‘‘నేను ‘35: చిన్న కథ కాదు’ సినిమా చూశాను. ఒక్కరోజు స్కూల్‌కి సెలవు పెట్టి థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూసినా ఫర్వాలేదు. ‘35’ తరహా సినిమా మాత్రం మళ్లీ రాదు. పొరపాటున కూడా మిస్ కాకండి’’ అని నానీ అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘నేను కొత్త ప్రతిభను ప్రొత్సహిస్తానని అంటున్నారు.
చె΄్పాలంటే రానా ముందు నేను నథింగ్. ఏ రంగంలో ఉన్న ప్రతిభవంతుల్నైనా రానా ప్రొత్సహిస్తారు. ఇండస్ట్రీలో నాకు ఉన్న ఓ మంచి ఫ్రెండ్ రానా. యాక్టర్స్ నుంచి మంచి పెర్ఫార్మె న్స్ ను రాబట్టుకుంటాడు దర్శకుడు నందకిశోర్’’ అని అన్నారు. ‘‘నేను టెన్త్‌లో మ్యాథమేటిక్స్‌లో ఫెయిల్ అయ్యాను. 35 మార్క్స్ నాకు పెద్ద టాస్క్‌లా అనిపించేది. సినిమాలో అమ్మానాన్నలుగా విశ్వ, నివేదా బాగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లొచ్చాయి’’ అని వెల్లడించారు రానా. ‘‘ఈ సినిమా మనల్ని ప్రశ్నిస్తుంది.. ఆలోజింపజేస్తుంది’’ అని పేర్కొన్నారు ప్రియదర్శి. ‘‘థియేటర్లలో మీ పిల్లల చెవులు, కళ్లు మూయక్కర్లేదు’’ అని తెలిపారు నందకిశోర్.
Comments
Please login to add a commentAdd a comment