వడోదర : గుజరాత్‌లో శనివారం 10 అడుగులున్న కొండచిలువను వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన వ్యక్తి రోజు మాదిరిగానే శనివారం ఉదయం పొలం పనులు చూసుకునేందుకు తన ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. కాసేపటి తర్వాత ఏదో అలికిడయిన శబ్దం వినిపించడంతో చెట్ల పొదల్లోకి తొంగి చూడగా కొండచిలువ కనిపించింది. వెంటనే వైల్డ్ లైఫ్ రెస్క్యూకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని చెట్ల పొదలను తొలగించి 10 అడుగుల కొండచిలువను బయటికి తీశారు. తర్వాత ఆ కొండచిలువను అక్కడి అటవీ అధికారులకు అప్పజెప్పారు. కాగా,ఈ వీడియోనూ తీసిన ఒక మీడియా సంస్థ తమ ట్విటర్‌లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment