
భార్య వీడియో తీస్తుంటే భర్త సముద్రంలో పడి..
ఆయన పేరు రోగర్ హుస్సే. వయసు 71 ఏళ్లు. పారాసెయిలింగ్ అంటే ఆయనకు తెగ ఇష్టం. ఏదైనా ఒకరోజు తాను పారాసెయిలింగ్ చేయాలని భార్యతో చెబుతుండేవాడు.
సముద్రంపై బోటు వేగంగా దూసుకెళుతుండగా వారు పారాసెయిలింగ్‌తో సముద్రంపై ఓ వంద అడుగుల ఎత్తులో దాదాపు 30 మీటర్ల ఎత్తులో తేలియాడుతున్నారు. అయితే, అనూహ్యంగా రోగర్ అంత ఎత్తు నుంచి తాడు తెగిపోయి సముద్రంలో పడ్డారు. దాంతో వీడియో తీస్తున్న ఆయన భార్య ఖిన్నురాలైంది. సముద్రంలో ఒడ్డున ఉన్నవారంతా ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయారు. వేగంగా సముద్రంలోకి ఆయనను రక్షించేందుకు వెళ్లి బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించినా మార్గం మధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్వాస ఆగిపోయిన కారణంగానే అతడు చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పారాసెయిలింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రోగర్ భార్యనే ఈ వీడియోను సోషల్ మీడియాతో పంచుకున్నారు.