పవన్ మూవీకి నో చెప్పిన బ్యూటీ! | Niveda Thomas says no to pawan kalyan project | Sakshi
Sakshi News home page

పవన్ మూవీకి నో చెప్పిన బ్యూటీ!

Published Tue, Dec 20 2016 10:01 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ మూవీకి నో చెప్పిన బ్యూటీ! - Sakshi

పవన్ మూవీకి నో చెప్పిన బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మూవీలో ఆఫర్‌ను మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ రిజెక్ట్ చేసింది. అదేంటీ.. అగ్రహీరో మూవీలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఆమె నో చెప్పడానికి కారణం లేకపోలేదు. 'జెంటిల్‌మన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి మూవీతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే తమిళంలో హిట్ మూవీ వేదలంను తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయడానికి సన్నద్ధమయ్యాడు. పవన్ సరసన కీర్తి సురేష్, శృతిహసన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

తమిళ రీమేక్ మూవీలో పవన్ చెల్లిలి క్యారెక్టర్ లో నివేదా థామస్ కనిపించనుందని వదంతులు వచ్చాయి. ఈ విషయంపై నివేదా థామస్ స్పందించారని.. స్టార్ హీరో సరసన హీరోయిన్ గా జతకట్టేందుకు ఎవరైనా ఇష్టపడతారని, చెల్లిలి పాత్ర చేసేందుకు నాకు ఇష్టం లేదు అని చెప్పేసిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరోవైపు పవన్ కాటమరాయుడు మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాటమరాయుడు తర్వాతే వేదలం రీమేక్ పై పవన్ దృష్టి సారించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement