క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. కాబట్టి సచిన్ టెండూల్కర్ గురించి దాదాపు అందరికి తెలుసు. సచిన్ ఆటల్లో మాత్రమే కాదు ఆటో మోటివ్ ఔత్సాహికుడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఈ రోజు క్రికెట్ గాడ్ సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆస్తులు విలువ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి వంటి విషయాలతో వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
క్రికెట్ తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1350 కోట్ల కంటే ఎక్కువ. బెంగళూరులో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం.
(ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..)
11 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఇప్పుడు క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్న సచిన్ ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు.
(ఇదీ చదవండి: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని)
క్రికెట్ అంటే ప్రాణమిచ్చే సచిన్ మొదటి కారు మారుతి 800 కావడం గమనార్హం. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో బిఎండబ్ల్యూ 30 జహ్రే ఎమ్5, ఎమ్ 6 గ్రాన్ కూపే, 7 సిరీస్, నిస్సాన్ జిటి-ఆర్, ఐ8, ఫెరారీ-360-మొడెనా మొదలైనవి ఉన్నాయి. సచిన్ వద్ద ఉన్న కార్ల ఖరీదు రూ. 15 కోట్లకంటే ఎక్కువ.
ఖరీదైన కార్లు, బంగ్లా కలిగి ఉన్న సచిన్ పెప్సి, అడిడాస్, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, ఎయిర్‌టెల్, కోకాకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ. 17 నుంచి 20 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment