ఆ పరీక్షలో పాసయ్యాం | Allu sirish Abcd movie success : madhura sridhar | Sakshi
Sakshi News home page

ఆ పరీక్షలో పాసయ్యాం

Published Wed, May 22 2019 12:01 AM | Last Updated on Wed, May 22 2019 12:01 AM

Allu sirish Abcd movie success : madhura sridhar - Sakshi

‘‘సినిమాను ఒక్కొక్కరు ఒక్కో దృష్టికోణంతో చూస్తారు. అందుకే సినిమా హిటై్టనా, ఫ్లాపైనా కొన్ని విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ విమర్శలను విశ్లేషించుకుంటూ, కొత్తతప్పులు చేయకుండా ముందుకు వెళ్లడమే ఒక ఫిల్మ్‌ మేకర్‌గా నా పని’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్‌ అన్నారు. అల్లు శిరీష్‌ హీరోగా సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని ‘మధుర’ శ్రీధర్‌ అన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన చెప్పిన విశేషాలు.

∙నా కెరీర్‌లో ఇప్పటివరకు తీసినవన్నీ కాన్సెప్ట్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలే. కమర్షియల్‌ సినిమాలు అంతగా తీయలేదు. అందుకే మంచి కాన్సెప్ట్‌ ఉన్న ‘ఏబీసీడీ’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నాం. మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. సోమవారం కూడా మంచి కలెక్షన్స్‌ రావడం ముఖ్యం. ఈ సోమవారం పరీక్షలో మేం పాసయ్యాం. 

∙‘ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల్లో అల్లు శిరీష్‌ కామెడీ టైమింగ్‌ నచ్చి ఈ చిత్రానికి తీసుకున్నాం. శిరీష్‌ ఇంటెలిజెంట్, సిన్సియర్‌ యాక్టర్‌. బాగా నటించాడు. దర్శకుడు సంజీవ్‌ బాగా చేశాడు. యష్‌ రంగినేనిగారు బాగా సపోర్ట్‌ చేశారు. నా సినిమాలకు నిర్మాత డి. సురేశ్‌బాబుగారి సహకారం ఉండాలనుకుంటాను.

∙నా కెరీర్‌లో నేను చేసిన తొలి రీమేక్‌ ఇది. రీమేక్‌ చేయడం అంత ఈజీ కాదు. బహుశ ఇదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ రీమేక్‌ కావొచ్చు. నా దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌’ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. హిందీలో కరణ్‌ జోహార్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేస్తారు. ఎక్కువగా నిర్మిస్తారు. అప్పుడప్పుడు సినిమాలను డైరెక్ట్‌ చేస్తారు. నేను కూడా ఆయనలా అన్నమాట. మంచి ఎగై్జటింగ్‌ కథ దొరికితే మళ్లీ డైరెక్ట్‌ చేస్తాను. భవిష్యత్‌లో వెబ్‌సిరీస్‌లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. నేను నిర్మించాలనుకుంటున్నాను. కానీ క్వాలిటీ ఆఫ్‌ కంటెంట్‌ ఉన్నప్పుడే ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు.

∙మామూలుగా సినిమా విడుదలైన మొదటిరోజే థియేటర్లో చూస్తూ యూఎస్‌ నుంచి లైవ్‌ అప్‌డేట్స్‌ ఇస్తుంటారు. థియేటర్స్‌లో అప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ కూర్చుంటే వారు సినిమాను ఏం ఆస్వాదించగలరు? సినిమా చూసి కాస్త రిలాక్స్‌ అయ్యి వారి అభిప్రాయాలు చెబితే బాగుంటుందని నా అభిప్రాయం.

∙మా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ‘దొరసాని’. ఈ చిత్రం ద్వారా విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, జీవితా–రాజశేఖర్‌ కుమార్తె శివాత్మికలను పరిచయం చేస్తున్నాం. జూలై 5న సినిమా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement