niveda thomas
-
35ని మిస్ కాకండి : హీరో నానీ
‘‘నేను ‘35: చిన్న కథ కాదు’ సినిమా చూశాను. ఒక్కరోజు స్కూల్‌కి సెలవు పెట్టి థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూసినా ఫర్వాలేదు. ‘35’ తరహా సినిమా మాత్రం మళ్లీ రాదు. పొరపాటున కూడా మిస్ కాకండి’’ అని నానీ అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘నేను కొత్త ప్రతిభను ప్రొత్సహిస్తానని అంటున్నారు. చె΄్పాలంటే రానా ముందు నేను నథింగ్. ఏ రంగంలో ఉన్న ప్రతిభవంతుల్నైనా రానా ప్రొత్సహిస్తారు. ఇండస్ట్రీలో నాకు ఉన్న ఓ మంచి ఫ్రెండ్ రానా. యాక్టర్స్ నుంచి మంచి పెర్ఫార్మె న్స్ ను రాబట్టుకుంటాడు దర్శకుడు నందకిశోర్’’ అని అన్నారు. ‘‘నేను టెన్త్‌లో మ్యాథమేటిక్స్‌లో ఫెయిల్ అయ్యాను. 35 మార్క్స్ నాకు పెద్ద టాస్క్‌లా అనిపించేది. సినిమాలో అమ్మానాన్నలుగా విశ్వ, నివేదా బాగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లొచ్చాయి’’ అని వెల్లడించారు రానా. ‘‘ఈ సినిమా మనల్ని ప్రశ్నిస్తుంది.. ఆలోజింపజేస్తుంది’’ అని పేర్కొన్నారు ప్రియదర్శి. ‘‘థియేటర్లలో మీ పిల్లల చెవులు, కళ్లు మూయక్కర్లేదు’’ అని తెలిపారు నందకిశోర్. -
జీరోను దాటి గెలిచి తీరాలి.. ఆసక్తిగా '35–చిన్న కథ కాదు' ట్రైలర్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఉంది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలవుతోంది. నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆపై ఆలోచింపచేస్తుంది. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్... ఇలాంటి బంధాల గురించి అందంగా ఈ సినిమాలో చెప్పారు. -
నేను కాదు...సరస్వతి కనిపిస్తుంది: నివేదా థామస్
‘‘సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీతో రూపొందిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. ఈ సినిమాలో తల్లి పాత్ర చేయడానికి ఆలోచించలేదు. ఓ నటిగా అన్ని పాత్రలూ చేయాలి. ఈ మూవీలో నివేదా థామస్ కాకుండా నేను చేసిన సరస్వతి పాత్రే కనిపిస్తుంది’’ అని హీరోయిన్ నివేదా థామస్ అన్నారు. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘నంద కిశోర్ ‘35–చిన్న కథ కాదు’ కథని అద్భుతంగా రాశారు. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్... ఇలాంటి బంధాల గురించి అందంగా చెప్పారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ కె. విశ్వనాథ్‌గారి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిని కూడా ఓ పాత్రలా చూపించారు దర్శకుడు’’ అన్నారు. హేమాలాంటి కమిటీలు రావాలి: ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలో ఉండటాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. ‘అమ్మ’లో నేను ఓ సభ్యురాలిని. హేమా కమిటీ నివేదికలో వెలుగు చూసిన అంశాలు బాధాకరం. ఆ విషయాల గురించి నేను నా కుటుంబ సభ్యులతో కూడా చర్చించాను. ఈ విషయంలో డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)ని ప్రశంసించాలి. పని చేసే చోట మహిళలకు భద్రత కల్పించడం కనీస అవసరం. దీని గురించి నేనూ వినతి చేశాను. మలయాళ చిత్ర పరిశ్రమలోలాగే ఇతర ఇండస్ట్రీల్లోనూ హేమా లాంటి కమిటీలు వస్తే మంచిదే’’ అన్నారు నివేదా థామస్. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
చిన్న కథ కాదు!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి. -
కొంతకాలం గడిచింది... చివరికి..!
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలయాళ బ్యూటీ నివేదా థామస్. నాని హీరోగా నటించిన ‘జెంటిల్మన్’ (2016) మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘నిన్ను కోరి, జై లవ కుశ, బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్’ వంటి పలు సినిమాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘డాకిని శాకిని’ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు నివేద. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.‘చాలా కాలమైంది.. బట్.. చివరికి.. ’ అంటూ లవ్ ఎమోజీని జత చేసి సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు నివేద. లవ్ సింబల్ పెట్టారు కాబట్టి ఇది ప్రేమకు సంబంధించిన వార్త అని, నివేద ఎంగేజ్మెంట్ అయిందని, తన పెళ్లి కబురు గురించే ఆ పోస్టు పెట్టారని నెటిజన్లు, ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొందరేమో తన కొత్త సినిమా ప్రకటన గురించి అయి ఉంటుందని ఊహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం కొత్త సినిమాలేవీ లేకపోవడంతో నివేద పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారనే వారూ లేకపోలేదు. మరి ఆమె పోస్ట్‌కి అర్థం ఏంటి? అనేది నివేదానే చెబితేనే తెలుస్తుంది. -
ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు.. ఏం చేశారు’, ‘అలా జరగద్దు.. జరగకూడదు’ అనే డైలాగ్స్‌తో టీజర్ సాగుతుంది. టీజర్ విడుదల సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్‌ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్ పూర్తయింది. ట్రైలర్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్. హిందీ హిట్ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ రూపొందిన విషయం తెలిసిందే. చదవండి: లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ పదహారువందల మందిని ప్రేమించా' -
ఒక్క మాట వంద అర్థాలు
ఒక్క మాటలో వంద అర్థాలు దాగి ఉంటాయి. అన్ని అర్థాలను ఒక్కమాటలో చెప్పడమంటే లోకాన్ని చదివేసి ఉండాలి. సమాజాన్ని ఔపోసన పట్టి ఉండాలి. ‘మహిళ’ విషయంలో సమాజం ఎలా ఉంటుందో చెప్పకుండా చెప్పింది నివేదా థామస్. ఇటీవల ఆమె నటించిన ‘వి’ సినిమా విడుదల సందర్భంగా ఒక జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె నర్మగర్భంగా ఒక మాటన్నారు. ‘హీరోయిన్ పాత్ర రూపకల్పన అనేది చిత్ర నిర్మాత, దర్శకుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో భాషకు సంబంధం లేదు’ అన్నదామె. ఏ భాషలోనయినా హీరోయిన్ను గ్లామర్ డాల్‌గా చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆమె అన్న మాటకు చాలా ప్రాధాన్యం ఉంది. స్త్రీ విషయంలో మన సమాజం దృష్టి కోణాన్ని చెప్పారు నివేద. ఇది ఇప్పటి సంగతి మాత్రమే కాదు. అయితే ఇప్పటి అమ్మాయిలు ధైర్యంగా, తెలివిగా వ్యక్తం చేస్తున్నారంతే. ఇది సినిమాలకు మాత్రమే పరిమితమైన వివక్ష కాదు. రాజకీయరంగంలోనూ ఉందనడానికి రాజ్‌కుమారీ అమృత్ కౌర్ పెద్ద ఉదాహరణ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ఆరోగ్య మంత్రి కౌర్. ట్యూబర్ క్యులోసిస్ అసోసియేషన్, రెడ్‌క్రాస్ వంటి ఆరోగ్య సంస్థల్లో పని చేశారామె. మహిళల ఆరోగ్యం పట్ల మన సమాజం లో శ్రద్ధ లేకపోవడానికి గమనించిన ఆమె గాంధీజీ, నెహ్రూల దగ్గర ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) స్థాపన అవసరాన్ని ప్రతిపాదించారు. తర్వాత ఎయిమ్స్ స్థాపన జరిగింది. కానీ పేరు, గుర్తింపు ఆమెకు రాలేదు. అంతే కాదు... ఆ తర్వాత రాజకీయాల్లో ఆమె పేరు కనిపించలేదు, వినిపించలేదు. -
వి ఇంటికి వస్తోంది
‘‘పన్నెండేళ్లుగా నా కోసం మీరు థియేటర్‌కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మీ ఇంటికే వస్తున్నాను. మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. ‘వి’ సినిమా రిలీజ్ విషయంలో కొంచెం నెర్వస్‌గానూ అనిపిస్తోంది’’అంటూ హీరో నాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సుధీర్‌బాబు, నాని, నివేదా థామస్, అదితీ రావ్ హైదరి ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుందా? ఓటీటీలోనా? అనే సందిగ్ధం చాలా రోజులుగా ఉండేది. అయితే ‘వి’ సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలోనే (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్లు నాని స్పష్టం చేశారు. తన సోషల్ మీడియాలో నాని ఓ లేఖను షేర్ చేశారు.. దాని సారాంశం ఇలా... ‘‘నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం డిజిటల్ ఫార్మెట్లో విడుదలవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలా డిజిటల్ ఫార్మెట్లో విడుదల కావడం నాకు గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం (అభిమానులను ఉద్దేశించి). థియేటర్లు తెరుచుకోగానే ‘టక్ జగదీశ్’ సినిమాతో సిద్ధంగా ఉంటా.. ఒట్టు’’ అని నాని పేర్కొన్నారు. -
సస్పెన్స్‌కు తెరదించిన హీరో నాని
సాక్షి, హైదరాబాద్: ‘‘అదిరింది.. అయ్యో అయిపోయింది. అయితేనేం మళ్లీ మళ్లీ చూస్తా. థియేటరే మీ ఇంటికి వచ్చేస్తుంది’’ అంటూ ఫ్యాన్స్‌ను టీజ్ చేసిన నేచురల్ స్టార్ నానీ ఎట్టకేలకు ‘వి’మూవీ విడుదలకు సంబంధించిన సస్పెన్స్‌కు తెరదించాడు. ‘‘వి’ ఇంటికి వచ్చేస్తుంది’’ అని ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సెప్టెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు తాజాగా ట్వీట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం ఇలా విడుదల కావడం కూడా గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందామంటూ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖను షేర్ చేశాడు. (మళ్లీ జంటగా కనిపిస్తారా? ) ‘‘గత 12 ఏళ్లుగా నా కోసం మీరు థియేటర్‌కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీ ధన్యవాదాలు చెప్పేందుకు ఇంటికే వస్తున్నాను! మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. సినిమా రిలీజ్ విషయంలో కొంచెం నెర్వస్‌గానూ అనిపిస్తోంది. థియేటర్లు తెరచుకోగానే టక్ జగదీశ్‌తో సిద్ధంగా ఉంటా. ఒట్టు’’అంటూ ‘వి’ సినిమాను ఆదరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఇక హీరోయిన్ నివేదా థామస్ సైతం.. ‘సెప్టెంబరు 5 నుంచి వేట మొదలు’ అని మూవీ అప్డేట్ను షేర్ చేశారు. కాగా విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని‘దిల్’ రాజు నిర్మించారు. అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ కథానియకలుగా నటించిన ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో పలు చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో కొన్ని భారీ చిత్రాలు కూడా ఓటీటీలో సందడి చేశాయి. అయితే దక్షిణాదిలో ఇంత బడ్జెట్‌తో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్నతొలి భారీ ‘వి’నే కావడం విశేషం. V is coming home ❤️ September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuE — Nani (@NameisNani) August 20, 2020 -
మనాలీ పోదాం
ఫైట్ కోసం మనాలీలో మకాం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ‘వి’ టీమ్. సుధీర్‌బాబు, నాని ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో పోలీసాఫీర్ పాత్రలో సుధీర్‌బాబు, విలన్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ముఖ్యంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ మనాలీలో జరగనుంది. అక్కడ కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. -
ఓనమ్ వచ్చెను చూడు
కేరళలో సెప్టెంబర్ 10 నుంచి ‘ఓనమ్’పండుగ వేడుకలు జరుగుతున్నాయి. తెలుగువారికి సంక్రాంతి ఎలాగోమలయాళీలకు ఓనమ్ అలాగ. పూలు,ఫలాలు, పంటలు, పిండి వంటలు,పాటలు, ఆటలు, పోటీలు...ఇవన్నీ ఓనమ్ పండుగ సమయంలోకేరళ అంతటినీ కళకళలాడిస్తాయి.ఆ సినిమా తారలను కూడా. కేరళను ‘దేవుని సొంత భూమి’గా చెప్తారు. అయితే ఇది ఒకప్పుడు దేవుని వద్ద లేదు. దీని పాలకుడు అసురుడు. బలి చక్రవర్తి. అయితే అందమైన ఈ భూమి మీద దేవుడు మనసుపడ్డాడు. అందుకే వామనుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి ‘మూడు అడుగుల నేల’ అడిగాడు. మొదటి రెండు అడుగులకే మూల్లోకాలు ఆక్రమితమయ్యాయి. ఇక మిగిలింది బలి చక్రవర్తి శిరస్సే. అమిత విష్ణుభక్తుడైన బలి వామనుడి మూడవ పాదాన్ని తన శిరస్సు మీదే పెట్టమని అంటాడు. ఆ తర్వాతి కథ ఏమైనా కేరళ వాసుల విశ్వాసం ప్రకారం బలి చక్రవర్తి భక్తికి విష్ణువు మెచ్చాడని, అందువల్ల ఒక వరం ప్రసాదించాడని, ఆ వరం ప్రకారం సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి సజీవుడైన తాను పాలించిన నేలకు (కేరళ) వచ్చి ఆ ప్రాంతాన్ని చూసుకుంటాడనీ. బలి వచ్చేవేళనే ఓనమ్ పండుగ వేళ. ఇది పురాణ కథ అయితే సాంస్కృతికంగా కేరళలో ఇది పంటలు ఇంటికి చేరే వేళ కనుక దీనిని విశేషంగా జరుపుకుంటారని విశ్లేషకులు అంటారు. కేరళ ప్రకృతి సౌందర్యానికే కాదు స్త్రీ సౌందర్యానికి కూడా పెట్టింది పేరు. అందుకే అక్కడి నుంచి కె.ఆర్.విజయ, పద్మినిలతో మొదలుపెట్టి నేటి అనుపమా పరమేశ్వరన్ వరకు ఎందరో హీరోయిన్లు దక్షణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగువారి హృదయాలను దోచారు. అక్కడి నుంచి వచ్చిన శోభన, వాణి విశ్వనాథ్ దాదాపు తెలుగు హీరోయిన్ల వలే లెక్కకు మించిన సినిమాల్లో పని చేశారు. రేవతి, ఊర్వశి, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, సితార, మీరా జాస్మిన్, అసిన్, నయన తార, ప్రియమణి, శ్వేతా మీనన్, కీర్తి సురేశ్, సాయి పల్లవి, నివేదా థామస్, అమలా పాల్... వీరంతా దాదాపు తెలుగవారి ఆడపడుచులు అయ్యారు. ఇక కేరళ మూలాలు ఉన్న సమంతా ఏకంగా అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది.పండుగల్లో పురుషుల పాత్ర ఎలా ఉన్నా స్త్రీల వల్లే వాటికి అందం వస్తుంది. ఓనమ్ పండుగ నాడు సంప్రదాయ ఓనమ్ చీరను కట్టడం తప్పనిసరి అని భావిస్తారు కేరళ స్త్రీలు. అందుకు మన హీరోయిన్లు కూడా భిన్నం కాదు. ఓనం చీరకే అందం తెచ్చిన ఆ సౌందర్యాన్ని చూడండి. ఇరుగు పొరుగున మలయాళీలు ఉంటే ఓనమ్ శుభాకాంక్షలు తెలపండి. -
ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు
సినిమా: ఏ రంగంలోనైనా, ఎంత ప్రతిభ ఉన్నా, అదృష్టం చాలా ముఖ్యం. ఇప్పుడు తమ వృత్తుల్లో రాణిస్తున్న వారంతా ప్రతిభావంతులని, ఇతరుల్లో ప్రతిభ లేదని చెప్పలేం. సినిమారంగంలోకి వస్తే నటి సమంత, జ్యోతిక లాంటి తమ కంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారన్న విషయాన్ని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. నటి అనుపమాపరమేశ్వరన్ పరిస్థితి ఇక్కడ ఇదే. ఈ మలయాళ కుట్టి ప్రేమమ్ వంటి హిట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ భాషల్లోనూ అవకాశాలు వరించాయి. అలా తమిళంలో ధనుష్ వంటి స్టార్ హీరోతో కొడి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం బాగానే ఆడింది. అయితే ఆ తరువాత ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క అవకాశం రాలేదు. ఇక తెలుగులో మాత్రం అవకాశాలు వరుస కడుతున్నాయి. అలాంటిది చాలా కాలం తరువాత తమిళంలో రెండో అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ వివరాలు చూద్దాం. తెలుగులో నాని, నివేదాథామస్ కలిసి నటించిన చిత్రం నిన్నుకోరి. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. లక్కీగా ఇందులో నటి అనుపమపరమేశ్వరన్ నాయకిగా నటించే అవకాశం వరించింది. అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో నటించడం గురించి నటి అనుపమపరమేశ్వరన్ మాట్లాడుతూ కొడి చిత్రం తరువాత తమిళంలో మంచి అవకాశం రాలేదని చెప్పింది. ఇన్నాళ్లకు నిన్నుకోరి రీమేక్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అంది. ఎందుకంటే ఇందులో కథానాయకి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. అయితే తెలుగులో నటి నివేదాథామస్ చాలా బాగా నటించిందని, ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదని అంది. తనదైన స్టైల్లో తాను నటించినట్లు తెలిపింది. ఇందులో తాను భరత నాట్య కళాకారిణిగా నటిస్తున్నట్లు చెప్పింది. క్లాసికల్ డాన్స్‌ను నేర్చుకున్న తనకు ఈ చిత్రంలోని పాత్ర ప్లస్ అవుతుందని భావిస్తున్నానని అంది. పాత్రలో ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని వాటిని అర్థం చేసుకుని నటిస్తున్నట్లు అనుపమా పరమేశ్వరన్ చెప్పింది. చూద్దాం ఈ చిత్రం అయినా ఈ భామను కోలీవుడ్‌లో నిలబెడుతుందేమో. -
ఆ అవకాశాలు పోయినా చింత లేదు: నివేదా
తమిళసినిమా: బాలనటిగా పరిచయమై కథానాయ కి స్థాయికి ఎదిగిన నటీమణుల్లో నివేదా థామస్ ఒకరు. బాల తారగా సుమారు పుష్కరం కాలం పాటు నటించి ఈ మధ్యనే నాయకిగా ప్రమోట్ అయిన ఈ కేరళా కుట్టి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మూడు భాషల్లో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది మాత్రం టాలీవుడ్‌నే. మాలీవుడ్‌లో 2003లోనే బాలనటిగా రంగప్రవేశం చేసిన నివేదా థామస్ కోలీవుడ్‌లో కాదల్‌కణ్మణి, 24, కాంచన 2, మెర్శల్ వంటి చిత్రాల్లో చెల్లెలి పాత్రల్లో నటించిన నివేదాథామస్ తెలుగులో జెంటిల్మెన్ చిత్రంతో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. అక్కడ వరుసగా నిన్నుకోరి, జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి చిత్రాల్లో నటించింది. ఇలాంటి తరుణంలో చదువు కోసం చిన్న బ్రేక్ తీసుకున్న నివేదా థామస్ ఇప్పుడు పరిక్షలు రాసేసి మళ్లీ నటనపై దృష్టి సారించిందట. కమహాసన్ చిత్రం పాపనాశం చిత్రంలో ఆయనకు కూతురుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వ్యాయామ కసరత్తులే, ఆహారపు కట్టుబాట్లు పక్కన పెట్టడంతో బాగా లావెక్కిందట. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన నివేదా థామస్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదే విధంగా ఆహార నియమాలను పాటించక బరువు పెరిగిన నటి నిత్యామీనన్‌కు చాలా అవకాశాలు దూరం అయ్యాయి. అయితే నిత్యామీనన్ ఆ అవకాశాలు పోయినా చింత లేదని తెగేసి చెప్పింది. కానీ నివేదాథామస్ పరిస్థితి వేరు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి. కోలీవుడ్‌లో ఇంకా కథానాయకిగా నటించే అవకాశమే అందుకోలేదు. ప్రస్తుత రోజుల్లో సన్నగా, నాజుగ్గా ఉన్న హీరోయిన్లకే క్రేజ్. ఈ విషయాన్ని గ్రహించి నివేదాథామస్ బరువు తగ్గితే మంచిదేనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. -
నివేదా ఎంత డేర్ చేశావ్.. ఫొటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నటి నివేదా థామస్ సోషల్ మీడియా పోస్ట్ కు విశేష స్పందన లభిస్తోంది. మనం మూమూలుగానైతే పామును చూసినా వామ్మో అంటూ భయంతో పరుగులు తీస్తుంటాం. కానీ నటి నివేదా మాత్రం ఓ కొండచిలువతో హాయిగా ఆడుకుంటూ కొన్ని ఫొటోలు దిగారు. 'బాబ్రా (కొండచిలువ)ను కలిశాను. చాలా చిన్న మంచి విషయం. నేను అనుకున్నంత చిన్న విషయమేం కాదంటూ' కొండ చిలువతో దిగిన ఫొటోలను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేయగా 'ఎంత ఇష్టంగా పట్టుకున్నావ్', 'ఓ మై గాడ్', వామ్మో ఎంత ధైర్యంగా కొండచిలువను పట్టుకున్నావంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న నటి ఇలా ప్రమాదకర ప్రాణులతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా, నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఆపై నిన్నుకోరి, జైలవకుశ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించారు. మూడు ప్రాజెక్టుల్లో నివేదా నటిస్తున్నారని ప్రచారం జరగగా అందులో వాస్తవం లేదని నటి కొట్టిపారేసిన విషయం తెలిసిందే. -
చిన్న బ్రేక్ తీసుకుంటా!
తమిళసినిమా: చిన్న బ్రేక్ తీసుకుంటున్నా అంటోంది నటి నివేదాథామస్. ఈ మలయాళ కుట్టి బాల తారగానే సినీరంగప్రవేశం చేసింది. అదేవిధంగా మాతృభాష మలయాళంతో పాటు, తమిళం, తెలుగులోనూ వరుసగా నటించేస్తోంది. తమిళంలో కొన్ని చిత్రాల్లో కథానాయికగా నటించినా, ఆ మధ్య పాపనాశం చిత్రంలో కమలహాసన్ కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇకపోతే తెలుగులో మాత్రం హిట్ చిత్రాల నాయకిగా ఎదుగుతోంది. నానీకి జంటగా జెంటిల్మెన్ చిత్రంతో టాలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన నివేదాథామస్, నిన్నుకోరి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం జూలియట్ అవర్ ఆఫ్ ఇడియట్ చిత్రంలో నటిస్తోంది. మరిన్ని అవకాశాలు అమ్మడి తలుపులు తడుతున్నా నో చెబుతోందట. కారణం తనకు చిన్న గ్యాప్ కావాలి అంటోందట. ఎవరైనా కథానాయకిగా ఎదుగుతున్న సమయంలో వచ్చే అవకాశాలను వద్దంటారా? తాను అంటానంటోంది నివేదాథామస్. కారణం ఏమంటంటే ఈ మలయాళీ కుట్టి మనసు చదువు మీదకు మళ్లిందట. ఆర్కిటిక్ విద్యలో ఉత్తీర్ణత సాధించిన తరువాత మళ్లీ నటనపై దృష్టి సారిస్తానని అంత వరకూ తాను నటనలో చిన్న గ్యాప్ తీసుకుంటున్నానని నివేదాథామస్ అంటోంది. అంతా బాగానే ఉంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత ఈ అమ్మడికి తెలియదేమో. ఇంతకు ముందు లక్ష్మీమీనన్ కూడా నటిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మధ్యలో నిలిపేసిన చదువును పూర్తి చేయాలని నటనకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె పరిస్థితి ఏలా మారిందో తెలుసు కథా! అవకాశాల కోసం ఇప్పుడు ఎదురు చూస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా నివేదాథామస్ జాగ్రత్త పడితే ఆమెకే మంచిదంటున్నారు సినీ విజ్ఞులు. చూద్దాం నటిగా ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో. -
‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ ఆడియో లాంచ్
-
ట్రింగ్..ట్రింగ్... ట్రింగ్!!!
మూడు బెల్లులు బాగానే మోగేటట్లున్నాయి.సినిమాకి స్టార్టింగ్ బెల్... ఇంటర్వెల్ బెల్...అయిపోయిందన్న బెల్. కథకి విలన్ బెల్... హీరో బెల్...ఎంటర్టైన్మెంట్ బెల్. ఫ్యాన్ల బెల్... ప్రొడ్యూసర్ల బెల్... డిస్ట్రిబ్యూటర్స్బెల్... అన్నీ మోగేలానే ఉన్నాయి.మంచి కాన్ఫిడెన్స్‌లో ఉన్న చిన్న ఎన్టీఆర్ ఇంటర్వ్యూ అంతా బెల్లులు మోగిస్తూనే ఉన్నాడు! రెండు రోజులు ఆగితే ఈలలు మోగాలి, చప్పట్లు మోగాలి, వసూళ్లు మోగాలనే నమ్మకంతో ఉన్నారు. ► మూడు పాత్రలు చేయాలని ఈ సినిమా మొదలుపెట్టలేదు. చేద్దామని మొదలుపెడితే కాదు కూడా! కథ రాసేవాళ్లు ఉండాలి. కథ రాసుకునే కెపాసిటీ నాకుంటే?.. నేనే కథ రాసుకుని, డైరెక్షన్ చేసేవాణ్ణి. అప్పుడు ఎవరూ ఏమీ అనరు కదా! బహుశా... ఎన్టీఆరే కథ రాశాడు, డైరెక్షన్ చేస్తున్నాడనే ఫోకస్ ఎక్కువ ఉండేదేమో! ఏకేయడానికో... పొగడడానికో... అందరూ రెడీగా ఉండేవాళ్లు. అంత ప్రతిభే ఉండుంటే... ఎప్పుడో దర్శకుణ్ణి, రచయితను అయ్యేవాణ్ణి. త్రిపాత్రాభినయం చేయాలనే కోరిక ఎప్పుడూ మనసులో లేదు. ఏ సినిమా చేయాలనే మీమాంశలో కథలు వింటునప్పుడు బాబీ ఈ కథతో వచ్చాడు. తను నాకు కథ చెప్పినప్పుడే... తన మైండ్‌లో ‘జై లవకుశ’ టైటిల్ ఉంది. కథలో మూడు పాత్రలున్నాయి. ► ఎప్పట్నుంచో కల్యాణ్ అన్న, నేనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. యాదృశ్చికమో? మరొకటో? అన్నదమ్ములు కలసి చేస్తున్న సినిమాకు అన్నదమ్ముల కథే దొరికింది. మా అదృష్టమది. బయట సంస్థకి, అన్నయ్య సంస్థలో చేస్తున్న సినిమాకు తేడా ఏంటంటే... ఈ సిన్మాను మా పేరెంట్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. అందువల్ల, మాపై ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడి వల్లే ఏమో? నేనూ, అన్నయ్య, మా టీమ్ ఎక్కువ కష్టపడ్డాం. మా ఫ్యామిలీకి ఇంకా సినిమా చూపించలేదు. మీరంతా (ప్రేక్షకులు) సినిమా విడుదలైన రోజే, ఉదయమే చూస్తారు. మేం 20వ తేదీ రాత్రి చూస్తాం లేదా 21 రాత్రి చూస్తాం! ► మూడు పాత్రలు తీసి పక్కన పడేస్తే... బాబీ చెప్పిన కథే నాకు నచ్చింది. అమ్మప్రేమను చెప్పే సినిమాలు ఎన్నో చూశాం. నాన్న గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. నేనే ఓ సినిమా (నాన్నకు ప్రేమతో) చేశా. కానీ, ఎక్కడా అన్నదమ్ముల అనుబంధం గురించి పెద్దగా రాలేదు. తాతగారు చేసిన ‘భలే తమ్ముడు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో మాత్రమే అరుదుగా చూశాం. ఎప్పుడైతే అలాంటి సినిమా చేసే ఛాన్స్ నాకు వచ్చిందో? వెంటనే ఒప్పేసుకున్నా. బహుశా... నేను మా అన్నయ్యకు (కల్యాణ్‌రామ్)కు ఎక్కువ ఎటాచ్ కావడం ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం. ► ముగురిలో ‘జై’ విలన్, ‘లవ’ హీరో, ‘కుశ’ కమెడియన్ అనుకుంటే... ఈ ‘జై లవకుశ’ చిత్రకథ చెడుపై మంచి గెలవడమో? మంచిపై చెడు గెలవడమో? కాదు. ఓ తల్లి కడుపున ముగ్గురు కవలలు పుట్టారు. తల్లి కోరికకు పూర్తి విరుద్ధంగా వాళ్ల జీవితాలు తయారవుతాయి. బయట పరిస్థితుల ప్రభావం వల్ల ఓ తల్లి కన్నటువంటి కల చెదురుతుంది. ఆ తల్లి కల నిజమవుతుందా? రావణ రామ లక్ష్మణులు మళ్లీ రామ లక్ష్మణ భరతులు అవుతారా? అనేది కథ. ఇదొక ఎమోషనల్ డ్రామా. అమ్మగా పవిత్రా లోకేష్ బాగా చేశారు. ► మీకు నచ్చిన పాత్ర ఏది? అని ఎన్టీఆర్‌ను అడిగితే... ‘‘ఒక పాత్ర పేరు చెబితే పక్షపాతం అవుతుంది. దేని గురించైనా మనం ఎక్కువ కష్టపడితే.. దానిపై ఇష్టం పెరుగుతుందని చెబుతారు. ‘జై’ కోసం ఎక్కువ కష్టపడ్డా కాబట్టి ఆ పాత్రంటే నాకిష్టం! కానీ, మూడు పాత్రల్లో ఏ ఒక్కటి తీసేసినా కథకు పరిపూర్ణత ఉండదు. ‘కుశ’ పాత్ర ఎక్కడో ‘యమదొంగ’లో నేనే చేసినట్టు, ‘లవ’ పాత్ర ‘నాన్నకు ప్రేమతో’లో నేనే చేసినట్టుంటుంది. ఆ రెండు పాత్రలకు రిఫరెన్సులున్నాయి. ‘జై’ పాత్రకు లేదు. పైగా ఇది నెగటివ్ షేడ్ క్యారెక్టర్. దాంతో నా కష్టం ఎక్కువైంది. విలన్‌గా చేయడం నచ్చింది. ► మెంటల్లీ, ఫిజికల్లీ బాగా ఎక్కువ కష్టపెట్టిన చిత్రమిది. టెక్నాలజీ ఎంత పెరిగినా నటించాల్సింది నేనే కదా! నటనలో టెక్నాలజీ లేదు కదా! నటీనటులు ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్‌ను ఫాలో కావల్సిందే. అందుకే, నా హోమ్‌వర్క్ నేను చేశా. ఒక్కోరోజు మూడు పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా ‘జై’ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమే పట్టింది. అదృష్టవశాత్తూ... నాకు ‘బిగ్ బాస్’ కొంచెం హెల్ప్ చేసింది. వీకెండ్లో ‘బిగ్ బాస్’కి వెళ్లినప్పుడు నాలా నేను ఉండేవాణ్ణి. ఈ సినిమా ఎంత ఇబ్బంది పెట్టినా... ఇలాంటి అవకాశం ఇంకెవరికి వస్తుందనే ఆశతో చేశా. నేనేంటో నిరూపించుకోవాలనుకున్నా. అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి. ► నాకు తాతగారి (ఎన్టీఆర్) ‘భలే తమ్ముడు’ సినిమా బాగా ఇష్టం. అందులో ఆయన విలన్ని కూడా హీరోలా ప్రజెంట్ చేయగలిగారు. ఆయన ఆహార్యంతో, రూపురేఖలతో, నటనతో! రామారావుగారు రెండు వేషాలు వేస్తే మనం ఇంకెవర్నీ చూడం. ఆయన్నే చూస్తుంటాం. ఎక్కడో నా మనసులో దాగున్న ఈ విషయాలన్నీ ‘జై లవ కుశ’ చేసేలా చేశాయి. ‘దానవీరశూరకర్ణ’ మాకు స్ఫూర్తే. కానీ, కథ ప్రకారం కాదు. కృష్ణుడి నుంచి దుర్యోధనుడికి, దుర్యోధనుడి నుంచి కర్ణుడి పాత్రకు ఎలా షిఫ్ట్ అయ్యారు? పాత్రల మధ్య ఎలాంటి డిఫరెన్స్ చూపించారు? ఎలా బ్యాలెన్స్ చేశారు? అనేవి మాకు స్ఫూర్తిగా నిలిచాయి. ► ‘జై’ పాత్ర కోసం నత్తితో మాట్లాడడానికి కోచింగ్ తీసుకున్నారా? అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా... ‘‘నథింగ్! కోచింగ్ సిస్టమ్‌ను నమ్మను. నత్తి అంటే ఏంటి? మనం ఏం మాట్లాడాలో మన మైండ్‌కి తెలుసు. కానీ, మైండ్ మనల్ని బ్లాక్ చేస్తుంది. ఓ పదాన్ని పూర్తిగా పలకనివ్వకుండా బ్లాక్ చేస్తుంది. సాధారణంగా నత్తిగా మాట్లాడాలంటే ‘ద్ద... ద్ద... ధైర్యం’ అనాలి. అలా కాకుండా ధైర్యంలో ‘ద’ను మింగేసి ‘ద్ధ... ద్ధ... ఐర్యం’ అని పలికా’’ అన్నారు. ► భవిష్యత్తుల్లో రాజకీయాల్లోకి నేను రావొచ్చు. రాకపోవచ్చు. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడం ఇష్టం లేదు. ఒకవేళ మాట్లాడితే తొందరపాటు అవుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి వెళ్తున్న దారిలోంచి కొంచెం పక్కకు వెళ్తాడు. నేనూ వెళ్లాను (రాజకీయాలను ఉద్దేశించి). అయితే మళ్లీ సరైన దారిలోకి రావడం నా అదృష్టం. నా ఫ్యాన్స్ వల్ల, దర్శకుల వల్ల నేను వెనక్కి రాగలిగా. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నా. ► తాతగారి లెగస్సీని సినిమాల్లో ముందుకు తీసుకువెళ్తున్నానని అనుకుంటారా? అని ఎన్టీఆర్‌ని అడగ్గా... ‘‘ముందు నేను లెగస్సీని నమ్మను. వారసత్వం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నేను హీరోనని... రేపు కచ్చితంగా నా కొడుకు (అభయ్‌రామ్) హీరో కావాలంటే కుదరదు. సినిమా వాతావరణంలో పెరగడం వల్ల తను సహజంగా ఈ రంగం పట్ల ఆకర్షితుడు కావొచ్చు. అంతే తప్ప... నేను మాత్రం అభయ్‌ను ఫోర్స్ చేయను. మా నాన్నగారు, అమ్మగారు నన్ను హీరో అవ్వమని ఫోర్స్ చేయలేదు. హీరో అవ్వాలని నాకు అనిపించింది. అయ్యాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 25 నుంచి 30 మంది హీరోలున్నారు. అందరికీ వారసత్వం ఉందా? ప్రతిభే ఇక్కడ మాట్లాడుతుంది. నేను దాన్నే నమ్ముతా’’ అని చెప్పారు. అభయ్‌కి జై నచ్చాడు! ‘మా అబ్బాయి అభయ్‌కి ‘జై’ బాగా నచ్చేశాడు. ‘జై జై రావణా...’ అని పాడుతున్నాడు. మా అమ్మగారు ఇప్పట్నుంచి వాడికి రామాయణ, మహాభారత ఇతిహాసలను వివరించి చెబుతున్నారు. దాంతో అభయ్‌కి కొంచెం కొంచెం అవగాహన ఏర్పడుతోంది. ఒక్క మాస్క్ కూడా వాడలేదు! ఇందులో మూడు పాత్రలు చేశా. ఒక్కో ఫ్రేమ్‌లో మూడు లేయర్స్ ఉంటాయి. ఫోకస్ లేయర్ ఒకటి. నాన్ ఫోకస్ లేయర్స్ రెండు. మూడుసార్లు షూటింగ్ చేయడం ఎందుకు? నాన్ ఫోకస్ లేయర్స్‌కి మాస్కులు వేయొచ్చు కదా అనే ఆలోచనతో హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్‌వెల్‌ని పిలిచాం. ప్రోస్థెటిక్ మేకప్ మాస్కులను రెడీ చేయించాం. కానీ, చివరకు ఒక్క మాస్క్ కూడా వాడలేదు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ రెండుంటే రెండు, మూడుంటే మూడు పాత్రలను నేనే చేశా. డూప్‌లను పెట్టి మేనేజ్ చేయలేదు. బాబీ సత్తా ఉన్న దర్శకుడు! రచయితగా బాబీ ఎన్నో సినిమాలు రాశాడు. తనకు కొత్తగా అర్హతలు ఏవీ అవసరం లేదు. దర్శకుడిగా తను తీసిన రెండు సిన్మాల్లోనూ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెంటాస్టిక్. హిట్టూఫ్లాపులు పక్కన పెడితే... దర్శకుడిగా తనలో సత్తా ఉంది. నిరూపించుకున్నాడు కూడా. ఎక్కడా అతన్ని ప్రశ్నించే ఇది లేదు. కానీ, తనకు కావల్సిన సపోర్ట్‌ని ఇవ్వడంలో మాత్రం కల్యాణ్ అన్న ఫెంటాస్టిక్! మూడు పాత్రలను డీల్ చేయాలి కాబట్టి... మంచి టెక్నీషియన్లను కల్యాణ్ అన్న సినిమాకు తీసుకున్నారు. ఇది బాబీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. నటుడిగా నాకు, నిర్మాతగా అన్నయ్యకు కూడా! నేను బాక్సాఫీస్ రిజల్ట్స్ గురించి, కలెక్షన్స్ గురించి మాట్లాడడం లేదు. మాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొస్తుందనే అంశం గురించే చెబుతున్నా! నేను టీచర్ని కాదు! ‘మీరు ఇంత బాగా నటిస్తారు కదా! టిప్స్ చెప్పండి’ అని నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు. నేను టీచర్ని కాదు, ఇంకా లెర్నర్నే. ఎవరికైనా ఎలా నటించాలో మనం ఎలా చెప్పలగం? అసలు, ‘ఎవరైనా మొదటిసారి ఎప్పుడు నటించుంటారో తెలుసా?’ ఒక్కసారి ఆలోచించండి. తల్లితండ్రులకు అబద్ధం చెప్పినప్పుడు. ‘లేటుగా వచ్చావేంటి?’ అని ఇంట్లో అడగ్గానే... ఈ సిట్యువేషన్ లోంచి ఎలాగైనా బయటపడాలని అబద్ధాన్ని ఎంతో అందంగా చెబుతాం కదా. నటనంటే అదేనని నా ఫీలింగ్. నో ఫైనాన్షియల్ డిస్కషన్స్! ఇప్పటివరకూ కల్యాణ్‌రామ్ నిర్మించిన సినిమాలు ఆయనకు నష్టాల్నే మిగిల్చాయి. ‘జై లవకుశ’తో ఆయన గట్టెక్కేశారు! అనే వార్తలపై ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా... ‘‘కల్యాణ్ అన్న కష్టాల్లో ఉన్నారు! నాతో సినిమా చేసి ఆయనకు సుఖం వచ్చేసింది’ అనుకోవడం లేదు. అలాంటి చర్చ గురించి కామెంట్ చేయాల్సిన అవసరమూ లేదనుకుంటున్నా. అన్నయ్య కష్టాల్లో ఉంటే ఇన్ని సినిమాలు ఎలా నిర్మిస్తాడు? ‘జై లవకుశ’ ఎలా తీస్తాడు? సింపుల్ లాజిక్... ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ లేవనుకోండి! నాకు మూడు సూపర్‌హిట్స్ ఉండవు. అయినా సినిమాలు చేస్తా కదా! ఆయనేంటో నాకు తెలుసు’’ అన్నారు. ‘కల్యాణ్‌రామ్‌కి, మీకు మధ్య ఫైనాన్షియల్ డిస్కషన్స్ జరగలేదా?’ అనడిగితే ‘‘ఏ సినిమాకీ దర్శక–నిర్మాతలతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేయను. వేరే నిర్మాతలతోనే డిస్కస్ చేయనప్పుడు అన్నయ్యతో ఎందుకు చేస్తా’’ అన్నారు. దర్శకుడి సలహాతోనే... తమన్నా ముందు నుంచి స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తున్నారు. ‘ఊసరవెల్లి’ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆమెతో నేను వర్క్ చేశా. అయితే... ఈసారి స్పెషల్ సాంగ్ చేశా. ‘జనతా గ్యారేజ్’లో కాజల్‌తో కలసి స్టెప్పులేశా. ఈసారి తమన్నాతో చేస్తే బాగుంటుందని దర్శకుడు సలహా ఇవ్వడంతో ఆమెను తీసుకున్నాం! పాట కూడా బాగా వచ్చింది. హీరోయిన్లుగా నటించిన రాశీఖన్నా, నివేథా థామస్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే... ఒక్కో రోజు మూడు పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు నేనెప్పుడైనా డల్ అయితే వాళ్లు ఎంతో ఉత్సాహపరిచేవారు. -
జై.. లవ.. కుశతో స్పెషల్ సాంగ్‌లో?
‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్’ చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో దుమ్ము రేపారు మిల్కీ బ్యూటీ తమన్నా. తాజాగా ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జై లవకుశ’ సినిమాలోనూ ఆమె ఓ ప్రత్యేక పాట చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ తొలిసారి మూడు పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రంలో ఉన్న ఓ ప్రత్యేక పాటను తమన్నాతో చేయిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. తమన్నాని సంప్రదించగా, నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కాగా, ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో ‘పక్కా లోకల్’ పాట తమన్నా చేస్తారంటూ వార్తలొచ్చినా, కాజల్ చేశారు. అప్పుడు మిస్ అయిన అవకాశం ‘జై లవకుశ’తో మిల్కీ బ్యూటీకి దక్కిందని బోగట్టా. -
గుండె పిండేస్తున్న నాని 'అడిగా.. అడిగా..'
-
గుండె పిండేస్తున్న నాని 'అడిగా.. అడిగా..'
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు. 'నేను లోకల్' అంటూ హిట్ కొట్టిన నాని.. ‘నిన్నుకోరి’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని, నివేదా థామస్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో ‘నిన్నుకోరి’ మూవీ నుండి ‘అడిగా అడిగా’ సాంగ్‌ను ట్వీటర్ ద్వారా రిలీజ్ చేశాడు నాని. చిత్ర ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఈ సాంగ్ మెలొడీ ప్రేమికుల మతి పోగొడుతోంది. పోస్టు చేసి 24 గంటలు గడవక ముందే ఐదున్నర లక్షల వ్యూస్ వచ్చాయి ఈ పాటకు. ఈ పాటకు గోపీ సుందర్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయగా శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. -
పవన్ మూవీకి నో చెప్పిన బ్యూటీ!
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మూవీలో ఆఫర్‌ను మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ రిజెక్ట్ చేసింది. అదేంటీ.. అగ్రహీరో మూవీలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఆమె నో చెప్పడానికి కారణం లేకపోలేదు. 'జెంటిల్మన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి మూవీతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే తమిళంలో హిట్ మూవీ వేదలంను తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయడానికి సన్నద్ధమయ్యాడు. పవన్ సరసన కీర్తి సురేష్, శృతిహసన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమిళ రీమేక్ మూవీలో పవన్ చెల్లిలి క్యారెక్టర్ లో నివేదా థామస్ కనిపించనుందని వదంతులు వచ్చాయి. ఈ విషయంపై నివేదా థామస్ స్పందించారని.. స్టార్ హీరో సరసన హీరోయిన్ గా జతకట్టేందుకు ఎవరైనా ఇష్టపడతారని, చెల్లిలి పాత్ర చేసేందుకు నాకు ఇష్టం లేదు అని చెప్పేసిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరోవైపు పవన్ కాటమరాయుడు మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాటమరాయుడు తర్వాతే వేదలం రీమేక్ పై పవన్ దృష్టి సారించనున్నాడు. -
పవర్ స్టార్‌కు నో చెప్పిన హీరోయిన్ ?
-
ఎన్టీఆర్ సినిమాలో 'జెంటిల్మన్' బ్యూటి
ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న మళయాలి ముద్దుగుమ్మ నివేదా థామస్. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నివేదా. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న ఈ భామ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. అందం, అభినయం రెండు ఉండటంతో స్టార్ హీరోలు కూడా నివేదాతో జతకట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది నివేదా. పస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న జూనియర్, ఆ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో నటించనున్నాడు. హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నివేదా థామస్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే నివేధా పాత్రపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
'జెంటిల్మన్' మూవీ రివ్యూ
టైటిల్ : జెంటిల్మన్ జానర్ : థ్రిల్లర్ తారాగణం : నాని, నివేదా థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాధ్ వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నాని హీరోగా, అతడిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్మన్. వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న నాని ఈ సినిమాతో కూడా మరోసారి అదే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ టైమ్ నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో నాని కనిపించటంతో, పాటు దర్శకుడు మోహనకృష్ణ కూడా తొలిసారిగా థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను డీల్ చేశాడు. మరి ఈ ఇద్దరి ప్రయత్నం ఫలించిందా..? నాని జెంటిల్మన్గా అభిమానులను మెప్పించాడా.? కథ : జయరామ్ ముళ్లపూడి (నాని) చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకున్న పెద్ద బిజినెస్ మన్, జైగౌరీ కంపెనీ అధినేత. మంచి బిజినెస్ మన్ గానే కాదు.. మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా ఐశ్వర్య(సురభి)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్‌ని కలవటానికి లండన్ వెళుతుంది ఐశ్వర్య. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్‌లో కలిసిన క్యాథరిన్(నివేదా)కు కొద్ది సమయంలోనే మంచి స్నేహితురాలవుతుంది. ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరామ్, అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్(నాని) లాగే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్, గౌతమ్‌ను చంపింది ఎవరో కనిపెట్టిందా..? అసలు జయరామ్‌కు, గౌతమ్‌కు సంబంధం ఏంటి..? నిజంగా నాని హీరోనా..? విలనా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : జయరామ్‌గా రిజర్వర్డ్గా, గౌతమ్‌గా ఎనర్జిటిక్‌గా రెండు పాత్రల్లోనూ నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాని నేచురల్ స్టార్‌గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ ఆకట్టుకుంది. బాయ్ ఫ్రెండ్‌ను పొగొట్టుకొని, ఆ బాధలోనే అతని మరణం వెనక రహాస్యాన్ని ఛేదించే అమ్మాయిగా మంచి నటన కనబరిచింది. సురభి పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో అందంతో అభినయంతో మెప్పించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ రోటీన్ కు భిన్నంగా కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రలలో రోహిణి, తనికెళ్ల భరణి, ఆనంద్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్‌లు తమ పరిధి మేరకు పాత్రలకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తరువాత లాంటి క్లాస్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తొలిసారిగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా తనకు బాగా పట్టున్న క్లాస్ ఫార్మాట్లో నడిపించిన మోహనకృష్ణ, సెకండ్ హాఫ్‌లో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ముఖ్యంగా నాని పాత్రను మలచిన తీరు ఆకట్టుకుంటుంది. లాస్ట్ సీన్ వరకు అభిమానులను కట్టి పడేసేలా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు మోహనకృష్ణ. సినిమాకు మరో ప్లస్ పాయింట్ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఇంట్రస్టింగ్‌గా మలిచాడు, అయితే పాటల విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. పిజి విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచాయి. ప్లస్ పాయింట్స్ : నాని పర్ఫామెన్స్ స్క్రీన్‌ప్లే నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ పాటలు ఓవరాల్‌గా జెంటిల్మన్ నాని స్థాయిని పెంచే పర్ఫెక్ట్ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
డబుల్ రోల్‌తో నాని 'ధమాకా'!
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. ఎవడే సుబ్రహ్మణ్యం, భలేభలే మగాడివోయ్ చిత్రాలతో విజయాన్నందుకున్న ఈ హీరో.. తాజాగా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతోనూ మంచి వసూళ్లే రాబడుతున్నాడు. ఈ సినిమా పట్ల హిట్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాలో డబుల్ రోల్‌తో డబుల్ 'ధమాకా' ఇవ్వడానికి నాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు 'ధమాకా' అని టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణతో చాలాకాలం తర్వాత నాని మళ్లీ సినిమా చేస్తున్నాడు. 'అష్టాచెమ్మా' లాంటి హిట్ సినిమాతో నాని చిత్రసీమకు పరిచయం చేసింది మోహనకృష్ణనే. వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదిత థామస్, సురభి హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం. నివేదిత చివరిసారిగా కమలహాసన్ 'పాపనాశనం' చిత్రంలో కనిపించగా.. 'ఎక్స్‌ప్రెస్ రాజా'గా సురభి విజయాన్నందుకుంది. -
ప్రేమను కూడా అమ్మేస్తాడా?
దేన్నయినా అమ్మేయగల సమర్థుడు ఆ యువకుడు. ఒకానొక దశలో తన ప్రేమను కూడా అమ్మేయాల్సివస్తుంది. ఇలాంటి ఆసక్తికర కథాంశంతో నవీన్‌చంద్ర, నివేదా థామస్ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. అజయ్ వొద్దిరాల దర్శకునిగా పరిచయం అవుతున్నారు. కె.రఘుబాబు, కేబీ చౌదరి నిర్మాతలు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి అనురాగ్ కెమెరా స్విచాన్ చేయగా, సుకుమార్ క్లాప్ ఇచ్చారు. టి.ప్రసన్నకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఆర్య’ నుంచి ‘ఆర్య-2’ వరకూ తన వద్ద అజయ్ సహాయకునిగా పనిచేశాడని, తనది అద్భుతమైన జడ్జిమెంట్ అని సుకుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. వాణిజ్య అంశాలను మేళవించిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కించనున్నానని దర్శకుడు చెప్పారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా నిర్మించనున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తన పాత్ర ఎనర్జి టిక్‌గా ఉంటుందని నవీన్ చంద్ర చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రతీష్ వేగా, పాటలు: సిరివెన్నెల.