శిరీష్‌ చిందేస్తే.. | allu sirish new movie abcd shooting launch | Sakshi
Sakshi News home page

శిరీష్‌ చిందేస్తే..

Published Mon, Feb 4 2019 5:41 AM | Last Updated on Mon, Feb 4 2019 5:41 AM

allu sirish new movie abcd shooting launch - Sakshi

అల్లు శిరీష్‌

హీరో అల్లు శిరీష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ కి ఇది రీమేక్‌. రుక్సార్‌ థిల్లాన్‌ కథానాయికగా నటిస్తున్నారు. డి.సురేశ్‌ బాబు సమర్పణలో యశ్‌ రంగినేని, ‘మధుర’ శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ ఫోక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. జుధా సాంధీ స్వరకర్త.  ఫోక్‌ సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ ఉంటుంది. మరి.. శిరీష్‌ వేస్తున్న స్టెప్పులు ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఉర్రూతలూగిస్తాయనే విషయం థియేటర్స్‌లోనే తెలుస్తుంది.  మార్చి 1న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement