Surabhi
-
వేడుకగా బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లి (ఫొటోలు)
-
ప్రియుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోయిన్
ప్రముఖ హిందీ సీరియల్ నటి సురభి జ్యోతి పెళ్లి చేసుకుంది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమిస్తున్న నటుడు సుమిత్ సూరితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్ట్‌లో ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఈ శుభకార్యం జరిగింది. ప్రకృతి ఒడిలోనే వివాహం చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: 'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ))ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై తదితర సీరియల్స్‌తో సురభి గుర్తింపు తెచ్చుకుంది. సుమిత్ సూరి విషయానికొస్తే.. 30కి పైగా యాడ్స్‌లో నటించాడు. 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు.ఐదేళ్ల క్రితం హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో సురభి-సుమిత్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది మేలో తమ బంధం గురించి బయటపెట్టారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే సహనటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
Surabhi Yadav: జ్ఞాపకాలకు జీవం..
ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా మరణిస్తే వారు వాడిన వస్తువులను జ్ఞాపకంగా భద్రపరచుకుంటాం. కొందరు ఆ వస్తువులు ఎందుకులే అని ఎవరికైనా ఇవ్వటమో.. అమ్మేయడమో చేస్తుంటారు. మీరట్‌కు చెందిన సురభి యాదవ్ మాత్రం తన అత్తగారు మరణించాక ఆమె గుర్తుగా ఉన్న వస్తువులను ఉపయోగంలోకి తెచ్చి, వాటికి తిరిగి జీవం పోయాలనుకుంది. అత్తగారి జ్ఞాపకాలుగా మిగిలిన వస్తువుల్లో 300 రకాల మొక్కలను పెంచుతూ.. ఇంటికి కొత్త కళను తీసుకొచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘మా అత్తగారు కోవిడ్ సెకండ్ వేవ్‌లో పోయారు. ఆవిడ లేని మా ఇల్లు కళ కోల్పోయినట్టు.. దిగులుగా అనిపించేది. ఇంట్లో మా అత్తగారు ఉపయోగించినవి, ఆమె సేకరించిన పాత్రలు చాలా ఉన్నాయి.అవి ఆమె 30ఏళ్ల కష్టానికి ప్రతీకలు. ఆవిడ జ్ఞాపకాలు. వాటికి కొత్తరూపం ఇచ్చి రోజువారీ వాడకంలోకి తెస్తే ఆవిడ మా మధ్య తిరిగినట్టే ఉంటుంది కదా.. ఎప్పటిలాగే ఇల్లు కళకళలాడుతుంది కదా అనిపించింది. అంతేకాదు దానివల్ల ఎంతోకొంత పర్యావరణానికి మా వంతు సాయం చేసినట్టవుతుంది అనిపించింది. అందుకే మా అత్తగారి కాలంనాటి సీసాలు, పాత్రలు, లాంతర్లు, ఫ్యాన్.. వంటివాటిని అందమైన ప్లాంటర్స్‌గా మార్చాను. నాకు ఎంతో ఊరట కలిగింది. ఒక అవగాహనా వచ్చింది.దాంతో మిగిలిన వస్తువుల్లో కొన్నిటిని అందమైన బొమ్మలుగా మార్చాను. ఇంకొన్నిట్లో మొక్కలను పెంచడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్లో పూలు, కూరగాయలు సహా 300 రకాల మొక్కలున్నాయి. నేనేం పెద్ద గార్డెనర్‌ని కాదు. నాకు తోచినట్టుగా ఓ చిన్నతోటతో మా అత్తగారి ప్రపంచాన్ని సజీవంగా మార్చేశాను!’ అని చెబుతుంది సురభి యాదవ్. -
ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'ఆమెతో ఉన్నదెవరు?'
ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది.. అలా ప్రేమ పక్షులకు పెద్దలనొప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి చందన- కరణ్ శర్మ 13 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల సమ్మతితో జైపూర్‌లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మార్చిలో పెళ్లిపీటలెక్కిన ఈ జంట వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సురభి.. స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో జలకాలాటలు ఆడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.రోజుకో వ్యక్తితో..ఇది చూసిన కొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. సురభిని.. క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీగా పొరపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే నీ జీవితమే వేస్ట్ అవుతుంది. డిప్రెషన్లోకి వెళ్లిపోతావు. తను రోజుకో వ్యక్తితో ఎంజాయ్ చేస్తుంది' అని ఓ యూజర్ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరో నెటిజన్.. 'ఈమె ధనశ్రీయా? నమ్మలేకపోతున్నాను.. సారీ చాహల్.. నువ్వు ఆమెను భాగస్వామిగా ఎంచుకుని తప్పు చేశావు' అని రాసుకొచ్చాడు.చాహల్‌ను ట్యాగ్ చేస్తూ..మరో వ్యక్తి ఏకంగా చాహల్‌ను ట్యాగ్ చేస్తూ.. 'నిన్ను ట్యాగ్ చేస్తున్నందుకు వెరీ సారీ.. కానీ చూశావ్‌గా.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది. అసలు ఇలా ఎవరైనా చేయగలరా?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధనశ్రీతో ఉన్న వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఇది చూసిన నటి అభిమానులు.. ఆమె ధనశ్రీ కాదు.. నటి సురభి చందన అని కామెంట్స్‌తో క్లారిటీ ఇస్తున్నారు.సీరియల్ కెరీర్సురభి చందన విషయానికి వస్తే.. 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'ఖుబూల్ హై', 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్ చిత్రంతో వెండితెరపైనా మెరిసింది. కరణ్ శర్మ.. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే ధారావాహికలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: OTT: ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు.. వీకెండ్లో ఓ లుక్కేయండి! -
దేవుడు నాకోసమే పంపాడు, ముంబై వెళ్లిపోతున్నా: హీరోయిన్
మలయాళ హీరోయిన్ సురభి సంతోష్ పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్‌ను పెళ్లాడింది. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కొత్త లైఫ్ ప్రారంభిస్తున్న సురభికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి అనంతరం సురభి మాట్లాడుతూ.. 'మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మేము ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా నెలలు కావస్తోంది. ఒక ఆర్టిస్టును పెళ్లాడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చివరకు ఆ కల నెరవేరింది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ అతడిని కలిసినప్పుడే నచ్చేశాడు.. తర్వాత ఇద్దరం ఒకరిగురించి ఒకరం తెలుసుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లయిపోయిందని సినిమాలకు దూరంగా ఉండిపోను. తర్వాత కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను. అతడు నాకెంతో సపోర్ట్‌గా ఉంటాడు. ప్రస్తుతం నేను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను. హనీమూన్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు. అతడు నెక్స్ట్ మంత్ ఏదో షో కోసం హాంగ్‌కాంగ్ వెళ్తున్నాడు. నేనూ తనతోపాటు వెళ్తున్నాను. ఫస్ట్ టైమ్ అతడి లైవ్ షో చూడబోతున్నాను. నాకెలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్నానో అచ్చం అలాంటి మనిషినే ఆ దేవుడు నాకోసం పంపించాడు' అని సంబరపడిపోయింది. లాయర్ కాబోయి హీరోయిన్ కాగా తిరువనంతపురంలో పుట్టిపెరిగిన సురభి లాయర్ కాబోయి యాక్టర్ అయింది. బెంగళూరులో న్యాయవిద్యనభ్యసిస్తున్న సమయంలో తనకు అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీవైపు అడుగులేసింది. కుట్టనాదన్ మర్పప్పా, మై గ్రేట్ ఫాదర్, నైట్ డ్రైవ్, కినవల్లి, ఎన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ వంటి పలు చిత్రాలతో మెప్పించింది. అటు ఎల్ఎల్బీ కూడా పూర్తి చేసింది. చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్‌పై పరువునష్టం దావా! -
హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం
హీరోయిన్ సురభికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఫలితంగా గాల్లో ఉన్న విమానం కంట్రోల్ తప్పి కిందపడబోయింది. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పి..ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని సురభి ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ.. చావు నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చింది. ‘నేను విమానంలో ప్రయాణిస్తుండగా ఎప్పుడూ జరగని సంఘటన ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. నాతో పాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా చాలా భయపడ్డారు. కానీ పైలెట్ జాగ్రత్త వల్ల సురక్షితంగా ల్యాండ్ చేశారు.కానీ కొన్ని గంటల తర్వాత పైలెట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశారు. ఆ ఘటనని ఊహించుకుంటేనే భయంగా ఉంది. చావు నుంచి తప్పించుకున్నాను. జస్ట్ మిస్. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది’ అని సురభి రాసుకొచ్చింది. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది సురభి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా సురభికి తగిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ కోలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తోంది. చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తోంది. -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది? పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది.... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది. పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి. స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్‌లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు. ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది. ‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి. ‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి. -
తెలుగు ప్రేక్షకులు రియల్ సినిమా లవర్స్
సంతానం, సురభి ప్రధాన తారాగణంగా ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘డీడీ రిటర్న్స్’. ఈ చిత్రం ఈ ఏడాది జూలై 28న విడుదలై, తమిళంలో ఘన విజయం సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు కలిసి ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ పేరుతో తెలుగులో ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సంతానం మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు రియల్ సినిమా లవర్స్. ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ ఓ రోలర్ కోస్టర్ ఫన్ రైడ్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘రాజమౌళిగారి తమిళ వెర్షన్ ‘ఈగ’ సినిమాలో సంతానంగారు ఓ కీలక ΄ాత్ర చేశారు. ఆ సినిమాకు నేను డైలాగ్స్ రాశాను. దర్శకుడిగా ‘డీడీ రిటర్న్స్’ నా తొలి చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు ప్రేమ్ ఆనంద్. ‘‘మంచి కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ కోవలోనే ఈ చిత్రాన్ని ఆదరించి, విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్. -
మళ్లీ కామెడీ బాట పట్టిన సంతానం
నటుడు సంతానం ఇంతకు ముందు హర్రర్ డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందిన దిల్లుక్కు దుడ్డు, డీడీ–2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తరువాత కామెడీకి భిన్నంగా నటించిన కొన్ని చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో సంతానం మళ్లీ తనకు కలిసివచ్చిన కామెడీతోనే చేసిన చిత్రం డీడీ రిటర్న్స్. ఆర్కే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రమేష్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో సురభి హీరోయిన్గా నటించారు. నటుడు మారన్, సేతు, మొటై రాజేంద్రన్, ఫెప్సీ విజయన్, మునీష్ కాంత్, ప్రదీప్ రావత్, రెడిన్ కింగ్స్ లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రేమ్ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఆప్రో సంగీతాన్ని, దీపక్ కుమార్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సంతానం మాట్లాడుతూ.. నేను నటించిన కొన్ని చిత్రాలు సంతానం సినిమాల మాదిరిగా లేవని కామెంట్లు వినిపించాయి.. అయితే డీడీ రిటర్న్స్ పూర్తిగా సంతానం చిత్రంలా యూనిట్ సభ్యులందరి సహకారంతో రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో ఒక్కో దెయ్యం ఒక్కో విధంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. చదవండి: ఈ బస్ డ్రైవర్ బిగ్‌బాస్‌లోకి -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
హీరోయిన్ సురభి లెహంగా ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!
‘చలిగాలి చూద్దూ తెగ తుంటరీ.. (జెంటిల్మన్ సినిమా)’ అంటూ యువతను గిలిగింతలు పెట్టిన నటి సురభి పురాణిక్ గుర్తుండే ఉంటుంది.. వరుసగా మూడు సినిమాలు చేసి కాస్త స్లో అయింది. లాక్డౌన్ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది.. కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెర మీదా కనిపించబోతోంది. తన యూనిక్ స్టయిల్ కోసం ఈ స్టార్ ఏ బ్రాండ్స్‌ను అనుసరిస్తుందో చూద్దాం.. కీర్తి కదిరె హైదరాబాద్‌కు చెందిన కీర్తి కదిరె సెలబ్రిటీస్‌కు ఫేవరెట్ డిజైనర్. తన పేరు మీదే ఫ్యాషన్ లేబుల్‌ను క్రియేట్ చేసుకుంది. వెడ్డింగ్ కలెక్షన్స్‌కు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళ, ఆధునిక ప్రపంచ పోకడ.. ఈ రెండింటి పర్ఫెక్ట్ మ్యాచ్, మన్నికైన ఫాబ్రికే ఆ బ్రాండ్‌కి వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో లభ్యం. ఫాష్యన్ జ్యూయెలరీ ఇది కూడా హైదరాబాద్‌కు చెందిన బ్రాండే. వ్యవస్థాపకురాలు ఐశ్వర్య. 2017లో ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తన బ్రాండ్ జ్యూయెలరీ సేల్స్‌ను స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఇవే ఆ జ్యూయెలరీ అవుట్ లెట్స్. ఈ అవుట్ లెట్స్లాగే ఈ జ్యూయెలరీ ధరలూ అందుబాటులోనే ఉంటాయి. ఒకరకంగా అదే ఆ బ్రాండ్ వ్యాల్యూ. లెహెంగా సెట్ బ్రాండ్: కీర్తి కదిరె ధర: రూ. 1,28,000 జ్యూయెలరీ: గులాబీ రంగు ముత్యాల సెట్ బ్రాండ్: ఫ్యాషన్ జ్యూయెలరీ వెబ్ సిరీస్ ట్రెండ్ కూడా ఫాలో అవుతున్నాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ విషయంలో విజయశాంతే నాకు స్ఫూర్తి. – సురభి పురాణిక్ -
Surabhi Bharadwaj: విజయ వీచిక
సురభి తొమ్మిదో తరగతి వరకు అమ్మకూచి. ఎన్సీసీలో చేరింది... రెక్కలు విచ్చుకుంది. రైఫిల్ చేతిలోకి తీసుకుంది... టార్గెట్‌కు గురిపెట్టింది. లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా తీర్మానించుకుంది. ఆ లక్ష్యాల్లో ఓ మైలురాయి.. ప్రపంచ స్థాయి రజత పతకం జర్మనీలో ఎగిరిన త్రివర్ణ పతాకమే అందుకు నిదర్శనం. మధ్య తరగతి కుటుంబం నుంచి స్పోర్ట్స్ పర్సన్ తయారు కావడం అంటే సాధారణమైన విషయం కాదు. తనలో నేర్చుకోవాలనే తపన, సాధన చేయాలనే కసి తనలో రగిలే జ్వాలలాగ ఉంటే సరిపోదు. తల్లిదండ్రులకు కూడా అదే స్థాయిలో ఆకాంక్ష ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు ఉండాలి. పిల్లల క్రీడాసాధన, పోటీలకు తీసుకువెళ్లడం, స్కూల్లో ప్రత్యేక అనుమతులు తీసుకోవడం, మిస్ అయిన క్లాసుల నోట్స్ తయారీ వంటి పనుల కోసం పేరెంట్స్‌లో ఒకరు ఆసరా ఇవ్వాలి. కొన్ని క్రీడలకైతే ఖర్చు లక్షల్లో ఉంటుంది. స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితులుంటాయి. కఠోర సాధనకు తోడుగా ఈ సౌకర్యాలన్నీ అమరినప్పుడే క్రీడాకారులు తయారవుతారు. ఇన్ని సమ్మెట దెబ్బలకు ఓర్చి మెరిసిన వీచిక రాపోలు సురభి భరద్వాజ్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజతంతో అంతర్జాతీయ వేదిక మీద మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించింది. ఇద్దరూ షూటర్సే! ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ వరల్డ్ కప్ 2022 పోటీలు జర్మనీలోని సూల్లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన సురభి హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి విష్ణు భరద్వాజ్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి. కుటుంబంలో క్రీడానేపథ్యం లేని సురభికి రైఫిల్ షూటింగ్‌కి బీజం ఆమె చదివిన కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్ బ్రాంచ్‌లో పడింది. కుటుంబ సభ్యులతో సురభి సురభి కంటే ముందు ఆమె అక్క వైష్ణవి రైఫిల్ షూటింగ్లో చేరింది. అక్క స్ఫూర్తితో సురభి కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఢిల్లీలో ఎన్సీసీ షూటింగ్ పోటీల్లో ఇద్దరూ పాల్గొన్నారు. కేరళలో 2017లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇద్దరూ పాల్గొని నేషనల్స్‌కి క్వాలిఫై అయ్యారు. ఖరీదైన క్రీడాసాధనలో ఇద్దరిని కొనసాగించడం కష్టం కావడంతో తల్లిదండ్రులు సురభి ప్రాక్టీస్ మీద మాత్రమే దృష్టి పెట్టగలిగారు. సురభి శ్రమలో అమ్మానాన్నతోపాటు అక్క కూడా భాగం పంచుకుంటోంది. కాల పరీక్ష! సురభి డైలీ రొటీన్ ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. వార్మప్ ఎక్సర్సైజ్లు చేసుకుని ఏడు– ఏడున్నరకంతా ఇంటి నుంచి ప్రాక్టీస్ కోసం గచ్చిబౌలికి బయలుదేరుతుంది. నాగోలులో మెట్రో రైలు, ఆటోరిక్షాలు పట్టుకుని పది గంటలలోపు హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న షూటింగ్ రేంజ్‌కు చేరుకుంటుంది. పది నుంచి ప్రాక్టీస్ మొదలవుతుంది. ఒంటి గంటకు లంచ్ బ్రేక్. తిరిగి రెండున్నర నుంచి ఐదున్నర వరకు ప్రాక్టీస్, ఇంటికి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదవుతుంది. కోచ్ సూచించిన విధంగా ఆహారాన్ని సిద్ధం చేసి బాక్సులు పెడుతుంది తల్లి లావణ్య. మెట్రో లేని రోజుల్లో, సిటీ బస్సులో వెళ్లాల్సిన రోజుల్లో అయితే దినచర్య ఐదింటికే మొదలయ్యేది. సురభి షూటింగ్ ప్రాక్టీస్‌తోపాటు ఉస్మానియాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతోంది. మినిమమ్ అటెండెన్స్ చూసుకుంటూ ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కే కేటాయిస్తోంది. మెట్రోలో ప్రయాణించే సమయంలో పాఠాలను పూర్తి చేసుకుంటోంది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కాలం పరీక్షల రూపంలో ప్రత్యేక పరీక్ష పెడుతుంది. షూటింగ్ పోటీలు, కాలేజ్ పరీక్షలు ఒకే సమయంలో వచ్చాయి. దాంతో ఐదవ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయింది. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్ ఫర్ గ్లోరీ నిర్వహిస్తున్న ప్రత్యేక లీప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఖర్చు లక్షల్లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహించిన సురభి బంగారు పతకాన్ని సాధించింది. సౌత్ జోన్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో రజతాలను మూటగట్టుకుంది. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్ దాదాపుగా 30 రూపాయలవుతుంది. కాంపిటీషన్లకు ముందు ప్రాక్టీస్‌లో రోజుకు యాభై నుంచి వంద బుల్లెట్లు వాడాల్సి ఉంటుంది. బ్లేజర్, ట్రౌజర్, షూస్, గ్లవుజ్ వంటివన్నీ కలిపి రెండు లక్షలవుతాయి. ఇక సురభి ఉపయోగించే పాయింట్ టూటూ వాల్టర్ రైఫిల్ ధర ఇరవై లక్షలు ఉంటుంది. సొంత రైఫిల్ లేకపోవడంతో సురభి అద్దె రైఫిల్‌తోనే ఇన్ని పోటీల్లో పాల్గొన్నది, పతకాలు సాధించింది. ఆమె ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌కు అర్హత 2018లోనే సాధించింది. కానీ వెపన్ లేకపోవడంతో కొన్ని అవకాశాలను చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రీడాకారులను మానసిక క్షోభకు గురి చేస్తుంది. సురభి వాటన్నింటినీ నిబ్బరంగా అధిగమించింది. మంచి రైఫిల్ అమరితే దేశానికి మరిన్ని పతకాలను తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. రైఫిల్ కావాలి! కాంపిటీషన్ల కోసం కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి, ఆహారానికి అలవాటు పడడం ప్రధానం. అలాగే విండ్ అసెస్మెంట్ కూడా గెలుపును నిర్ణయిస్తుంది. మన గురి లక్ష్యాన్ని చేరడంలో అసలైన మెళకువ గాలి వీచే వేగాన్ని కచ్చితంగా అంచనా వేయగలగడమే. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో మనదేశానికి పతకాలు సాధించడం నా ముందున్న లక్ష్యం. మా పేరెంట్స్ ఇప్పటికే వాళ్ల శక్తికి మించి ఖర్చు చేసేశారు. ప్రభుత్వం కానీ ఇతర స్పాన్సర్లు కానీ వెపన్‌కి సపోర్ట్ చేస్తే నేను నా ప్రాక్టీస్ మీద పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతాను. – రాపోలు సురభి భరద్వాజ్, షూటర్, వరల్డ్ కప్ విజేత – వాకా మంజులారెడ్డి. -
సోల్ ట్రేడ్..: ఉత్తమ అత్తాకోడళ్లు
చెన్నైలోని ఎస్ఆర్యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి. నిర్మాణ్ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్ (మధ్యప్రదేశ్)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్’స్టార్టప్‌కు అంకురార్పణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్’ అంటుంది సురభి. ‘కారాగ్రీన్’ అనేది బయోడిగ్రేడబుల్ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్ పేపర్ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్ సామాగ్రిని తయారు చేస్తారు. ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి. కట్ చేస్తే... షార్క్ ట్యాంక్ ఇండియా (బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్)లో ‘కారాగ్రీన్’ 50 లక్షల ఫండింగ్ ఆఫర్‌ను గెలుచుకుంది. -
ఆది సాయికుమార్‌కు భారీ షాక్.. ‘శశి’విడులైన తొలి రోజే..
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మార్చి 19న (శుక్రవారం) ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా గత వారం మార్చి 12న విడుదలైన జాతిరత్నాలు మూవీకి షాక్‌నిస్తూ విడుదలైన తొలి రోజే పైరసి భూతం తాకింది. అయినప్పటికి బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కలెక్షన్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈసారి ‘శశీ’ మూవీకి కూడా భారీ షాక్ తగిలింది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీ పైరసీ బారిన పడింది. ఇక ఈ మూవీతో పాటు ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్లు’ సినిమాలు కూడా విడుదల కావడం.. ఇప్పుడు ఈ పైరసీ భూతం వెంటడాటంతో ‘శశి’ మూవీ టీంకు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. అంతేగాక దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై పడే ప్రమాదం ఉంది. కాగా పైరసి వెబ్సైట్లు మూవీరూల్స్, తమిళరాక్స్తో పాలు పలు పైరసి వెబ్సైట్లలో ఈ మూవీ లింకులు వచ్చేశాయి. దీంతో ప్రేక్షకుల్లో అంతగా పాజిటివ్ టాక్ లేకపోవడంతో ఈ మూవీని థీయేటర్లో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ భామకు కరోనా పాజిటివ్ పైరసీ కారణంగా రూ.2,100 కోట్ల నష్టం ‘జాతిరత్నాలు’ టీమ్‌కి భారీ షాక్ -
గ్లామర్ పాత్రలు రావడం లేదు: ‘శశి’ హీరోయిన్
‘‘శశి’ చిత్రనిర్మాతలు మొదట నాకు ఫోన్ చేసి కథ వినమన్నారు. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్ వచ్చి మూడు గంటలు ‘శశి’ కథ చెప్పారు. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యి నటించేందుకు ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ సురభి అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురభి విలేకరులతో మాట్లాడుతూ -‘‘శశి’ రెగ్యులర్ ప్రేమకథా చిత్రం కాదు. అన్ని రకాల అంశాలున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తల్లితండ్రులు, కూతురు మధ్య ఉన్న ప్రేమను ఈ చిత్రంలో బాగా చూపించారు. నిజ జీవితంలోనూ నా తల్లితండ్రులకు నేనొక్కదాన్నే కావడంతో శశి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. కూతురు పట్ల ఓ తండ్రి ఎంత రక్షణగా, బాధ్యతగా ఉంటాడన్నది ఆకట్టుకుంటుంది. నా తండ్రి పాత్రలో రాజీవ్ కనకాలబాగా నటించారు. ఈ సినిమాలో ఆది పాత్ర రగ్డ్గా ఉంటుంది. తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. నేను కూడా రెండు వేరియేషన్స్‌లో నటించడం కొత్తగా అనిపించింది. గ్లామర్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ‘ఓటర్’ సినిమాలో నాది గ్లామర్ పాత్రే. ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. ‘శశి’ సినిమా విడుదల తర్వాత నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నాను. తమిళంలో చేస్తుండడం వల్ల తెలుగులో ఎక్కువగా చేయలేకపోయా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా. తమిళంలో 3 సినిమాలు చేస్తున్నాను. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నా. గోల్డెన్ స్టార్ గణేష్‌తో నటిస్తున్నాను’’ అన్నారు. -
'శశి' ట్రైలర్ విడుదల చేసిన పవన్ కల్యాణ్
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా 'శశి' లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 'మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభవుతుంది. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం' 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆది లుక్స్ కొత్తగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. రాజీవ్ కనకాల హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. వెన్నెల కిశోర్ , తులసి, జయప్రకాష్, అజయ్, వైవా హర్ష , సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రంలోని 'ఒకే ఒక లోకం నువ్వే' పాట ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. చంద్రబోస్ రచించిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 19న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఆదికి 'శశి' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. చదవండి : (రణ్‌బీర్‌కి కరోనా... క్వారంటైన్లో ఆలియా!) (పవన్ కల్యాణ్ న్యూలుక్.. ఫొటో వైరల్) -
ఆవును సంరక్షించడంతో నా జీవితం మలుపు తిరిగింది
‘గంగి గోవు పాలు గరిటెడైనను చాలు..’ అంటూ వేమన శ్రేష్టమైన ఆవు పాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. నాటు (దేశీ జాతి) ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి సర్వోత్తమమైనవన్న భావన ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. వీటినే ‘ఎ2 మిల్క్’ అని పిలుస్తూ.. అనేక దేశాల్లో అమృతసమానంగా చూస్తున్నారు. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఎ2 పాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు ఆర్గానిక్ పాల ఉత్పత్తిని పెంపొందించి, ఎ2 పాల ఉత్పత్తులను ‘ఏపీ గోపుష్టి’ పేరుతో దేశ విదేశాల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. నాటు ఆవుల సంతతిపై అవ్యాజమైన ప్రేమతో, అనురక్తితో ‘సురభి గోశాల’ ను నిర్వహిస్తున్న వల్లూరు రవికుమార్ ఈ పథకానికి సలహాదారుగా నియమితులయ్యారు. నాటు ఆవు పాల ఉత్పత్తితో పాటు శాస్త్రీయ పద్ధతిలో సంతతిని పెంపొందించుకునే పద్ధతులపై తన సుసంపన్నమైన అనుభవాలను ఆయన ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు. దేశీ ఆవుల్లో కొన్నే ‘గంగి గోవుల’ని ఆయన సూత్రీకరిస్తున్నారు.. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వల్లూరు రవి కుమార్(47) హైదరాబాద్‌లో ఓ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు. ఒక రోజు తమ ఇంటి ఎదుట ఒక నాటు ఆవుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ ఆవును సంరక్షించి సపర్యలు చేయడంతో రవి జీవితం మలుపు తిరిగింది. తదనంతరం గుజరాత్‌లోని తోడల్లుడి దగ్గరకు వెళ్లినప్పుడు దేశీ గోజాతుల గురించి మరింత ఆసక్తి కలిగింది. దేశీ గోజాతుల సంరక్షణకు రవి కృషి అనుకోకుండా అలా ఆరంభమైంది. ఏడేళ్ల క్రితం ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వగ్రామం పేరికలపాడులో ‘సురభి గోశాల’ను రవి 4 ఆవులతో ప్రారంభించారు. 21 ఎకరాలు.. 125 ఆవులు.. సురభి గోశాలలో ఇప్పుడు 125 ఆవులు, ఆంబోతులు ఉన్నాయి అనే కంటే.. వాటితో రవి పూర్తిగా మమేకమై అనుదిన జీవనాన్ని పంచుకుంటున్నారు అంటే బావుంటుంది. 2.35 ఎకరాల్లో షెడ్లున్నాయి. వివిధ జాతుల గోవులు, ఆంబోతులకు అందులో వేర్వేరుగా ప్రత్యేక ఆవాస విభాగాలున్నాయి. పక్కనే ఉన్న 6 ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డి పెంచుతున్నారు. 45 రోజులకోసారి కోస్తూ నిరంతరం పచ్చి గడ్డి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఆవుల పేడను గుంతలో వేసి, చివికిన తర్వాత పొలాల్లో వేస్తున్నారు. గోమూత్రం బక్కెట్లతో పట్టుకుంటేనే స్వచ్ఛత, ఔషధ గుణాలు చెడకుండా ఉంటాయని రవి అన్నారు. వరి గడ్డి కొని మేపుతున్నారు. 60% పచ్చిమేత, 40ఋ% ఎండుమేత ఉండేలా చాప్ కట్టర్‌తో ముక్కలు చేసి రెండూ కలిపి ఆవులకు పెడుతున్నారు. పదెకరాల్లో సజ్జలు, పచ్చజొన్న, జె7 జొన్న, 3 ఎకరాల్లో పుల్ల శనగ, 3 ఎకరాల్లో వేరుశనగ పండించి.. దాణాకు వాడుతున్నారు. గిర్ జాతి ఆవులు ఎక్కువ సంఖ్యలో 79తోపాటు 7 ఆంబోతులు ఉన్నాయి. కాంక్రేజ్ ఆవులు 18, ఆంబోతులు 2 ఉన్నాయి. పుంగనూరు ఆవులు 3, ఒక ఆంబోతు ఉంది. రెడ్ సింధి ఆవులు 3, థార్పార్కర్ ఆవులు 3, ఒక ఆంబోతు ఉన్నాయి. 3 ఒంగోలు ఆవులు ఉన్నాయి. 115 ఆవుల్లో ఏ సీజన్లో అయినా కనీసం 30 ఆవులు పాలు ఇస్తూ ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా చూడి కట్టించడం చేస్తున్నామని రవి కుమార్ తెలిపారు. 15 చూడితో ఉంటాయి. 30 దూడలు (మూడేళ్ల లోపు) ఉంటాయి. వత్తిడి లేని గోపాలన నాటు ఆవుల పెంపకం పాల దిగుబడి వరకే పరిమితం చేసుకోకుండా దేశీ గో జాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం రవి ప్రత్యేకత. వత్తిడి లేని గోపాలన పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారు. ఆవులను వేరే ప్రాంతం నుంచి కొని తెచ్చిన తర్వాత కొత్త మనుషులకు అలవాటు పడటానికి కనీసం 15 రోజులు పడుతుంది. రైతు స్వయంగా రోజుకు కనీసం 4–5 గంటల పాటైనా ఆవులతో మమేకం అవ్వాలి. ప్రతి ఆవుకు పేరు పెట్టాలి. ఆ పేరుతోనే పిలుస్తూ గంగడోలు సవరిస్తూ ఉంటే.. కొద్ది రోజుల్లోనే నాటు ఆవులు మచ్చిక అవుతాయి. వత్తిడి నుంచి బయటపడతాయి. ఆవులను ప్రేమగా నిమరాలి. రోజూ నిమిరే వ్యక్తిని గుర్తు పెట్టుకొని.. పేరుతో పిలవగానే పరుగెత్తుకుంటూ దగ్గరకు వస్తాయని రవి తెలిపారు. ఈ అనుబంధం ఏర్పరచుకుంటే ఆవులు వత్తిడికి గురికాకుండా.. సౌమ్యంగా, ఆనందంగా ఉంటూ అధిక పాల దిగుబడినిస్తాయన్నారు. ఫ్రీ లోఫింగ్ సిస్టం జన్యు స్వచ్ఛతను పరిరక్షించుకోవడానికి ‘ఫ్రీ లోఫింగ్ సిస్టమ్’ను రవి అనుసరిస్తున్నారు. కట్టేసి మేపరు. అన్నిటినీ కలిపి ఆరు బయట తిరగనివ్వరు. అలా తిరగనిస్తే రక్త సంబంధం ఉండే ఆవులను ఆంబోతులు ‘దాటే’ అవకాశం ఉంటుంది. దాని వల్ల ‘ఇన్‌బ్రీడింగ్’ జరిగి, జన్యు స్వచ్ఛత తగ్గిపోతుంది. పిడిగ్రీ నియమాలు ఇందుకు అనుమతించవు. అంటే.. ఏ జాతికి ఆ జాతిని వేర్వేరుగా ప్రత్యేక దొడ్ల(ఎన్‌క్లోజర్)లో ఉంచుతున్నారు. పాలిచ్చే ఆవులు, 7 నెలలు నిండిన చూడి ఆవులు, 9 నెలల లోపు దూడలు, మూడేళ్ల లోపు దూడలు, ఆంబోతులు.. ఇలా విభజించి వేర్వేరు విభాగాల్లో ఉంచుతున్నారు. ప్రతి ఆవుకు 15 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా 65“60 అడుగుల విస్తీర్ణంలో దొడ్లను నిర్మించారు. నీడనిచ్చే షెడ్‌తో పాటు ఎండ తగిలే ఖాళీ ప్రదేశం కూడా ఈ దొడ్డిలో ఉంటుంది. ఆవు తన ఇష్టం మేరకు ఎండలో, నీడలో బంధించినట్లు లేకుండా తిరుగాడుతూ స్వేచ్ఛగా ఉండటం వల్ల వత్తిడి ఉండదు. 4 ఏళ్లుగా పిడిగ్రీ నమోదు రవి ఏడేళ్లుగా సురభి గోశాలను నిర్వహిస్తున్నారు. అనేక విషయాల్లో అనుభవం గడించిన తర్వాత దేశీ గోజాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ఉపక్రమించారు. గత నాలుగేళ్లుగా పిడిగ్రీ(జన్యు వంశకత)ని నమోదు చేస్తున్నారు. ప్రతి ఆవు, ఆంబోతు తల్లిదండ్రులు ఎవరు? వాటి లక్షణాలు, పాల ఉత్పత్తి సామర్థ్యం తదితర వివరాలను, వాటి ఫోటోలను శాస్త్రీయంగా నమోదు చేసి, కంప్యూటరీకరిస్తున్నారు. దేశీ గోజాతుల బ్రీడింగ్లోను, నాణ్యమైన పాల ఉత్పత్తిలోనూ రవి కుమార్ సాధించిన విజయం అసామాన్యం. పట్టుదల, శ్రద్ధ రవిని ఎ2 డెయిరీ రంగంలో విజయ తీరాలకు నడిపించాయి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ దూడలే రైతుకు ఆస్తి దేశీ గోజాతులను పెంచే రైతులకు దూడలే పెద్ద ఆస్తి అని రవి భావిస్తున్నారు. పిడిగ్రీ ప్రకారం, పోషణ లోపం లేకుండా పెంచితే మూడేళ్ల పెయ్య దూడ ఒక్కోటి రూ. లక్షకు అమ్ముడు పోతుందని, అదే రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తుందని ఆయన స్వానుభవంతో చెబుతున్నారు. దూడకు ఒకటి లేదా రెండు రొమ్ముల పాలు పూర్తిగా వదిలెయ్యాలి. ఒక నెల అటు వైపు రొమ్ములు, మరో నెల ఇటు వైపు రొమ్ములు దూడకు అలవాటు చెయ్యాలి. 3 నెలల తర్వాత దూడ పాలు తాగటం తగ్గిస్తుంది. 6వ నెల నుంచి రోజుకు కిలో దాణా పెట్టాలి. ఆవు లేదా దూడ ఆరోగ్యం ఎలా ఉందో వాటిని, పేడను చూసి తెలుసుకోగలిగే అవగాహన రైతుకు ఉండాలి. టీకాలు షెడ్యూలు ప్రకారం వేసుకుంటూ.. మూడేళ్ల వరకు దూడలను కనిపెట్టుకొని ఉండాలి. ఈనిన తర్వాత 90 రోజుల్లో ఆవును కట్టించాలి. ఏడాదికో దూడ పుట్టాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే డెయిరీ రంగంలో నష్టాలకు ఆస్కారమే ఉండదు. గంగి గోవు నెయ్యిలో ‘కెరోటిని’ 3.2% రోజుకు 240 లీటర్ల పాల దిగుబడి వస్తోంది. ఉదయం పూట పాలను విజయవాడలో ఇంటింటికీ (లీ. రూ. వంద) పంపుతున్నారు. సాయంత్రం పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయ బద్ధంగా వెన్న తీస్తారు. 40 డిగ్రీలకు మించని వేడితో కాచి నాణ్యమైన నెయ్యినిæతయారు చేస్తున్నారు (కిలో రూ. 2,700 – 3 వేలు). ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. నిబంధనల మేరకు 3 నెలలకోసారి పాలు, నెయ్యిలకు లాబ్ పరీక్షలు చేయిస్తారు. పాలలో ఎస్.ఎన్.ఎఫ్. 8–8.5%, కొవ్వు 4–4.5% వస్తుంటాయి. నెయ్యిలో ఇతర పౌష్టికాంశాలతో పాటు ‘కెరోటిని’ 3.2% ఉంటుంది. మనిషి దేహానికి విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా సమకూరేందుకు ఇది దోహపడుతుంది. ఇది గంగి గోవు నెయ్యిలోనే ఉంటుంది. గేదె నెయ్యిలో ఉండదు అన్నారు రవి. మజ్జిగను దూడలకు కుడితిలో పోస్తారు. పుల్ల మజ్జిగను పంటలపై అవసరం ఉన్నప్పుడు పిచికారీ చేస్తారు. ఆవుతో రోజూ మాట్టాడాలి! నాటు ఆవులు సున్నితంగా ఉంటాయి. కొట్టకూడదు. ముల్లుగర్రతో పొడవ కూడదు. తిట్ట కూడదు. ముక్కుతాడు, సిగమారు వెయ్యకూడదు. రైతు రోజూ 4–5 గంటలు ఆవులతో ఉండాలి. పేరుతో పిలుస్తూ ప్రతి రోజూ కొద్ది నిమిషాలు నిమరాలి. ఆవులతో మమేకం కాగలగాలి. మేత కన్నా ఈ ప్రేమ ముఖ్యం. ఇలా చేస్తుంటే ఆవుపై వత్తిడి ఉండదు. పాల దిగుబడి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలూ పెద్దగా రావు. కష్టపడే తత్వం ఉన్న రైతుకు నాటు ఆవుల గోశాల సంతృప్తిని, లాభాలను అందిస్తుంది. ఏ పేరు గల ఆవు ఎప్పుడు చూడి కట్టింది, ఏ రోజు ఎంత పాలిచ్చింది, ఆరోగ్య స్థితిగతులు.. అన్నీ రైతు స్వయంగా రోజూ డైరీలో రాసుకోవాలి. దానికి అనుగుణంగా ఏయే మార్పులు, చేర్పులు చేసుకోవాలో అర్థమవుతుంది. ఆవు ఆరోగ్య రక్షణ, మేత–దాణా లభ్యత, దూడల పోషణ, వత్తిడి లేని సంరక్షణ పద్ధతులు.. ఇవే నాటు ఆవు గోశాలల సక్సెస్ మంత్రాలు. గోశాలలో ఉన్న ఆవుల్లో మూడో వంతు ఆవులు రోజుకు 10 లీటర్ల పాలిచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. లీటరుకు రూ. 50 ధర లభిస్తే చాలు రైతు నిలబడతాడు. ఏపీ ప్రభుత్వ గో పుష్టి పథకం రైతులకు చాలా ఉపయోగకరమైనది. గోశాల వల్ల ఆర్థిక పుష్టితో పాటు సమాజంలో ఎంతో పెద్ద వారి నుంచి కూడా గౌరవ మర్యాదలు పొందుతున్నాను. భార్యా పిల్లల తోడ్పాటు నా విజయానికి మరో ముఖ్య కారణం. – వల్లూరు రవి కుమార్ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు, పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా,ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు. నాటు ఆవుల్లో గంగి గోవులు వేరు.. దేశీ జాతుల ఆవుల్లోనూ అన్నీ శ్రేష్టంగా ఉండవంటారు రవి. 100% సకల సద్గుణాలు కలిగిన ఆవును గంగి గోవు అంటారు. విశాలమైన గంగడోలు, మంచి మోపురం, సాధు స్వభావం, మనిషిని గుర్తుపట్టే నైజం.. ఈ లక్షణాలు 100% ఉంటే ‘గంగి గోవు’. ఈ లక్షణాలు 50–65% ఉంటే ‘గోవు’. ఈ లక్షణాలు అసలు లేకపోతే ‘ఆవు’ మాత్రమేనని రవి అంటున్నారు. -
ఒక లోకం... రెండు కోట్లు
‘‘పోలీస్ స్టోరీ’ సినిమా 25 సంవత్సరాల వేడుకకి వెళ్లినప్పుడు బెంగళూరులో ‘శశి’ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటని కన్నడలో తర్జుమా చేసి, వింటున్నారు. తమిళనాడులో కూడా ఈ పాటకు స్పందన చాలా బాగుంది. ఆది కెరీర్లో బెస్ట్ సాంగ్ ఇది. ఈ పాటలాగే ‘శశి’ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. అరుణ్ సంగీతం అందించారు. చంద్రబోస్ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట రెండు కోట్లకు పైగా వ్యూస్ దాటింది. ఈ సందర్భంగా ‘ఒకే ఒక లోకం..’ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘పాటను ఇంతలా ఆదరించినవారికి థ్యాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ నాయుడు నందికట్ల. ‘‘2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపజేస్తో్తంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామేన్ అమర్నాథ్ బొమ్మిరెడ్డి, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్.పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
నా బర్త్‌డే కేక్ నేనే తయారు చేసుకున్నా
‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016), ‘జెంటిల్‌మేన్’ (2016), ‘ఒక్కక్షణం’ (2017) చిత్రాల్లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ సురభి. ఆ తర్వాత కెరీర్లో కాస్త నెమ్మదించినా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలకు సైన్ చేసి, ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. నేడు సురభి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సురభి చెప్పిన విశేషాలు. ► గత ఏడాది నా బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గానే జరిగాయి. కానీ ఈ ఏడాది లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేం. ముంబైలో వర్షాలు కూడా పడుతున్నాయి. సో... ఈ ఏడాది నా బర్త్‌డే వేడుకలు ముంబైలోని మా ఇంట్లో మా తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతాయి. ప్రతి ఏడాది నా బర్త్‌డే వేడుకల్లో నా స్నేహితులు పాల్గొనేవారు. ఈసారి వారిని బాగా మిస్ అవుతున్నాను. ► లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం. చాలా సమయం కూడా దొరికినట్లయింది. దీంతో కొత్త వంటకాలు నేర్చుకున్నాను. వంటలు చేయడానికి మా అమ్మగారు హెల్ప్ చేస్తున్నారు. పానీపూరి, చాట్, వడపావ్.. ఇలా చాలా ఐటమ్స్ చేశాను. విశేషం ఏంటంటే... నా బర్త్‌డేకి నా కేక్‌ను నేనే తయారు చేసుకున్నాను. కుకింగ్ కాకుండా ఇంకా పెయింటింగ్స్ వేశాను. గార్డెనింగ్ పనులు చూసుకుంటున్నాను. సమ్మర్ హాలీడేస్‌లా అనిపిస్తోంది. కుటుంబంతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. నా గురించి కూడా నేను ఆలోచించుకునే వీలు దొరికింది. ► ‘ఒక్కక్షణం’ తర్వాత నాకు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ కథలు నచ్చలేదు. అయితే వేరే భాషల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా చేస్తోన్న ‘శశి’ చిత్రంలో నటిస్తున్నాను. ‘శశి’ మంచి ప్రేమకథా చిత్రం. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత వాటిని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇంకా తమిళంలో జీవీ ప్రకాష్‌కుమార్, కన్నడలో గణేశ్ హీరోలుగా చేస్తోన్న సినిమాల్లో నటిస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత వాటిపై స్పష్టత వస్తుంది. ► ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవలే ఓ కథ విన్నాను. ఇంకా ఫైనలైజ్ కాలేదు. పోలీసాఫీసర్ పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలని ఉంది. ఈ విషయంలో నాకు విజయశాంతిగారు స్ఫూర్తి. యాక్షన్ సినిమాల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేశారు. తెలుగులో నా ఫేవరెట్ యాక్టర్స్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, శర్వానంద్... ఇలా చాలామంది ఉన్నారు. ► వెబ్ సిరీస్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్ సిరీస్ కూడా చేస్తాను. -
శశి కథేంటి?
డిసెంబర్ 23 ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘శశి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్రబృందం. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు. ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. గుబురు గడ్డంతో కోపంతో అరుస్తున్న పోజులో ఉన్న ఫొటోను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఆది డిఫరెంట్‌గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: అమర్నాథ్ బొమ్మిరెడ్డి. -
ఇదీ భారతం
బహుముఖ సాంస్కృతిక భారతాన్ని..ఆచారాల భారతాన్ని.. సహజీవన భారతాన్ని.. ఆధ్యాత్మిక భారతాన్ని.. బహుజనుల భారతాన్ని మొదటిసారి దూర్‌దర్శన్‌లో చూపిన షో ‘సురభి’. సిద్ధార్థ్ కక్, రేణుకా సహాని యాంకర్లుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ♦ భారతీయ సంగీత దర్శకుడు, వయోలినిస్ట్ డా.ఎల్ సుబ్రమణ్యమ్ సురభికి సంగీతాన్ని అందించారు ∙ఈ కార్యక్రమాన్ని అమూల్ సంస్థ స్పాన్సర్ చేయడంతో ‘అమూల్ సురభి’ అని పేరు పడిపోయింది ♦ దీర్గకాలం ప్రసారమైన సాంస్కృతిక సీరీస్‌గా సురభి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు చేసుకుంది. ఇప్పుడంటే వంటకాలకో చానెల్, సంగీతానికో చానెల్, భక్తికి ఓ చానెల్, పర్యటనకు ఓ చానెల్.. ఇలా ప్రతీ అంశానికి సంబంధించిన చానెల్స్ విడివిడిగా ఉన్నాయి. కానీ, దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇవన్నింటినీ ఓ ప్రోగ్రామ్ ద్వారా అందించింది దూరదర్శన్. భారతీయ సంస్కృతిని వెలుగులోకి తెచ్చి కొత్తగా దేశభక్తిని ఆవిష్కరించింది. ఈ నేలలో పాదుకున్న నీతి, సామాజిక విలువలను కళ్లకు కట్టింది. ఈ థీమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ టెలివిజన్ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన, అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమంగా ‘సురభి’ అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో సగౌరవంగా నిలిచిపోయింది. ఎంచుకున్న అంశాలు విభిన్న స్వభావాలతో కూడినవి కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ‘సురభి’ అపార ఖ్యాతిని పొందింది. ఎక్కువకాలం ప్రసారం ప్రతి ఆదివారం బుల్లితెర స్క్రీన్‌పై యాంకర్లుగా సిద్ధార్ద్ కక్, రేణుకా సహానీలు చిరునవ్వులు చిందిస్తూ 30 నిమిషాల సేపు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. కొత్త కొత్త వ్యక్తులను, ప్రదేశాలను, సంప్రదాయాలను, మనిషి సృష్టించిన అద్భుతాలను చూపేవారు. ఆ సమయంలో సీరియల్సన్నీ సాధారణ కుటుంబ సంబంధాల నేపధ్యంతో వచ్చేవి. సురభి ఒక్కటే వీటికి భిన్నంగా వచ్చింది. 1990లో మొదలైన సురభి 2001 వరకు దాదాపు 415 ఎపిసోడ్లతో అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన షో గా రికార్డులను సొంతం చేసుకుంది. పోస్ట్.. పోస్ట్ ‘సురభి’ షో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందడం వెనుక మరో కృషి ఉంది. షో చివరలో తామడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపమని ప్రేక్షకులను కోరడంతో పోస్టుకార్డు వ్యవస్థ కొత్త ఊపిరి పోసుకుంది. ప్రతీవారం ప్రేక్షకులను క్విజ్ కాంటెస్ట్‌లో పాల్గొనెలా చేయడంతో ‘సురభి’ రేటింగ్ అమాంతం రాకెట్లా దూసుకుపోవడం ఆరంభించింది. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో జనం 15 పైసల పోస్టుకార్డును ఇలాంటివాటికి ఉపయోగించేవారు. వారానికి దాదాపు పదిన్నర లక్షల పోస్టుకార్డులు ప్రేక్షకుల నుంచి దూరదర్శన్‌కి అందేవి. ఈ పోటీలో పాల్గొనడానికి ఒక్కో కార్డ్‌కు 2 రూపాయల ధరతో ‘కాంపిటిషన్ పోస్ట్‌కార్డ్స్’ను పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా జారీచేయాల్సి వచ్చింది. అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ప్రజల నుంచి అత్యధిక ఆదరణ పొందిన కార్యక్రమంగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుచేసుకుంది సురభి. 90ల కాలంలో ఒక బెంచ్ మార్క్ షోగా మారింది. ఈ షో తర్వాత కక్ ఫోర్డ్ ఫౌండేషన్ సహాయంతో సురభి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కళాఖండాలను పరిరక్షించే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. చిరునవ్వుల సురభి ఆమె చిరునవ్వు సురభికి ఒక నక్షత్రంలా అమరింది. అప్పటికే ఆమె 1989లో టెలివిజన్ సీరియల్ సర్కస్‌లో నటించింది. ఆ సీరియల్ మంచి ప్రజాదరణ పొందింది. అటు తర్వాత సురభితో ప్రజాదరణను సుస్థిరం చేసుకుంది. సురభి మొదలైన రెండేళ్లకు ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 350 ఎపిసోడ్లను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆమె.. నటి, దర్శకురాలు రేణుకా సహానీ. సురభి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహానీ ‘మళ్లీ అలాంటి రోజులను, అలాంటి షోను తిలకించలేం. దేశ సంస్కృతి, చరిత్రకి అసలు సిసలు భాష్యం చెప్పింది నాటి దూరదర్శన్. గతాన్ని చూపుతూ భవిష్యత్తుకు బంగారంగా నిలిచింది’ అన్నారు. నిర్మాత, వ్యాఖ్యాత ఈ షో గురించి నిర్మాత, వ్యాఖ్యాత సిద్ధార్థ్ కక్ మాట్టాడుతూ ‘నాటి రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉండేది. దీని వల్లే విస్తృతంగా ప్రేక్షకులతో సంభాషించాం. భారతీయ సంస్కృతి సమగ్ర దృక్పథాన్ని సరైన సందర్భంలో ప్రదర్శించాం. ఈ ప్రయాణంలో మాకున్నది తక్కువ కమ్యూనికేషన్ కానీ ప్రజలతో కలిసి ఎక్కువ కాలం ప్రయాణించాం. ముందే ఎంచుకున్న ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ చిన్న చిన్న వివరాలు సైతం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని చిత్రించేవాళ్ళం. చివరికి మా కష్టం ప్రేక్షకులకు అర్ధమైంది. దీంతో వారు మాకు సహకరించారు’ అని ఆనందంగా గతాన్ని గర్తు చేసుకుంటారు సిద్ధార్థ్. ఒక్క చిరునవ్వు సురభి ప్రయాణంతో రేణుకా సహానీ ‘హమ్ ఆప్ హై కౌన్, తున్ను కి టీనా.. వంటి సినిమాలోనూ నటించింది. 2009లో మరాఠీ చిత్రం ‘రీటా’కు దర్శకత్వం వహించింది. రేణుకా సహానీ సినిమాలలో నటించినా, సామాజిక, రాజకీయ సమస్యలపై బలమైన అభిప్రాయాలను వినిపించినా ఇప్పటికీ సిసలైన గుర్తింపు అంటే అది ‘సురభి’ వల్లే. రేణుకా సహానీ మాట్లాడుతూ ‘మొబైల్ ఫోన్లు, టెక్నాలజీ ఇప్పుడున్నంతగా అప్పుడు లేదు. ప్రజలు వినోదం, మంచి కథలు ఉన్న కార్యక్రమాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. మేం వాటికనుగుణంగా కంటెంట్‌లో సర్దుబాటు చేశారు. మొదట మా వ్యాఖ్యాన్యం చాలా సాధారణంగా ఉండేది. సురభి మొదలైన రెండేళ్లకు నేను వచ్చాను. కొన్ని ఎపిసోడ్స్ పూర్తయ్యాక సిద్దార్థ గారు, నేను షోను ప్లెజెంట్‌గా మార్చాలంటే ఏం చేయాలని ఆలోచించాం. అందుకు చిరునవ్వుతో యాంకరింగ్ చేయాలన్నారు. అలా మొదలైంది నా ప్రయాణం. ఒక్క చిరునవ్వు నా జీవితాన్నే మార్చేసింది. బాంబేలో పుట్టి పెరిగిన నేను విదేశాల్లో చదువుకున్నాను. ఈ షో ద్వారా నేను నా దేశం గొప్పతనాన్ని స్వీయ అన్వేషణతో తెలుసుకోగలిగాను. దేశమంతా తిరిగాను. నాగరికత ఆనవాళ్లు, తరాతరాల గొప్పతనం తెలుసుకున్నాను. ఈ ఉద్యమంలో నేనూ భాగమైనందకు గర్వంగా ఉంది’ అన్నారు . వారపత్రిక వారం వారం అనేక సాంస్కృతిక అంశాలతో అలంరించే సురభిని ఒక వీక్లీ మ్యాగజైన్‌తో పోల్చుతారు. భారతీయ సంస్కతిలో భాగమైన సంగీతం, నృత్యం, శిల్పం, ప్రజల జీవనవిధానం, వంటకాలు, చేతిపనులు.. ప్రతీ అంశాన్ని ఈ షోలో కవర్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఎన్నో చానెల్స్ అనుసరిస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ ఇప్పటికీ రకరకాల చానెల్స్‌లో నడుస్తూనే ఉంది. ఇన్ని కార్యక్రమాలకు ‘సురభి’ ఒక్కటే సమాధానమైంది. అంతేకాదు, సురభిని సాధ్యం చేసిన మరో విషయం ఏమిటంటే సామాన్య ప్రజల నుండి ఈ షోకు లభించిన భారీ మద్దతు. పట్టణ కేంద్రాలకే కాదు మారుమూల ప్రాంతాలకు ప్రయాణించింది సురభి. అక్కడి ప్రజలు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సంస్కృతి, చరిత్ర మనకు వారసత్వంగా వచ్చింది. వాటిని మనం మార్చలేం. ప్రజలే స్వయంగా వచ్చి సంస్కృతిని అందించడానికి సహాయపడ్డారు. కొన్నింటిని ప్రజలే నేరుగా వచ్చి మార్పులు చేయడానికి సహకరించారు. తమ ఆలోచనలను షో నిర్వాహకులతో పంచుకున్నారు.– ఎన్.ఆర్. -
నీ చూపే చల్లని చిరుగాలై...
‘బీరువా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సురభి... ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్మెన్... సినిమాలతో సుపరిచితమయ్యారు. తాజాగా ‘ఓటర్’ సినిమాతో ఆకట్టుకున్న సురభి ముచ్చట్లు... నా బలం: పేరెంట్స్ ఇష్టమైన నటి: మాధురీ దీక్షిత్ కష్టమైన పాత్ర: మొదటి సినిమాలో చేసింది. నటి కాకపోయి ఉంటే: కచ్చితంగా నటినే! మరో సందేహమే లేదు!! సమయం దొరికితే: మ్యూజిక్ వింటాను. నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. సౌత్‌లో నచ్చిన నటి: అనుష్కా శెట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్: సహనం. నాలో ఓపిక, సహనంలాంటివి చాలా తక్కువ. సినిమాల పుణ్యమా అనే సహనాన్ని అలవర్చుకున్నాను. నచ్చిన డైరెక్టర్లు: ఈ జాబితా చాలా పెద్దది గురూ! ఫ్యాషన్ సెన్స్: సింపుల్‌గా ఉండాలి. బాడీకి సూట్ కావాలి. అతిగా ఉండకూడదు. నచ్చిన ప్రదేశం: గ్రీస్ నచ్చిన గాయని: లతా మంగేష్కర్ నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్: ఏఆర్ రెహమాన్ హైదరాబాదీస్: 1. సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. 2. భోజనప్రియులు. 3. మంచి మనసున్న మనుషులు బాగా ఆడే ఆట: క్యారమ్స్ బాగా చూసే ఆట: రేసింగ్ గేమ్స్ మ్యూజిక్‌లో ఇష్టపడే జానర్: జాస్ నచ్చే పేరు: లిపిక ఫస్ట్ క్రష్: హృతిక్ రోషన్ నచ్చే పానీయం: స్ట్రాబెర్రీ బలహీనత: నా స్వీట్నెస్? సూపర్ పవర్ ఉంటే?: ఎదుటి వాళ్ల మనసులను చదువుతాను. ఫెవరైట్ స్పైస్: గ్రీన్‌చిల్లీ ఫెవరెట్ టీవీ షో: కపిల్‌శర్మ షో బోధించడానికి ఇష్టపడే సబ్జెక్ట్: సైకాలజీ ఊత పదాలు: సా...ర్, అచ్ఛా చేయాలనుకునే రోల్స్: ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్: ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. రెండిట్లో ఏది ఉత్తమం అనేదాన్ని పక్కన పెడితే...పెళ్లికి ముందు భాగస్వామి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎలాంటి భర్త కావాలి: జెంటిల్మెన్గా ఉండాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. తాను చేసే పనిని గౌరవించాలి. ‘ఆడవాళ్లు వంటింటికే పరిమితం’ అనే భావం ఉండకూడదు. ఇష్టమైనది: ప్రకృతి ఆరాధన. -
ఆంధ్ర నాటకానికి నవ వసంతాలు
ఆంధ్ర నాటక కళాపరిషత్... నాటక కళ క్షీణ దశకు చేరుతున్న తరుణంలో నాటక పునరుజ్జీవం లక్ష్యంతో భారతదేశంలోనే తొలిగా తెనాలిలో ఏర్పాటైన నాటక సంస్థ. రంగస్థల నాటకానికి పునర్వికాసం కల్పించి తెలుగుదేశాన నాటక కళ పరిఢ విల్లేందుకు అవిరళ కృషే చేసింది. ఆధునిక సమాజంలో ఇంకా నాటకం అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నదంటే ఇలాంటి సంస్థల కృషి ఫలితమే. ఇంతటి ఘనచరిత్ర కలిగిన సంస్థను దశాబ్దకాలం కిత్రమే పునరుద్ధరించారు. ఎనిమిది దశాబ్దాల ఉత్సవాలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 90 వసంతాల వేళ, విజయవాడ మొగల్రా జపురంలోని సిద్ధార్థ కళాపీఠంలో గురువారం నుంచి నాలుగురోజులపాటు జాతీయ బహుభాషా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నందున ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆవిర్భావం, కృషిని గుర్తు చేసుకోవటం సందర్భోచితం... ఇతర రాష్ట్రాల నుంచి... పూర్వం ఇతర రాష్ట్రాల నుంచి నాటక కంపెనీలు వచ్చి ఆంధ్ర దేశంలో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. 1880 తర్వాత తెనాలితో సహా అయిదారు పట్టణాల్లో నాటక కంపెనీలు ఏర్పాటయ్యాయి. పురాణాల నుంచి కథాంశాలను ఎన్నుకొని నాటకాలను తీసుకొచ్చారు. జాతీయోద్యమ ప్రభావంతో పౌరాణిక అంశాలతో నాటకాలను రూపొందించి, సందర్భోచితంగా బ్రిటిష్ వారిని దుయ్యబడుతూ వచ్చారు. ఆ రకంగా తెలుగునాట నాటక ప్రదర్శనలు విస్తారంగా జరుగుతున్న 1919లోనే నాటక పోటీలు ఆరంభమయ్యాయి. నాటక ప్రాభవం క్రమేపీ తగ్గిపోవడానికి, అపసవ్య ధోరణులకు ఈ పోటీలే దారితీయటం విశేషం! ఏ నటుడు ఎక్కువసేపు రాగం తీస్తే, ఆ నటుడికే ప్రేక్షకుల నుంచి ‘వన్స్‌మోర్’ వస్తుండటంతో నాటకానికి అర్ధం మారింది. నటనకు ప్రాధాన్యత తగ్గి గానం, సంగీతమే ప్రధానమైంది. నాటకాలు పాటకచేరీలు అన్నట్టుగా తయారయ్యాయి. నటులను సంస్కరిస్తే నాటకాలు బాగుపడతాయన్న భావనతో 1924లో తొలిసారిగా విజయవాడలో నాటక పాఠశాల ఏర్పాటుచేసి శిక్షణనిచ్చిన తర్వాత కూడా పద్ధతి మారలేదు. నటులు వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడారు. వైషమ్యాలు పెరిగి, నాటక సమాజాలు నష్టాల్లో పడ్డాయి. క్రమంగా మూతపడ్డాయి. సినిమాలు అప్పుడప్పుడే వస్తున్నందున కొందరు ఆ రంగానికి వెళ్లారు. నాటకరంగం అధోగతిలో పడింది. నాటక రంగంలోని అపసవ్య ధోరణులను అరికట్టడానికి అనేకులు రకరకాలుగా ప్రయత్నించారు. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’ అనే ఆశయంతో ఔత్సాహికులు రంగంలోకి దిగి తెలుగు నాటకం ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషిచేశా రు. నాటక సంస్కరణలకు మార్గాలను అన్వేషించారు. ఇలాంటి తరుణంలో ‘సురభి’ నాటక కంపెనీ పితామహుడు వనారస గోవిందరావు ఆరునెలలపాటు కష్టపడి రాష్ట్రంలోని ప్రముఖులను కూడగట్టి, ఎంతో వ్యయంచేసి ‘ఆంధ్ర నాటక కళా పరిషత్’ ఆవిర్భావానికి దోహదపడ్డారు. సంస్థ ఆవిర్భావ సభలు 1929 జూన్ 19, 20, 21 తేదీల్లో తెనాలిలో వైభవంగా నిర్వహించారు. దశమార్చిన మారిన సభలు మూడురోజుల సభలతో ఆంధ్ర నాటక కళాపరిషత్, తెలుగు నాటక రంగానికి దశ, దిశానిర్దేశం చేసింది. స్పష్టమైన నియమాలను రూపొందించింది. పరిషత్ నిర్వహణతో రాష్ట్రంలో ఔత్సాహిక సమాజాలు వందలకొద్దీ పుట్టుకొచ్చాయి. కొత్త రచయితలు, నటీ నటులు, సంగీత కళాకారులు నాటక రంగంలోకి అడుగుపెట్టారు. పరిషత్తుల్లో బహుమతులు సాధించిన రచయితలు, నటులకు సినిమారంగంలో ప్రవేశం లభించింది. మొదటి సభలకు అతిథులు వీరే.. బుర్రా శేషగిరిరావు, వక్కలంక అచ్యుతరావు, భమిడిపాటి చిన యజ్ఞనారాయణ శర్మ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు సుబ్బారావు, తల్లావఝుల శివశంకరశాస్త్రి, కాళ్లకూరి గోపాలరావు, బళ్లారి రాఘవ ప్రభృతులు హాజరయ్యారు. మొదటిరోజు ‘నాటక రచన’, రెండోరోజు ‘నటన’, చివరిరోజున ‘నాటక ప్రయోగం’ అంశంపై చర్చలు జరిగాయి. ప్రతిరోజు రాత్రి నాటకాలను ప్రదర్శించారు. ముగింపు సభలో ‘దేశోద్ధారక’ కాశీనాధుని నాగేశ్వరరావు, గోవిందరావు, ఆచంట సాంఖ్యాయన శర్మ, చట్టి చినపూర్ణయ్య పంతులు, విశ్వనాధ కవిరాజు, కొత్తపల్లి లక్ష్మయ్య, నీలంరాజు వేంకట శేషయ్యతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వనారస గోవిందరావును ‘ఆంధ్ర నాటక కళోద్ధారక’ బిరుదుతో సత్కరించారు. తెనాలి నేపధ్యమే ప్రేరణ.. ‘సురభి’ నాటక సమాజం నాటక ప్రదర్శనలిస్తూ తెనాలికి వచ్చిన సందర్భంలో ఆ కంపెనీ నిర్వాహకుడు వనారస గోవిందరావుకు ఇక్కడి సాంస్కృతిక వాతావరణం నచ్చింది. అందుకే ఇక్కడ కళాపరిషత్ ఆవిర్భావానికి కృషి చేశారు. సాహితీ సమితి ఏర్పాటై ఉంది. రచయితలు, కళాకారులు, నాటక సమాజాలు ఉన్నాయి. తెనాలి నుంచి అప్పట్లో 20 వరకు దిన, వార, మాసపత్రికలు వెలువడుతుండేవి. ఇంత అనుకూలంగా ఉన్నందునే పరిషత్ విజయవంతమైంది. – నేతి పరమేశ్వరశర్మ, సీనియర్ కళాకారుడు పరిషత్ అనుమతిస్తే గొప్పే! ఆ రోజుల్లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌లో ప్రదర్శనకు ఏదైనా నాటకానికి అనుమతి లభించిందంటే గొప్ప గౌరవంగా భావించేవారు. ‘కాళరాత్రి’, ‘మరో మొహంజదారో’, ‘ఎన్జీవో’, ‘ఈనాడు’, ‘దొంగవీరడు’, ‘పల్లెపడుచు’, ‘అన్నాచెల్లెలు’, ‘మావూరు’, ‘ఎదురీత’, ‘పెత్తందారు‘, ‘నటనాలయం’, ‘కనక పుష్యరాగం’, ‘కళ్లు’ వంటి అద్భుత కళాఖండాలు తెలుగు నాటక రంగంలో వెలుగులోకి రావడానికి కళాపరిషత్ దోహదపడింది. తర్వాత 1951 లో మున్సిపల్ చైర్మన్ నన్నపనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మళ్లీ తెనాలిలో నాలుగురోజులు ఆంధ్ర నాటక కళాపరిషత్ సభలు జరిగాయి. ఆవిర్భావ సభల్లో పాల్గొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సభలను, పోటీ నాటకాలను సినిమా దర్శకుడు వైవీ రావ్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్, ఆ నాటి సభల్లో నృత్యం చేయటం మరో విశేషం. కళారంగంలో జాజ్వలమానంగా ప్రకాశించేందుకు ఎంతో కృషిచేసిన ఈ పరిషత్ పదేళ్లు విరామం అనంతరం, బొల్లినేని కృష్ణయ్య, అన్నమనేని ప్రసాదరావు సారధ్యంలో పూర్వవైభవానికి కృషిని కొనసాగిస్తోంది. ఆ క్రమంలో 2009లో తెనాలిలో ఎనిమిది పదుల నాటకోత్సవాలను జరుపుకోవటం విశేషం. -
బెదిరింపులతో ఓటర్ని ఆపలేరు
‘‘ఓటర్’ సినిమా విడుదల కాకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలని బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆపేది లేదు. అనుకున్న ప్రకారం నేడు విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్ గౌడ్. మంచు విష్ణు, సురభి జంటగా నటించిన చిత్రం ‘ఓటర్’. కార్తీక్ దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో అడ్వకేట్ వేణుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో జాన్ సుధీర్ పూదోట, కార్తీక్‌పై 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ కోర్టులో కేసు వేసింది. సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. సినిమా విడుదల విషయంలో అభ్యంతరం చెప్పకుండా కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘12ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా ఉన్నాను. నాపై ఇప్పటివరకూ ఎలాంటి వివాదాలు లేవు. ఓటర్ విలువ చెప్పే చిత్రం ఇది. ఈ పాయింట్ నచ్చి కొనుక్కున్నా. లీగల్‌గా విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌తో ఉన్న పరిచయాలతో సినిమాని విడుదల చేస్తున్నా’’ అన్నారు.