కొండచిలువ నోట చిక్కి.. షాకింగ్‌ వీడియో | Python Strangles Dog In Horrifying Video in Thailand | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 23 2018 11:02 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Python Strangles Dog In Horrifying Video in Thailand - Sakshi

ఫేస్‌బుక్‌ వీడియో ఆధారంగా దృశ్యం

ప్రాణాల కోసం ఆ మూగ జీవి పోరాటం.. ధైర్యం చేసిన ఓ బృందం సభ్యులు.. తోడుగా మరో అల్పజీవి. అంతా కలిసి కష్టపడి ఆ భారీ జీవి నుంచి దానిని విడిపించగలిగారు. అయితే చివర్లోనే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కాస్త భయానకంగా ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. 

బ్యాంకాక్‌: సుమారు 20 అడుగులపై ఉన్న ఓ భారీ కొండచిలువ ఓ నల్లకుక్క పిల్లను మింగేందుకు యత్నించింది. ముందుగా దానిని చుట్టేసి నలిపేయటం ప్రారంభించింది. అది గమనించిన కొందరు కర్రలతో విడిపించేందుకు యత్నించారు. అది సాధ్యం కాకపోవటంతో ఓ వ్యక్తి ధైర్యం చేసి దాని తోకపట్టి లాగాడు. ఇంతలో మిగతా వారు అతనితో కలవటంతో దానిని ఈడ్చి కుక్కను లాగేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న మరో చిన్న కుక్క పిల్ల మొరుగుతూ, ఆ భారీ జీవిపై దాడి చేయాలని చూసింది. చివరకు ఎలాగోలా దాని నోటి నుంచి కుక్క పిల్లను లాగిన ఆ బృందం.. పెనుగులాటలో అది చనిపోయి ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా ఆ కుక్క పిల్ల లేచి, పక్కనే ఉన్న మరో కుక్కతో సహా అక్కడ నుంచి పరిగెత్తింది. మళ్లీ పట్టేందుకు ప్రయత్నించగా వారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. చివరకు నోటి కాడ కూడు పోవటంతో ఊసురుమనుకుంటూ ఆ కొండచిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. థాయ్‌లాండ్‌లో చియాంగ్‌ మయి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ఆ కుక్కను కాపాడిన బృందాన్ని ‘ఫ్లైట్‌ ఆఫ్‌ ది గిబ్బన్స్‌’గా అధికారులు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement