. ట్రంప్ నిర్ణయం చారిత్రక తప్పిదమని, భూగోళానికి ప్రమాదమని అన్నాయి. ట్రంప్ నిర్ణయంపై రాద్దాంతం అక్కర్లేదని, ఆయనతో కలసి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా ముందుకు సాగాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ‘ట్రంప్ తన దేశప్రయోజనాల కోసం చారిత్రక తప్పిదం చేశారు. ప్రపంచానికి అమెరికా వెన్నుచూపింది’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు. ఒప్పందాన్ని కొనసాగిస్తామని చైనా ప్రధాని లీ కెకియాంగ్ అన్నారు. ‘ఉద్గారాల తగ్గింపు, అంతర్జాతీయ భద్రత కోసం ప్రపంచం చేస్తున్న యత్నాలకు అమెరికా నిర్ణయం నిరుత్సాహం కలిగించింది..’ అని ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెరస్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని ఆయన కుమార్తె ఇవాంకా కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కట్టుబడి ఉన్నాం: భారత్ న్యూఢిల్లీ: పారిస్ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందని పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ‘ఎవరి వైఖరి, ఏ దేశం వైఖరి ఎలా ఉన్నా మా ప్రభుత్వం మాత్రం ఒప్పందానికి కట్టుబడి ఉంది’ అని అన్నారు. -
పవర్ స్టార్ సినిమాకు నో చెప్పాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పనిచేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు. కానీ ఓ టాలీవుడ్ టెక్నిషియన్ మాత్రం ఈ గోల్డెన్ ఆఫర్‌ను కాదనేశాడు. పవన్ హీరోగా తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం, ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వేదలంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు హర్షవర్థన్‌ను రచయితగా తీసుకోవాలని భావించారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షవర్థన్. అయితే చాలా కాలంగా దర్శకత్వం కోసం ఎదురుచూస్తున్న హర్షవర్థన్ ఇటీవలే దర్శకుడిగా తన తొలి సినిమాను ప్రారంభించాడు. దీంతో పవన్ సినిమాకు మాటలు రాసే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందట. దీంతో పవన్ సినిమాకు మరో రచయితను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. హర్షవర్దన్ దర్శకుడిగా తన తొలి సినిమా సెట్స్ మీద ఉండగానే సుధీర్ బాబు హీరోగా మరో సినిమాను ప్రకటించాడు. -
'తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలి'
కరీంనగర్(సుల్తానాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలనికోరుతూ మంగళవారం రాత్రి ఎంపీలతో కలిసి తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు. ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి వైద్య రంగంలో ప్రాధాన్యత ఇచ్చిన వారవుతారని అన్నారు. కేంద్ర మంత్రి తమ వినతిపై సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా ఉన్నారు. -
'ఇన్కాయిస్ వల్లే హుద్‌హుద్ ప్రాణనష్టం తగ్గింది'
హైదరాబాద్: ఇన్కాయిస్ అందించిన ముందుస్తు సమాచారం వల్లే హుద్‌హుద్ తుపానులో ప్రాణనష్టాన్ని తగ్గించ గలిగామని కేంద్ర మంత్రులు హర్షవర్థన్, సుజనా చౌదరి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇన్కాయిస్ 10వ వార్షికోత్సవ సభకు వారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. సునామి లాంటి విపత్తులను ఆపడం సాధ్యం కానప్పటికీ భవిష్యత్తులో జరిగే విపత్తులను మాత్రం ఇన్కాయిస్ ద్వారా గుర్తించ వచ్చని హర్షవర్థన్, సుజనా చౌదరి తెలిపారు. -
క్షణికావేశమే ఊపిరి తీసిందా...?
విద్యార్థి హర్షవర్థన్ మృతి నేపథ్యం... సాక్షి,సిటీబ్యూరో: ఆ క్షణం వరకు వాళ్లు శత్రువులు కాదు... ఆ ఇద్దరి మధ్య పగ, ప్రతీకారాలు లేవు. హతమార్చేందుకు కుట్రలు పన్నినదాఖలాల్లేవు. కానీ క్షణికావేశమే నిండు ప్రాణాన్ని బలితీసింది. అమాయకుడైన హర్షవర్ధన్‌ను పొట్టనబెట్టుకుంది. ఒక్క ప్రగతి మహావిద్యాలయలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి అసహనం, క్షణికోద్రేకమే ఒకరినొకరు కొట్టుకోవడం, హత్యలకు పాల్పడటం వంటి ఘటనలకు దారితీస్తోంది. ఘర్షణకు దిగిన వారిలో ఏ ఒక్కరైనా కొద్దిగా సహనం పాటించినా ఇలాంటి దారుణానికి అవకాశం ఉండదు. సోమవారం హర్షవర్ధన్ మృతికి సంతాపంగా విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్పందించారు. జరిగిన ఘోరాన్ని తలచుకొని బాధపడ్డారు. ఈ ర్యాలీ సందర్భంగా కళాశాలకు వచ్చిన హర్షవర్ధన్ తల్లిదండ్రులు నర్సింగ్‌రావు, జయశ్రీలు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు సైతం అదే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎవ్వరితోనూ ఎలాంటి గొడవలు, ఘర్షణలకు దిగని తమ కొడుకును ఎందుకు చంపాల్సి వచ్చిందో పోలీసులు దర్యాఫ్తు చేసి చెప్పాలని కోరారు. హర్షవర్ధన్ తల్లి జయశ్రీ మాట్లాడుతూ, ‘‘ ఎవ్వరితోనూ మాట్లాడడు. తన పని తాను చేసుకుంటాడు. ఉదయం 11 గంటలకు కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం 1.30కి ఇంటికి వస్తాడు. భోజనం చేసి 2.30కి అపోలోకెళ్తాడు. తిరిగి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తాడు. అలాంటి మా బాబును అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది. వాళ్ల మధ్య ఎలాంటి పగ ఉన్నదీ మాకు తెలవాల్సి ఉంది.’’ అని అన్నారు. యాజమాన్యం బాధ్యత వహించాలి కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్ల నిర్లక్ష్యమే నా కొడుకును బలితీసుకుంది. పిల్లవాన్ని అలా కొడుతూంటే వాళ్లంతా ఏం చేశారు. ఎందుకు ఆపలేకపోయారు. మా కొడుకు చీమకు కూడా హానితలపెట్టని వాడు. అలాంటి వాన్ని చావబాదుతుంటే వాళ్లకు ఎట్లా చూడబుద్దయింది. మా వాడు అమాయకుడు. సంతాప ర్యాలీకి తరలి వచ్చిన విద్యార్థులే ఇందుకు నిదర్శనం. పోలీసులు, కాలేజీ యాజమాన్యం మాకు న్యాయం చేయాలి. - నర్సింగ్‌రావు, తండ్రి సతీష్ రిమాండ్ సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్‌రావు హత్య కేసులో సీనియర్ విద్యార్థి సతీశ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. మృతుడు హర్షవర్ధన్ తండ్రి నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. సతీష్‌ను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై 302, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్రిక్తతకు దారితీసిన శాంతి ర్యాలీ సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్ మృతికి సంతాపంగా తోటి విద్యార్థులు నిర్వహించిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం హనుమాన్టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థుల ర్యాలీ నిర్వహించేందుకు వస్తున్నారని తెలిసి సుల్తాన్‌బజార్ పోలీసులు కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ గేట్లు మూసివేసి, ర్యాలీకి అనుమతిలేదని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి బొగ్గులకుంట వరకు తరిమికొట్టారు. కాగా, కళాశాలలో ఉన్న కొంత మంది విద్యార్థులతో కళాశాల అధ్యాపకులు సంతాపసభ నిర్వహించారు. హర్షవర్ధన్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీవీ రావు పూలమాలలు వేసి, రెండు నిముషాలు మౌనం పాటించారు. హర్షవర్ధన్ మృతికి సంతాపంగా కళాశాలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించామని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో బీసీఏ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలోనే శాంతి ర్యాలీకి విద్యార్థులను అనుమతించలేదన్నారు. -
కట్టలుతెంచుకున్న ఆగ్రహం!
-
పోలీస్ కస్టడీకి హర్షవర్దన్ బృందం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : పెదవేగి మండలం దుగ్గిరాలలోని డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న టీవీ యూంకర్ యండ్రపాటి హర్షవర్దన్, అతని బృందాన్ని విచారణ నిమిత్తం ఏలూరు పోలీసులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి టూటౌన్ పోలీసులు తీసుకెళ్లారు. ఈనెల 7న ఫాదర్ బాలను బెదిరించి, రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన లూక్‌బాబు, హేలాపురి న్యూస్ విలేకరులు బోడా విజయకుమార్, దిరిసిపాముల విజయరత్నం, ఏలూరుకు చెందిన కారు విడిభాగాల వ్యాపారి అధినేత వీరంకి చిరంజీవి అనే వారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. వారిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు. ఆ తరువాత తన ఫొటోను ఒక యువతి ఫొటోతో మార్ఫింగ్ చేసి తననుంచి రూ.13 లక్షల వసూలు చేశారంటూ విజయవాడలో రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ని మిత్తం హర్షవర్దన్, అతని బృంద సభ్యులను తమ కస్టడీకి అప్పగించాలంటూ టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు సూచన మేరకు సబ్‌జైలు నుంచి పోలీసులు తీసుకెళ్లారు. -
హర్షవర్ధన్ వేషాలు ఇన్నిన్ని కావయా!!
-
వెలుగుచూస్తున్నహర్షవర్ధన్ గ్యాంగ్ ఆగడాలు
-
యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు
-
'ముండే కారులోంచి కిందకు పడిపోయారు'
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీట్లో కూర్చున్నారని బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గడ్కరీ, మరో మంత్రి హర్షవర్థన్ హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలి వెళ్లారు. ముండే మృతిపై గడ్కరీ మాట్లాడుతూ ఈరోజు ఉదయం 6.30గంటలకు ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో కారులోంచి ఆయన కిందకు పడిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయనతో పాటు సహాయకుడు, డ్రైవర్ ఉన్నట్లు తెలిపారు. ముండేను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు గడ్కరీ చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ముండే మరణవార్తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చినట్లు గడ్కరీ తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ముండే భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు పార్టీ కార్యాలయానికి తరలించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో ముండే స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ముంబయిలోని బీజేపీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతూ ముండే రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డారు. -
అబద్ధాలకోరు కేజ్రీవాల్‌పై హర్షవర్ధన్
అబద్ధాలకోరు కేజ్రీవాల్‌పై హర్షవర్ధన్ సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అబద్ధాల కోరని విధానసభలో ప్రతిపక్ష నేత హర్షవర్ధన్ ఆరోపించారు. అబ ద్ధం చెప్పకపోతే ఆయనకు తిన్నది అరగదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు సృష్టించిన రగడ కారణంగా సభలో జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టలేకపోయినట్లు కేజ్రీవాల్ గురువారం రాత్రి ఫేస్బుక్లో తెలిపారని, అయితే నిజానికి గురువారంనాటి విధానసభ ఎజెండాలో ఆ అంశమే లేదన్నారు. ఎజెండాలో జన్‌లోక్ పాల్ అంశాన్ని చేర్చనప్పుడు దానిని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారంటూ కేజ్రీవాల్ అసత్య ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ఎజెండాలో మొదటి స్థానం నుంచి ఐదోస్థానానికి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ఒత్తిళ్లకు లొంగరాదని హితవు పలికారు. సభ ఎజెండాలో జన్‌లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వం సృష్టిస్తున్న అయోమయంపై కాంగ్రెస్ సభ్యులు అర్విందర్‌సింగ్ లవ్లీ , హరూన్ యూసఫ్ మండిపడ్డారు. బుధవారం తమకు అర్ధరాత్రి అందించిన ఎజెండాలో జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడతారని ఉందని, కానీ గురువారం మధ్యాహ్నానానికి ఎజెండా మారి పోయిందన్నారు. అందులోనుంచి జన్‌పాల్ బిల్లును ఉపసంహరించారన్నారు. శుక్రవారం కూడా మరోసారి ఎజెండా మారిపోయిందని, గురువారం రాత్రి తమకు అందిన సమాచారం ప్రకారం జన్‌లోక్‌పాల్ బిల్లు ఎజెండాలో మొదటి స్థానంలో ఉండగా శుక్రవారం మధ్యాహ్నానికి ఐదోస్థానానికి మారిపోయిందని ఆయన చెప్పారు. జన్ లోక్‌పాల్ పై ప్రచారం చేసుకుంటున్న సర్కారు దానిని ఎజెండాలో ఐదో స్థానంలో ఉంచడమేమిటంటూ ఆయన ఎద్దేవా చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతులు కాంగ్రెస్ సభా పక్ష నేత హరూన్యూసఫ్తోపాటు పలువురికి అందలేదని లవ్లీ తెలిపారు. సభ ప్రారంభం కాగానే బీజేపీ, మిగతా 8వ పేజీలో ఠ ఠ7వ పేజీ తరువాయి కాంగ్రెస్ సభ్యులు సంత్ రవిదాస్ జయంతిరోజునే అసెంబ్లీ నిర్వహించడంపై అభ్యంతరం లేవనెత్తారు. సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని సభా కార్యక్రమాలను నిలిపివేయాలని కోరుతూ రామ్బీర్సింగ్ బిధూరీ నోటీసు ఇచ్చారు. కేజ్రీవాల్ సంప్రదాయాలకు తిలోకదకాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు కూడా సంత్ రవిదాస్ జయంతి రోజు సమావేశం కావడం లేదన్నారు. సభా కార్యక్రమాలను నిర్వహించడమే సంత్ రవిదాస్‌కు నిజమైన శ్ర ద్ధాంజలి అంటూ స్పీకర్ ధీర్ ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి చెందలేదు. దీనిపై కాంగ్రెస్‌కు చెందిన అర్విందర్ సింగ్ లవ్లీ, జేడీయూ సభ్యుడు షోయబ్ ఇక్బాల్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రయివేటు మెంబర్ల బిల్లులను చేపట్టే రోజని, అలాంటి రోజున ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టడంపై లవ్లీతో పాటు హర్షవర్దన్, షోయబ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ సభా సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని వారు ఆరోపించారు. దానికి స్పీకర్ ధీర్ ప్రతిస్పం దిస్తూ గతంలో శుక్రవారం రోజున ఇతర కార్యక్రమాలు జరిగాయన్నారు. శాసనసభ చరిత్రలో అటువంటి కార్యకలాపాలు జరిగిన రోజులను ఉటంకించారు. 4 మరికొంత సమయం కావాలి న్యూఢిల్లీ: మిడ్నైట్ రైడ్ వివాదంపై శుక్రవారం స్థాయీ నివేదికను ఇవ్వడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు. ఉగాండా మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమపై దాడిచేసిన వారికి సోమ్‌నాథ్ భారతి నేతృత్వం వహించినట్లు బాధితురాలైన ఉగాండా మహిళ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు సులభతరమవుతందని భావించారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా తమ పని ఎందాకా వచ్చిందో కోర్టుకు తెలపడంలో విఫలమయ్యారు. కేసుకు సంబంధించి సాక్షుల పేర్లతో కూడిన ఓ సీల్డ్ కవర్‌ను న్యాయమూర్తి చేత్నాసింగ్‌కు అందజేశారు. పూర్తిస్థాయి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కనీసం నెలరోజులైనా గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టువర్గాలు అందించిన వివరాల ప్రకారం... న్యాయమూర్తికి అందజేసిన కవర్లో దాదాపు 40 మంది సాక్షుల పేర్లున్నాయి. అందులో 12 మంది ఆఫ్రికన్ మహిళలు ఉండగా మిగతావారు స్థానికులు. ఈ 12 మంది వాంగ్మూలాలను న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఇదిలాఉండగా దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తిస్థాయి నివేదికకు నెలరోజుల సమయం పడుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 19న ఈ కేసుకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 153ఏ, 323, 354, 509, 506, 147 ప్రకారం మాలవీయనగర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఉగాండా మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. బాధితుల్లో రెండో మహిళ కూడా కోర్టును ఆశ్రయించి, ప్రత్యేక కేసు నమోదు చేయాలని కోరిందని, అయితే ఈ ఘటనను కూడా ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయాలని కోర్టు సూచిందన్నారు. -
మాది విపక్ష పాత్రే: కేజ్రీవాల్
మాది విపక్ష పాత్రే: కేజ్రీవాల్ ఢిల్లీలో ఏ పార్టీ మద్దతుతోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని జెయింట్ కిల్లర్, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆదివారం వెలువడ్డ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆప్ మట్టికరిపించిన అనంతరం మద్దతుదారులను, మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ఫలితాలను చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు స్పష్టమైన సందేశమిది. కులం, మతం, అవినీతి, నేరాలు, ధన, కండ బలాలే ఇప్పటిదాకా ఈ పార్టీలను నడిపించాయి. ఇకనైనా సంస్కరణ బాట పట్టకుంటే ప్రజలే వాటిని ఇంటికి పంపుతారు’’ అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదని, ప్రజా విజయమని అన్నారు. అవినీతిమయ రాజకీయాలకు, నీతి నిజాయితీలతో కూడిన రాజకీయాలకు మధ్య పోరాటం జరిగిందన్నారు. ఈ స్ఫూర్తితో ఢిల్లీ బయట కూడా విస్తరిస్తామని, మరింత క్రియాశీలకంగా మారతామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా అని ప్రశ్నించగా లేదని బదులిచ్చారు. తమది విధాన, సైద్ధాంతిక పోరాటమే తప్ప షీలా దీక్షిత్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వమూ లేదన్నారు. ఢిల్లీలో మోడీ ప్రభావం లేదని పేర్కొన్నారు. మూర్ఖులం: షీలా ‘మేం మూర్ఖులం, కదూ?’ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందన ఇది. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆదివారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల మనోగతాన్ని పసిగట్టలేకపోయారా అన్న ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పరాజయాన్ని అంగీకరిస్తున్నాం. పొరపాటు ఎక్కడ జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకుంటాం. 15 ఏళ్ల పాటు మాకు మద్దతుగా నిలిచినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు’’ అన్నారు. శభాష్ కేజ్రీవాల్: హర్షవర్ధన్ ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయానికి గాను అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు. తమ పార్టీకి విజయం కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమన్నారు. ఢిల్లీ సీఎంగా 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ సేవలందించారంటూ కొనియాడారు. -
ఢిల్లీ లో త్రిశంకు సభ
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు జరిపిన పలు ప్రజాభిప్రాయసేకరణల్లో వెల్లడైన విధంగానే ఢిల్లీ ఓటర్లు ‘త్రిశంకు’ తీర్పునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలతో అరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలి యత్నంలోనే 28 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 36 స్థానాలు అవసరం కాగా, బీజేపీకి 31 స్థానాలు మాత్రమే లభించాయి. మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కు ఒక స్థానం దక్కింది. అంటే, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ నాలుగు స్థానాల దూరంలో మిగిలింది. వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఈసారి అత్యంత దయనీయంగా 8 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో 25,864 ఓట్ల భారీ తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూశారు. ఆమె కేబినెట్లోని పలువురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ సైతం ప్రత్యర్థుల చేతిలో మట్టికరిచారు. ఫలితాల తీరు గమనించిన షీలా దీక్షిత్ ఆదివారం మధ్యాహ్నమే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు రాజీనామా సమర్పించారు. మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి ఏకంగా 43,150 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. ‘త్రిశంకు’ తీర్పుతో సర్కారు ఏర్పాటుపై ప్రశ్నలు...: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశంకు ఫలితాలు వెలువడటంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరేందుకు అవకాశం ఉంది. లేదా గవర్నర్ ఆహ్వానించేంత వరకు వేచి చూసే అవకాశాలూ ఉన్నాయి. అయితే, నిర్ణీత గడువులోగా బల నిరూపణ కోసం గవర్నర్ బీజేపీకి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం కాంగ్రెస్ లేదా ‘ఆప్’ నుంచి ఫిరాయింపులు లేనిదే మెజారిటీని రుజువు చేసుకోవడం బీజేపీకి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. తమకు తగినంత సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తనంతట తానుగా కోరలేనని, అయితే, ఏం జరుగుతుందో తనకు తెలియదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అన్నారు. ఎవరైనా తమంతట తాముగా తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మద్దతు కూడగట్టుకునేందుకు అడ్డదారులు తొక్కబోమని, అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చూనేందుకైనా సిద్ధపడతామని బీజేపీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే, కాంగ్రెస్ మాత్రం తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని, ‘ఆప్’కు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ప్రకటించారు. -
మంచి మ్యాజికల్ ఫిగర్ వస్తుంది
-
కృష్ణానగర్‌పై ‘దీక్షిత్’ దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ వరుస విజయాలతో పట్టుసాధించిన కృష్ణానగర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌ను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకులు వేగంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి కుమారుడు, కాం గ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ స్వయంగా చూసుకుంటున్నట్టు సమాచారం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కృష్ణానగర్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గత 20 ఏళ్లుగా వరుస విజయాలతో బీజేపీ నాయకుడుహర్షవర్ధన్ ఈ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోట గా మార్చారు. ఇక్కడ గెలిచేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు వరుసగా నాలుగుసార్లు నలుగురు కొత్త అభ్యర్ధులను బరిలోకి దించినా గెలుపు మాత్రం అందుకోలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంతా భావించారు. చివరకు ముస్లిం ఓట్లను బీఎస్పీ అభ్యర్థి కమ్రుద్దీన్ చీల్చడంతో మరోమారు ఢీలా పడక తప్పలేదు. నియోజకవర్గంలోని మూడు వార్డుల్లో స్పష్టమైన మెజార్టీ తెచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నాలుగో వార్డులో వెనుకబడడంతో స్పల్ప మెజార్టీతో హర్షవర్ధన్ నాలుగోమారు ఎమ్మెల్యే అయ్యారు. ఈమారు పార్టీ టిక్కెట్ డాక్టర్ మోం గా కు ఇస్తే తప్పక గెలుస్తామని కాంగ్రెస్ యోచి స్తోం ది.హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిం చిన వెంటనే అదే రోజు సాయంత్రం ఎంపీ సందీప్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహిం చడం గమనార్హం. స్థానిక నేత డాక్టర్ మోంగా ఇం ట్లో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు కాం గ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గెలుపునకు కీలకమైన ముస్లిం ఓట్ల నుంచి ఇతర రాజకీయ సమీకరణాలపై సందీప్ దీక్షిత్ చర్చించినట్టు సమాచారం. ‘హర్షవర్దన్.. క్షమాపణ చెప్పు’ గడచిన 15 ఏళ్లుగా ఢిల్లీలో అత్యవసర చికిత్సావిభా గం (ఐసీయూ)లో ఉందంటూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన మాటలు ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉన్నాయని, వెం టనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ పాలనను భరించలేని ప్రజలు ఆ పార్టీనే 1998 నుంచి ఐసీయూలో ఉంచారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ విమర్శించారు. అందులో నుంచి బీజేపీ బయటపడే అవకాశాలూ కనిపిం చడం లేదన్నారు. ‘ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఢిల్లీ ఒకటని పేరు వచ్చినప్పుడు వర్ధన్ అలాంటి మాటలు ఎలా అంటారు ? ఆయన మాట లు ఢిల్లీవాసులను అవమానించాయి. వర్దన్ వెంట నే క్షమాపణ చెప్పాలి’ అని షీలా దీక్షిత్ పార్లమెం టరీశాఖ కార్యదర్శి కూడా అయిన శర్మ స్పష్టం చేశా రు. కాంగ్రెస్ తన అసమర్థ పాలనతో గత 15 ఏళ్లు గా ప్రజలకు నరకం చూపిస్తోందంటూ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్ ఆరోపించారు. ఈ ఎన్నికలు ముగిసిన తరువాత బీజేపీ పని ముగిసిపోతుందని, అది వెంటిలేటర్‌పైనే జీవిస్తుందని శర్మ వ్యాఖ్యానించారు.