వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. | Python And Crocodile Rescue By Forest Officials In Gujarat | Sakshi
Sakshi News home page

వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి..

Published Sat, Oct 2 2021 12:35 PM | Last Updated on Sat, Oct 2 2021 12:48 PM

Python And Crocodile Rescue By Forest Officials In Gujarat - Sakshi

గాంధీనగర్‌: భారీ వర్షాల కారణంగా ఒక్కొసారి అడవిలోని జంతువులు మానవ ఆవాసాల దగ్గరికి వస్తుంటాయని విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్‌లో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ రెండు భయంకరమైన జీవులు జనావాసాల సమీపంలోకి వచ్చాయి. ప్రస్తుతం​ ఈ క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, వడోదరకు సమీపంలో ఒక చెరువు ఉంది. ఈ క్రమంలో, అక్కడి నుంచి 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి రెండు కూడా జనావాసాల్లోకి వచ్చాయి.

వీటిని చూడగానే స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే ఆ జీవులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి కొండచిలువ, మొసలిని బంధించారు. ఆ తర్వాత వాటిని దగ్గరలోని అడవిలోకి వెళ్లి వదిలినట్లు ఫారెస్టు అధికారి అర్వింద్‌ పవార్‌ తెలిపారు. కాగా, ఆ జీవుల నుంచి ఎలాంటి అపాయం లేకుండా రెస్క్యూ సిబ్బంది పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: గోల చేయని భార్య! ప్చ్‌.. నాలుగు రోజులకే విడాకులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement