దేవుడు నాకోసమే పంపాడు, ముంబై వెళ్లిపోతున్నా: హీరోయిన్‌ | Actress Surabhi Santosh, Singer Pranav Chandran Got Married! - Sakshi
Sakshi News home page

సింగర్‌ను పెళ్లాడిన లాయర్‌ కమ్‌ హీరోయిన్‌.. హనీమూన్‌ ఇంకా ప్లాన్‌ చేసుకోలేదంటూ..

Published Mon, Mar 25 2024 5:52 PM | Last Updated on Mon, Mar 25 2024 6:47 PM

Heroine Surabhi Santosh, Singer Pranav Chandran got married! - Sakshi

మలయాళ హీరోయిన్‌ సురభి సంతోష్‌ పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్‌ సింగర్‌ ప్రణవ్‌ చంద్రన్‌ను పెళ్లాడింది. హల్దీ, మెహందీ, సంగీత్‌, పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. కొత్త లైఫ్‌ ప్రారంభిస్తున్న సురభికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి అనంతరం సురభి మాట్లాడుతూ.. 'మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మేము ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని చాలా నెలలు కావస్తోంది. ఒక ఆర్టిస్టును పెళ్లాడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చివరకు ఆ కల నెరవేరింది.

పెళ్లి తర్వాత సినిమాలు చేస్తా
ఇది అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ అయినప్పటికీ అతడిని కలిసినప్పుడే నచ్చేశాడు.. తర్వాత ఇద్దరం ఒకరిగురించి ఒకరం తెలుసుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లయిపోయిందని సినిమాలకు దూరంగా ఉండిపోను. తర్వాత కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను. అతడు నాకెంతో సపోర్ట్‌గా ఉంటాడు. ప్రస్తుతం నేను ముంబైకి షిఫ్ట్‌ అవుతున్నాను. హనీమూన్‌ ఇంకా ప్లాన్‌ చేసుకోలేదు. అతడు నెక్స్ట్‌ మంత్‌ ఏదో షో కోసం హాంగ్‌కాంగ్‌ వెళ్తున్నాడు. నేనూ తనతోపాటు వెళ్తున్నాను. ఫస్ట్‌ టైమ్‌ అతడి లైవ్‌ షో చూడబోతున్నాను. నాకెలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్నానో అచ్చం అలాంటి మనిషినే ఆ దేవుడు నాకోసం పంపించాడు' అని సంబరపడిపోయింది.

లాయర్‌ కాబోయి హీరోయిన్‌
​కాగా తిరువనంతపురంలో పుట్టిపెరిగిన సురభి లాయర్‌ కాబోయి యాక్టర్‌ అయింది. బెంగళూరులో న్యాయవిద్యనభ్యసిస్తున్న సమయంలో తనకు అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీవైపు అడుగులేసింది. కుట్టనాదన్‌ మర్పప్పా, మై గ్రేట్‌ ఫాదర్‌, నైట్‌ డ్రైవ్‌, కినవల్లి, ఎన్‌ ఇంటర్నేషనల్‌ లోకల్‌ స్టోరీ వంటి పలు చిత్రాలతో మెప్పించింది. అటు ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేసింది.

చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్‌పై పరువునష్టం దావా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement