నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్రెడ్డి | Congress select Kista Reddy's Son sanjeev reddy for Narayankhed Seat | Sakshi
Sakshi News home page

నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్రెడ్డి

Published Thu, Jan 14 2016 3:15 PM | Last Updated on Wed, Aug 15 2018 7:35 PM

Congress select Kista Reddy's Son sanjeev reddy for Narayankhed Seat

మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ ఉపఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ గురువారం ఖరారు చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆకస్మికంగా మృతి చెందిన కృష్టారెడ్డి కుమారుడు సంజీవ్రెడ్డిని అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది.  నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికల ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది.

ఈ ఉప ఎన్నికపై జనవరి 20వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 30వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ. నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కృష్టారెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement