అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన చిత్రం‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఎన్నారై పాత్రలో అల్లు శిరీష్, అతని స్నేహితుడి భరత్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల విడుదలై టీజర్‌కు అనూహ్య స్సందన వచ్చింది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందుకున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment