
మహేష్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి సమకాలీకులతో పోలిస్తే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా వుంటారు. చాలా కాలం క్రితం ఓ ప్రముఖ కార్ల సంస్ధకు ప్రభాస్ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ చేశారు. ఆ తరువాత మళ్లీ ఏ బ్రాండ్‌కు తను పని చేయలేదు.
అయితే ఇటీవల కాలంలో పలు ప్రముఖ బ్రాండ్ల నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రభాస్ వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ కోలా కంపెనీతో పాటు ఓ ఆటోమొబైల్ కంపెనీ వారు ప్రభాస్‌ను సంప్రదించగా తను వాటిపై ఆసక్తి చూపలేదట.
ఓ యాడ్‌కు కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల వరకు సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌లు చేయడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఓ సెలబ్రిటీ మేనేజర్ తెలిపారు.
మహేష్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే పలు బ్రాండ్‌తో ఒప్పందాలు చేసుకుని ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన ఫోకస్ అంతా నటన, సినిమాలపైనే పెట్టారు. సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు.
ఇలా తనకు కోట్లలో భారీ మొత్తాలను చెల్లించేందుకు పలు బ్రాండ్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ డార్లింగ్ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ కేవలం తన నటనపై మాత్రమే ఫోకస్ పెట్టారంటూ ఆ సెలబ్రిటీ మేనేజర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునిరేషన్ తీసుకుంటూ టాప్ స్టార్‌గా ఉన్నప్పటికీ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా ఉండటం ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను తెలిజేస్తుంది.