sanjeev reddy
-
సీఎం రేవంత్‌రెడ్డికి టాలీవుడ్ డైరెక్టర్ బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి..తనదైన మార్క్ పాలనను ప్రారంభించారు. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం అమలు చేశాలు చేశాడు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ‘ప్రజావాణి’ని నిర్వహిస్తున్నాడు. నేటి నుంచి రైతుబంధు నిధులను కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశాడు. సినీ, ప్రజా సమస్యలను తెలియజేస్తూ..వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్‌కు, సినిమాటోగ్రపీ మినిస్టర్ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. తెలంగాణలో సినిమా అవార్డులను, ఫిల్మ్ ఫెస్టివల్స్‌ని నిర్వహించాలని కోరారు. అలాగే అర్హులైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు ఇల్లు లేదా స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడగలరని లేఖలో పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ వాసిగా ఓ విజ్ఞప్తి అంటూ.. నాళాల సమస్యలను, ట్రాఫిక్ కష్టాలను వివరిస్తూ.. కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. (చదవండి: ఎక్కడా కనిపించని 'సలార్' బజ్.. మరి సినిమా పరిస్థితి ఏంటి..?) సంజీవ్ రెడ్డి సినిమా విషయాలకొస్తే.. తెలుగులో యంగ్ హీరో అల్లు శిరీష్‌తో ABCD అనే సినిమా తెరకెక్కించాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా ‘ఆహా నా పెళ్లంట’అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. Dear Chief Minister @revanth_anumula Garu (MAUD, G.A., Law & Order) and Minister for R&B and Cinematography @KomatireddyKVR Garu, attached are posters presenting requests for your consideration. #OnlinePrajaDarbar #DigitalPrajaDarbar pic.twitter.com/KlM2OX88kq — Sanjeev Reddy (@sanjeevflicks) December 11, 2023 -
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్‌మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
ఖేడ్ లో కాంగ్రెస్ కథ .. ఇద్దరు నేతలు కొంప ముంచుతారా ?
-
‘కృష్ణ పట్టె’లో భయం..భయం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: స్వల్ప భూ ప్రకంపనలతో కృష్ణ పట్టె ప్రాంతంలోని మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా కంపనాలు వస్తుండటంతో భారీ భూకంపం వస్తుందేమోనని ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలను కృష్ణపట్టె మండలాలుగా పిలుస్తుంటారు. వీటి పరిధిలో సున్నపురాయి గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు పులిచింతల ప్రాజెక్టు ఉంది. వందలాది ఎకరాల్లో తవ్వకాలతో ఇక్కడ సున్నపురాయిని వెలికితీస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా చింతలపాలెం మండలంలోని చింతలపాలెం, గుడిమల్కాపురం, దొండపాడు, నెమలిపురి, కిష్టాపురం, మేళ్లచెరువు మండలంలోని.. మేళ్లచెరువు, రామాపురం, వేపలమాధారం గ్రామాల్లో రోజుకు రెండుమూడు సార్లు స్వల్ప కంపనాలు వస్తున్నా యి. ఇది భారీ భూకంపానికి సంకేతమేమోనని ఆ గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డికి కూడా ప్రజలు ఫోన్లు చేశారు. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ లేకపోవడంతో భూ కంపనాల విషయాన్ని ఎన్జీఆర్ఐకి చెబుతామని అధికారులు తెలిపారు. ఆందోళన వద్దు స్వల్ప భూ కంపనాలు వస్తున్న విషయం పై తహసీల్దార్లు పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుంటున్నారు. దీన్ని ఎన్జీఆర్ఐకి పంపిస్తాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. అప్పుడప్పుడు భూమిలో సర్దుబాట్ల వల్ల స్వల్ప కంపనాలు వస్తుంటాయి. వీటి వల్ల ఎలాంటి నష్టమూ జరగదు. – డి.సంజీవరెడ్డి, జేసీ, సూర్యాపేట -
‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్‌ప్యూజ్డ్ దేశీ) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అల్లు శిరీష్, రుక్సర్ ధిల్లాన్, భరత్, రాజా, నాగబాబు సంగీతం : జుడా సాండీ దర్శకత్వం : సంజీవ్ రెడ్డి నిర్మాత : మథురా శ్రీధర్, యష్ రంగినేని మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ హీరోగా ప్రూవ్ చేసకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాలు హీరోగా నటించినా స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చే హిట్ ఒక్కటి కూడా పడలేదు. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో ఈ మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ సూపర్ హిట్ సాధించాడా..? కథ : అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) అలియాస్ అవి.. న్యూయార్క్‌లో సెటిల్ అయిన ఇండియన్ మిలియనీర్ విద్యా ప్రసాద్ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్ బాలషణ్ముగం (భరత్)తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు. నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ జేయాలనుకున్న విద్యా ప్రసాద్.. వెకేషన్ పేరుతో అవి, బాషాలను ఇండియాకు పంపిస్తాడు. అలా ఇండియాకు వచ్చిన వారిద్దరిని నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని చెప్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండిపోయిన అవికి లోకల్ పొలిటీషన్ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? అమెరికాలో పెరిగిన అవి, బాషాలు ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? ఓ సాధారణ యువకుడిగా ఇండియాలో అడుగుపెట్టిన అవి.. సెలబ్రిటీగా, యూత్ ఐకాన్‌గా ఎలా మారాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ నటనకు పెద్దగా అవకాశం లేని పాత్రలో కనిపించారు. లుక్స్ పరంగా మాత్రం మంచి మార్కులు సాధించారు. హీరో తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. విలన్‌గా రాజా పరవాలేదనిపించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, శుభలేక సుధాకర్, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. బలమైన సంఘర్షణ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇండియా వచ్చిన తరువాత హీరో ఇబ్బంది పడే సన్నివేశాల్లో మరింత కామెడీ, ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశాడు. కథలోనూ బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవటం కూడా మైనస్ అయ్యింది. జుడా సాండీ అందించిన సంగీతం బాగుంది. ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్ఫుల్గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్ రామ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం బలమైన సన్నివేశాలు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అల్లు వారి ‘ఏబీసీడీ’ వాయిదా..!
అల్లు ఫ్యామిలీ హీరోగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు శిరీష్. హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఏబీసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మళయాలంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా మార్చి 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏబీసీడీ రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు అన్‌సీజన్ కావటం, మార్చి నెలలో విద్యార్థులు పరీక్షలతో బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో మార్చి నెలాఖరున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 22న ఏబీసీడీ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శిరీష్‌కు జోడిగా రుక్సర్ ధిల్లాన్ నటిస్తున్నారు. -
అల్లు శిరీష్‌కు జోడీగా రుక్సర్?
హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కృష్ణార్జున యుద్దం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌పరంగా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అల్లు శిరీష్ నటిస్తోన్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైంది. అల్లు శిరీష్ మలయాళ రీమేక్ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో హిట్ అయిన ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. Happy to share that @RuksharDhillon plays the female lead in ABCD. Hello & welcome onboard Rukshar! #ABCDTelugu pic.twitter.com/uJUvWi3M3k — Allu Sirish (@AlluSirish) June 1, 2018 -
నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్‌రెడ్డి
మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ గురువారం ఖరారు చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆకస్మికంగా మృతి చెందిన కృష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది. ఈ ఉప ఎన్నికపై జనవరి 20వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 30వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కృష్టారెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుంది. -
సిగ్గు.. సిగ్గు
సాక్షి, అనంతపురం : ‘ఏం చెప్పమంటారు సారూ మా పరిస్థితి! ఎన్ని సార్లు అడిగినా అధికారులు స్పందించడం లేదు. మా పల్లెలో ఇద్దరికో..ముగ్గురికో తప్ప ఇంకెవరికీ మరుగుదొడ్లు లేవు. బహిర్భూమికి ఆరు బయటకు వెళ్లడానికి సిగ్గుతో చస్తున్నాం’’ ఇదీ మాజీ రాష్ట్రపతి, దివంగత నీలం సంజీవరెడ్డి స్వగ్రామమైన గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన ఓబుళమ్మ ఆవేదన. ఈమెకు చిన్నపాటి ఇల్లు ఉన్నా వ్యక్తిగత మరుగుదొడ్డి మాత్రం లేదు. ప్రభుత్వం నిర్మిస్తోందని తెలుసుకున్న ఈమె పలుమార్లు అధికారులను కలిసి పరిస్థితి వివరించింది. అయినా ఇంతవరకు మంజూరు కాలేదు. ఒక్క ఇల్లూరులోనే కాదు... జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా... ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 25 లక్షల జనాభా ఉంది. కుటుంబాల పరంగా చూసుకుంటే 5,56,543 ఉన్నాయి. ఇందులో 5,19,943 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. ఇందులోనూ 5,01,058 కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ సంఖ్యను తగ్గించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సిబ్బందితో గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయించి మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించాయి. నిర్మల్ భారత్ అభియాన్ కింద తొలివిడతగా జిల్లాలోని 372 పంచాయతీలలో 98,284 మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా రూ.4,600, ఉపాధిహామీ కింద రూ.5,400 చొప్పున.. మొత్తం రూ.10 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో ఆన్లైన్ ద్వారా జమ చేస్తారు. అయితే.. 2013 మార్చి నుంచి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో నిర్మించిన మరుగుదొడ్ల సంఖ్య 3,945 మాత్రమే. అంటే.. తొలివిడత లక్ష్యంలో ఐదు శాతం కూడా పూర్తి కాలేదు. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి 20 నుంచి 25 శాతం మంది బయటకు వెళ్లక తప్పడం లేదు. పట్టణాలలోని మురికివాడలు, పల్లెల్లో క్షయ, మలేరియా, పైలేరియా, టైఫాయిడ్, కాలేయ సంబంధ వ్యాధులు ప్రబలటానికి బహిరంగ మలవిసర్జనే కారణమని వైద్యులు అంటున్నారు. పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు నిర్మించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే.. కొన్ని పాఠశాలల్లో మాత్రమే నిర్మించారు. వాటిలోనూ నిర్వహణ గాలికొదిలేశారు. ఇక నిర్మాణం చేపట్టని వాటిలో విద్యార్థుల అవస్థలను ఎవరూ పట్టించుకోవడం లేదు. 40 శాతం పాఠశాలల్లో విద్యార్థినులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయించడంలో ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిపై కనీసం నియోజకవర్గ స్థాయిలో ఏ శాసనసభ్యుడు కూడా సమీక్ష జరపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో అప్పట్లో ఇలాంటి లోపాలన్నీ వెలుగులోకి రాలేదు. ప్రస్తుతమైనా శాసనసభ్యులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.