allu shireesh
-
బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి...
అల్లు శిరీష్ హీరోగా డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ ట్యాగ్‌లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మే 17న చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ని కరెక్ట్‌గా చేయాలి. ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని మేం సినిమా ఆరంభించే ముందు అనుకున్నాం. అది నెరవేరింది. శిరీష్ ఫెంటాస్టిక్‌గా నటించాడు. శిరీష్‌లో హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. అది కూడా ఈ రోజు నెరవేరింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ, భరత్, వెన్నెల కిశోర్‌ల కామెడీ హైలైట్ అయ్యాయని అంటున్నారు. శిరీష్ నటించిన బెస్ట్ మూవీ ‘శ్రీరస్తు– శుభమస్తు’ని మించి మా సినిమా వసూళ్లు ఉండాలన్నది మా ఆశ. వీకెండ్‌కే ఆ ఫీట్‌ని సాధిస్తాం’’ అన్నారు. సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మేమందరం సినిమాలో ఎక్కడెక్కడ మంచి స్పందన వస్తుందని అనుకున్నామో, అక్కడే ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పా¯Œ ్స రావటం ఆనందంగా ఉంది. శిరీష్‌గారి యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రోల్ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాను. ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ గతంలో నేను చేసిన ఏ సినిమాకూ రాలేదు. నాకు ఇంత పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సంజీవ్దే’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ధీరజ్ పాల్గొన్నారు. -
వాళ్లు చెబితే ఒప్పుకుని తీరాలి
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాను. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, మోహన్‌లాల్ వంటి గొప్ప నటులతో నటించాను. మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్టర్‌గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. డి. సురేష్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మలయాళంలో దుల్కర్సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ (2012) సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన సంగతులు. ► మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రాన్ని రెండేళ్ల క్రితం చూశాను. బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా చూడమని రామ్‌చరణ్ చెప్పారు. దర్శకుడు మారుతి, వరుణ్ తేజ్ ఇలా ఇండస్ట్రీలోని నా సన్నిహితులు కూడా ఈ సినిమా గురించి చెప్పారు. సాధారణంగా అందరూ రీమేక్ ఈజీ అంటారు కానీ అంత ఈజీ కాదు. తెలుగు కోసం కొన్ని మార్పులు చేశాం. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఒరిజినల్ సినిమాలో ఉన్నవి ఉంటాయి. సోల్‌ని మాత్రమే తీసుకున్నాం. సంజీవ్ బాగా తీశారు. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు అవి. అమ్మ ప్రేమ చాటున గారాభంగా పెరుగుతున్న అవికి అంతగా డబ్బు విలువ తెలియదు. ఆ విలువ తెలియడానికి అవి తండ్రి తనను ఇండియాకి పంపి, మధ్యతరగతి జీవితం గడిపేలా ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్‌లో అవి లైఫ్‌లో ఎలాంటి విషయాలను నేర్చుకున్నాడు అన్నదే కథ. ► నాకు, భరత్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీని చూశాం. సినిమా పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ► నేను ముంబైలో నాలుగేళ్లు ఉన్నాను. అక్కడ నేను ఆల్మోస్ట్ నార్మల్ జీవితాన్ని గడిపాను. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేసేవాణ్ణి. సినిమాలు చూడాలనుకున్నపుడు అక్కడ మార్నింగ్ షో అయితే టికెట్ రేటు తక్కువగా ఉంటుందని ఆ షోలకు వెళ్లాను. ముంబైలో నేను గడిపిన ఆ నాలుగేళ్లు నాలో చాలా మార్పు తెచ్చాయి. ఆ తర్వాత స్టడీస్ కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త తీసుకున్నాను. ► నేను ‘కొత్తజంట’ సినిమా చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్‌గారిని కలిశాను. డీసెంట్ యాక్టర్‌కి, గుడ్ యాక్టర్ తేడా ఏంటి? అన్న సంభాషణ వచ్చింది. ‘‘దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చెసేవాడు యాక్టర్. దర్శకుడు చెప్పింది చేస్తూనే ఏదో తన సొంతగా, కొత్తగా ప్రయత్నించాలని తపన పడేవాడు గుడ్ యాక్టర్’ అని చెప్పకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి సినిమాకి నేను కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► ‘ఒక్క క్షణం’ సినిమాకు బాగా కష్టపడ్డాం. ఫస్ట్ కాపీ చూసి చాలా సంతోషపడ్డాను. కానీ ప్రేక్షకుల నుంచి మేం ఆశించిన ఫలితం రాలేదు. సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల తీర్పు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకుని తీరాలి. ఆన్లైన్ ఆడియన్స్‌కు బాగానే నచ్చింది. ప్రస్తుతం రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి లవ్‌స్టోరీ. -
అప్పుడే ఎక్కువ సినిమాలు వస్తాయి
‘‘కాన్సెప్ట్ చిత్రాలు తీసే ‘మధుర’ శ్రీధర్‌గారికి సినిమాలంటే చాలా ప్రేమ. సినిమాలను ప్రేమించే నిర్మాతల చిత్రాలు బాగా ఆడితే మరిన్ని వస్తాయి. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే శ్రీధర్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా భరత్ ముఖ్య పాత్రలో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అన్నది ఉపశీర్షిక. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్. రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 17న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను త్రివికమ్ర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జల్సా’ టైమ్‌లో శిరీష్‌ను చిన్నకుర్రాడిగా చూశాను. సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మా చిత్రం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కువగా మాట్లాడతాను. శ్రీధర్, సురేశ్‌బాబు, యష్గార్లకు థ్యాంక్స్. నన్ను బాగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు సంజీవ్‌గారికి, మంచి మ్యూజిక్ అందించిన జుడో సాండీకి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు నిర్మించే నేను ఓ ఫన్ మూవీ తీయాలని చాలా రోజులుగా అనుకున్నాను. ఆ క్రమంలో చేసిన సినిమాయే ‘ఏబీసీడీ’. శిరీష్, భరత్ ఫెంటాస్టిక్‌గా నటించారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం శిరీష్‌గారే. ఆయన ఎప్పటికీ నా హీరోగానే ఉంటారు. ఈ జర్నీలో ముందు నుంచి నాతో భాగమైన ‘మధుర’ శ్రీధర్‌గారికి థాంక్స్’’ అన్నారు సంజీవ్ రెడ్డి. -
నవ్వులు పంచే ఏబీసీడీ
కథాబలం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల్ని అల రిస్తున్న అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ‘ఏబీసీడీ’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఏబీసీడీ’ని రీమేక్ చేయడం హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేశాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషించారు. అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబుగారు నటించారు. బాల నటుడు భరత్ ఈ చిత్రంలో శిరీష్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. మా సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందనతో పాటు, చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేశ్‌బాబు, సంగీతం: జుధా సాంధీ, సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
పాకెట్ మనీ కట్
కోటీశ్వరుడి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు సాదాసీదా జీవితం గడపాల్సి వచ్చింది. లక్షల్లో పాకెట్ మనీ తీసుకున్న ఆ కుర్రాడికి చివరికి 5 వేలే అని ఇంట్లో ఫిక్స్ చేస్తారు. అలా ఎందుకు? అంటే దానికో పెద్ద కారణం ఉంది. అదేంటో థియేటర్లో తెలుసుకుంటేనే కదా థ్రిల్. అల్లు శిరిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ). రుక్సానా కథానాయిక. ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి తెలుగు పరిశ్రమకు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగు తోంది. ఇందులో కోటీశ్వరుడి తండ్రికి కొడుకుగా అవినాష్ పాత్రలో అల్లు శిరీష్ నటిస్తున్నారని సమాచారం. అలాగే కామెడీ యాక్టర్ భరత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
అందుకే తప్పుకున్నా
దర్శకుడు కేవీ ఆనంద్, హీరో సూర్య కాంబినేషన్లో రూపొందనున్న ఓ చిత్రంలో అల్లు శిరీష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది. ఈ పాత్ర కోసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశానని ఆ మధ్య శిరీష్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అల్లు శిరీష్ తప్పుకున్నారు. ‘‘ సూర్య, కేవీ ఆనంద్‌గారి సినిమాకు, ‘ఏబీసిడీ’ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ విషయంలో క్లాష్ వచ్చింది. రెండు సినిమాల గురించి ఆలోచించి నా అంతట నేను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కేవీ ఆనంద్‌గారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నా నిర్ణయాన్ని గౌరవించారు. ఈ సినిమాలో భాగం కావాలని ఎంతో అనుకున్నాను. కానీ కుదర్లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కేవీ ఆనంద్‌గారికి, సూర్యగారికి, లైకా ప్రొడక్షన్స్‌కు కృతజ్ఞతలు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ టీమ్‌తో కలసి వర్క్ చేయాలనుకుంటున్నాను’’ అని శిరీష్ అసలు కారణం చెప్పారు. -
గీత.. గోవిందం... కహానీ ఏంటి?
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా జంటగా ‘శ్రీరస్తు శుభమస్తు’ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గీత గోవిందం’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల్లో మంచి యాక్టింగ్ స్కిల్స్‌తో విజయ్ స్టార్డమ్ సంపాదించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా విజయ్ కెరీర్లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. విజయ్, రష్మికల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మా బ్యానర్లో రెండో చిత్రం చేస్తున్న పరశురాం కమిట్మెంట్ ఉన్న దర్శకుడు. గోపీసుందర్ సంగీతం బాగుంది. రిలీజ్ డేట్‌ని త్వరలోనే ‘బన్నీ’ వాసు ఎనౌన్స్ చేస్తారు’’ అన్నారు. ‘‘థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు నిరుత్సాహపడకూడదనేలా మమ్మల్ని వర్క్ చేయమని ప్రోత్సహించే అల్లు అరవింద్‌గారు ఈ సినిమాకు సమర్పకులుగా ఉండటం హ్యాపీగా ఉంది. విజయ్ క్రేజ్ ఉన్న హీరో. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరకెక్కించడం పరశురాంకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘అల్లు అరవింద్‌గారి ఆశీర్వాదం, ‘బన్నీ’ వాసు సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది. విజయ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అతని పాత్రని డిజైన్ చేశా. రియల్ లైఫ్ రష్మికని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు దర్శకుడు. అన్నట్లు.. గీత గోవిందం అని టైటిల్ పెట్టారు కాబట్టి సినిమాలో నాయకా నాయకల పేర్లు ఇవే అయ్యుండొచ్చు. -
యుద్ధ భూమిలో...
భారత సరిహద్దుల్లో 1971లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా మేజర్ రవి దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘1971: బియాండ్ బోర్డర్స్’. మోహన్‌లాల్, అల్లు శిరీష్, అరుణోదయ సింగ్ ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమాను ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌తో జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకాలపై ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది. ‘‘1971లో భారత్–పాక్ బోర్డర్లో జరిగిన వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం. ఈ సినిమాలో ఆర్మీ మేజర్‌గా మోహన్‌లాల్, డైనమిక్ సోల్జర్‌గా అల్లు శిరీష్ నటించారు. మేజర్ రవి సినిమాలు ఆర్మీ నేపథ్యంలో ఉంటూనే యువతలో దేశభక్తిని కలిగిస్తాయి. ఇంతకుముందు నేను తెలుగులోకి అనువదించిన తమిళం, హిందీ, మలయాళ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ‘యుద్ధభూమి’ కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సెన్సార్ పూర్తి చేశాం’’ అన్నారు నిర్మాత బాలాజీ. -
బోర్డర్లో యుద్ధం
భారత సరిహద్దుల్లో 1971లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘1971 బియాండ్ బార్డర్స్’. మేజర్ రవి దర్శకత్వం వహించారు. గత ఏడాది మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఏయన్ బాలాజి ‘యుద్ధభూమి’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఏయన్ బాలాజి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్ర దర్శకుడు రవిగారు నిజ జీవితంలో కూడా మేజర్ కావడం విశేషం. ఆయన 1981లో ఆర్మీలో చేరి అనేక కీలక ఆపరేషన్స్ లీడ్ చేసారు. ఆ ఆపరేషన్స్‌కి సంబంధించిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1971లో భారత్ –పాక్ బోర్డర్లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. మేజర్‌గా మోహన్‌లాల్, ఎనర్జిటిక్ అండ్ యంగ్ డైనమిక్ సోల్జర్‌గా అల్లు శిరీష్ కనిపిస్తారు. నేను రిలీజ్ చేసిన గత సినిమాల్లాగే ఈ చిత్రం కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్ద్ విపిన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్. -
చుట్టేసెయ్ చుట్టేసెయ్
‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి హిట్స్ తర్వాత హీరో సూర్య, దర్శకుడు కేవీ ఆనంద్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు శిరీష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాలో సాయేషా సైగల్ కథానాయిక. కేవలం యాక్టర్స్ ఎంపిక విషయంలోనే కాదు.. షూటింగ్ లొకేషన్స్‌లో కూడా కాంప్రమైజ్ కాదలుచుకోవడంలేదు చిత్రబృందం. చుట్టేసెయ్.. చుట్టేసెయ్... అంటూ దేశాలు చుట్టనున్నారట. ఈ సినిమాను పది వివిధ దేశాల్లో షూట్ చేయనున్నారని సమాచారం. న్యూయార్క్, ఇంగ్లాండ్, బ్రెజిల్ వంటి పలు దేశాల్లోని సుందర ప్రదేశాల్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. జూన్ 23న లండన్‌లో స్టార్ట్ కానున్న ఈ చిత్రం షూటింగ్‌ను డిసెంబర్‌కు కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. సూర్య కెరీర్ -
జోడీ కుదిరింది
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హిట్ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేసి) తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఏబిసిడి’ చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ మా చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
సూర్యతో శిరీష్
‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి సూపర్‌హిట్ సినిమాలు అందించిన హీరో సూర్య, దర్శకుడు కేవీ ఆనంద్ కాంబినేషన్, ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది సూర్యకు 37వ సినిమా. హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి సినిమాను భారీగానే ప్లాన్ చేశారు దర్శకుడు కేవీ ఆనంద్. దానికి తగ్గట్టుగానే యాక్టర్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఆల్రెడీ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ టీమ్‌లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి అల్లు శిరీష్ కూడా యాడ్ అయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్ కేవీ ఆనంద్‌గారు చెప్పిన పాత్ర నాకు చాలా నచ్చింది. ఎంతలా నచ్చిందంటే ఇప్పటి నుంచే ఆ క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నా ఫేవరెట్ యాక్టర్ సూర్యతో కలిసి యాక్ట్ చేయడం, అది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ అయ్యేసరికి చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మలయాళంలో మోహన్‌లాల్‌గారితో ‘1971: బియాండ్ బోర్డర్స్’ పరిచయం అయ్యాను. ఇప్పుడు మోహన్‌లాల్, సూర్య ఇద్దరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్‌గారికి థ్యాంక్స్’’ అని అన్నారు. -
శిరీష్ మా‘స్టార్’ వచ్చిండు.. ఇంగ్లిష్ పాఠం చెప్పిండు
బంజారాహిల్స్: సినీనటుడు అల్లు శిరీష్ టీచర్ అవతారం ఎత్తాడు. పెగా టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ తరగతులు బోధిస్తోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలతో ఆయా స్కూళ్లలో పాఠాలు చెప్పిస్తుంటారు. ఇలా శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4,5 తరగతి విద్యార్థులకు అల్లు శిరీష్ గెస్ట్ టీచర్‌గా రెండు గంటల పాఠాలు బోధించాడు. విద్యార్థులకు సరదాగా ప్రశ్నలు వేస్తూ ఆంగ్లంలో సమాధానలు రాబట్టాడు. అనంతరం చిన్నారులు శిరీష్‌తో ఫొటోలు దిగారు. అతడు మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజని, పిల్లలకు తాను పాఠం చెప్పడం అద్భుతంగా ఉందన్నాడు. తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
మన్యంపులి లాగే ఆదరిస్తారని ఆశిస్తున్నా – మోహన్‌లాల్
ఇండో–పాక్ బోర్డర్లో 1971లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘1971 బియాండ్ బోర్డర్స్’. మోహన్‌లాల్, అల్లు శిరీష్ ముఖ్య తారలుగా మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ‘యుద్ధభూమి’ పేరుతో జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎన్.బాలాజీ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం మోహన్‌లాల్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మేజర్ రవికి దేశభక్తి ఎక్కువ. ఆర్మీలో పని చేయడంతో ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే పది సినిమాలు తీశారు. అందులో 5 సినిమాలు నాతోనే తీశారు. అల్లు శిరీష్ ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ‘మన్యం పులి’ సినిమాలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మన సైనికులకు దేశ భక్తి ఉన్నట్టే ఆ దేశ సైనికులకు కూడా దేశభక్తి ఉంటుంది. ఇలా ఇరు దేశ సైనికుల భావోద్వేగాలను చూపించాం. మోహన్‌లాల్, శిరీష్ అద్భుతంగా నటించారు. ఎన్.బాలాజీ గారు తెలుగులో రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మేజర్ రవి. ‘‘ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు ఫైనల్ స్టేజిలో ఉన్నాయి. మన నేటివిటీకి తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా డబ్ చేస్తున్నాం. త్వరలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం. మేజర్ రవి, మోహన్‌లాల్, అల్లు శిరీష్, హాజరు కానున్నారు’’ అని నిర్మాత బాలాజీ అన్నారు. -
4ఏళ్లుగా యోగా చేస్తున్నా: అల్లు శిరీష్
హైదరాబాద్: ఆరు పలకల దేహం అంటే అబ్బాయిలకు ఎంతో మోజు. ఇక, సినిమా హీరోలైతే ఏదైనా పాత్ర డిమాండ్ చేస్తే.. వెనక్కి తగ్గకుండా సిక్స్ ప్యాక్ చేసేస్తారు. ఇటీవల అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ చేశారు. తన శరీరం ఎంత ఫిట్‌గా ఉందో చూపించడానికి సామాజిక మాధ్యమం ద్వారా కొన్ని ఫొటోలు బయటపెట్టారు కూడా. శిరీష్ ఫిట్నెస్ చూసినవాళ్లు సూపర్బ్ అంటున్నారు. ఇంతకీ.. ఈ ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. వ్యాయామాలే కారణం కూడా కొంతమంది ఫిక్సయ్యారు. కానీ, కేవలం వ్యాయామాలే కాదు.. ఇంత ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి ఓ కారణం 'యోగా' అంటున్నారు అల్లు శిరీష్. దీని గురించి ఆయన విపులంగా చెబుతూ నాలుగేళ్ల నుంచీ యోగాసనాలు ప్రాక్టిస్ చేస్తున్నా. వ్యాయామాలకు మించిన బలాన్నిస్తోంది యోగా. వ్యాయామం కేవలం దేహదారుఢ్యాన్ని పెంచుతుంది. కానీ యోగా మనలో అంతర్లీనంగా దాగున్న ఎన్నో శక్తులను మేల్కొల్పి ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఈ తరం వారికి యోగా చాలా అవసరం కూడా. ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి కొత్త గుర్తింపు తెచ్చింది యోగా అన్నారు అల్లు శిరీష్.