
హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కృష్ణార్జున యుద్దం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌పరంగా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అల్లు శిరీష్ నటిస్తోన్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. అల్లు శిరీష్ మలయాళ రీమేక్ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మాలీవుడ్‌లో హిట్ అయిన ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.
Happy to share that @RuksharDhillon plays the female lead in ABCD. Hello & welcome onboard Rukshar! #ABCDTelugu pic.twitter.com/uJUvWi3M3k
— Allu Sirish (@AlluSirish) June 1, 2018