మొసలిని మింగిన కొండచిలువ! | Python Swallows Crocodile In An Epic Battle | Sakshi
Sakshi News home page

మొసలిని మింగిన కొండచిలువ!

Jul 13 2019 8:50 PM | Updated on Jul 17 2019 2:23 PM

Python Swallows Crocodile In An Epic Battle - Sakshi

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం... చూసిన వారంతా బాబోయ్‌! అనకుండ ఉండలేరు.  కొండచిలువ మొసలికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి మొసలిపై పైథాన్‌ గెలుపు సాధించింది. ఆలివ్‌ పైథాన్‌ మంచి నీటి మొసలితో పోరాడి చివరకు దానిని పూర్తిగా మింగేసింది. ఈ పోరాట దృశ్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఓ ఫోటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించి అందులో కొన్ని ఫోటోలను జీజీ వైల్డ్‌ లైఫ్‌​ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లంతా కామెంట్లు పెట్టకుండా ఉండలేక పోతున్నారు. ‘ఇంత భయంకరమై కొండచిలువను జూలో కూడా చూడలేదని, ఇలాంటి ఘటనను దగ్గర చూసే అవకాశం కూడా ఎప్పుడు రాలేదని’ కామెంట్లు పెట్టారు. సామాజిక మాధ్యమంలో సెన్సేషనల్‌గా మారిన ఈ ఫోటోలకు ఇప్పటివరకు 23 వేల కామెంట్లు, 48 వేల షేర్లు, 23 వేల లైక్‌లు వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement