టాలీవుడ్ నటి నివేదా థామస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నటి నివేదా థామస్ సోషల్ మీడియా పోస్ట్ కు విశేష స్పందన లభిస్తోంది. మనం మూమూలుగానైతే పామును చూసినా వామ్మో అంటూ భయంతో పరుగులు తీస్తుంటాం. కానీ నటి నివేదా మాత్రం ఓ కొండచిలువతో హాయిగా ఆడుకుంటూ కొన్ని ఫొటోలు దిగారు. 'బాబ్రా (కొండచిలువ)ను కలిశాను. చాలా చిన్న మంచి విషయం. నేను అనుకున్నంత చిన్న విషయమేం కాదంటూ' కొండ చిలువతో దిగిన ఫొటోలను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేయగా 'ఎంత ఇష్టంగా పట్టుకున్నావ్', 'ఓ మై గాడ్', వామ్మో ఎంత ధైర్యంగా కొండచిలువను పట్టుకున్నావంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న నటి ఇలా ప్రమాదకర ప్రాణులతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా, నాని హీరోగా నటించిన జెంటిల్‌మెన్ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఆపై నిన్నుకోరి, జైలవకుశ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించారు. మూడు ప్రాజెక్టుల్లో నివేదా నటిస్తున్నారని ప్రచారం జరగగా అందులో వాస్తవం లేదని నటి కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment