allu shirish
-
ఆ పెయిన్ నాకు తెలుసు: అల్లు శిరీష్
‘‘ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యంగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. కొంత బ్యాడ్ ప్లానింగ్ కూడా కారణం అనిపిస్తోంది. సాధారణంగా చిన్న, పెద్ద... ఏ సినిమా అయినా సరే అనుకున్న సమయానికి దాదాపు పూర్తి కావడం లేదు. ఎంతో కొంత ఆలస్యం అవుతున్నాయి’’ అని అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. కేఈ జ్ఞానవేల్ రాజా, అధనా జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో అల్లు శిరీష్ చెప్పిన సంగతులు.⇒ ‘బడ్డీ’ కథను దర్శకుడు శామ్ చెప్పినప్పుడు టెడ్డీ బేర్ పాయింట్‌తో ఆల్రెడీ తమిళంలో ‘టెడ్డీ’, ఇంగ్లిష్‌లో మరో మూవీ ఉందని చెప్పాను. ‘బడ్డీ’ కథ విన్నాక ఓటీటీలో ‘టెడ్డీ’ చూడండి... కచ్చితంగా ‘బడ్డీ’ కొత్తగా అనిపిస్తుందని శామ్ అన్నారు. దీంతో ‘బడ్డీ’ కథ విన్నాను. టెడ్డీ బేర్లోకి ప్రాణం రావడం అనే పాయింట్ తప్ప మిగతా అంతా కొత్తగా అనిపించింది. హీరో, విలన్‌కు మధ్య ఉండే ఘర్షణ, హీరో క్యారెక్టరైజేషన్, లవ్ స్టోరీ... అంతా కొత్తగా డిజైన్ చేసినట్లనిపించింది. అందుకే ‘బడ్డీ’ ఒప్పుకున్నాను. ⇒ ‘బడ్డీ’ పోస్టర్ బయటకు రాగానే ఇది తమిళ మూవీ ‘టెడ్డీ’కి రీమేక్ కదా అనే కామెంట్స్ వినిపించాయి. ‘కాదు... మేం కష్టపడి స్ట్రయిట్‌గా చేసిన తెలుగు సినిమా’ అని చెప్పడమే మాకు సవాల్‌గా అనిపిస్తోంది. మేం ఎంత చెప్పినా రీమేక్ అని కామెంట్స్ చేసేవారు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిని మార్చలేం. ⇒ ‘బడ్డీ’ని గతేడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ టెడ్డీ బేర్ ఎమోషన్స్, లుక్స్‌తో పాటు సినిమాలో మూడువేలకు పైగా గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయి. వీటిని కరెక్ట్‌గా చేయించాలంటే చేసే ఆర్టిస్టులకు సమయం ఇవ్వాలి. అందుకే రిలీజ్ ఆలస్యమైంది. ∙కథగా చెప్పాలంటే ‘బడ్డీ’ లవ్‌స్టోరీ. హీరో పైలట్. హీరోయిన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. హీరోయిన్‌కు హీరో తెలుసు. కానీ హీరోకు హీరోయిన్ తెలియదు. ఫైనల్‌గా వీరి లవ్‌స్టోరీ ఏమైంది? మధ్యలో ‘బడ్డీ’ క్యారెక్టర్ ఏంటి? అన్నది కథ. ⇒ జ్ఞానవేల్ రాజాగారు సినిమాను రిచ్‌గా నిర్మించారు. నాకుప్రోడక్షన్లో కాస్త అనుభవం ఉంది. కానీ నేను హీరోగా చేసే సినిమాలప్రోడక్షన్ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోను. ఓ ప్రముఖ నిర్మాత (అల్లు అరవింద్) తనయుడిగా,ప్రోడక్షన్ గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా వేస్ట్ప్రోడక్షన్ వల్ల కలిగే పెయిన్ నాకు తెలుసు. అందుకే వృథా ఖర్చుని ్రపోత్సహించను. -
అల్లు శిరీష్ 'బడ్డీ' వచ్చేస్తున్నాడు.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తోన్న తాజా చిత్రం 'బడ్డీ'. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజగా బడ్డీ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఆగస్టు 2న బడ్డీ వస్తున్నాడు.. క్యాలెండర్లో ఈ డేట్‌ను మార్క్ చేసుకోండి.. థియేటర్లలో కలుసుకుందాం' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో టెడ్డీ బేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో హీరో అల్లు శిరీష్ కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బడ్డీ ప్రేక్షకులను అలరించనున్నారు. చాలా రోజుల తర్వాత అజ్మల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.Buddy is now releasing on August 2nd. Please mark the date on your calendar. And see you soon in the theatres!!! 🐻🧸✨ pic.twitter.com/JqcJNqhlBe— Allu Sirish (@AlluSirish) July 17, 2024 -
Allu Aravind Birthday: నిర్మాత అల్లు అరవింద్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు (ఫొటోలు)
-
'ఊర్వశివో రాక్షసివో' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈ రోజు కోసమే ఎదురు చూశాను : అల్లు అర్జున్
‘‘నా సినిమా హిట్ అయినా కూడా నేను ఇంత ఆనందంగా ఉండను.. నా తమ్ముడు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ తో హిట్ కొట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది.. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఊర్వశివో రాక్షసివో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఈ సినిమా మా గీతా ఆర్ట్స్‌కి, మా నాన్న–అమ్మలకు, నాకు, శిరీష్‌కి చాలా స్పెషల్ ఫిల్మ్. ఇకపై ఈ బ్యానర్లో ఎన్ని హిట్స్ వచ్చినా ‘ఊర్వశివో రాక్షసివో’ మరచిపోలేని అనుభూతి. ఈ హిట్ ఇచ్చిన రాకేష్ శశికి కృతజ్ఞతలు. శిరీష్‌తో హిట్ కొట్టిన మా నాన్నకి కంగ్రాట్స్. ఈ చిత్రంలో శిరీష్ నటన బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా తనని మరో మెట్టు ఎక్కించింది. ‘పుష్ప 1’ తగ్గేదే లే.. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే. ఈ సినిమా పాజిటివ్‌గా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘ఐకాన్‌స్టార్‌గా ఆల్ ఇండియా స్థాయికి వెళ్లిపోయిన మన బన్నీ(అల్లు అర్జున్). ఇప్పుడిప్పుడు సక్సెస్ చూస్తూ స్టార్‌గా ఎదుగుతున్న మన శిరీష్. వాళ్లిద్దరూ ఇక్కడ ఉంటే నాకంటే ఆనంద పడేవారు ఎవరుంటారు. ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘20 ఏళ్ల క్రితం ‘ఆర్య’ సినిమాతో నేను, సుకుమార్, బన్నీ కలిసి ప్రయాణం స్టార్ట్ చేశాం. ఈ రోజు మేము, మా సంస్థ పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయాం. ‘ఆర్య’ చేసేందుకు ముఖ్య కారణం అల్లు అరవింద్‌గారు. ‘ఊర్వశివో రాక్షసివో’తో మంచి సక్సెస్ అƇదుకున్న టీమ్‌కి అభినందనలు. శిరీష్‌తో నేను ఓ సినిమా చేయాలి.. త్వరలో చేసి, తన బాకీ తీర్చేస్తాను’’ అన్నారు. ‘‘ఊర్వశివో రాక్షసివో’ ప్రయాణంలో నాకు సపోర్ట్ చే సిన అరవింద్, బన్నీవాస్గార్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంత మంచి హిట్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని. ‘‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా సక్సెస్‌ని అల్లు శిరీష్గారిని అభిమానించే వారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు రాకేష్ శశి. ‘‘అరవింద్‌గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్ని అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు.. తన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం’’ అన్నారు శిరీష్. ఈ వేడుకలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ఎస్కేఎన్, నటుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఈ భామ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చినా సంగతి తెలిసిందే. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. తాజాగా ఈ వార్తలపై అను ఇమ్మానియేల్ స్పందించారు. (చదవండి: అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్) అను మాట్లాడుతూ.. 'అందులో ఎలాంటి నిజం లేదు. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సహజం. ఇలాంటి అసత్య ప్రచారాలను నేను పట్టించుకోను. ఈ వార్తలు చదివి మా అమ్మ చాలా బాధపడింది' అని తెలిపింది. అను ఇమ్మానియేల్, అల్లు శిరీష్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. యువతను ఆకర్షించేలా ప్రేమ, సహజీవనం అంశాలతో ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైన నాటి నుంచి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వరుస వార్తలు వైరలయ్యాయి. -
మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్
‘‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర కథని తమ్మారెడ్డి భరద్వాజగారు అందించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత ఆయన నుంచి నాకు వరుసగా కాల్స్ వచ్చాయి. తన కథను మేము సరిగ్గా తీయలేకపోయారని అంటారేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డా.. కానీ, సినిమా చాలా బాగా తీశారని ఆయన చెప్పడంతో సంతోషపడ్డాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మధ్య తరగతి అబ్బాయిగా శిరీష్ బాగా నటించాడు. మా సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘కపట నాటక సూత్రధారి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ‘‘దాసరి నారాయణరావు, బాలచందర్‌గార్లు మధ్య తరగతి సమస్యలను అందంగా, సరదాగా చెప్పేవారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఊర్వశివో రాక్షసివో’లో చూపిస్తుండటం హ్యాపీ’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ఇంటికెళ్లిన తర్వాత కూడా ప్రేక్షకులు మా మూవీ గురించి ఆలోచిస్తారు’’అన్నారు అల్లు శిరీష్. -
నాకు రెండు, మూడు సీరియస్ రిలేషన్స్ ఉన్నాయి: అల్లు శిరీష్
అల్లు హీరో శిరీష్ నటించి లేటెస్ట్ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్‌పై స్పందించాడు. మూవీలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ గురించి చెబుతుండగా యాంకర్ నిజ జీవితంలో కూడా రిలేషన్స్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే.. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్ రిలేషన్స్ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. ఆ బ్రేకప్స్ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. బ్రేకప్ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అల్లు శిరీష్ క్రేజీ అప్డేట్.. కొత్త సినిమా టీజర్ ఆరోజే..!
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్రబృందం. ఈ మూవీకి 'ఊర్వశివో రాక్షసివో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. (చదవండి: అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్) టైటిల్ పోస్టర్లో అల్లు శిరీష్ – అను ఇమ్మానియేల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం రొమాంటిక్ కథ అని తెలుస్తోంది. నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. తాజాగా ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. The teaser of our film #UrvasivoRakshasivo will be out on the 29th September (Thursday). Cant wait to share it with you :) pic.twitter.com/lR938fFE4i — Allu Sirish (@AlluSirish) September 26, 2022 -
ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్
Allu Sirish Shocking Tweet About AHA App Goes Viral: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన తెలుగు ఏకైక ఓటీటీ యాప్ ఆహా. లెటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు సరికొత్త రియాలిటీ షోతో ఆహా డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆహా స్థాపించిన కొద్ది కాలంలోనే అగ్ర ఓటీటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఆహా సబ్‌స్రైబర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఆహాతో తనకు సంబంధం లేదంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు అల్లు వారి వారసుడు, హీరో అల్లు శిరీష్. చదవండి: ‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్ దీంతో అతడి ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ మారింది. కాగా ఆహా సబ్స్రైబర్లు యాప్‌లో ఏమైన సమస్యలు ఎదురైతే ట్వీటర్ వేదిక తమ సమస్యలను లెవనెత్తుతున్నారు. యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను చెబుతూ దీనిని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆహా వీడియోస్ టీంతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఆహాలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సోషల్ మీడియాలో వీరిని ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై అల్లు శిరీష్ స్పందించాడు. అతడు ఈ ట్వీట్‌ని షేర్ చేసి.. ‘ఆహాని ట్యాగ్ చేస్తూ చాలామంది నేను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు. దయచేసి ఆహా టీం ఈ కంప్లైంట్స్‌ని చూడండి’ అంటూ పోస్ట్ చేశాడు. శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘ఏంటి శిరీష్‌కు ఆహాకి సంబంధం లేదా’ ప్రశ్నిస్తున్నారు. అంతేగా ఆహా అల్లు ఫ్యామిలీదే కదా, ఆహాతో తనకు సంబంధం లేకపోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘శిరీష్ ఇంకా ఆహా బాధ్యతలను స్వీకరించలేదేమో అందుకే ఇలా స్పందించాడు’ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నా బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య అయితే ఆహాలో అల్లు అరవింద్ మాత్రమే కాక మరికొంతమంది ఇందులో పార్ట్నర్లుగా ఉన్నారు. ఐకాన్ స్టార్, అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆహాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆహా చేసే ప్రతి ఈవెంట్లోనూ అల్లు అర్జున్ భాగమవుతున్నాడు. అలాగే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా ఆహాకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్నాడు. ఇలా అల్లు వారి వారసులు ఆహాలో ఏదోకవిధంగా భాగమవుతున్నారు. అయితే ఇంతవరకు అల్లు శిరీష్ మాత్రం ఆహాలోని ఏ ఈవెంట్లో కనిపించకపోవడం గమనార్హం. Dear @ahavideoIN, lots of ppl tagging me thinking I'm involved with Aha. Kindly address the customer complaints. https://t.co/xbt4xkdfhr — Allu Sirish (@AlluSirish) January 15, 2022 -
షర్ట్ విప్పి కండలు చూపిస్తున్న అల్లు శిరీష్.. ఫోటోలు వైరల్
తండ్రి బడా నిర్మాత, అన్న స్టార్ హీరో అయినప్పటీకీ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు అల్లు శిరీష్. ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలు కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. అవార్డు ఫంక్షన్లకు తనదైన శైలీలో హోస్టింగ్ చేసి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇక కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్లకి బ్రేక్ పడడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు ఈ అల్లు హీరో. ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. అల్లు శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.అల్లు శిరీష్ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాతో వచ్చిన శిరీష్ గత ఏడాది ఖాళీగానే ఉన్నాడు. ఆ మధ్య బాలీవుడ్లో ‘విలయాటి షరాబి’మ్యూజిక్ ఆల్భమ్‌లో నటించాడు. ప్రస్తుతం కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం వాటిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
పుష్ప మూవీ ఫస్ట్ మీట్ ఫోటోలు
-
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ బాబాయ్ : అల్లు అయాన్
-
ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. : బన్నీ
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అరవింద్‌కు ఆయన కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే డాడీ.. ఎప్పటికీ నువ్వే నా ఫెవరేట్.. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అని పేర్కొన్నారు. మెగా హీరో సాయిధరమ్‌తేజ్ కూడా అరవింద్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. తమకు ధైర్యం ఇవ్వడంతోపాటు.. సపోర్టింగ్ పిల్లర్‌గా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. నువ్వే నా ఫస్ట్ హీరో.. హీరో అల్లు శిరీష్ కూడా తన తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే డాన్ కార్లియోన్. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ హీరో. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో, ఎంత కృతజ్ఞత ఉందో మాటల్లో వ్యక్తపరచలేను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని శిరీష్ పేర్కొన్నారు. ఇంకా రాశీ ఖన్నా, రష్మికా మందన్నా, లావణ్య త్రిపాఠి, బోయపాటి శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, గోపిచంద్ మలినేని, మారుతి, హరీశ్ శంకర్లతోపాటు పలువురు అరవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కాగా, ఇటీవల జరిగిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం ‘మ్యూజికల్ కన్సర్ట్’లో అల్లు అర్జున్ తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయిన సంగతి తెలిసిందే. తన తండ్రి అంత గొప్పవాడిని కాలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి తొలిసారిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న అల.. వైకుంఠపురములో చిత్రంపై భారీ అంచనాల నెలకొన్నాయి.(అల్లు అర్జున్ భావోద్వేగం) Happy Birthday Dad. You will always be my favourite ... can’t say more ❤️ pic.twitter.com/mGLcQWXdbU — Allu Arjun (@alluarjun) January 10, 2020 Happy birthday Don Corleone! You'll always be my first hero. Words can't express how much gratitude and love I have you. Thank you for everything. 🤗♥️😘 #HBDAlluAravind pic.twitter.com/JzfL1QVPkq — Allu Sirish (@AlluSirish) January 10, 2020 -
ఏబీసీడీలకు వేళాయె
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన చిత్రం‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఎన్నారై పాత్రలో అల్లు శిరీష్, అతని స్నేహితుడి భరత్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల విడుదలై టీజర్‌కు అనూహ్య స్సందన వచ్చింది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందుకున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
డబ్బులు తక్కువ... ఖర్చులు ఎక్కువ!
అన్ని సౌకర్యాలతో హాయిగా లైఫ్‌ని లీడ్ చేసే ఓ విదేశీ కుర్రాడు ఇండియాలో మిడిల్ క్లాస్ జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. పాకెట్ మనీ తక్కువై... ఖర్చులు ఎక్కువయ్యాయి. ఐదు వేల రూపాయలతో నెల మొత్తం గడపాలి. ఆ కుర్రాడికి ఎందుకీ పరిస్థితి వచ్చింది? అనే అంశాలను మాత్రం వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అనేది ఉపశీర్షిక. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించారు. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అల్లు శిరీష్‌గారితో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘మెల్ల మెల్లగా..’, ‘ముంతకల్లు’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. చిత్రీకరణ పూర్తయింది. ప్యాచ్‌వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి’’ అని అన్నారు. నాగబాబు, భరత్ తదితరులు నటించిన ఈ సినిమాకు ధీరజ్ మొగిలినేని సహ–నిర్మాత. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఈ చిత్రం తెలుగు రీమేక్. -
సిడ్కి పెద్ద ఫ్యాన్‌ని – అల్లు శిరీష్
‘‘ఏబీసీడి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సంగీత దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బెంగళూర్ వెళ్లినప్పుడు రేడియోలో ఓ పాట విని జుడా శాండీ అయితే బావుంటుంది అనుకున్నాను. ఈ సినిమాతో తనని తెలుగుకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏబీసీడి’. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సిడ్ శ్రీరామ్ ఆలపించిన ఈ సినిమాలోని తొలి పాటను బుధవారం రిలీజ్ చేశారు. నిహారిక కొణిదెల బిగ్ సీడీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘జుడా శాండీగారికి మా సినిమా ద్వారా తెలుగుకు ఆహ్వానం పలుకుతున్నాం. సిడ్ శ్రీరామ్ చక్కగా పాడారు’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకీ అవకాశం ఇచ్చిన శిరీష్‌గారికి రుణపడి ఉంటా. యష్ రంగినేనిగారికి, ధీరజ్ మొగిలినేనిగారికి థ్యాంక్స్. మంచి సంగీత దర్శకుడిగా శాండీ పేరు తెచ్చుకుంటారు’’ అన్నారు సంజీవ్ రెడ్డి. ‘‘సిడ్ శ్రీరామ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నా సినిమాకు పాడటం గౌరవంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నా. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు శిరీష్. భరత్, రుక్సార్ థిల్లాన్, ఎస్కేయన్ పాల్గొన్నారు. -
శిరీష్ చిందేస్తే..
హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ కి ఇది రీమేక్. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్నారు. డి.సురేశ్ బాబు సమర్పణలో యశ్ రంగినేని, ‘మధుర’ శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ ఫోక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. జుధా సాంధీ స్వరకర్త. ఫోక్ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి.. శిరీష్ వేస్తున్న స్టెప్పులు ఆడియన్స్‌ను ఏ రేంజ్లో ఉర్రూతలూగిస్తాయనే విషయం థియేటర్స్‌లోనే తెలుస్తుంది. మార్చి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
రియల్‌గా అంకుల్.. రీల్‌పై ఫాదర్
‘‘విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రంలో హీరో ఫాదర్ ఎవరు? ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో ఎన్టీఆర్ నాన్నగా ఎవరు నటించారు? ఆ సినిమాల్లో నాన్నగా నటించిన నాగబాబుగారే మా సినిమా ‘ఏబిసిడి’లోను నాన్నగా నటిస్తున్నారు’’ అంటున్నారు అల్లు శిరీష్ . ‘‘నాగబాబుగారితో ఇది నా మొదటి సినిమా. ఆయన నాకు రియల్ లైఫ్‌లో అంకుల్, ఇప్పుడు రీల్ లైఫ్‌లో ఫాదర్‌గా నటిస్తున్నారు. నేను ఈ కథ విన్నప్పుడే తండ్రి పాత్రకు నాగబాబు గారిని తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాను. అనుకున్నట్టుగానే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆనందంగా ఉంది’’ అని కూడా అన్నారు శిరీష్. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ అల్లు శిరీష్ హీరోగా మధుర ఎంటర్టైన్మెంట్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్‌బెన్ సినిమా బ్యానర్‌పై యష్ రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘ఏబిసిడి’. రుక్సార్ థిల్లాన్ కథానాయిక. బాలనటుడు భరత్ ఈ చిత్రంలో హీరో శిరీష్ ఫ్రెండ్‌గా నటిస్తున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా ధీరజ్ మొగిలి వ్యవహరిస్తు్తన్నారు. -
ధనిక కుర్రాడి పేద జీవితం!
ధనిక కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు పేద జీవితం గడపాల్సి వచ్చింది. ఎందుకు అంటే మలయాళ ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాలో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ‘ఏబీసీడీ’ పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ‘అల్లు’ శిరీష్ హీరోగా నటిస్తున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో సంజీవ్‌రెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు. ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని సహ–నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అల్లు శిరీష్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. బాలనటుడిగా పేరు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. జుధా సాంధీ మంచి çస్వరాలు అందిస్తున్నారు’’ అన్నారు. -
ఏబీసీడీలకు వేళాయె
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని అల్లు శిరీష్ కథానాయకుడిగా తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుక్సార్ థిల్లాన్ కథానాయిక. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాతల అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా మరో నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. పలు చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన మాస్టర్ భరత్ ‘ఏబీసీడీ’ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని. -
బంపర్ చాన్స్
ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే హీరో సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో క్రేజ్ మొదలైంది. ఇందుకు నటీనటుల ఎంపిక ఒక కారణం. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో ఆల్రెడీ మోహన్‌లాల్, అల్లు శిరీష్ కీలక పాత్రలు చేయనున్నారు. తాజాగా ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ సాయేషా సైగల్ కథానాయికగా నటించనున్నారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే సాయేషా బంపర్ చాన్స్ కొట్టేసినట్లే. మరి.. స్టార్ హీరో సూర్య సరసన అంటే బంపర్ చాన్సే కదా. మూడేళ్ల క్రితం నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ చిత్రంలో ఈ బ్యూటీనే హీరోయిన్. ఆ తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేయలేదు కానీ కోలీవుడ్‌లో మాత్రం జోరుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘జుంగా’, కార్తీ హీరోగా నటించిన ‘కడైకుట్టి సింగమ్’, ఆర్య లీడ్ రోల్ చేస్తున్న ‘గజనీకాంత్’ సినిమాలతో బిజీగా ఉన్నారీ బ్యూటీ. కార్తీ నటించిన ‘కుడైకుట్టి సింగమ్’, తెలుగులో ‘చినబాబు’ పేరుతో రిలీజ్ కానుంది. -
మన సినిమాలు అక్కడవరకూ వెళ్లాలి
‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో తెలుగు సినిమాల ప్రదర్శన లేకపోవడం బాధాకరం. ఈ విషయం గురించి తెలుగు ఇండస్ట్రీలో కొంతమందితో మాట్లాడాను. అయితే కాన్స్ ఉత్సవాల వరకూ ఎలా వెళ్లాలి? అనే విషయంలో తమకు సరైన అవగాహన లేదన్నట్లుగా వారు చెప్పారు. మన వైపు నుంచి ప్రయత్నం ఉంటే బాగుంటుందని ఐ అండ్ బీ మినిస్ట్రీ పేర్కొంది’’ అని అల్లు శిరీష్ అన్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కాన్స్ చలన చిత్రోత్సవాలకు శిరీష్ వెళ్లారు. ఈ సందర్భంగా తన అనుభవాల గురించి శిరీష్ మాట్లాడుతూ– ‘‘ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే చిత్రాలను చూసేందుకు, విభిన్న చిత్రాలను తీసే దర్శకులను కలిసి మూవీస్ గురించి డిస్కస్ చేసేందుకు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లాను. మినిస్ట్రీ ఆఫ్ ఐ అండ్ బి (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్) అండ్ ఎఫ్ఐసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించిన కొన్ని సెమినార్స్‌లో పాల్గొని, ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఎంత పెద్దగా ఉందో తెలిసింది. అంతేకాదు దేశంలో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే సినిమాలు, మరాఠీ సినిమాల గురించి ఎక్కువమందికి సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కాన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద నడవడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో శిరీష్ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. -
నా నమ్మకం నిజమైంది – అల్లు శిరీష్
‘‘నా కెరీర్లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. మలయాళ సినిమా ‘1971 బియాండ్ బోర్డర్’లో మోహన్‌లాల్‌గారితో నటించా. నా పాత్రకి మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 28న విడుదలైన ‘ఒక్కక్షణం’ నాకు మరచిపోలేని సినిమాగా నిలిచింది’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘గౌరవం’ సరైన విజయం అందుకోలేదు. దాంతో కొత్తగా చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది. ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ వంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశాక మళ్లీ ధైర్యం తెచ్చుకుని, ఏదైనా కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ‘ఒక్కక్షణం’ చేశా. ఈ రోజు నా నమ్మకం నిజమైంది. సినిమా చూసినవారందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్‌లోనూ మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు సహా అందరికీ థ్యాంక్స్. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఒక్కక్షణం’ సక్సెస్‌తో 2018కి మేం సంతోషంగా స్వాగతం పలికేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సీరత్ కపూర్. నిర్మాత చక్రి చిగురుపాటి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
కసి ఉన్నవాళ్లతో పనిచేస్తే ఎనర్జీ వస్తుంది
‘‘ఒక్కక్షణం’ సినిమాకి వస్తున్న ఫీడ్‌బ్యాక్, రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నా. ప్రత్యేకించి ఈ సినిమాలోని కథతో పాటు హీరో గురించి మాట్లాడుతున్నారు. ఓ యాక్టర్‌గా అది నాకు బాగా అనిపించింది. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటుడిగా ఎదిగావు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటుంటే వెరీ హ్యాపీ’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఈ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు. ► ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడా. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నప్పుడు ఆనంద్ ‘ఒక్కక్షణం’ కథ తీసుకొచ్చారు. తను కథ చెప్పిన విధానం నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్) కథ విని బాగుందన్నారు. అన్నయ్యకి (అల్లు అర్జున్) స్టోరీ లైన్ తెలుసు. కథ పూర్తిగా తెలీదు. ఫస్ట్ కాపీ చూసి బాగుందన్నారు. ► ‘ఒక్కక్షణం’ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. అయితే సినిమాపై నమ్మకంతో వేరే ఏ సినిమా నేను ఒప్పుకోలేదు. ప్యారలల్ లైఫ్ పాయింట్ కొత్తగా అనిపించింది. కథను నేను బాగా నమ్మడంతో ఇన్వాల్వ్ అయి చేశా. కథకి అవసరం మేరకే మూడు ఫైట్స్ ఉన్నాయి. అవి అనవసరం అనిపించవు. ► ఆనంద్ చెప్పిన కథని అంతే చక్కగా తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది. అమ్మ సెంటిమెంట్ సీన్‌కి చాలామంది కనెక్ట్ అయ్యారు. కెమెరామ్యాన్ శ్యాం కె.నాయుడుతో పనిచేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరింది. మరో సినిమాకి ఆయనతో పనిచేయనున్నా. ఈ చిత్రంలో సంగీతం కంటే నేపథ్య సంగీతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మణిశర్మగారు చాలా బాగా చేశారు. ఆయనలా ఎవరూ చేయలేరు. ► ప్రమోషన్ సాంగ్‌ను ఇంటర్వెల్ తర్వాత పెట్టాలని షూట్ చేశాం. లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఎండింగ్ టైటిల్స్ అప్పుడు ఆ పాట ఉంటుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు తీసేశాం. ► లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టం. అన్నీ అటువంటివే చేయాలని కాదు. నా పాత్ర కొత్తగా ఉండాలి. వైవిధ్యమైన సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. ► మంచి పాత్ర అయితే వేరే హీరోల సినిమాలో చేయడానికి రెడీ. నా సినిమాలో ఏ హీరో చేయడానికైనా అభ్యంతరం లేదు. మల్టీస్టారర్ మూవీ కథలను రచయితలు రాయడం లేదు. మలయాళంలో ‘1971’ సినిమాలో మోహన్‌లాల్‌గారితో కలిసి నటించడం మరచిపోలేను. ‘ఒక్కక్షణం’ మలయాళంలో డబ్బింగ్ చేయడానికి అక్కడివారు ముందుకొచ్చారు. ► ఓ నిర్మాత కొడుకుగా అది కావాలి.. ఇది కావాలి.. అంటూ నేను నిర్మాతలను డిమాండ్ చేయను. ప్రాజెక్ట్‌పై ఎంత శ్రద్ధ ఉంటుందో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్పైనా అంతే శ్రద్ధ పెట్టమని చెబుతానంతే. ► నాన్నగారు వేరే హీరోతో హిట్ సాధించారంటే ఓ కొడుకుగా సంతోషిస్తా. అదే నేను హీరోగా చేసిన సినిమా హిట్ అయిందంటే నాకు మరో పది రెట్లు సంతోషంగా ఉంటుంది (నవ్వుతూ). ► కొత్త డైరెక్టర్లతో పనిచేయాలనే ఎగై్జట్‌మెంట్ ఉంది. ఇప్పుడొస్తున్న మంచి సినిమాలన్నీ కొత్తవారి నుంచి వస్తున్నవే. ఆనంద్ ఓ కొత్త డైరెక్టర్లా కష్టపడ్డాడు. అంత కసి ఉన్నవాళ్లతో పనిచేస్తుంటే ఎనర్జీ వస్తుంది. కొత్త, పాత డైరెక్టర్లు చెప్పిన రెండు మూడు కథలు విన్నా. నెలలోపు ఫైనలైజ్ చేస్తా. నేను క్రమశిక్షణతో పనిచేస్తా. కొత్త ఏడాది నుంచి మరింత క్రమశిక్షణగా పనిచేయాలనుకుంటున్నా.