అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్బీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగరుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. టీజర్ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ‘‘టీజర్‌లో చెప్పిన ‘నేను ప్రేమిస్తే.. ’ డైలాగ్ శాంపిల్ మాత్రమే. సినిమాలో ఇంకా సస్పెన్స్ ఉంది. మణిశర్మగారి సంగీతం సినిమాకు ఫ్లస్. దర్శకుడి మార్క్ చూసించే సినిమా ఇది’’ అన్నారు హీరో అల్లు శిరీష్. ‘‘సినిమా కోసం శిరీష్ చాలా కష్టపడ్డారు. గతేడాది నవంబర్‌లో హీరోకి, నిర్మాతకు కథ చెప్పా. వాళ్లు నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు ఆనంద్. ‘‘ కథకు తగ్గ టైటిల్ పెట్టాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’అన్నారు చక్రి. ‘‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సినిమా’’అన్నారు రచయిత అబ్బూరి రవి.
Comments
Please login to add a commentAdd a comment