
అల్లు శిరీష్, రుక్షార్ థిల్లాన్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హిట్ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేసి) తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఏబిసిడి’ చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ మా చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని.
Comments
Please login to add a commentAdd a comment