
ఆయనతో నటించడం థ్రిల్లింగా ఉంది
కవ్వించే గుండ్రటి అందమైన కళ్లు, తాకితే కందిపోతాయన్నంతగా బుగ్గలు, ఆకర్షణీయమైన పెదాలు మొత్తంగా బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అంటారే అలాంటి సొగసైన చిన్నది సురభి. కోలీవుడ్‌లో తొలి చిత్రం ఇవన్ వేరమాదిరితోనే సక్సెస్‌ఫల్ నటిగా పేరు తెచ్చుకున్న ఈ వన్నెల చిన్నదానికి టైమ్ బాగుంది. రెండు మూడు చిత్రాలతోనే బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇవన్ వేరమాదిరి చిత్రం తరువాత సురభి ధనుష్ సరసన వేలైఇల్లాద పట్టాదారి చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. తాజాగా నటుడు జయ్‌తో పుగళ్ చిత్రంలో నటిస్తోంది. ఫిలిం డిపార్ట్‌మెంట్ పటాకంపై శుశాంత్ నిర్మిసున్న ఈ చిత్రానికి మణిమారన్ దర్శకుడు.
ఈ చిత్రంలో నటించిన అనుభవం తదితర విషయాల గురించి సురభి ఏం చెబుతుందో చూద్దాం. పుగళ్ చిత్రంలో భువన పాత్రలో నటిస్తున్నాను. ఇది చాలా బోల్డ్ క్యారెక్టర్. నిజ జీవితంలో ఎలా ఉంటానో అలానే ఏ విషయాన్నయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే పాత్ర. బహుశ అందుకేనేమో ఈ పాత్ర నాకు బాగా నచ్చింది. చిత్ర హీరో జయ్‌తో నటించడం చాలా థ్రిల్‌గా ఉంది. జయ్ ఏ కార్యం తలపెట్టినా అందులో పూర్తిగా ఏకాగ్రత పెట్టి శ్రమించే వ్యక్తి జయ్. కారు రేస్‌లో కూడా పాంటున్నారు.
అజిత్‌లాగా జయ్ కూడా పలు కారు రేసులో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక పుగళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం. దర్శకుడు మణిమారన్ మంచి ప్రతిభావంతుడు. చిత్రాన్ని ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా తెరకెక్కస్తున్నారు. తాను రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న అటాక్ హిందీ చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రానికిది తర్ఫీదులా ఉంది. అటాక్ చిత్రంలో బైక్ మెకానిక్‌గా నటిస్తున్నాను. ఇలాంటి పాత్రను నిజ జీవితంలో చూడలేదు. అందువల్ల ఈ పాత్రను సవాల్‌గా తీసుకుని నటిస్తున్నాను. కాగా పుగళ్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం జరగనుంది అని నటి సురభి తెలిపారు