‘బీరువా’లో ఏముంది? | Sundeep Kishan's next film is Beeruva | Sakshi
Sakshi News home page

‘బీరువా’లో ఏముంది?

Published Tue, Nov 11 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

‘బీరువా’లో ఏముంది?

‘బీరువా’లో ఏముంది?

సమస్యలు ఎదురైనప్పుడు స్నేహితులు ఆదుకోవడం సహజం. కానీ సంజుగాణ్ణి మాత్రం ఓ ‘బీరువా’ ఆదుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఈ సంజుగాడు ఎవరు? ప్రాణం లేని బీరువా సంజుగాణ్ణి ఆదుకోవడమేంటి? ఈ నేపథ్యంలో ‘బీరువా’ చిత్రం రూపొందింది. ఉషాకిరణ్ ఫిలింస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, సురభి జంటగా నటించారు. కణ్మణి దర్శకుడు. నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కెమేరామేన్ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ -‘‘ఇద్దరు అగ్ర నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ చిత్రం విభిన్నంగా, వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు.

బీరువా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తోందనీ, సందీప్ పాత్ర వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా కమర్షియల్‌గా కొత్తగా ఉంటుందని, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని సందీప్‌కిషన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: తమన్, నిర్మాత: రామోజీరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement