horrific video
-
కెరీర్‌కు అడ్డుగా ఉందని కన్న కూతురును నాల్గో అంతస్తు నుంచి విసిరేసిన కన్న తల్లి
-
బెంగళూరు: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!
-
నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!
బెంగళూరు: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి కాసేపు నిలబడింది. గమనించిన కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్ఆర్ నగర్‌లోని అపార్ట్మెంట్లో ఈ ఘటన గురువారం జరిగినట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్ కాగా.. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా. ‘తల్లి మానసిక పరిస్థితి సహా మేము అన్ని కోణాల్లో విచారిస్తున్నాము.’ అని పేర్కొన్నారు. A woman was arrested in #Bengaluru for killing her four-year-old mentally challenged daughter by throwing her from the fourth floor of a building, police said. pic.twitter.com/S96GaVblxx — IANS (@ians_india) August 5, 2022 ఇదీ చదవండి: ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి -
ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!!
కన్నపేగు మమకారం మరిచిన ఆ తల్లి.. కర్కకశంగా వ్యవహరించింది. మూడేళ్ల బిడ్డను నిర్దాక్షిణ్యంగా ఎలుగుబంటి బోనులోకి విసిరేసింది. పదహారు అడుగుల లోపలికి పడిపోయిన ఆ బిడ్డ తలకు గాయమై.. స్పృహ కోల్పోయింది. అందరూ అరుస్తుండగా.. ఆ బిడ్డ వైపు వెళ్లింది ఓ ఎలుగుబంటి. మరి ఆపై ఏం జరిగిందంటే.. కన్నబిడ్డను చేజేతులారా చంపాలని ప్రయత్నించింది ఓ తల్లి. తాష్కెంట్ జూలో ఎలుగు బంటి ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లి.. తన బిడ్డను అందులోకి విసిరేసింది. అప్పటికే ఆమె చేష్టలు అనుమానంగా ఉండడంతో పక్కనే ఉన్న సందర్శకులు, జూ సిబ్బంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ, హఠాత్తుగా ఆమె ఆ చిన్నారిని విసిరేసింది. ఆ ఎన్‌క్లోజర్ పదహారు అడుగుల లోతు ఉండడంతో.. కింద పడ్డ బిడ్డ తలకు గాయమైంది. ఇంతలో జూజూ అనే ఎలుగుబంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి వాసన చూసింది. కానీ, అదృష్టవశాత్తూ ఏం చేయకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇంతలో ఆరుగురు జూ సిబ్బంది ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. ఆ ఎలుగు బంటిని మళ్లీ బిడ్డ దగ్గరికి వెళ్లనీయకుండా.. దారి మళ్లించారు. ఆపై బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేయగా.. బిడ్డ ప్రాణం తీసేంత కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. హత్యాయత్నం కింద నేరం రుజువైతే ఆమెకు పదిహేనేళ్ల శిక్ష పడుతుంది. తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉంది. Have You Seen This?#Tashkent, #Uzbekistan A girl survives after her mom recklessly placed her child over the security fence and she fell into a bear sanctuary at #TashkentZoo. The brown bear #Zuzu, slowly approached the girl, sniffed and walked away. pic.twitter.com/dXCZwo8YVa — Geovanni Villafañe (@RezZureKtedPoeT) January 31, 2022 -
కొండచిలువ నోట చిక్కి.. షాకింగ్ వీడియో
ప్రాణాల కోసం ఆ మూగ జీవి పోరాటం.. ధైర్యం చేసిన ఓ బృందం సభ్యులు.. తోడుగా మరో అల్పజీవి. అంతా కలిసి కష్టపడి ఆ భారీ జీవి నుంచి దానిని విడిపించగలిగారు. అయితే చివర్లోనే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. కాస్త భయానకంగా ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యాంకాక్: సుమారు 20 అడుగులపై ఉన్న ఓ భారీ కొండచిలువ ఓ నల్లకుక్క పిల్లను మింగేందుకు యత్నించింది. ముందుగా దానిని చుట్టేసి నలిపేయటం ప్రారంభించింది. అది గమనించిన కొందరు కర్రలతో విడిపించేందుకు యత్నించారు. అది సాధ్యం కాకపోవటంతో ఓ వ్యక్తి ధైర్యం చేసి దాని తోకపట్టి లాగాడు. ఇంతలో మిగతా వారు అతనితో కలవటంతో దానిని ఈడ్చి కుక్కను లాగేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న మరో చిన్న కుక్క పిల్ల మొరుగుతూ, ఆ భారీ జీవిపై దాడి చేయాలని చూసింది. చివరకు ఎలాగోలా దాని నోటి నుంచి కుక్క పిల్లను లాగిన ఆ బృందం.. పెనుగులాటలో అది చనిపోయి ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా ఆ కుక్క పిల్ల లేచి, పక్కనే ఉన్న మరో కుక్కతో సహా అక్కడ నుంచి పరిగెత్తింది. మళ్లీ పట్టేందుకు ప్రయత్నించగా వారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. చివరకు నోటి కాడ కూడు పోవటంతో ఊసురుమనుకుంటూ ఆ కొండచిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. థాయ్‌లాండ్‌లో చియాంగ్ మయి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్కను కాపాడిన బృందాన్ని ‘ఫ్లైట్ ఆఫ్ ది గిబ్బన్స్’గా అధికారులు గుర్తించారు. -
భయానకం.. కారుతో కసి తీరా 8సార్లు గుద్దించి...
బీజింగ్ : తనకు సంబంధం లేని గొడవలో చిక్కుకుని ఓ వ్యక్తి పైశాచికంగా హత్యకు గురయ్యాడు. దక్షిణ చైనాలోని చెన్ చియాంగ్జ్లో చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన భయానక వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు తన ఇంటి పక్కనే ఉండే మహిళతో కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. అది మనసులో పెట్టుకుని ఆమెపై అతను పగ పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం టాక్సీలో వెళ్తున్న మహిళను నడిరోడ్డుపై అడ్డగించి వివాదానికి దిగాడు. ఆమె ఓవైపు వాదిస్తుండగానే మధ్యలో ఓ యువకుడు కలుగజేసుకుని సర్దిచెప్పే యత్నం చేశాడు. ఇంతలో నిందితుడు జువాన్ లింగ్జి(26) మాత్రం కారును తీసి అతన్ని ఢీకొట్టాడు. ఊహించని పరిణామానికి అక్కడున్నవారంతా షాక్‌కి గురయ్యారు. అంతా తేరుకునేలోపే ఎనిమిది సార్లు కారుతో అతన్ని ఢీకొట్టాడు.నిందితుడి కారు(తెలుపు)కి, టాక్సీకి మధ్య నలిగిపోయి ఆ యువకుడు కుప్పకూలిపోయింది. వీడియోలో నిందితుడి కారుకు అంటిన రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న కొందరు అతన్ని రక్షించేందుకు యత్నించగా.. వారికి కూడా గాయాలయ్యాయి. ఈ నేరంలో నిందితుడు జువాన్ లింగ్జి(26)కు ముగ్గురు వ్యక్తులు సాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో నుంచి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హాహాకారాలతో ఉన్న ఆ దృశ్యాలు మీకోసం... -
భయానకం.. కారుతో కసి తీరా 8సార్లు గుద్ది...
-
భార్య వీడియో తీస్తుంటే భర్త సముద్రంలో పడి..
బ్యాంకాక్: ఆయన పేరు రోగర్ హుస్సే. వయసు 71 ఏళ్లు. పారాసెయిలింగ్ అంటే ఆయనకు తెగ ఇష్టం. ఏదైనా ఒకరోజు తాను పారాసెయిలింగ్ చేయాలని భార్యతో చెబుతుండేవాడు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన ఈ దంపతులు థాయిలాండ్‌కు వచ్చారు. వెంటనే బీచ్ వెళ్లగానే తన పారాసెయిలింగ్ కోరిక తీర్చుకునేందుకు రోగర్ రెడీ అయ్యారు. సెయిలింగ్‌కు ముందు ఆయనకు రక్షణగా ఉండే డ్రెస్ వేసే సమయంలో ఎంతో ఉల్లాసంగా నవ్వుతూ కనిపించారు. ఆయన భార్య స్వయంగా వీడియో తీసింది. కొద్ది సేపటి తర్వాత పారాసెయిలింగ్ శిక్షకుడు, రోగర్ కలిసి గగనతలంలో విహరించేందుకు బయలుదేరారు. సముద్రంపై బోటు వేగంగా దూసుకెళుతుండగా వారు పారాసెయిలింగ్తో సముద్రంపై ఓ వంద అడుగుల ఎత్తులో దాదాపు 30 మీటర్ల ఎత్తులో తేలియాడుతున్నారు. అయితే, అనూహ్యంగా రోగర్ అంత ఎత్తు నుంచి తాడు తెగిపోయి సముద్రంలో పడ్డారు. దాంతో వీడియో తీస్తున్న ఆయన భార్య ఖిన్నురాలైంది. సముద్రంలో ఒడ్డున ఉన్నవారంతా ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయారు. వేగంగా సముద్రంలోకి ఆయనను రక్షించేందుకు వెళ్లి బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించినా మార్గం మధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్వాస ఆగిపోయిన కారణంగానే అతడు చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పారాసెయిలింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రోగర్ భార్యనే ఈ వీడియోను సోషల్ మీడియాతో పంచుకున్నారు.