
డీజీపీ చేతుల మీదుగా అవార్డులను అందుకుంటున్న ఎస్సై హుస్సేన్‌బాషా
గూడూరురూరల్: బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్‌లోని దగదర్తి పోలీసు స్టేషన్ పరిధిలో 2019లో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న ఓ లారీలోని రూ.5కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దుండగులు అపహరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు, చిల్లకూరు ఎస్సై హుస్సేన్‌బాబు, గూడూరు రూరల్ స్టేషన్ హెచ్‌కానిస్టేబుల్ ఆర్‌వీరాజు ఆత్మకూరు కానిస్టేబుల్ కేశవ కీలకంగా వ్యవహరించారు. నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభకనబరిచిన వీరిని అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్( ఏబీసీడీ) అవార్డులు వరించాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం ఏబీసీడీ అవార్డులను ప్రదానం చేసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment