endorsements
-
డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలకు కొత్త రూల్! మార్గదర్శకాలు విడుదల
వైద్య ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల ప్రకటనల్లో హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు, డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయన్సర్లు వీక్షకులను తప్పుదారి పట్టించకుండా డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ప్రకటనల్లో అసలైన వైద్య నిపుణులు, హెల్త్, ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు నటించినా కూడా వైద్య, ఆరోగ్య సంబంధ సమాచారాన్ని తెలియజేసేటప్పుడు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు తాము ధ్రువీకరణ పొందిన హెల్త్/ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు లేదా వైద్య నిపుణులమనే విషయాన్ని బహిర్గతం చేయాలని సూచించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆరోగ్య నిపుణులుగా లేదా వైద్య నిపుణులుగా నటిస్తూ వైద్య, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు, వైద్య ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు తాము చెప్పే విషయాలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి మినహాయింపు అయితే వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట ఉత్పత్తులు, సేవలతో సంబంధం లేని సాధారణ వెల్నెస్, ఆరోగ్య సలహాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే నీరు ఎక్కువగా తాగండి.. వ్యాయామం చేయండి.. బాగా నిద్రపోండి.. వంటి సాధారణ సలహాలు ఇవ్వవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మార్గదర్శకాల అమలును చురుకుగా పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాలు విధించవచ్చు. -
క్రికెట్ దేవుడు సచిన్‌కు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. కాబట్టి సచిన్ టెండూల్కర్ గురించి దాదాపు అందరికి తెలుసు. సచిన్ ఆటల్లో మాత్రమే కాదు ఆటో మోటివ్ ఔత్సాహికుడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఈ రోజు క్రికెట్ గాడ్ సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆస్తులు విలువ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి వంటి విషయాలతో వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. క్రికెట్ తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1350 కోట్ల కంటే ఎక్కువ. బెంగళూరులో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) 11 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఇప్పుడు క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్న సచిన్ ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. (ఇదీ చదవండి: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని) క్రికెట్ అంటే ప్రాణమిచ్చే సచిన్ మొదటి కారు మారుతి 800 కావడం గమనార్హం. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో బిఎండబ్ల్యూ 30 జహ్రే ఎమ్5, ఎమ్ 6 గ్రాన్ కూపే, 7 సిరీస్, నిస్సాన్ జిటి-ఆర్, ఐ8, ఫెరారీ-360-మొడెనా మొదలైనవి ఉన్నాయి. సచిన్ వద్ద ఉన్న కార్ల ఖరీదు రూ. 15 కోట్లకంటే ఎక్కువ. ఖరీదైన కార్లు, బంగ్లా కలిగి ఉన్న సచిన్ పెప్సి, అడిడాస్, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, ఎయిర్టెల్, కోకాకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ. 17 నుంచి 20 కోట్లు. -
Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాక్!
Virat Kohli- Ranveer Singh: భారత సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు విరాట్ కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్ పేరే ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. రికార్డుల రారాజు అయిన కింగ్ కోహ్లి.. బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే, తాజా నివేదికల ప్రకారం.. దేశంలోని మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్‌ను కోహ్లి కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఆక్రమించినట్లు సమాచారం. కాగా గత ఐదేళ్లుగా కోహ్లి వరుసగా ఇండియా మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. అయితే, 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేసిన కోహ్లిని.. ఆ తర్వాతి ఏడాదిలో వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం కోహ్లి టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు. అగ్రస్థానంలో రణ్వీర్ సింగ్! ఓ వైపు కెప్టెన్సీ చేజారడం.. అదే సమయంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి ఖాతాలో వెయ్యి రోజుల పాటు సెంచరీ అన్నదే లేకుండా పోయింది. ఈ పరిణామాలు కోహ్లి బ్రాండ్ వాల్యూపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో క్రోల్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ రిపోర్టు 2022లో ఈ మేరకు రణ్వీర్ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకువచ్చినట్లు పేర్కొంది. పడిపోయిన బ్రాండ్ వాల్యూ కోహ్లి బ్రాండ్ వాల్యూ 185.7 మిలియన్ డాలర్ల(2021లో) నుంచి గతేడాది 176.9 మిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. అదే సమయంలో 2021లో 158.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూ కలిగిన రణ్వీర్ సింగ్.. 2022లో 181.7 మిలియన్ డాలర్లతో టాప్‌లోకి దూసుకొచ్చినట్లు తెలిపింది. త్వరలోనే మళ్లీ పూర్వవైభవం అయితే, కోహ్లి బ్రాండ్ వాల్యూలో ఈ మేర పతనం తాత్కాలికమేనని.. త్వరలోనే అతడు పూర్వవైభవం పొందే అవకాశం ఉందని క్రోల్ వాల్యూయేషన్ సర్వీసెస్ ఎండీ అవిరల్ జైన్ మనీ కంట్రోల్‌తో వ్యాఖ్యానించారు. 34 ఏళ్ల కోహ్లి బ్రాండ్ వాల్యూ క్రికెటర్‌గా తారస్థాయికి చేరిందని.. త్వరలోనే నాన్- క్రికెటర్‌గానూ వాల్యూబుల్ సెలబ్రిటీగా అదే స్థాయికి చేరుకోగలడని పేర్కొన్నారు. భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లి ధోని మాదిరి సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్న కోహ్లి.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని మాదిరి నాన్- క్రికెటింగ్ విభాగంలోనూ సత్తా చాటగలడని జైన్ అభిప్రాయపడ్డారు. 2021లో కోహ్లి బ్రాండ్ వాల్యూలో 5 శాతం తరుగుదల నమోదైందని.. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా మరోసారి కోహ్లి మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ హోదా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కింగ్ ఎల్లప్పుడూ కాగా ఆసియా కప్-2022 టీ20 టోర్నీతో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా టెస్టుల్లోనూ శతక కరువు తీర్చుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 75 సెంచరీలు బాదిన అతడు.. బ్యాటర్‌గా పూర్వవైభవం సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తిరిగి మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్ పొంది రణ్వీర్ను వెనక్కినెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి: WC 2023: వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్ ఎక్కడంటే! హైదరాబాద్‌లోనూ.. WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై! -
బ్రాండ్ కా బాప్.. అమితాబ్
Happy Birthday Amitabh Bachchan: నటనలో కొందరు అరుదు. అంటే వయసు మీద పడినా.. వాళ్ల మీద జనాల అభిమానం మాత్రం తగ్గదు. పైగా వాళ్ల ఛరిష్మా.. ఏ జనరేషన్‌ను అయినా ఇట్టే ఆకట్టుకోగలుగుతుంది. అలాంటి తారల్లో ముందు వరుసలో ఉంటారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. అందుకే ఇప్పటి మార్కెట్లోనూ ఎండార్స్మెంట్ కింగ్‌గా రాణించగలుగుతున్నారు ఆయన. అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు ఇవాళ(అక్టోబర్ 11). తన 79వ పుట్టినరోజు సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ పాన్ మసాలా బ్రాండ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డబ్బుల్ని సైతం వెనక్కి ఇచ్చేసిన ఆయన.. ఇది Surrogate advertising( నిషేధించిన అడ్వైర్టైజ్మెంట్) జాబితాలో ఉందని తెలియక ఒప్పుకున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన సైతం విడుదల చేశారు. సాధారణంగా తారలు తమ బ్రాండ్ ఇమేజ్ కోసం Surrogate advertisementsలోనూ కనిపిస్తుంటారు. అయితే అమితాబ్ మీద జనాల్లో ఓ నమ్మకం ఉందని, దానిని చెడగొట్టుకోవద్దని నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్(నాటో) సంస్థ కోరింది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా! అందుకే వైదొలిగినట్లు ప్రకటించారు. ఆ నమ్మకమే.. బాలీవుడ్ మెగాస్టార్ లెజెండెస్ ఆఫ్ ఆల్‌టైం.. ఎవర్గ్రీన్ ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఆఫ్ బాలీవుడ్ బాలీవుడ్ షెహన్షా.. ఇలా ఏ పేర్లతో పిలుచుకున్నా సరే.. అమితాబ్ అంటే దేశం మొత్తానికి ఓ అభిమానం ఉంది. ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై’.. సాధారణంగా యంగ్ సెలబ్రిటీకి ఎండార్స్మెంట్ మార్కెట్ రెడ్‌కార్పెట్ పరుస్తుంటుంది. అలా కాకుండా ఎనిమిది పదుల వయసు దగ్గరపడుతున్నా.. ఎండార్స్మెంట్ కింగ్‌గా ఆయన కొనసాగడం మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. అందుకు కారణాలేంటో చూద్దాం. ►సినిమాకు సంబంధించి మాత్రమే కాదు.. సాధారణ సొసైటీలోనూ అమితాబ్ ప్రభావం ఎక్కువే. ►ఆయన యాడ్స్‌ల్లో పిల్లలకు ఏదైనా చెబితే ఇంట్లో తాత చెప్పినట్లే ఉంటుంది. ►ఓ తండ్రిగా, ఓ పెద్దన్నగా, ఓ మామగా, ఊరికి ఓ పెద్దమనిషిగా.. ఆయన ఏం చెబితే అంతా వింటారనే నమ్మకం మార్కెట్లో క్రియేట్ అయ్యింది. ►ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్(IIHB) ఇచ్చిన టియారా(Trust, Identify, Attractive, Respect and Appeal) నివేదికలో బిగ్ బీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ►దేశంలో వందకి 88 మంది.. అమితాబ్ చేసే బ్రాండింగ్‌ను నమ్ముతామని చెప్పారు ►ఆయన ఇచ్చే ప్రకటనలు నమ్మశక్యంగా ఉంటాయని తేల్చారు వాళ్లంతా. ►హుందాగా ఆయన చేసే యాడ్ ఏదైనాసరే.. భాషతో సంబంధం లేకుండా జనాల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది ►అమితాబ్ ఒక్కో కమర్షియల్యాడ్కు తీసుకునే రూ.5 నుంచి 8 కోట్ల మధ్య(స్టార్టప్టాకీ ప్రకారం) తీసుకుంటారట! ►పిల్లలు ఇష్టపడే మ్యాగీ నుంచి వాళ్ల ఆరోగ్య భద్రత కోసం పోలియో వ్యాక్సిన్ ప్రచారం దాకా, క్యాడబరీ చాక్లెట్ నుంచి నగల దాకా, హెల్త్, స్పోర్ట్స్, ఫుడ్, ఈ-కామర్స్, వెహికిల్స్.. ఇలా అన్ని యాడ్స్‌లోనూ అమితాబ్ మార్క్ కనిపిస్తుంటుంది. ►ఐరాసకు సంబంధించిన పలు విభాగాలకు అంబాసిడర్‌గా.. స్వచ్ఛ భారత్ అభియాన్, పొలియో వ్యాక్సిన్ లాంటి ప్రభుత్వ ప్రచారాలకు సైతం అమితాబ్ పెద్దరికం తోడవుతోంది. ► వివాదాలకు దూరంగా ఉండే అమితాబ్.. ఎండార్స్మెంట్ల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని భావించారు. అందుకే ఆ పాన్ మసాలా యాడ్ నుంచి వైదొలిగారు. HBDAmitabhBachchan.. సెలబ్రిటీల ట్వీట్లు కొన్ని.. Wishing My Beloved Big Brother, My forever Guru, the One and Only Amit Ji @SrBachchan a very Happy Birthday. Many Many Happy Returns!! Health, Happiness and More Power to You Amit ji!!🙏 pic.twitter.com/h3Q5wyrB4n — Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2021 Sending the most splendid birthday wishes to the legend of Indian Cinema! Happy birthday to you dear Amitabh Ji! @SrBachchan pic.twitter.com/u4rfOzPDd6 — Mohanlal (@Mohanlal) October 11, 2021 Happy Birthday Amitabh Sir ❤@SrBachchan#AmitabhBachchan pic.twitter.com/rrDpQd44uH — Mammootty (@mammukka) October 11, 2021 My hero, my idol, my friend, my father! Happy birthday Dad. Love you @SrBachchan pic.twitter.com/8DzGRyoxEF — Abhishek Bachchan (@juniorbachchan) October 11, 2021 Happy birthday, @SrBachchan sir! May you continue to inspire us with your unparalleled brilliance. Good health and happiness always! — Mahesh Babu (@urstrulyMahesh) October 11, 2021 Happy birthday to the versatile and the evergreen @SrBachchan sir. 🎂🤗 Wishing you good health and happiness always. — Virat Kohli (@imVkohli) October 11, 2021 Sir, looking at you through a different lens taught me what being a true artiste is. Happy Birthday dear Amitji@SrBachchan pic.twitter.com/v3V5qhQO3w — Ajay Devgn (@ajaydevgn) October 11, 2021 Happy birthday my handsome paapajiiiii♥️ @SrBachchan 🌸 You are truly the awesomest..✨ We love you! Thank you for being the most amazing human being.. We wish you all the love, health and happiness🌸 — Rashmika Mandanna (@iamRashmika) October 11, 2021 Many More Happy Returns Sarkaar @SrBachchan Never Before Never Again ; 🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/xPb5pmrcWb — Harish Shankar .S (@harish2you) October 11, 2021 - సాక్షి, వెబ్‌స్పెషల్ -
క్లాస్ బిజినెస్‌కు కేరాఫ్ ఈ కింగ్
Happy Birthday Akkineni Nagarjuna: ‘మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పడం కష్టం. అందుకే అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.’.. నటుడు తెలుగు వెండితెర తొలి సొగ్గాడు శోభన్ బాబు తర్వాతి తరాల తారల కోసం ఇచ్చిన సందేశం ఇది. ఇలాంటివేం ఫాలో కాకుండా.. సోకులకు పోయి డౌన్‌ఫాల్ అయినవాళ్లు సినీ పరిశ్రమలో చాలామందే ఉన్నారు. అయితే ఆ సోగ్గాడి మాటలను ఒంటబట్టించుకుని ఈ సొగ్గాడే చిన్ని నాయన ఒక్క వెండితెరనే కాదు బుల్లితెర, స్టూడియో ఓనర్, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ టీమ్స్ కో ఓనర్‌గా అనేక రంగాలకు విస్తరించి క్లాస్ బిజినెస్‌కు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారారు. ముందే పసిగట్టారు టాలీవుడ్లో ‘మన్మథుడు’ అనే పదానికి పర్యాయ పదంగా ఉన్న అక్కినేని నాగార్జున.. ఆరు పదుల వయసులోనూ ఆ ట్యాగ్ లైన్‌కు జస్టిఫికేషన్ చేస్తున్నారాయన. సినిమాలతోనే కాదు.. బుల్లెతెర మీదకు ఎర్లీ ఎంట్రీ ఇచ్చింది కూడా ఆయనే. అప్‌కమింగ్ స్టేజీలో ఉన్నప్పుడే మాటీవీలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మా టీవీ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. పెట్టుబడులతోనే కాదు బుల్లితెరపైనా నాగ్ తన హోస్టింగ్‌తో ఆడియొన్స్పై మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. అప్పుడెప్పుడో యువ సీరియల్‌తో నిర్మాతగా బుల్లితెరపై అడుగుపెట్టిన నాగ్.. ఆపై మీలో ఎవరు కోటీశ్వరుడు?తో స్మాల్‌స్క్రీన్‌పై విశ్వరూపమే ప్రదర్వించారు. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోల టీఆర్పీ రేటింగ్‌లు చాలూ.. నాగ్ క్రేజ్ ఏంటో మచ్చుకు చెప్పుకోవడానికి. అదే ఆయన బలం. అందుకే ఎండార్స్మెంట్స్ ట్రాజెడీ కింగ్, రొమాంటిక్ హోరోగా అక్కినేని హీరోలకు ఇమేజ్‌ని పెర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఫలితంగా మహిళల్లో నాగ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇది గమనించే తెలివిగా నాగ్‌ను ఎండోర్స్మెంట్ వెపన్‌గా వాడుకుంటున్నాయి పలు కంపెనీలు. నాగ్‌ను యాడ్ల ద్వారా చూపించి.. వాళ్లను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ఆ కోవలోనే కళ్యాణ్ జువెల్లర్స్, సౌతిండియా షాపింగ్‌మాల్, ఘడీ డిటర్జెంట్‌తో పాటు స్పోటిఫై లాంటి ఎనర్జిటిక్ యాడ్లతో మెప్పించారు. టీవీ స్పేస్‌లో నాగ్ ఉన్నాడంటే.. ఆ రిచ్‌నెస్ వేరేలా ఉంటుంది. డిటర్జెంట్ పౌడర్ నుంచి నగల యాడ్స్ దాకా.. మహిళలు బేస్డ్గా ఉండే ఉత్పత్తుల్లో చాలావాటికి ఎండోర్స్మెంట్ చేశారు. యాడ్ల కోసం రాసే స్క్రిప్ట్ ను డైరెక్షన్‌తో సంబంధం లేకుండా మరింత డ్రమటిక్‌గా మార్చడం , ఎమోషన్స్‌తో ప్రజెంట్ చేయడం నాగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ వయసులోనూ ఆయన ఎండోర్స్మెంట్ కింగ్‌గా రాణిస్తున్నాడు. మూవీస్ ప్లస్ స్పోర్ట్స్ సినిమాలు, ఆటలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దీన్ని పసిగట్టిన వెండితెర హీరోల్లో నాగార్జున అగ్రస్థానంలో ఉంటారు. ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు అనేక జట్లకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. 2013 నుంచి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ‘ముంబై మాస్టర్స్’కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో కలిసి, మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి మహీ రేసింగ్ టీం ఇండియాకు, ఇంకోవైపు ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్లో కేరళ బ్లాస్టర్ ఎఫ్సీకి సహ యాజమానిగా ఉన్నాడు నాగ్. రియల్ బిజినెస్‌మ్యాన్ అక్కినేని నాగార్జున గతంలో రెండుసార్లు ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రొడక్షన్ కంపెనీ అన్నపూర్ణ స్టూడియోస్కి నాగార్జున అక్కినేని కో-ఓనర్. ఈ స్టూడియో అనుబంధంగా ఇంటర్నేషనల్‌స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అంతేనా భార్య అమల అక్కినేనితో కలిసి బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఎన్జీవోను నడిపిస్తున్న నాగ్.. ఎయిడ్స్ అవేర్నెస్ ప్రచార కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ ఓవైపు హీరోగా సినిమా కెరీర్ మరోవైపు ఎండోర్స్మెంట్లు, వ్యాపారాలతోనూ బిజినెస్ ‘కింగ్’ అనే ట్యాగ్ లైన్‌కు వందకు వంద శాతం న్యాయం చేస్తున్నారాయన. హీరోల్లో నాగ్ మొదటి నుంచి డిఫరెంట్ రూట్లోనే ప్రయత్నాలు చేస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగ్‌కు ఉన్న పాషన్ అండ్ ఎనర్జీ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే ఆయనకి ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చిపెట్టింది. సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా నిలిపింది. చదవండి: కక క్లాస్.. మమ మాస్ -
ఖాన్‌లను వెనక్కి నెట్టిన ‘ఖిలాడీ’
బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్.. ఖాన్ల త్రయాన్ని వెనక్కి నెట్టేశారు. కమర్షియల్స్ ద్వారా వచ్చే ఆదాయం విషయంలో అక్షయ్ ముగ్గురు ఖాన్ల కంటే ముందున్నారు. సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీకి చాలా పెద్ద పీట వేస్తారు. ఒక్క సినిమా మంచి విజయం సాధిస్తే చాలు.. అవకాశాలతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఒక్క సారి పేరు వస్తే చాలు.. ఆదాయం సంపాదించటానికి ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటారు సెలబ్రిటీలు. సినిమాలతో పాటు టీవీ కమర్షియల్స్, బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ.. కోట్లలో పారితోషికం తీసుకుంటారు. (చదవండి : ఇదేంది అక్షయ్.. ఇట్లా చేస్తివి!?) అలా యాడ్ ఫిలింస్, కమర్షియల్స్‌కు అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో అక్షయ్ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్ చేతిలో రూ.100 కోట్లు విలువ చేసే కమర్షియల్స్ ఒప్పందాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో రణ్వీర్ సింగ్ (రూ.84 కోట్లు), మూడో స్థానంలో ఆయన భార్య దీపికా పదుకొనే (రూ.75 కోట్లు) ఉన్నారు. టాప్ 10లో మిగతా సెలబ్రిటీలు ఏవరంటే.. 4. అమితాబ్ బచ్చన్ (రూ.72 కోట్లు) 5. ఆలియా భట్ (రూ.68 కోట్లు) 6. షారుఖ్ ఖాన్ (రూ.56 కోట్లు) 7. వరుణ్ ధావన్ (రూ.48 కోట్లు) 8. సల్మాన్ ఖాన్ (రూ. 40 కోట్లు) 9. కరీనా కపూర్ (రూ.32 కోట్లు) 10. కత్రినా కైఫ్ (రూ.30 కోట్లు) -
‘సిల్వర్’ సింధు గోల్డెన్ డీల్!
-
‘సిల్వర్’ సింధు గోల్డెన్ డీల్!
హైదరాబాద్: ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు కాసుల పంట కొనసాగుతోంది. ‘సిల్వర్’ సింధు రూ. 50 కోట్లు విలువ చేసే గోల్డెన్ డీల్ పై సంతకాలు చేసినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. వ్యాపార సంస్థలతో ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్న క్రికెటేతర ప్లేయర్ గా సింధు ఘనత సాధించింది. ఆమెతో స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ ’బేస్ లైన్’ మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. సింధు సంతకం చేసిన బెస్ట్ డీల్ ఇదేనని ’బేస్ లైన్’ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు తుహిన్ మిశ్రా తెలిపారు. ‘సింధుకు పెరుగుతున్న పాపులారిటీని వినియోగించుకునేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ఆమె బ్రాండ్ వేల్యూను అత్యధిస్థాయికి పెంచేందుకు ప్రయత్నిస్తాం. ఒలింపిక్స్ అద్భుత విజయం సాధించిన తర్వాత సింధు చూసిన అణకువ, విలువ ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్లింద’ని మిశ్రా అన్నారు. ఇక నుంచి సింధు బ్రాండ్ ప్రొఫెలింగ్, లైసెన్సింగ్, ఎండార్స్ మెంట్స్ ను ‘బేస్ లైన్’ పర్యవేక్షించనుంది. సింధు తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని ఇప్పటివరకు 16 కంపెనీలు సంప్రదించాయని మిశ్రా వెల్లడించారు. తొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు దాదాపు ఖరారయ్యాయని తెలిపారు. వచ్చే వారంలో ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశముందన్నారు. కంపెనీలు పేర్లు ఇప్పుడు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. సింధు ప్రాక్టీసుకు భంగం కలగకుండా ఆమెతో వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేయిస్తామని చెప్పారు. కోలా బ్రాండ్స్ కు ప్రచారం చేయడానికి నిరాకరించిన తన కోచ్ పుల్లెల గోపీచంద్ బాటలో నడవాలని సింధు నిర్ణయించుకుంది. యువతపై ప్రతికూల ప్రభావం చూపే ఉత్పత్తులకు ప్రచారం చేయకూడదని ఆమె భావిస్తోంది. ఎండార్స్ మెంట్స్ తో సింధుకు ఎంత మొత్తంలో డబ్బు ముడుతుందో చెప్పేందుకు మిశ్రా నిరాకరించారు. -
అమాంతం పెరిగిన పీవీ సింధు బ్రాండ్ వాల్యూ
మొన్నటివరకు వర్ధమాన షట్లర్గానే ఉన్న పీవీ సింధు.. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి సింధుకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. సన్మానాలు చేశారు. ఉద్యోగాలు ప్రకటించారు. రియోలో రజతపతకం సాధించాక ఈ తెలుగుతేజం కెరీర్ మారిపోయింది. సింధు బ్రాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరిగింది. ఆమెతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సింధు బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని, ఒప్పందాలు చేసుకోవడంలో తొందరపడబోమని ఆమె ఎండార్స్మెంట్ వ్యవహారాలను చూస్తున్న బ్రాండ్ మేనేజ్మెంట్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ భావిస్తోంది. సింధుతో రెండు ఎండార్స్మెంట్ ఒప్పందాలను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. బేస్‌లైన్ వెంచర్స్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు ముందు ఈ ఎండార్స్మెంట్ ఒప్పందాలు జరిగాయని, సింధు సన్నాహకాల్లో తీరికలేకుండా ఉండటంతో ప్రకటించలేదని చెప్పారు. ఇవి జాతీయ స్థాయిలో మేజర్ ఎండార్స్మెంట్స్ అని చెప్పారు. -
ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే..
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల బోణీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.2,374 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 21.5 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ. 11,267 కోట్ల నుంచి రూ.12,770 కోట్లకు పెరిగింది. వార్షికంగా 13.3 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీలో ఇటీవలే భారీగా యాజమాన్యపరమైన మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో కంపెనీ సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ చిట్టచివరి ఆర్థిక ఫలితాల ప్రకటన ఇది. త్రైమాసికంగా తగ్గింది...: గతేడాది ఆఖరి క్వార్టర్(క్యూ4)తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో(త్రైమాసిక ప్రాతిపదికన) ఇన్ఫీ లాభాలు 3.5 శాతం తగ్గాయి. క్యూ4లో రూ.2,992 కోట్ల లాభం నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం కూడా 0.8 శాతం(క్యూ4లో రూ.12,875 కోట్లు) స్వల్పంగా తగ్గింది. అయితే, డాలరు రూపంలో ఏప్రిల్-జూన్ ఆదాయం 1.95 శాతం పెరిగి 2.133 బిలియన్ డాలర్లకు చేరింది. గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను గతంలో ప్రకటించిన మాదిరిగానే యథాతథంగా కొనసాగించింది. క్యూ4 ఫలితాల సందర్భంగా డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్‌ను 7-9 శాతంగా కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఇదే గెడైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇక రూపాయి ప్రాతిపదికన గెడైన్స్ 5.6-7.6 శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 60 చొప్పున ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. విశ్లేషకుల అంచనాలకు పైనే... బ్రోకరేజి కంపెనీలకు చెందిన విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫీ ఆదాయం సగటున రూ.12,814 కోట్లు, నికర లాభం రూ.2,667 కోట్లుగా అంచనావేశారు. ఈ అంచనాల కంటే మెరుగ్గానే ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో 5 మల్టీమిలియన్ డాలర్ కాంట్రాక్టులు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. వీటి విలువ 70 కోట్ల డాలర్లు. ఇక ఈ కాలంలో మొత్తం 61 క్లయింట్లు కొత్తగా జతయ్యారు. ఇన్ఫీ నిర్వహణ మార్జిన్ క్రితం క్యూ1తో పోలిస్తే 23.5 శాతం నుంచి 25.1 శాతానికి మెరుగుపడింది. జూన్ చివరినాటికి కంపెనీ వద్దనున్న నగదు తత్సంబంధ నిల్వలు కాస్త తగ్గి రూ.29,748 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిచివరికి ఈ మొత్తం రూ.30,251 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో సబ్సిడరీలతో సహా కంపెనీలో కొత్తగా 11,506 మంది ఉద్యోగులు చేరారు. అయితే, కంపెనీని 10,627 మంది వీడటంతో నికరంగా 879 మందికి మాత్రమే జతైనట్లు లెక్క. దీంతో జూన్ చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,61,284కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతానికి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో ఈ రేటు 16.9 శాతం కాగా, క్యూ4లో 18.7%. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 1 శాతం లాభపడి రూ. 3,326 వద్ద స్థిరపడింది. మార్పులు... చేర్పులు.. కొత్త సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా నియామకానికి ఆమోదం కోసం ఈ నెల 30న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. క్యూ1లోనే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్‌లు పదవుల నుంచి వైదొలిగారు. అయితే, అక్టోబర్ 10 వరకూ వాళ్లు ఈ పదవుల్లో తాత్కాలికంగా కొనసాగనున్నారు. అక్టోబర్ 11 నుంచి గౌరవ చైర్మన్‌గా నారాయణ మూర్తి వ్యవహరిస్తారు. అదే రోజు నుంచి కేవీ కామత్ బోర్డు చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, ఈ మార్పుల సందర్భంగానే ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డెరైక్టర్ యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పదోన్నతి పొందారు. మార్పును స్వాగతిస్తున్నా: శిబులాల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్... తన ఆఖరి ఫలితాల ప్రకటనలో కొంత వేదాంత ధోరణితో మాట్లాడారు. శిబులాల్ స్థానంలో శాప్ మాజీ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కాకు వచ్చే నెల 1న బాధ్యతలను అప్పగించనున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం తనతోపాటు మొత్తం ఏడుగురు కలసి ఏర్పాటు చేసిన ఇన్ఫీ ఇప్పుడు 8 బిలియన్ డాలర్ల ఆదాయార్జనగల కంపెనీగా ఎదిగింది. కాగా, ఇప్పటిదాకా కంపెనీ సీఈఓలుగా ఏడుగురు సహవ్యవస్థాపకులే కొనసాగారు. తొలిసారి సిక్కా రూపంలో బయటివ్యక్తి పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ‘అత్యంత పటిష్టమైన మూలాలతో ఉన్న కంపెనీని విడిచివెళ్తున్నా. బలమైన యంత్రాంగాన్ని ఉపయోగించుకుని సిక్కా కంపెనీని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన టీమ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మార్పులనేవి జీవితంలో ఒక భాగమేనని నేను భావిస్తా. అయితే, నా ప్రయాణం చాలా గొప్పగానే సాగింది. గడచిన మూడేళ్లుగా మేం ఎదుర్కొంటున్న అనేక కఠిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటికొస్తున్నాం. ఇంటాబయటా ముఖ్యంగా సిబ్బంది వలసల నుంచి క్లయింట్లను అట్టిపెట్టుకోవడం ఇలా పలు సవాళ్లను మేం దీటుగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ సవాళ్లన్నీ తొలగినట్టే. ఇన్ఫీని వీడుతున్నందుకు నేనేమీ చింతించడం లేదు. జరిగిపోయిన విషయాలపై అతిగా అలోచించే వ్యక్తిని కూడా కాదు. కంపెనీ మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మా నుంచి ఒక్క క్లయింట్ కూడా జారిపోలేదు. యూరప్‌లో కీలకమైన లోడ్స్టోన్ను కొనుగోలు చేయడం మేం తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయం. అంతేకాదు.. 2012-13తో పోలిస్తే గతేడాది మా ఆదాయం రెట్టింపుస్థాయిలో పెరగడం కూడా గమనించాల్సిన విషయం. మా కంపెనీలో అట్రిషన్ రేటు పెరగడం కొంత ఆందోళనకరమైన అంశమే. అయితే, ఐటీ పరిశ్రమలో నిపుణులైన సిబ్బందికి డిమాండ్ అధికంగాఉందన్న పరిస్థితిని ఇది తెలియజేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 22,000 ఫ్రెషర్లకు కంపెనీ క్యాంపస్ ఆఫర్లు ఇచ్చింది. వ్యాపారపరిస్థితికి అనుగుణంగా వీళ్లను దశలవారీగా నియమించుకుంటాం’ అని శిబులాల్ ప్రస్తుత కంపెనీ పరిస్థితిని వివరించారు. -
స్టీవ్ జాబ్స్‌తో మా జాబులు గల్లంతు...
స్టాక్‌హోం: ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్‌పై ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ అక్కసు వెళ్లగక్కారు. స్టీవ్ జాబ్స్ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసి విక్రయించడం వల్లే తమ దేశంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయారనీ, ఫిన్లాండ్ కంపెనీలు ఆత్మరక్షణలో పడిపోయాయనీ చెప్పారు. ‘మా ఆర్థిక వ్యవస్థ ఐటీ, పేపర్ అనే రెండు దిమ్మెలపై నిలబడి ఉండేది. ఐఫోన్ రాకతో నోకియా (ఫిన్లాండ్ కంపెనీ) సంక్షోభంలో పడిపోయింది. ఐప్యాడ్ ప్రవేశంతో పేపరు వినియోగం క్షీణించింది..’ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టబ్ వ్యాఖ్యానించారు. మొబైల్ పరికరాల ఉత్పత్తిలో ఒకనాడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన నోకియా సంక్షోభంలో చిక్కుకోవడంతో ఫిన్లాండ్కు కష్టాలు మొదలయ్యాయి. హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని నోకియా గత ఏప్రిల్‌లో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు విక్రయించింది. రెండేళ్లు పీడించిన ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు ఫిన్లాండ్ అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే స్టబ్ గత నెలాఖరులో ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు. ‘మార్పు ఇప్పుడే మొదలైంది. మా ఐటీ పరిశ్రమ గేమింగ్ వైపు మళ్లుతోంది.. అడవులు కాగితం ఉత్పత్తి కేంద్రాలుగా కాకుండా బయోఎనర్జీ సెంటర్లుగా ఆవిర్భవిస్తున్నాయి. దేశం వెంటనే ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో సంస్థాగత సవరణలు, ఈయూ మార్కెట్ సరళీకరణ, ప్రపంచస్థాయిలో వ్యాపారాన్ని పెంచుకోవడం అనే మూడు చర్యలతో అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు...’ అని ఆయన పేర్కొన్నారు. -
దాల్మియా సిమెంట్ చేతికి బొకారో జేపీ
న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా ఇన్ఫ్రా దిగ్గజం జైప్రకాశ్ అసోసియేట్స్.. బొకారో జేపీ సిమెంట్‌లో తనకున్న మొత్తం 74 శాతం వాటాలను దాల్మియా సిమెంట్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 690 కోట్లుగా ఉండనుంది. దీని ద్వారా వచ్చే నిధులను జేపీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ఉక్కు దిగ్గజం సెయిల్‌తో కలిసి జేపీ అసోసియేట్స్ ఏర్పాటు చేసిన రెండు జాయింట్ వెంచర్లలో బొకారో జేపీ సిమెంట్ (బీవోజేసీఎల్) కూడా ఒకటి. ఇందులో జేపీ గ్రూప్‌కి 74 శాతం, సెయిల్‌కి 26 శాతం వాటాలు ఉన్నాయి. బీవోజేసీఎల్‌కి జార్ఖండ్‌లోని బొకారోలో 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (వార్షిక) గల సిమెంటు ప్లాంటు ఉంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ సారథ్యంలోని ఏసీసీ కూడా బీవోజేసీఎల్ కోసం పోటీపడినప్పటికీ.. దాల్మియా మెరుగైన ఆఫర్ ఇవ్వడంతో దాని వైపు మొగ్గు చూపినట్లు జేపీ అసోసియేట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి దాల్మియా సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సోమవారం కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సెయిల్‌తో మరో జాయింట్ వెంచర్ అయిన భిలాయ్ ప్లాంటు (2.2 మిలియన్ టన్నుల సామర్థ్యం) విషయంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. సిమెంటు తయారీ రంగంలో జేపీ సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద కంపెనీ. రియల్ ఎస్టేట్, విద్యుత్ తదితర రంగాల్లో కూడా గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుతం బీవోజేసీఎల్‌లో 74 శాతం వాటాల కింద 9.89 కోట్ల షేర్లను జేపీ అసోసియేట్స్ (జేఏఎల్) విక్రయిస్తోంది. రూ. 18.57 విలువ చేసే ఒక్కో షేరును దాదాపు రూ. 69.74 ధరకి విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. భాగస్వామ్య సంస్థ సెయిల్‌తో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి విక్రయం జరుగుతుందని వివరించింది. భిలాయ్ జాయింట్ వెంచర్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. సెయిల్‌తో ఉన్న రెండు జాయింట్ వెంచర్ సిమెంట్ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను జేపీ గ్రూప్.. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది. జేపీ గ్రూప్ గతేడాది 4.8 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యమున్న సిమెంట్ ప్లాంటును ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌కి విక్రయించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులను విక్రయించే దిశగా అబుధాబి నేషనల్ ఎనర్జీ కంపెనీతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బోర్డ్ మీటింగ్ నేపథ్యంలో జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో సోమవారం 1.34% లాభపడి రూ.49.05 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ రూ. 5,000 కోట్ల మొండిబకాయిల సేల్!
ముంబై: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్పీఏ) భారాన్ని తగ్గించుకునే దిశగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చకాచకా అడుగులు వేస్తోంది. రెండు వందల సంవత్సరాల చరిత్రలో మొదటిసారి దాదాపు రూ. 5,000 కోట్ల ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ సంస్థలకు (ఏఆర్సీ-ఆర్క్స్) విక్రయించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినెల మార్చిఆఖరునాటికే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎస్బీఐ మొత్తం రూ. 11,39,326 కోట్ల అసెట్స్‌లో (బ్యాంకు ఇచ్చిన రుణాల్లో) స్థూల ఎన్పీఏలు 5.73 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. విలువ రూపంలో ఎన్పీఏల పరిమాణం దాదాపు రూ.67,799 కోట్లు. ఏప్రిల్ నుంచి ప్రొవిజనింగ్ నిబంధనల (నిర్వహణా లాభాల నుంచి ఎన్పీఏలకు జరిగే కేటాయింపు) కఠినతరం అవుతున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ రుణాలకు ప్రొవిజనింగ్ ప్రస్తుత 2 శాతం నుంచి 5 శాతానికి పెరగనుంది. ‘‘ప్రస్తుతం 14 ఏఆర్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మా మొండిబకాయిల మొత్తాల్లో దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ఎన్పీఏలను విక్రయించడానికి వీటిలో (ఏఆర్సీ) పలు సంస్థలను ఆహ్వానించాం. అధిక బిడ్డర్లకు ఎన్‌పీఏల్లో అధిక మొత్తాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరుకే ప్రక్రియను పూర్తిచేయాలన్న నిశ్చయంలో ఉన్నాం’’ అని సీనియర్ ఎస్బీఐ అధికారి వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయాన్ని బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య మార్చి 8వ తేదీనే ప్రకటించారు. అయితే నిర్దిష్టంగా ఎంతమొత్తమన్న విషయాన్ని వెల్లడించలేదు. కొనుగోలు చేస్తున్న మొండిబకాయిల్లో 5 నుంచి 10 శాతం వరకూ నగదు రూపంలో తక్షణం ఏఆర్‌సీలు చెల్లిస్తాయి. మిగిలిన మొత్తాలు సెక్యూరిటీ రిసిట్స్(ఎస్ఆర్) రూపంలో ఉంటాయని ఇంతక్రితం ఎస్బీఐ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి.