సురభి ఎదురు చూపులు | Actress Surabhi hopes in pugal movie | Sakshi
Sakshi News home page

సురభి ఎదురు చూపులు

Published Tue, Apr 7 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

సురభి ఎదురు చూపులు

సురభి ఎదురు చూపులు

నటి సురభి పుగళ్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రంతో కోలీవుడ్‌లో తన స్థాయి పెరుగుతుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నది. విక్రమ్ ప్రభు సరసన ఇవన్ వేర మాదిరి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగు పెట్టిన సురభి ఆ తర్వాత ధనుష్ చిత్రం వేలైఇల్లాద పట్టదారి చిత్రంలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు ఆశించిన మేరకు రాలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి పెట్టే పనిలో పడ్డారు. అక్కడ ఓ చిత్రంలో నటించి, మళ్లీ కోలీవుడ్‌కు తిరుగు పయనమయ్యారు.
 
  ప్రస్తుతం జై సరసన పుగళ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంగీకరించినప్పుడు గ్లామరస్‌గా నటించనని తొలుత కండీషన్ పెట్టిన సురభి, తర్వాత  పాటల సన్నివేశాల్లో మాత్రం అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పుగళ్ రాజకీయ నేపథ్యం కథా చిత్రం కావడంతో జైతో పాటుగా తనకు ఈ చిత్రం మంచిపేరు తెచ్చి పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. అందువల్ల చిన్న చిన్న చిత్రాల అవకాశాలు వచ్చినా తోసి పుచ్చి పెద్ద హీరోల చిత్రాల్లో రెండో హీరోయిన్ అయినా, నటించేందుకు సిద్ధం అని అంటున్నట్టు కోలీవుడ్‌లో టాక్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement