ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్‌! 'ఆమెతో ఉన్నదెవరు?' | Surbhi Chandna Gets Mistaken for Yuzvendra Chahal Wife Dhanashree Verma | Sakshi
Sakshi News home page

వీడియో షేర్‌ చేసిన నటి.. ధనశ్రీపై ట్రోలింగ్‌

Published Thu, Apr 25 2024 2:34 PM | Last Updated on Thu, Apr 25 2024 2:38 PM

Surbhi Chandna Gets Mistaken for Yuzvendra Chahal Wife Dhanashree Verma

ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది.. అలా ప్రేమ పక్షులకు పెద్దలనొప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. బుల్లితెర లవ్‌ బర్డ్స్‌ సురభి చందన- కరణ్‌ శర్మ 13 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల సమ్మతితో జైపూర్‌లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మార్చిలో పెళ్లిపీటలెక్కిన ఈ జంట వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా సురభి.. స్విమ్మింగ్‌ పూల్‌లో భర్తతో జలకాలాటలు ఆడిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

రోజుకో వ్యక్తితో..
ఇది చూసిన కొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. సురభిని.. క్రికెటర్‌ చాహల్‌ భార్య ధనశ్రీగా పొరపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే నీ జీవితమే వేస్ట్‌ అవుతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతావు. తను రోజుకో వ్యక్తితో ఎంజాయ్‌ చేస్తుంది' అని ఓ యూజర్‌ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరో నెటిజన్‌.. 'ఈమె ధనశ్రీయా? నమ్మలేకపోతున్నాను.. సారీ చాహల్‌.. నువ్వు ఆమెను భాగస్వామిగా ఎంచుకుని తప్పు చేశావు' అని రాసుకొచ్చాడు.

చాహల్‌ను ట్యాగ్‌ చేస్తూ..
మరో వ్యక్తి ఏకంగా చాహల్‌ను ట్యాగ్‌ చేస్తూ.. 'నిన్ను ట్యాగ్‌ చేస్తున్నందుకు వెరీ సారీ.. కానీ చూశావ్‌గా.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది. అసలు ఇలా ఎవరైనా చేయగలరా?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధనశ్రీతో ఉన్న వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఇది చూసిన నటి అభిమానులు.. ఆమె ధనశ్రీ కాదు.. నటి సురభి చందన అని కామెంట్స్‌తో క్లారిటీ ఇస్తున్నారు.

సీరియల్‌ కెరీర్‌
సురభి చందన విషయానికి వస్తే.. 'ఇష్క్‌బాజ్‌', 'సంజీవ‌ని', 'నాగిన్ 5', 'హున‌ర్బాజ్‌:  దేశ్ కీ షాన్‌', 'ఖుబూల్ హై', 'తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా' ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్‌ చిత్రంతో వెండితెరపైనా మెరిసింది. కరణ్‌ శర్మ.. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'ప‌విత్ర రిష్తా' వంటి సీరియ‌ల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం 'ఉదారియ‌న్' అనే ధారావాహికలో నటిస్తున్నాడు.

 

 

చదవండి: OTT: ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు.. వీకెండ్‌లో ఓ లుక్కేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement