ABCD
-
Anna Katharina Valayil: సింగర్ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా..
అన్న కేథరిన్ వలయిల్ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగింది. మళ్లీ వారి కుటుంబం స్వదేశానికి వచ్చింది. కొచ్చిన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సౌత్ ఆస్ట్రేలియాలో మూడు సంవత్సరాల పాటు ఇండిజినస్ మ్యూజిక్‌ను స్టడీ చేసింది. డెబ్యూ మ్యూజిక్ వీడియో ‘హాని బీ’ తనకు మంచి పేరు తెచ్చింది. కేథరిన్ చక్కని సింగర్ మాత్రమే కాదు చక్కని కవయిత్రి కూడా. ‘ఏబీసిడీ’ ‘బెంగళూరు డేస్’ ‘లైలా ఓ లైలా’ సినిమాలలో పాటలు రాసింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోసం ఒక మ్యూజిక్ వీడియో తయారు చేసి ఇచ్చింది. తన గొంతే కాదు..పాటలు కూడా బాగుంటాయి అని చెప్పడానికి ఈ వాక్యాలు సాక్ష్యంగా నిలుస్తాయి... ‘నాలుగు గోడల ఇల్లే నీ ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో స్చేచ్ఛగా విహరించాలని మాత్రమే అనుకుంటాయి అక్కడ ఖరీదైన గూడు ఒకటి కట్టాలనుకోవు!’ చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం.. -
కృష్ణార్జున యుద్ధం హీరోయిన్ రుక్షర్ ధిల్లాన్ ఫోటోస్..
-
పోలీసులకు ఏబీసీడీ అవార్డులు
గూడూరురూరల్: బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్లోని దగదర్తి పోలీసు స్టేషన్ పరిధిలో 2019లో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న ఓ లారీలోని రూ.5కోట్ల విలువైన సెల్ఫోన్లను దుండగులు అపహరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు, చిల్లకూరు ఎస్సై హుస్సేన్‌బాబు, గూడూరు రూరల్ స్టేషన్ హెచ్‌కానిస్టేబుల్ ఆర్వీరాజు ఆత్మకూరు కానిస్టేబుల్ కేశవ కీలకంగా వ్యవహరించారు. నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభకనబరిచిన వీరిని అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్( ఏబీసీడీ) అవార్డులు వరించాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం ఏబీసీడీ అవార్డులను ప్రదానం చేసి అభినందించారు. -
హుందాగా స్పందించిన అల్లు శిరీష్
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ పుట్టినరోజు నేడు. అల్లు రామలింగయ్య మనవడిగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన శిరీష్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రొటీన్ ఫార్ములా కథలను కాకుండా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు శిరీష్. ఈ ట్వీట్లో శిరీష్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఏబీసీడీ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు శిరీష్. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిన శిరీష్ ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తానన్నాడు. ‘మేమంతా మీకు మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం. కానీ అంచనాలను అందుకోలేకపోయాం’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్మీట్లు పెట్టి హడావిడి చేస్తున్న తరుణంలో శిరీష్ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు. ❤️🙏🏽 pic.twitter.com/kSUyKPNQbM — Allu Sirish (@AlluSirish) 30 May 2019 -
ఆ పరీక్షలో పాసయ్యాం
‘‘సినిమాను ఒక్కొక్కరు ఒక్కో దృష్టికోణంతో చూస్తారు. అందుకే సినిమా హిటై్టనా, ఫ్లాపైనా కొన్ని విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ విమర్శలను విశ్లేషించుకుంటూ, కొత్తతప్పులు చేయకుండా ముందుకు వెళ్లడమే ఒక ఫిల్మ్ మేకర్‌గా నా పని’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్ అన్నారు. అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన చెప్పిన విశేషాలు. ∙నా కెరీర్లో ఇప్పటివరకు తీసినవన్నీ కాన్సెప్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ సినిమాలే. కమర్షియల్ సినిమాలు అంతగా తీయలేదు. అందుకే మంచి కాన్సెప్ట్ ఉన్న ‘ఏబీసీడీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సోమవారం కూడా మంచి కలెక్షన్స్ రావడం ముఖ్యం. ఈ సోమవారం పరీక్షలో మేం పాసయ్యాం. ∙‘ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల్లో అల్లు శిరీష్ కామెడీ టైమింగ్ నచ్చి ఈ చిత్రానికి తీసుకున్నాం. శిరీష్ ఇంటెలిజెంట్, సిన్సియర్ యాక్టర్. బాగా నటించాడు. దర్శకుడు సంజీవ్ బాగా చేశాడు. యష్ రంగినేనిగారు బాగా సపోర్ట్ చేశారు. నా సినిమాలకు నిర్మాత డి. సురేశ్‌బాబుగారి సహకారం ఉండాలనుకుంటాను. ∙నా కెరీర్లో నేను చేసిన తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. బహుశ ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ రీమేక్ కావొచ్చు. నా దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. హిందీలో కరణ్ జోహార్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎక్కువగా నిర్మిస్తారు. అప్పుడప్పుడు సినిమాలను డైరెక్ట్ చేస్తారు. నేను కూడా ఆయనలా అన్నమాట. మంచి ఎగై్జటింగ్ కథ దొరికితే మళ్లీ డైరెక్ట్ చేస్తాను. భవిష్యత్‌లో వెబ్‌సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంటుంది. నేను నిర్మించాలనుకుంటున్నాను. కానీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఉన్నప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ∙మామూలుగా సినిమా విడుదలైన మొదటిరోజే థియేటర్లో చూస్తూ యూఎస్ నుంచి లైవ్ అప్డేట్స్ ఇస్తుంటారు. థియేటర్స్‌లో అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ కూర్చుంటే వారు సినిమాను ఏం ఆస్వాదించగలరు? సినిమా చూసి కాస్త రిలాక్స్ అయ్యి వారి అభిప్రాయాలు చెబితే బాగుంటుందని నా అభిప్రాయం. ∙మా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘దొరసాని’. ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా–రాజశేఖర్ కుమార్తె శివాత్మికలను పరిచయం చేస్తున్నాం. జూలై 5న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. -
‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్‌ప్యూజ్డ్ దేశీ) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అల్లు శిరీష్, రుక్సర్ ధిల్లాన్, భరత్, రాజా, నాగబాబు సంగీతం : జుడా సాండీ దర్శకత్వం : సంజీవ్ రెడ్డి నిర్మాత : మథురా శ్రీధర్, యష్ రంగినేని మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ హీరోగా ప్రూవ్ చేసకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాలు హీరోగా నటించినా స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చే హిట్ ఒక్కటి కూడా పడలేదు. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో ఈ మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ సూపర్ హిట్ సాధించాడా..? కథ : అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) అలియాస్ అవి.. న్యూయార్క్‌లో సెటిల్ అయిన ఇండియన్ మిలియనీర్ విద్యా ప్రసాద్ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్ బాలషణ్ముగం (భరత్)తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు. నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ జేయాలనుకున్న విద్యా ప్రసాద్.. వెకేషన్ పేరుతో అవి, బాషాలను ఇండియాకు పంపిస్తాడు. అలా ఇండియాకు వచ్చిన వారిద్దరిని నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని చెప్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండిపోయిన అవికి లోకల్ పొలిటీషన్ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? అమెరికాలో పెరిగిన అవి, బాషాలు ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? ఓ సాధారణ యువకుడిగా ఇండియాలో అడుగుపెట్టిన అవి.. సెలబ్రిటీగా, యూత్ ఐకాన్‌గా ఎలా మారాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ నటనకు పెద్దగా అవకాశం లేని పాత్రలో కనిపించారు. లుక్స్ పరంగా మాత్రం మంచి మార్కులు సాధించారు. హీరో తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. విలన్‌గా రాజా పరవాలేదనిపించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, శుభలేక సుధాకర్, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. బలమైన సంఘర్షణ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇండియా వచ్చిన తరువాత హీరో ఇబ్బంది పడే సన్నివేశాల్లో మరింత కామెడీ, ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశాడు. కథలోనూ బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవటం కూడా మైనస్ అయ్యింది. జుడా సాండీ అందించిన సంగీతం బాగుంది. ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్ఫుల్గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్ రామ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం బలమైన సన్నివేశాలు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
వాళ్లు చెబితే ఒప్పుకుని తీరాలి
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాను. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, మోహన్‌లాల్ వంటి గొప్ప నటులతో నటించాను. మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్టర్‌గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. డి. సురేష్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మలయాళంలో దుల్కర్సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ (2012) సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన సంగతులు. ► మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రాన్ని రెండేళ్ల క్రితం చూశాను. బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా చూడమని రామ్‌చరణ్ చెప్పారు. దర్శకుడు మారుతి, వరుణ్ తేజ్ ఇలా ఇండస్ట్రీలోని నా సన్నిహితులు కూడా ఈ సినిమా గురించి చెప్పారు. సాధారణంగా అందరూ రీమేక్ ఈజీ అంటారు కానీ అంత ఈజీ కాదు. తెలుగు కోసం కొన్ని మార్పులు చేశాం. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఒరిజినల్ సినిమాలో ఉన్నవి ఉంటాయి. సోల్‌ని మాత్రమే తీసుకున్నాం. సంజీవ్ బాగా తీశారు. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు అవి. అమ్మ ప్రేమ చాటున గారాభంగా పెరుగుతున్న అవికి అంతగా డబ్బు విలువ తెలియదు. ఆ విలువ తెలియడానికి అవి తండ్రి తనను ఇండియాకి పంపి, మధ్యతరగతి జీవితం గడిపేలా ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్‌లో అవి లైఫ్‌లో ఎలాంటి విషయాలను నేర్చుకున్నాడు అన్నదే కథ. ► నాకు, భరత్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీని చూశాం. సినిమా పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ► నేను ముంబైలో నాలుగేళ్లు ఉన్నాను. అక్కడ నేను ఆల్మోస్ట్ నార్మల్ జీవితాన్ని గడిపాను. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేసేవాణ్ణి. సినిమాలు చూడాలనుకున్నపుడు అక్కడ మార్నింగ్ షో అయితే టికెట్ రేటు తక్కువగా ఉంటుందని ఆ షోలకు వెళ్లాను. ముంబైలో నేను గడిపిన ఆ నాలుగేళ్లు నాలో చాలా మార్పు తెచ్చాయి. ఆ తర్వాత స్టడీస్ కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త తీసుకున్నాను. ► నేను ‘కొత్తజంట’ సినిమా చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్‌గారిని కలిశాను. డీసెంట్ యాక్టర్‌కి, గుడ్ యాక్టర్ తేడా ఏంటి? అన్న సంభాషణ వచ్చింది. ‘‘దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చెసేవాడు యాక్టర్. దర్శకుడు చెప్పింది చేస్తూనే ఏదో తన సొంతగా, కొత్తగా ప్రయత్నించాలని తపన పడేవాడు గుడ్ యాక్టర్’ అని చెప్పకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి సినిమాకి నేను కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► ‘ఒక్క క్షణం’ సినిమాకు బాగా కష్టపడ్డాం. ఫస్ట్ కాపీ చూసి చాలా సంతోషపడ్డాను. కానీ ప్రేక్షకుల నుంచి మేం ఆశించిన ఫలితం రాలేదు. సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల తీర్పు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకుని తీరాలి. ఆన్లైన్ ఆడియన్స్‌కు బాగానే నచ్చింది. ప్రస్తుతం రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి లవ్‌స్టోరీ. -
స్టార్డమ్ ఏబీసీడీలు కూడా శిరీష్ స్టార్ట్ చేయాలి
‘‘ఏబీసీడీ’ సినిమా ట్రైలర్ చూస్తుంటే నా ‘పిల్ల జమీందార్’ సినిమా గుర్తుకు వస్తోంది. నా సినిమాను మించి ‘ఏబీసీడీ’ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు హీరో నాని. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. డి.సురేశ్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు శిరీష్‌ను అప్పుడప్పుడు కలిశాను. అప్పుడు తను కాస్త లావుగా, బొద్దుగా ఉండేవాడు. సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాసేవాడు. ప్రొడక్షన్లో అరవింద్‌గారికి మంచి సక్సెసర్ దొరికాడని అనుకున్నాను. కట్ చేస్తే తను యాక్టర్ అయిపోయాడు. తన కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్, తన స్టార్డమ్కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ–‘‘రెండేళ్ల కిందట నా కజిన్ రామ్‌చరణ్ ‘ఏబీసీడీ’ మలయాళ సినిమా సీడీ నాకు ఇచ్చి, ఈ క్యారెక్టర్ నీకు కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పాడు. సినిమా చూస్తే చాలా బాగుందనిపించింది. ఈ సినిమాలో హీరో డబ్బు విలువ తెలియకుండా పాడైపోయాడని భావించిన తండ్రి అతన్ని బాగు చేసుకోవడానికి ఏం చేశాడనేదే కథ. బన్నీకి, రామ్‌చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వచ్చాక మంచి స్పోర్ట్స్ కారు కొనివ్వమని నాన్నను అడగ్గానే ‘చెప్పుచ్చుకుని కొడతాను.. నీ వయసువాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వడమే లగ్జరీ. అలాంటిది స్పోర్ట్స్ కారు కొనివ్వమని అడుగుతున్నావ్’ అని కొనివ్వలేదు. నీ కారుకి బడ్జెట్ ఇంత అనుకుంటున్నాను అంటే, ఆ రోజు నేను కోపానికి పోయి ‘నాకు వద్దులే, నా సొంత డబ్బులతోనే కొనుక్కుంటాను’ అన్నాను. అయితే ఆ కారు కొనడానికి నాకు మూడేళ్లు పట్టింది. అప్పుడు నాన్న చేసిన పనివల్ల డబ్బు విలువ తెలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమాను మా నాన్నకు డెడికేట్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నా తండ్రి పాత్రలో నాగబాబుగారిని తప్ప మరెవరినీ ఊహించుకోలేను’’ అన్నారు. ‘‘మధుర’ శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. అతనితో కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నాను. అల్లు అరవింద్‌గారు కూడా నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద విజయం రావాలి’’ అన్నారు డి.సురేశ్‌బాబు. ‘‘అందరికీ థాంక్స్’’ అని ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ‘‘మధుర శ్రీధర్’తో ట్రావెల్ చేసేటప్పుడు మా నాన్నతో ఉన్నట్లే అనిపించింది. అల్లు శిరీష్ సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ హీరో కూడా. కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. శిరీష్ నాకు లైఫ్ లాంగ్ హీరోగా ఉంటారు’’ అన్నారు సంజీవ్ రెడ్డి. రుక్సార్ థిల్లాన్, మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాందీ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులు పాల్గొన్నారు. -
‘ఏబీసీడీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ఏబీసీడీలకు వేళాయె
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన చిత్రం‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఎన్నారై పాత్రలో అల్లు శిరీష్, అతని స్నేహితుడి భరత్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల విడుదలై టీజర్‌కు అనూహ్య స్సందన వచ్చింది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందుకున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ప్రెసిడెంట్‌గారి మనవరాలు
లండన్‌లో పుట్టి గోవాలో పెరిగి బెంగళూరులో చదువు పూర్తి చేసింది రుక్షర్ ధిల్లాన్. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన రుక్సర్ ఆమధ్య ‘కృష్ణార్జున యుద్ధం’తో ‘ప్రెసిడెంట్‌గారి మనవరాలు’గా తెలుగు తెరపై మెరిసింది. అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న రుక్షర్ గురించి కొన్ని ముచ్చట్లు... డిగ్రీ తరువాతే... గోవాలో నైంత్ గ్రేడ్ పూర్తయిన తరువాత తదుపరి చదువుల కోసం బెంగళూరు వచ్చింది రుక్షర్. అక్కడ బిషప్ కాటన్ హైస్కూల్లో చదువుకుంది. ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. బెంగళూరులో వ్యాపారప్రకటనల్లో నటిస్తున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే... ‘‘డిగ్రీ తరువాతే సినిమాలు’’ అని డిసైడ్ కావడంతో సినిమాల జోలికి వెళ్లలేదు. తొలి సినిమా ‘రన్ ఆంటోనీ’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రాజ్‌కుమార్ మనవడు వినయ్ రాజ్‌కుమార్ సరసన నటించింది. ఈ సినిమాలో సూసైడ్ బాంబర్‌గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ‘కృష్టార్జున యుద్ధం’ సినిమాలో రియా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షో టైమ్ ‘షో టైమ్’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్టర్ చేయబోయే యస్.యస్.కాంచీ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కజిన్ అనేదే ఆమె ఉత్సాహానికి కారణం. ‘సెలెక్ట్ అవుతానా!’ అనే చిన్న బెరుకు ఉండేదట. మొత్తానికైతే ఆడిషన్లో సెలెకై్ట ఆ సినిమాలో భాగమైపోయింది. చారిత్రక పాత్రలు... విభిన్నమైన పాత్రలు చేయడం అంటే తనకు ఇష్టం అని చెబుతుంది రుక్షర్. సంజయ్ లీలా బన్సాలీ సినిమాల్లో కనిపించే చారిత్రక పాత్రలు వేయడమంటే తనకు ఇష్టమట. ‘భాంగ్రా పా లె’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన రుక్షర్ ‘ఫలానా ఇండస్ట్రీలో మాత్రమే పనిచేయాలని ఉంది’లాంటి పట్టింపులు లేవు అని చెబుతుంది. ‘ప్రాంతీయ చిత్రాలు కూడా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి’ అంటూ ప్రాంతీయ చిత్రాల గొప్పతనాన్ని చెప్పకనే చెప్పింది రుక్షర్. -
అప్పుడే ఎక్కువ సినిమాలు వస్తాయి
‘‘కాన్సెప్ట్ చిత్రాలు తీసే ‘మధుర’ శ్రీధర్‌గారికి సినిమాలంటే చాలా ప్రేమ. సినిమాలను ప్రేమించే నిర్మాతల చిత్రాలు బాగా ఆడితే మరిన్ని వస్తాయి. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే శ్రీధర్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా భరత్ ముఖ్య పాత్రలో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అన్నది ఉపశీర్షిక. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్. రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 17న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను త్రివికమ్ర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జల్సా’ టైమ్‌లో శిరీష్‌ను చిన్నకుర్రాడిగా చూశాను. సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మా చిత్రం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కువగా మాట్లాడతాను. శ్రీధర్, సురేశ్‌బాబు, యష్గార్లకు థ్యాంక్స్. నన్ను బాగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు సంజీవ్‌గారికి, మంచి మ్యూజిక్ అందించిన జుడో సాండీకి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు నిర్మించే నేను ఓ ఫన్ మూవీ తీయాలని చాలా రోజులుగా అనుకున్నాను. ఆ క్రమంలో చేసిన సినిమాయే ‘ఏబీసీడీ’. శిరీష్, భరత్ ఫెంటాస్టిక్‌గా నటించారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం శిరీష్‌గారే. ఆయన ఎప్పటికీ నా హీరోగానే ఉంటారు. ఈ జర్నీలో ముందు నుంచి నాతో భాగమైన ‘మధుర’ శ్రీధర్‌గారికి థాంక్స్’’ అన్నారు సంజీవ్ రెడ్డి. -
‘ ఏబీసీడీ ’మూవీ ట్రైలర్ లాంచ్
-
‘రిచ్‌గానే పుట్టాను.. రిచ్‌గానే పెరిగాను’
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ సరైన హిట్ కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చివరగా.. ‘ఒక్క క్షణం’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈసారి పక్క భాషలో హిట్ అయిన ఓ చిత్రం కన్నేశాడీ ఈ హీరో. మళయాలంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని ఏబీసీడీ(అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్, సాంగ్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మాష్టర్ భరత్ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించగా.. జుడా శాండీ సంగీతాన్ని సమకూర్చారు. -
డబ్బులు తక్కువ... ఖర్చులు ఎక్కువ!
అన్ని సౌకర్యాలతో హాయిగా లైఫ్‌ని లీడ్ చేసే ఓ విదేశీ కుర్రాడు ఇండియాలో మిడిల్ క్లాస్ జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. పాకెట్ మనీ తక్కువై... ఖర్చులు ఎక్కువయ్యాయి. ఐదు వేల రూపాయలతో నెల మొత్తం గడపాలి. ఆ కుర్రాడికి ఎందుకీ పరిస్థితి వచ్చింది? అనే అంశాలను మాత్రం వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అనేది ఉపశీర్షిక. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించారు. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అల్లు శిరీష్‌గారితో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘మెల్ల మెల్లగా..’, ‘ముంతకల్లు’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. చిత్రీకరణ పూర్తయింది. ప్యాచ్‌వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి’’ అని అన్నారు. నాగబాబు, భరత్ తదితరులు నటించిన ఈ సినిమాకు ధీరజ్ మొగిలినేని సహ–నిర్మాత. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఈ చిత్రం తెలుగు రీమేక్. -
‘ఏబీసీడీ’ మెల్ల మెల్లగా సాంగ్ లాంచ్
-
అల్లు వారి ‘ఏబీసీడీ’ వాయిదా..!
అల్లు ఫ్యామిలీ హీరోగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు శిరీష్. హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఏబీసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మళయాలంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా మార్చి 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏబీసీడీ రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు అన్‌సీజన్ కావటం, మార్చి నెలలో విద్యార్థులు పరీక్షలతో బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో మార్చి నెలాఖరున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 22న ఏబీసీడీ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శిరీష్‌కు జోడిగా రుక్సర్ ధిల్లాన్ నటిస్తున్నారు. -
శిరీష్ చిందేస్తే..
హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ కి ఇది రీమేక్. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్నారు. డి.సురేశ్ బాబు సమర్పణలో యశ్ రంగినేని, ‘మధుర’ శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ ఫోక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. జుధా సాంధీ స్వరకర్త. ఫోక్ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి.. శిరీష్ వేస్తున్న స్టెప్పులు ఆడియన్స్‌ను ఏ రేంజ్లో ఉర్రూతలూగిస్తాయనే విషయం థియేటర్స్‌లోనే తెలుస్తుంది. మార్చి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
నవ్వులు పంచే ఏబీసీడీ
కథాబలం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల్ని అల రిస్తున్న అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ‘ఏబీసీడీ’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఏబీసీడీ’ని రీమేక్ చేయడం హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేశాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషించారు. అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబుగారు నటించారు. బాల నటుడు భరత్ ఈ చిత్రంలో శిరీష్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. మా సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందనతో పాటు, చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేశ్‌బాబు, సంగీతం: జుధా సాంధీ, సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
ఆకట్టుకుంటోన్న ‘ఏబీసీడీ’ మోషన్ పోస్టర్!
ఎంతో కాలంపాటు బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అల్లువారబ్బాయి అల్లు శిరీష్‌కు ఏబీసీడీ రూపంలో హిట్ వచ్చేట్టు కనిపిస్తోంది. మాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌తో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ చిత్ర మోహన్ పోస్టర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)గా అల్లు శిరీష్ హాస్యాన్ని పండించబోతున్నాడని ఈ మోషన్ పోస్టర్లో తెలుస్తోంది. అమెరికాలో పుట్టిపెరిగిన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో విలేజ్‌కు వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
రియల్‌గా అంకుల్.. రీల్‌పై ఫాదర్
‘‘విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రంలో హీరో ఫాదర్ ఎవరు? ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో ఎన్టీఆర్ నాన్నగా ఎవరు నటించారు? ఆ సినిమాల్లో నాన్నగా నటించిన నాగబాబుగారే మా సినిమా ‘ఏబిసిడి’లోను నాన్నగా నటిస్తున్నారు’’ అంటున్నారు అల్లు శిరీష్ . ‘‘నాగబాబుగారితో ఇది నా మొదటి సినిమా. ఆయన నాకు రియల్ లైఫ్‌లో అంకుల్, ఇప్పుడు రీల్ లైఫ్‌లో ఫాదర్‌గా నటిస్తున్నారు. నేను ఈ కథ విన్నప్పుడే తండ్రి పాత్రకు నాగబాబు గారిని తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాను. అనుకున్నట్టుగానే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆనందంగా ఉంది’’ అని కూడా అన్నారు శిరీష్. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ అల్లు శిరీష్ హీరోగా మధుర ఎంటర్టైన్మెంట్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్‌బెన్ సినిమా బ్యానర్‌పై యష్ రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘ఏబిసిడి’. రుక్సార్ థిల్లాన్ కథానాయిక. బాలనటుడు భరత్ ఈ చిత్రంలో హీరో శిరీష్ ఫ్రెండ్‌గా నటిస్తున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా ధీరజ్ మొగిలి వ్యవహరిస్తు్తన్నారు. -
ముగింపు దశలో ‘ఏబీసీడీ’
‘ఒక్క క్షణం’ సినిమాతో పలకరించిన అల్లు శిరీష్‌కు నిరాశే మిగిలింది. అనుకున్నస్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని అల్లువారబ్బాయి మలయాళ రీమేక్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యుల్‌ను నవంబర్ 2న ప్రారంభించింది చిత్రయూనిట్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ధనిక కుర్రాడి పేద జీవితం!
ధనిక కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు పేద జీవితం గడపాల్సి వచ్చింది. ఎందుకు అంటే మలయాళ ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాలో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ‘ఏబీసీడీ’ పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ‘అల్లు’ శిరీష్ హీరోగా నటిస్తున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో సంజీవ్‌రెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు. ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని సహ–నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అల్లు శిరీష్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. బాలనటుడిగా పేరు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. జుధా సాంధీ మంచి çస్వరాలు అందిస్తున్నారు’’ అన్నారు. -
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన అల్లు హీరో
కెరీర్లో భారీ హిట్ లేక సతమతమవుతున్నాడు మెగాహీరో అల్లు శిరీష్. దాంతో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. ‘1971’ సినిమా వచ్చినా అది డబ్బింగ్ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో అదే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తనకి ఈ సినిమాతో మంచి హిట్ లభిస్తుందని ఈ మెగా హీరో కోటి ఆశలు పెట్టుకున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్ న్యూస్‌ను అల్లూ శిరీష్ స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ‘సినిమాలో నేను కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాను కావచ్చు. కానీ ప్రేక్షకులందరికీ ఫిబ్రవరి 8, 2019న థియేటర్లో వినోదాన్ని పంచడం పక్కా’అంటూ పోస్ట్ చేశాడు. -
పాకెట్ మనీ కట్
కోటీశ్వరుడి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు సాదాసీదా జీవితం గడపాల్సి వచ్చింది. లక్షల్లో పాకెట్ మనీ తీసుకున్న ఆ కుర్రాడికి చివరికి 5 వేలే అని ఇంట్లో ఫిక్స్ చేస్తారు. అలా ఎందుకు? అంటే దానికో పెద్ద కారణం ఉంది. అదేంటో థియేటర్లో తెలుసుకుంటేనే కదా థ్రిల్. అల్లు శిరిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ). రుక్సానా కథానాయిక. ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి తెలుగు పరిశ్రమకు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగు తోంది. ఇందులో కోటీశ్వరుడి తండ్రికి కొడుకుగా అవినాష్ పాత్రలో అల్లు శిరీష్ నటిస్తున్నారని సమాచారం. అలాగే కామెడీ యాక్టర్ భరత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.