డబుల్ రోల్‌తో నాని 'ధమాకా'! | Telugu star Nani to play a dual role in his next? | Sakshi
Sakshi News home page

డబుల్ రోల్‌తో నాని 'ధమాకా'!

Published Sat, Feb 13 2016 8:40 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

డబుల్ రోల్‌తో నాని 'ధమాకా'!

డబుల్ రోల్‌తో నాని 'ధమాకా'!

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. ఎవడే సుబ్రహ్మణ్యం, భలేభలే మగాడివోయ్‌ చిత్రాలతో విజయాన్నందుకున్న ఈ హీరో.. తాజాగా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతోనూ మంచి వసూళ్లే రాబడుతున్నాడు. ఈ సినిమా పట్ల హిట్‌ టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాలో డబుల్‌ రోల్‌తో డబుల్ 'ధమాకా' ఇవ్వడానికి నాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు 'ధమాకా' అని టైటిల్‌ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇంద్రగంటి మోహనకృష్ణతో చాలాకాలం తర్వాత నాని మళ్లీ సినిమా చేస్తున్నాడు. 'అష్టాచెమ్మా' లాంటి హిట్‌ సినిమాతో నాని చిత్రసీమకు పరిచయం చేసింది మోహనకృష్ణనే. వీరిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదిత థామస్, సురభి హీరోయిన్‌లుగా కనిపించనున్నారని సమాచారం. నివేదిత చివరిసారిగా కమలహాసన్‌ 'పాపనాశనం' చిత్రంలో కనిపించగా.. 'ఎక్స్‌ప్రెస్ రాజా'గా సురభి విజయాన్నందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement