'వర్మ సార్తో పనిచేయడం నా అదృష్టం' | Want to be more than just a pretty face: Surabhi | Sakshi
Sakshi News home page

'వర్మ సార్తో పనిచేయడం నా అదృష్టం'

Published Mon, Mar 2 2015 1:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

'వర్మ సార్తో పనిచేయడం నా అదృష్టం'

'వర్మ సార్తో పనిచేయడం నా అదృష్టం'

చెన్నై:   బీరువా సినిమా డెబ్యూ హీరోయిన్  'సురభి'... దర్శకుడు రామ్  గోపాల్ వర్మను పొగడ్తలతో ముంచెత్తుతోంది. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ఎటాక్  లో హీరోయిన్ గా నటిస్తున్న  ఆమె  ..  వర్మ సార్ తో పనిచేయడం తన అదృష్టమంటూ తెగ సంబరపడిపోతోంది.   బీరువా సినిమాలో్ తన నటన  చూసి ఇంప్రెస్ అయ్యి..తనకు ఈ అవకాశం ఇచ్చారని  ఆమె  పొంగిపోతోంది. 

అంతేకాదు..."ఇప్పటిదాకా  అందమైన, అమాయకమైన పక్కింటి  అమ్మాయి పాత్ర ల్లో చూసిన తనను ఇకముందు డిఫరెంటు గెటప్స్ లో చూస్తారు.. నాలో ఇంకో కోణాన్ని చూస్తారంటూ ఊరిస్తోంది.  ఎటాక్ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ   కార్లను రిపేర్ చేసే  మెకానిక్ పాత్రలో  రౌడీలాగా వెరైటీగా  కనిస్తానంటోంది'' సురభి.  జగపతిబాబు, మంచు మనోజ్ లాంటి సీనియర్ నటులతో నటించడం చాలా సంతోషంగా ఉందంటోంది.


గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లను  దోచుకుంటాడన్న ఆరోపణలను ఖండిస్తోంది ఈ యువనటి.  రాంగోపాల్ వర్మ హీరోయన్లను ఎంత సెక్సీగా చూపిస్తాడో అంత అందంగానూ ప్రొజెక్ట్  చేస్తారంటోంది. ఆయన ఆడవాళ్ళను ప్రేమిస్తారు,  హీరోయిన్లను ఒక పెయింటింగ్ లాగా  చూసుకుంటారని చెప్పుకొచ్చింది.  రంగీలా సినిమా అప్పటినుంచి తాను వర్మ అభిమానినని వెల్లడించింది ఈ బీరువా భామ. ఆయనతో చేసిన ఫోటో షూట్ ను చాలా ఎంజాయ్ చేశానని.. తెరమీద తను ఎంత అందంగా ఉన్నానో  చూడాలని ఆరాటంగా ఉందంటూ మురిసిపోతోంది.  హీరోయిన్లను  తెరమీద అందంగా ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసంటూ  తెగ కితాబులిస్తోంది. ప్రస్తుతం  సురభి ఒక తమిళ సినిమాలో కూడా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement