డబ్బులు తక్కువ... ఖర్చులు ఎక్కువ! | allu sirish abcd released on may 17 | Sakshi
Sakshi News home page

డబ్బులు తక్కువ... ఖర్చులు ఎక్కువ!

Published Fri, Apr 5 2019 3:52 AM | Last Updated on Fri, Apr 5 2019 3:52 AM

allu sirish abcd released on may 17 - Sakshi

అల్లు శిరీష్‌

అన్ని సౌకర్యాలతో హాయిగా లైఫ్‌ని లీడ్‌ చేసే ఓ విదేశీ కుర్రాడు ఇండియాలో మిడిల్‌ క్లాస్‌ జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. పాకెట్‌ మనీ తక్కువై... ఖర్చులు ఎక్కువయ్యాయి. ఐదు వేల రూపాయలతో నెల మొత్తం గడపాలి. ఆ కుర్రాడికి ఎందుకీ పరిస్థితి వచ్చింది? అనే అంశాలను మాత్రం వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అల్లు శిరీష్‌ హీరోగా సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ అనేది ఉపశీర్షిక. ఇందులో రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించారు. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించారు.

ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అల్లు శిరీష్‌గారితో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘మెల్ల మెల్లగా..’, ‘ముంతకల్లు’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. చిత్రీకరణ పూర్తయింది. ప్యాచ్‌వర్క్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి’’ అని అన్నారు. నాగబాబు, భరత్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు ధీరజ్‌ మొగిలినేని సహ–నిర్మాత. మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఈ చిత్రం తెలుగు రీమేక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement