ఆ ‘సర్‌ప్రైజ్‌’ రివీల్‌ చేసిన మెగా హీరో | Master Bharath Act As Hero Friend In Allu Sirish Film | Sakshi
Sakshi News home page

ఆ ‘సర్‌ప్రైజ్‌’ రివీల్‌ చేసిన మెగా హీరో

Published Mon, Jun 11 2018 1:36 PM | Last Updated on Mon, Jun 11 2018 3:16 PM

Master Bharath Act As Hero Friend In Allu Sirish Film - Sakshi

పలు చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న బాల నుటుడు భరత్‌ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవతారం ఎత్తనున్నారు. అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కనున్న ఏబీసీడీ చిత్రంలో హీరో ఫ్రెండ్‌ పాత్రను పోషించనున్నారు. ఈ విషయాన్ని శిరీష్‌ సోమవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నిన్న అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్టు చెప్పిన శిరీష్‌ నేడు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ చిత్రంలో శిరీష్‌కు ఫ్రెండ్‌ పాత్రలో భరత్‌ ఫుల్‌ లెన్త్‌ పాత్రలో కనపించనున్నారు. శిరీష్‌ ట్వీట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిసూ​.. భరత్‌కు అల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. వెంకీ, పోకిరి, ఢీ, రెడీ, కింగ్‌ వంటి అనేక చిత్రాల్లో భరత్‌ చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

మాలీవుడ్‌లో హిట్‌ అయిన ఏబీసీడీ (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. అమెరికా నుంచి ట్రిప్‌ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ను లీడ్‌ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్‌ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ బాణీలు అందిస్తారు. కృష్ణార్జున యుద్దం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్సర్‌ థిల్లార్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement