భయానకం.. కారుతో కసి తీరా 8సార్లు గుద్దించి... | China Woman Crushed 8 times killed by neighborhood | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 4 2018 1:01 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

China Woman Crushed 8 times killed by neighborhood  - Sakshi

బీజింగ్‌ : తనకు సంబంధం లేని గొడవలో చిక్కుకుని ఓ వ్యక్తి పైశాచికంగా హత్యకు గురయ్యాడు. దక్షిణ చైనాలోని చెన్‌ చియాంగ్జ్‌లో చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన భయానక వీడియో నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు తన ఇంటి పక్కనే ఉండే మహిళతో కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. అది మనసులో పెట్టుకుని ఆమెపై అతను పగ పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం టాక్సీలో వెళ్తున్న మహిళను నడిరోడ్డుపై అడ్డగించి వివాదానికి దిగాడు. ఆమె ఓవైపు వాదిస్తుండగానే మధ్యలో ఓ యువకుడు కలుగజేసుకుని సర్దిచెప్పే యత్నం చేశాడు. ఇంతలో నిందితుడు జువాన్‌ లింగ్జి(26) మాత్రం కారును తీసి అతన్ని ఢీకొట్టాడు. 

ఊహించని పరిణామానికి అక్కడున్నవారంతా షాక్‌కి గురయ్యారు. అంతా తేరుకునేలోపే ఎనిమిది సార్లు కారుతో అతన్ని ఢీకొట్టాడు.నిందితుడి కారు(తెలుపు)కి, టాక్సీకి మధ్య నలిగిపోయి ఆ యువకుడు కుప్పకూలిపోయింది. వీడియోలో నిందితుడి కారుకు అంటిన రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న కొందరు అతన్ని రక్షించేందుకు యత్నించగా.. వారికి కూడా గాయాలయ్యాయి. ఈ నేరంలో నిందితుడు జువాన్‌ లింగ్జి(26)కు  ముగ్గురు వ్యక్తులు సాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో నుంచి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

హాహాకారాలతో ఉన్న ఆ దృశ్యాలు మీకోసం... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement