
పవర్ స్టార్ సినిమాకు నో చెప్పాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పనిచేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు. కానీ ఓ టాలీవుడ్ టెక్నిషియన్ మాత్రం ఈ గోల్డెన్ ఆఫర్ను కాదనేశాడు. పవన్ హీరోగా తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం, ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వేదలంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్కు హర్షవర్థన్ను రచయితగా తీసుకోవాలని భావించారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షవర్థన్.
అయితే చాలా కాలంగా దర్శకత్వం కోసం ఎదురుచూస్తున్న హర్షవర్థన్ ఇటీవలే దర్శకుడిగా తన తొలి సినిమాను ప్రారంభించాడు. దీంతో పవన్ సినిమాకు మాటలు రాసే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందట. దీంతో పవన్ సినిమాకు మరో రచయితను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. హర్షవర్దన్ దర్శకుడిగా తన తొలి సినిమా సెట్స్ మీద ఉండగానే సుధీర్ బాబు హీరోగా మరో సినిమాను ప్రకటించాడు.